Monday, October 23, 2023

కలబందతో వైద్యం -

కలబందతో వైద్యం - 

 * కలబంద మట్టలలోని జిగురు లొపలికి తీసుకోవడం వలన శరీరంలోని వేడిని తగ్గించును.

 * లోపలి జిగురుని నీళ్లతో శుభ్రముగా కడిగి పటికపంచదార పొడితో తినిన చలువచేయును .

 * సారా పటిక ని ఒక గుంట గంటె లో వేసి పొయ్యి మీద పెడితే పొంగుతుంది . చల్లారాక దానిని పొడిచేసి ఆ పొడిని కలబంద జిగురుపైన ఒత్తుగా చల్లి ఒక గుడ్డలో కట్టి దానితో దానితో కండ్లపైన అద్దుచుండిన కండ్ల ఎరుపులు , నీరు కారడం , పుసి కారడం నొప్పులు మానును . 

 * కలబంద రసంలో పసుపు కలిపి లొపలికి తీసుకున్న స్ప్లీన్ వృద్ధి చెంది కడుపు పెద్దగా అయ్యే రోగం నివృత్తి అగును. 

 * కలబంద రసంలో పాలు మరియు నీరు కలిపి ఇచ్చిన సెగరోగం మరియు గర్భాశయంలో పుండు నివారణ అగును.

 * కలబంద గుజ్జుని పసుపు తో కలిపి కట్టిన వ్రణాలు మానును . 

 * కలబంద మట్టని కొంచం తొక్కి పసుపుతో నూరి కట్టిన పైకి కనిపించకుండా లోపల తగిలిన దెబ్బలు అనగా కవుకు దెబ్బలు నయం అగును. నొప్పి కూడా హరించును . 

 * కలబంద వేరు రసంతో సీసముని భస్మం చేయుదురు.

        

Friday, October 20, 2023

స్వర్ణభస్మము గురించి సంపూర్ణ వివరణ -

స్వర్ణభస్మము గురించి సంపూర్ణ వివరణ -

    
        స్వర్ణం 5 రకాలుగా ఉండును. అవి 

 1 - సహజము .

 2 - ప్రాకృతము .

 3 - వహ్నిజము .

 4 - ఖనిజము .

 5 - సూతవేదజము . 

       బంగారము 16 వన్నెలు కలిగి ప్రకాశించుచుండును. ఇప్పుడు స్వర్ణములులోని రకాల గురించి సంపూర్ణంగా వివరిస్తాను.

   బ్రహ్మాండం అవతల కోడిగుడ్డు ఆకారమున ఉండును. దీనిని "ప్రాకృతం " అని అందురు. ఇది దేవతలకు కూడా సాధ్యం కాదు.

   అగ్నివలన పుట్టినది కావున "వహ్నిజ"అని అంటారు. దీనిని సేవించిన కాయసిద్ధి కలుగును.

  పర్వతముల యందు పుట్టు ( ఖనిజము ) బంగారము సేవించిన సర్వరోగములను హరించును . మేరుపర్వతము పైన పుట్టు బంగారమునకు " సహజము " అని పేరు .

  పాదరసమును రసవాద ప్రక్రియల యందు చెప్పబడిన విధముగా శుద్ధియొనర్చి కొన్ని రహస్య ప్రక్రియలద్వారా బంగారం తయారుచేయుదురు. ఇది వేదముచే కలిగినది కావున " వేదజ " అని పేరువచ్చినది.

          పైనచెప్పబడిన సహజము , వేదజము , ఖనిజము మూడునూ శుద్ది యొనర్చి సేవించిన అమృతముతో సమానమై అది సేవించు మానవులకు సమస్తరోగములను పోగొట్టును . శరీరముకు ఆరోగ్యాన్ని ఇచ్చి దీర్గాయువును కలుగచేయును .

 * బంగారం యొక్క స్వచ్ఛత లక్షణము -

          బంగారం స్వచ్చమైన ప్రకాశము కలిగి పచ్చగా పొరలు లేక పెళుసుదనము లేకుండా మెత్తదనం , చిక్కదనం మరియు బరువును కలిగి ఉండి ఆకురాయిపై రుద్దిన చక్కని కాంతి కలిగి ఉండి నిప్పున బాగా కాల్చి చల్లార్చిన ఎర్రనై కత్తిరించిన కపిలవర్ణమై ఉండవలెను . అట్టి లక్షణములు కలిగినది ఉత్తమ బంగారము . ఇటువంటి బంగారమును మాత్రమే రసాయనిక ఔషధముల యందు ఉపయోగించవలెను .

 * స్వర్ణమును శుద్దిచేయు క్రమము -

           నువ్వులనూనె , మజ్జిగ , ఆవుపంచితం , కలి , ఉలవల కషాయం వీని యందు ఒక్కొక దానియందు ఏడుసార్లు ముంచుచూ మరలా ఏడుసార్లు కాల్చుతూ మళ్ళీ ఒక్కొక్కదాని యందు ఏడుసార్లు ముంచుతూ చేసినచో స్వర్ణం శుద్ది అగును.

       ఈ పద్ధతిలో ఒక్క స్వర్ణముకు మాత్రమే కాకుండా అన్నిరకాల లోహాలను శుద్ధిచేయవచ్చు .

