👉ఇంతకీ ఆ రోజు ఏంటి? ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
👉మిగిలిన ఆరు రోజలు కూడా ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని కళ్ళలో ఒత్తులు పెట్టుకుని మరీ ఎదురుచూస్తుంటారు. అన్ని రోజులు వేచి చూసిన తరువాత వచ్చిన ఆరోజు ఒక పండుగ కంటే ఎక్కువ వేడుకగా చేసుకోవడానికి ఎన్నెన్నో ప్లాన్లు చేసుకుని మరీ వేచి చూస్తుంటారు.
👉మితిమీరిన ఆహారపు రుచులు, అదుపు లేని ఆల్కహాల్ పార్టీలు , పబ్ లు రెస్టారెంట్లలో చేసుకునే విందులు వినోదాల కోసం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి మిత్రులతో కలిసి ప్లాన్ చేసుకుని అనారోగ్యానికి రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానించే ఆ రోజే " ఆదివారం" .
👉సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుండి రోజువారీ కూలీల వరకు, పేరు మోసిన దిగ్గజ వ్యాపార వేత్తల నుండి బిక్షగాళ్ల వరకూ కూడా పేద ధనిక వ్యత్యాసాలు లేకుండా ఈ ఆదివారం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
👉ఆ ఒక్క రోజు చేస్తున్న తప్పిదం ఎన్నో అనారోగ్యాలకు దారి తీస్తున్నది. పిల్లల నుండి పెద్దల వరకు కూడా ఎన్నో అంతులేని జబ్బల బారిన పడి హాస్పిటల్స్ చుట్టూ క్యూలు కడుతున్నారు. అరవై ఏళ్ళలో రావాల్సిన జబ్బులు ఇరవై ఏళ్ళకే వచ్చేస్తున్నాయి. జబ్బులేని మనిషి ఎవరైనా ఉన్నారా అంటే లేరు ఆనే సమాధానం 100% వినపడుతున్నాయి.
👉ఈ ఒక్కరోజు ఈ నాలుగు పనులు చేయడం ద్వారా మీ ఆరోగ్యంతో పాటూ ఆయుష్షును కూడా పొందవచ్చు.
✍️ *ఈ ఒక్కరోజు మీ మొబైల్ ఫోన్ ను పక్కన పెట్టేయండి.!*
👉ఈ ఫోన్ వల్ల మీకు కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువ అని మీకు తెలుసా?
👉మొబైల్ ఫోన్లు రేడియో తరంగాల రూపంలో విద్యుదయస్కాంత వికిరణాన్ని విడుదల చేస్తాయి. ఈ రేడియేషన్ వల్ల మెదడు పనితీరులో మార్పులు జరిగి శారీరక మరియు మానసిక ఆరోగ్యాల పైన ప్రభావం చూపి, మన నడవడిక లో మార్పులు వచ్చి అనారోగ్యానికి దారి తీస్తుంది.
👉దీర్ఘకాలిక మొబైల్ ఫోన్ వినియోగం మరియు కొన్ని క్యాన్సర్‌లు, ముఖ్యంగా మెదడులో కణితులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
👉నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం వల్ల నిద్రను నియంత్రించే హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. మొబైల్ ఫోన్ స్క్రీన్‌ల ద్వారా వెలువడే నీలిరంగు కాంతి నిద్రకు అంతరాయం కలిగించి సహజమైన నిద్రకు భంగం కలిగిస్తుంది. . దీనివల్ల నిద్రపోవడం కష్టం, నిద్ర నాణ్యత సరిగా ఉండదు మరియు పగటిపూట మగతగా ఉంటుంది.
👉ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మెడ మరియు వెన్నెముకపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది మెడ నొప్పి, దృఢత్వం మరియు భంగిమ సమస్యలకు దారితీస్తుంది. చిన్న స్క్రీన్‌లపై తరచుగా సందేశాలు పంపడం లేదా టైప్ చేయడం కూడా బొటనవేలు లేదా మణికట్టు సమస్యలకు కారణమవుతుంది.
👉స్మార్ట్‌ఫోన్ వ్యసనం లేదా అధిక ఫోన్ వినియోగం వంటి పరిస్థితులు ఆందోళన, నిరాశ, ఒంటరితనం కు గురవ్వడం తో పాటు రోజువారీ పనితీరులో అంతరాయానికి దారితీయవచ్చు.
👉చాలామంది యువత మొబైల్ ఫోన్ ను ప్యాంట్ జేబులో పెట్టుకుంటుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల మగవారిలో శీఘ్ర స్ఖలనం, వీర్య కణాల లోపాలు సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
👉అధిక మొబైల్ వినియోగం వల్ల మొబైల్ ఫోన్ లో వెలువడే నీలి కిరణాలు కంటి సమస్యలను పెంచుతాయి. చూపులో తేడాలు కనిపిస్తాయి. రాను రాను కంటి చూపు తగ్గడం, సైట్ లాంటివి రావడం జరుగుతుంది.
