👉ఈ సమస్య ఉన్న వారికి కండరాలు పట్టేసినట్లు ఉండటమే కాదు భరించలేని నొప్పి ఉంటుంది.
👉దీనికి ఆధునిక వైద్య విధానంలో శస్త్రచికిత్స ఒకటే మార్గమని చెబుతారు. అయితే అది కూడా తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే. కొంత కాలం తర్వాత ఈ నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది.
👉 కానీ ఆయుర్వేదంలో సయాటికాకు శాశ్వత పరిష్కారం కలదు.
✍️ *అసలు సయాటిక సమస్య అంటే ఏమిటి?*
👉శరీరంలో అతి పొడవైన నరం సయాటిక్. ఇది తొడల నుంచి మోకాళ్లు, పిక్కల ద్వారా అరికాళ్లు, కాలివేళ్ల దాకా వ్యాపించి ఉంటుంది.
👉మన వెన్నులో ప్రతి రెండు వెన్నుపూసల మధ్య కొంత ఖాళీ ప్రదేశం, ఒక సయాటిక్ నరం, పూసలను బంధించి ఉంచే కొన్ని కండరాలు ఉంటాయి.
👉మన దైనందిన పనుల్లోని కొన్ని లోపాల వల్ల కొందరిలో ఈ పూసలను బంధించి ఉంచే కండరాలు బలహీనమవుతాయి. ఫలితంగా పూసల మధ్య సహజంగా ఉండవలసిన ఖాళీ తగ్గిపోతుంది.
👉దీనివల్ల పూసల మధ్య ఉండే సయాటికా నరం ఒత్తిడికి లోనవుతుంది.ఫలితంగా ఆ నరం శరీరంలో ఎంత దూరం వెళితే అంత దూరం నొప్పి వస్తూనే ఉంటుంది.
👉సయాటిక్ నరం ఒత్తిడికి గురి కావడం వల్ల వచ్చే సమస్య కావడం చేత దీనికి సయాటికా అన్న పేరు స్థిరపడింది. సయాటికాకు ఆయుర్వేద పరిభాషలో గృద్రసి వాతం అని పేరు.
✍️ *సయాటిక సమస్య లక్షణాలు:*
👉సయాటికా సమస్య ప్రారంభం కాగానే కనిపించే లక్షణం నొప్పి. ఆ తరువాత కొంత అసౌకర్యంగా ఉండటం, ఆ భాగంలో ఏదో కదిలినట్టు, చీమలు పాకినట్లు, పొడిచినట్లు అనిపిస్తుంది.
👉 తరువాత ఆ భాగమంతా మొద్దుబారినట్లుగా తయారవుతుంది.
👉వంగడం కష్టమవుతుంది. ఒకవేళ వంగినా మళ్లీ లేవబోతే చురుకుపెట్టినట్లు అవుతుంది.ఈ లక్షణాలు తుంటి నుంచి కాలి వేళ్ల దాకా ఎక్కడైనా కనిపించవచ్చు.
👉ఈ సమస్య నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశలో నడుము భాగంలో కండరాలు పట్టేసినట్లు అనిపిస్తుంది.
👉రెండవ దశలో ఈ నొప్పి నడుము నుంచి పిరుదుల దాకా వెళుతుంది. ఈ దశలో కాస్త తైలమర్ధనం చేసుకున్నా నొప్పి తగ్గుతుంది.
👉మూడవ దశలో నొప్పితో కాలంతా లాగుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే పొడిచినట్లు, మొద్దుబారినట్లు కూడా అనిపిస్తుంది.
👉నాలుగవ దశలో నొప్పి కాలంతా పాకడమే కాకుండా కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది.
పడుకుని మరో పక్కకు తిరగబోతే బలంగా చురుకు పెట్టినట్లు అవుతుంది. వంగినా లేచినా ఇదే పరిస్థితి ఉంటుంది.
👉సయాటికా సమస్య ఉన్న వివాహితుల్లో చాలా మందిలో అంగస్తంభన లోపాలు, శీఘ్రస్కలన సమస్యలు ఉంటాయి.