 * స్వర్ణభస్మం తయారుచేయు విధానం -

          16 వన్నెలు కలిగిన స్వచ్చమైన బంగారంను తెచ్చి చాలా పలచటి రేకులుగా మార్చి ఆ రేకుల బరువుకు సమానం అగు రసభస్మమును గ్రహించి మాదిఫల రసములో వేసి బాగుగా నూరి ఆ నూరినదానిని పైన చెప్పిన బంగారు రేకులకు పట్టించి మూకుడు యందు ఉంచి పైన మరొక మూకుడు బోర్లించి లోపలకు ఏమి పోకుండా చుట్టూ చీలమన్ను వేసి ఆవుపిడకలతో పుటము పెట్టవలెను . ఈ విధముగా మూడుసార్లు పుటము పెట్టవలెను . ఇలా మూడుసార్లు పుటం పెట్టటం వలన స్వర్ణపు రేకులు భస్మం అగును. ఆ భస్మమును జాగ్రత్తగా సంగ్రహించి ఆ భస్మమునకు 4 వ వంతు పాదరస భస్మమును కలిపి నిమ్మపండ్ల రసమును పోసి నూరవలెను ఆతరువాత దానిని చిన్నచిన్న బిళ్లలుగా చేసి మళ్ళీ పైనచెప్పిన విధముగా మూకుడులో పెట్టి చీలమన్ను అంటించి 33 సార్లు పుటము పెట్టవలెను . ఇలా పుటములు పెట్టిన తరువాత స్వర్ణము కుంకుమపువ్వు కాంతి కలిగి సింధూరించి చక్కని భస్మం అగును.

 * స్వర్ణ సింధూరం గుణములు -

         పైన చెప్పబడిన విధముగా తయారుచేయబడిన స్వర్ణసింధురం అత్యంత శక్తివంతం అయినది. దీన్ని మించిన గొప్ప ఔషదం మరొక్కటి లేదు శాస్త్రప్రకారముగా దీనిని లోపలికి వాడుచున్న సకల క్షయలు , పూర్వజన్మ పాపములు వలన జనించిన రోగాలు , పిశాచ బాధలు నశించును. అంతులేని శక్తి దేహమంతయు వ్యాపించి అత్యంత శక్తువంతుడు అగును. దేహకాంతి , వీర్యపుష్టి , సూక్ష్మబుద్ధి కలిగించి మనిషికి దీర్గాయుష్షును కలిగించును.

       స్వర్ణభస్మం కేవలం అనుభవవైద్యల సూచనతో మాత్రమే వాడవలెను . స్వర్ణసింధురం 
మరియు స్వర్ణభస్మం వాడినవారి శరీరం నందు అత్యద్భుతమైన తేజస్సు కలుగును.

 

తల్లిపాలలో దోషాలు - శిశువుకు కలుగు ఉపద్రవాలు -

తల్లిపాలలో దోషాలు - శిశువుకు కలుగు ఉపద్రవాలు - 

    తల్లిపాలు శిశువుకు అమృతప్రాయమైనవి. తల్లిపాలలో ఉండే పోషకాలు శిశువు యొక్క రోగనిరోధకశక్తిని పెంపొందించడం లో ప్రధానపాత్ర పోషించును . ప్రస్తుతం చాలమంది పిల్లలకు డబ్బాపాలు అలవాటు చేయడం జరుగుతుంది. దానివలన శిశువు శరీరం నందు కఫం పెరుగును . ఈ విధముగా కఫం పెరగటం వలన పాలఉబ్బసం , జీర్ణవ్యవస్థలో సమస్యలు , మలబద్ధక సమస్యలు వంటివి ఎన్నొ రోగాలు వస్తాయి.  

          ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిపాలు తాగుతున్న శిశువుకు కూడా ఎన్నొ రకాల సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం శిశువు తాగే తల్లిపాలలోని దోషాలు. మనం సమస్య ఎక్కడ ఉందో కనుగొనకుండా శిశువుకి మందుల మీద మందులు వాడి శిశువు యొక్క శరీరాన్ని మరింత బలహీనపరుస్తున్నాం. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం తల్లి తీసుకునే ఆహారం . పాతకాలంలో బాలింతకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు చాలామందికి ఏమి తినాలో తెలీదు. ఏదిపడితే అది తినటం వలన సంభవించే దోషప్రభావం చివరికి తల్లిపాల ద్వారా శిశువుకి సంప్రాప్తించి శిశువు రోగాలపాలవుతున్నాడు. 

  * వాతదోషం పొందిన పాలు తాగుట వలన శిశువుకు కలుగు దుష్ప్రభావాలు - 

    తల్లి యందు వాతం పెరుగుట వలన స్తన్యం యొక్క రుచి చెడిపోవును . ఇలా దోషమును పొందిన స్తన్యమును సేవించిన బాలుడు కృశించును. శిశువు వృద్ది చెందుటకు చాలాకాలం పట్టును . వాతప్రభావం వలన స్తన్యము నురుగుతో కూడుకుని ఉండును. స్తన్యము కష్టము మీద బయటకి వచ్చును. ఇట్టి స్తన్యము సేవించిన శిశువుకు కృశించిన స్వరము , మలమూత్ర బంధనం జరిగి వాతదోషము వలన శిరోరోగము , పీనసరోగము ( పీనస రోగము అనగా ముక్కు వెంట నీరు కారుతూ ఉండును ) సంభంవించును . 

 * పిత్త దోషం పొందిన పాలు తాగుట వలన శిశువుకు కలుగు ఉపద్రవాలు - 

       తల్లి యందు పిత్తము పెరుగుట వలన స్తన్యము పచ్చగా లేదా నలుపు రంగుతో వచ్చును. ఇట్టి స్తన్యమును తాగిన శిశువుకు శరీరవర్ణం మారును . చెమటయు , మలస్రావము ఎల్లప్పుడూ వేడిగా ఉండును. శరీరము ఎల్లప్పుడూ వేడిగా ఉండును . స్తన్యము నందు ఇష్టము లేకపోవుట జరుగును . పిత్తదోషము పొందిన స్తన్యమును సేవించు శిశువుకు పాండురోగము , కామెర్ల వ్యాధి సంభంవించును . 

