Thursday, May 1, 2025

నిల్వ పచ్చళ్ళు అనారోగ్యమా? ఔషధమా?

నమస్తే అండీ🙏 

నిల్వ పచ్చళ్ళు అనారోగ్యమా? ఔషధమా? 

మీ అరోగ్యము కోసం, 2 నిమిషాలు... 

పూర్వం, అంటే 50 సంవత్సరాల క్రితం వరకు ప్రతి ఇంటిలో సుమారుగా, పచ్చడి  అన్నం 70 శాతం, కూర అన్నం 30 శాతంగా తినేవారు. అయినా వారు చాలా చాలా ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించి ఉన్నారు. దీనికి గల కారణం, వారు పచ్చడిలో వాడిన  పదార్థముల ఔషధీ గుణాలు. 

పచ్చడిలో కచ్చితంగా అన్నీ న్యాచురల్ (ప్రకృతి వ్యవసాయం) పదార్ధములు మాత్రమే వాడాలి. కారం ,పసుపు,మెంతిపిండి, ఆవపిండి ,సముద్రపు ఉప్పు,  గానుగ నూనె మరియు ఇంగువ లు అనేక అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్న పదార్థములు. 

పచ్చడికి సంబందించిన కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం.... 

కారము: ఇది రక్తనాళాలు గడ్డకట్టకుండా కాపాడి, రక్తప్రసరణ సవ్యంగా జరుగుటకు దోహదం చేయును.  తద్వారా గుండెకు సంబంధించిన రోగములు రాకుండా కాపాడును.దీనిలో విటమిన్ ఎ, బి,సి పుష్కలంగా ఉంటాయి. 

పసుపు:.మన భారతీయ సనాతన సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం.దీనిలో కుర్కుమిన్ అనే ఒక రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరిచే  గుణం ఉంటుంది. ఇది క్యాన్సర్ రాకుండా దోహదం చేస్తుంది. 

గానుగ నూనెలు: గానుగ నూనెలలో( పల్లి నూనె&నువ్వుల నూనె) ఉండే ఎంజైమ్స్,లిపిడ్ గుణాలను శరీరము మెరుగ్గా సంగ్రహించే విధముగా చేస్తుంది.. 

మెంతిపిండి: జీర్ణవ్యవస్థను సక్రమంగా చేసి క్లోమము సక్రమంగా వృద్ధిచేస్తుంది. 

సముద్రపు ఉప్పు: నాన్ అయొడైజ్డ్ సాల్ట్ :పచ్చడి నిల్వ సామర్థ్యం చాలా చక్కగా ఉంటుంది. అంతే కాకుండా మన తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే వ్యవస్థ ఉంటుంది. మన శరీరానికి కావల్సిన అత్యంత శక్తివంతమైన అటువంటి కొన్ని సుగుణాలు పొటాషియం లాంటివి దీంట్లో మెరుగ్గా ఉంటాయి.(అయోడిన్ ఉప్పు ఆరోగ్యానికి ఎంతో హానికరం.థైరాయిడ్ వంటి ఎన్నో జబ్బులకు ఇదే ప్రధాన కారణం.మార్కెట్ లో సాధారణంగా మనకు దొరికేది అయొడైజ్డ్ ఉప్పు కావున, దానిని వాడకూడదు)

ఇంగువ: ఇది తిన్న ఆహారాన్ని సరిగా జీర్ణమై, రక్తంలో శక్తిగా మారుటకు ఉపయోగంగా ఉంటుంది. 

పచ్చడి లో వాడే ఆహార పదార్ధములలో ఇన్ని ఔషధీ గుణాలు ఉన్నప్పటికీ, వాటిని పండించే విధానం లో విపరీతమైన విషపూరిత రసాయనాలు వాడడం వలన, శరీర ఆరోగ్య వ్యవస్థను కాపాడవలసిన ఆహార పదార్థాలు, మన ఆరోగ్యాన్ని విపరీతంగా నిర్వీర్యం చేస్తున్నాయి. 

ఉదాహరణకి ఒక మిరపపంట కాలవ్యవధిలో, అంటే తొమ్మిది నెలల వ్యవధిలో, సుమారుగా 40 సార్లు పురుగు మందులు వాడతారు. 

అందువలన మనము పచ్చడి ద్వారా ఆరోగ్యాన్ని పొందాలంటే, ఖచ్చితముగా విష రసాయనాలు వాడకుండా పండించిన పదార్థాలు  మాత్రమే వాడాలి. 

ఒక సంవత్సరంలో ఒక కుటుంబం మొత్తానికి కావలసిన కారము మరియు పసుపు సుమారుగా 3నుంచి 5 కేజీలు మాత్రమే . 


Tuesday, April 29, 2025

గాయత్రీ మంత్రమనేది

గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు

  కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.

 నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.

గాయత్రీ మంత్రము అంటే…
“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, 
భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”
ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…

 

ఓం

భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్

 

ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.

 ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.

 గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.

 1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.

 2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.

 3. పురాణ కధనం ప్రకారం 24 ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. ధర్మచక్రం లో వున్నా 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.

 4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.

 5. 24 కేశవ నామాలు

6. 24 తత్వాలు : ఐదు జ్ఞానేన్ద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 5 మహాద్భూతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు

 7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”

 8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.

 9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు

 10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.

 11. మన వెన్ను బాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.
12.మనకు గల సమయం 24 గంటలు.. ఒక్కొక్క గంటకు ఒకొక్క అక్షరం మనలలను కాపాడుతూ వుంటుంటుంది ఆ గాయత్రి మాత 
 “న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు . 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు. సకల దేవతా స్వరూపం గాయత్రీ. రామాయణ సారం గాయత్రీ . కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ .. సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రీ .. 24 బీజాక్షర సంపుటి గాయత్రీ.. అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.

 
యిరువది నాలుగు దేవతా మూర్తులు
క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి
1 తత్ విఘ్నేశ్వరుడు 13 ధీ భూదేవి
2 న నరసింహస్వామి 14 మ సూర్య భగవానుడు
3 వి మహావిష్ణువు 15 హి శ్రీరాముడు
4 తుః శివుడు 16 ధి సీతాదేవి
5 వ శ్రీకృష్ణుడు 17 యో చంద్రుడు
6 రే రాధాదేవి 18 యో యముడు
7 ణ్యం శ్రీ మహాలక్ష్మి 19 నః బ్రహ్మ
8 భ అగ్ని దేవుడు 20 ప్ర వరుణుదు
9 ర్గోః ఇంద్రుడు 21 చో శ్రీమన్నారాయణుడు
10 దే సరస్వతీ దేవి 22 ద హయగ్రీవుడు
11 వ దుర్గాదేవి 23 య హంసదేవత
12 స్య ఆంజనేయస్వామి 24 త్ తులసీమాత
ఈ ఇవరై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి,దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.

!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!

From Whatsapp

Friday, April 25, 2025

పసిపిల్లలు పుట్టగానే చేయవలసిన పని మరియు పుట్టగానే ఏడవని బిడ్డలకు ప్రాణం పోసే విధానం

పసిపిల్లలు పుట్టగానే చేయవలసిన పని మరియు పుట్టగానే ఏడవని బిడ్డలకు ప్రాణం పోసే విధానం - 
  
•. పసిపిల్లలు పుట్టగానే చేయవలిసిన పని - 
      
సహజమయిన కాన్పు జరిగినప్పుడు తల్లికి చీకట్లు కమ్మినట్లుగా ఉండి తన ఒళ్లు తనకే తెలియనట్లుగా ఉంటుంది. ఆ స్థితిలో ఆమెకి గట్టిగా నడుము బిగించి కట్టి వెల్లికిలా పడుకొపెట్టి ఉంచాలి. పక్కన సహాయకులుగా ఉన్నవారు బిడ్డని జాగ్రత్తగా ఎత్తుకొని గోరువెచ్చటి నీరుతో శుభ్రంగా కడిగి స్నానం చేయించి మెత్తని పొడి గుడ్డల్లో పడుకోపెట్టాలి. పక్కన ఉన్నవారు తమ చేతులకు నిప్పుసెగని కాచుకొని ఆ చేతులను బిడ్డ శిరస్సు , కడుపు భాగాలకు వేడి కలిగేలా చేయాలి . తరువాత ఆ చేయి శుభ్రంగా కడుక్కొని చూపుడు వ్రేలితో అతి కొద్ది ఆముదాన్ని తీసుకుని బిడ్డకు నాకించాలి.
  
• పుట్టగానే ఏడవని బిడ్డకు ప్రాణం పోసే విధానం -
     
      కొన్ని సమయాలలో బిడ్డ పుట్టగానే ఏడవకుండా ఉండటం జరుగును. అట్టి సమయాలలో గాబరా పడకుండా మావిత్రాడు ని సవరిస్తూ ఉండాలి. దానివలన ఆ మావిత్రాడు లొని ప్రాణవాయువు బిడ్డ గర్భములొకి చేరి వెంటనే శరీరానికి చైతన్యం కలిగి అంటే ప్రాణం చేరి బిడ్డ కదులుతూ ఏడుస్తుంది. ఇంకా బిడ్డని అటుఇటు కదిలించి వేడివేడి చేతులతో తాకుట వలన బిడ్డ తుంటి పైన మెల్లగా సుతారంగా తట్టుట వలన ప్రాణం శరీరంలోకి ప్రవేశించి బిడ్డ ఏడుస్తుంది . 
        
. ఒకవేళ బిడ్డ ఎడవకపోతే పైన చెప్పిన పనులు చేసిన తరువాత బిడ్డ క్షేమంగా సజీవంగా ఉందని తెలిసిన తరువాతే బొడ్డు కోయాలి. పదిపదిహేను నిమిషాల పాటు పైన చెప్పినట్టుగా చేస్తూ ఉంటే నిర్జీవంగా ఉన్న బిడ్డలో ప్రాణం వస్తుంది. ఆముదం తడిపిన వ్రేలు బిడ్డ నోటిలో పెట్టడం వలన కూడా బిడ్డలో ప్రాణం చేరి ఉలిక్కిపడి ఏడుస్తుంది . మావిత్రాడులో ప్రాణ నాడి కొట్టుకుంటూ ఉంటుంది. ఆ ప్రాణం బిడ్డ శరీరంలో చేరి బిడ్డకు చైతన్యం కలిగి ఏడ్చే వరకు మావిత్రాడుని కదిలిస్తూ ఉండాలే కాని ఎట్టి పరిస్థితులలో మావిత్రాడు కోయడం కాని , ముడి వేయడం కాని చేయకూడదు .
           
. వైద్యులు , పురుడు పోసే మంత్రసానులు ఈ విషయాన్ని తప్పక గుర్తు ఉంచుకోవాలి . 


గోమాత గొప్పదనం - గోవుతో వైద్యం .

గోమాత గొప్పదనం - గోవుతో వైద్యం .
    
వేదకాలం నుంచి గోమాతకు ఈ భారతదేశం నందు ప్రత్యేక స్థానం కలదు. గోవు ని తల్లిలా భావించిన మన పూర్వికులు పూజించుట యే కాకుండా ఆవు కు సంబంధించిన వుత్పత్తులలోని గొప్పతనాన్ని తెలుసుకుని గ్రంధస్తం కూడా చేశారు అవి చాలా రహస్య యోగాలుగా ఉండిపోయాయి. కొన్ని పురాతన గ్రంథాల నుండి ఆ వివరాలు సేకరించాను అవి మీకు తెలియచేస్తాను 

• ఆవుపాలు  

  ఇవి మధురంగా సమ శితోష్ణము గా ఉంటాయి. తాగితే మంచి వీర్యపుష్టి , దేహపుష్టి కలిగిస్తాయి . వీటిలో A B C D విటమిన్లు వున్నాయి. పగలంతా మనంచేసే శ్రమ హరించిపొయి మరుసటి రోజుకి శక్తి రావాలంటే రోజు రాత్రిపుట తప్పనిసరిగా ఒక గ్లాస్ ఆవుపాలు తాగాలి. శరీరంలోని క్షీణించిపోయిన ధాతువులని మళ్లి జీవింప చేసి ధీర్ఘాయిషుని అందించడంలో ఆవుపాలదే అగ్రస్థానం వీటిని చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిది. వేడితత్వం గలవారు తక్కువగా, శీతల తత్వం వారు ఎక్కువుగా వాడవచ్చు.

 • ఆవుపెరుగు -  

గర్భిణి స్త్రీకి వరం .  
                   వెండి పాత్రలో తోడు బెట్టిన పెరుగు గర్భిణి స్త్రీకి వరప్రసాదం లాంటిది. ఆవుపెరుగు వాడటం వలన గర్భస్రావాలు అరికట్టబడతాయి. నెలలు నిండకుండా జరిగే ప్రసవాలను నిరోధించవచ్చు. పుట్టే పిల్లలు ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఆరోగ్యంగా పుడతారు. ఇంకా తల్లికి చనుబాలు పెంచడంలో కూడా ఆవుపెరుగు శ్రేష్టం అయినది.

 • ఆవు వెన్న - 
              
ఇది చలువ చేస్తుంది శరీరంలోని వాత, పిత్త , కఫ దోషాలను మూడింటిని నిర్మూలిస్తుంది. మేహరోగాలు , నేత్రవ్యాదులు పోగోడుతుంది . ముఖ్యంగా పిల్లలకు,వృద్దులకు ఆవువెన్న చాలా ఉపయోగపడుతుంది.

 •. ఆవునెయ్యి - 
             
. ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జీవకణాలను పోషిస్తూ ధీర్ఘాయిషు ని ఇస్తుంది.ఎంత భయంకరమైన పైత్యాన్ని అయినా హరించి వేస్తుంది సుఖవిరేచనం చేస్తుంది . ఉన్మాదం , పాండు రోగం , విషప్రయోగం , ఉదర శులలు ( కడుపు నొప్పి ) మొదలయిన వ్యాదులతో బాధపడే వారికి మంటల్లో కాలినవారికి , గాయాలు అయినవారికి మంచి పధ్యమైన ఆహారం గా ఆవునెయ్యి ఉపకరిస్తుంది. ఆవునేయ్యితో తలంటు కొని స్నానం చేస్తే తలకు, కళ్లకు అమితమైన చలువ చేస్తుంది .

 • ఆవుపేడ - 
             
  ఆవుపేడ రసం 70 గ్రాముల్లో 35 గ్రాములు ఆవుపాలు కలిపి తాగిస్తూ ఉంటే కడుపులోని మృత పిండం బయటపడుతుంది.
 
• గుధస్తానంలో తిమ్మిరి కొరకు - 
             
ఆవుపేడ ని వేడిచేసి ఒక గుడ్డలో చుట్టి గుధస్థానం లో కాపడం పెరుగుతూ ఉంటే తిమ్మిరి వ్యాధి హరిస్తుంది .
 
• వంటి దురదలకు - 
               
 అప్పుడే వేసిన ఆవుపేడతో వంటికి మర్దన చేసుకుంటూ ఉంటే ఒక గంట తరువాత వేడినీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే దురదలు తగ్గిపోతాయి . 

 • కడుపులోని క్రిములకు - 
              
 20 గ్రా ఆవుపేడ పిడకల చూర్ణం 100 గ్రా మంచినీళ్ళలో కలిపి వడపోసి ప్రతి ఉదయం తాగుతూ ఉంటే కడుపులోని పేగుల్లో ఉండే క్రిములు అయిదారు రోజులలో పడిపోతాయి.
                  ఆవుపేడ లొ క్షయవ్యాధి క్రిములను చంపే శక్తి వుందని అందువల్ల కొంచం ఆవుపేడ ని మంచినీళ్ళతో కలిపి వడపోసి తాగిస్తూ ఉంటే క్షయ మలేరియా , కలరా వ్యాధులు హరించి పొతాయి. ఇదే విషయాన్ని ఇటలి శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు .
 
• ఆవుముత్రం - 
 
  ప్రతిరోజు వడకట్టిన గోముత్రాన్ని 25 గ్రా మోతాదుగా తాగుతూ ఉంటే శ్లేష్మం వల్ల వచ్చిన వ్యాధులు హరించి పొతాయి . 

