Friday, April 10, 2020

మలేరియా జ్వరమునకు తులసితో చికిత్స - malaria chikitsa

 మలేరియా జ్వరం వర్షాకాలం  నందు విపరీతంగా వ్యాప్తి చెందును. ఇది ఇప్పుడు సర్వసాధారణం అయినది. దీనికి ఇతర వైద్యులు "క్యూనైన్ "మందుగా వాడటం జరుగుతుంది. దీనిచే జ్వరం తగ్గును. కానీ తలనొప్పి , చెవులలో హోరుమను శబ్దం , తలతిరుగుట , చెవుడు మొదలుకొని హృదయసంబంధ కాంప్లికేషన్స్ అగుపిస్తున్నాయి. మన ఆయుర్వేద వైద్యం నందు తులసితో ఎటువంటి సైడ్ ఎఫక్ట్స్ లేకుండా ఈ జ్వరాన్ని సులభంగా నివారించవచ్చు.

  నివారణోపాయాలు  -

 *  7 మిరియాలు , 7 తులసి ఆకులు కలిపి నమిలి మ్రింగుచున్న  మలేరియా జ్వరం 3  రోజులలో హరించును .

 *  మానిపసుపు , పిప్పిళ్ళు , వెల్లుల్లి , జీలకర్ర , శొంఠి , తులసి , నారింజ పిందెలు , వావిలి వ్రేళ్ళు , ఆకుపత్రి వీటిని సమాన భాగాలుగా కలిపి చూర్ణించి పూటకు అరతులం వంతున ఇచ్చుచున్న చలిజ్వరములు తగ్గును.

 *  తులసి ఆకులు 60 గ్రా , కొద్దిగా మందార పుష్పదళములు , కొద్దిగా ఉమ్మెత్త పుష్పదళములు , మిరియాలు 10 గ్రా , కొద్దిగా నీరువేసి మర్దించి బఠాణి గింజంత పరిమాణంతో మాత్రలు చేసి చలిజ్వరం వచ్చుటకు గంట ముందుగా రెండు మాత్రలు తీసుకున్న చలిజ్వరం రాకుండానే పోవును.అలాగే రొజు మార్చి రొజు వచ్చు మలేరియా జ్వరం లందు మంచి ఫలితాన్ని ఇచ్చును .

 *  మలేరియా జ్వరం మొండిగా ప్రతిసంవత్సరం వస్తూనే ఉండిన తులసీదళములు , మిరియాలు నీటిలో వేసి ఉడికించిన కషాయములో కొద్దిగా బెల్లం , నిమ్మరసం కలిపి వేడిగా ఉన్నప్పుడే కాఫీ వలే తాగి రగ్గు కప్పుకొని పడుకోవలెను . ఇలా మూడు గంటలకు ఒకమారు చేయుచుండిన మంచి ఫలితం ఉండును.

 *  తులసి వ్రేళ్ళ కాషాయం త్రాపిన బాగుగా చెమటపట్టి చలిజ్వరం వెంటనే తగ్గును.

 *  మలేరియా జ్వరం ప్రతిసంవత్సరం భాదించుచున్న వ్యక్తికీ తులసిరసం , పుదీనా రసం , అల్లం రసం ఒక్కొక్కటి 5 గ్రాముల వంతున కలిపి తాగుచున్న మంచి ఫలితం కనిపించును.

  గమనిక  -

      తులసి చెట్టు వైద్యం కొరకు కుండీలలో ఇంట్లో పెంచుకొనుట చాలా మంచిది.

యాపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలు - apple benefits

  యాపిల్ లో మంచి విటమిన్స్ ఉన్నాయి . ఒక యాపిల్ లో ఒక మిల్లీగ్రాము ఇనుము. పద్నాలుగు మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ , పది మిల్లీగ్రాముల కాల్షియం మరియు A విటమిన్ కూడా ఉన్నది. ప్రతిరోజు ఒక యాపిల్ తినడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు.

 * యాపిల్ రక్తక్షీణతని నివారిస్తుంది. రక్తక్షీణత కలవారు రోజుకి మూడు యాపిల్స్ తీసుకొవడం చాలా మంచిది.

 *  మలబద్దకం నివారణ అవుతుంది. శరీరంకి కావలసినంత బలం ని ఇస్తుంది.

 *  రక్త,బంక విరేచనాలు అవుతున్నవారు యాపిల్ జ్యూస్ తీసుకొవడం వలన అందులో ఉండే పిండిపదార్ధాలు విరేచనాలు లొని నీటిశాతాన్ని తగ్గించడం వలన విరేచనాలు తగ్గుతాయి . యాపిల్ ముక్కలని ఉడికించి తీసుకుంటే ఇంకా మంచిది.

 *  చంటిపిల్లలకు విరేచనాలు అవుతున్నప్పుడు ఒక చెంచా యాపిల్ జ్యూస్ ఇవ్వడం వలన విరేచనాలు కట్టుకుంటాయి.

 *  యాపిల్ జ్యూస్ లో యాలుకలు , తేనే కూడా కలుపుకుని తీసుకుంటూ ఉంటే కడుపులో మంట ప్రేగుల్లో పూత , అజీర్తి , గ్యాస్ట్రబుల్ , పుల్లనితేపులు , గుండెల్లో మంట నివారించబడును.

 *  యాపిల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన మరియు పొటాషియం ఎక్కువుగా ఉండటం వలన బీపీ తో పాటు అన్ని హృదయవ్యాధులు , మూత్రపిండాల వ్యాధులు నివారించబడతాయి. మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు రోజు యాపిల్ జ్యూస్ తాగుతుంటే రాళ్లు కరిగిపోతాయి .

 *  తరచుగా యాపిల్ తింటూ ఉంటే తరచుగా వచ్చే జ్వరాలు అరికడతాయి.

 *  పక్షవాతం , నాడీసంబంధ వ్యాధులు కలవారికి మెదడు వ్యాధులు కలవారికి యాపిల్ చాలా మేలు చేస్తుంది .

 *  రోజు యాపిల్ జ్యూస్ సేవించడం వలన కడుపులో మంట, మూత్రంలో మంట ఉండదు.

 *  కామెర్ల వ్యాధి సోకినప్పుడు వీలయినంత ఎక్కువ యాపిల్ రసాన్ని తాగుతుంటే లివర్ ని సంరక్షిస్తుంది.

 *  యాపిల్ కి కఫాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. జలుబు , దగ్గు , ఆయాసం వీటిని నివారిస్తుంది.

 *  యాపిల్ జ్యూస్ లైంగిక శక్తిని పెంచుతుంది . నీరసాన్ని , అలసటని రానివ్వదు.

 *  యాపిల్ ముక్కలుగా కోసి ఉడికించి రోజు తింటూ ఉంటే బొల్లిమచ్చలు నివారణ అవుతాయి. శరీరం కాంతివంతం అవుతుంది.

 *  యాపిల్ చెట్టు యొక్క వ్రేళ్ళ రసాన్ని తాగితే కడుపులో ఏలికపాములు నివారణ అగును.


  గమనిక  -

       షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం యాపిల్ తీసుకోరాదు .

ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్స చేసిన విధానం - susrutha vaidya vidanam

ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్స చేసిన విధానం -

      చెట్టుయొక్క ఆకుని తీసి తెగియున్న ముక్కుభాగమును సరిగ్గా కొలతపెట్టి అంతప్రమాణం గల చర్మమాంసములు తో కూడిన పోరని దగ్గరగా ఉండు చెక్కిలి భాగం క్రిందనుండి మీదకి కోసి మీదభాగం పట్టు ఉండునట్లు ఉంచి ఆ పొరని ముక్కు యొక్క మొదలు వరకు పదునైన అంచుతో శస్త్రం తో గీచి రక్తం స్రవించునట్లు చేసి దానితో అంచులని అతికించి నాసారంధ్రములకు రెండింటికి తేలికైన గలగడ్డితో చేసిన గొట్టములని దూర్చి పైన ముక్కుయొక్క ఆకారంనకు సరిగ్గా ఆ కండపోరని సర్ది అప్రమత్తముగా , శీఘ్రముగా మీదకి ఎత్తి సూత్రాదులతో ( దారాలతో ) చక్కగా బంధనం చేసి దానిపైన రక్తచందనం , యష్టిమధూకం , రసాంజనం వీని చూర్ణంని చల్లి ఆ పైన తెల్ల దూదిపింజతో కప్పి నువ్వులనూనెని మాటిమాటికి వేసి తడుపుచుండవలెను . మరియు ఆ రోగికి జీర్ణం అయ్యేంత తగినంత నెయ్యిని త్రాగించి కొంచం స్థిమితపడిన తరువాత శాస్త్రానుసారం విరేచనం చేయించవలెను.