 * కఫ దోషం పొందిన పాలు తాగుట వలన శిశువుకు కలుగు ఉపద్రవాలు - 

       తల్లి యందు కఫము పెరుగుట వలన స్తన్యము జిడ్డుగా , జిగటగా ఉండును. ఇట్టి స్తన్యము సేవించిన శిశువుకు వాంతి , బాధ , నోటి నుండి చొల్లు కారుట , ఆయాసము , దగ్గు , నోటి నుంచి అతిగా నీరు వూరుట , నేత్రములు వాచుట , మందముగా ఉండటం వంటి సమస్యలు కలుగును. 

    

రుద్రాక్షల విశేషాలు - సంపూర్ణ వివరణ - 2 .

రుద్రాక్షల విశేషాలు - సంపూర్ణ వివరణ - 2 .  

      రంగును బట్టి రుద్రాక్షలను మూడు రకాలుగా విభజించవచ్చు . రుద్రాక్షలు శ్వేత ,రక్తపీత , కృష్ణ వర్ణాలలో ఉంటాయి . అంటే తెలుపు , ఎరుపు , నలుపు రంగులలో ఉంటాయి . నిజానికి రుద్రాక్షల యొక్క రంగు అంత ఖచ్చితంగా నిర్ధారించడానికి వీలులేదు . నూటికి నూరుశాతం తెలుపు రుద్రాక్ష గాని లేదా మరో స్వచ్ఛమైన ఇంద్రధనస్సు రంగులలో ఏ ఒక్కదానికి చెందినది గాని ఉత్పత్తి అవుతున్న దాఖలాలు లేవు . 

     సాధారణంగా తెలుపు రుద్రాక్షలు అనేవి కాస్త జేగురు రంగు కలసినచో లేదా లేత పసుపు రంగులో ఉండేవో ఉంటాయి . ఈ రుద్రాక్షలు అరుదుగా ఉంటాయి .మనదేశములో మహారాష్ట్ర రాష్ట్రములో నాసిక్ పరిసర ప్రాంతాలలో ఈ రకం రుద్రాక్షలు లభ్యం అగును . పూర్తి ఎరుపు రంగు రుద్రాక్షలు కూడా సాధారణంగా తటస్థపడవు . రుద్రాక్ష పండు దశలో ఉండేటప్పుడు ఖచ్చితమైన ఎరుపు ఉండే అవకాశం ఉందిగాని ఎండి గట్టిబడిన తరువాత ఆ రంగు ఉండదు . సాధరణంగా ఎరుపు రుద్రాక్షలుగా పిలవబడేవి ఇటుక పొడి రంగులో ఉంటాయి . 

    స్వచ్చమైన నలుపు రంగు రుద్రాక్షలు కూడా ఎక్కడా లభించవు . మాములుగా ముదురు కాఫీ రంగు , ఎరుపు , నలుపుల మిశ్రమపు రంగులో ఉండే రుద్రాక్షలనే నలుపు రంగు రుద్రాక్షలు అంటూ ఉంటారు . ప్రపంచములో ఈ రంగు రుద్రాక్షలే ఎక్కువుగా లభిస్తాయి . 

   మొత్తానికి రుద్రాక్షల రంగు ఏదైనా వాటిలో పెద్ద పరిమాణంలో ఉన్నవి ధరించడం ఉత్తమ ఫలితాలు ఇస్తాయనడంలో సందేహం లేదు . ఇప్పుడు ఆధునిక కొలమానం ప్రకారం మూడు రకాల కొలతలు గురించి వివరిస్తాను . 

 * పెద్దరకం రుద్రాక్షలు - 

 2 నుండి 2 .5 సెంటీమీటర్లు . 
వీటిని ధాత్రిఫల ప్రమాణం అని పిలుస్తారు . 
 
 * మధ్యరకం రుద్రాక్షలు - 

 1 నుంచి 2 సెంటీమీటర్ల మధ్య . 
వీటిని బదరీఫల ప్రమాణం అని అంటారు. 

 * చిన్నరకం రుద్రాక్షలు - 

 1 సెంటీమీటరు కన్నా తక్కువ . 
వీటిని చణమాత్ర ప్రమాణం అంటారు . 

   తరవాతి పోస్టు నందు ముఖాలు ను బట్టి రుద్రాక్ష విభజన వాటి యందలి అద్భుత శక్తులు మరియు ఉపయోగాల గురించి సంపూర్ణంగా వివరిస్తాను . 

  

రుద్రాక్షల విశేషాలు - సంపూర్ణ వివరణ .

రుద్రాక్షల విశేషాలు - సంపూర్ణ వివరణ . 

 ఈ రుద్రాక్షలు అనేవి పలు పరిమాణాల్లో లభ్యం అగును . వీటిని పరిమాణాన్ని బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు . అవి 

  1 - ధాత్ర ఫల ప్రమాణము . 

  2 - బదరి ఫల ప్రమాణము . 

  3 - చణ మాత్రము . 


    రుద్రాక్షలు పలు రంగులలో కూడా లభ్యం అగును . తెలుపు , ఎరుపు , నలుపు రంగులు ప్రధానం అయినవి . ఈ రుద్రాక్షలు పలు ముఖాలను కలిగి ఉంటాయి. ఏకముఖం నుండి ఇరవై ఒక్క ముఖాలు కలిగిన రుద్రాక్షలు కూడా ఉంటాయి . 

