Wednesday, July 28, 2021

గౌట్ గురించి సంపూర్ణ వివరణ ( gout details

 గౌట్ గురించి సంపూర్ణ వివరణ  - 


   ఈ వ్యాధిలో కాలిబాటన వ్రేళ్లు వాచి ఉంటాయి. నడిచినప్పుడు నొప్పిని కలిగించును. ఈ వ్యాధి కొంతకాలం ఉండి ఆ తరువాత దానంతట అదే తగ్గిపోవును . మరలా వస్తుంది. రక్తములో యూరిక్ ఆసిడ్ మోతాదు పెరగటం వలన ఈ సమస్య ఎక్కువుగా వచ్చును. 


 ఈ సమస్య రావడానికి గల కారణాలు  - 


      అధిక పరిమాణం ప్రొటీన్స్ గల పదార్ధాలలో "ప్యూరిన్స్ " అనబడు పదార్థాలు ఉంటాయి. ఇది జీర్ణం అగునప్పుడు యూరిక్ ఆమ్లం తయారగును. సాధారణముగా ఇది మూత్రములో విసర్జించబడుతుంది. కాని కొన్ని సందర్భాలాలో ఇది పూర్తిగా విసర్జించబడదు . ఇది రక్తములో నిలువ ఉండిపోతుంది. ఈ విధముగా విసర్జించబడని యూరిక్ ఆమ్లం స్పటిక రూపములో ముఖ్యముగా కాలిబాటన వ్రేలి కీలు వద్ద నిక్షిప్తమై ఉంటుంది . కావున బ్రొటన వ్రేలు వాచి నొప్పి కలిగించును. 


              ఈ యురిక్ ఆమ్లము ఎక్కువుగా ఉత్పత్తి అగుటకు కారణాలు  -

   

  *  ప్యూరిన్ ఎక్కువ గల ఆహార పదార్థాలు అయిన మాంసము విపరీతముగా తినటం . 


 *  నీరు తక్కువుగా తాగుతూ మద్యము , కాఫీ , టీ మొదలైన వాటిని అధికంగా సేవించుట . 


 *  విపరీతమైన మానసిక సంఘర్షణ . 


 *  వంశపారంపర్యముగా రావడం . 

No comments:

Post a Comment