          ఇలా చేయుచూ చక్కగా ఆ పోర అతుకుకున్న తరువాత అంతకు ముందు కొంచం పట్టు ఉంచిన కండ భాగాన్ని ఛేదించవలెను . ఇలా చక్కగా అతుకుకొనిన తరువాత కొంచం కృశించి ఉన్నచో ఆ భాగం నకు వెనక చెప్పిన తైలాది చికిత్సలను అనుసరించి ఆ భాగం పెరుగునట్లు చేయవలెను . ఒకవేళ అక్కడ మాంసం ఎక్కువుగా వృద్ధిచెంది యున్నచో సమముగా ఉండునట్టి ఉపాయం జూచి తగ్గించి  సరిచేయవలెను . ఒక్కోసారి లలాటభాగం నందలి మాంసపుపొర కూడా కోసి అతకవలసి యుండును.

       ఈ విధముగా సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్సలు కడు ఉపాయంతో సులభంగా చేసేవారు.

Hot & cold foods:

Hot & cold foods:


Apples- cold
Chikoo-cold
Lemon- cold
Cabbage- cold

Onion- cold
Bhendi, Okra- cold
Beet- cold
Cucumbers- cold
Watermelons- cold


Orange- hot
Mango- hot
Ginger, Garlic- hot


Potatoes- hot

Karela- hot

Carrot- cold
Radish- cold
Spinach- cold
Tomato- cold
Kothmir, Pudina- cold

Chillies- hot
Corn- hot
Methi- hot

Brinjal- hot
Gavar(cluster beans)- hot

Saunf(Fennel seeds)-cold
Cardamom- cold

Papaya- hot
Pineapple-hot

Pomegranate-cold
Sugarcane juice- cold
Coconut water- cold

Honey- hot

Panchamrit
(curd,milk,ghee,honey,
sugar)- cold
Salt- cold
Moong Dal- cold

Toor Dal- hot
Chana Dal- hot
Jaggery- hot
Sesame seeds- hot

Peanut, Almonds, Cashews, Walnuts, Dates- hot

Turmeric- hot
Tea- hot

Coffee- cold

Paneer-hot

Drumstick- cold
Jowar- cold

Bajra- hot
Nachani- hot
Ice cream- hot

Shrikhand, Mango Shrikechand- hot

All refrigerator items- hot
Refrigerator water-hot

Water in earthen pot-cold

Castor oil- very cold
Tulsi - cold, Tulsi seeds- very cold
Sabja seeds- cold cold
Raisin- cold

Bread, Khari, biscuits- hot
All hot drinks- hot
All cold drinks- hot

In summer eating more naturally cold items will considerably lesson the summer heat in our body & keep us cool.

Please send to all your relatives & friends.

ఆయుర్వేదం నందు ఔషదములు గ్రహించు ప్రాచీన పద్దతులు - cleaning kriyas in ayurveda

ఆయుర్వేదం నందు ఔషదములు గ్రహించు     ప్రాచీన పద్దతులు  -

 ఆయుర్వేదం లొ ఔషధసేవన అన్నది 5 పద్ధతులలో తీసుకొవడం జరుగుతుంది. ప్రాచీన గ్రంధాలలో ఈ పద్దతులు వివరించడం జరిగింది. వాటి గురించి మీకు వివరిస్తాను.     అవి

 1 -  స్నేహన విధి .
 2 -  స్వేద విధి .
 3 -  వమన విధి .
 4 -  విరేచన విధి .
 5 -  నస్య విది.

 * స్నేహన విధి  -

    తైలాధులను లేపనం చేయుట . చరుముట, రాచుట మొదలయినవి. దీనికి లేపనం అని పేరు కలదు.

 * స్వేద విధి  -

    బాగా చెమట పట్టునట్లు ఔషధాలను వేడి నీటి యందు వేసి ఆ వేడినీటి యెక్క ఆవిరి పట్టుట. దీనిని కుంభ సేకం అనే పేరు కలదు. దీనిని ఆంగ్లమున "టర్కిష్ బాత్ " అని అంటారు.

 * వమన విధి  -

    వాంతి అగునట్లు ఔషధాలను పుచ్చుకొనుట .

 * విరేచన విధి  -

    భేదికి ( విరేచనం అయ్యే ఔషదం ) పుచ్చుకొని జీర్ణాశయం ని శుద్ది పరచుట.

 * నస్య విధి  -

    కొన్ని మూలికల రసమును నాసికా రంద్రముల యందు పోయుట.

    పైన చెప్పినవి పంచకర్మములు  ఇంకా కొన్ని పద్ధతుల ద్వారా కూడా ఔషధాలను ఇచ్చే విధానాలు ఉన్నాయి . ఇవి ఎక్కువుగా చరక సంహిత , చక్రదత్త, సారంగధార సంహిత, అష్టాంగా హృదయము మొదలయిన ప్రాచీన గ్రంధాల యందు కలవు. వాటి గురించి మీకు వివరిస్తాను.

 * అంజనము  -

  కొన్ని వస్తువుల సముదాయం చేత చేసినట్టి మాత్రను గాని , లేక మూలికల రసం గాని , తైలాధులను గాని , నవనీతం గాని నేత్రముల యందు ఉంచుట ఇదే కలికము లేక అంజనము అంటారు.

 * గండుషము  -

   ఏదేని వస్తువులను వేసి నానబెట్టిన జలముతో పుక్కిలించుట .

 * వస్తి శోధనము  -

   నాళము ద్వారా జలమును గుదస్థానము నందు ప్రవేశింప చేసి మలశోధనము చేయుట . ఇందువలన మలకోశము శుద్ది అగును. పొత్తి కడుపు పలచన అగును. ఇది హట యోగుల యొక్క షట్కర్మలు లలొ ఒకటై ఉన్నది. ఆంగ్లము నందు దీనిని "ఎనిమా " అందురు.

 * నాళికా శోధనము  -

   చిమ్మన గ్రోవి ద్వారా జలమును యొనిస్థానము , కర్ణ రంధ్రము వీని యందు ప్రవేశింప చేసి మలినము వెలికి తీసి శుద్ది చేయుట . ఇది వస్తి శొధనము నందు ఒక బేధము . దీనిని వస్తి పీడనము అని చెప్పెదరు.

 *  ముఖ నిక్షిప్తము  -

   అతిమధురము, కరక్కాయ బెరడు మొదలగు వస్తువులను పుక్కిట యందు ఉంచుకుని ఆరసమును మింగుట .

 * నిబంధనము   -

   గడ్డలు మొదలగు వానికి బియ్యపు పిండి లేక మూలికలు ఉడకబెట్టి కట్టుట.

 * బంధము   -

   గాయములు కలిగినప్పుడు లేక అవయవములు  స్థానము దప్పినను , విరిగినను, బద్ధపెట్టి కట్టుట దీనిని అంగ్లము నందు "బ్యాండేజ్ " అంటారు.

 *  మర్దనము  -

   తైలాధులను వ్యాధిగల స్థలము నందు లేపనము చేసి చేతితో పట్టుట . దీనిని ఆంగ్లము నందు "మసాజ్ " అంటారు.

 *  తాపనము   -

     వ్యాధి బాధ గల చోట ఇసుక, తవుడు, ఆకులు మొదలగు వానిని వేయించి గుడ్డలో మూటకట్టి కాని లేక వేడి నీళ్ళని గాజు బుడ్డియందు ఉంచి కాని కాపడం పెట్టుట .

 *  లేపనము  -

       తలనొప్పి, గడ్డ, మొదలయిన వాటికి పట్టు వేయుట .

 *  అభ్యంగనము   -

        తైలము , మూలికల రసము , జంభిఫల రసము ( నిమ్మకాయ ) , లాంటి కొన్ని స్నేహ వస్తువులను తలకు రాచుకొని స్నానం చేయుట .

 *  చూర్ణము   -

       పదార్ధాలను చక్కగా దంచి వస్త్రగాలితం చేసుకొనుట ( వస్త్రము నందు జల్లెడ పట్టుట ).

 *  కల్కము  -

      ఔషద యోగముల యందు చేర్చుట కొరకై కొన్ని వస్తువులు చేర్చిన సముదాయము ఇదే కల్కద్రవ్యము .

 *  ఘటిక  -

    ఔషద వస్తువులను నూరి చిన్న చిన్న మాత్రలుగా చేసి ఎండలో నుంచి గాని లేక నీడలో ఉంచిగాని ఎండబెట్టుట . దీనినే వటకం , మాత్ర , గుళిక అని చెప్పెదరు.