       రుద్రాక్షల గురించి వ్యాసమహర్షి తన గ్రంథాలలో వివరించారు. ఈయన వివరణ ప్రకారం ఈ రుద్రాక్షలు అన్ని రకాలు ఒకే ప్రదేశములో లభ్యం అయ్యేవి కావు . ఒక్కోరకం ఒక్కో ప్రదేశములో విరివిగా వ్యాపించి ఉండేవి . తెలుపు లేదా పసుపు రంగు కలిగిన రుద్రాక్షలు కేవలం పశ్చిమ తీరప్రాంత పర్వత సాణువుల్లో పెరిగే వృక్షాల నుండి లభ్యం అగును . ఏకముఖి రుద్రాక్షలు కేవలం నేపాల్ లో మాత్రమె ఉన్నాయి . దశముఖ రుద్రాక్షలు కేవలం మలేసియా దేశములో గల వృక్షాల నుంచే లభ్యం అగును . ఇరవైఒక్క ముఖాలు కలిగిన రుద్రాక్షలు బయట బజారులో అమ్ముతుంటారు . కాని అవి ఎక్కడ నుంచి లభ్యం అగునో , ఆ వృక్షాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలీదు . ఇలా వేరువేరు ప్రదేశాలలో లభ్యం అయ్యే రుద్రాక్షల గురించి వ్యాస మహర్షి తన గ్రంథాలలో రాయటం చాలా ఆసక్తి కలిగిస్తుంది . అంతేకాదు భూమి మీద లభ్యం అయ్యే ఏ ఫలానికి లేక కాయకు లేని "అయస్కాంత క్షేత్రం" ఈ రుద్రాక్షలకు ఉంది . 

    ప్రస్తుతం ఈ అయస్కాంత క్షేత్రాన్ని నిర్ధారించుట ద్వారానే రుద్రాక్ష అసలైనదో , నకిలీదో తేల్చి చెప్పే విధానం ఇప్పుడు విస్తృతంగా వాడుకలో ఉంది . అసలైన రుద్రాక్షను గనుక రెండు రాగినాణాల మధ్య ఉంచి పట్టుకుంటే అది స్వయం చలనంతో పరిభ్రమిస్తుంది . ఇలాంటివే మరికొన్ని అద్భుతమైన భౌతిక లక్షణాలు రుద్రాక్షలకు ఉన్నాయి .

     రుద్రాక్ష ధారణ వలన సుఖశాంతులు కలుగుతాయని , జ్ఞానం పెంపొందించునని , ఆధ్యాత్మిక వికాసం కలుగుతుందని , కుండలిని శక్తి పెరుగుతుందని , సకలసంపదలు లభిస్తాయని , ఆయురారోగ్యాలు వృద్ధిచెందుతాయని మన ప్రాచీన గ్రంథాలు ఉద్ఘోషిస్తున్నాయి . 

     తరవాతి పోస్టు నందు మరింత వివరణాత్మకంగా రుద్రాక్ష విశేషాలు వివరిస్తాను . 

         

ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్స చేసిన విధానం -

ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్స చేసిన విధానం - 

      చెట్టుయొక్క ఆకుని తీసి తెగియున్న ముక్కుభాగమును సరిగ్గా కొలతపెట్టి అంతప్రమాణం గల చర్మమాంసములు తో కూడిన పోరని దగ్గరగా ఉండు చెక్కిలి భాగం క్రిందనుండి మీదకి కోసి మీదభాగం పట్టు ఉండునట్లు ఉంచి ఆ పొరని ముక్కు యొక్క మొదలు వరకు పదునైన అంచుతో శస్త్రం తో గీచి రక్తం స్రవించునట్లు చేసి దానితో అంచులని అతికించి నాసారంధ్రములకు రెండింటికి తేలికైన గలగడ్డితో చేసిన గొట్టములని దూర్చి పైన ముక్కుయొక్క ఆకారంనకు సరిగ్గా ఆ కండపోరని సర్ది అప్రమత్తముగా , శీఘ్రముగా మీదకి ఎత్తి సూత్రాదులతో ( దారాలతో ) చక్కగా బంధనం చేసి దానిపైన రక్తచందనం , యష్టిమధూకం , రసాంజనం వీని చూర్ణంని చల్లి ఆ పైన తెల్ల దూదిపింజతో కప్పి నువ్వులనూనెని మాటిమాటికి వేసి తడుపుచుండవలెను . మరియు ఆ రోగికి జీర్ణం అయ్యేంత తగినంత నెయ్యిని త్రాగించి కొంచం స్థిమితపడిన తరువాత శాస్త్రానుసారం విరేచనం చేయించవలెను. 

          ఇలా చేయుచూ చక్కగా ఆ పోర అతుకుకున్న తరువాత అంతకు ముందు కొంచం పట్టు ఉంచిన కండ భాగాన్ని ఛేదించవలెను . ఇలా చక్కగా అతుకుకొనిన తరువాత కొంచం కృశించి ఉన్నచో ఆ భాగం నకు వెనక చెప్పిన తైలాది చికిత్సలను అనుసరించి ఆ భాగం పెరుగునట్లు చేయవలెను . ఒకవేళ అక్కడ మాంసం ఎక్కువుగా వృద్ధిచెంది యున్నచో సమముగా ఉండునట్టి ఉపాయం జూచి తగ్గించి సరిచేయవలెను . ఒక్కోసారి లలాటభాగం నందలి మాంసపుపొర కూడా కోసి అతకవలసి యుండును.

       ఈ విధముగా సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్సలు కడు ఉపాయంతో సులభంగా చేసేవారు.

