* శొంటి కొమ్మును చూర్ణం చేసి తేనెతో కలిపి సేవించిన గొంతు నొప్పి తగ్గును.
* తేనెలో కొంచం మిరియాల చూర్ణం వేసి తీసుకుంటే బొంగురుపోయిన గొంతు మాములుగా అగును.
* మామిడి ఆకుల కషాయం అరకప్పు తీసుకుని అందులో చెంచా తేనె కలుపుకుని తాగాలి . అలా ఉదయం , సాయంత్రం రెండుపూటలా మూడు రోజుల పాటు తీసుకున్న గొంతు బొంగురు పోవును .
* ముల్లంగి రసాన్ని పూటకు పావుకప్పు తీసుకుంటున్న గొంతు బొంగురు పోవును .
* చిన్న అల్లం ముక్క బుగ్గన పెట్టుకుని రసం మింగుచున్నను గొంతు బొంగురు పోవును .
* రాత్రి సమయం నందు నిద్రించుటకు పూర్వం ఒక గ్లాసు వేడివేడి పాలలో ఒక చిన్న స్పూన్ మిరియాల చూర్ణం కలుపుకుని తాగుచున్న గొంతులో రొంప, గొంతు బొంగురు పోవును .
* గొంతులో మంట, నుస ఉంటే లవంగ మొగ్గ నోటిలో వేసుకొని రసం మింగుచున్న తగ్గును.
* చిన్నపిల్లలకు గొంతులో మంట, నుస ఉంటే వారితో అప్పుడప్పుడు లేత కొబ్బరి తినిపిస్తున్న తగ్గును.
* గొంతులో టాన్సిల్స్ వాపు వచ్చినపుడు ఉల్లిగడ్డ దంచి ఆ రసం పైన పూయుచున్న వాపు తగ్గును.
* లేత కొబ్బరి వేర్ల కషాయం కాని మెంతుల కషాయం తో పుక్కిలిస్తున్న గొంతు మంట తగ్గును.
* టాన్సిల్స్ ఇబ్బంది ఉన్నప్పుడు తాంబూలం లో వాడే కాచు చూర్ణం చేసి పూటకు పావు స్పూన్ చూర్ణం కొంచం తేనెతో కలిపి లోపలికి తీసుకోవాలి లేదా అరకప్పు నీటిలో కలిపి తాగాలి ఇలా రోజు చేయుచున్న టాన్సిల్స్ వాపు క్రమక్రంగా తగ్గును.
No comments:
Post a Comment