 *  రక్త మొక్షనము  -

     శరీరం నందు ఎచ్చట నైనా గడ్డలు మొదలయినవి కలిగినపుడు హస్త , పాదాల యందు రక్తము హెచ్చుగా నుండినప్పుడు మూలికాదులను కట్టి గాని లేక జలగలను కరిపించి గాని లేక సలాకు ( పదునైన వస్తువు ) తో గాని పొడిచి రక్తము తీయుట .

 *  ధూమ పానము  -

     కొన్ని మూలికలను చేర్చిన చుట్టను గాని లేక మూలికాదుల చూర్ణం ని నిప్పు పైన వేసి ఆ పొగను గాని వేము మొదలగు కొయ్యలను గాని పీల్చుట .

 * ధూప వర్తి  -

     మూలికాదుల రసమున తడిపి ఎండించిన గుడ్డను వత్తిగా చేసి కాల్చి ముక్కుతో పీల్చుట .

 *  ధూపము  -

       సాంబ్రాణి లేక మరికొన్ని ఇతర వస్తువులను పొడిచేసి నిప్పు మీద వేసి ఆ పొగను శరీరం పైన సోకించుట .

 *  ఆఘ్రణము   -

       కొన్ని వస్తువులను వాసన చూడుట .

 *  పోట్టణం   -

        ఏదేని మూలికలను ఆకుల యందు చుట్టి కుంపటి లొ గాని , కుమ్ములో గాని ఉంచి ఉడికించి తీసుకొనుట . ఇది పుటపాక బేదము .

 *  పుట పాకము   -

       మూలికాదులను ఆకులలో చుట్టి కుమ్ములలో నుంచి తీసి వాని యెక్క రసము పిండు కొనుట.

 *  పిష్టపాకము   -

      ఏదేని మూలికలను రోటిలో వేసి దంచి ఆవిరి మీద పెట్టి ఉడికించి తినుట.

 *  చిక్కాన పాకము   -

       లేహ్యాధులను ఉండచేసినప్పుడు అందు పల్లము పడిన యెడల దానిని చిక్కాన పాకము అనబడును . అనగా ఔషధమును చేతితో తీసీ ఉండ చేయునప్పుడే చేతికి అంటుకోను పాకము .

Auyerveda Tea

Auyerveda Vata Tea
1/4 teaspoon fresh ginger, grated
1/4 teaspoon ground cardamom
1/4 teaspoon cinnamon
1/4 teaspoon ajwan
1 cup water

Boil the water and add the spices. Turn off the heat and let sit for a few minutes. Sweeten with honey or brown sugar according to taste. Very calming for vata types
--------------------------------------
Auyerveda Pitta Tea
1/4 teaspoon cumin
1/4 teaspoon Coriander
1/4 teaspoon fennel
1/4 teaspoon rose petals
1/4 teaspoon fresh cilantro
1 Cup water

Boil the water and add spices. Turn off the heat and cover. Let stand for 5 minutes. Strain And sweeten according to your constitution. Stimulates digestion. Very calming for pitta types.                 
-------------------------------------
Auyerveda Kapha Tea
1/4 teaspoon dry ginger
1/3 teaspoon ground clove
1/4 teaspoon dill seed
1/4 teaspoon fenugreek seed
1 cup water

Boil the water and add the spices. Cover, turn off the heat and let sit a few minutes. Very calming for kapha types.                   

మన పండుగల గొప్పతనం history of indian festivals

ఉగాది:- కష్టము,సుఖము,సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.

శ్రీరామ నవమి:- భార్య - భర్తల  అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.

అక్షయ తృతీయ:- విలువైన వాటిని  కూడబెట్టుకోమని.

వ్యాస (గురు)పౌర్ణమి :-  జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.

నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.

వరలక్ష్మి వ్రతం :-  నీకున్న ఐశ్వర్యమును అందరికి పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.

రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.

వినాయక చవితి ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.

పితృ అమావాస్య :-   చనిపోయిన వారిని  ఎప్పటికి మరువకు అని చెపుతూ.

బతుకమ్మ :- ఊళ్లోని వాళ్లంతా ఆట పాటలతో కలిసిపోతూ సంతోషంగా గడపమని.

దసరా ( ఆయుధ పూజ)  :- ఎప్పుడు నీకు అండగా  నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.

దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.

కార్తీక పౌర్ణమి :-  చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమనెడి.

సంక్రాంతి :-  మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.

మహా శివరాత్రి :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.

కామదహనం:-  కోరికలు తగ్గించమని.

హోలీ :-  వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు ,వివిధ అనుభూతులను పిల్లా పెద్ధ అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.......💐💐💐

పండ్లరసాలు వాటి ఉపయోగాలు - fruits juices benefits

 * కాకరకాయ  -

    కాకరకాయ రసం రక్తాన్ని శుద్ధిచేస్తుంది. ఇది ఆకలిని పెంచుతుంది. పేగులలో ఉండే పురుగులకు నిర్మూలిస్తుంది. మూలశంఖ నుండి విశ్రాంతినిస్తుంది. ఇది డైయూరిటిక్ అవడం వలన మూత్రపిండాలలో మంటని తగ్గిస్తుంది. మూత్రపిండాలలో రాళ్లని కరిగిస్తుంది. ఇది మధుమేహా వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం. కీళ్లవాతం, కామెర్లతో బాధపడేవారు ఖాళీ కడుపుతో ఈ కాకరకాయ రసం తీసుకోవడం మంచిది .
* వెల్లుల్లి  -

         వెల్లుల్లి చాలా శక్తివంతమైన యాంటిసెప్టిక్. వెల్లుల్లి రసాన్ని అంతే మొత్తంలో నీరుకి కలిపి తీసుకుంటే కలరా క్రిములు నశిస్తాయి. వెల్లుల్లిని టైఫాయిడ్ నిరోధించడానికి వాడవచ్చు . దీనిలో ఉండే సల్ఫాయిడ్ నూనె ముఖ్యమైనది. శ్వాసవ్యాధులకు , న్యుమోనియా సమస్యలకు ఇది అద్భుతమైన మందు. న్యుమోనియా లక్షణాలు అయిన టెంపరేచర్ , శ్వాస , నాడి అవకతవకలను కేవలం ఏడు రోజులలోనే వెల్లుల్లి రసం వాడటం వలన మాములు స్థితికి తేబడ్డాయి.

              ఎటువంటి కడుపుబ్బరానికి అయినా , పక్షవాతం , శరీరం మొత్తం పట్టేయడం , గుండె సమస్య , కడుపునొప్పి , ఎన్నో రోగాలను నయం చేస్తుంది . బ్రాంకైటిస్ వ్యాధిలో వెల్లుల్లి చాలా అద్భుతంగా పనిచేస్తుంది . కొంతమంది వైద్యులు వెల్లుల్లిని క్షయవ్యాధి చికిత్సలో భాగంగా సూచిస్తున్నారు. వెల్లుల్లి శ్లేష్మాన్ని బయటకి పంపుతుంది. నిద్రని కలిగిస్తుంది . జీర్ణశక్తిని అభివృద్ధిపరుస్తుంది. బరువు పెరగడానికి సహాయపడుతుంది.

               పేగులలో ఉండే ఇన్ఫెక్షన్ సమస్యను నిరోధించి పేగులకు జీవం ఇస్తుంది. అజీర్ణం , జీవరసాలు మెల్లగా ప్రవహించడం , గ్యాసుకి అద్భుతమైన మందు. దీర్ఘకాలిక విరేచనాలు వంటి దీర్ఘకాలిక ప్రేగు వ్యాధులను అదుపుచేయడం లో మంచిఫలితాలు వస్తాయి.

        పుండ్లు , అల్సర్లు కుళ్ళిపోకుండా ఉండటానికి వెల్లుల్లిని వాడతారు. వీటితోపాటుగా వెల్లుల్లి రసాన్ని ఇన్ఫెక్షన్ కి గురి అయిన పుండ్లు శుభ్రపరచడానికి వాడతారు. చెడు అల్సర్లు కూడా తొందరగా బాగుపడుతుంది. నొప్పి ఆగిపోతుంది . పుండ్లు , అల్సర్లు డ్రెస్సింగ్ చేయడానికి వెల్లుల్లి రసానికి మూడు భాగాలు నీటితో కలిపి పలచగా చేసి పుండ్లు , అల్సర్ల ను కడగడానికి ఉపయోగించవలెను . గౌట్ , మూత్రపిండాలలో , ఊపిరితిత్తుల్లో రాళ్లు విషయంలో ఉపయోగకరం . ఇది అధిక రక్తపోటును తగ్గించును . చెముడు , చెవిలో పోటు సమస్యలకు ఒక్క చుక్క చెవిలో వేసిన నయం అగును.