   
   

Sunday, October 15, 2023

pulse

నాడి పరీక్ష...... సర్వనాడీలను నిర్మూలంగా స్వాస్థానం నందు సంచల రహిత ముగాను మందహీనముగా నుండిన శుభ లక్షణ నాడిని తెలియవలెను పురుషులకు కుడి చేయి యందును స్త్రీలకు ఎడమ చేయి యందును నాడిని పురుషుని కుడి చేయి యొక్క మణికట్టు వద్ద వైద్యుడు మూడు వేళ్లతో నాడిని పరీక్షించినప్పుడు తర్జుని వేలి కింద నాడి వైద్యనాడియన్యు మధ్య వేరి అందలి నాడి శేష్మ నాడి ఎన్ యు అనామిక వేలి అందాలి నాడి వాతనాడి ఎన్ యు తెలుసుకోవలెను స్త్రీలకు నాభి కూర్మం వృత్వం ముఖముగా ఉండుట వలన నాడులు కుడు వ్యాత ఖ్య స్థానములగా స్థామూలముగా ఉండును అందుచే స్త్రీలకు వ మ హస్తము మందు నాడిని పరీక్షించవలెను అటుల పక్షించునప్పుడు తర్జని వేలియందని నాడివత నాడి ఎన్ యు మధ్య వేలి యందలి నాడి శేష్మ మరియు అనామిక వేలియంయ లి నాడి వైద్యనాడి ఎన్ యు గ్రహింప వలెను పురుషులకు ఎడమవైపునకు స్త్రీలకు కుడివైపునను జీర్ణకోశములు నాడి భేదాలు కలుగజేయునది ,,,,,,,,,,1,,,( నాడి జ్ఞానహిన వైద్య దోషాలు ) ఎవడు శాస్త్ర జ్ఞాన మెరుo గాక నాడి గతులు తెలిసి కొనక చికిత్స జయంబున నో అట్టి వైద్యుడు పర్వత్వం నెక్కుట యాతించు నందుని వలె బగపడును.........2 ( త్రీ కల నాడి లక్షణము ) నాడి పాత్ర కాలము మా oదు శేష్మ గతి గలదీగాను మధ్యాహ్నము మందు పిట్ట గతి గలదిగాను అపర్ణ హరణం మందు వాత గతి గలది గును అర్థరాత్రి యందు పిత్తగతి గలదిగును నుండనని తెలుసుకోనవలెను.........3 నాడి పరీక్ష నిషేధ కాలం ఆకలి గున్న వానికి భుజించిన వానికి వ్యాయామము దప్పి ఎండ వీనిచే డ్రెస్ యున్నవానికి అభ్యాంజనం చేసుకుని స్నానం శ్రీ సంభోగం చేసేవానికి నిద్ర లేచిన వానికి చుట్ట బీడీ సిగరెట్ తాగిన వానికి నాడి బాగా చేసుకోవాల్సిన జాలారు మధ్యపానం చేసినవాని కి మతి బ్రహ్మ గ లుగు వానికి గంజాయి సేవించిన వానికి యోగ అభ్యాసం చేయు వానికి కప్ప కోడి కుందేలు సర్పము విని మాంసంలను పూజించు వానికి అపస్ర్మ రోగికి నాడి బాగా కనిపించదు.........4 (వాత నాడి లక్షణములు ) వాతనాడి వాతాధీ క్య మునందు సర్పము వలె వక్ర మూగాను ఇధు దు ష్టంబున బిగించబడిన తంత్రి చందంబున నడుచుచుండును......(.5 పిత్తనాడి లక్షణములు ).. పిత్తనాడి పీత దీ క్యా ము నందు సంచలమగును కాకి వలె నడుచుచుండును.......(6 శేష్మ నాడి లక్షణము )...నాడి నందు కొంగ కప్ప ఊర పిచ్చుక పిరికిపెట్టా హంసకో డి పావురా పి ట్ట వలె ముందుగా నడుచుచుండును......(7 వాత పిత్త నాడి లక్షణము )......... వాత పిత్త సంసారంగము నందు పారమారు స్వరము వలె కప్ప వలె నడుచుచుండుని వైద్య వే తు లు నుడి వీరి....(..8.. వాత శేష్మ నాడి లక్షణములు )...... వాతశ్లేష్మా సంసారగము నందు నాడి సర్పము రాజహంస దీనివల్ల నడుచుచుండును వలెను.......9.( పిత్త స్లే ష్మ నాడి లక్షణములు )... పిత్త శేష్మ సంసారగంనందు నా డి కప్ప నెమలి మొదలగు వాణి గమనము కలధై ఉండునని తెలియజేయవలె ........(.10 అందరికీ గుడ్ ఈవెనింగ్ )🙏🏽🌹🌹🌹🌹🌹🌹

Friday, October 6, 2023

వ్యాధుల నివారణలో విటమిన్ల ఉపయోగాలు - 2

వ్యాధుల నివారణలో విటమిన్ల ఉపయోగాలు - 2 . 

 అంతకు ముందు పోస్టులో మీకు D విటమిన్ గురించి సంపూర్ణంగా వివరించాను . ఇప్పుడు మిగిలిన విటమిన్స్ గురించి కూడా వివరిస్తాను . వీటి గురించి సంపూర్ణ సమాచారం నేను రచించిన గ్రంథాలలో మరింత వివరణాత్మకంగా ఇచ్చాను . 