 • గో మూత్రంలో కొంచం కలకండ పొడి కలిపి కొంచం ఉప్పు కలిపి తాగుతూ ఉంటే కొద్ది రొజుల్లోనే ఉదరానికి చెందిన కడుపుబ్బరం , కడుపునోప్పులు మొదలయిన వ్యాదులు అన్ని హరించి పొతాయి.

 * వడకట్టిన గో మూత్రాన్ని 35 గ్రా మోతాదుగా ప్రతిరోజు ఉదయమే తాగుతూ ఉంటే ఇరవయి నుంచి 40 రొజుల్లొ పాండు వ్యాధి హరించి పొతుంది.
 
* గో మూత్రాన్ని గోరువెచ్చగా వేడిచేసి చెవిని కడుగుతూ ఉంటే చెవిలొ చీము కారడం తగ్గిపొతుంది.

 * ఇరవై గ్రాముల గో మూత్రం లొ పది గ్రాముల మంచి నీళ్లు కలిపి తాగుతూ ఉంటే మూత్రం సాఫిగా బయటకు వెళ్ళిపోతుంది.

 * ప్రతిరోజు ఉదయమే గోమూత్రమును 30 గ్రా మోతాదులో 20 గ్రా పటికబెల్లం కలుపుకుని తాగుతూ ఉంటే మలబద్దకం హరించి పొతుంది. 


క్రిముల ( WORMS ) గురించి సంపూర్ణ వివరణ -

క్రిముల ( WORMS ) గురించి సంపూర్ణ వివరణ -
      
   క్రిములు అనేవి అజీర్ణవ్యాధి వలన కలుగును. పాశ్చాత్య వైద్యులు ఆయుర్వేద శాస్త్రము నందు క్రిముల విషయము క్రిముల గురించి ఎక్కడా ఇవ్వలేదు , చెప్పబడలేదు అని , క్రిములకు ప్రాధాన్యత ఇవ్వబడి ఉండలేదని పొరపాటు అభిప్రాయముతో ఉన్నారు . ఆయుర్వేదం నందు క్రిమివ్యాధులకు కూడా అవసరం ఉన్నంత వరకు ప్రాముఖ్యత ఇవ్వబడినది. ఇప్పుడు మీకు ఆయుర్వేదం నందు క్రిముల గురించి ఏమి చెప్పారో మీకు సంపూర్ణముగా వివరిస్తాను. ఇదే విషయము పైన అంతకు ముందు నేను మీకు ఒక పోస్టులో కొంత వివరించాను. ఇప్పుడు మరిన్ని విషయాలు వివరిస్తాను. 
    
    ఆయుర్వేదం నందు క్రిములను రెండురకాలుగా విభజించారు. అవి 
           
. 1 - బాహ్యక్రిములు . 
             2 - అభ్యంతరములు . 
     త్వక్కులు మొదలగువాని యందు , స్వేదము మున్నగు బాహ్యమలముల యందు శ్లేష్మము , రక్తము , పురీషములను అభ్యంతర మలముల యందు నాలుగు రకములుగా క్రిములు జనించుచున్నవి. 
          
. ముందుగా మీకు బాహ్యక్రిమి లక్షణం వివరిస్తాను. ఈ బాహ్యక్రిములు 20 రకములు కలవు. ఇవి నువ్వులంత పరిమాణమున ఆకారము కలిగి ఆరంగుతో వస్త్రములను ఆశ్రయించి ఉండును. వీటిని నల్లులు అని పిలుస్తారు . జుట్టులో ఉండు యూక , ఈళ్ళు అని రెండు రకములు ఉండును . వాటిలో మరలా అనేక భేదములు ఉండును. ఎర్రటి మచ్చలు , బొబ్బలు , దురదలను , కంతులను కలిగించును. వీటికి బాహ్యక్రిములు అని పిలుస్తారు .  
            
. ముందుగా అసలు ఈ క్రిమిసంబంధ వ్యాధులు రావడానికి గల కారణం తెలుసుకుందాము . ఎవరైతే మొదట భుజించిన ఆహారం జీర్ణము కాకుండా మరలా భుజిస్తారో , ఎల్లప్పుడు మధురపదార్ధములను ఎక్కువుగా తీసుకుంటారో , ద్రవపదార్ధముల సేవన మీద మిక్కిలి ప్రేమ కలిగి ఉందురో , బెల్లము కలిసిన తిండి అధికముగా తినుదురో , కసరత్తు చేయనివాడు , పగలు నిద్రించువారు , పరస్పర విరుద్ద ఆహారములను భుజించువారు ఈ క్రిమివ్యాధులకు లోనగుదురు.  
        మినపపిండి , ఆమ్ల లవణ రసములు గల ద్రవ్యములు , బెల్లము , కూరగాయలు అధికముగా తినువానికి పురీషము నందు క్రిములు పుట్టును . 
            మాంసము , మత్స్యము , బెల్లము , పాలు , పెరుగు , పులిసిన ( తరువాణి ) వస్తువులు నిత్యము సేవించువానికి కఫము నందు క్రిములు పుట్టును . 
      అజీర్ణకరమైన శాకములు , విరుద్ద ఆహారములు తీసుకొనుటచేత రక్తము నందు క్రిమిదోషాలు కలుగును . 
          క్రిముల మన శరీరం నందు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలుగును. మనం ఆ లక్షణాలని గుర్తించి దోషములకు చికిత్స చేయవలెను . ఇప్పుడు మీకు వాటి గురించి వివరిస్తాను . 
      జ్వరము , శరీరం రంగు మారు ట , శూల , హృదయము నందు జబ్బు , శరీరాకృశత్వము , భ్రమ , అన్నద్వేషము , అతిసారం అనునవి ఉండువానికి శరీరము నందు క్రిమి ఉన్నదని తెలుసుకొనవలెను . 
  
          ఇప్పుడు కఫజ క్రిమి గురించి వివరిస్తాను. కఫము చేత ఆమాశయము నందు క్రిములు పుట్టును . అవి వృద్ది నొంది శరీరము నందు పైభాగము నందును క్రింద భాగము నందును కూడా తిరుగుచుండును . వీటిలో కొన్ని లావుగా , పొడవుగా ఫిడేలు చర్మపు తీగవలే ఉండును. ఇవి ఆమాశయము నందు , చుట్టుపక్కల ఆశయముల యందు పొరను అంటిపెట్టుకుని ఉండును. కొన్ని ఎర్రల వలే ఉండును. మరికొన్ని సమముగా పొడవుగా ఉండును. కొన్ని సూక్ష్మాకారముగా ఉండును. మరికొన్ని శ్వేత రక్తవర్ణముగా ఉండును. 
     
  కఫజక్రిములు 7 రకాలుగా ఉండును. అవి 
  * ఆంత్రాదములు - 
         ఇవి శరీరం నందలి ప్రేగులను తినుచుండును. 
  * ఉదరావేష్టములు - 
         ఇవి కడుపున చుట్టుకుని ఉండును. 
 * హృదయాదములు - 
         ఇవి హృదయము నందు తిరుగుచుండును. 
 * మహాగుదములు - 
        ఇవి వెడల్పైన గుదములు కల్గి ఉండును. 
 * భుఱువులు . 
 * దర్భ కుసుమములు - 
          ఇవి రెల్లు పువ్వుల వలే ఉండును. 
 * సుగంధములు -  
         ఇవి సుగంధము కలిగి ఉండును. 
        కఫజ క్రిముల వలన హృదయము నందు అదురుట , నోట నీరుకారుట , ఆహారం జీర్ణం కాకుండా ఉండుట , అరుచి , మూర్చ , వాంతి , జ్వరము , కడుపుబ్బరం , కృశించుట , తుమ్ములు , పీనస వంటి సమస్యలు కలుగును. 

  రక్తజ క్రిమి లక్షణము - 
       రక్తమున జనించిన క్రిములు మిక్కిలి సూక్ష్మమైన ఆకారము కలిగి ఉండును. పాదము పొడవు , గుండ్రమైన ఆకారం కలిగి ఉండును. ఎరుపు రంగు కలిగి రక్తం ప్రవహించు సిరలు యందు ఉండును. వాటిలో చాలా వరకు సూక్ష్మ ఆకారం కలిగి ఉండటం వలన కంటికి కనిపించవు. 
       ఈ రక్తజ క్రిమి మొత్తం 6 రకాలుగా ఉండును. అవి 
 * కేశాదములు - 
          ఇవి తల వెంట్రుకలను నశింపచేయును . 
 * రోమ విధ్వంసకములు - 
         ఇవి శరీరం పైన రోమములను రాలిపోవునట్లు చేయును . 

 * రోమద్వికములు - 
        ఇవి రోమకూపములను ఆశ్రయించి ఉండును . 
 * ఉదుంబరములు 
 * సౌరసములు . 
 * మాతలు .  
    
    ఈ రక్తజ క్రిమి వలన ముఖ్యముగా కుష్టువ్యాధిని కలిగించును. ఈ మాతలను జంతుమాతలు అని అంటారు. 
     
. పురీషజ క్రిమి లక్షణాలు గురించి తెలుసుకుందాము . ఇవి పక్వాశయమున పుట్టి అధోమార్గమున సంచరించును. ఇవి వృద్ధినొంది ఆమాశయమునకు పోయి సంచరించునప్పుడు త్రేన్పులు వచ్చును. ఉపిరి బయటకి విడుచునప్పుడు మలము వలే దుర్గంధము బయటకి వెడలును . వీటిలో కొన్ని లావుగా , కొన్ని గుండ్రముగా , కొన్ని స్థూలంగా , కొన్ని శ్యామల పీత వర్ణముగా , కొన్ని తెలుపు , నలుపు రంగులు కలవిగా ఉండును. ఇవి 5 రకాలుగా ఉండును. అవి 
  
. * కకేరుకములు . 
   * మకేరుకములు . 
   * సౌసుదాములు . 
   * లేలిహములు . 
   * సశూలములు . 
     
 ఈ పురీషజ క్రిముల వలన పురీషము ఉండలు ఉండలుగా వెడలుట , శూల , మలబద్ధము , శరీరం కృశించుట , గరగరలాడుట , ఒళ్ళు తెల్లబారి ఉండటం వంటి గుణములు కలిగి ఉండును. ఇవి తమ స్థానములను వదిలి ఇతర స్థానముల యందు సంచరించునప్పుడు గగుర్పాటు , అగ్నిమాంద్యము , గుద స్థానము యందు దురద అను ఉపద్రవములు కలుగును. పాండు రోగము కూడా కలుగును. 
                
. సమాప్తము.

Tuesday, April 22, 2025

లిపిడ్ ప్రొఫైల్

**లిపిడ్ ప్రొఫైల్**  
*అద్భుతంగా వివరించబడింది*  
ఒక ప్రముఖ వైద్యుడు లిపిడ్ ప్రొఫైల్‌ను ఒక ప్రత్యేక మార్గంలో వివరించేందుకు ఒక అందమైన కథను పంచుకున్నారు.  

**మన శరీరాన్ని ఒక చిన్న పట్టణంగా ఊహించుకోండి.** ఈ పట్టణంలోని ప్రధాన ఇబ్బంది కలిగించేవారు *కొలెస్ట్రాల్*. వారికి కొన్ని సహాయకులూ ఉన్నారు. ప్రధాన సహచరుడు *ట్రైగ్లిసరైడ్*. వారి పని ఏమిటంటే, రోడ్లపై తిరుగాడి గందరగోళాన్ని సృష్టించడం, మార్గాలను అడ్డుకోవడం.  

*హృదయం* ఈ పట్టణం యొక్క సిటీ సెంటర్. అన్ని రోడ్లు హృదయానికి దారితీస్తాయి. ఇబ్బంది కలిగించేవారి సంఖ్య పెరిగినప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసు. వారు హృదయం యొక్క పనితనాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు.  

కానీ మన శరీర-పట్టణానికి ఒక పోలీస్ ఫోర్స్ కూడా ఉంది.  
*HDL* మంచి పోలీస్, ఇబ్బంది కలిగించేవారిని అరెస్ట్ చేసి జైలులో (కాలేయం) ఉంచుతాడు. కాలేయం వారిని శరీరం నుండి డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటకు తోసేస్తుంది.  

అయితే, ఒక చెడ్డ పోలీస్ కూడా ఉన్నాడు, *LDL*, అతను శక్తి కోసం ఆశించేవాడు.  
*LDL* ఇబ్బంది కలిగించేవారిని జైలు నుండి విడుదల చేసి తిరిగి రోడ్లపైకి పంపుతాడు.  

మంచి పోలీస్ *HDL* కంటే చెడ్డవారు ఎక్కువగా ఉన్నప్పుడు, పట్టణం గందరగోళంగా మారుతుంది. అలాంటి పట్టణంలో ఎవరు ఉండాలనుకుంటారు?  

*మీరు ఇబ్బంది కలిగించేవారిని తగ్గించి, మంచి పోలీసులను పెంచాలనుకుంటున్నారా?*  

**నడవడం ప్రారంభించండి!** ప్రతి అడుగుతో, మంచి పోలీసులు *HDL* పెరుగుతారు, మరియు ఇబ్బంది కలిగించేవారు *కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్, మరియు LDL* తగ్గుతారు.  

మీ పట్టణం (శరీరం) తిరిగి దీప్తిని పొందుతుంది. మీ హృదయం, సిటీ సెంటర్, ఇబ్బంది కలిగించేవారి బ్లాకేడ్‌లు (హృదయ బ్లాక్) నుండి సురక్షితంగా ఉంటుంది. మరియు మీ హృదయం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.  

*కాబట్టి, మీకు అవకాశం దొరికినప్పుడల్లా నడవడం ప్రారంభించండి!*  
*ఆరోగ్యంగా ఉండండి... మరియు*  
*మంచి ఆరోగ్యాన్ని పొందండి*  

ఇది మంచి *HDL* ను పెంచడానికి మరియు చెడ్డ *LDL* ను తగ్గించడానికి ప్రధానంగా నడక ద్వారా సాధించే ఒక మంచి వ్యాసం. *ప్రతి నడక అడుగు HDL ను పెంచుతుంది. అందువల్ల, నడవండి, నడవండి మరియు నడవండి.*  
*సుఖంగా ఉండే సీనియర్ సిటిజన్స్ వీక్*  

### **తగ్గించాల్సినవి:**  
1. ఉప్పు  
2. చక్కెర  
3. బ్లీచ్ చేసిన పిండి  
4. పాల ఉత్పత్తులు  
5. ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు  

### **కావలసిన ఆహారాలు:**  
1. కూరగాయలు  
2. పప్పులు  
3. బీన్స్  
4. గింజలు  
5. గుడ్లు  
6. కోల్డ్ ప్రెస్డ్ నూనె (ఆలివ్, కొబ్బరి, ...)  
7. పండ్లు  

### **మరచిపోయేందుకు ప్రయత్నించాల్సిన మూడు విషయాలు:**  
1. మీ వయస్సు  
2. మీ గతం  
3. మీ ఫిర్యాదులు  

### **ప్రాముఖ్యమైనవి మరియు ప్రియమైనవి:**  
1. మీ కుటుంబం  
2. మీ స్నేహితులు  
3. మీ సానుకూల ఆలోచనలు  
4. శుభ్రమైన మరియు ఆహ్లాదకరమైన ఇల్లు  

### **అవలంబించాల్సిన మూడు ప్రాథమిక విషయాలు:**  
1. ఎప్పుడూ నవ్వండి / చిరునవ్వు  
2. మీ స్వంత వేగంతో క్రమం తప్పకుండా శారీరక కార్యకలాపాలు చేయండి  
3. మీ బరువును తనిఖీ చేసి నియంత్రించండి  

### **అభ్యసించాల్సిన ఆరు ముఖ్యమైన జీవనశైలులు:**  
1. దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగడానికి వేచి ఉండకండి  
2. అలసిపోయినప్పుడు మాత్రమే విశ్రాంతి తీసుకోవడానికి వేచి ఉండకండి  
3. అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వేచి ఉండకండి  
4. అద్భుతాల కోసం దేవుడిని నమ్మడానికి వేచి ఉండకండి  
5. మీలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి  
6. సానుకూలంగా ఉండి, ఎల్లప్పుడూ మంచి రేపటి కోసం ఆశించండి  

*మీ స్నేహితులు ఈ వయస్సు పరిధిలో (47-80 సంవత్సరాలు) ఉంటే, దయచేసి వారికి ఈ సందేశాన్ని పంపండి.*
👌👏🤝💓
 ఆరోగ్యం ప్రాప్తిరస్తు

Wednesday, April 16, 2025

అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన కంపనాలను వ్యాపింప చేయండి )

వైబ్రేట్ హైయర్ 
( అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన కంపనాలను వ్యాపింప చేయండి )

 *తక్కువ వైబ్రేషన్ కలిగి ఉండటానికి కారణాలు:* 
 భయం, అనుమానం
 ఆందోళన, ఒత్తిడి, ఉద్రిక్తత.
 అసూయ, కోపం
 ద్వేషం, దురాశ
 అటాచ్మెంట్ లేదా నొప్పి

 * కాబట్టి ...... తక్కువ వైబ్రేషన్ మన రోగనిరోధక శక్తిని బలహీనపరచకుండా ఉండటానికి, అధికంగా కంపించేలా మనం అర్థం చేసుకోవాలి.
 నేడు భూమి యొక్క ఫ్రీక్వెన్సీ 27.4 హెర్ట్జ్. కానీ చాలా తక్కువ వైబ్రేట్ చేసే ప్రదేశాలు ఉన్నాయి:
 ఆస్పత్రులు
 సహాయ కేంద్రాలు.
 జైళ్లు
 భూగర్భO మొదలైనవి.
ఈ ప్రదేశాలలో కంపనం 20hz లేదా అంతకంటే తక్కువకు పడిపోతుంది.