 *  క్యాబేజి  -

        గ్యాస్ట్రిక్ , డియోడనల్  అల్సర్లు నయం చేసే విటమిన్ "U " అనే కొత్తరకం విటమిన్ దీనిలో ఉంది . క్యాబేజీని బాగా ఉడికించినప్పుడు అల్సర్ ని నయం చేసే పదార్థం నాశనం అవుతుంది. అంతేకాదు క్యాబేజి తగుపాళ్లలో ఐరన్ కలిగి ఉంటుంది. కాబట్టి రక్తహీనత చికిత్సలో ఉపయోగకరం . ఈ క్యాబేజి రసం కీళ్లవాపు , న్యూరాస్ దేనియా , చిగుళ్ల నుంచి చీము స్రవించుట, అజీర్ణం , రక్తహీనత , దృష్టిలోపం , స్థూలకాయం వంటి పరిస్థితులకు ప్రభావవంతంగా పనిచేయును .

            క్యాబేజి బయటవైపు ఉండు పచ్చని ఆకులు విటమిన్ "A " ను కలిగి ఉంటాయి. లోపలి తెల్ల ఆకులు దీనిని కలిగి ఉండవు. కాబట్టి బయట ఆకులను పారవేయకూడదు. అంతేగాక బయట ఆకులలో ఐరన్ ఎక్కువుగా ఉంటుంది.
పండ్లరసాలు వాటి ఉపయోగాలు  - 4 .

 ద్రాక్షారసం -

     ద్రాక్ష ఎక్కువుగా జనవరి నుంచి మార్చి నెలల మధ్యకాలంలో ఎక్కువుగా లభ్యం అవుతాయి. ద్రాక్షపళ్లు నలుపు , ఆకుపచ్చ , వంకాయ రంగులలో లభ్యం అగును. ఇవి వివిధ ఆకారాలలో , వివిధ పరిమాణాల్లో లభ్యం అగును. చిన్నవాటిలో గింజలు ఉండవు. పెద్దవాటిలో గింజలు ఉంటాయి.

          చరకసంహితలో చరక మహర్షి ఈ ద్రాక్షపళ్ళు గురించి చాలా చక్కగా వివరించారు. ద్రాక్షాపళ్లు మంచి పథ్యముగా , తియ్యగా , శరీరము నందు శాంతము కలిగించే విధముగా ఉండును. గొంతు , చర్మం, జుట్టు, కళ్ళకు సంబంధించిన సమస్యలకు అద్భుతముగా పనిచేయును . ఆకలిని పెంచును. శరీరము నందు మంట, దాహము , జ్వరం , కుష్టు , క్షయ , క్రమం లేని రుతువులు , గొంతు సమస్య , వాంతులు , స్థూలకాయం , దీర్ఘకాల కామెర్లు అనగా హెపటైటిస్ వంటి వాటి మంచి ఔషధముగా పనిచేయును . ఉదరము నందు ఆమ్లతత్వాన్ని తగ్గించును .

           అనేక పురాతన ఆయుర్వేద గ్రంథాలలో యవ్వనాన్ని నిలిపి ఉంచుటకు ముసలితనం తొందరగా రానివ్వకుండా ఉంచుటలో ద్రాక్ష అద్భుతముగా పనిచేయును అని రాసి ఉంది. ఇవి మంచి పోషకాలను కలిగి ఉంటాయి. గ్యాస్ సమస్య కూడా తగ్గిపోవును . ద్రాక్షపళ్లు యూరిక్ సమస్యలు , మూత్రకోశములో మండుతున్న అనుభూతి , మూత్రపిండాలలో రాళ్లు నుండి మంచి ఉపశమనాన్ని కలిగించును.

                 ఈ ద్రాక్షపళ్ళు రసాన్ని వైద్యులు ఎక్కువుగా కీళ్ల వాపులు , ఋతుసంబంధ సమస్యలు , రక్తస్రావానికి వాడుతుంటారు. పచ్చి ద్రాక్షపండ్లలో ఎక్కువ ఆమ్లమూలాలు తక్కువ పంచదార ఉంటాయి. కాని పండిన ద్రాక్షపండ్లలో పంచదార మొత్తం గమనించదగినంత పెరిగిపోవును. ద్రాక్షలో ఉండే పంచదారలో గ్లూకోజ్ ఎక్కువుగా ఉండును. ద్రాక్షపండ్లను మిగతాపండ్లను సమాన తూకంలో తీసుకుని చూస్తే ద్రాక్షపండ్లలోనే గ్లూకోజ్ అధికంగా ఉండును. ద్రాక్షపండ్లలో ఉండే గ్లూకోజ్ శరీరంలో తొందరగా కలిసిపోవును. రక్తహీనతతో బాధపడేవారు ద్రాక్షారసం తీసుకోవడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. ద్రాక్షలో ఉండే మాలిక్ , సిట్రిక్ , టార్టారిక్ ఆమ్లాలు రక్తాన్ని శుద్ధిచేస్తాయి. ప్రేగుల , మూత్రపిండాలు చురుకుపరుస్తాయి.

                  ద్రాక్షపండ్లను సహజరూపంలో తీసుకోవచ్చు . కాని వైద్యపరంగా స్వచ్చమైన తాజా రసములో ఎక్కువ విలువలు ఉంటాయి. ద్రాక్షపండ్లు ప్రతినిత్యం తీసుకోవడం వలన మలబద్దకం సమస్య తీరును . మొలల సమస్య కూడా తగ్గుముఖం పట్టును . పిత్తరసం ఎక్కువ అయ్యి ఉదరంలో మండుతున్నట్టు ఉండే భావన శాంతపరచగలిగే శక్తి వీటికి ఉంది.సాధరణ బలహీనత , నిస్సత్తువ , నిలిచిపోయిన బరువు , చర్మం ఎండిపోవుట , దృష్టి డిమ్ముగా ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ రసాన్ని వాడవలెను.

       ద్రాక్షారసాన్ని కొన్నిరోజులపాటు ఆగకుండా వాడటం వలన అనవసరమైన వేడి శరీరం నుంచి తీసివేయబడింది. శరీరం శుభ్రంగా , చల్లబడును. ద్రాక్షారసం తాగడం వలన రక్తవిరేచనాల లక్షణాలు అన్ని మాయం అవుతాయి. క్యాన్సర్ నయం చేస్తుంది. రక్తహీనత వలన బాధపడేవారు ప్రతినిత్యం 300 మి.లీ ద్రాక్షరసం తీసికొనవలెను

వరసగా వచ్చు ఎక్కిళ్లు హరించుటకొరకు అద్భుత యోగం - ekkillu

* నల్లేరు కాడలు తెచ్చి కుమ్ములో ఉడకబెట్టి రసముపిండి ఆ రసము 5ml , తేనే 5ml కలిపి పూటకొక సారి రోజూ రెండుసార్లు తీసుకున్న యెడల ఎక్కిళ్లు హరించును

 * నెమలిపింఛం కాల్చి మసిచేసి ఆ మసి , తేనె , తమలపాకులరసం సమభాగములుగా కలిపి పూటకు 5 గ్రాములు చొప్పున రోజుకి మూడుపూటలా ఇచ్చుచుండిన యొడల ఎక్కిళ్లు హరించును .

జలాండము (HYDROCELE ) నివారణా యోగాలు -

* కొబ్బరికోరు ఆముదములో వెచ్చచేసి కడుతున్న చాలాకాలం నుంచి ఉన్న బుడ్డలు కూడా హరించును .

 *  మిరియాలు , ఉలవలు , తెలకపిండి వీటిని సమాన భాగాలుగా నూరి వెచ్చచేసి కట్టిన బుడ్డలు తగ్గును.

 *  గచ్ఛ ఆకు వేడిచేసి కట్టుచున్నను బుడ్డలు హరించును .

 *  ఉలవలు , వెల్లుల్లి , ఇంగువ, గచ్ఛపప్పు వీటిని సమపాళ్లలో నలగగొట్టి కషాయము కాచి నేతితో సేవించుచున్న బుడ్డలు తగ్గును.

 *  గచ్చ చిగుళ్లు ఆముదముతో వేడిచేసి బుడ్డలపైనా వేసి కడుతున్న బుడ్డలు తగ్గును.