 * C విటమిన్ - 

    C విటమిన్ మన శరీరానికి యాంటిబయాటిక్ గా పనిచేస్తుంది . జీర్ణశక్తిని పెంచుతుంది . ఈ విటమిన్ లోపిస్తే ఐరన్ ను ప్రేగులు శోషించుకోలేవు . ఐరన్ లోపిస్తే రక్తహీనత ఏర్పడును . C విటమిన్ ఎక్కువుగా నిమ్మకాయ , ఉసిరికాయ , కొత్తిమీర , కలబంద , వెల్లుల్లి , ముల్లంగి , పైనాపిల్ , కొబ్బరిబోండాలలో , మునగ ఆకులలో పుష్కలంగా లభ్యం అగును . 

 * A విటమిన్ - 

    ముఖ్యముగా ఈ విటమిన్ కంటిదృష్టి స్పష్టంగా కనిపించుటకు సహాయపడును . మునగాకు, మునగపువ్వు , మునగకాయ A విటమిన్ సమృద్ధిగా ఉండును . పైనాపిల్ , ముల్లంగి , ఆవునెయ్యి , గోధుమగడ్డి రసంలో , పచ్చిబఠాణీలో , క్యారెట్ లో ఈ A విటమిన్ సమృద్దిగా లభించును . 

 * E విటమిన్ - 

    A ,C విటమిన్ లను , ప్రోటీయాసిడ్స్ ను శరీరం నుండి నశించకుండా రక్షించే గుణం పైనాపిల్ లో ఉన్న విటమిన్ E లో ఉంది . వేరుశెనగ , బాదం , కాయగింజలలో , సోయాచిక్కుడులో , గట్టిగా ఉండు గింజలలో E విటమిన్ లభ్యం అగును . 

 * K విటమిన్ - 

    K విటమిన్ రక్తం త్వరగా గడ్డ కట్టుటకు ఉపయోగపడును . K విటమిన్ లోపించడం వలన రక్తం గడ్డకట్టదు . ఈ విటమిన్ పచ్చి బఠాణి , ఆవునేయ్యిలో అధికముగా ఉండును . 

 * B6 విటమిన్ - 

    ఈ విటమిన్ తెల్ల రక్త కణాల తయారీకి ఉపయోగపడును . అరటిపండులో , పచ్చటి ఆకుకూరలలో , పప్పుదినుసులలో , చిక్కుడు , బంగాళాదుంపలలో ఈ B6 విటమిన్ ఎక్కువుగా ఉండును. 

 * B12 విటమిన్ - 

    విటమిన్ B12 లోపిస్తే పెదవులలో పగుళ్లు వస్తాయి . ఎర్రరక్త కణాలు ఏర్పడుటకు , నాడీమండల వ్యవస్థకు , నీరసం , జ్ఞాపకశక్తి తగ్గడం , నోటిపూత , నరాల కణాలు నశించిపోవడం వంటి సమస్యలు వస్తాయి . విటమిన్ B12 పాలఉత్పత్తులలో , సోయాచిక్కుడు పాలలో ఎక్కువుగా ఉండును . 

 

Thursday, October 5, 2023

వ్యాధుల నివారణలో విటమిన్ల ఉపయోగాలు -

వ్యాధుల నివారణలో విటమిన్ల ఉపయోగాలు - 1

  ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషి ఏదో ఒక అనారోగ్యముతో ఇబ్బందిపడుతున్నారు . ఈ అనారోగ్యాలకు ముఖ్యకారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే . మనం తీసుకునే ఆహారం పురుగుమందులతో కలిసి ఎప్పుడో విషంగా మారిపోయింది . ఇలాంటి విషపూరిత ఆహారం మరియు సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం లేదో అప్పుడే శరీరం రోగగ్రస్తం అయిపోతుంది . 

     మన శరీర ఆరోగ్యం అనేది విటమిన్ల పైన ఆధారపడి ఉంటుంది. విటమిన్ల లోపం ఏర్పడినప్పుడు ఆయా రోగాలు సంభవిస్తాయి. రోగగ్రస్తం అయిన శరీరము నందు రోగాన్ని పారదోలుటకు ఒక్క ఔషధం వాడటమే కాదు ఆ రోగం రావడానికి ఏ విటమిన్ తక్కువ అయ్యిందో గమనించి ఆ విటమిన్ కలిగిన ఆహారాన్ని లోపలికి తీసుకోవడం వలన ఆ జబ్బు నుంచి త్వరగా బయటపడవచ్చు . 

 ఈ విషయము గురించి రోగికి చికిత్స చేయు వైద్యుడికి సంపూర్ణ అవగాహన ఏర్పరుచుకోవాలి . 

   ఇప్పుడు ఆ విటమిన్ల లోపం వలన కలుగు సమస్యల గురించి మీకు వివరిస్తాను . వీటి గురించి నా గ్రంధాలలో సంపూర్ణ వివరణ ఇచ్చాను . 


 * విటమిన్ D - 

  సాధారణంగా మన శరీరం విటమిన్లను తయారుచేసుకోలేదు . వాటిని ఆహార రూపంలో బయట నుంచి లోపలికి తీసుకోవాలి . D విటమిన్ మన శరీరంలో తయారగును . దీన్ని మన శరీరం సూర్యరశ్మి నుంచి తయారుచేసుకుంటుంది . ఎముకలు బలంగా ఉండుటకు ఈ విటమిన్ అత్యంత ముఖ్యమైనది . రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది . రక్తనాళాలు బలంగా ఉండుటకు తోడ్పడును . ఇన్సులిన్ ఉత్పత్తి సవ్యముగా జరిగేలా చూస్తుంది . అలానే ఇన్సులిన్ శరీరం గ్రహించేలా చూస్తుంది . శరీరంలో కణవిభజన నియంత్రిస్తుంది ఫలితముగా క్యాన్సర్ రాకుండా కాపాడును . 