✍️ *మీ నాలుకను అదుపులో పెట్టుకోండి.!*
👉నాలుక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకి మాట్లాడేటప్పుడు ఎంత ఆలోచించి మాట్లాడితే అంత మంచిది. అలాగే లోపలికి తీసుకునే ఆహారంలో ఎంత రుచులను తగ్గిస్తే అంత మంచిది.. ఆలోచించకుండా అధికంగా మాట్లాడే వారు సమాజంలో నవ్వుల పాలు అవుతారు. అధిక రుచులను ఆస్వాదిస్తే అనారోగ్యం పాలు అవుతారు..
👉సాధారణంగా నాలుక ఈ విశ్వం అందించే అన్ని వంటకాల కోసం ఆరాటపడుతుంది. కానీ ఆయుర్వేదం యొక్క నియమం ఏమిటంటే, మీకు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి. ముందు తిన్న ఆహారం జీర్ణం అవకుండా తదుపరి ఆహారం తీసుకోకూడదు. మీరు మీ ఆహారంలో మొత్తం ఆరు రుచులను చేర్చుకోవాలి (తీపి, ఉప్పు, పులుపు, చేదు, ఒగరు మరియు ఘాటు). కానీ నాలుక ఏమి చేస్తుంది అంటే ఒకటి లేదా రెండు అభిరుచులతో కొనసాగాలని కోరుకుంటుంది. ఆ రుచులే మనకు అనారోగ్యాన్ని తెచ్చి పెడుతాయి. మిగిలిన రుచులు మన ఆరోగ్యాన్ని చక్కబెడుతాయి కానీ వాటిని నాలుక పక్కన పెట్టేస్తుంది.
👉హైపర్-యాక్టివ్ మైండ్ యొక్క దురాశ కారణంగా వ్యక్తి వివిధ రకాల ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాడు. జీర్ణసమస్యలను కొని తెచ్చుకొంటారు. తద్వారా ఊబకాయం, మధుమేహం లాంటి ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది.
✍️ *మీ కుటుంబంతో పాటూ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి ఒడిలో గడపండి!*
👉మొబైల్ ఫోన్ ను ఎలాగైతే పక్కన పెట్టేశామో అలాగే ఈ ఒక్క రోజు మాంసాహారం, ఆల్కహాల్, ధూమపానం ను పక్కన పెట్టేయండి. అలాగే పబ్ లు రెస్టారెంట్లకి వెళ్లి మిత్రులతో పార్టీలు చేసుకోవడం ఆపి ఈ ఒక్కరోజు కేవలం కుటుంభం తో విహారాలకు ప్లాన్ చేసుకోండి.
👉విహారాలు వెళ్ళడానికి సమయం లేకపోతే పిల్లలతో కలిసి ఇంటి పెరట్లో ఉన్న మొక్కలు నాటడం, నీళ్లు పోయడం, మొక్కల మధ్య ఉన్న కలుపు తీయడం లాంటి పనులు చేయండి.
👉మీ ఇంట్లో పనులకు పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటూ, పాడుకుంటూ మీ శ్రీమతికి సహాయంగా నిలవండి. ఇలా చేయడం వల్ల మీ శ్రీమతి తో పాటు మీ పిల్లలు కూడా చాలా సంతోషంగా వుంటారు. ఆ సంతోషానికి కారణం మీరే అవుతారు.
👉ఆ రోజు మొత్తం కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోండి.. పిల్లలకి ప్రకృతి గురించి, ఆయుర్వేద జీవన విధానం గురించి వివరించండి. మంచి చెడుల గురించి చెప్పండి. వారి ప్రవర్తనను గమనించండి. వారితో సన్నిహితంగా ఉండండి. వారి సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుని వారి సమస్యలను తీర్చండి. ఇలా చేయడం వల్ల కుటుంభం లో ఒక మంచి వాతావరణం అలవాటు అవుతుంది.
👉పిల్లలకి ఆటలు అలవాటు చేయండి. అవసరం అయితే మీరు కూడా వాళ్ళతో కలిసి ఆడండి. పిల్లలకి సెలవు ఇచ్చిన రోజు ఒక చెట్టుని నాటడం అలవాటు చేయండి. ఇంటి చుట్టూ చెట్లను పెంచడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వారికి తెలియజేయండి.
✍️ *మన పూర్వీకుల నుండి మనకు వచ్చిన ఆయుర్వేద జీవన విధానాన్ని ఈ ఒకరోజు పాటిద్దాము!*
👉ఇది చాలా కీలకమైన బాధ్యతగా భావించాలి. ఏదో నోటికి వచ్చింది ఇక్కడ తెలపడం లేదు. ఆయుర్వేద జీవన విధానం అంటే మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఆరోగ్య సంపద. వాళ్ళు ఎన్నో తరాలుగా ప్రయోగాలు చేసి ఏది తింటే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఏవి తింటే అనారోగ్యానికి దారి తీస్తాయి అనే అంశాలతో పాటుగా వాటిని ఏ ఏ రూపాల్లో తీసుకుంటే మనకు ఉపయుక్తంగా ఉంటాయి అని వారు తిని ఆరోగ్యంగా జీవించిన తరువాత మనకి వాటిని అలవాటు చేశారు.