 *  సైన్ధవ లవణం పది గ్రాములు , జిల్లేడు ఆకులు ఇరవై గ్రాములు తీసుకుని మెత్తగా నూరి అండవృద్ధి పైన లేపనం చేయుచున్న వృషణముల వాపులు హరించి మరలా వ్యాధి రాదు .

 *  ముద్దకర్పూరము , గవ్వపలుకు సాంబ్రాణి రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని బాగా నూరి బుడ్డపై పట్టు వేసిన బుడ్డ తగ్గును.

జామకాయ గురించి సంపూర్ణ వివరణ - guava benefits

 జామచెట్టు దక్షిణ అమెరికాకు చెందినది. అయితే ఇప్పుడు ప్రపంచమంతా కనిపిస్తుంది. ఇది ప్రాచీనకాలం నుంచి భారతదేశంలో ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఇది చలికాలంలో తేలికగా లభ్యం అవుతుంది. ఈ జాతిలో తెల్లజామకాయ , ఎర్ర జామకాయ అను రెండురకాలు ఉన్నాయి. తెల్ల జామకాయ ఎర్ర జామకాయ కంటే రుచిగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ మరియు వారణాశి లో పండే జామకాయలు గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.

 గుణాలు -

         జామకాయ అంగుళికరంగా , వగరుగా , తీపిగా ఉంటుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది . శరీరానికి చలువచేయును . పిత్తరసాన్ని ఎక్కువుగా ప్రవహించకుండా నిరోధిస్తుంది. ఇది ఆకలిని పెంచుతుంది . జీర్ణాశయంలో మండుతున్న అనుభూతిని తగ్గిస్తుంది . మానసిక బ్రాంతి , హిస్టీరియాలను నయంచేస్తుంది . దప్పికను తీర్చుతుంది. ఇది పేగులలోని పురుగులను నాశనం చేస్తుంది. ఉన్మాదం నుండి ఉపశమనం ఇస్తుంది.

         జామకాయలో నీటి శాతం - 76.1 % , ప్రోటీన్ - 1.5 %, కొవ్వు - 0.2 % , కార్బో హైడ్రేట్లు - 14.5 % , క్యాల్షియం - 0.01 % , ఫాస్ఫరస్ - 0 .04 % , ఐరన్ - 1 మిల్లీగ్రాముల నుంచి 100 గ్రా , విటమిన్ C - 300 మిల్లీగ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఉంటుంది.

       జామకాయ విటమిన్ C ని ఎక్కువ కలిగి ఉంటుంది. ఈ పండు మగ్గి మెత్తగా అయితే మాత్రం విటమిన్ C తగ్గుతుంది . జామకాయ తొక్క మరియు తొక్కకు దగ్గరలో ఉండే గుజ్జు ఎక్కువ మొత్తంలో విటమిన్ C ని కలిగి ఉంటాయి.

  తీసుకునే విధానం  -

         జామకాయని బాగా నమిలి తినవచ్చు . కాని ఎక్కువ పోషకాలను పొందాలంటే రసం తీసుకోవాలి . ప్రతి 100 ml రసంలో 70 నుంచి 170 మిల్లీగ్రాముల విటమిన్ C ఉంటుంది.

       జామకాయ మలబద్ధకాన్ని మంచి ఔషధముగా పనిచేయును . రక్తములోని మలినాలను తీసివేయును . కుష్టు ఇతరవ్యాధుల చికిత్సలో చాలా అద్భుతముగా పనిచేయును .

అల్లం గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు . ginger benefits

 సంస్కృతంలో అల్లమును "విశ్వాఔషధ" అని అంటారు. ఇది వాతాన్ని తగ్గిస్తుంది . జీర్ణకరము , విరేచనకారి , కళ్లు , గొంతుకు మంచిది . దీని విరేచనగుణం వలన పేగులలో పురుగులను నాశనం చేస్తుంది . అలా నాశనం అయిన క్రిములు మూత్రము ద్వారా బయటకి విసర్జించబడతాయి. పేగులకు అల్లం మంచి టానిక్ లాగా పనిచేస్తుంది . దీనిని వాడటం వలన ఇటువంటి సైడ్ ఎఫక్ట్స్ ఉండవు.

         అల్లము నందు విటమిన్ A , మరియు విటమిన్ C , ఫాస్ఫరస్ కొంత మోతాదులో ఉంటుంది. భోజనం తీసుకోవడానికి గంట ముందు చాలా చిన్నమొత్తంలో మినరల్ సాల్ట్ , నిమ్మకాయ రసం కొన్ని చుక్కలు , నాలుగు స్పూనుల అల్లం రసం కలిపి లోపలికి తీసుకుంటే ఆకలిని అద్భుతముగా పెంచును. గ్యాస్ సమస్య కూడా పరిష్కారం అగును. దగ్గు , జలుబు , రొంప మొదలయిన సమస్యలతో బాధపడేవారు అల్లం వాడటం వలన సమస్య నుంచి తొందరగా బయటపడతారు. గుండెజబ్బు ఉన్నవారు తరచుగా అల్లం వాడటం చాలా మంచిది . అన్ని రకాల ఉదరవ్యాధులకు అల్లం చాలా మంచి పరిష్కారం చూపిస్తుంది.

           అల్లం రసం ప్రతినిత్యం తీసుకోవడం వలన మూత్రసంబంధ సమస్యలు , కామెర్లు , మూలశంఖ , ఆస్తమా , దగ్గు , నీరుపట్టడం వంటి సమస్యలు త్వరగా నయం అగును. ఔషధాలు సేవిస్తూ అల్లంకూడా వాడటం వలన త్వరగా ప్రయోజనం చేకూరును . ఆయుర్వేదం ప్రకారం అల్లాన్ని ప్రతినిత్యం తీసుకోవడం వలన గొంతు , నాలుక సంబంధ సమస్యలకు అద్భుతముగా పనిచేయును . తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు అల్లంరసం ముక్కులో వేయుచున్న తలనొప్పి తగ్గును. పంటినొప్పితో బాధపడుతున్నప్పుడు పంటిపైన అల్లం ముక్కతో రుద్దిన నొప్పి తగ్గును. సైనసైటిస్ నుంచి కూడా విముక్తి లభించును.



బొప్పాయి గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు . Popeye benefits

బొప్పాయి గురించి సంపూర్ణ వివరణ  - ఉపయోగాలు .

      ఇది పులుపు , తీపి రుచులతో ఉండి దీని రసం చల్లగా ఉంటుంది. ఇది  ఫిబ్రవరి , మార్చి నెలలో మే నుండి అక్టోబర్ నెలలో కాపుకు వస్తుంది. పండు బొప్పాయి కాయ గుండెకు మంచి ఉపయోగకరం . పైత్యాన్ని తగ్గించును . కాలేయానికి ఉపయోగకరం . ప్లీహం పెద్దది అవ్వకుండా కాపాడును . మలబద్ధకాన్ని పోగొట్టును . మూత్రవ్యాధులలో అద్భుతముగా పనిచేయును .

          బొప్పాయికాయలో దాదాపు సగం గ్లూకోజ్ , మిగతాసగం ఫ్రక్టోజ్ ఉండును. మామిడికాయ తరువాత విటమిన్ "A " ఎక్కువ మోతాదులో ఇందులోనే ఉంటుంది. ఇది పక్వానికి వచ్చేకొద్దీ ఇందులో విటమిన్ " C " పెరుగును . మే నుండి అక్టోబర్ మధ్యలో వచ్చే బొప్పాయకాయల్లో పంచదార మరియు విటమిన్ " C " అధికంగా ఉండును. బొప్పాయకాయలో విటమిన్ B1 , B2 మరియు నియాసిన్ అధికంగా ఉండును.

        పచ్చిబొప్పాయకాయ నుండి వచ్చే తెల్లటి సెక్రిపన్ , పాపాయన్ అనే జీర్ణసంబంధమైన ఎంజైము ను కలిగి ఉంటుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయును . పచ్చి బొప్పాయకాయను రసం రూపంలో తీసికొనవలెను . పండిన కాయను సహజరూపంలోనే తీసుకొనవచ్చు . బొప్పాయి కాయను తీసుకోవడం వలన జీర్ణప్రదేశంలో ఉండే రౌండ్ వార్మ్స్ అనే పురుగులను బయటకి పంపును . ఈ రసం కాలేయవ్యాధులను నయం చేయును . రుతుప్రవాహం సరిగ్గా ఉండటానికి సహాయపడును. రక్తవిరేచనాలు , ఆమ్లత్వం , అజీర్ణం, మలబద్దకం వంటివాటికి చాలా మంచి ఔషధముగా పనిచేయును . రక్తహీనతకు కూడా బాగుగా పనిచేయును .