 తక్కువ వైబ్రేషన్ ఉన్న మానవులకు, వైరస్ ప్రమాదకరంగా మారుతుంది.
 నొప్పి- 0.1 నుండి 2హెర్ట్జ్ 
 భయం- 0.2 నుండి 2.2 హెర్ట్జ్.
 చికాకు - 0.9 నుండి 6.8 హెర్ట్జ్.
 శబ్దం - 0.6 నుండి 2.2 హెర్ట్జ్.
 అహంకారం - 0.8 హెర్ట్జ్.
 ఆధిపత్యం - 1.9 హెర్ట్జ్.

 క్రింద ఇవ్వబడిన ప్రవర్తన కారణంగా అధిక కంపనం ఫ్రీక్వెన్సీ వస్తుంది : -
 ఔదార్యం - 95hz
 కృతజ్ఞత - 150 హెర్ట్జ్
 కరుణ -150 హెర్ట్జ్ లేదా అంతకంటే ఎక్కువ.
 అన్ని జీవులకు ప్రేమ మరియు కరుణ యొక్క ఫ్రీక్వెన్సీ - 150 Hz మరియు అంతకంటే ఎక్కువ. 
 *నిష్కామ ప్రేమ, విశ్వం పట్ల ప్రేమ యొక్క ఫ్రీక్వెన్సీ 205hz కంటే ఎక్కువ* 
 
* వైబ్రేట్ హయ్యర్ !!! *
 అధికంగా కంపించడానికి మాకు ఏది సహాయపడుతుంది?
 ప్రేమించడం, నవ్వడం, ఆశీర్వదించడం, ధన్యవాదాలు, ఆడటం, పెయింటింగ్, పాడటం, నృత్యం, యోగా, ధ్యానం, ఎండలో నడవడం, వ్యాయామం చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం మొదలైనవి.
  భూమి మనకు ఇచ్చే ఆహారాలు: విత్తనాలు-ధాన్యాలు-తృణధాన్యాలు-చిక్కుళ్ళు-పండ్లు మరియు కూరగాయలు-
 తాగునీరు: అధికంగా కంపించడానికి మాకు సహాయపడండి ..... !!!

 * *ప్రార్థన యొక్క కంపనం ఫ్రీక్వెన్సీ ఒక్కటే 120 నుండి 350 హెర్ట్జ్ వరకు ఉంటుంది ** 
 కాబట్టి పాడండి, నవ్వండి, ప్రేమించండి, ధ్యానం చేయండి, ఆడుకోండి, కృతజ్ఞతలు చెప్పి జీవించండి!
 _ * *అధికంగా వైబ్రేట్ చేద్దాం ... !!! * _* 
 ఈ సమాచారాన్ని నేచురోథెరపిస్ట్ డాక్టర్ హర్షల్ సాంచెటి, నాసిక్ రచన చేసి, సవరించారు.
 ఈ సమాచారం యొక్క అసలు మూలం * పవర్ Vs ఫోర్స్ * పుస్తకం నుండి
 * డేవిడ్ ఆర్ హాకిన్స్ డాక్టోరల్ థీసిస్ * ఆధారంగా.🙏🙏🙏

Tuesday, April 8, 2025

సాయంత్రం దీపం స్నానం చేసి వెలిగించాలా!!!*

*సాయంత్రం దీపం స్నానం చేసి వెలిగించాలా!!!*
 🌷🌼🌷🌼🌷🌼🌷🌼🌷

#అని చాలా మంది స్త్రీలకు కలిగే అనుమానం.

🌷🌼🌷#గృహిణికి ఉదయంపూట స్నానం మాత్రమే ధర్మం చెప్తోంది. 

🌷🌼🌷సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే ప్రారంభ సమయంలో అంటే పూర్తిగా చీకటి పడదు ఇంకా. వెలుతురుగా ఉంటుంది. ఆ సమయంలో కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కొని ముఖం కడుక్కొని మళ్ళీ బొట్టుపెట్టుకొని ఉదయం నుంచి ధరించిన వస్త్రములు విడిచి ఉతికిన వస్త్రములు #ధరించి దేవతా గృహంలోకి వెళ్ళి తైలంతో దీపారాధన చేయాలి.

 🌷🌼🌷#ఆ పిమ్మట శ్లోకములు ఏమైనా తెలిసి ఉంటే చెప్పుకోవాలి. ఇంటిల్లిపాది ఒక చోట కూర్చొని పిల్లలను కూర్చోబెట్టుకొని శ్లోకములు, పద్యములు, #దండకములు చెప్పించాలి.

🌷🌼🌷#ఇలా ఈ సమయాన్ని మనం గడిపితే అది దీపారాధన చేసినట్లు. దీపాన్ని వెలిగించడం ఒకటి. దీపాన్ని ఆరాధన చేయడం రెండు.

🌷“#దేవీం షోడశవర్షీయాం శశత్సుస్థిర యౌవనాం!
బింబోష్ఠీం సుదతీమ్ శుద్ధామ్ శరత్ పద్మ నిభాననామ్!!
శ్వేతచంపక వర్ణాభాం సునీలోత్పల లోచనామ్!
#జగద్ధాత్రిమ్ చ ధాత్రిమ్ చ సర్వేభ్య సర్వ సంపదామ్!!
#సంసార సాగరే ఘోరే జ్యోతీరూపాం సదా భజే!🌷

🌷🌼🌷#ఇది జ్యోతి కాంతులను మనం ఆరాధన చేసేసమయంలో మనం చెప్పవలసిన శ్లోకము, స్తోత్రము.

🌷🌼🌷 #కాబట్టి సాయంత్రం వేళల వెలిగించేటటువంటి దీపారాధనకు పూర్వం మళ్ళీ స్నానం చేసే అవసరం లేదు.

🌷🌼🌷#దీపారాధనకి వినియోగించే వివిధ వత్తులు- వాటి ఫలితాలు -

🌷🌼🌷#ప్రత్తివత్తుల దీపారాధన:- దైవభక్తి వృద్ది అగును. పితృదేవతాదోషాలు తొలగును. 

🌷🌼🌷#అరటినార వత్తుల దీపారాధన:- కుటుంబశాంతి, మంచి సంతానం, కులదైవం అనుగ్రహం కలుగుతుంది. -

🌷🌼🌷#తామరతూడు వత్తుల దీపారాధన: - ఋణబాధలు తొలగి, లక్ష్మీకటాక్షం కలుగుతుంది. సిరిసంపదలు కలిగి శ్రేయెస్సు కలుగుతుంది. -

🌷🌼🌷#జిల్లేడు వత్తుల దీపారాధన :- విఘ్ణేశ్వరుని అనుగ్రహం లభించి. దుష్టశక్తుల పీడ నివారణ మౌతుంది. సిరిసంపదలతో తులతూగుతారు. -

🌷🌼🌷#పసుపు నీటితో తడిపిన క్రొత్త బట్టవత్తుల #దీపారాధన: -                 
 అమ్మ కటాక్షం, జఠర, ఉదరసంబంధ వ్యాధుల నివారణ కలుగుతుంది. కామెర్లు త్వరగా తగ్గు ముఖం పడుతుంది. -

🌷🌼🌷#కుంకుమ నీటితో తడిపిన క్రొత్త బట్టవత్తులు దీపారాధన :- దైవానుగ్రహం కల్గి వివాహ ఆలస్యసమస్యలు, వైవాహిక సమస్యలు, సంతానలేమి సమస్యలు ప్రయోగించబడిన మాంత్రిక శక్తులు తొలగిపోతాయి. మంచి సంతానం కల్గుతుంది. -

🌷🌼🌷#పన్నీరు అద్దిన వత్తులను నేతితో దీపారాధన-: లక్ష్మీదేవి అనుగ్రహం సిరిసంపదలు కీర్తి ప్రతిష్టలు కల్గుతాయి.
🌷🌼🌷🌼🌷🌼🌷🌼🌷

ధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీ కృష్ణుడు .....🙏🏼🙏🙏🏻

ధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీ కృష్ణుడు .....🙏🏼🙏🙏🏻

మనస్సుని కేంద్రీకరించటానికి ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనాలో, సోమరితనంగా అయిపోయి, నిద్దురలోనికి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ప్రారంభంలో ప్రాపంచిక మనస్సు కి, ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం, భగవత్ ధ్యానం లో రాదు. దీనితో, భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి, భోజనం చేస్తూ చేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు, కానీ మీకు ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించటంలో మధ్యలో నిద్దురలోనికి జారుకోనే వారు కనిపిస్తారు. ఇది కాకుండా ఉండటానికి, శ్రీ కృష్ణుడు నిటారుగా కూర్చోనమంటున్నాడు.

ధ్యానంలో కూర్చునే భంగిమని (posture) గురించి బ్రహ్మ సూత్రాలు కూడా 3 సూత్రాలను పేర్కొంటున్నాయి:

ఆసీనః సంభవాత్ (4.1.7) “సాధనా చేయటానికి, సరియైన విధానంలో కూర్చోండి”

అచలత్వం చాపేక్ష్య (4.1.9) “నిశ్చలంగా, నిటారుగా కూర్చోండి”

ధ్యానాచ్చ (4.1.8) “ఈ విధంగా కూర్చొని, మనస్సుని ధ్యానంలో కేంద్రీకరించండి”

హఠ యోగ ప్రదీపిక లో చాలా రకాల ధ్యాన ఆసనాలు వివరించబడ్డాయి, పద్మాసనం, అర్ధ పద్మాసనం, ధ్యానవీర్ ఆసనం, సిద్దాసనం మరియు సుఖాసనం వంటివి. మనకు సౌకర్యంగా ఉండే ఏదైనా ఆసనాన్ని మనం ఎంచుకోవచ్చు. మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నాడు:

“స్థిర సుఖమాసనం” (పతంజలి యోగ సూత్రములు 2.46)

“ధ్యాన అభ్యాసం చేయటానికి మీకు అనువుగా ఉండే ఎదో ఒక భంగిమలో నిశ్చలంగా కూర్చొనుము.” కొందరు మోకాలు నొప్పుల వలన నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహ పడనవసరం లేదు, ఎందుకంటే వారు కుర్చీలో కూర్చొని అయినా ధ్యానం చేయవచ్చు, కానీ తప్పకుండా నిటారుగా మరియు నిశ్చలంగా కూర్చోవాలి అన్న నియమాన్ని పాటించాలి.

ధ్యానం అనేది :

🔸 చంచలమైన మనస్సుని నియంత్రించి, క్లిష్టమైన లక్ష్యాలను సాధించటానికి ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది.
🔸 అది, ప్రతికూల పరిస్థితులలో కూడా మానసిక సమతుల్యతను కాపాడుకోవటానికి దోహదపడుతుంది.
🔸 అది జీవితంలో విజయం కోసం కావలసిన దృఢ సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది.
🔸 చెడు సంస్కారాలను మరియు అలవాట్లను నిర్మూలించటానికి, మంచి గుణాలనుధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీ కృష్ణుడు, మనస్సుని కేంద్రీకరించటానికి ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనాలో, సోమరితనంగా అయిపోయి, నిద్దురలోనికి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ప్రారంభంలో ప్రాపంచిక మనస్సు కి, ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం, భగవత్ ధ్యానం లో రాదు. దీనితో, భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి, భోజనం చేస్తూ చేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు, కానీ మీకు ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించటంలో మధ్యలో నిద్దురలోనికి జారుకోనే వారు కనిపిస్తారు. ఇది కాకుండా ఉండటానికి, శ్రీ కృష్ణుడు నిటారుగా కూర్చోనమంటున్నాడు.

ధ్యానంలో కూర్చునే భంగిమని (posture) గురించి బ్రహ్మ సూత్రాలు కూడా 3 సూత్రాలను పేర్కొంటున్నాయి:

ఆసీనః సంభవాత్ (4.1.7) “సాధనా చేయటానికి, సరియైన విధానంలో కూర్చోండి”

అచలత్వం చాపేక్ష్య (4.1.9) “నిశ్చలంగా, నిటారుగా కూర్చోండి”

ధ్యానాచ్చ (4.1.8) “ఈ విధంగా కూర్చొని, మనస్సుని ధ్యానంలో కేంద్రీకరించండి”

హఠ యోగ ప్రదీపిక లో చాలా రకాల ధ్యాన ఆసనాలు వివరించబడ్డాయి, పద్మాసనం, అర్ధ పద్మాసనం, ధ్యానవీర్ ఆసనం, సిద్దాసనం మరియు సుఖాసనం వంటివి. మనకు సౌకర్యంగా ఉండే ఏదైనా ఆసనాన్ని మనం ఎంచుకోవచ్చు. మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నాడు:

“స్థిర సుఖమాసనం” (పతంజలి యోగ సూత్రములు 2.46)

“ధ్యాన అభ్యాసం చేయటానికి మీకు అనువుగా ఉండే ఎదో ఒక భంగిమలో నిశ్చలంగా కూర్చొనుము.” కొందరు మోకాలు నొప్పుల వలన నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహ పడనవసరం లేదు, ఎందుకంటే వారు కుర్చీలో కూర్చొని అయినా ధ్యానం చేయవచ్చు, కానీ తప్పకుండా నిటారుగా మరియు నిశ్చలంగా కూర్చోవాలి అన్న నియమాన్ని పాటించాలి.

ధ్యానం అనేది :

🔸 చంచలమైన మనస్సుని నియంత్రించి, క్లిష్టమైన లక్ష్యాలను సాధించటానికి ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది.
🔸 అది, ప్రతికూల పరిస్థితులలో కూడా మానసిక సమతుల్యతను కాపాడుకోవటానికి దోహదపడుతుంది.
🔸 అది జీవితంలో విజయం కోసం కావలసిన దృఢ సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది.
🔸 చెడు సంస్కారాలను మరియు అలవాట్లను నిర్మూలించటానికి, మంచి గుణాలనుధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీ కృష్ణుడు, మనస్సుని కేంద్రీకరించటానికి ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనాలో, సోమరితనంగా అయిపోయి, నిద్దురలోనికి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ప్రారంభంలో ప్రాపంచిక మనస్సు కి, ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం, భగవత్ ధ్యానం లో రాదు. దీనితో, భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి, భోజనం చేస్తూ చేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు, కానీ మీకు ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించటంలో మధ్యలో నిద్దురలోనికి జారుకోనే వారు కనిపిస్తారు. ఇది కాకుండా ఉండటానికి, శ్రీ కృష్ణుడు నిటారుగా కూర్చోనమంటున్నాడు.