            విటమిన్ D లోపము వలన ప్రేగు క్యాన్సర్ , రొమ్ము క్యాన్సర్ , ప్రోస్టేట్ గ్రంధి క్యాన్సర్ , క్లోమ క్యాన్సర్ సంభవించును . ఉదయం 6 నుంచి 7 సమయములో వచ్చు సూర్యరశ్మిలో విటమిన్ D ఎక్కువుగా ఉండును. ఈ సమయములో సూర్యనమస్కారాలు చేయుట ఉత్తమం . D విటమిన్ లోపిస్తే పిల్లల ఎదుగుదల లోపిస్తుంది . 

    ఈ D విటమిన్ పాలు , గోధుమలు మరియు దేశీవాళీ ఆవునెయ్యిలో ఎక్కువుగా ఉండును . బాదంలో కూడా ఈ విటమిన్ లభ్యం అగును. మెగ్నీషియం కూడా ఉండును . ఈ మెగ్నీషియం లోపించిన తలవెంట్రుకలు ఊడును . 

    

Wednesday, October 4, 2023

భోజనమునకు ఉపయోగించదగిన పాత్రలు మరియు ఆకు విస్తళ్ళు -

భోజనమునకు ఉపయోగించదగిన పాత్రలు మరియు ఆకు విస్తళ్ళు - 

 * బంగారు పాత్ర యందు భోజనము మంగళప్రదమైనది . జఠరాగ్ని వృద్ది చెందును .వీర్యవృద్ధి కలుగచేయును . మంచి చూపును ఇచ్చును . పైత్యవికారాలను అణుచును . శరీరానికి గొప్ప మేలు చేయును . 

 * వెండిపాత్ర యందు భుజించిన పిత్తం ఎక్కువగును . శ్లేష్మాన్ని హరించును . వాతాన్ని చేయును . అరుచి ( ఏమి తిన్నా రుచి లేకుండా ఉండు సమస్య ) పోగొట్టును . శరీరానికి కాంతిని ఇచ్చును . వెండి ప్లేట్ మధ్యలో బంగారముతో తాపడం చేయించి అందులో భుజించుట కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును . 

 * కంచు పాత్రలో భుజించిన రక్తపైత్యము హరించును . హృదయానికి బలాన్ని ఇచ్చును . బుద్ధిని పెంచును . శరీరము నందు జఠరాగ్ని పెంచును . శరీరానికి కాంతిని కలుగచేయును . ఎముకల వృద్ది అగుటకు తోడ్పడును . ఎముకల బలానికి సహాయపడును . 

 * స్టెయిన్ లెస్ స్టీల్ , ఇనుము పాత్ర యందు భుజించిన శోధన ( Asitis ) , పాండురోగము ( Anemia ) సమస్యలను పోగొట్టును . కామిల వ్యాధి ( కామెర్లు ) నివారణ అగును . వీర్యవృద్ధి , జఠరాగ్ని పెంచును . ఈ పాత్రలను శుభ్రపరుచుట సులభము . 

 * అల్యూమినియం పాత్ర యందు వండుట మరియు భోజనం చేయుట అత్యంత ప్రమాదకరం . ఈ పాత్రల యందు వండు సమయము నందు దీని యందలి విషము కొంచం కొంచం వండిన ఆహారాల యందు కలిసి రక్తదోషాలు ఏర్పడి చర్మరోగాలు వచ్చుటయే కాక , జఠరాగ్ని మందగించి శరీరము విషతుల్యమై అనేక రోగాలు సంప్రాప్తించును . 

 ఆకు విస్తర్ల యందు భోజనం చేయుట వలన ఉపయోగాలు - 

 * అరటి ఆకు యందు భోజనము మిక్కిలి పరిశుభ్రముగా ఉండును . వాతాన్ని హరించును . బలము , ఆరోగ్యము వృద్ధిచెందును . శరీరకాంతి , సంభోగశక్తి పెంపొందించును . ఆకలిని మరియు దంతకాంతిని కలిగించును . పైత్యమును శాంతిప చేయును . శ్లేష్మవికారాలు , వొళ్ళు నొప్పులు తగ్గును . శరీరము నందలి క్రిములు నాశనం అగును . ఉదరము నందలి పుండ్లు ( peptic ulcers ) తగ్గించును . 

 * మోదుగ ఆకు విస్తరి యందు భుజించుట వలన గుల్మరోగము ,మహోదరము , క్రిమిరోగము , రక్తసంబంధ రోగములు , పిత్తరోగములు నివారణ అగును . బుద్దిని పెంచును . మోదుగ చంద్ర సంబంధ వృక్షము . చంద్రుడు మనః కారకుడు అందుచే ఈ విస్తరి యందు భుజించటం చేత సాత్విక గుణములు కలుగును . 

 * మర్రి ఆకుల విస్తరి యందు భుజించటం వలన క్రిమిరోగ నివారణ అగును. వ్రణములు , పైత్యం పొగొట్టును . కుష్ఠు రోగమును హరించును . నేత్రదోష నివారణ చేయును . వీర్యవృద్ధి కలిగించును . 

 * రావి ఆకు విస్తరి యందు భుజించిన పిత్తము , శ్లేష్మము నివారణ అగును . అగ్నివృద్ధి కలిగించును . జననేంద్రియ దోషములు నివారణ అగును . విద్యార్జనకు కావలసిన ఆసక్తిని కలుగచేయును . 

 * పనస ఆకుల యందు భుజించిన అగ్నివృద్ది , పిత్తహర గుణములు ఉండును . 