         బొప్పాయి మూత్రం ఎక్కువ అయ్యేలా చేస్తుంది . కావున ఇది మూత్రపిండాల వ్యాధులలో చాలా ఉపయోగకరం . పండిన బొప్పాయి మలబద్దకాన్ని పోగొట్టును . ఆస్తమాకు మంచి ఔషధముగా పనిచేస్తుంది . పచ్చి బొప్పాయికాయలోని తెల్లటి గుజ్జు ముఖంపైన రుద్దుట వలన మొటిమల సమస్య నివారణ అగును. ముఖానికి మంచి వెలుగు తెచ్చును. ముడతలను పోగొట్టును .

  బొప్పాయిరసం శరీరంలో వేడిని పెంచును కావున గర్భిణీలు , జ్వరం ఉన్నవారికి బొప్పాయి ఇవ్వకూడదు. బొప్పాయి ఆకులను బోదకాలు నివారణలో వాడతారు.

గోధుమగడ్డి రసం ఉపయోగాలు - సంపూర్ణ వివరణ - wheat grass benefits

గోధుమగడ్డి రసం ఉపయోగాలు

    అంతకు ముందు పోస్టులో గోధుమగడ్డి ఉపయోగాలు మీకు తెలియచేశాను . ఇప్పుడు గోధుమగడ్డిని పెంచేవిధానం , తీసుకునే విధానం తెలియచేస్తాను .

 * గోధుమగడ్డి పెంచే విధానం  -

           ఇంటి యందు ఖాళీ ప్రదేశం ఉన్నవారు దానిని ఏడు భాగాలుగా విడగొట్టటం లేదా పెద్ద వెడల్పాటి కుండీలు లేదా చెక్కపెట్టెలలో గోధుమగడ్డిని పెంచాలి. ఎరువు సహజమైనది అయి ఉండాలి. రసాయనిక ఎరువులను వాడరాదు. మనం పెంచే కుండీ లేదా చెక్కపెట్టె పరిమాణం ఒక స్క్వేర్ ఫీట్ ఉండాలి. 100 గ్రాముల గోధుమగింజలను ప్రతి కుండీలో నాటాలి . సాధారణంగా 100 గ్రా నుండి 120 గ్రా గోధుమగడ్డి మనం నాటినదాని నుండి వస్తుంది.

                   గోధుమగింజలను నాటే ముందు 12 గంటలపాటు నానబెట్టాలి. వీటిని నీటినుండి తీసి , తడిగా ఉన్న దళసరిగా ఉన్న గుడ్డలో ఉంచాలి. గట్టిగా గుడ్డను మూటకట్టండి. దాని నుంచి మొలకలు వస్తాయి. మొలచిన గోధుమ గింజలను నాటితే గడ్డి యొక్క ఎత్తు వారం రోజులలో 5 నుండి 7 అంగుళాల ఎత్తు పెరుగును . ప్రతి 24 గంటలకు ఒకసారి నీరు చిలకరించండి. కుండీలలో ఎక్కువ నీరు పోయవద్దు. ఇలా పోయడం వలన వాటి పెరుగుదల అడ్డగించబడును. ఇలా 7 కుండీలలో ఒక్కోరోజు నాటండి. మొదటిరోజు నాటబడిన గోధుమ గింజలు గోధుమగడ్డిగా పెరుగును . ఏడొవరోజు నాటికి 7 ఇంచులు ఎత్తుకి పెరుగును . ఈ గోధుమగడ్డిని కత్తెరతో కోయడం లేదా చేతితో తుంచడం చేయండి . కుండీలలో నుండి తీసిన తరువాత మట్టిని తీసి శుభ్రపరిచి ఎండలో పెట్టాలి . మళ్ళీ గోధుమను నాటేప్పుడు కొంచెం సహజ ఎరువును వేయండి . ఒకేసారి ఏడుకుండీలలో నాటవద్దు. ప్రతిరోజూ ఒకదానిలో నాటుకుంటూ వెళ్ళాలి. ప్రతిరోజు వాడుకొవచ్చు.

 *  రసం తీసే విధానం -

            గోధుమగడ్డిని కుండీలలో నుంచి తీసిన తరువాత బాగా కడిగి ఆ తరువాత కొంతనీరు కలిపి బాగా రుబ్బాలి. అలా రుబ్బిన గోధుమగడ్డిని ఒక పరిశుభ్రమైన గుడ్డ యందు ఉంచి పిండాలి. అలా వచ్చిన రసాన్ని తీసుకోవాలి . ఎవరైనా రసాన్ని తాగటం ఇష్టం లేకున్న గడ్డిని నమిలి రసాన్ని తీసుకుని పిప్పిని బయటకి వూయవచ్చు. సాధారణంగా 100 గ్రాముల గోధుమగడ్డి నుండి 5 నుంచి 6 ఔన్సుల స్వచ్చమైన రసం మాత్రమే వస్తుంది. నీరు కలిపి రుబ్బటం వలన కొంత మోతాదు పెరుగుతుంది .

 *  గోధుమగడ్డి రసం తీసుకోవలసిన మోతాదు -

        వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి 100 మి.ల్లీ తీసికొనవలెను. కాని ఒకేసారి తీసుకొకూడదు. మొదట 25 మి మి .లీ నుండి ప్రారంభించి 50 మి.లీ అటు తరువాత 100 మి.లీ వరకు పెంచుకుంటూ వెళ్ళాలి. పాత మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు 250 మి.లీ నుంచి 300 మి.లీ వరకు రోజు మొత్తం తీసుకోవాలి. వేడి చేయు గుణం ఉండటం వలన వేడి శరీరం ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది .

                   గోధుమగడ్డి నుండి రసం తీసినవెంటనే రసాన్ని తీసుకోవాలి . ఒకేసారి మింగకుండా కొంచంకొంచం తీసికొనవలెను . రసాన్ని ఎక్కువసేపు నిలువ ఉంచితే పోషకాలు కోల్పోవును . రసం తాగుటకు గంట ముందు గాని తాగిన గంట వరకు కూడా ఎటువంటివి తినటం గాని తాగటం కాని చేయకూడదు .

 *  గోధుమగడ్డి రసాన్ని తీసుకునే ముందు గమనించవలసిన విషయం  -

           గోధుమగడ్డి రసాన్ని మాత్రమే తీసుకోవాలి అనుకునే వారు ఒకటి రెండు రోజుల ముందు నుంచి ఉపవాసం చేయడం లేదా కేవలం పళ్లరసాలను మాత్రమే తీసుకొనవలెను . ఉపవాసం చేసినతరువాత తీసుకుంటే ఒంటికి తొందరగా పడుతుంది. మొదట చిన్న మోతాదులో తీసుకొవడం మొదలుపెట్టి మెల్లగా మోతాదు పెంచుకుంటూ వెళ్లవలెను . కొంతమందికి ఈ రసం తీసుకున్నాక డోకు , వాంతులు , జలుబు , విరేచనాలు , జ్వరం రావొచ్చు . ఇలాంటివి అరుదుగా వస్తాయి. భయపడనవసరం లేదు . అటువంటి సమయాలలో రసానికి మరింత మోతాదు నీరు కలిపి పలుచగా చేసి తీసుకోవాలి . పైన చెప్పిన లక్షణాలు అలానే ఉంటే రసం తీసుకోవడం ఆపేసి తగ్గాక మరలా మొదలుపెట్టండి. రుచి కొరకు ఎటువంటి వస్తువులు కలపకూడదు.

పాలు యొక్క ఉపయోగాలు - సంపూర్ణ వివరణ . benefits of cow milk

 పాలు సంపూర్ణ ఆహారం . ఆరోగ్యముగా ఉన్న ఆవు నుంచి అప్పుడే తీసిన ఆవుపాలు అమృతతుల్యమైనవి. ఈ పాలు తేలికగా ఉండి త్వరగా జీర్ణం అవుతాయి. కడుపుబ్బరం , పైత్యం , దగ్గును నయం చేయును . ఆవుపొదుగు నుంచి తీసిన పాలను వెంటనే నిలువ ఉంచకుండా తాగవలెను లేదా వేడిచేసి తాగవలెను. శుభ్రతలేని పరిసరాలలో పాలు తీసినప్పుడు ఆ పాలను మరగకాయాలి.