ధ్యానంలో కూర్చునే భంగిమని (posture) గురించి బ్రహ్మ సూత్రాలు కూడా 3 సూత్రాలను పేర్కొంటున్నాయి:

ఆసీనః సంభవాత్ (4.1.7) “సాధనా చేయటానికి, సరియైన విధానంలో కూర్చోండి”

అచలత్వం చాపేక్ష్య (4.1.9) “నిశ్చలంగా, నిటారుగా కూర్చోండి”

ధ్యానాచ్చ (4.1.8) “ఈ విధంగా కూర్చొని, మనస్సుని ధ్యానంలో కేంద్రీకరించండి”

హఠ యోగ ప్రదీపిక లో చాలా రకాల ధ్యాన ఆసనాలు వివరించబడ్డాయి, పద్మాసనం, అర్ధ పద్మాసనం, ధ్యానవీర్ ఆసనం, సిద్దాసనం మరియు సుఖాసనం వంటివి. మనకు సౌకర్యంగా ఉండే ఏదైనా ఆసనాన్ని మనం ఎంచుకోవచ్చు. మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నాడు:

“స్థిర సుఖమాసనం” (పతంజలి యోగ సూత్రములు 2.46)

“ధ్యాన అభ్యాసం చేయటానికి మీకు అనువుగా ఉండే ఎదో ఒక భంగిమలో నిశ్చలంగా కూర్చొనుము.” కొందరు మోకాలు నొప్పుల వలన నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహ పడనవసరం లేదు, ఎందుకంటే వారు కుర్చీలో కూర్చొని అయినా ధ్యానం చేయవచ్చు, కానీ తప్పకుండా నిటారుగా మరియు నిశ్చలంగా కూర్చోవాలి అన్న నియమాన్ని పాటించాలి.

ధ్యానం అనేది :

🔸 చంచలమైన మనస్సుని నియంత్రించి, క్లిష్టమైన లక్ష్యాలను సాధించటానికి ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది.
🔸 అది, ప్రతికూల పరిస్థితులలో కూడా మానసిక సమతుల్యతను కాపాడుకోవటానికి దోహదపడుతుంది.
🔸 అది జీవితంలో విజయం కోసం కావలసిన దృఢ సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది.
🔸 చెడు సంస్కారాలను మరియు అలవాట్లను నిర్మూలించటానికి, మంచి గుణాలను పెంపొందిచుకోవటానికి దోహదపడుతుంది

     🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 పెంపొందిచుకోవటానికి దోహదపడుతుంది

     🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 పెంపొందిచుకోవటానికి దోహదపడుతుంది

     🚩🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🚩

Sunday, April 6, 2025

గుడిలో చేసే ప్రార్ధన

*🌹గుడిలో చేసే ప్రార్ధన 🌹*
*🍃🌾గుడి మండపంలో_*
*కొంతసేపు కూర్చుని ఒకచిన్నప్రార్ధన*
*‌మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు ‌దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు* 
*వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ_ అది ఏమిటంటే*..!

*🍁🌾"అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం*
*దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం 🙏

*🌺🌾మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ* *రెండు చేతులను*
*జోడించి కళ్ళు తెరిచి *ప్రశాంతమైన మనసుతో*
*దర్శనం చేసుకోండి*

*🍁🌾దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక_*
*గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని* *అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు* *తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి*

*" 🌺🌾అనాయాసేన మరణం "*
*నాకు నొప్పి లేక బాధ కానీ లేనిమరణాన్ని ప్రసాదించు*

*"🍁🌾 వినా ధైన్యేన జీవనం "*
*నాకు ఎవరి మీదా* *ఆధారపడకుండా*,
*నేను జీవితంలో ఎవరి* *ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు*

*" 🌺🌾దేహాంతే తవ సాన్నిధ్యం* "
*మృత్యువు నావద్దకు* *వచ్చినప్పుడు నేను*
*నిన్ను దర్శించుకునే విధంగా దీవించు*

*"🍇దేహిమే పరమేశ్వరం"*

*🌺🌾ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను*

*1. 🍁అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ *ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన * *మార్గంలోకి తీసుకు వెళ్ళు*

*2. 🍁ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ* ....
*నా బిడ్డలకు కానీ ...సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు* *కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు*
*ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.*

*3. 🍁 నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా*
*ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు*.

*🌺🌾ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన* *విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో* *అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే* *ప్రసాదిస్తాడని మరువకండి*.

*🌺🌾దీనినే దర్పణ దర్శన పప్రక్రియ* 
*ఏమనస్సనే దర్పణం లో దర్శించి*, 
*ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశాన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ* 🙏

కలువలకు కమలాలకు తేడా ఏమిటి?*

*కలువలకు కమలాలకు తేడా ఏమిటి?*

కలువ పువ్వు తామర పువ్వు

"కలువ కు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం" అయితే చాల మంది కలువకూ-కమలానికి తేడా లేదను కుంటారు. ఏది నిజం. కవిగారు ప్రాస కోసం వర్ణించారా? కాదు కాదు. కలువ పువ్వు రాత్రి వికసిస్తుంది. కమలము పగలు వికసిస్తుంది. కలువలకు చంద్రుడు, కమలానికి (పద్మానికి) సూర్యుడు భౌతికంగా ఎంతో దూరం. అయినా వాటి మధ్య ఉన్న అనుబంధం గొప్పది. ఎందువలన అంటే, ఆ పుష్పాలు సూర్య చంద్రుల స్నేహ కిరణాలు సోకి విరిసి మురిసిపోతాయి. కమలం, పద్మం, తామర పువ్వు ఒకటే. కలువలు నీటిలో పుడతాయి. కమలాలు బురదలో పుడతాయి. అయితే సుమతీ శతకం లో బద్దెన కవి "కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్" అని అన్నాడు. కమలానికి సూర్యుడు ఎంత మిత్రుడైనా వాటిని నీటిలోంచి బయటకు తీస్తే సూర్య రశ్మిని తాళలేక వాడి పోతుంది. అలాగే 'తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులె శత్రులగుట తథ్యము" అన్నది కూడా ముమ్మాటికీ నిజం. 'కుముదము' లేదా 'కువలయము' అంటే తెల్ల కలువ; ఏనుగు అని కూడా ఇంకొక అర్థం. కలువను ఉత్పలము అని కూడా అంటారు. నీలోత్పలము అంటే ముదురు నల్ల కలువ లేదా నీలి రంగు కలువ.

       పంకం (బురద) లో పుడుతుంది కనుక కమలాన్ని 'పంకజ' అంటారు. బురదలో పుట్టినా పద్మానికి ఆ బురద అంటదు. స్వచ్చంగా ఉంటుంది. అందుకే కమలం మన జాతీయ కుసుమం అయ్యింది. కమలం మరియు తామర పువ్వు ఒకటే. భగవద్గీత లో "తామరాకు మీద నీటి బొట్టులా" ఉండగలిగే వానిని స్థిత ప్రజ్ఞుడు అని శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునకు ఉపదేశించాడు.  

      మన పురాణములలో ఎన్నో పుష్పాల వర్ణన వుంది. అలాగే పుష్పాలతో పురాణ పురుషులను వర్ణిస్తారు. ఉదాహరణకు పద్మం తో లక్ష్మీ దేవికి, విష్ణువుకు సంబంధం వుంది. పద్మం లో పుట్టినది కనుక లక్ష్మిని 'పద్మజ' అంటాం. 'జ' అంటే పుట్టినది అని అర్ధం. పద్మం బొడ్డులో పుట్టిన వాడు పద్మనాభుడు (విష్ణువు) లేదా పంకజ నాభుడు. నీటికి ఉన్న పర్యాయ పదాలు నీరు, జలము, వారి తద్వారా ఇందులో పుట్టిన పద్మాన్ని వరుసక్రమం లో నీరజ, జలజ, వారిజ అని అనవచ్చు. సరసు లో పుడితే సరసిజ. వారిజవైరికులేశ = వారిజ (కమలం) - వైరి (శత్రువు); వారిజ వైరి = కమలానికి శత్రువు (సూర్యుడు); వారిజవైరి కులం = సూర్య వంశం; వారిజ వైరి కులేశ = సూర్య వంశ ప్రభువు; శ్రీ రాముడు సూర్య వంశస్థుడు

భక్తి అంటే ఏమిటి?

*భక్తి అంటే ఏమిటి?*
               
*భక్తి అంటే ఏమిటి? అందులోని రకాలెన్ని?*

*భక్తి అనేది ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. భక్తి అనేక రకాలుగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహం పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. అసలు భక్తి ఎన్ని రకాలు, ఎటువంటి భక్తిని కలిగి ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇక్కడ తెలుసుకుందాం…*
 
*1. శ్రవణ భక్తి :*
*సత్‌పురుషుల వాక్యాలు, సత్‌గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీని వల్ల మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తిని ఆశ్రయించి మోక్షాన్ని పొందాడు.*
 
*2. కీర్తనా భక్తి :*

*భగవంతుని గొప్ప లక్షణాలను కీర్తించడమే కీర్తనా భక్తి. భగవంతుని సాక్షాత్కారం కోసం కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో మోక్షం పొందారు.*
 
*3. స్మరణ భక్తి :*
*భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించడమే స్మరణ భక్తి. ఇందులో నామ స్మరణం, రూప స్మరణం, స్వరూప స్మరణం అని మూడు రకాలు ఉన్నాయి. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.*

*4. పాదసేవన భక్తి :*
*భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించిన భక్తులకు భగవంతుని పవిత్రసేవ చేసుకున్న ఫలితం వస్తుంది. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.*

*5. అర్చన భక్తి :*
*ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చన రూపంలో దేవుని పూజించడమే అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్టించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.*
 
*6. వందన భక్తి :*
*వందనం అంటే నమస్కరించడం. తనయందు మనస్సు నిలిపి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోదించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు.*
 
*7. దాస్య భక్తి :*
*ప్రతి మనిషి తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తిని ఆశ్రయించి ముక్తిని పొందారు.*
 
*8. సఖ్య భక్తి :*
*సఖ్యం అనగా స్నేహం. భగవంతునితో సఖ్యత ఏర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.*
 
*9. ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి :*
*ఆత్మనివేదనమనగా భగవంతుడు తప్ప ఇంకెవరూలేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తి పొందారు.*

Tuesday, April 1, 2025

సప్త వ్యసనాలు అంటే ఏమిటి?*

*🚩సప్త వ్యసనాలు అంటే ఏమిటి?*

*ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు.*
*ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు. ముఖ్యంగా దుర్వ్యసనాలు ఏడు అంటారు."* 

*అవేమిటంటే:-*

*1.పరస్త్రీ వ్యామోహం – ఏ కాలంలోనైనా మనిషిని అధఃపాతాళానికి తొక్కేసే వ్యసనం ఇది. ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్నవాళ్ళల్లో పూర్వ కాలంలో రావణాసురుడు ముఖ్య ఉదాహరణ. సీతాదేవిని అపహరించి, ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవటమేగాక తన కుటుంబాన్నీ, వంశాన్నీ, అయినవారినీ, చివరికి రాజ్యాన్నికూడా కోల్పోయాడు.

*2.జూదం .. ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. (ఆంతటి గొప్పవాడే ఆ రోజుల్లో అన్ని అవస్తలు తాను పడటమే కాకుండా, తన తమ్ములూ, భార్యా కూడా అవస్తలు పడటానికి కారకుడయ్యాడే, మరి ఈ రోజుల్లో ఈ పేకాట వగైరా వ్యసనాలబారినపడి ఎన్ని కుటుంబాలు ఎన్ని అవస్తలు పడుతున్నాయో).

*3.మద్యపానం – పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను వెంటనే బ్రతికించేవాడు. అలాంటివాడు మద్యపాన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు. (పురాతన కధలు అందరికీ వివరంగా తెలియక పోయినా కచుడి చితాభస్మం తాగటం వివరాలు నేనూ ఇప్పుడు తెలుసుకోవాలి) నేటి సమాజంలో మద్యపాన మహిమ అందరికీ తెలిసినదే.

*4. వేట -- పూర్వం దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి శ్రవణకుమారుడిని చంపుతాడు. ఆయనకి తెలియక చేసిన పాపమయినా శ్రవణుడి వృధ్ధ తల్లిదండ్రుల శాపానికి గురయి తన కుమారుడు శ్రీ రామచంద్రుడికి దూరమయి రాముణ్ణే కలవరిస్తూ మరణిస్తాడు. (ఇదివరకంటే కృర మృగాల (kroora - inscript లో ఎలా టైప్ చెయ్యాలో రాలేదు నాకు) బారినుండి ప్రజలను కాపాడటానికి రాజులు వేటాడేవారు. ఈ రోజుల్లో మాత్రం ఇది , స్ధితి పరులకు వ్యసనమే. దానితో పట్టుబడ్డవారెన్ని కేసులెదుర్కుంటున్నారో పేపర్లల్లో చూస్తున్నాంగా).

*5. కఠినంగా, పరుషంగా మాట్లాడటం -- దుర్యోధనుడు దీనికి మంచి ఉదాహరణ. పాండవులను దుర్భాషలాడి ఏ స్దితి తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. (పూర్వకాలంలో కఠినంగా మాట్లాడేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టేవాళ్ళు...ఇప్పుడు అలా మాట్లాడనివాళ్ళని....)

*6.కఠినంగా దండించటం -- దీనికికూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు. వారికి ఆహారం కూడా అతి తక్కువ ఇచ్చి నానా ఇబ్బందులూ పెడతాడు. వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో వున్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు.
ఈ రోజుల్లోకూడా ఏ కారణంవల్లనైతేనేమి తల్లిదండ్రులు పిల్లల్ని దండించటం, టీచర్లు పిల్లల్ని కఠినంగా దండించటం ఎక్కువైంది. (ఎవరిమీదైనా ఏమైనా కక్షవుంటే దాన్ని తీర్చుకోవటానికి అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు).

*7.ఆఖరిది డబ్బు. కొందరికి డబ్బు వృధాగా ఖర్చుచెయ్యటం అలవాటు. బాగా డబ్బున్నా, క్రమ శిక్షణా, సరైన ఆలోచన లేకపోవటంవల్ల అవసరముందా లేదా అని కూడా ఆలోచించకుండా డబ్బు దుర్వినియోగం చేస్తారు. మహాలక్ష్మిని ప్రయోజనకరమైనవాటికి కాకుండా దుర్వ్యసనాలకు వినియోగిస్తే దుర్గతే లభిస్తుంది అపజయమే తప్ప జయం వుండదు. అందుకే ధనాన్ని సద్వినియోగం చెయ్యాలి.

*👌మంచీ చెడూ తెలుసుకుని మనుగడ సాగించటమే మనిషి జన్మకి సార్ధకత.*

మధుమేహం రావడానికి గల కారణాలు - పాటించవలసిన ఆహార నియమాలు - ఔషదాలు.

మధుమేహం రావడానికి గల కారణాలు - పాటించవలసిన ఆహార నియమాలు - ఔషదాలు.

       మధుమేహము కలిగినటువంటి మనుష్యుని యొక్క మూత్రం తేనె వలే తియ్యటి మరియు చిక్కటి మూత్రం వెలువరించును. ఈ మధుమేహము రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది శరీరం నందలి రస,రక్త ధాతువులు కొన్ని కారణాలచే క్షీణించడం వలన వాతం ప్రకోపించడం వలన కలుగునది. రెండోవది శరీరం నందు వాతం సంచరించు మార్గములలో కొన్ని దోషములు అడ్డగించునపుడు వాతం ప్రకోపం చెంది కలుగునది . మొదటి రకమైన ధాతు క్షయముచే వచ్చు మధుమేహము తగ్గుట అసాధ్యము. జీవితాంతం ఔషధాలు వాడుతూ ఉండవలెను.