 * తామర ఆకు విస్తరి యందు భుజించిన విషహరముగా ఉండును . సరస్సులో ఉన్న ఆకు భుజించుటకు పనికిరాదని " అహ్నిక ప్రకాశం" అను గ్రంథములో ఉన్నది . 

 * వక్కపెట్ట భోజనమునకు వాడుట కొన్ని ప్రదేశాలలో ఉన్నది. తిన్నతరువాత పళ్ళెము వలే కడిగి మరలా భుజించటం కూడా ఉన్నది . ఇది అగ్నివృద్ది చేయును . దీని నుంచి వాతపిత్తరోగములు హరించును . 

   

Sunday, October 1, 2023

కొలెస్ట్రాల్ అన్నది ఒక రకపు కొవ్వుపదార్ధము👩🏻‍⚕️*

*👩🏻‍⚕️కొలెస్ట్రాల్ అన్నది ఒక రకపు కొవ్వుపదార్ధము👩🏻‍⚕️*



కొలెస్ట్రాల్ అన్నది ఒక రకపు కొవ్వుపదార్ధము , దీన్ని Lipids అంటారు . 
ఇది జంతు జీవనానికి ప్రధానమైనది . మన శరీరానికీ కొలెస్ట్రాల్ అవసరము . ప్రతి జీవకణం లోని పొరల నిర్మాణానికి , బైల్ సాల్ట్స్ , అన్ని హార్మోన్లు ముఖ్యముగా స్త్రీ-పురుష జననేంద్రియాల నిర్వహణ చేసే హార్మొన్లు , వాటి నిర్వహణకు ఇది అవసరము . గుండె జబ్బులకి ప్రధాన కారణము మన శరీరం లో పేరుకుపోతున్న కొలెస్ట్రాల్ . ఇది ఎంత రహస్యం గా పెరుగుతుందంటే చివరిదాకా మనకు తెలియదు . అందుకే మన గుడెను మనం రక్షించుకొవాలంటే కొలెస్ట్రాల్ ని పెరగనివ్వకుండా నియంత్రంచుకోవాలి . ఈ పెరిగిన కొలెస్ట్రాల్ గుండెనే కాదు ఇతర చోట్ల కూడా తన ప్రభావాని చూపుతుంది . అందుకే మంచి ఆహారపు అలవాట్ల తో , మంచి నడవడికతో దీన్ని మనము కంట్రోల్ చేసుకో్వచ్చును .


*ఉపయోగాలు :*

కొలెస్ట్రాల్‌ను చాలామంది మన శరీరానికి హాని కలిగించే పదార్థంగానే భావిస్తుంటారు. కానీ నిజానికిది మన శరీరానికి ఎంతో అవసరమైన ఒక రకం కొవ్వు పదార్థం అని తెలియదు.కొలెస్ట్రాల్‌(ఫ్యాట్స్ +ప్రోటీన్స్ ) అన్నది ఒక రకం కొవ్వు. ఇది నూనెలు, వృక్ష సంబంధ కొవ్వులో అసలు ఉండదు. వెన్నతీయని పాలు, గుడ్లు, మాంసాహారం వంటి జంతు సంబంధమైన ఆహారం నుంచి వస్తుంది. అయితే దీనికంటే కూడా ఎక్కువ భాగం మన శరీరమే లోపల లివర్‌లో తయారు చేసుకుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ అవసరం చాలా ఎక్కువ. శరీరంలో కణాలన్నీ ఆరోగ్యంగా ఉండటానికీ, కీలకమైన హార్మోన్ల తయారీకీ, జీర్ణప్రక్రియకు అవసరమైన పైత్యరసం ఉత్పత్తి కావటానికీ.. 
A,D,E,K విటమిన్లు శరీరము గ్రహించుటకు , ఇలా ఎన్నో విధాలుగా కొలెస్ట్రాల్‌ ఉపయోగపడుతుంది. కాబట్టి మనం నేరుగా ఆహారం రూపంలో తీసుకున్నా, తీసుకోకున్నా శరీరమే దీన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. మనం బయటి నుంచి తీసుకునేది, లోపల తయారయ్యేది.. ఇలా ఏ రూపంలోనైనాగానీ రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం పెద్ద సమస్య! ఇదే అనర్థాలకు మూలం! కాబట్టి.. ఎవరైనా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాల్సిందే. కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు అనే కొవ్వులు నీటిలో కరిగేవి కాదు కాబట్టి రక్త ప్రవాహంలో తేలికగాకలవలేవు. అందుకే కొలెస్ట్రాల్‌ను మన లివర్‌.. ప్రోటీన్లతో జతచేసి.. Lipo-Proteins గా రక్తప్రవాహంలోకి పంపిస్తుంది.
కొలెస్టిరాల్ నిల్వలు ఎప్పుడు ప్రమాదకరము ?

టోటల్ కొలెస్టిరాల్ :
200 మి.గా% వరకు — మంచిది .
200 – 239 %–కొంతవరకు రిష్క్ ,
240 – కంటే ఎక్కువ % — హై రిష్క్ ,
LDL :
100 లోపు — మంచిది ,
100-129 — ఉండవచ్చును ,
130-159—కొంతవరకు రిష్క్ ,
160– అంతకంటె ఎక్కువ హై రిష్క్ ,
HDL : 50 మి.గ్రా% — మంచిది ,
50- 35 ——-కొద్దిక రిష్క్ ,
35 — తక్కువ – హై రిష్క్ …. ఈ స్టేజీ లో గుండె జబ్బులు వచ్చే అవకాశము ఎక్కువ .

❄️❄️❄️❄️❄️❄️❄️