👉సయాటికా సమస్యతో వచ్చిన వారికి ఈ సమస్య కూడా ఉంటే రెండింటికీ ఏకకాలంలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
👉ఎక్కువ కాలం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే నపుంసకత్వానికి కూడా దారి తీయవచ్చు.
👉సమస్య మరీ తీవ్రమైతే కొందరిలో రెండు కాళ్లూ చచ్చుబడిపోవచ్చు.
👉ప్రమాదాల్లో కూడా కొందరిలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
👉సమస్య మొదలైన మూడుమాసాల్లోపే వస్తే ఇది సులభంగా తగ్గిపోతుంది. కనీసం ఏడాదిలోపు తీసుకున్నా మంచి ఫలితాలే ఉంటాయి. మూడేళ్లు దాటాక చికిత్స తీసుకుంటే సమస్య పూర్తిస్థాయిలో తగ్గదు
✍️ *సయాటిక రావడానికి కారణాలు:*
👉సయాటికా రావడానికి అస్తవ్యస్తమైన జీవన శైలి ప్రధాన కారణం. ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిన వారిలో కండరాలకు ఎక్కువగా శ్రమ ఉండదు. అరుదుగా ఎప్పుడైనా కాస్త ఎక్కువ బరువు ఎత్తడం, ఎక్కువ గంటలు నిలుచోవడం లేక కూర్చునే భంగిమలో తేడా వల్ల వెన్నుపాము అపక్రమానికి లోనయితే ఈ సమస్య తలెత్తుతుంది.
👉రోజంతా కూర్చుని లేదా నిలుచుని ఉండే ఉద్యోగ, వ్యాపారాలు చేసే వారు, మరీ ఎత్తయిన హీల్స్ ధరించేవారు, బెల్ట్‌ను మరీ బిగుతుగా పెట్టుకునే వారు, వెయిట్ లిఫ్టింగ్ చేసేవారు, ఏదైనా ప్రమాదానికి గురయిన వారు సయాటికా సమస్యకు గురికావచ్చు.
👉అలాగే దీర్ఘకాలికంగా మధుమేహం, క్షయ, లైంగిక వ్యాధుల కారణంగా వ్యాధి నిరోధక శక్తి కోల్పోయినపుడు కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది.
👉 ఇవే కాకుండా బాల్యంలో తగిలిన దెబ్బల తాలూకు దుష్ప్రభావం శరీరంలో ఉండిపోతుంది. అది పెద్దయ్యాక ఎప్పుడో శరీరం బలహీన పడినప్పుడు సయాటికాగా బయటపడవచ్చు.
👉ముఖ్యంగా రోజూ చేసే పనుల వల్ల కాకుండా హఠాత్తుగా ఏదైనా బరువైన పనిచేసినప్పుడు ఈ సమస్య రావచ్చు.
👉ఇక స్త్రీలలో అయితే, గర్భంతో ఉన్నప్పుడు గానీ, ప్రసవ సమయంలో గానీ నడుము మీద పడే ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
👉కొంతమంది స్త్రీలలో రుతుక్రమం ఆగిపోయిన తరువాత కాల్షియం లోపాల వల్ల సయాటికా సమస్య రావచ్చు.
✍️ *నివారణా మార్గాలు:*
👉ఈ సమస్య నాలుగు దశల్లో ఉంటుంది. వీటిని డిస్కు బల్జ్, స్లిప్ డిస్క్, హెర్నియేటెడ్ డిస్క్, సీక్వెస్ట్రమ్ డిస్క్ అంటారు.
👉 మొదటి మూడు దశల్లో సమస్యను ఆయుర్వేద మందులతోనే పూర్తిగా తగ్గించవచ్చు. చికిత్సల తరువాత ఎంఆర్ఐ రిపోర్టు చూస్తే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
👉చివరి దశ అయినటువంటి సీక్వెస్ట్రమ్‌లో మాత్రం శస్త్రచికిత్స అవసరమవుతుంది. సయాటికాకు ఆయుర్వేద వైద్యవిధానంలో పంచకర్మ చికిత్సలో భాగమైన మేరు చికిత్స బాగా పనిచేస్తుంది.
👉 ఆయుర్వేద మందులతో పాటు ఆహార నియమాలను పాటిస్తే ఫలితం బాగుంటుంది.
*పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.*
No comments:
Post a Comment