👉ఆయుర్వేదం అంటే కేవలం మందులు ఇచ్చేసి పంపేది కాదు. ఆయుర్వేదం అంటే మన బ్రతుకు బండిని నడిపే జీవన వేదం. ఆచరిస్తే ఆరోగ్యంతో పాటు ఆయుష్మంతులు కూడా అవుతారు.
👉ఈ ఒక్క రోజు సూర్యోదయానికి ముందు అనగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి.
👉 లేచిన వెంటనే మొబైల్ ఫోను కోసం వెతకడం ఆపి దేవుని రూపం చూసి చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన అయ్యాక మనస్ఫూర్తిగా కాసేపు నవ్వండి. ఇలా నవ్వడం వల్ల ఆ రోజు అంతా మీరు ఒక సంతోషకరమైన వాతావరణంలో జీవిస్తున్న భావన కలిగి ఉంటారు.
👉మలమూత్ర విసర్జన ప్రక్రియ పూర్తి చేసి పిల్లలు అయితే 1 నుండి 2 గ్లాసులు, పెద్దవారు అయితే 750ml నుండి 1 లీటర్ వరకు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి.
👉కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి మధ్యలో కనీసం 45 నిమిషాల నుండి ఒక గంట వరకూ వ్యాయామం చేయండి.
👉వ్యాయామం పూర్తి అయ్యాక నువ్వుల నూనె, ఆవ నూనె మరియూ కొబ్బరి నూనె సమాన నిష్పత్తిలో తీసుకుని గోరువెచ్చగా కాచి ఆ నూనెతో తల నుండి కాళ్ళ వరకు బాగా మసాజ్ చేసి 1 గంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీనినే అభ్యంగనం అంటారు.
👉దంతాల శుభ్రత కోసం వేప పుల్లని, అలాగే తల స్నానం కోసం కుంకుడు, శీకాయ మిశ్రమాన్ని వాడండి.
👉ఉదయం తీసుకునే అల్పాహారం కోసం కీరా, క్యారెట్, బీట్రూట్ లతో పాటుగా చిరుధాన్యాల తో చేసిన ఇడ్లిలు కానీ లేదా జావ గా కానీ తీసుకోవాలి.
👉మధ్యాహ్నం భోజనానికి పాలిష్ చేసిన సన్న బియ్యాలతో చేసిన అన్నం కాకుండా దంపుడు బియ్యంతో కానీ బ్రౌన్ రైస్ తో కానీ చేసిన అన్నం తో పాటు ఆకు కూరలు, కూరగాయలతో చేసిన కూరలను ఎక్కువగా తీసుకోవాలి.
👉రాత్రి భోజనం 7:30 లోపల పూర్తి చేయాలి. ఆయిల్ లేకుండా నిప్పుల మీద కాల్చిన చపాతీ మరియూ ఆకు కూరలతో చేసిన కర్రీతో కలిపి తీసుకోవాలి.
👉అల్పాహారం కి మధ్యాహ్న భోజనానికి మధ్య ఏదైనా ఆకు కూరలతో కానీ కూరగాయలతో కానీ చేసిన జ్యూస్ (కీరా, బీర, పొట్లకాయ, బూడిద గుమ్మడి, పుచ్చకాయ , దోసకాయ లాంటి వాటితో చేసిన ఏదైనా ఒకరకం జ్యూస్ ని) తీసుకోవాలి.
👉భోజనం తర్వాత తప్పకుండా ఏదైనా సీజనల్ ఫ్రూట్ తీసుకోవాలి.
👉మధ్యాహ్న భోజనానికి మరియూ రాత్రి భోజనానికి మధ్య స్నాక్స్ సమయంలో మొలకెత్తిన విత్తనాలు కానీ, బొప్పాయి లేక దానిమ్మ సీ విటమిన్ కలిగిన పండ్లు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఏవో ఒకటి తీసుకోవాలి. నువ్వులు, పల్లీలు, బెల్లం తో తయారు చేసిన ఉండలు కానీ, చిక్కీలు కానీ తీసుకోవాలి.
👉రాత్రి 9 గంటలలోపు పడుకోవాలి. నిద్రకు ముందు టీవీ కానీ మొబైల్ కానీ అసలు చూడకూడదు. వీలైతే ఒక మంచి సందేశం ఉన్న పుస్తకం కాసేపు చదవండి.
👉ఆనందంగా జీవించాలి అంటే ఆస్తులు అవససరం లేదు. ఆరోగ్యదాయకమైన అలవాట్లు ఉంటే చాలు. రోజూ ఎలాగో చేయలేరు. కనీసం ఇలా వారానికి ఒకరోజు చేసి చూడండి. ఫలితాన్ని మీరే స్వయంగా చూస్తారు. ఇలా మీ జీవితంలో చిన్న మార్పులు చేసుకుంటే చాలు.... హాస్పిటల్స్ లో అడుగు పెట్టాల్సిన అవసరం రాదు.
No comments:
Post a Comment