Wednesday, January 10, 2024

అభ్యంగనం ( మసాజ్ ) వలన ఉపయోగాలు -

అభ్యంగనం ( మసాజ్ ) వలన ఉపయోగాలు - 

      శరీరానికి ప్రతిదినం ఒంటికి ఆయిల్ మసాజ్ చేసుకోవడం తప్పనిసరి అని ఆయుర్వేదం తెలియచేస్తుంది. ఇది ఒక రకమైన వ్యాయామం వంటిది. దీనివలన ముసలితనం త్వరగా దరిచేరదు. ఒళ్లునొప్పులు ఉండవు. కళ్ళకి తేటదనం వస్తుంది. శరీరానికి నునుపుదనం , బలం కలుగుతాయి. ఆయుష్షు పెరుగుతుంది. మంచినిద్ర పడుతుంది. శ్రమని తట్టుకొనే శక్తి పెరుగును . 

             శరీరానికి ఆయిల్ మసాజ్ చేసుకొనుటకు ఆయుర్వేదం అనేక రకాల తైలాలను సూచించింది. ఇప్పుడు మీకు శరీరానికి ఆయిల్ మసాజ్ చేయడం వలన ఉపయోగాల గురించి మీకు వివరిస్తాను. 

  ఉపయోగాలు - 

 * తైలముతో శరీరానికి మసాజ్ చేయడం వలన చర్మానికి కాంతి వచ్చును. 

 * కండరాలు బలంగా తయారగును. 

 * కండరాలకు , టిష్యులకు మంచి పోషణ అందుతుంది.

 * రక్తప్రసరణ బాగా ఉంటుంది. రక్తప్రసరణ బాగా జరగడం వలన శరీరంలో ప్రతి కణానికి ఆక్సిజన్ అందుతుంది . 

 * శరీరంలో వ్యర్ధాలు బయటకి వస్తాయి. 

 * శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగును . 

 * శరీరం తేలికగా , ఉత్సాహంగా ఉంటుంది. 

 * శరీరంలోని అన్ని జాయింట్లలో పట్టుకుపోవడం తగ్గి అన్నివైపులకు తిరగడానికి వీలుగా ఉంటుంది. 

 * మసాజ్ శరీరంలో దృఢత్వాన్ని పెంచుతుంది.

 * వెన్నుముక కు చాలా మంచిది . వెన్నుముక నుంచి వచ్చే స్పైనల్ నెర్వ్స్ కు సంబందించిన అవయవాలన్నీ బాగా పనిచేయడానికి అవకాశం ఉంది. 

 * శరీరంలోని ఎలక్ట్రో మేగ్నటిక్ శక్తి సక్రమంగా ప్రవహించడానికి మసాజ్ దోహదం చేస్తుంది.

       పైన చెప్పిన విధముగా ఎన్నొ ఉపయోగాలు ఉన్నాయి. మసాజ్ చేసుకొనే సమయములో అరికాళ్ళు మర్దన చేసుకోవడం మర్చిపోవద్దు. 

   
  

No comments:

Post a Comment