         ఆవుపాలను ఇతర ఆహారంతో కలిపి ఎప్పుడూ తీసుకోకూడదు . పాల యొక్క పోషకాలను గరిష్టంగా పొందాలి అంటే ప్రతినిత్యం తీసికొనవలెను. పాలను ఎక్కువ మొత్తములో తీసుకుంటే అందులోని క్యాల్షియం , ఇతర ఖనిజ లవణాలు ఉదరములోని ఆమ్లతత్వాన్ని అడ్డుకొని ఒకరకమయిన ఎంజైము ఉత్పత్తిని తగ్గించును . కడుపు మంచిగా తయారగును. పాలలో ఉండే లాక్టిన్ పేగుల్లోకి డైరెక్టుగా ప్రవేశించి బ్యాక్టీరియా చురుకుదనాన్ని తగ్గించును . కేవలం ఒక శాతం లాక్టోస్ బ్యాక్టిరియాను అడ్డుకుంటుంది.

             ఆవుపాలల్లో క్యాల్షియం ఫాస్పెట్ , పొటాషియం ఫాస్పెట్ , సోడియం క్లోరైడ్ , పొటాషియం క్లోరైడ్ , ఐరన్ ఫాస్ఫెట్ , మాంగనీస్ ఫాస్పెట్ ఉంటాయి. విటమిన్లు A , B , C , D , E , O కూడా పాలలో ఉంటాయి. పాలలో ఉండే ప్రొటీన్ కి బయోలాజికల్ విలువ బాగా ఉండి తేలికగా జీర్ణం అగును. శరీరానికి అవసరమయిన ఎమినో ఆమ్లములు దీనిలో ఉన్నాయి . ఐరన్ శాతంకూడా పాలలో లభించును.

      పాలను ఎప్పుడూ గటగటా తాగకూడదు కొంచం కొంచం చప్పరిస్తూ తాగవలెను. ఇలా చేయడం వలన లాక్టోస్ లాలాజలంతో కలిసి అది జీర్ణం అవ్వడం అక్కడి నుంచే మొదలగును. పాలు ఎక్కువుగా బాలురు , వృద్ధులు , శరీరం క్షీణించినవారు , ఆకలిచే కృశించినవారు , సంగమం వలన అలసట చెందినవారు. పాలు సేవించిన త్వరగా కోలుకుందురు. పంచదార లేదా పటికబెల్లం పాలతో కలిపి సేవించిన శుక్రవృద్ధికరము , బెల్లముతో కలిపి పాలు సేవించుచున్న మూత్రకృచ్చ రోగమును పోగొట్టును . మూత్రకృచ్చ రోగం అనగా మూత్రం బొట్లుబొట్లుగా పడుచూ తీవ్రమైన బాధ కలిగి ఉండు రోగం .

             ప్రతినిత్యం రాత్రి సమయముల యందు పాలు తాగుచున్న యెడల అనేక దోషములను పోగొట్టును . పాలు ఎప్పుడూ భోజన సమయానికి రెండు గంటల వ్యవధితో తాగవలెను . లేక భోజనం తినకుండా పాలు సేవించవచ్చు . పాలలో ఎప్పుడూ అన్నం కలిపి తినకూడదు. అలా కలిపి తినుచున్న అజీర్ణరోగం కలుగును. రాత్రి సమయము నందు నిద్రపట్టదు.

  పాలను సేవించువారు ఇప్పుడు నేను చెప్పబోవు నియమాలను తప్పక పాటించవలెను.

 *  మంచి రంగు లేక రుచి చెడి , పుల్లగా , చెడువాసనతో గడ్డగడ్డలుగా ఉన్నట్టు పాలను వాడరాదు.

 *  పాలతో ఎల్లప్పుడూ పంచదార , అప్పుడప్పుడు మాత్రం బెల్లం కలిపి మాత్రమే ఉపయోగించవలెను .

 *  పాలల్లో ఉప్పు కలిపి వాడరాదు.

 *  చేపలకూర , మాంసాహారం తిని పాలు , పాలపదార్థాలు సేవించిన కుష్టురోగం కలుగును. ఎండుచేపలు కాని పచ్చిచేపలు కాని పాలతో ఉపయోగించకూడదు.

 *  పుల్లటి వస్తువులు తీసుకున్నపుడు పాలు ఉపయోగించకూడదు .

 *  ఉలవలు , వరిగెలు , కొర్రలు , అనుములు , అడివి పెసలు మెదలైనవి పాలతో కలిపి తినరాదు. ముఖ్యముగా అనుములు మరియు మినుములు తినిన తరువాత పాలు వాడిన అనారోగ్యం కలుగును . ఇడ్లీ , దోశ తినిన తరువాత టీ , కాఫీ సేవించరాదు .

 *  ముల్లంగి భుజించునప్పుడు పాలను దూరం ఉంచవలెను.

        అనారోగ్యముతో బాధపడువారు రాత్రులయందు వేడివేడి గోధుమ చపాతీలు ఆకుకూరలతో గాని , తీపి పదార్థాలతోగాని , పంచదారతో గాని భుజించి కాచిన పాలలో పంచదార కలిపి తాగిన శరీరానికి మంచి ఆరోగ్యం కలుగును. పాల యందు వెన్న అనునది ఆవులు , గేదెలు తిను ఆహారం నుండి పుట్టుచుండును. చిట్టు , పచ్చగడ్డి, పత్తిగింజలు మినపపొట్టు మొదలగునవి తిను పాలు శ్రేష్టము . పల్లపు ప్రాంతపు పశువుల పాలకన్నా మెట్టపు ప్రాంతపు పశువుల పాలు శ్రేష్టము .

         నేను పైన చెప్పినటువంటి పోషకాలు , విటమిన్లు అన్నియు స్వేచ్ఛగా బయట పొలాలలో , అడవులలో తిరిగి గడ్డిమేయు ఆవులపాల యందు లభించును. అవి దేశవాళి ఆవుల పాల యందు అధికంగా పోషకాలు ఉండును.

మనుధర్మశాస్తము నందలి నియమాలు - manu dharma sastra

*  నాభిచ్చేదనకు పూర్వమే మగశిశువునకు జాతకర్మ చేయవలెను . ఆ బాలుని నోటికి మంత్రపూర్వకముగా తేనెను గాని , నేతిని గాని బంగారముతో తాకించవలెను .

 *  బాలునకు పదోవరోజు కాని , పన్నెండోవ దినమున కాని మంచి తిథి యందు , నక్షత్రము నందు , ముహూర్తము నందు నామకరణము చేయవలెను .

 *  బాలికల పేరు సుఖముగా ఉచ్చరించే విధముగా ఉండవలెను . క్రూరమైన అర్ధము లేనిదిగా , స్పష్టమైన అర్ధము కలిగినటువంటిది , మంగళకరం అయినది , దీర్ఘాక్షరం చివర ఉండునది అయి ఉండవలెను .

 *  నాలుగోవ మాసము నందు శిశువును సూర్యదర్శనార్ధనము ఇంటి నుండి బయటకి తీసుకువెళ్ళవలెను. ఆరొవ మాసము నందు అన్నప్రాశనం చేయవలెను . అటుల కుదరనిచో తమ కులాచారమును బట్టి మంగళకరదినము నందు చేయవచ్చు .

 *  చెవులు కుట్టించుట అందరికి మొదట సంవత్సరం నందు గాని మూడొవ సంవత్సరము నందుగాని చేయవలెను .

 *  ఆయువును కోరువాడు తూర్పుముఖముగా , కీర్తికోరువాడు దక్షిణముఖముగా , సంపద కోరువాడు పశ్చిమ ముఖముగా , భుజించవలెను . సత్యమును కోరువాడు ఉత్తరముఖంగా భుజించవలెను .

 *  ఆహారమును పూజించవలెను . తాను తినగా మిగిలినటువంటి ఆహారం మరియొకరికి పెట్టరాదు. మరలా దానిని భుజించకూడదు.

 *  అధికంగా ఆహారంను తినరాదు. అన్నము తినుచూ ఎచ్చటికి వెళ్ళరాదు . అధిక భోజనం ఆరోగ్యభంగమును కలిగించును. ఆయుర్దాయము తగ్గించును .

 *  తల్లివంశమునకు చెందనదియు , తండ్రి గోత్రమునకు చెందనదియు అగు కన్య వివాహమాడదగినది . కపిల వర్ణం కలిగినదియు , అధికాంగములు కలిగినదియు , రోగగ్రస్తురాలును , పరుషపదాలు మాటలాడునదియు , అధికంగా వెంట్రుకలు కలిగినదియు , వెంట్రుకలు లేనిదగు కన్యను వివాహమాడరాదు .