   మధుమేహ రోగులు తీసుకోవలసిన ఆహార పదార్థాలు -

   పాతబియ్యం , పాత గోధుమలు, రాగిమాల్ట్, మేకమాంసం , మజ్జిగ, కందిపప్పు కట్టు, పెసర కట్టు, పాత చింతపండు, ఉసిరికాయ, వెలగపండు, తోటకూర, పాలకూర, మెంతికూర , కొయ్యతోటకూర, పొన్నగంటికూర, లేత మునగ కూర, లేత బీరకాయ, లేత సొరకాయ, లేత పొట్లకాయ, లేత బెండ , లేత క్యాబేజి, లేత టమాటో లేతవి మాత్రమే తీసుకోవాలి . బూడిద గుమ్మడి , కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి .జొన్నరొట్టె చాలా మంచిది.

  తీసుకోకూడని ఆహారపదార్థాలు -

       తేలికగా అరగని ఆహారం నిషిద్దం, చేపలు , రొయ్యలు తినరాదు. మద్యపానం , ధూమపానం నిషిద్దం , పెరుగు వాడరాదు , ఇంగువ, వెల్లుల్లి వాడకూడదు, నువ్వులు , నువ్వుల నూనె , ఆవాలు, ఆవనూనె వాడరాదు. ఎర్రగుమ్మడి తీసుకోరాదు, శనగపిండి తినరాదు, నూనెతో వేపిన పదార్థాలు వాడరాదు, కొబ్బరి ముట్టుకోకూడదు, పనస, ద్రాక్ష, కమలా పండ్లు నిషిద్దం, దుంపకూరలు పూర్తిగా మానివేయాలి, భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు, బెల్లము , కొత్త చింతపండు వాడరాదు .

 మధుమేహంలో ఉపయోగపడు ఔషధాలు -

 * పొడపత్రి ఆకు రసాన్ని రోజుకి పావుకప్పు తాగుతుంటే ఈ వ్యాధి తగ్గును.

 * ఇండుప గింజ సగం వరకు అరగదీసి ఆ గంధాన్ని ప్రతినిత్యం నీటిలో కలిపి తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.

 * నేరేడు గింజల చూర్ణం పావు చెంచా ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ నీటితో కలిపి సేవించుచున్న మధుమేహం నియంత్రణ అగును.

 * మధుమేహం అతిగా ఉన్నవారు పూటకి ఒక లవంగ మొగ్గ చప్పరిస్తూ ఉన్న మధుమేహం నియంత్రణ అగును.

 * ప్రతినిత్యం ఒక కప్పు ఉలవలు ఉడకపెట్టిన నీటిని తీసుకొనవలెను .

 * త్రిఫల చూర్ణమునకు మధుమేహం తగ్గించే గుణము కలదు. కాకపోతే బయట దొరికే త్రిఫల చూర్ణం లో కరక్కాయ, తానికాయ, ఉశిరికాయ సమపాళ్లలో ఉంటాయి . అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే మోతాదులో తయారుచేసుకొని రోజు రాత్రిపూట అరచెంచా చూర్ణం అరకప్పు నీటిలో వేసుకొని రాత్రిపూట పడుకునేప్పుడు తాగవలెను . కరక్కాయ పెచ్చులు చూర్ణం ఒక భాగము , తానికాయ చూర్ణం రెండు భాగాలు , ఉశిరికాయ చూర్ణం మూడు భాగాలు కలిపి ఒకే చూర్ణంగా రూపొందించుకొని రాత్రిపూట వాడుచున్న మధుమేహం త్వరగా నియంత్రణకు వస్తుంది.

 * తంగేడు పువ్వుల కషాయం ఉదయం , సాయంత్రం సేవించుచున్న మధుమేహము తగ్గును.

 * రోజూ అరటిపువ్వుని ఉడకబెట్టి అల్పహారంగా తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.

 * మర్రిచెట్టు బెరడు చూర్ణం అరచెంచా కాని లేక బెరడు కషాయం పావుకప్పు కాని ప్రతినిత్యం సేవించుచున్న మధుమేహం నిశ్చయంగా తగ్గును.

 * ఉసిరికాయల కషాయం కాని లేక ఉసిరిగింజల కషాయం రోజుకి అరకప్పు తాగుచున్న మధుమేహం తగ్గును.

 * లేత మామిడి ఆకులు ఎండించి చూర్ణం చేసి రోజుకి అరచెంచా తీసుకున్నచో మధుమేహం తగ్గును.

  నా అనుభవ యోగాలు -

 * మధుమేహం 300 వరకు ఉంటే మూడు మారేడు దళాలు అనగా 9 లేత ఆకులు ఉదయాన్నే పరగడుపున , సాయంత్రం ఆహారానికి గంట ముందు తినుచున్న కేవలం 15 నుంచి 20 రోజుల్లో 170 నుంచి 190 వరకు వచ్చును. ఆ తరువాత రెండు మారేడు దళాలు చొప్పున ఉదయం , రాత్రిపూట పైన చెప్పిన సమయాల్లో తీసికొనవలెను. త్వరలోనే సాధారణ స్థితికి వస్తారు.

 * పొడపత్రి చూర్ణం ఒక స్పూన్ , నేరేడు గింజల చూర్ణం ఒక స్పూన్ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో నానబెట్టి రాత్రి సమయంలో ఆహారానికి గంట ముందు సేవించవలెను . అదేవిధముగా రాత్రిపూట పైనచెప్పిన మోతాదులో గ్లాసు గోరువెచ్చటి నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున సేవించవలెను .

        పైన చెప్పినవన్నీ నేను కొంతమంది వ్యాధిగ్రస్తుల చేత వాడించాను . చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఒకేసారి అల్లోపతి ఔషధాలు ఆపి ఇవి వాడవద్దు. ఇవి వాడుతూ అల్లోపతి ఔషదాల మోతాదు తగ్గించుకుంటూ చివరకి పూర్తిగా ఆపివేయవచ్చు . 

         ఈ ఔషధాలు వాడు సమయంలో టీ , కాఫీ , మద్యం , మాంసాహారం ముట్టుకోరాదు. త్వరగా గుణం కనిపించును.

     
        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .

Monday, March 31, 2025

ప్రాచీన భారతీయ వేదాలలో వివరించిన ధనుర్విద్య గురించి సంపూర్ణ వివరణ - 1

ప్రాచీన భారతీయ వేదాలలో వివరించిన ధనుర్విద్య గురించి సంపూర్ణ వివరణ - 1

        మన ప్రాచీన యుద్ధవిద్యలలో ధనుర్విద్యకు ప్రముఖస్థానం కలదు. ఈ విద్యకు సంబంధించిన చాలా గ్రంథాలు మరియు తాళపత్రాలు బ్రిటిష్ వారు మనదేశము నుండి తరలించుకొనిపోయి బ్రిటిషు మ్యూజియం నందు ఉంచటం జరిగిందని "మేడం బ్లావేట్స్కి " రచించిన " THE SECRET DOCTRINE " అనే గ్రంథము నందు వివరించారు . ఇలాంటి కారణాల వలన ఈ ధనుర్విద్య గురించిన విజ్ఞానం మరుగునపడిపోయింది. ఇలా మరుగునపడిపోయిన ధనుర్విద్య గురించి కొంతవరకైనా మీకు తెలియాలి అనే సదుద్దేశముతో నేను చదివిన కొన్ని ప్రాచీన గ్రంథాలలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలియచేయుటకు ఈ పోస్ట్ పెడుతున్నాను . 

          ఇప్పుడు మనకి లభ్యం అవుతున్న గ్రంథాలలో ఈశాన సంహిత శస్త్రాలు మరియు అస్త్రాలు గురించి తెలియచేస్తుంది . ఈ ధనుర్వేదమును ఉపదేశించిన వాడు మహర్షి విశ్వమిత్రుడు . ఈశాన సంహిత యందు ధనుర్విద్య గురించి 20 ,000 శ్లోకాల రూపంలో శివుడు పార్వతికి సంగ్రహముగా వివరించాడు. దీనిలో నాలుగు విభాగాలుగా అస్త్రములు తెలుపబడినవి. అస్త్రమును తయారుచేయు ధాతువులు , ద్రవ్యములు , ఈ అస్త్రమును తయారుచేయువాడికి ఉండు లక్షణములు . అస్త్రములను తయారుచేసే విధానములు ఇందులో తెలుపబడినవి .  

              ఈశాన సంహిత యందు ఉమామహేశ్వర సంవాదం అను భాగములో వివిధ అస్త్రములును ప్రయోగించు పద్దతులు , ఒక్కో అస్త్రప్రయోగానికి కావలిసిన అస్త్ర మంత్రములు , ఆ మంత్రములను జపించే విధానం , దానికి సంబంధించిన మంత్రశాస్త్రం కూడా సంగ్రహముగా తెలుపబడినది .  

. పరశురాముడు రచించిన " శాండిల్యభాష్యం " లో దీక్షాపాదము , సంగ్రహ , సిద్ధిపాదాలు అని అధ్యాయాల రూపంలో అనేక విశేషాలు కలవు. ఇది కేరళ రాష్ట్రంలో తాళపత్రాల రూపంలో కలదు. అంతే కాకుండా పంజాబులోని ప్రాచీన తాళపత్రాల పట్టికలో ఈ ధనుర్వేదాన్ని తెలిపే గ్రంథాల వివరాలు ఇంకొన్ని ఇవ్వబడ్డాయి. అందులో " శివ ధనుర్వేదం " , మనుసార్ణ , చతుష్టష్టికళ సంగ్రహం , యమళాష్టకం మాత్రమే కాక వైశాలాక్షం అనే పేరుతో 10,000 శ్లోకములు కల్గిన గ్రంథము కూడా తెలుపబడింది. ఇవే కాకుండా మరికొన్ని గ్రంథాల పేర్లు కూడా తెలియచేస్తాను . 

     * వశిష్ట సంహిత . 

     * సారంగధరుని విరచింతామణి . 

     * కోదండ మండనము . 

     * హరిహర చతురాంగం . 

     * రాజ - విజయం . 

     * భోజుని ధనుస్సంహిత .  

          పైన చెప్పినవే కాకుండా విశ్వమిత్ర సంహితము , లోహార్ణవము , లోహరత్నాకరము , సోవనేశ్వరుని " అభిలాషితార్ధ చింతామణి " , బసవేశ్వరుని " శివతత్వ రత్నాకరం " వంటి గ్రంథముల యందు కూడా ధనుర్విద్యకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి. వరాహమిహిరాచార్యుడు వ్రాసిన బృహత్సంహిత అన్న విజ్ఞానసర్వస్వము లో కూడా అస్త్రములు తయారుచేసే పద్దతి , రకరకాల కత్తులు శూలాలు , వివిధ ఆయుధాలు తయారుచేసే పద్దతి వర్ణించాడు. 

              ధనుర్వేదము నందు రథములు , ఏనుగులు , కాల్బలములు నడిపించే పద్దతి , సైన్యమును నిలబెట్టే వ్యూహరచన వర్ణించబడినవి. వేదవ్యాస మహర్షి మహాభారతములో భీష్మద్రోణ పర్వాలలో ముఖ్యముగా చక్రవ్యూహము , క్రౌంచవ్యూహము వంటి అనేక సైనిక విన్యాసాలు వర్ణించాడు . పైన చెప్పిన గ్రంధములే కాకుండా ఇంకా ఎన్నో విలువైన గ్రంథములు విదేశాలకు తరలిపోయాయి . మరికొన్ని తాటిఆకులపై రాసి ఉండి సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వలన కాలగర్భములో కలిసిపోయాయి. బ్రిటిషు లైబ్రరీ నందు ఆగ్నేయాస్త్రము గురించి తెలియచేసే ఒక ప్రాచీన వ్రాతపతిని చూసినట్లు "మేడం బ్లావట్స్కి " తన గ్రంధములో రాశారు . 

            అదేవిధముగా ధనుర్వేదము గురించి తెలియచేసే ఇతర గ్రంధములలో ద్రోణాచార్యుడు రచించిన ధనుశ్శాస్త్రము , బసవేంద్రుడి శివతత్వ రత్నాకరం లొని ప్రకరణము , ధనుర్వేద సంహిత , రేవంత్తోత్తరము , భోజరాజీయము , అశ్వలక్ష్మణ సారము మొదలయిన ప్రాచీన గ్రంధములే కాక కొన్ని మహాపురాణాలలో కూడా ఈ ధనుర్విద్య గురించి వివరించబడినది. వాల్మీకి రామాయణములో బాలకాండలో అస్త్రవిద్య వివరాలు తెలుపబడినవి . 

        ధనుర్విద్యకు పదకొండు ఏకాదశ ఉపవిద్యలు ఉండును. అవి 

  * విలువిద్య .
 
  * అస్త్రవిద్య . 

  * మల్ల శాస్త్రం ( కుస్తీ లేక బాక్సింగ్ ) . 

  * అశ్వ శాస్త్రం . 

  * గజ శాస్త్రం . 

  * ఖడ్గ ధారణము . 

  * వ్యూహ శాస్త్రం ( సేనలను నిలబెట్టు వ్యూహాలు )

  * సేనా శాస్త్రం ( ఆర్మీ ట్రైనింగ్ ) . 

  * రధ - శిక్షణ శాస్త్రం . 

  * వాహనారోహణము .  

         పైన చెప్పిన 11 రకాల విద్యలు ధనుర్విద్యకు ఉపవిద్యలుగా పరిగణించబడుతున్నాయి. 

           

Sunday, March 30, 2025

లిపిడ్ ప్రొఫైల్**

**లిపిడ్ ప్రొఫైల్**  
*అద్భుతంగా వివరించబడింది*  
ఒక ప్రముఖ వైద్యుడు లిపిడ్ ప్రొఫైల్‌ను ఒక ప్రత్యేక మార్గంలో వివరించేందుకు ఒక అందమైన కథను పంచుకున్నారు.  

**మన శరీరాన్ని ఒక చిన్న పట్టణంగా ఊహించుకోండి.** ఈ పట్టణంలోని ప్రధాన ఇబ్బంది కలిగించేవారు *కొలెస్ట్రాల్*. వారికి కొన్ని సహాయకులూ ఉన్నారు. ప్రధాన సహచరుడు *ట్రైగ్లిసరైడ్*. వారి పని ఏమిటంటే, రోడ్లపై తిరుగాడి గందరగోళాన్ని సృష్టించడం, మార్గాలను అడ్డుకోవడం.  

*హృదయం* ఈ పట్టణం యొక్క సిటీ సెంటర్. అన్ని రోడ్లు హృదయానికి దారితీస్తాయి. ఇబ్బంది కలిగించేవారి సంఖ్య పెరిగినప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసు. వారు హృదయం యొక్క పనితనాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు.  

కానీ మన శరీర-పట్టణానికి ఒక పోలీస్ ఫోర్స్ కూడా ఉంది.  
*HDL* మంచి పోలీస్, ఇబ్బంది కలిగించేవారిని అరెస్ట్ చేసి జైలులో (కాలేయం) ఉంచుతాడు. కాలేయం వారిని శరీరం నుండి డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటకు తోసేస్తుంది.  

అయితే, ఒక చెడ్డ పోలీస్ కూడా ఉన్నాడు, *LDL*, అతను శక్తి కోసం ఆశించేవాడు.  
*LDL* ఇబ్బంది కలిగించేవారిని జైలు నుండి విడుదల చేసి తిరిగి రోడ్లపైకి పంపుతాడు.  

మంచి పోలీస్ *HDL* కంటే చెడ్డవారు ఎక్కువగా ఉన్నప్పుడు, పట్టణం గందరగోళంగా మారుతుంది. అలాంటి పట్టణంలో ఎవరు ఉండాలనుకుంటారు?  

*మీరు ఇబ్బంది కలిగించేవారిని తగ్గించి, మంచి పోలీసులను పెంచాలనుకుంటున్నారా?*  

**నడవడం ప్రారంభించండి!** ప్రతి అడుగుతో, మంచి పోలీసులు *HDL* పెరుగుతారు, మరియు ఇబ్బంది కలిగించేవారు *కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్, మరియు LDL* తగ్గుతారు.  

మీ పట్టణం (శరీరం) తిరిగి దీప్తిని పొందుతుంది. మీ హృదయం, సిటీ సెంటర్, ఇబ్బంది కలిగించేవారి బ్లాకేడ్‌లు (హృదయ బ్లాక్) నుండి సురక్షితంగా ఉంటుంది. మరియు మీ హృదయం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.  

*కాబట్టి, మీకు అవకాశం దొరికినప్పుడల్లా నడవడం ప్రారంభించండి!*  
*ఆరోగ్యంగా ఉండండి... మరియు*  
*మంచి ఆరోగ్యాన్ని పొందండి*  

ఇది మంచి *HDL* ను పెంచడానికి మరియు చెడ్డ *LDL* ను తగ్గించడానికి ప్రధానంగా నడక ద్వారా సాధించే ఒక మంచి వ్యాసం. *ప్రతి నడక అడుగు HDL ను పెంచుతుంది. అందువల్ల, నడవండి, నడవండి మరియు నడవండి.*  
*సుఖంగా ఉండే సీనియర్ సిటిజన్స్ వీక్*  

### **తగ్గించాల్సినవి:**  
1. ఉప్పు  
2. చక్కెర  
3. బ్లీచ్ చేసిన పిండి  
4. పాల ఉత్పత్తులు  
5. ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు  

### **కావలసిన ఆహారాలు:**  
1. కూరగాయలు  
2. పప్పులు  
3. బీన్స్  
4. గింజలు  
5. గుడ్లు  
6. కోల్డ్ ప్రెస్డ్ నూనె (ఆలివ్, కొబ్బరి, ...)  
7. పండ్లు  

### **మరచిపోయేందుకు ప్రయత్నించాల్సిన మూడు విషయాలు:**  
1. మీ వయస్సు  
2. మీ గతం  
3. మీ ఫిర్యాదులు  

### **ప్రాముఖ్యమైనవి మరియు ప్రియమైనవి:**  
1. మీ కుటుంబం  
2. మీ స్నేహితులు  
3. మీ సానుకూల ఆలోచనలు  
4. శుభ్రమైన మరియు ఆహ్లాదకరమైన ఇల్లు  

### **అవలంబించాల్సిన మూడు ప్రాథమిక విషయాలు:**  
1. ఎప్పుడూ నవ్వండి / చిరునవ్వు  
2. మీ స్వంత వేగంతో క్రమం తప్పకుండా శారీరక కార్యకలాపాలు చేయండి  
3. మీ బరువును తనిఖీ చేసి నియంత్రించండి  

### **అభ్యసించాల్సిన ఆరు ముఖ్యమైన జీవనశైలులు:**  
1. దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగడానికి వేచి ఉండకండి  
2. అలసిపోయినప్పుడు మాత్రమే విశ్రాంతి తీసుకోవడానికి వేచి ఉండకండి  
3. అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వేచి ఉండకండి  
4. అద్భుతాల కోసం దేవుడిని నమ్మడానికి వేచి ఉండకండి  
5. మీలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి  
6. సానుకూలంగా ఉండి, ఎల్లప్పుడూ మంచి రేపటి కోసం ఆశించండి  

*మీ స్నేహితులు ఈ వయస్సు పరిధిలో (47-90 సంవత్సరాలు) ఉంటే, దయచేసి వారికి ఈ సందేశాన్ని పంపండి.*

Thursday, March 27, 2025

ఆహర విరుద్ధాలు -

ఆహర విరుద్ధాలు -

 మనం భుజించే ఆహరం వరసగా 

 1.రసం .

 2.రక్తం .
 
 3.మాంసం .

 4.మేధస్సు (కొవ్వు ) .

 5. ఎముక .

 6. మజ్జా .

 7. వీర్యము. (ఆర్థవము ).

అనే 7 ధాతువులు గా రూపాంతరం చెందుతుంది. ఆహారం మనిషి నిత్య నూతనం గా శక్తివంతం గా ఉండేవిధంగా తోడ్పడుతుంది. ఇదే రెండు విరుద్ధ భావాలు గల ఆహారం తీసుకున్నప్పుడు అవి విషతుల్యం అయ్యి తీవ్రమయిన అనారోగ్యాన్ని కలిగించవచ్చు .ఒక్కోసారి విషమై మనిషి మరణానికి కారణం కావొచ్చు.

 * చేపలు తిన్న వెంటనే పాలు , పెరుగు తాగరాదు.ఎందుకంటే చలువ చేసే స్వభావం గల పాలు , వేడి చేసే స్వభావం గల చేపలు కలిపి తినడం వలన పరస్పర విరుద్ద స్వభావాలు గల ఆహారాల వలన రక్తం లొ దొషం ఏర్పడి చర్మ వ్యాధులు కలగజేస్తుంది.

 * మాంసం తేనే గానీ , నువ్వులుగాని బెల్లం గానీ , పాలు గానీ , మినుములు గానీ , ముల్లంగి గానీ , మొలకెత్తిన ధాన్యాలు గానీ కలిపి వాడ కూడదు . ఒకవేళ పొరపాటున గానీ , గ్రహపాటున గానీ తింటే ఆ వ్యక్తికీ చెముడు, దృష్టి మాంద్యము, వణుకు, మొదలయిన వ్యాధులు కాలక్రమేణ రావడం జరుగుతుంది.

 * ఆవ నూనే లొ వేయించిన పావురం మాంసం గానీ , తేనే , నెయ్యి సమంగా కలిపి ఎట్టి పరిస్థితులో భుజింప గూడదు . ఈ విరుద్ద ఆహరం వలన రక్తము చెడి ధమనుల యందు గ్రంధులు ఏర్పడతాయి. అపస్మారము , కణతలు యందు పోటు సంభవిస్తుంది.

 * వెల్లుల్లి, మునగ, తులసి మొదలయిన పదార్దాలు తినిన వెంటనే పాలు తాగకూడదు. అలా తాగితే కుష్టు వ్యాధి సంభవిస్తుంది.

 * నిమ్మ పండును తేనే , నెయ్యి కలిపి గానీ మినపపప్పు బెల్లం నెయ్యి లొ కలిపి గానీ ఉపయోగించ కూడదు . అలా ఉపయోగించడం వలన నపుసకత్వం ఏర్పడుతుంది .

 * మామిడి , దానిమ్మ,, నిమ్మ , అరటి, పుల్ల దబ్బకాయ , రేగిపండ్లు, నేరేడు, వెలగ, చింతపండు , అక్రోటు, పనస, కొబ్బరి కాయ , ఉసిరి ఇటువంటి యే పుల్లటి పదార్ధం అయినా పచ్చిగా ఉన్నప్పుడు గానీ , ఎండిన పిమ్మట గానీ పాలతో కలిపి ఉపయొగించ కూడదు .

 * పెసలు మినుములు , అనుములు, ఉలవలు, కొర్రలు, వరిగలు.ఈ పదార్ధాలను కుడా పాలతో కలిపి భుజించకుడదు .అలా భుజిస్తే శరీరం లొ వాతము విపరీతం గా ప్రకోపించి వాత వ్యాదులుని కలిగిస్తుంది.

 * బచ్చలి కూరలో నువ్వుల పిండి కలిపి తింటె వెంటనే అతిసార వ్యాది కలుగుతుంది.

 * కొంగ మాంసం , పంది మాంసం కలిపితింటే తిన్న వెంటనే ప్రాణాంతక విషం అవుతుంది.

 * ఉష్ణ శరీర స్వభావం కలవారు తమ శరీరం లొ ఉష్ణం అదికం గా ఉన్నప్పుడు తేనెను వేడి చేసి గాని వేడి వస్తువులతో కానీ తింటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లతుంది.

 * తేనే , నెయ్యి సమాన భాగాలుగా కలిపి ఎప్పుడు భుజించకుడదు . తెనే లొ సగబాగం నెయ్యి కానీ , నెయ్యి లొ సగబాగం తేనే కానీ కలిపి మాత్రమే తీసుకొవాలి . లేకపొతే రెండు అమృతాలు కలిసి " "అమృతం అమృతేన విషం " అన్నట్లుగా విరుద్దమై ప్రాణాలు తీస్తాయి.

 * తేనే ను కొంచం గోరువెచ్చని నీటితో తప్ప భాగా వేడిగా ఉన్న నీటితో కలిపి సేవిస్తే అది విష తుల్యం అవుతుంది.

       ఈ విధంగా మనం తినే ఆహర పదార్దాలలోనే , ఒక దానితో ఒకటి పడని పదార్దాలు చాలా ఉన్నాయి వాటిని మన మహర్షులు పరిశోధించి విరుద్ద గుణాలు గల ఆహార పదార్దాలు వాడవద్దు అని తమ తమ గ్రంథాలలో విపులం గా పేర్కొన్నారు. 


Wednesday, March 26, 2025

హరిఃఓం

హరిఃఓం .🌹

*అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం! సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం!!!* 

🕉పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు.

💧 *తీర్ధం* యొక్క విశిష్టత ప్రత్యేకంగా ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం. 

దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్ధంలో 
💦 *పంచామృతాలు* , 
☘ *తులసి దళాలు* , 
🥃 *సుగంధ ద్రవ్యాలు* ,

📿 *మంత్ర శక్తులు* ఉంటాయి. దీంతో ఆ తీర్ధం అత్యంత పవిత్రంగా మారుతుంది. తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి.

👌 *మొదటిసారి* తీర్ధం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. ( *అకాల మృత్యు హరణం* )

👌 *రెండవసారి* తీర్ధం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ( *సర్వవ్యాధి నివారణం!* )

👌 *మూడవది* పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి.( *సమస్త పాపక్షయకరం* )

📚 *పురాణాల** ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి.
మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. *కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం ముద్ర* వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. అలా చేయకూడదు. తల పైన బ్రహ్మ రంద్రం *సహస్రార చక్ర*ఋ ఉంటుంది. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము. కనుక కళ్లకద్దుకోవడం మంచిది.

హరిఃఓం🙏🙏

సేకరణ .

ఆలోచనలు

*ఆలోచనలు*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*'ఆలోచనల రూపమే మనం'* అంటాడు *బుద్ధుడు•* 

 మనసులో అమంగళ కరమైన ఆలోచనా తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే, ముఖంలో అవే వికృత భావాలు ప్రస్ఫుటంగా ప్రకటితం అవుతుంటాయి. 

 *ముఖం - మనసుకు ప్రతీక* అంటారు పెద్దలు• ప్రశాంతమైన మోము కలిగినవారి మనసు *'తేటనీటి కొలను'•* 

 ఆలోచనలు - వికసించిన పువ్వు చుట్టూరా తిరిగే *భ్రమరం* లా శుభాల చుట్టూ పరిభ్రమిస్తాయి. అశుభం వైపు పోకుండా మనసును సున్నితంగా పట్టి ఉంచుతాయి.

 మన సంప్రదాయంలో *దీవెన* కు విశేష స్థానం ఉంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధాప్య దశ దాకా వివిధ సందర్భాల్లో పెద్దల ఆశీర్వాదాలు పొందుతూనే ఉంటారు. 

 *మంగళాశాసనం* అంటే మనసా వాచా ఒకరి భావబలం మనల్ని వెన్నంటి ఉండటం. ఆశీర్వాదబలం వెన్నుదన్నుగా ఉంటే విద్యార్థి నుంచి కార్యార్థి వరకు... అందరికీ అన్నింటా సఫలమే!

 పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు, *'అన్నీ తామే, అంతా తామే'* అన్నట్లుగా... కాస్త బెడిసి కొడితే... *'తమ చేతిలో ఏదీ లేదన్నట్లుగా'* మాట్లాడుతుంటారు కొందరు. 

 ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా శ్రేయోతత్త్వాన్ని విడిచిపెట్టనివారు - *విజయకాంక్ష* ఉన్నవారు. ఓటమికి వెరవనిది, కుంగిపోనిదీ వారే!

 *చదవడం* అంటే అందరికీ *పుస్తకమే* గుర్తుకు వస్తుంది. 

 ఒక లక్ష్యం ఏర్పరచుకుని, అనుక్షణం శ్రేయోభిలాషతో - ఎవరు తనతో కలిసివచ్చినా, రాకపోయినా దృఢంగా అడుగులేసుకుంటూ గమ్యం వైపు సాగిపోయేవారు మనకు ఎక్కడో అక్కడ అరుదుగా తారసపడతారు. వారిని శ్రద్ధగా చదివి ఆకళింపు చేసుకుంటే, మన మనసులో *'పుట్టినందుకు ఏదైనా సాధించాలి'* అనే తపనకు బీజం పడుతుంది. మన నిత్య కృషితో అది, ఏదో నాటికి మహావృక్షం అవుతుంది. మన కీర్తిని అజరామరం చేస్తుంది.

 మన ప్రమేయం లేకుండా చెయ్యి కదలదు, కాలు నడవదు. మరి *ఆలోచనలు మాత్రం కట్టు తెగిన కోడెల్లా, కట్ట తెగిన వరద నీటిలా ఇచ్ఛారీతిన ప్రవహిస్తే ఎలా?* వాటికి కళ్లెం వేయాలి. మన ఆలోచనలు మనకు ఉపయోగపడాలి. చెరుపు చేయకూడదు. 

 *శరీరం మీద కాకుండా మనసుపై పెట్టే శ్రద్ధ మేలు చేస్తుంది. మనుషులను ఋషులుగా మాధవులుగా చేస్తుంది.*

 *హృదయం నవనీతం అయితే, నోటి నుంచి కర్ణపేయంగా వెలువడే మాటలు నలుగురికీ దగ్గరయ్యేలా చేస్తాయి.*

 *కీడెంచి మేలెంచమని* మన పూర్వులు చెప్పింది, జీవితంలో ఏమరుపాటును వదిలి అప్రమత్తంగా ఉండమని హెచ్చరించడానికి. అంతేకాని - ఆ భావాన్నే అంటి పెట్టుకుని, నిత్యం శంకలతో కాలం గడుపుతూ, జీవితాన్ని వృథా చేసుకొమ్మని కాదు. 

 శ్రేయోదాయక ఆలోచనలు మనసును స్వచ్ఛమైన వేదికగా మారుస్తాయి. దానిపై కొలువుదీరడానికి అంతర్యామి ఉవ్విళ్లూరతాడన్నది సత్యం. 

 ఆధ్యాత్మికంగా ఉత్తమ ఆలోచనలకు ఉన్న గొప్ప శక్తి అది. ముముక్షువులు భగవదవతారంగా గుర్తింపు పొందడానికి అదే కారణం.
             🙏సమస్త లోకాః సుఖినోభవంతు🙏

                              🌼శుభమస్తు🌺

తెలుగు సంవత్సరాల పేర్లు...* *వాటి అర్థాలు*

*తెలుగు సంవత్సరాల పేర్లు...* *వాటి అర్థాలు*
                  
1. ప్రభవ అంటే...ప్రభవించునది. 
    అంటే... పుట్టుక.

2. విభవ - వైభవంగా ఉండేది.

3. శుక్ల... అంటే తెల్లనిది.  
    నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు 
    ప్రతీక.

4. ప్రమోదూత.... ఆనందం. 
    ప్రమోదభరితంగా ఉండేది 
    ప్రమోదూత.

5. ప్రజోత్పత్తి... ప్రజ అంటే 
    సంతానం. సంతాన వృద్ధి 
    కలిగినది ప్రజోత్పత్తి.

6. అంగీరస... అంగీరసం అంటే 
    శరీర అంగాల్లోని ప్రాణశక్తి, 
    ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ 
    దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది 
    అని అర్థం.

7. శ్రీముఖ... శుభమైన ముఖం. 
    ముఖం ప్రధానాంశం కాబట్టి 
    అంతా శుభంగా ఉండేదని 
    అర్ధం.

8. భావ.... భావ అంటే భావ 
    రూపుడిగా ఉన్న నారాయణుడు. 
    ఈయనే భావ నారాయణుడు. 
    ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి 
    ముందు సంకల్పం చేసే బ్రహ్మ 
    అని పండితులు వివరిస్తున్నారు.

9. యువ.... యువ అనేది 
    బలానికి ప్రతీక.

10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే 
    ధరించేవాడు, రక్షించేవాడు.

11. ఈశ్వర... పరమేశ్వరుడు.

12. బహుధాన్య... సుభిక్షంగా 
    ఉండటం.

13. ప్రమాది... ప్రమాదమున్నవాడు 
    అని అర్థమున్నప్పటికీ    
    సంవత్సరమంతా ప్రమాదాలు 
    జరుగుతాయని భయపడనవసరం 
    లేదు.

14. విక్రమ..విక్రమం కలిగిన వాడు.

15. వృష ... చర్మం.

16. చిత్రభాను... భానుడంటే 
    సూర్యుడు. సూర్యుడి ప్రధాన  
    లక్షణం ప్రకాశించటం. చిత్రమైన 
    ప్రకాశమంటే మంచి గుర్తింపు 
    పొందడమని అర్థం.

17. స్వభాను... స్వయం ప్రకాశానికి 
    గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని 
    అర్థం.

18. తారణ... తరింపచేయడం 
    అంటే దాటించడం. కష్టాలు 
    దాటించడం, గట్టెక్కించడం అని 
    అర్థం.

19. పార్థివ..పృధ్వీ సంబంధమైనది, 
    గుర్రం అనే అర్థాలున్నాయి. 
    భూమికున్నంత సహనం, 
    పనిచేసేవాడని అర్థం.

20. వ్యయ... ఖర్చు కావటం. ఈ 
    ఖర్చు శుభాల కోసం ఖర్చై
    ఉంటుందని ఈ సంవత్సరం 
    అర్థం.

21. సర్వజిత్తు.. సర్వాన్ని జయించినది.

22. సర్వధారి -. సర్వాన్ని ధరించేది.

23.విరోధి..విరోధం కలిగినటువంటిది.

24. వికృతి...వికృతమైనటువంటిది.

25. ఖర.... గాడిద, కాకి, ఒక 
    రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన 
    పోక అనే అర్థాలున్నాయి.

26. నందన ... కూతురు, 
    ఉద్యానవనం, ఆనందాన్ని 
    కలుగజేసేది.

27. విజయ... విశేషమైన జయం 
    కలిగినది.

28. జయ... జయాన్ని కలిగించేది. 

29. మన్మథ..మనస్సును మధించేది.

30. దుర్ముఖి...చెడ్డ ముఖం కలది.

31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.

32. విలంబి... సాగదీయడం.

33. వికారి.... వికారం కలిగినది.

34. శార్వరి... రాత్రి.

35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... 
    దాటించునది అని అర్థం.

36. శుభకృత్..శుభాన్ని చేసి పెట్టేది.

37. శోభకృత్... శోభను కలిగించేది.

38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.

39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.

40. పరాభవ ... అవమానం.

41. ప్లవంగ... కోతి, కప్ప.

42. కీలక.... పశువులను 
    కట్టేందుకు ఉపయోగించే కొయ్య.

43. సౌమ్య... మృదుత్వం.

44. సాధారణ... సామాన్యం.

45. విరోధికృత్... విరోధాలను 
    కలిగించేది.

46. పరీధావి... భయకారకం.

47. ప్రమాదీచ... ప్రమాద కారకం.

48. ఆనంద... ఆనందమయం.

49. రాక్షస...రాక్షసత్వాన్ని కలిగినది.

50. నల.... నల్ల అనే పదానికి 
    రూపాంతరం.

51. పింగళ.. ఒక నాడి, కోతి, 
    పాము, ముంగిస.

52. కాలయుక్తి... కాలానికి తగిన     
    యుక్తి.

53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.

54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.

55. దుర్మతి... దుష్ట బుద్ధి.

56. దుందుభి ... వరుణుడు.

57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.

58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.

59. క్రోదన... కోప స్వభావం కలది.

60. అక్షయ... నశించనిది.`


.

వడదెబ్బ - నివారణా యోగాలు .

వడదెబ్బ - నివారణా యోగాలు .

 * ఉల్లిపాయరసం ని వంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అవుతుంది.

 * వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయను టోపిలో గాని , రుమాలులో గాని నడినెత్తిన ఉండునట్లు కట్టి నడిచిన వడదెబ్బ తగలదు. జేబులో నైనా ఉంచుకోవచ్చు.

 * నీరుల్లిపాయ రసం రెండు కనతలకు , గుండెకి పూసిన వడ దెబ్బవలన కలిగిన బాధ హరించును. 

 * వడదెబ్బ తగిలిన ముఖము పైన , శరీరం పైన నీళ్లు చల్లుతూ , తలపైన మంచు గడ్డలను వుంచి త్రాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.

 * కుమ్మున ఉడికించిన మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనం నందు త్రాగుచుండిన వడదెబ్బ తగలదు.

 * విశ్రాంతిగా పడుకోపెట్టి కాఫీ తాగుటకు ఇచ్చిన వడదెబ్బ నుండి తట్టుకొందురు.

 * నాలుగు తులాల చల్లటి నీటిలో ఒక తులం తేనెని వేసి కలిపి ఇచ్చిన వడదెబ్బ నివారించును.

 * వడగండ్లు పడినప్పుడు ఏరి విబూతిలో వేసి దాచి వడదెబ్బ తగిలినపుడు వారికి మూడువేల్లకు వచ్చినంత మంచినీటిలో వేసి ఇచ్చిన ఎండదెబ్బ నివారణ అగును.

 * నువ్వులనూనేలో చనుబాలు రంగరించి చెవులలో వేసి కొంచం వెచ్చటి నీళ్లలో నెయ్యివేసి ఇచ్చిన వడదెబ్బ బాధలు తగ్గును . 

 * తరవాణి తేటలో ఉప్పుని చేర్చి ఇవ్వవలెను.

 * తాటి ముంజలు పంచదారతో ఇవ్వవలెను. 

 * నాలుకకు పాత ఉసిరి పచ్చడి రాసి , పుల్లని ఆవు మజ్జిగలో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసం ని త్రాగించ వలెను.

 * చన్నీటితో స్నానం చేయవలెను . 

 * వేడివేడి పల్చని గంజిలొ ఉప్పు వేసి త్రాగవలెను.

 * నిమ్మ ఉప్పుని నోటిలో వేసుకోనిన నాలుకకు ఉట ఊరి వడదెబ్బ నివృత్తి అగును.

         తగు జగ్రత్తలు తీసుకుని వడదెబ్బ నుంచి తప్పించుకోగలరు. ప్రమాదవశాత్తు వడదెబ్బ తగిలితే పైన చెప్పిన నివారణా ఉపాయాలు ఉపయొగించుకొని బయటపడగలరు. 

 

Monday, March 24, 2025

యోగాసనాలు & వాటి ప్రయోజనాలు ✨

26 యోగాసనాలు & వాటి ప్రయోజనాలు ✨

పి.ఆర్.కే రెడ్డి గారు "మీ ఆరోగ్యం మీ చేతుల్లో" గ్రూపులో 26 యోగాసనాల ఫొటోలు, మువ్మెంట్స్ వివరంగా చూపించారు. ఆయన్ను మనమందరం అభినందిద్దాం.
ఇప్పుడు ప్రతీ యోగాసనాన్ని మూడు లైన్లలో వివరించాను. మీ ఆరోగ్య ప్రయోజనాల కోసం వాటిని పాటించండి.

---

1. తాడాసనం (Mountain Pose) 🏔️

ఇది శరీరాన్ని సరైన భంగిమలో ఉంచుతుంది.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

మెదడు ప్రశాంతంగా ఉంటుంది.

---

2. వృక్షాసనం (Tree Pose) 🌳

సమతుల్యత పెరిగి, కాళ్ల బలం పెరుగుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది.

మానసిక ఏకాగ్రత పెంచుతుంది.

---

3. అధో ముఖ శ్వానాసనం (Downward Dog) 🐕

వీపునొప్పిని తగ్గిస్తుంది.

శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా చేస్తుంది.

మెదడు దెబ్బతినకుండా రక్షిస్తుంది.

---

4. భుజంగాసనం (Cobra Pose) 🐍

వెన్నునొప్పికి ఉపశమనం ఇస్తుంది.

గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది.

---

5. ధనురాసనం (Bow Pose) 🎯

కడుపులో కొవ్వు తగ్గుతుంది.

వెన్నుపూస బలంగా మారుతుంది.

జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.

---

6. శలభాసనం (Locust Pose) 🦗

వెన్ను, నడుము నొప్పి తగ్గుతుంది.

కడుపు మాసిల్స్ బలపడతాయి.

జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.

---

7. నవకాసనం (Boat Pose) 🚣‍♂️

పొట్ట చుట్టూ కొవ్వు కరిగిస్తుంది.

కండరాలను బలోపేతం చేస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.

---

8. పశ్చిమోత్తాసనం (Seated Forward Bend) 🧘‍♂️

వెన్నునొప్పి తగ్గుతుంది.

మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతత లభిస్తుంది.

జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

---

9. ఉత్తానాసనం (Standing Forward Bend) 🙇‍♂️

నరాల బలహీనత తగ్గుతుంది.

మెదడుకు శక్తి అందుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది.

---

10. మత్స్యాసనం (Fish Pose) 🐟

థైరాయిడ్ సమస్యలకు మంచిది.

శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మానసిక ప్రశాంతత కలిగిస్తుంది.

---

11. హలాసనం (Plow Pose) 🌾

వెన్నుముక దృఢంగా మారుతుంది.

జీర్ణక్రియ మెరుగవుతుంది.

ఒత్తిడి తగ్గుతుంది.

---

12. సర్వాంగాసనం (Shoulder Stand) 🔄

రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

థైరాయిడ్ ఆరోగ్యానికి మంచిది.

మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

---

13. అర్ధమత్స్యేంద్రాసనం (Half Spinal Twist) 🔄

వెన్నునొప్పి తగ్గుతుంది.

జీర్ణక్రియ మెరుగవుతుంది.

మానసిక స్థిరత పెరుగుతుంది.

---

14. వజ్రాసనం (Thunderbolt Pose) ⚡

భోజనం తర్వాత చేయడానికి ఉత్తమమైన ఆసనం.

గ్యాస్, అజీర్తి సమస్యలు తగ్గుతాయి.

మోకాళ్ల బలహీనత తగ్గుతుంది.

---

15. గోముఖాసనం (Cow Face Pose) 🐄

భుజాల నొప్పి తగ్గుతుంది.

శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

నడుము నొప్పిని తగ్గిస్తుంది.

---

16. కపోతాసనం (Pigeon Pose) 🕊️

నడుము నొప్పి తగ్గుతుంది.

నరాల వాపు తగ్గుతుంది.

మానసిక ప్రశాంతత కలుగుతుంది.

---

17. మండూకాసనం (Frog Pose) 🐸

జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది.

---

18. ఉష్ట్రాసనం (Camel Pose) 🐫

వెన్నునొప్పి తగ్గుతుంది.

ఛాతీ, ఊపిరితిత్తులు శక్తివంతమవుతాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

---

19. సింహగర్జనాసనం (Lion Pose) 🦁

గొంతు సమస్యలకు మంచి పరిష్కారం.

థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ముక్కు, గొంతు, కళ్ల ఆరోగ్యానికి మంచిది.

---

20. మయూరాసనం (Peacock Pose) 🦚

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

శరీర బలాన్ని పెంచుతుంది.

చెడు కొవ్వును కరిగిస్తుంది.

---

21. తిట్టిబాసనం (Firefly Pose) 🦟

భుజాల బలం పెరుగుతుంది.

కండరాలను బలోపేతం చేస్తుంది.

శరీరాన్ని లైట్‌గా ఉంచుతుంది.

---

22. అష్టావక్రాసనం (Eight-Angle Pose) 🔄

శరీరాన్ని నడిపించే నరాలను బలపరుస్తుంది.

మానసిక ఏకాగ్రత పెరుగుతుంది.

భుజాల, చేతుల బలం పెరుగుతుంది.

---

23. అర్ధచంద్రాసనం (Half Moon Pose) 🌙

సమతుల్యత పెరుగుతుంది.

వెన్నుముక దృఢంగా మారుతుంది.

ఒత్తిడి తగ్గుతుంది.

---

24. సుప్త వజ్రాసనం (Sleeping Thunderbolt) 😴

మోకాళ్ల నొప్పిని తగ్గిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

మానసిక ప్రశాంతత కలిగిస్తుంది.

---

25. సిద్ధాసనం (Perfect Pose) 🙏

ధ్యానం, ప్రాణాయామానికి ఉత్తమమైనది.

నరాల బలం పెరుగుతుంది.

మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

---

26. శవాసనం (Corpse Pose) ⚰️

పూర్తిగా రిలాక్స్ అయ్యే ఆసనం.

ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.

మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది.

---



🙏🏻👍

Thursday, March 20, 2025

వేసవి పండ్లు

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి డీహైడ్రేషన్ ను నివారించడానికి అధిక నీటి శాతం ఉండే పండ్లు చాలా ముఖ్యమైనవి. అయితే వేసవిలో తప్పక తినాల్సిన కొన్ని పండ్లు ఏంటో తెలుసుకుందాం..

(1).పుచ్చకాయ లో అధికంగా నీరు ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇందులో విటమిన్ C పుష్కలంగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

(2).కీరదోసకాయ లో పోషకాలతో పాటు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడానికి డీహైడ్రేషన్ ను నివారించడానికి సహాయపడుతుంది

(3).కర్బుజ లోను ఎక్కువ నీటి శాతం ఉంటుంది, ఇది వేసవిలో హైడ్రేషన్ ను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

(4).ద్రాక్ష లో విటమిన్లు, మినరల్స్ లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడానికి వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

(5).బొప్పాయి లో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

వేసవి కాలం పండ్లు (మార్చి-మే):

 వేసవి కాలం పండ్లు (మార్చి-మే):

(1).మామిడి పండ్లు : 

"పండ్ల రాజు", ఒక ప్రసిద్ధ మరియు ప్రసిద్ధ వేసవి పండు.

(2).పుచ్చకాయలు : 

వేడి వాతావరణానికి అనువైన, తాజాదనం మరియు జ్యుసిగల పండు.

(3).బొప్పాయిలు : 

విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

(4).ద్రాక్ష :
 
వేసవి చివరిలో రుచికరమైన పండ్లు.

(5).జ్యుసి ప్లమ్స్ :
 
 తీయని పండ్లు .

(6).చెర్రీస్ : 

ఒక చిన్న, తీపి మరియు జ్యుసి పండు.

(7).నేరేడు పండ్లు : 

సూర్య రక్షణకు సహజ మూలం.

(8).పియర్ :
 
అనేక రకాలతో కూడిన జాక్-ఆఫ్-ఆల్-ట్రేడ్ పండు. 
 
[21/03, 08:38] Pcg Mgmt Ashok Acupressure: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి డీహైడ్రేషన్ ను నివారించడానికి అధిక నీటి శాతం ఉండే పండ్లు చాలా ముఖ్యమైనవి. అయితే వేసవిలో తప్పక తినాల్సిన కొన్ని పండ్లు ఏంటో తెలుసుకుందాం..

(1).పుచ్చకాయ లో అధికంగా నీరు ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇందులో విటమిన్ C పుష్కలంగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

(2).కీరదోసకాయ లో పోషకాలతో పాటు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడానికి డీహైడ్రేషన్ ను నివారించడానికి సహాయపడుతుంది

(3).కర్బుజ లోను ఎక్కువ నీటి శాతం ఉంటుంది, ఇది వేసవిలో హైడ్రేషన్ ను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

(4).ద్రాక్ష లో విటమిన్లు, మినరల్స్ లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడానికి వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

(5).బొప్పాయి లో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

సృష్టి రహస్య విశేషాలు*

*సృష్టి రహస్య విశేషాలు*

1 సృష్టి ఎలా ఏర్పడ్డది?
2 సృష్టి కాల చక్రము ఎలా నడుస్తుంది?
3 మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి?

(సృష్టి) ఆవిర్బావము.
1. ముందు పరాపరము దీనియందు శివము పుట్టినది
2 శివమునందు శక్తి
3 శక్తి యందు నాదము 
4 నాదమునందు బిందువు
5 బిందువునందు సదాశివుఁడు
6 సదాశివుని యందు మహేశ్వరుఁడు
7 మహేశ్వరుని యందు ఈశ్వరుఁడు
8 ఈశ్వరుని యందు రుద్రుఁడు
9 రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11 బ్రహ్మ యందు ఆత్మ
12 ఆత్మ యందు దహరాకాశము
13 దహరాకాశమునందు వాయువు
14 వాయువునందు అగ్ని
15 ఆగ్ని యందు జలము 
16 జలమునందు పృథ్వీ. 
17. పృథ్వీ యందు ఓషధులు
18. ఓషధుల వలన అన్నము 
19. ఈ అన్నము వల్ల...... నర , మృగ , పశు , పక్షి ,వృక్ష , స్థావర జంగమాదులు పుట్టినవి.
( సృష్టి ) కాల చక్రము.
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఎంతో మంది శివులు  
ఎంతోమంది విష్ణువులు  
ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు 
ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.
ఇప్పుడు నడుస్తుంది 51వ బ్రహ్మ.
1 కృతాయుగము
2 త్రేతాయుగము
3 ద్వాపరయుగము
4 కలియుగము
నాలుగు యుగాలకు 1 మహాయుగము.
71 మహాయుగాలకు 1మన్వంతరము.
14 మన్వంతరాలకు ఒక సృష్టి (ఒక కల్పము)
15 సంధులకు ఒక ప్రళయము (ఒక కల్పము)
1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  
1000 యుగాలకు ఒక రాత్రి (ప్రళయము)
2000 యుగాలకు ఒక దినము.
ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహాయుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరాలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరాలు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువు కాలములో ఉన్నాము. 
శ్వేతవరాహ యుగంలో ఉన్నాము
5 గురు భాగాన కాలంకు 60 సం
1 గురు భాగాన కాలానికి 12 సం
1 సంవత్సరానికి 6 ఋతువులు.
1 సంవత్సరానికి 3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం. 2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిథులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారానికి 7 రోజులు
పంచాంగంలో 
1 తిధి. 
2 వారము.  
3 నక్షత్రము.  
4 కరణము.  
5 యోగము.
సృష్టి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.
దేవతలు జీవులు చెట్లలో అన్ని వర్గాలలో మూడే గుణములు ఉంటాయి.
1 సత్వ గుణము 
2 రజో గుణము 
3 తమో గుణము 
( పంచ భూతాలు ఆవిర్భావము)
1 ఆత్మ యందు ఆకాశము 
2 ఆకాశము నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలము 
5 జలము నుండి భూమి అవిర్భవించాయి.
5 జ్ఞానేంద్రియాలు
5 పంచ ప్రాణాలు
5 పంచ తన్మాత్రలు
5 ఆంతర ఇంద్రియాలు
5 కర్మేంద్రియాలు = 25 తత్వంలు
(ఆకాశ పంచీకరణాలు)
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల (జ్ఞానము)
ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల (బుద్ధి)
ఆకాశం - జలంతో కలవడంవల్ల (చిత్తము)
ఆకాశం - భూమితో కలవడంవల్ల (అహంకారము) పుడుతుతున్నాయి
(వాయువు పంచీకరణాలు)
వాయువు - వాయువుతో కలవడం వల్ల (వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల (సమాన)
వాయువు - అగ్నితో కలవడంవల్ల (ఉదాన)
వాయువు - జలంతో కలవడం వల్ల (ప్రాణ)
వాయువు - భూమితో కలవడంవల్ల (అపాన) వాయువులు పుడుతున్నాయి.
(అగ్ని పంచీకరణాలు)
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల (శ్రోత్రం)
అగ్ని - వాయువుతో కలవడంవల్ల (వాక్కు)
అగ్ని - అగ్నిలో కలవడంతో (చక్షువు)
అగ్ని - జలంతో కలవడంతో (జిహ్వ)
అగ్ని - భూమితో కలవడంతో ( ఘ్రాణము) పుట్టెను.
(జలము పంచీకరణాలు)
జలం - ఆకాశంలో కలవడంవల్ల (శబ్దము)
జలము - వాయువుతో కలవడంవల్ల ( స్పర్శ)
జలం - అగ్నిలో కలవడంవల్ల (రూపము)
జలం - జలంలో కలవడంవల్ల (రసము)
జలం - భూమితో కలవడం వల్ల (గంధము) పుట్టెను.
(భూమి పంచీకరణాలు)
భూమి - ఆకాశంలో కలవడంవల్ల ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల ( పాణి )
భూమి - అగ్నితో కలవడంవల్ల ( పాదము )
భూమి - జలంతో కలవడంతో ( గుహ్యము )
భూమి - భూమిలో కలవడంవల్ల (గుదము) పుట్టెను.
(మానవదేహ తత్త్వ స్వరూపము- విభాగాలు) 
(పంచతన్మాత్రలు)
1 శబ్దము 
2 స్పర్శ
3 రూపము 
4 రసము 
5 గంధము 
(జ్ఞానేంద్రియాలు)
1 చెవులు
2 చర్మం
3 కండ్లు
4 నాలుక
5 ముక్కు
(అంతః కరణాలు)
1 మనస్సు
2 బుద్ధి
3 చిత్తము 
4 జ్ఞానము 
5 అహంకారము 
(కర్మేంద్రియాలు)
1 వాక్కు
2 పాణి
3 పాదము 
4 గుహ్యము
5 గుదము
(అరిషడ్వర్గాలు)
1 కామము 
3 క్రోధము 
3 మోహము 
4 లోభము 
5 మదము 
6 మాత్సర్యము 
(శరీరాలు)
1 స్థూల శరీరము 
2 సూక్ష్మ శరీరము 
3 కారణ శరీరము 
(అవస్థలు)
1 జాగ్రదవస్థ
2 స్వప్నావస్థ
3 సుషుప్త్యవస్థ
(షడ్భావ వికారాలు)
1 పుట్టుట
2 పెరుగుట
3.ఉండుట
4 పరిణమించుట
5 క్షిణించుట
6 నశించుట
(షడూర్ములు)
1 ఆకలి
2 దప్పిక
3 శోకము 
4 మోహము 
5 జరా
6 మరణము 
(సప్త ధాతువులు)
1 చర్మము 
2 రక్తము 
3 మాంసము 
4 మేధస్సు
5 మజ్జ
6 ఎముకలు
7 శుక్లము
(జీవత్రయాలు)
1 విశ్వుడు
2 తైజసుడు
3 ప్రాఙ్ఞుడు
(కర్మత్రయాలు)
1 ప్రారబ్ధ కర్మలు
2 ఆగామి కర్మలు
3 సంచిత కర్మలు
( కర్మలు)
1 వచన
2 ఆదాన
3 గమన
4 విస్తర
5 ఆనంద
(గుణాలు)
1 సత్వ గుణము 
2 రజో గుణము 
3 తమో గుణము 
(చతుష్టయములు)
1 సంకల్పము
2 అధ్యవసాయము
3 అభిమానము 
4 అవధారణ
5 ముదిత
6 కరుణ
7 మైత్రి
8 ఉపేక్ష
9 తితిక్షా
(పంచభూతాలు)
1 ఆకాశము 
2 వాయువు
3 అగ్ని
4 జలము 
5 భూమి 
(అవస్థ దేవతలు)
1 దిక్కు
2 వాయువు
3 సూర్యుడు
4 వరుణుడు
5 అశ్వినీ దేవతలు
6 ఆగ్ని
7 ఇంద్రుడు
8 ఉపేంద్రుడు
9 మృత్యువు
10 చంద్రుడు
11 చతుర్వక్త్రుడు
12 రుద్రుడు
13 క్షేత్రజ్ఞుడు
14 ఈశానుడు
 (నాడులు)
1 ఇడా నాడి
2 పింగళ
3 సుషుమ్నా
4 గాంధారి
5 పమశ్వని
6 పూష
7 అలంబన
8 హస్తి
9 శంఖిని
10 కూహు
11 బ్రహ్మనాడీ
(వాయువులు)
1 ప్రాణము 
2 అపానము
3 వ్యానము 
4 ఉదానము
5 సమానము 
6 కూర్మము
7 కృకరము
8 నాగము
9 దేవదత్తము
10 ధనంజయము
7 ( షట్ చక్రాలు )
1 మూలాధార
2 స్వాధిష్ఠాన
3 మణిపూరక
4 అనాహత
5 విశుద్ధి
6 ఆజ్ఞా
7 సహస్రారము 
(మనిషి ప్రమాణాలు)
96 అంగుళాలు
8 జానల పొడవు
4 జానల వలయము
33 కోట్ల రోమాలు
66 ఎముకలు
72 వేల నాడులు
62 కీళ్ళు 
37 ముారల ప్రేగులు
1 సేరు గుండె
అర్ధ సేరు రుధిరము
4 సేర్లు మాంసము 
1 సేరెడు పైత్యము
అర్ధ సేరు శ్లేష్మము
(మానవ దేహంలో 14 లోకాలు)  
పైలోకాలు 7
1 భూలోకం - పాదాల్లో
2 భువర్లోకం - హృదయంలో
3 సువర్లోకం - నాభిలో
4 మహర్లోకం - మర్మాంగంలో
5 జనోలోకం - కంఠంలో
6 తపోలోకం - భ్రూమధ్యములో
7 సత్యలోకం - లలాటంలో
అధోలోకాలు 7
1 అతలం - అరికాళ్ళలో
2 వితలం - గోర్లలో
3 సుతలం - మడమల్లో
4 తలాతలం - పిక్కల్లో
5 రసాతలం - మొకాల్లలో
6 మహాతలం - తొడల్లో
7 పాతాళం - పాయువుల్లో
( మానవ దేహంలో సప్త సముద్రాలు )
1 లవణ సముద్రం - మూత్రం
2 ఇక్షు సముద్రం - చెమట
3 సురా సముద్రం - ఇంద్రియం
4 సర్పి సముద్రం - దోషితం
5 దధి సముద్రం - శ్లేషం
6 క్షీర సముద్రం - జోల్లు
7 శుద్ధోదక సముద్రం - కన్నీరు
( పంచాగ్నులు )
1 కాలాగ్ని - పాదాల్లో
2 క్షుధాగ్ని - నాభిలో
3 శీతాగ్ని- హృదయంలో
4 కోపాగ్ని - నేత్రంలో
5 జ్ఞానాగ్ని - ఆత్మలో
7 (మానవ దేహంలో సప్త దీపాలు)
1 జంబుా ద్వీపం - తలలోన
2 ప్లక్ష ద్వీపం - అస్తిలోన
3 శాక ద్వీపం - శిరస్సున
4 శాల్మలి ధ్వీపం - చర్మమున
5 పుష్కర ద్వీపం - గోలమందు
6 కుశ ద్వీపం - మాంసంలో
7 క్రౌంచ ద్వీపం - వెంట్రుకల్లో
10 ( నాదాలు )
1.లాలాదిఘోష -నాదము
2 భేరి - నాదము 
3 చణీ - నాదము 
4 మృదంగ - నాదము 
5 ఘంటా - నాదము 
6 కింకిణీ - నాదము 
7 కళ - నాదము 
8 వేణు - నాదము 
9 భ్రమణ - నాదము 
10 ప్రణవ - నాదము 

శుభమస్తు.

భూలోకంలో అమృతం మజ్జిగ*

*19-Mar-25, Enlightenment Story*
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
*భూలోకంలో అమృతం మజ్జిగ*

సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు

అమరత్వం యథా స్వర్గం దేవానామమమృతాద్భవేత్‌!
తక్రాద్భూమౌ తథా నృణామమరత్వం హి జాయతే!

సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు పరమాత్ముడు. మంచినీళ్లు అడిగితే మజ్జిగ ఇచ్చి పంపే సంస్కృతి మనది. మజ్జిగ లేదా చల్లకూ... తెలుగువారికీ అనుబంధం అనాదిగా ఉంది. 

క్షేమశర్మ తన ‘క్షేమకుతూహలం’ గ్రంథంలో మజ్జిగతో అనేక ప్రయోగాలు చెప్పాడు. మజ్జిగని సంస్కృతంలో ‘తక్రం’ అంటారు. ‘తక్రం’ ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నివారణకూ పనికొచ్చే ఔషధం. వాపుల్ని కరిగించే శక్తి ఉంది. మొత్తం జీర్ణాశయ వ్యవస్థని బల సంపన్నం చేస్తుంది. లివరు, స్ప్లీను లాంటి మృదువైన అవయవాలలో కలిగే వ్యాధుల్ని నివారిస్తుంది. రక్త పుష్టి ఇస్తుంది. తీసుకున్న ఆహారంలో పోషకాలు వంటబట్టేలా చేస్తుంది. వేసవిలోనే కాదు, అన్ని కాలాల్లో తీసుకోదగిన ఔషధం మజ్జిగ. నెయ్యి, నూనెలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు మజ్జిగ తాగితే ఆ దోషం పోతుంది. జఠరాగ్నిపెరుగుతుంది. కొందరికి మజ్జిగంటే పడదు. దాని వాసన సరిపడకపోవటం ఒక కారణం. ఇంకొందరికి మజ్జిగ తాగితే జలుబు చేస్తుందని భయం. మరికొందరికి మజ్జిగ అరగదనీ, త్రేన్పులు వస్తాయని అనుమానం. మజ్జిగలో నీళ్లు తప్ప ఏమీ లేవనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. ఇవన్నీ మజ్జిగ ఉపయోగాలు తెలియక పెంచుకున్న అపోహలు. 
ఒక గ్లాసు పెరుగుని చిలికి మూడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్లు కలిపి ఒక పూటంతా ఉంచాలి. ఆ పెరుగులో ఉన్న ఉపయోగపడే బాక్టీరియా ఆ నీళ్ల నిండా పెరుగుతాయి. ఈ ఉపయోగపడే బాక్టీరియా కోసమే మజ్జిగ. దీన్ని ప్రోబయాటిక్‌ ఔషధంగా చెబుతారు. జీర్ణశక్తి బలంగా ఉండాలంటే ఈ ప్రోబయాటిక్‌ కావాలి. అందుకు మజ్జిగే మంచి ఉపాయం. పాల కన్నా పెరుగు మంచిది. పెరుగు కన్నా చిలికిన మజ్జిగ తాగేవారి శరీరానికి వృద్ధాప్యం వచ్చినా పేగులకు రాదు. మెరుగైన ఆరోగ్యం కోసం ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు తగలబెట్టాల్సిన అవసరం లేదు. మన నిత్యం వంట గదిలో వాడే వాటినే సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే చాలా మంది వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో తెలియక.. 
మజ్జిగ అంటే పూర్ణచంద్రుడిలా, మల్లెపువ్వులా, శంఖంలా తెల్లగా ఉండాలి. బాగా చిలికితే తేలికగా అరుగుతాయి. ఫ్రిడ్జ్‌లో ఉంచిన మజ్జిగైతే దాని చల్లదనం పోయేదాకా బయటే ఉంచి తీసుకుంటే జలుబు చెయ్యదు. ఈ పెద్ద గ్లాసు మజ్జిగలో అరచెంచా నెయ్యి కలిపి, తగినంత సైంధవ లవణం, చిటికెడు ఇంగువ చేర్చి తాగితే అన్ని వ్యాధుల మీదా ఔషధంగా పని చేస్తుంది. 
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*సర్వేజనా సుఖినోభవంతు*
*లోకా సమస్త సుఖినోభవంతు*
 *శుభం భూయాత్*
*ఓం శాంతి శాంతి శాంతిః*
*స్వస్తి*
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