 *  నక్షత్రములు , వృక్షములు , నదులపేర్లు కలిగినటువంటి , పర్వతాదుల పేర్లు , సర్పాదుల పేర్లు , భయంకర నామాలు కలిగిన కన్యను వివాహామాడరాదు.

 *  శుభమును కోరిన తండ్రి , సోదరుడు , భర్త , మరిది మొదలగు వారందరిచేత స్త్రీలు గౌరవించతగి ఉన్నారు . స్త్రీలను పూజించు గృహముల యందు దేవతలు సంతోషముతో నివసిస్తారు. స్త్రీలను గౌరవించని గృహముల యందు ఎన్ని పుణ్యకార్యాలను చేసినను అవన్ని నిష్ప్రయోజనమే .

 *  శునకములకు , పాపులకు , రోగులకు , కాకులకు పరిశుద్ధమైన భూమిపై మాత్రమే భోజనం పెట్టవలెను . ముందుగా అతిథికి భోజనం పెట్టవలెను . పిమ్మట బిక్షువునకు,  బ్రహ్మచారికి పెట్టవలెను .

 *  అతిథికి భోజనం పెట్టకుండా తినరాదు. ఇంటికి వచ్చిన బంధువులకు కూడా ప్రీతితో యధాశక్తి భోజనం పెట్టి సత్కరించవలెను. కొత్తగా వివాహం అయిన స్త్రీలకు , బాలికలకు , రోగులకు , గర్భిణీ స్త్రీలకు అతిధులకంటే ముందుగానే భోజనం పెట్టవలెను .

 *  ఒకే వస్త్రముతో భోజనం చేయరాదు . వస్త్రము లేకుండా స్నానం చేయరాదు . మార్గము నందు మూత్రవిసర్జన చేయరాదు . భస్మము నందు, ఆవుల మందల యందు , పంటపొలముల యందు , నీటి యందు, ఇటుకల పైన, పర్వతము పైన , శిధిలమైన దేవాలయాల నందు , పుట్టయందు మూత్రవిసర్జన చేయరాదు . ప్రాణులు గల గోతుల యందు , నడుచుచు , నిలబడియు , నదీతీరముల యందు మూత్రవిసర్జన చేయరాదు .

 *  అగ్నిని నోటితో ఆర్పరాదు, దిగంబరంగా స్త్రీని చూడరాదు. అగ్ని యందు అశుద్ధపదార్థాన్ని వేయరాదు . నిప్పుని కాళ్లతో తన్నరాదు. సంధ్యాకాలము నందు భోజనం చేయరాదు ,  ప్రయాణించకూడదు . భూమిని కాలితో గీకరాదు,  తన మెడయందలి హారమును స్వయముగా తీయరాదు . అశుచి పదార్థమును , రక్తమును, విషములను నీటియందు కలపరాదు. పాడుబడిన గృహము నందు ఒంటరిగా నిద్రించరాదు . తనకంటే పెద్దవారిని మేల్కొలపరాదు . రజస్వల అయిన స్త్రీతో సంభాషించరాదు. మేయుచున్న ఆవును బయటకి తోలరాదు . వ్యర్థముగా కాళ్ళుచేతులు ఊపరాదు, ఇంద్రధనుస్సును చూడరాదు , వేరొకరికి చూపరాదు . దోసిట్లో నీరు తాగరాదు.తినే భక్ష్యములను తొడమీద పెట్టుకుని తినరాదు. ప్రయోజనము లేని విషయాల గురించి అతిగా ఆలోచించరాదు.

       తరవాతి పోస్టులలో మరిన్ని మనువు ఉపదేశించిన ధర్మసూత్రాలు వివరిస్తాను.

పుల్లటి త్రేపులు మరియు ఆహారం అరగకుండా ఉండు సమస్యకు అత్యంత సులభ పరిష్కారం -

  శొంఠి , మిరియాలు , వేపచెట్టు బెరడు చూర్ణం ఈ మూడింటి చూర్ణాలను సమభాగాలుగా తీసుకుని కలిపి ఒకే చూర్ణంగా చేసుకుని ఉదయాన్నే పరగడుపున 10 గ్రాముల చూర్ణాన్ని ఒక గ్లాసు మంచినీటిలో కలిపి తీసుకున్న పులిత్రేపులు ఆహారం అరగకుండా ఉండు సమస్యలు 40 రోజుల్లొ మాయం అగును.

శరీరంలో రసాదిదోషాలు ప్రకోపించిన ఏయే స్థానాలలో ఏయే వ్యాధులు కలుగునో సంపూర్ణ వివరణ - over acid in body cause these disease

శరీరంలో రసాదిదోషాలు ప్రకోపించిన ఏయే స్థానాలలో ఏయే వ్యాధులు కలుగునో సంపూర్ణ వివరణ  -

 *  రసం దోషం పొందిన కలుగు వ్యాధులు -

    అన్నం మీద ఇష్టం లేకపోవుట, రుచి తెలియకపోవటం, ఆహారం జీర్ణం కాకపోవడం , శరీరం నొప్పులు , జ్వరం, గుండెపీకుట , వాంతి వచ్చునట్లు ఉండటం, ఆహారం తినకపోయినను తినినట్లు ఉండటం , శరీరం బరువు, హృదయ సంబంధ వ్యాధులు , పాండురోగం , శరీరం కృశించటం, అవయవములు కృశించుట, అకాలంలో శరీరం ముడుతలు పడుట, అకాలం నందు జుట్టు నెరియుట వంటి వ్యాధులు కలుగును.

 *  రక్తం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  -

     కుష్టు , విసర్ప, పిడక ,మశక ,నీలిక , తిలకాలకా, నశ్చ , వ్యంగ అను చర్మవ్యాధులు ,  పేనుకొరుకుడు, ప్లీహ సంబంధ సమాస్యలు , విద్రది అను వ్రణం , గుల్మవాతం, శోణిత, క్యాన్సర్ , రక్తపిత్తం వంటి వ్యాధులు సంభంవించును.

 *  మాంసం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  -

     ఆసనము , నోరు , నాలిక పుండ్లు పడుట, మాంసం వృద్ధినొందుట, క్యాన్సర్ కణుతులు, మొలలు , కొండనాలుక వాచుట, ఇగుళ్ళు నొప్పులు , గలగండిక ( టాన్సిల్స్ ) , పెదవులు పుండ్లు పడుట, గొంతు చుట్టూ కణుతులు వచ్చుట, గొంతు వాచుట మొదలైన వ్యాధులు సంభంవించును.

 *  మేథస్సు అనగా కొవ్వు దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  -

     శరీరంపై గ్రంథులు లేచుట , అండవృద్ధి, గొంతు వ్రణాలు , క్యాన్సర్ , మధుమేహం , శరీరం లావెక్కుట , అధికమైన చెమట  మొదలయిన రోగాలు సంభంవించును.

 *  ఎముకలు దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  -

      ఎముకపై ఎముక పెరుగుట, దంతముల పై దంతము పెరుగుట, ఎముకలపై సూదులతో పొడిచినట్లు అగుట, పిప్పిగొళ్ళు మొలుచుట మెదలైనవి ఎముకలలో దోషం పొందుట వలన కలుగు వ్యాధులు .

 *  మజ్జ దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  -

        అజ్ఞానము కలుగుట, మూర్చ వచ్చుట, శరీరం తిరిగినట్లు అనిపించటం, జాయింట్లలో వాపులు , బాధ కలుగుట, కళ్ళకలక మొదలైనవి శరీరంలో మజ్జ దోషం పొందుట వలన కలుగు వ్యాధులు .

 *  శుక్రం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  -

       నపుంసకత్వం ,సంతోషం లేకపోవటం , రోగంతో ఉన్న నపుంసకునకు అల్ప ఆయుర్దాయం , వికృత రూపం కలిగిన సంతానం కలుగుట, గర్భస్రావం మెదలైనవి శరీరంలో శుక్రం దోషం పొందుట వలన కలుగును.

 *  మలము దొషం పొందట వలన కలుగు వ్యాధులు  -

       మలము వెలువరించుటకు అవరోధం కలుగుట, లేదా అధికంగా వెలువడుట, సకాలంలో విరేచనం అవ్వకపోవుట, కడుపులో వికారాలు, చర్మవ్యాదులు సంభవించుట జరుగును.

తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం - for gas trouble

తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం  -

    ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.

      వాము  250 గ్రాములు .

      జీలకర్ర  250 గ్రాములు .

      ధనియాలు  250 గ్రాములు .

         మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.

            పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.

  అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు  -

  పాటించవలసిన నియామాలు  -

      తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .

 పాటించకూడనివి  -

       కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం