Tuesday, December 26, 2023

కిడ్నీ లో రాళ్ళ సమస్య - ఆయుర్వేద నివారణ మార్గాలు - పూర్తి వివరణ:*

✍️ *కిడ్నీ లో రాళ్ళ సమస్య - ఆయుర్వేద నివారణ మార్గాలు - పూర్తి వివరణ:*

👉ఈ సమస్య సాధారణంగా 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

👉మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థాలను ఫిల్టర్ చేయడం వల్ల అవి మూత్రాన్ని సృష్టిస్తాయి.

👉 కొన్నిసార్లు, మూత్రంలో లవణాలు మరియు ఇతర ఖనిజాలు చిన్న మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి. 

👉ఇవి షుగర్ క్రిస్టల్ పరిమాణం నుండి మొదలవుతాయి.

👉అయితే అవి అడ్డంకిని కలిగించే వరకు చాలా అరుదుగా గుర్తించబడతాయి. అవి వదులుగా విరిగి, మూత్రాశయానికి దారితీసే ఇరుకైన నాళాలు, మూత్ర నాళాలలోకి నెట్టడం వలన అవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.

✍️  *కిడ్నీ రాళ్ల సమస్య లక్షణాలు:*

👉బొడ్డు, గజ్జల్లో నొప్పి,

👉బలహీనత,

👉 అలసట, 

👉 పొత్తికడుపు నొప్పి, 

👉రుచి లేకపోవడం, 

👉రక్తహీనత, 

👉మూత్ర విసర్జన సమయంలో మంట, 

👉మేఘావృతమైన లేదా దుర్వాసన తో కూడిన మూత్రం,

👉దాహం, 

👉ఛాతీ నొప్పి,

👉కుడి లేదా ఎడమ దిగువ పొత్తికడుపులో (పార్శ్వాలు) ఆకస్మిక నొప్పి వెనుక నుండి ముందుకి ప్రసరిస్తుంది,

👉మూత్రాశయం మరియు మూత్రనాళంలో నొప్పి,

👉మూత్రం తగ్గడం,

👉పసుపు లేదా ఎరుపు-పసుపు రంగు మూత్రం,

👉నీరసం,

👉వాంతులు,

👉తలనొప్పి, 

👉శరీర నొప్పి,

👉జ్వరం మరియూ చలి,

👉మూత్రం పట్టి పట్టి రావడం మొదలైనవి.

✍️  *కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణాలు:*

👉చెడు జీవనశైలి, 

👉నిద్రలేమి, 

👉బేసి ఆహారాలు, 

👉ఫాస్ట్ ఫుడ్ యొక్క అధిక వినియోగం, 

👉విటమిన్ ఎ లోపం,

👉యాంటాసిడ్ మందులు తీసుకోవడం,

👉థైరాయిడ్ వ్యాధి,

👉నిర్దిష్ట ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం.

👉గ్యాస్ట్రిక్ సర్జరీ,

👉మధుమేహం,

👉ఎముకల వ్యాధులు,

👉ఊబకాయం,

👉మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్.

👉అధికంగా మాంసం తీసుకోవడం,

👉మద్యపానం మొదలైనవి.

✍️ *కిడ్నీ రాళ్ల రకాలు:*

👉రాళ్లలో ప్రధానంగా 5 ప్రాథమిక రకాలు ఉన్నాయి.

1. కాల్షియం ఆక్సలేట్ రాయి,

2. కాల్షియం ఫాస్ఫేట్ రాయి,

3. అమ్మోనియా - అమ్మోనియం రాయి,

4. యూరిక్ యాసిడ్ - యూరిక్ యాసిడ్ రాయి

5. సిస్టీన్ - అమైనో యాసిడ్ రాయి.

👉  *కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు :-*   

ఇవి కూరగాయలు, పండ్లు మరియు గింజలతో కూడిన ఆహార ఆక్సలేట్ ద్వారా ఏర్పడతాయి. ఈ రకమైన కాలిక్యులిలో, మూత్రం ఆమ్లంగా మారుతుంది మరియు తక్కువ pH విలువను చూపుతుంది.

👉 *కాల్షియం ఫాస్ఫేట్ స్ఫటికాలు :-*

ఇవి ఆల్కలీన్ మూత్రం మరియు అధిక pH విలువను కలిగి ఉంటాయి.

👉 *యూరిక్ యాసిడ్ స్ఫటికాలు :-*

ఇవి ఆహారంలో సమృద్ధిగా ఉండే జంతు ప్రోటీన్లు, ప్యూరిన్లు, మాంసం, చేపలు మొదలైన వాటి వల్ల ఏర్పడతాయి. ఈ మూత్రంలో ఆమ్లం మరియు అధిక pH విలువ ఉంటుంది.

👉 *సిస్టీన్ స్ఫటికాలు :-*

సిస్టీన్ అనేది ప్రోటీన్ డైట్ నుండి తీసుకోబడిన నీటిలో కరిగే తెలుపు రంగు అమైనో ఆమ్లం. ఇది మూత్రపిండాలలో విడుదలైనప్పుడు, స్ఫటికాలు ఏర్పడతాయి.

👉 *స్ట్రువైట్ స్ఫటికాలు :-*  

ఇది మెగ్నీషియం అమ్మోనియం ఫాస్ఫేట్, అధిక మెగ్నీషియం ఆధారిత ఆహారం నుండి తీసుకోబడింది. ఆల్కలీన్ మూత్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా ఇవి ఏర్పడతాయి.

✍️ *స్థానాన్ని బట్టి వాటి పేర్లు మారుతాయి:*

👉నెఫ్రోలిథియాసిస్ - ఈ కాలిక్యులి మూత్రపిండాలలో కనిపిస్తాయి.

👉యురోలిథియాసిస్ - ఈ కాలిక్యులి మూత్ర వ్యవస్థ, మూత్రపిండాలు మరియు మూత్రాశయంలో ఎక్కడైనా ఉద్భవిస్తుంది.

👉యురేటెరోలిథియాసిస్ - ఈ కాలిక్యులి యురేటర్‌లో కనిపిస్తాయి.

👉సిస్టోలిథియాసిస్ - ఈ కాలిక్యులిస్ మూత్రాశయంలో కనిపిస్తాయి.

👉కాలిసియల్ కాలిక్యులి - ఈ కాలిక్యులి చిన్న లేదా పెద్ద కాలిసెస్‌లో కనిపిస్తాయి.

✍️ *మూత్రపిండాల్లో రాళ్లకు సరైన ఆహారం:*

👉పుట్టగొడుగులు, 

👉మొలకెత్తిన బీన్స్,

👉 తృణధాన్యాలు,

👉 గోధుమలు, 

👉 పచ్చి బఠానీలు, , 

👉పచ్చిమిర్చి, 

👉బొప్పాయి,

👉 మామిడి, 

👉యాపిల్, 

👉గోధుమ రవ్వ,

👉 బెంగాల్ పప్పు,

👉ద్రాక్ష,

👉పాత బియ్యం,

👉మిస్ర్తీ

👉మజ్జిగ,

👉బూడిద గుమ్మడి,

👉కొబ్బరి నీళ్లు,

👉గూస్బెర్రీ,

👉ఉష్ణోదకం (వెచ్చని నీరు) - ఆయుర్వేదం ప్రకారం, వేడినీరు వాత నుండి ఉపశమనం కలిగిస్తుంది. మరియు లోపలి శ్లేష్మ పొరను ఉపశమనం చేస్తుంది.

✍️ *కిడ్నీలో రాళ్ల సమస్యకు ఇంటి నివారణలు:*

👉1 టీస్పూన్ తులసి ఆకుల రసానికి 1 టీస్పూన్ తేనె మిక్స్ చేసి, ఉదయాన్నే తీసుకోవాలి.

👉4 టీస్పూన్ల గుర్రపు పప్పును (ఉలవలు) తీసుకుని అందులో అర లీటరు నీరు వేసి, ఈ మిశ్రమాన్ని ఐదవ వంతుకు తగ్గించే వరకు వేడి చేసి, సూప్ గా చేసి దానికి 2 టీస్పూన్ల దానిమ్మ గింజల చూర్ణం చేసి, బాగా మిక్స్ చేసి, వడపోయాలి. దీనిని రోజుకు ఒకసారి తీసుకోవాలి.

👉ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు టమోటా రసంలో చిటికెడు ఉప్పు మరియు మిరియాలపొడిని తీసుకోండి.

👉రోజూ పుచ్చకాయ రసం తీసుకోండి.

👉ఒక గ్లాసు నిమ్మరసం రోజుకు 4 సార్లు తీసుకోండి.

👉3 గ్రా గోఖ్రు (గోక్షుర) మరియు 7 గ్రా గుర్రపు పప్పు (ఉలవలు)  ను లీటరు నీటిలో 6 గంటలు నానబెట్టండి. దానిని సగం అయ్యేవరకు ఉడకబెట్టి వడపోసి ఉదయం తీసుకోవాలి.

👉2 అత్తి పండ్లను - ఒక కప్పు నీటిలో అంజీర్ వేసి ఉడకబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి.

👉ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకోండి.

👉ప్రతిరోజూ పుష్కలంగా శుద్ధి చేసిన నీరు, కొబ్బరి నీరు, బార్లీ నీరు త్రాగాలి.

అన్ని రకాల వెన్నుముక సమస్యలు (spinal disorders) - అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు:*

✍️ *అన్ని రకాల వెన్నుముక సమస్యలు (spinal disorders) - అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు:*

👉మన శరీరంలో అత్యంత ముఖ్యమైన, సున్నితమైన భాగం ఈ వెన్నుముక. దీనికి ఏ చిన్న గాయమైనా ప్రాణం విలవిల్లాడుతుంది. రోజువారీ పనులపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే, వెన్నెముక సమస్యలను వెంటనే గుర్తించలేం. సమస్య వచ్చిన తర్వాత తగ్గించలేం. అందుకే, మొదటి నుంచి మనం జాగ్రత్తగా వ్యవహరించాలి.

👉వయసుతో సంబందం లేకుండా చాలామంది మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపడుతుంటారు. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. 

👉కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్రపిండాలలో రాళ్లదాకా నడుము నొప్పికి కారణాలు చాలా ఉన్నాయి.

✍️ *నొప్పికి ముఖ్య కారణం డిస్క్(disc problem):*

👉శరీరానికి ఒక ఆకృతి రావడానికి ఉపయోగపడే వెన్నుపాములో 29 వెన్నుపూసలు ఉంటాయి. 

👉మెడ భాగంలో C1 నుంచి C7 వరకు మొత్తం ఏడు వెన్నుపూసలు, ఆ తరువాత రొమ్ము భాగంలో ఉండే పన్నెండు వెన్నుపూసలు D1 నుంచి D12. ఇక నడుము భాగంలో ఉండే వెన్నుపూసలు అయిదు. అవి L1 నుంచి L5. ఆ తరువాత కాలి ఎముకలకు ముందు ఉండే వెన్నుపూసలను S1 నుంచి S5 గా పిలుస్తారు. 

👉ప్రతి రెండు వెన్నుపూసల మధ్య మెత్తని గిన్నె లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్నే డిస్క్ (Intervertebral disc) అంటాం.

👉 దీని పై భాగం గట్టిగా ఉన్నా లోపల జెల్లీలాంటి పదార్థం ఉంటుంది. 

👉డిస్కులు వెన్నుపామును షాక్స్ నుంచి రక్షిస్తాయి. డిస్కులు జారడం వల్ల గానీ, అవి అరిగిపోవడం వల్ల గానీ నొప్పి మొదలవుతుంది. 

👉వెన్నుపూసల నుంచి బయలుదేరే నాడులన్నీ కలిసి పిరుదుల భాగంలో ఒక్క నాడిగా ఏర్పడి కాలి కింది భాగంలోకి వెళతాయి. ఈ నరాన్నే సయాటిక్ నరం అంటారు. డిస్కులో సమస్యలున్నప్పుడు ఏర్పడే ఏ నడుంనొప్పి అయినా ఈ సయాటిక్ నరం గుండా కాలిలోకి పాకుతూ వెళుతుంది. అందుకే డిస్కుల వల్ల కలిగే ఈ నడుంనొప్పిని సయాటికా (Sciatica) నొప్పి అని కూడా అంటారు.

✍️ *డిస్క్ జారడం (slipped disc):*

👉రెండు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు జారడాన్నే డిస్క్ ప్రొలాప్స్ (Disc prolapse) లేదా స్లిప్‌డ్ డిస్క్ (Slipped disc) అని గానీ అంటారు.

👉 డిస్కు జారడమంటే గిన్నె లాంటి నిర్మాణం మొత్తం పక్కకు జారిపోతుందని అనుకుంటారు. కానీ డిస్కు పై భాగంలో పగులులా ఏర్పడి లోపలున్న జెల్లీ పదార్థం బయటకు వస్తుంది. ఇది డిస్కు వెనుక ఉన్న స్పైనల్ నరంపై ఒరిగిపోతుంది. దానివల్ల నరం ఒత్తిడికి గురయి నొప్పి వస్తుంది. 

👉ఏ వెన్నుపూసల మధ్య ఉన్న డిస్కు జారిందన్న దాన్ని బట్టి దాని వల్ల కనిపించే నొప్పి లక్షణాలు కూడా వేరుగా ఉంటాయి. లక్షణాలను బట్టి ఏ డిస్కు జారివుంటుందో కూడా చెప్పవచ్చు.

👉ఉదాహరణకి L4, L5 వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు జారినప్పుడు తొడ భాగంలో పక్కవైపు నుంచి కాలు కింది వరకూ నొప్పి ఉంటుంది. నడుంనొప్పి కన్నా కాళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారిగా పక్కకు తిరగడం, బరువు ఎత్తడం, వంగడం వల్ల నొప్పి మొదలవుతుంది.

👉 ఒక్కసారిగా కూర్చున్న చోట నుంచి లేచినా డిస్కు స్లిప్ అవుతుంది. జెర్క్ ఉన్న ఏ కదలిక వల్లనైనా డిస్కు జారవచ్చు. 

👉L5, S1 మధ్య ఉన్న డిస్కు జారితే తొడ వెనుక భాగం అంటే వెనుక వైపు తొడ నుంచి కాలి పాదం వరకూ నొప్పి ఉంటుంది.

✍️ *డిస్కు అరుగుదల:*

👉డిస్కు అరిగిపోవడం ప్రారంభమైన తొలిదశలో నడుంనొప్పి అంత తీవ్రంగా ఉండదు. తరువాత ఎక్కువ అవుతుంది. ఎక్కువ సేపు కూర్చున్నా, నిల్చున్నా నొప్పి ఎక్కువ అవుతుంది. విశ్రాంతిగా ఉన్నప్పుడు తక్కువ అవుతుంది. 

👉డిస్కు అరుగుతున్నకొద్దీ సమస్య తీవ్రం అవుతుంది. డిస్కు అరిగిపోవడంతో రెండు వెన్నుపూసలు గీరుకుంటాయి. నరం ఒత్తిడికి గురవుతుంది. 

✍️ *స్పాండైలో లిస్థెసిస్ (spondylolisthesis):*

👉వయసురీత్యా కలిగే మార్పులలో వెన్నుపూసలు పక్కకు జరిగిపోవడం (స్పాండైలో లిస్థెసిస్) కూడా ఒకటి. 

👉చిన్న వయసులోనే వెన్నుపూసలు జరిగిపోయాయంటే మాత్రం ప్రమాదాలే కారణం. యాక్సిడెంట్ వల్ల వెన్నుపూసల వెనుక ఉండే లింకులో ఫ్రాక్చర్ వల్ల వెన్నుపూసలు పక్కకు జరుగుతాయి. ఇలాంటప్పుడే నడుంనొప్పి స్థిరంగా ఉంటుంది. 

👉ఇదీ సయాటికా నొప్పే. నిటారుగా ఉన్నవాళ్లు పక్కకు తిరిగినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. కింద కూర్చుని పైకి లేచేటప్పుడు కూడా నొప్పి పెరుగుతుంది. రెండు కాళ్లలోనూ నొప్పి ఉంటుంది. ఆడవాళ్లలో ఈ రకమైన నడుంనొప్పి ఎక్కువగా కనిపిస్తుంది.

✍️ *స్పైన్ ఇన్‌ఫెక్షన్(spine infection):*

👉వెన్నుపాము ఇన్‌ఫెక్షన్లలో అతి సాధారణంగా కనిపించేది క్షయ. ఎముక టిబి వల్ల కూడా కనిపించే ముఖ్య లక్షణం నడుంనొప్పే. ఎముక టిబి ఉన్నవాళ్లలోరావూతిపూట నొప్పి ఎక్కువగా ఉంటుంది. నొప్పితో పాటు జ్వరం ఉంటుంది. బరువు తగ్గిపోతారు. ఆకలి ఉండదు. చెమట ఎక్కువగా పడుతుంది. టిబి వల్ల నరాలు దెబ్బతిని కాళ్లు చచ్చుబడిపోయే అవకాశం కూడా ఉంది.

✍️ *స్పైన్ ట్యూమర్స్(spine tumors)*

👉వెన్నుపాము కింది ఎముకలో క్యాన్సర్ కణుతులు ఏర్పడినప్పుడు కూడా నడుంనొప్పి ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గుతారు. కానీ జ్వరం మాత్రం ఉండదు.

✍️ *సాగిటల్ ఇంబ్యాపూన్స్(Sagittal Imbapoons):*

👉అయిదు పదులు దాటిన తరువాత కొంతమంది మెల్లమెల్లగా ముందుకు వంగిపోతారు. వెన్నుపాము నిర్మాణంలో తేడా రావడం వల్ల పిరుదులు, తొడ భాగాల్లో నొప్పిగా ఉంటుంది. పడుకుని ఉన్నప్పుడు నొప్పి ఉండదు. వెన్నుపామును సాధారణ స్థితికి తేవడానికి కండరాలన్నీ ప్రయత్నించడం వల్ల నొప్పి మొదలవుతుంది.

👉90 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో నడుంనొప్పితో బాధపడతారు. వీరిలో 80 శాతం మందికి ఆరువారాల్లోగా నొప్పి తగ్గిపోతుంది. మిగిలిన 20 శాతం మంది మాత్రం తీవ్రమైన నడుంనొప్పితో నిత్యం బాధపడుతుంటారని అంచనా. వీరిలో 10 శాతం మందికి మాత్రం ఆపరేషన్ అవసరం అవుతుందని అమెరికా అధ్యయనాలు తెలుపుతున్నాయి. అమెరికాలాంటి దేశంలోనే గణాంకాలు ఇలా ఉంటే ఇక మన ఇండియాలాంటి దేశంలో ఈ సమస్య మరింత ఎక్కువనే చెప్పాలి.

✍️ఇతర కారణాలు:

👉కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి ఉన్నప్పటికీ దానికి వెన్నుపాముతో ఎటువంటి సంబంధం ఉండదు. అలాగని అశ్రద్ధ చేయడం పనికిరాదు. ఇలాంటప్పుడు ఇతరత్రా సమస్యలేవైనా ఉండవచ్చు. అయితే నొప్పి లక్షణాన్ని బట్టి అది ఏ అవయవానికి సంబంధించిన సమస్యో కొంతవరకు నిర్ధారించవచ్చు.

👉కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు కూడా నడుంనొప్పి ఉంటుంది. అయితే ఇది అలా వచ్చి ఇలా పోతుంది. వచ్చినప్పుడల్లా పది నుంచి 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. నొప్పితో పాటు మూత్రంలో మంట ఉంటుంది. నొప్పి ఒకేచోట ఉంటుంది. కాళ్లలోకి పాకదు. ఒక్కోసారి కిడ్నీలో నీళ్లు నిండిపోయినప్పుడు (హైవూడోనెవూఫోసిస్) కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. దీంతోపాటు మూత్రం తక్కువ లేదా ఎక్కువ సార్లు రావడం, ఇతరత్రా మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఉంటాయి.

👉వెన్నెముక కాకుండా కేవలం కండరాలకు సంబంధించిన నొప్పే అయితే గనుక ఆ కండరాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది. ఆ కండరం ఒత్తిడికి గురయ్యేలా బరువు ఎత్తినా, పక్కకు తిరిగినా నొప్పి ఉంటుంది.

👉పాంక్రియోటైటిస్ లాంటి జీర్ణవ్యవస్థ సంబంధమైన సమస్యలున్నప్పుడు బొడ్డు నుంచి వెనక్కి నొప్పి వ్యాపిస్తుంది.

👉గర్భాశయం, ఓవరీలలో సమస్యలున్నప్పుడు పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ (పిఐడి) సమస్య వల్ల పిరుదుల భాగంలో నొప్పి, బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ నొప్పితో పాటు రుతు సంబంధ సమస్యలుంటాయి..

✍️ *వెన్నుముక సమస్యలకు ఆయుర్వేద గృహ చిట్కాలు:*

👉ఆయుర్వేద రస శాస్త్రంలో గుగ్గులుతో కూడిన మూలికా మిశ్రమాలతో కలిగిన ఔషధాలు ఉన్నాయి. ఇందులో కాంచన, త్రిఫల, త్రయోదశాంగ, కైశోర, నవక, పంచతిక్త, అమృతాది, గోక్షురాది, మహారాజ, సింహనాద, రాన్సాది గుగ్గులు ఉన్నాయి. ఇవి కీళ్లవాతం, సంధివాతం, వెన్నుముక సమస్యలు, చర్మరోగాలు, కొలెస్ట్రాల్‌ తగ్గిస్తాయి. 

👉ఆయుర్వేద ఔషధ మూలికల్లో శొంఠిపొడి, నల్లనువ్వులు, ఆముదం చెట్టు బెరడు, గింజలు, వేర్లు, కరక్కాయ, తిప్పతీగ, నల్లేరు, పారిజాతం మొక్క, మెంతాకు, రావి చెక్క, వావిలి, మునగాకు ముఖ్యమైనవి. నియామానుసారం ఆహార, విహార, రుతు నియమాలు పాటిస్తే అనారోగ్యం దరిచేరకుండా చూసుకోవచ్చు

👉ప్రభావవంతమైన మార్గాలలో నొప్పి లేదా ఉద్రిక్తమైన కండరాలను సున్నితంగా మసాజ్ చేయడం మంచిది.

👉నడుము నొప్పితో బాధపడేవారికి వ్యాయామాలు మంచివి. కండరాలను పునరుద్ధరించడంలో సహాయపదుతుంది మరియు తదుపరి నొప్పి నుండి మిమ్మల్ని రక్షించవచ్చు. కొన్ని వ్యాయామాలు (మైదానంలో నడవడం, నిలబడి వంగిగడం ,కోబ్రా భంగిమ మొదలైనవి) లక్షణాలను తగ్గించగలవు. 

👉వెన్నునొప్పిని తగ్గించడానికి వేడి మరియు శీతల కాపడాలు మంచి మార్గాలు . గాయం అయిన వెంటనే, స్ట్రెయిన్ వంటి వాటిని ఉపయోగించినప్పుడు ఐస్ ప్యాక్‌లు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. టవల్‌లో చుట్టిన ఐస్ ప్యాక్‌ను నేరుగా నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టడం వల్ల మంట తగ్గుతుంది. హీటింగ్ ప్యాడ్ గట్టి లేదా బాధాకరమైన కండరాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఏదైనా హీటింగ్ ప్యాడ్‌లోని సూచనలను చదివి, అనుసరించాలి మరియు అది చాలా వేడిగా లేదని నిర్ధారించుకోవడానికి ఉష్ణోగ్రతను పూర్తిగా పరీక్షించాలి.

పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన శాశ్వత పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.

Sunday, December 24, 2023

నేల ఉశిరిక చెట్టు గురించి సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు .

నేల ఉశిరిక చెట్టు గురించి సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు .

   నేల ఉశిరిక చెట్టును సంస్కృతంలో భూమ్యామలి , తమాలి , తాలి , తమాలికా , ఉచ్చట అని పిలుస్తారు . ఆంగ్లము నందు Phyllanthus Amarus అని పిలుస్తారు . దీనిలో చాలారకాలు ఉన్నాయి . మనం ఔషధాల కొరకు ఉపయోగించునది సన్నని తెలుపుగల జీలగ ఆకుల వంటి ఆకులు , ఆకుల కింద సన్నని గట్టి కాయలు గల దానిని కొందరు , పొడవుగా కొంచం నలుపు రంగుగా ఉండు ఆకులు కలిగి , ఆకుల కింద కాయలు గల దానిని కొందరు వాడుదురు. రెండింటిలో జీలగ ఆకుల వంటి కురచ ఆకులది శ్రేష్టము. ఈ మొక్కలో సర్వాంగములు ఔషధోపయోగమే . ఇది ఎల్లప్పుడూ విరివిగా దొరుకును . దీనిలో ఎరుపు , తెలుపు కాడలు కలిగినవి కూడా ఉండును. ఎరుపు కాడ కలిగినదానిని రసవాదం నందు ఉపాయోగిస్తారు. తెల్ల కాడ కలిగిన దానితో సత్తు , వంగము , తాళకం వంటి లోహాలను భస్మం చేయుటకు ఉపయోగిస్తారు .

 ఔషధోపయోగములు -

 * రక్తప్రదరం అనగా స్త్రీలలో అధిక రక్తస్రావం కావడం . ఈ సమస్య ఉన్నవారు నేల ఉశిరిక గింజలను బియ్యపు కడుగుతో నూరి రెండు లేక మూడు దినములు సేవించిన రక్తప్రదరం తగ్గును. వేడి చేసే వస్తువులు తినకూడదు.

 * వరసగా వచ్చు ఎక్కిళ్లు నివారణ కొరకు నేల ఉశిరిక చూర్ణమును పంచదారతో కలిపి తినినను లేక నేల ఉశిరిక రసమును రసం ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా లోపలికి నశ్యము చేసినను ఎక్కిళ్లు ఆగిపోవును .

 * కంటి సమస్యలతో ఇబ్బంది పడువారు నేల ఉశిరిక , సైన్ధవ లవణం రాగిరేకు యందు కాంజీకంతో నూరి నేత్రముల చుట్టూ పట్టువేసిన నేత్ర బాధలు అన్నియు శమించును . ఈ కాంజీకం ఆయుర్వేద దుకాణాల్లో లభ్యం అగును.

 * వ్రణాలతో ఇబ్బంది పడువారు నేల ఉశిరిక రసంలో పసుపు చూర్ణం కలిపి పుండ్లపైన రాయుచున్న అవి మాడిపోవును.

 * స్త్రీలకు ఋతు సమయంలో వచ్చు నొప్పికి 25 గ్రాముల నేల ఉశిరిక రసములో 40 మిరియపు గింజల చూర్ణం కలిపి మూడోవ రుతుదినమున సేవించిన రుతుశూల , సరిగ్గా ఋతురక్తం జారీ కాకపోవటం వంటి సమస్యలు తగ్గును.

 * ఉబ్బుకామెర్ల సమస్యతో బాధపడువారు నేల ఉశిరిక నీడన ఎండించి చూర్ణం చేసినది లేదా నేల ఉశిరి సమూల రసం పెరుగులో కలిపి కాని గోమూత్రంలో కలిపి కాని లోపలికి ఇవ్వవలెను . రసము మోతాదు 25 గ్రాములు .

 * శరీరం పైన లేచు దద్దుర్లకు దీని ఆకును పుల్లటి మజ్జిగతో నూరి శరీరానికి పూసిన శరీరం పైన దద్దురులు నయం అగును.

 * మధుమేహంతో బాధపడువారు నేల ఉశిరి రసం , మంచి పసుపు, నేరేడు గింజల చూర్ణం కలిపి శనగ గింజలంత మాత్రలు చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున వాడుచున్న మధుమేహం అదుపులోకి వచ్చును.

 * జిగట విరేచనాలతో ఇబ్బంది పడువారు నేల ఉశిరి చూర్ణం , మెంతులు చూర్ణం కలిపి అరచెంచా చొప్పున మజ్జిగలో కలిపి తీసుకొనుచున్న జిగట విరేచనాలు తగ్గును.

 * శరీరంలో రక్తహీనత వల్ల వొళ్ళంతా తెల్లగా పాలిపోయే పాండురోగ రోగులు నేల ఉశిరి వేర్లను 10 గ్రా మోతాదుగా మెత్తగా నూరి రసం తీసి అరగ్లాసు నాటు ఆవుపాలలో కలిపి రెండుపూటలా ఆహారానికి గంట ముందు సేవిస్తుంటే క్రమంగా పాండురోగం హరించిపోయి రక్తవృద్ధి, రక్తశుద్ది జరుగును.

 
  

Tuesday, December 19, 2023

తలతిప్పు రోగం ( vertigo ) నివారణా యోగాలు -

తలతిప్పు రోగం ( vertigo ) నివారణా యోగాలు - 

  ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఇది పూర్తిగా పైత్యసంబంధ సమస్య. మన చుట్టూ ఉన్న భూమి తిరిగిపోతున్నట్టు బ్రాంతి కలుగుతుంది . కొంతమందికి పొద్దున్నే నిద్రలేవగానే ఈ సమస్య కలుగుతుంది . దీన్ని ఆంగ్లము నందు VERTIGO or DIZINESS అని పిలుస్తారు .

 నివారణా యోగాలు -

 * నిమ్మకాయ రసంలో జీలకర్ర నానబెట్టి మరలా ఎండబెట్టాలి .మరలా నానబెట్టి ఎండబెట్టాలి .ఈ విధానాన్ని ఆయుర్వేదంలో భావన చేయడం అంటారు. ఇలా 7 రోజులపాటు చేసిన తరువాత ఉదయాన్నే ఒక గ్రాము నుంచి రెండు గ్రాముల చొప్పున తినుచున్న తలతిప్పు రోగం నశించును.

 * చిన్న అల్లం ముక్క కి ఉప్పు కలిపి బుగ్గన పెట్టుకుని రసం మింగుచున్న ఈ సమస్య తీరును . ఉదయం పూట పరగడుపున చేయవలెను .

 * అల్లం రసం ఒక స్పూన్ , నిమ్మరసం ఒక స్పూన్ , తేనె ఒక స్పూన్ కలిపి ఉదయాన్నే పరగడుపున ప్రతినిత్యం సేవించుచున్న తలతిప్పు రోగం నశించును.

       పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులువుగా ఉంటే దానిని పాటించండి. ముఖ్యంగా టీ , కాఫీ పూర్తిగా నిషిద్దం.

  

దగ్గును హరించు సులభయోగాలు -

దగ్గును హరించు సులభయోగాలు -

 * పిప్పిళ్ల చూర్ణం , తేనెతో కలిపి సేవించిన దగ్గు హరించబడును.

 * తిప్పతీగ కషాయంలో పిప్పిళ్ల చూర్ణం కలిపి సేవించిన దగ్గు తగ్గును.

 * అల్లం రసంలో తేనె కలిపి సేవించుచున్న దగ్గు తగ్గును.

 * ఉదయం సమయమున అల్లం రసం బెల్లంతోను , రాత్రుల యందు త్రిఫలా చూర్ణం తేనెతోను కలిపి తీసుకొనుచున్న దగ్గులు తగ్గును.

 * లవంగాలు కాల్చి పొడిచేసి సేవించిన దగ్గు తగ్గును.

 * మిరియాల చూర్ణంను నేతితో సేవించుచున్న దగ్గు తగ్గును.

 * అరటిపండులో మిరియాల పొడి వేసి తినుచున్న దగ్గు తగ్గును.

 * నిప్పులపైన వాము వేసి ఆపొగ పీల్చుతున్న దగ్గు తగ్గును.

 * ఎందుజిల్లేడు ఆకులను చుట్టగా చుట్టి దానికి నిప్పు అంటించి ఆ పొగ లొపలికి పీల్చిన దగ్గు తగ్గును.

 * గంటకొకసారి వెల్లుల్లిపాయ రేకును తినుచున్న దగ్గు తగ్గును.

 * మోదుగు బెరడు కషాయాన్ని పూటకు పావుకప్పు చొప్పున తాగుచున్న దగ్గు తగ్గును.

    పైన చెప్పిన యోగాలలో మీకు సులువైన ఔషధ యోగాన్ని పాటించి సమస్య నుంచి బయటపడగలరు . 
  
  

ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు

ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు - 

 
 * బాలింతలకు ప్రసవించిన 8 వ దినము నుండి క్రమక్రమంగా శరీరమునకు బలము చేకూర్చు ఔషధములు , ఆహారములు వాడుట మంచిది. బాలింతలకు 12 దినములు గడుచునంత వరకు మాంసం పెట్టకూడదు. 

 * గర్భం నందు శిశువు తల్లి ఆహారం పంచుకొని పెరుగుట చేత ప్రసవవేదన అనుభవించుట చేత , ప్రసవకాలమున అధిక రక్తస్రావం జరుగుటవలన బాగా అలిసిపోవడం వలన బాలింతరాలుకు వ్యాధులు తొందరగా వచ్చును.అందుకొరకు తొందరగా బలం చేకూర్చుటకు ప్రత్యేక ఔషదాలు ఇవ్వవలెను. దశమూలారిష్టం టానిక్ గాని ద్రాక్షరిష్టం టానిక్ గాని , సౌభాగ్యశొంటి అను లేహ్యం కాని భోజనమును తరువాత వాడవలెను. దీనివలన మంచి జీర్ణశక్తి కలుగును. 

 * బాలింతలకు పథ్యమైన ఆహారాన్ని మాత్రమే ఇవ్వవలెను . దేహశ్రమ , పురుషసంపర్కం , కోపం చల్లనిపదార్ధాలు వీటిని విడిచిపెట్టవలెను. అన్నివిధముల పరిశుభ్రముగా ఉండవలెను . నెయ్యి వంటి పదార్థం కలిసిన పథ్యమైన ఆహారం మితముగా భుజించవలెను. ప్రతిదినము తలంటుస్నానం చేయవలెను . ఈ నియమాలు బాలింత శ్రద్దగా ఒక నెలరోజుల పాటు అనుసరించవలెను. 

 * బాలింతరాలు తలంటు స్నానం నందు మూడుమాసముల వరకు బలాధన్వంతర తైలం వాడుట మంచిది. దీనివలన నరములకు బలం కలుగును. 

 * స్త్రీకి గర్భధారణ నిల్చిపోయి 6 సంవత్సరములు అయిన పిదప మరలా గర్భదారణ జరిగి ప్రసవం ఏర్పడినట్లైతే ఆ శిశువుకు ఆయుర్ధాయం తక్కువ ఉండునని శుశ్రుతుడు చెప్పెను. 

 * బాగా పాతబడిన బియ్యాన్నే ఆహారముగా ఇవ్వవలెను. 

 * కందికట్టు , ధనియాలపొడి , శొంఠిపొడి , వెల్లుల్లి పాయ కారం , నువ్వులనూనె , నువ్వులపొడి , ఇంగువ , పాతబెల్లం , తాంబూలం పాత ఉశిరిక పచ్చడి , పాతనిమ్మ పచ్చడి , పొట్లకాయ , మునగకూర , బీరకాయ , కందకూర 
ఆవుపాలు , వేడినీటి స్నానం , ఎక్కువ విశ్రాంతి ఇవన్ని తప్పకుండా ఆచరించాలి . 

 * ప్రసవించిన 15 రోజుల వరకు ఒంటిపూట భొజనం చేయాలి . బొప్పాయిపండు తినవచ్చు. రొట్టె , కాఫీ పుచ్చుకోవచ్చు. కాచి గోరువెచ్చగా ఉన్న చల్లార్చిన నీటిని తాగవచ్చు . 

 * మాంసాహారం తీసుకునేవారు ఎండుచేపలు , కాల్చిన మాంసం , ఆవునెయ్యిలొ వేయించిన మాంసం , ఎండబెట్టిన మేకమాంసం , మేకమాంసానికి అల్లం , ఉప్పు , కొద్దిగా గరం మసాలా రాసి ఎండించి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఆవునెయ్యిలొ వేయించి తినవచ్చు . 

  బాలింతలు తినకూడని ఆహార పదార్దాలు -

 
 * ఎట్టి పరిస్థితులలో కొత్తబియ్యం అన్నం తినకూడదు. 

 * చద్దిఅన్నం , పలుకుగా ఉన్న అన్నం తినరాదు.

 * పచ్చి చేపలు , కొత్త చింతపండు , పులుసుకూరలు , మజ్జిగ , పెరుగు ముట్టుకోకూడదు. 

 * చల్లటి పదార్దాలు ముట్టరాదు. 

    పైన చెప్పిన నియమాలు పాటించని బాలింతలకు సూతికా వ్యాధులు సంభవిస్తాయి. ఒక్కోసారి ఈ చిన్న వ్యాధులు 13 రకాల సన్నిపాత జబ్బులుగా మారి ప్రాణాలు హరిస్తాయి 
  
  
  

40 రోజుల్లో శోభి నివారణ కొరకు అద్భుత యోగం -

40 రోజుల్లో శోభి నివారణ కొరకు అద్భుత యోగం - 

    
     పొంగించిన వెలిగారం , మంచిగంధం చూర్ణం తో కలిపి కొంచం నీళ్లతో మెత్తగా నూరి ఆ గంధాన్ని శొభి మచ్చల పైన లేపనం చేస్తూ ఉంటే శోభి హరించి ఆ మచ్చలన్నీ కేవలం 40 రోజుల్లొ చర్మంలో కలిసిపోతాయి . 

  గమనిక - 

      పొంగించిన వెలిగారం ఆయుర్వేద పచారీ షాపులలో దొరకును. 

  
  

తేలుకాటు నివారణా యోగాలు -

తేలుకాటు నివారణా యోగాలు -

 * జీలకర్ర నూరి సైన్ధవ లవణం కలిపి ఇచ్చిన తేలుకాటు బాధ తగ్గును.

 * ఉత్తరేణి ఆకు రసం తేలుకాటు పైన రుద్దిన తేలు విషం దిగును.

 * జిల్లేడు పాలల్లో నేపాళం గింజలోని పప్పు నూరి తేలుకాటు వేసిన చోట అంటించాలి. గోమూత్రం 20 మి.లీ .లో పసుపు వేసి తాగించాలి . విషం దిగును .

 * ఉత్తరేణి చెట్టు వేరు బియ్యం కడుగుతో నూరి తాగించవలెను . తేలు విషం హరించును .

 * తులసి వేరును అరగదీసి ఆ గంధాన్ని తేలు కుట్టినచోట అంటించుచున్న తేలు విషం విరుగును.

 * దాల్చినచెక్క నూనె తేలు కుట్టినచోట దూదిలో ముంచి పెట్టిన నొప్పి తగ్గును.

 * గుగ్గిలం పొడి తేలు కుట్టినచోట పెట్టి నిప్పు వేడి చూపించిన విషాన్ని లాగేస్తుంది.

 * జీలకర్ర నూరి తేలు కుట్టినచోట అంటించిన నిప్పువేడి చూపిన విషం తగ్గును.

 * కుంకుడుకాయ తడిపి దాని గుజ్జుతో తేలుకుట్టిన చోట రుద్దిన బాధ తగ్గును.

 * ఎర్ర చేమంతి పువ్వుల రసం తేలు కుట్టినచోట వేస్తే విషప్రభావం దిగును .

 * గచ్చకాయలోని పప్పు నీళ్లతో అరగదీసి ఆ గంధమును తేలు కుట్టినచోట వేసి ఒక కాటన్ బట్ట కాల్చి ఆ పొగ గంథం పూసిన చోట చూపించవలెను.ఈ విధంగా చేసిన తేలు విషం దిగును .

 * ఇంగువను నీళ్లతో అరగదీసి ఆ గంధమును తేలు కుట్టినచోట దళసరిగా పూసి గుడ్డ ముక్క కాల్చి ఆ పొగ చూపించిన విషం దిగును .

 * మోదుగ గింజలను జిల్లేడు పాలతో నూరి ఆ గంధాన్ని తేలుకుట్టినచోట పూస్తే తేలు విషం దిగును .

  

Friday, December 8, 2023

జ్వరము లక్షణాలు - నివారణా యోగాలు .

జ్వరము లక్షణాలు - నివారణా యోగాలు .

    శరీరం వణుకుట, పెదవులు , నోరు ఆరిపోవుట, నిద్రపట్టకపోవుట, తుమ్ము రాకుండా ఉండటం, తల ఇతర భాగాలు నొప్పులుగా ఉండటం, నోటికి రుచి తెలియకపోవటం , మలబద్దకం, కడుపునొప్పి, కడుపుబ్బరం, ఆవులింతలు ఇటువంటి లక్షణాలు అన్నియు వాతం వలన కలుగు జ్వర లక్షణాలు .

     బాగా వొళ్ళు కాలుట, అతిసారం, సరిగ్గా నిద్రపట్టకపొవుట, వాంతులు , నోటిలో పుండుపడుట, నోరు చేదుగా ఉండటం, మూర్చ, తాపము , దాహము , మలమూత్రాలు, కళ్లు పచ్చగా ఉండటం వంటి లక్షణాలు అన్నియు పిత్త సంబంధ జ్వర లక్షణాలు .

     శరీరం బాగా చలిగా ఉండటం, సోమరితనం, నోరు తియ్యగా ఉండటం , చర్మం పాలిపోవుట , మూత్రం తెల్లగా రావటం, శరీరం బిగుసుకుపోయినట్టు ఉండటం, పొట్ట, శరీరం బరువుగా ఉండటం , అతినిద్ర, మలము కొద్దిగా వచ్చుట, నోటిలో ఎక్కువ నీరు ఊరట, మూత్రం ఎక్కువుగా రావటం, వాంతులు , అరుచి , జీర్ణం కాకుండా ఉండటం, దగ్గు, జలుబు , కళ్లు తెల్లగా ఉండటం ఈ లక్షణాలు అన్నియు కఫ సంబంధ జ్వర లక్షణాలు .

         పైన చెప్పిన విధముగా జ్వరం వచ్చినపుడు లక్షణాన్నిబట్టి దేని సంబంధమైన జ్వరమో నిర్ణయించుకొని దానికి తగ్గ ఔషథాన్ని నిర్ణయించుకుని వాడవలెను.

 నివారణా యోగాలు -

 * తిప్పతీగ , మోడి , శొంటి మూడు సమాన బాగాలుగా తీసుకుని కషాయం చేసుకుని సేవిస్తున్న వాతజ్వరం నశించును.

 * దురదగొండి వేర్లు, పర్పాటకం, ప్రేంఖనం , నేలవేము , అడ్డసరం, కటుకరోహిణి వీటి కషాయం ఎక్కువుగా చక్కర కలిపి తీసుకుంటే దాహము , రక్తపిత్తం, జ్వరం, తాపం నివారిస్తాయి.

 * పర్పాటకం , చందనం,వట్టివేళ్ళు , ధనియాలు వీటి కషాయం తీసుకుంటే పైత్య జ్వరం వెంటనే నివారణ అగును.

 * వాము , వస, శొంటి, పిప్పళ్లు , నల్ల జీలకర్ర సమాన చూర్ణాలను తీసుకుని కలిపి కొంచం నీరు కలిపి శరీరానికి మర్దన చేయుచున్న టైఫాయిడ్ జ్వరములో వచ్చు శరీరపు మంటలు తగ్గును.

 * బెత్తెడు వేపచెక్క దంచి గ్లాసున్నర నీటిలో వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు లోపలికి ఇచ్చి పడుకోపెట్టి లొపలికి గాలి చొరబడకుండా నిండగా దుప్పట్లు కప్పవలెను. లోపల అంత చెమట పట్టి జ్వరం తగ్గును. ఈ విధముగా మూడుపూటలా చేయుచున్న అన్నిరకాల జ్వరాలు నశించును.

 * నిమ్మకాయ రసంలో పంచదార కలిపి తాగించుచున్న జ్వరం వల్ల వచ్చు తాపం తగ్గును.

 * కృష్ణ తులసి ఆకులు 50 గ్రాములు , మిరియాలు 10 గ్రాములు రెండూ కలిపి నూరి బటాణిగింజ అంత మాత్రలు చేసి పూటకి ఒక మాత్ర చొప్పున ఇచ్చి వేడి నీరు తాగించవలెను . చలిజ్వరం నందు పూటకి రెండు మాత్రలు చొప్పున ఇవ్వవలెను. దీనివలన సాధారణ జ్వరములు, మలేరియా జ్వరములు కూడా నశించును.

 * గుంటగలగరాకు జ్వరం ఉన్నవారు కొంచం కొంచం నమిలి మింగుచున్న జ్వరం తగ్గును.

 * రావిచెట్టు ఆకులు 5 , మారేడు ఆకులు 15 , తులసి ఆకులు 45 ఈ వస్తువులను మెత్తగా నూరి అర లీటరు నీళ్లలో కలిపి కషాయం కాచి పావులీటరులో సగం వచ్చేంత వరకు మరిగించి దింపి వడపోసుకొని ఉంచుకుని గంట గంటకు 10ml చొప్పున తాగించుచున్న రెండు రోజుల్లొ టైఫాయిడ్ జ్వరం నశించును.

 * గుంటగలగర చిగుళ్లు 7 , మిరియాలు 7 కలిపి నూరి ఒక్క మోతాదుగా రోజూ రెండుపూటలా ఇచ్చుచుండిన యెడల చలిజ్వరం తగ్గును.

 * 5 తులసి ఆకులు , 5 మిరియపు గింజలు కలిపి నూరి 60ml నీరు , 15ml తేనె కలిపి భోజనానికి గంట ముందుగా ఉదయం , సాయంత్రం కలిపి ఇచ్చుచుండిన టైఫాయిడ్ జ్వరం తగ్గాక వచ్చు బలహీనత నివారించబడును.

 * వరిపేలాలు చూర్ణం చేసి కషాయం పెట్టి ఆ కషాయంలో కొంచం పటికబెల్లం పొడి కలిపి తాగించున్న పైత్యం వలన వచ్చు జ్వరం తగ్గును.

 * గోధుమల కషాయం లో పటికబెల్లం పొడి కలిపి తాగించుచున్న పైత్యజ్వరం నశించును.

      జ్వరం తగ్గుటకు పథ్యం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. సరైన పథ్యమును పాటిస్తూ ఔషధాలను తీసుకొనుచున్న ఎటువంటి జ్వరం అయినా నశించును.

  

Monday, December 4, 2023

వ్యాధుల చికిత్సలో ఉపయోగించవలసిన పచ్చి కూరగాయల రసాలు -

వ్యాధుల చికిత్సలో ఉపయోగించవలసిన పచ్చి కూరగాయల రసాలు - 

 ప్రియమితృలకు నమస్కారం ,

      ఇప్పుడు నేను చెప్పబోయే పచ్చికూరగాయలు మరియు ఆకుకూరల పచ్చి రసాలు మీరు వ్యాధి నివారణ కొరకు తీసుకునే ఔషదాలు కు అనుబంధంగా తీసుకుంటూ ఉంటే మరింత తొందరగా మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. 

 * ఉబ్బసం , తీవ్ర జ్వరాల కొరకు - 

      పచ్చి క్యారెట్ , తొటకూర , కూరాకు ( endive ) రసాలను కలిపి తీసుకొనిన చాలా బాగా పనిచేస్తుంది .

 * మొటిమలు మరియు కాలిన బొబ్బలకు - 

        క్యారెట్ మరియు బీట్ రూటు రసాలను కలిపి వాడవలెను. ( పచ్చిరసం మాత్రమే ).

 * గాస్ట్రిక్ సమస్య కొరకు - 

        తోటకూర మరియు క్యారెట్ పచ్చిరసాలను రెండు పూటలా రెండు గ్లాసుల 
మోతాదుగా తాగవలెను .

 * గొంతు మీద వచ్చు కాయ ( goiter) కొరకు 

         క్యారెట్ మరియు వాటర్ క్రెస్ రసములను వాడవలెను .

 * గుండె సమస్యల కొరకు - 

         క్యారెట్ మరియు బీట్ రూట్ రసమును వాడవలెను.

 * మూలవ్యాది కొరకు - 

         క్యారెట్ మరియు కొత్తిమీర ఆకు కూర రసంని తాగించవలెను . 

 * అజీర్ణ వ్యాధి కొరకు - 

         క్యారెట్ మరియు తోటకూర రసం తాగవలెను .

 * ఎక్కువుగా ఉన్న రక్తపోటు కొరకు - 

         తోటకూర మరియు బీట్రూట్ మరియు క్యారెట్ రసంని వాడవలెను .

 * నిద్రసరిగ్గా పట్టనందుకు - 

          పడుకునే ముందు తోటకూర రసంని తాగవలెను .

 * మూత్రపిండాల బాధల కొరకు - 

           క్యారెట్ మరియు parsly అని కొత్తిమీర వంటి ఆకురసం తాగవలెను . జలోదరం అనగా పొట్ట నిండా నీరు చేరు రోగం కు కూడా ఇదే రసాల్ని వాడవలెను .

 * కాలేయ సమస్యల కొరకు - 

        క్యారెట్ , బీట్ రూట్ మరియు దోసకాయ   
రసాలని వాడవలెను .గాల్ బ్లాడర్ సమస్యలకు కూడా ఈ రసాలని తాగవలెను .

 * నరాల బాధల కొరకు - 

        తోటకూర మరియు లెట్యూస్ పచ్చి రసాలని తాగవలెను .

 * అధిక బరువు తగ్గించుట కొరకు - 

        తోటకూర , క్యారెట్ మరియు క్యాబేజ్ రసాలని తాగవలెను .

 * హృదయంకి నల్ల రక్తం తీసుకుని పోవు సిరలని బాగు చేయుట కొరకు - 

          క్యారెట్ , బీట్ రూట్ మరియు తోటకూర రసంలని తాగవలెను .

 * క్షయ వ్యాధి నివారణ కొరకు - 

          పచ్చి బంగాళా దుంపలు రసం పిండి ఒక గిన్నెలొ పోసి దానిలో పిండిపదార్థాలు అడుగుకు పేరుకొనునట్లు చేసి పైన రసముని ఒక గ్లాసుడు , అంతే పరిమాణంలో మరొక గ్లాసుడు బీట్రూట్ రసంని కలిపి దానిలో ఒక చెంచాడు ( tea spoon ) ఆలివ్ ఆయిల్ చేర్చి నురుగు వచ్చేవరకు చిలికి ఆ రసంని రోజుకి రెండు మూడు సార్లు ఇచ్చుచుండవలెను .

 * అల్సర్ , పెద్ద పేగుల్లో వాపు ( colitis) సమస్య నివారణ కొరకు - 

       క్యారెట్ లేదా క్యాబిజి రసం తీసికొనవలెను 

 * సిరలకు సంబందించిన వ్యాధి కొరకు - 

        క్యారెట్ , స్పినాచ్ మరియు turnip tops రసమును తీసుకొనుచుండవలెను .

 * ఎడినోయిడ్స్ , టాన్సిల్స్ వ్యాధుల కొరకు 

         టమోటా మరియు బీట్రూట్ రసాలు లేక క్యారెట్ మరియు బీట్రూట్ రసాలు కలిపి తాగవలెను .

 * రక్తహీనత కొరకు - 

          క్యారెట్ మరియు తోటకూర మరియు పాలకూర లేక క్యారెట్ మరియు బీట్రూట్ రసాలని కలిపి తాగవలెను .

 * సంధివాతం - 

          తోటకూర మరియు క్యారెట్ రసాలు తాగవలెను . 

 * ఉబ్బసం , రొమ్ము పడిశం , జలుబు నివారణ కొరకు - 

      ఒక ఔన్స్ ముల్లంగి తురుము , ఒక ఔన్సు నిమ్మరసం తో కలిపి రోజుకి రెండు సార్లు అరచెంచా చొప్పున తీసుకుంటూ క్యారెట్ , ముల్లంగి రసాలు తీసుకోవాలి . 

        మీగడ, ఐస్క్రీమ్ , గుడ్లు, పిండిపదార్థాలు చక్కెర బుజించరాదు . 

 * కాన్సర్ , శరీరం పైన కలిగెడి కాయలు , ఉబ్బు , వాపులు , శరీరంలో నీరు చేరుట , ఉపిరితుత్తులలో సమస్యల కొరకు - 

      క్యారెట్ , లెట్యుస్ , తోటకూర రసాలను సేవించాలి . 

 * రక్తప్రవాహంలోని దోషాల కొరకు - 

      క్యారెట్ , బీట్రూట్ రసాలను కలిపి సేవించాలి . 

 * మలబద్దకం సమస్య నివారణ కొరకు - 

        క్యాబేజి , తోటకూర , పాలకూర రసాలు కలిపి కాని లేక తోటకూర రసంని నిమ్మరసం కలిపికాని సేవించవలెను . 

 * మధుమేహము కొరకు - 

        తోటకూర , క్యారెట్ , తీగ చిక్కుడు రసాలని సేవించాలి . 

 * చర్మవ్యాధులు కొరకు - 

         క్యారెట్ , బీట్రూట్, తోటకూర రసాలని కలిపి సేవించాలి . 

 * కంటిజబ్బులు - 

         క్యారెట్ మరియు parsly అనగా కొత్తిమీర వలే ఉండు ఆకుకూర రసాలని సేవించవలెను . 

 * మూత్రావయవాలలో రాళ్లు , పిత్తాశయంలో రాళ్లు కరుగుట కొరకు - 

       క్యారెట్ , బీట్రూట్ , దోసకాయ రసాలను సేవించవలెను . 

 గమనిక - 

           పైన చెప్పిన సమస్యలకు ఔషదాలు వాడుకుంటూ పచ్చి కూరగాయలు , ఆకు కూరల రసాలని సేవించాలి . ఫలితం తొందరగా వస్తుంది.

            మంచి ఫలితాలు పొందవలెను అనుకుంటే రోజుకి కనీసం 180ml రసాన్ని లొపలికి తీసుకోవాలి . శీఘ్రంగా ఫలితం రావాలి అనుకునే వారు రోజుకి రెండు లేదా మూడుసార్లు సేవించవచ్చు . అయితే బీట్రూట్ రసం , parsly రసం మరియు water kres రసములను మరియు మితముగా తీసికొనవలెను . 6 ఔన్సుల మించి వాడరాదు. పైన చెప్పిన రసాల్లో ఏవైనా ఎక్కువ తీసుకోవాలి అంటే 180 ml వరకు తీసుకోవచ్చు . ఎక్కువ మోతాదులో తీసుకోవలసిన అవసరం వస్తే క్యారెట్ రసం గాని , తొటకూర రసంతో గాని తీసుకోవలెను . 

  
   

Tuesday, November 28, 2023

ఉత్తరేణి చెట్టు ఔషధ ఉపయోగాలు -

ఉత్తరేణి చెట్టు ఔషధ ఉపయోగాలు -

   ఉత్తరేణి చెట్టుని "అపామార్గ" అని పిలుస్తారు . తెలుగులో " దుచ్చెన చెట్టు " అని మరొక పేరు . ఆయుర్వేద వైద్యంలో ఈ చెట్టుకు ప్రముఖస్థానం ఉన్నది. ఈ చెట్టు గురించి దీని ఔషధ ఉపయోగాలు గురించి మీకు సంపూర్ణంగా వివరిస్తాను.

 * ఈ చెట్టు సమూల రసం కాని కషాయం చేదుగా మరియు వెగటుగా ఉండును.

 * శరీరంలోని త్రిదోషాలను పోగొట్టును .

 * ఉత్తరేణి చెట్టు విత్తులను పాలతో వండి పాయసంలా చేసుకుని తినుచున్న పరిణామ శూలని పొగొట్టును. పరిణామశూల అనగా ఆహారం తీసుకొనిన తరువాత జీర్ణం అయ్యే సమయంలో కలుగు నొప్పి.

 * ఈ చెట్టు సమూలం తీసికొనివచ్చి నీడలో ఎండించి భస్మం చేసి ఆ భస్మమును 3 గ్రాముల చొప్పున నీటిలో కలిపి తీసుకొనుచున్న అజీర్ణం వలన వచ్చే నొప్పి తగ్గును.

 * ఉత్తరేణి చెట్టు సమూల భస్మం గంజితో కాని , శొంఠి కషాయంతో కాని ఇచ్చిన శరీరపు ఉబ్బు మరియు ఉదర రోగం నివారణ అగును.

 * దీని విత్తనాలను నీళ్లతో నూరి కాని , చూర్ణం చేసి నీళ్లతో ఇచ్చిన వెర్రికుక్క విషపు సంధి (Hydrophobia ) తగ్గును. దీని పూతవెన్నులను కొద్దిగా పంచదార వేసి నూరి మాత్రలుగా చేసి వెర్రికుక్క కరిచిన వానికి ఇచ్చిన విషం హరించును 
పూటకు గచ్చకాయ మోతాదులో రోజుకు రెండుపూటలా 3 నుంచి 4 దినములు ఇవ్వవలెను.

 * ఉత్తరేణి చెట్టు ఆకులను కాని పూత వెన్నులను నూరి తేలు కుట్టినచోట దళసరిగా పట్టించిన బాధ మరియు మంట తగ్గును. పాము కరిచిన చోట పట్టించిన దాని విషం హరించును . జెర్రీ కుట్టినచోట పట్టించిన మంట నివారణ అగును.

 * ఉత్తరేణి చెట్టు సమూల భస్మం తేనెతో కలిపి ఇచ్చిన దగ్గులు , ఉబ్బసం హరించును . మోతాదు 2 గ్రాములు . రోజుకు రెండుపూటలా ఇవ్వవలెను.

 * ఉత్తరేణి చెట్టు సమూల భస్మంలో హరిదళం వేసి నూరి నూనె కలిపి పూసిన వ్రణములు , పులిపిరికాయలు హరించును .

 * ఉత్తరేణి చెట్టు సమూల భస్మం నువ్వులనూనె లో కలిపి ఉదయం , సాయంత్రం 2 చుక్కలు చెవుల్లో వేసిన కర్ణరోగములు మానును .

 * ఉత్తరేణి చెట్టు సమూల రసంలో దూది తడిపి పుప్పిపంటిలో పెట్టిన పుప్పి పన్ను వల్ల వచ్చు నొప్పి మానును .

 * ఉత్తరేణి చెట్టు విత్తనాలు గాని ఆకు గాని నూరి కట్టిన శరీరం పైన లేచు గడ్డల మంట , పక్క నొప్పి ( Pleurodynia ) నివారణ అగును.

 * ఉత్తరేణి ఆకుల రసం లోపలికి ఇచ్చిన సర్పవిషం హరించును .

 * ఉబ్బసం దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను నిప్పులపైన వేసి ఆ పొగ పీల్చిన దగ్గు, ఆయాసం తగ్గును.

 * ఉత్తరేణి ఆకు నీడన ఎండించిన చూర్ణం పుచ్చుకొనిన రక్తగ్రహణి తగ్గును.

 * ఉత్తరేణి చెట్టు పచ్చి ఆకులలో కొద్దిగా మిరియాలు , కొద్దిగా వెల్లుల్లిపాయలు చేర్చి నూరి గచ్చకాయ అంత సైజు మాత్రలు చేసి చలిజ్వరం రాక మునుపు ఇచ్చుచుండిన చలిజ్వరం , వరసగా వచ్చు జ్వరం నివారించును.

 * ఉత్తరేణి ఆకును నీటితో కలిపి నూరి వంటికి పూసిన కందిరీగలు, తేనెటీగలు మొదలయిన పురుగులు కుట్టినప్పుడు కలుగు మంట, బాధ నివారణ అగును.

 
   

చీనా పంచదార , పంచదార -

చీనా పంచదార , పంచదార - 

  * ఇది చలువ చేయును . రుచిని పుట్టించును .
 
  * వీర్య వృద్ది, బలము కలగచేయును. 
 
  * మూర్చ, సర్వ ప్రమేహములు , దాహము ,జ్వరము, వాంతి , క్షయకు , ఎక్కిల్లకు పనిచేయును. .

 * మూత్రము నందు సుద్ధవలె పడు వ్యాధిని రూపుమాపును .
 
  * ఉన్మాదము, కామెర్లు, అతిగా దాహము వేయుట, తల తిప్పుతూ సృహ తప్పడం వీటికి బాగుగా పనిచేయును . 

  * పాండు రోగమునకు మంచి మందుగా పనిచేయును .
 
  * నరుకులు, దెబ్బలు మాన్పును.
 
  * గొంతుకను, గుండెలు ( రొమ్ములు ) లొని రోగములు కు పనిచేయును .

   * ఉపిరితిత్తులకు మేలు చేయును . 

   * దీనిని ఇతర మందులతో అనుపానముగా ఇచ్చినచో వేగముగా దేహమంత వ్యాప్తి చెందును. ప్రాణమును కాపాడును.

   * కడుపులో వాతమును వెదలించును .
 
   * మంచి రక్తమును బుట్టిన్చును.

   * నరములకు, కార్జము ( లివర్ ) కు సత్తువ చేయును 
 
   * ముసలితనమును వేగముగా రాకుండా ఆపును. 
 
   * కడుపునొప్పిని తగ్గించును.

   * 20 దినములు ( సుమారు 6 తులముల ఎత్తు ) మోతాదుగా ఇచ్చిన రక్తమును శుద్ధి చెయును. 

   * దేహము నందు గట్టిపడిన దుష్ట పదార్ధ కూటమి ని కరిగించును. నీరు చెయును.

  * శరీరం కుళ్ళుని ఆపును.

          చీనా పంచదార తెల్లగా , పిండివలె ఉండును. తెల్ల పంచదార ఇసుక వలె తెల్లగా శుబ్రముగా ఉండును. చక్కీ పంచదార ఇసుక వలె ఉండును. కాని కొంచం ఎర్రగా ఉండును. 
     ఈ మూడింటి గుణం ఇంచుమించు ఒకేలా ఉండును గాని మొదటి దాని కంటే తక్కిన రెండు ఒకదాని కంటే ఒకటి తక్కువ చలువ , అదిక వేడి గలవి . పరగడుపున పొద్దున్నే పంచదార ఒట్టిగా తినినను, అధికముగా తినినను , ఆకలి మంధగించును. అజీర్ణం చెయును.

 దీనికి విరుగుళ్ళు - 
బాదం పప్పు, పచ్చిపాలు, పులుపు పదార్దములు 

 ఒట్టి పంచదార తిని నీళ్లు త్రాగరాదు. అలా త్రాగిన జలుబు, వాతము, శ్లేష్మము చెయును, జ్వరము తెచ్చును.

   

Monday, November 20, 2023

✍️మధుమేహ సమస్యకు అద్భుతమైన ఆయుర్వేద నియమాలు మరియు గృహ చిట్కాలు:

✍️మధుమేహ సమస్యకు అద్భుతమైన ఆయుర్వేద నియమాలు మరియు గృహ చిట్కాలు:

👉పంచవ్యాప్తంగా మధుమేహం విస్తరిస్తోంది. మారిన ఆధునిక జీవనశైలిలో మధుమేహుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. 

👉ఇవాళ చాలామందికి జీవితంలో ఈ వ్యాధి నియంత్రణ ఓ తప్పనిసరి అంశం అవుతోంది. 

👉వైద్య విధానంలో విప్లవాత్మకమైన ఆవిష్కరణలు జరిగినా, ఆరోగ్య రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నా, కొత్త ఔషధాల కోసం పరిశోధనలు జరుగుతున్నా, కొత్తకొత్త మందులు మార్కెట్లో అందుబాటులోకొచ్చినా, మధుమేహ నివారణ ఇప్పటికీ అసాధ్యంగానే ఉన్నదని చెప్పాలి.

👉అభివృద్ధిచెందిన దేశాలను పట్టిపీడిస్తున్న సమస్య లలో ముఖ్యమైన సమస్య మధుమేహం.

👉పాశ్చాత్య దేశాల మాట ఎలా ఉన్నా మన దేశంలో 30-40 సంవత్సరాల వయస్సువారు కూడా మధుమేహం బారిన పడుతున్నారు. 

👉ఈ వ్యాధికి నివారణ, నియంత్రణ చర్యలే ప్రధానం. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకో వడం మినహా తగ్గించే మందులు లేవు.

👉మనల్ని ఇంతలా పట్టిపీడిస్తున్న మధుమేహ వ్యాధి నియంత్రణ, నివారణ గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించాలి.

👉మధుమేహ నియంత్రణ, నివారణపై ఎన్నో పరి శోధనలు సాగుతున్నాయి. కొన్ని విజయవంతం కూడా అయ్యాయి. వీటితోపాటు ప్రత్యామ్నాయ వైద్యాల అన్వేషణ కూడా ఎంతో అవసరం అవుతుంది.

👉వ్యాధిని అదుపులో ఉంచడానికి, ఎటువంటి సమ స్యలు రాకుండా చూసుకోవడానికి సాంప్రదాయక ఔష ధులు కొన్ని విశేషంగా పనిచేస్తాయి. అవి- 

✍️మారేడు:

👉మారేడు (ఏగ్లె మార్మె లోస్) గురించి పెద్దగా పరి చయం అక్కర్లేదు. ఈ చెట్టు శివాలయాల్లో తప్పని సరిగా దర్శనమిస్తుంది. మారేడు పత్రితో శివుణ్ణి పూజించడం ప్రతీతి. మాన వాళి ఆరోగ్య పరిరక్షణ కోసం మహాదేవుడే ఈ చెట్టుని సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి.

👉మారేడు వలన మానవాళికి ఎన్నో లాభాలున్నాయి. ఆయుర్వేదంలో మారేడుకి విశిష్ట స్థానం ఉంది. దీనిని ఆయుర్వేద ఔషధాల తయారీలో విరివిగా ఉపయోగి స్తారు. 

👉మారేడు వేర్లు, ఆకులు, ఫలాలు, విత్తనాలలో ఔషధ గుణాలు అపారం. ఈ మారేడు ఆకులలో మధుమేహాన్ని నివారించే ఔషధ విలువలు ఉన్నాయి.

👉ఆకుల్ని మెత్తగా నూరుకొని ప్రతిరోజూ నీటిలో కలిపి తీసుకుంటే మధుమేహం దరికిరాదు. 

👉ఈ ఆకుల నుంచి తీసిన కషాయంలో ఒక చిటికెడు నల్లమిరియాల పొడి కలుపుకుని తాగితే ఇంకా మంచిది.

👉 రక్తహీనత, ఉబ్బసం, పచ్చకామెర్లు, అధిక రక్తపోటు నివారించే ఔషధగుణాలు మారేడులో సమృద్ధిగా ఉన్నాయి. 

👉మామూలు వ్యాధులలో కూడా మారేడు మంచి ఔషధంలా పనిచేస్తుంది.

✍️మెంతి:

👉మెంతి (ట్రిగొనెల్లా ఫొనెమ్ గ్రేకమ్) అద్భుత మైన ఔషధ ఆహారం. రోజూ ఆహారంలో తీసు కుంటే మంచిది. 

👉ప్రతి రోజూ రెండు టీ స్పూన్ల మెంతిపొడిని తీసుకుంటే మధుమేహం, కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చును. 

👉మూత్రంలో చక్కెర పోవడాన్ని మెంతి అదుపుచేస్తుంది. మధుమేహ లక్షణాల్ని తగ్గిస్తుంది. 

👉మెంతిలో కాల్షియం, ఇనుము, ఫాస్పరస్ ధాతువులతో పాటు మాంసకృత్తులు కూడా హెచ్చుమోతాదులోనే ఉంటాయి. 

👉జీర్ణ సమస్యలను తగ్గించి... శరీరంలోని విషపదార్థాలను బైటకు పంపి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

👉 కీళ్ళవ్యాధులు నయంచేస్తుంది. పలు ఆరోగ్య సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది.

✍️వెల్లుల్లి:

👉వెల్లుల్లి (అలియమ్ సాటియమ్) ఆహార పదా ర్థంగా, ఔషధంగా ఉప యోగపడుతుంది. 

👉వంటకాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా చాలా రుగ్మతలకు మందులా పని చేస్తుంది. 

👉వెల్లుల్లిలో వాతగుణాన్ని తగ్గించే తత్వం ఉంది.

👉 యాంటీ సెప్టిక్ గుణాలన్నీ వెల్లుల్లిలో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. 

👉డయాబెటిస్ వాతరోగం కాబట్టి వెల్లుల్లి తీసుకోవడం ఎంతో ప్రయోజనకారి.

👉వెల్లుల్లిలోని 'ఎల్లిసిస్' అనే పదార్థం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించేందుకు ఉపకరిస్తుంది.

👉 వెల్లుల్లి రక్తకణాలలోని కొలెస్ట్రాల్ కరిగించి రక్తప్రసరణ సజావుగా సాగడానికి ఎంతగానో సహకరిస్తుంది.

✍️నేరేడు:

👉జామూన్ (సిజిజి యం క్యుమిన్)గా పిలిచే అల్లనేరేడు వంగపండు రంగులో ఉంటుంది.

👉ఆయుర్వేదం అపర సంజీవనిగా పేర్కొనే నేరేడు జీర్ణకోశ సంబంధిత రోగాలకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. 

👉మధుమేహ రోగులు దీన్ని ఎక్కువగా వాడతారు.

👉 ఇది మన శరీరంలో ఉండే పిండి పదార్థాలు చక్కెరగా మారకుండా నియంత్రిస్తుంది. 

👉నేరేడు పండులోని గుజ్జుకంటె గింజలు అత్యుత్తమ ప్రభావాన్ని కలిగివుంటాయి.

👉ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అవి వివిధ రోగాల నుంచి మనల్ని రక్షిస్తాయి. 

👉నేరేడు గింజల పొడిని రోజూ తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.

✍️వేప:

👉ఆరోగ్యదాయకమయినటువంటి వేప (అజాడి రక్తా ఇండికా)లో అనేక ఔషధ గుణాలున్నాయి.

👉 చరిత్రకు అందని కాలంలోనే వేపలోని ఔషధీయ గుణాలను గుర్తించారు భారతీయులు. 

👉వేపచెట్టులోని ఆకులు, వేపగింజలు, బెరడు, వేర్లలో ఔషధగుణాలు సమృద్ధిగా ఉన్నాయి

👉ఔషధాల తయారీలో వేపను విరివిగా ఉపయోగిస్తారు. 

👉నూరిన వేపాకు ముద్దను తగుమోతాదులో రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెరను తగ్గించడానికి తోడ్పడుతుంది. 

👉వేపనూనెను పలు రోగాల నివారణకు వాడతారు.

👉 వేప ఉన్న చోట ఆరోగ్యానికి ఢాకా ఉండదు.

✍️ఉల్లి:

👉ఉల్లిలో ఘాటైన వాసనే కాదు, శక్తివంతమయిన ఆహార విలువలతో పాటు ఘనమైన ఔషధ గుణాలు ఉన్నాయి.

👉ఉల్లిలో హైపోగ్లైసిమిక్ (తక్కువగా చక్కెర) గుణాలు ఉన్నాయి. 

👉దీనిలోని రసాయన గుణాల గురించి ఆయుర్వేదం సంపూర్ణంగా పరీక్షించింది.

👉ఈ ఔషధ గుణాలతోపాటు కామోద్దీపన కలిగించే ధాతువులు కూడా ఉల్లిలో పుష్కలంగా ఉన్నాయి. ఇది లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.

👉శరీరంలో శక్తిని పెంచుతుంది. ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టే ఉల్లి మధుమేహ వైద్యంలో అత్యంత విలువైన ఆహారం అయింది.

✍️కాకర:

👉ఆరోగ్యాన్నిచ్చే కాకర చేదే అయినప్పటికీ ఆరో గ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

👉పూర్వకాలం నుంచి కాకరకాయను మధుమేహానికి ఔషధంగా వినియోగిస్తూనే ఉన్నారు.

👉 కాకర ఆకులను కూడా వైద్య చికిత్సలో వాడుతున్నారు.

👉మధుమేహ రోగులకు ఇది చక్కటి ఔషధి.

👉 కాకరరసంలోని హైపోగ్లైసమిక్ పదార్థం రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

👉 ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా కాపాడుతుంది.

👉శరీరానికి అవసరమయ్యే గ్లూకోజ్ను అందించే శక్తి కాకరకు ఉంది. 

👉ఉత్తరాదివారు కరేలా అని పిలుచుకునే కాకరకాయ చక్కటి ఆరోగ్యాహారం. 

👉కాకరకాయ గింజలతో రక్తంలో గ్లూకోజును తగ్గించే చారన్టిన్ అనే ఇన్సులిన్ వంటి పదార్థం ఉంది.

👉ముదురు ఆకుపచ్చరంగులో గరుకుగా ఉండే కాకర కటిక చేదుగా ఉంటుంది. దానిలో ఉన్న సహజ గుణాలు పోకుండా కాకరను తింటే దాని ఔషధ గుణాల ప్రయోజనాన్ని పూర్తిగా పొందవచ్చును. 

👉కొద్ది మోతాదులో తీసుకునే కాకరకాయ రసం వలన శారీరక శక్తి ఒనగూరుతుంది. రక్షణ వ్యవస్థ మెరుగుపడి, రోగనిరోధకశక్తి కూడా ఇనుమడిస్తుంది.

👉కాకరకాయను ఔషధ రూపంలో తీసుకోవడానికి ముందు మధుమేహ రోగులు వైద్యసలహా తీసుకోవాలి.

👉రక్తాన్ని శుద్ధిచేసే కాకరలో బి1, బి2, బి3, సి విటమిన్లతో పాటు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, జింక్, ఫాస్పరస్, మాంగనీస్ దాతువులు అధిక మోతాదులో తక్కువ క్యాలరీ లతో లభిస్తే, బీటాకెరోటిన్, కాల్షియం, పొటాషియం వంటివి రెట్టింపు మోతాదులో ఉంతాయి.

👉 రోజూ కాకర తినడం మంచిదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రక్తంలో తీపిని తగ్గించే కాకరకాయ మధుమేహ వ్యాధి గ్రస్తులకు ప్రకృతి ప్రసాదించిన వరం.

✍️ ఉసిరి:

👉ఉసిరి (టర్మినిలియా ఆఫోసినియలిస్)లో శరీరానికి కావలసిన ఆమ్లాలు, ధాతువులతోపాటు ఎంతో ముఖ్యమైన విటమిన్ 'సి' సమృద్ధంగా లభిస్తుంది. 

👉ఆయుర్వేదం అద్భుతమైన ఔషధంగా పరిగణించే ఉసిరి శరీరంలో కొత్తకణాల అభివృద్ధిలో ఎంతో ఉపయోగపడుతుందని ప్రతీతి.

👉మధుమేహం ఉన్నవారు ఉసిరిపొడిని, కొంచెం పసుపును ఉదయాన్నే పరగడుపున ఇన్సులిన్ చికిత్స ఏదీ లేకుండా తీసుకుంటే అది మధుమేహాన్ని నివారిస్తుంది. 

👉బరువు తగ్గడానికి కూడా ఇది తోడ్పడుతుంది. ఇది కొలె స్ట్రాల్ని, రక్తంలో చక్కెర నిల్వలను తగ్గిస్తుంది.

✍️పసుపు:

👉పసుపు (కర్క్యూమా లోంగా) ప్రకృతి ప్రసాదించిన సహజ ఆరోగ్య ప్రదాయని.

👉 పదార్థాల రుచిని, రంగును పెంచి, ఆరోగ్యానికి దోహదంచేసే పసుపు సర్వరోగనివారణి.

👉రక్తంలో అధికంగా ఉన్న కొవ్వు నిల్వలను, టైగ్లిజరయిడ్స్ ను తగ్గిస్తుంది. 

👉దీనిలో విశేష ఔషధగుణాల వలన రక్తప్రసరణ మెరుగవుతుంది. 

👉మధుమేహ నివారణలో, నియంత్రణలో పసుపు అత్యంత ఉపయోగకరమైన నివారక ఔషధి. 

✍️త్రిఫలచూర్ణం:

👉త్రిఫల చూర్ణం అంటే ఉసిరి, కరక్కాయ, తాని కాయల సమ్మేళనం.

👉రాత్రి పడుకోబోయే ముందు, ఉదయం లేవగానే ఒక చెంచా త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటే మొత్తం జీవనశైలిని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అది తోడ్పడుతుంది. 

👉ఇది త్రిదోషహరం. ఈ ఔషధులన్నీ మధుమేహం రాకుండా నివారించుకోవడానికి, మధు మేహం బారినపడ్డా ఎట్టి ఆరోగ్య సమస్యలూ తలెత్తకుండా చూసుకోవడానికి ఉపయోగిస్తాయి.

👉జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ వ్యాయామం, నియంత్రిక ఆహారం, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే చక్కెర వ్యాధికి చెక్ పెట్టొచ్చు. ఆనందంగా జీవించవచ్చు.

రుద్రాక్ష మాల ధరించుటకు పాటించవలసిన ముఖ్య నియమాలు -

రుద్రాక్ష మాల ధరించుటకు పాటించవలసిన ముఖ్య నియమాలు -

 * రుద్రాక్ష మాల ధరించాలనుకునేవారు పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించి ఆవుపాలతో శుద్ధిచేసి ధరించగలరు.

 * సంవత్సరానికి ఒకసారి రుద్రాక్ష అధిష్టాన దేవత పూజ చేయించి ఆ పూజలో రుద్రాక్షమాలను ఉంచి మరలా ధరించవలెను .

 * ఎల్లప్పుడూ రుద్రాక్ష మాలని ధరించువారు కనీసం సంవత్సరానికి ఒకమారు ఆ రుద్రాక్ష మాలకు " మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం " చేసినచో చాలా మంచిది .

 * రుద్రాక్ష మాలను బంగారంతో గాని వెండితో గాని చుట్టించుకొని తీసుకువచ్చి గంగాజలంతో శుభ్రపరచి , పంచామృతాలతో శుద్దిచేసి ఆయా రుద్రాక్ష యొక్క అధిష్టాన దేవత మందిరంలో ఉంచి పూజించి ధరించవలెను .

 * రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు పౌర్ణమి , త్రయోదశి , చతుర్దశి , మహాశివరాత్రి , కార్తీకమాస సోమవారముల యందు ధరించవలెను .

 * రుద్రాక్షలను రుద్రాక్ష పూజా మంత్రములతో పూజచేయకుండా ధరించిన ఫలితం ఉండదు.

 * రుద్రాక్షలు కొన్ని సంవత్సరాల పాటు మన్నికగా ఉండవలెను అనిన వాటికి ఆవునెయ్యి నెలకొకమారు రాయవలెను.

 * ప్రతినిత్యం స్నానం చేయునపుడు రుద్రాక్షమాల తీసి పక్కన పెట్టి స్నానం చేయుట మంచిది .

 * రుద్రాక్షలతో ముత్యాలు , పగడములు , స్పటికములు , శంఖాలు , తులసి పూసలు , నవరత్నాలు కలిపి ధరిస్తారు . ఇలా ధరించేప్పుడు కనీసం రుద్రాక్షలు 27 గాని , 54 గాని ఉండవలెను .

 * శివరాత్రి పర్వదినమున రుద్రాక్షలతో పూజ చేయుట చాలా శ్రేష్టం .

 రుద్రాక్ష ధారణకు శుభసమయ వేళలు -

 * మేష , కర్కాటక , తులా , మకర , కుంభ లగ్నముల యందు రుద్రాక్ష ధారణ చేయవలెను .

 * అశ్వని , మృగశిర , పునర్వసు , పుష్యమి , హస్త , స్వాతి , అనూరాధ , శ్రవణం , రేవతి నక్షత్రాలలో రుద్రాక్ష ధారణ చాలా మంచిది .

 * పంచమి , సప్తమి , దశమి , ఏకాదశి , త్రయోదశి , పౌర్ణమి తిథులలో ధరిస్తే మంచిది .

 * సోమవారం ధరిస్తే చాలా మంచిది . లేదా శనివారం కూడా ధరించగలరు . కృష్ణపక్షంలో (పౌర్ణమి తదుపరి బహుళపాడ్యమి నుండి అమావాస్య వరకు ) ధరిస్తే మంచిది .

 * కార్తీకమాసంలో ధరిస్తే చాలా మంచిది . లేదా మార్గశిర మాసంలో కూడా ధరించవచ్చు . భాద్రపద , పుష్య , శ్రావణ , అశ్వయుజ మాసంలో కూడా ధరించవచ్చు .

 * రుద్రాక్షమాల ధారణకు మహాశివరాత్రి పర్వదినం చాలా ఉత్తమం.

 రుద్రాక్షధారణ కు పాటించవలసిన నియమాలు -

 * సోమరులు అయి ఉండకూడదు. సేవా కార్యక్రమాలు యందు ఆసక్తి కలిగిఉండవలెను.

 * అపద్దాలు ఆడకూడదు . దయ, దాక్షిణ్యం , ఏకాంతం , క్షమాగుణములలో సాత్విక అభిప్రాయంతో , శాంతస్వభావులై ఉండవలెను .

 * కామ, క్రోధ, లోభ, మోహ , మద మాత్సర్యాలను వదిలిపెట్టి సంప్రదాయ బద్ధమైన విషయాలను నిందించకూడదు .

 * పాపాత్ములతో సావాసం చేయరాదు .

 * వితంతువులు రుద్రాక్ష ధారణ చేయుట మంచిది .

 * రుద్రాక్ష ధరించువారు ధూమపానం మానివేయవలెను .

 * రుద్రాక్ష ధారణ చేసినవారు వెల్లుల్లి , నీరుల్లి , మద్యమాంసాదులు మానివేయవలెను .

      

Saturday, November 18, 2023

అధిక కొలెస్ట్రాల్ (చెడు కొవ్వు) సమస్య మరియు నివారణ మార్గాలు:

✍️అధిక కొలెస్ట్రాల్ (చెడు కొవ్వు) సమస్య మరియు నివారణ మార్గాలు:

👉మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. 

👉అయితే ఎల్‌డీఎల్ ఎక్కువైతే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

👉 శ‌ర‌రీంలో ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంటే మ‌న‌కు శ‌రీరం కొన్ని సూచ‌న‌ల ద్వారా తెలియ‌జేస్తుంది. అలాగే కొన్ని ల‌క్ష‌ణాల‌ను కూడా చూపిస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

✍️లక్షణాలు:

👉శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే చ‌ర్మంపై ప‌సుపు లేదా ఎరుపు రంగులో కురుపులు వ‌స్తాయి. 

👉ముఖ్యంగా మోచేతులు, మోకాళ్లు, చేతులు, పాదాలు, ముక్కుపై ఈ కురుపులు వ‌స్తాయి. ఇవి సైజ్‌లో ఒక్కోసారి 3 ఇంచుల వ‌ర‌కు ఏర్ప‌డ‌తాయి.

👉అయితే ఈ కురుపుల‌ను చూసి చాలా మంది మొటిమ‌లు లేదా వేడి వ‌ల్ల ఏర్ప‌డిన కురుపులు కావ‌చ్చ‌ని అనుకుంటారు. కానీ అలా ఏర్ప‌డితే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌రాదు. వెంట‌నే కొలెస్ట్రాల్ టెస్ట్ (లిపిడ్ ప్రొఫైల్‌) చేయించుకోవాలి.

👉ఇక కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటే శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా ఉండ‌దు. 

👉దీంతో బీపీ పెరుగుతుంది. 

👉అలాగే శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు వ‌స్తుంటాయి. 

👉ఛాతిలో నొప్పిగా ఉంటుంది. 

👉కాళ్ళు నొప్పి మరియు తిమ్మిర్లు.

👉పాదాలు చల్లగా ఉండడం.

👉కాళ్ళు బరువుగా అనిపించడం.

👉ఎక్కువ దూరం నడవలేకపోవడం.

👉అరికాళ్ళు మంటలు.

✍️ఆచరించాల్సిన నియమాలు:

👉జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేసుకోవచ్చు. 

👉రోజూ సైక్లింగ్, నడక, ఈత లాంటి తేలికపాటి వ్యాయామాలు వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

👉 దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి, అధిక బరువు సమస్య దరిచేరదు. అంతేకాదు రక్తనాళాల్లో వాపు, తగ్గి, వాటి గోడలు మందం కాకుండా ఉంటాయి.

✍️సోయాబీన్:

👉అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు సోయాబీన్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

👉 వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, ఫైబ‌ర్ ఉంటాయి. 

👉ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. రోజూ ఒక క‌ప్పు సోయాను తిన‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

✍️అవిశ గింజలు:

👉అవిసె గింజ‌ల్లో సాల్యుబుల్ ఫైబ‌ర్‌, లిగ్న‌న్స్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. 

👉వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎల్‌డీఎల్ త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

✍️తులసి:

👉తుల‌సి ఆకుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. 

👉వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ డ‌యాబెటిక్‌, యాంటీ హైపర్ కొలెస్ట‌రొలెమియా, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు ఉంటాయి. 

👉తుల‌సి ఆకుల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో పేరుకుపోవే కొలెస్ట్రాల్ క‌రుగుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. 

👉రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గడుపునే కొన్ని తుల‌సి ఆకుల‌ను తింటున్నా లేదా తుల‌సి ఆకుల‌తో త‌యారు చేసిన డికాష‌న్ తాగుతున్నా కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది.

✍️ వెల్లుల్లి:

👉 దాని విలక్షణమైన వాసనకు మరియు అనేక రకాల ఉపయోగకరమైన ఔషధ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. 

👉అనేక వంటకాలలో ఆహారంలో సువాసన ఏజెంట్‌గా ఉపయోగించడమే కాకుండా, ఇందులో ఉండే అల్లిసిన్ అనే రసాయనం బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలను చంపుతుంది మరియు కొన్ని జీర్ణ రుగ్మతలను తగ్గిస్తుంది.

👉మరియు అన్నింటికంటే, వెల్లుల్లి అధిక స్థాయి LDL ఉన్న రోగులలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. 

👉 వెల్లుల్లి అందించే వైద్యపరమైన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రోజూ మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం మంచిది.

👉అయితే మీరు కొలెస్ట్రాల్‌కు ఇంటి నివారణగా వెల్లుల్లిపైనే పూర్తిగా ఆధారపడకూడదు. .

✍️అల్లం:

👉అల్లం కొలెస్ట్రాల్‌కు అలాగే ఇతర ఆరోగ్య సమస్యలకు సమర్థవంతమైన ఇంటి నివారణగా ఉపయోగించవచ్చు. 

👉 అల్లం రెండు విధాలుగా సీరం మరియు హెపాటిక్ కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది - 
1. శరీరంలోకి కొలెస్ట్రాల్ శోషణను బలహీనపరచడం 2. కొలెస్ట్రాల్‌ను పిత్త ఆమ్లాలుగా మార్చడాన్ని ప్రేరేపించడం. 

👉ఈ ప్రక్రియలో, అల్లం పిత్త స్రావాన్ని పెంచుతుంది, ఇది జీర్ణ సమస్యలపై సానుకూల ప్రభావాలను చూపుతుంది.

👉కొలెస్ట్రాల్‌కు ఇంటి నివారణగా అల్లం అనేక రూపాల్లో ఉపయోగించబడుతుంది.

👉 అల్లం పొడిని మీ హెర్బల్ టీలో చేర్చి ప్రతిరోజూ తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన ఎంపిక మాత్రమే కాదు, రుచికరమైనది కూడా. 

👉అల్లం ముక్కలను సూప్‌లలో కూడా బాగా చేర్చి వినియోగించవచ్చు. 

✍️ గ్రీన్ టీ:

👉కొలెస్ట్రాల్‌కు అద్భుతమైన మరియు సురక్షితమైన నివారణ గ్రీన్ టీ. 

👉అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన గ్రీన్ టీ, లిపిడ్ల స్రావాన్ని పెంచే మెకానిజం ద్వారా కొలెస్ట్రాల్ విషయంలో కూడా చాలా బాగా పని చేస్తుంది.

👉ఇంకా, గ్రీన్ టీ రక్తనాళాల సంకోచానికి కారణమయ్యే లేదా ప్రోత్సహించే ఎంజైమ్ ఉత్పత్తిని నిరోధిస్తుంది.

👉గ్రీన్ టీ కూడా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్‌లో ప్రస్థానం చేస్తుంది మరియు ఈ ప్రక్రియలో ధమనులకు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. 

👉గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం కొలెస్ట్రాల్ కోసం సమర్థవంతమైన ఇంటి నివారణ.

✍️ కారపు మిరియాలు:

👉కొమ్ము మిరియాలు లేదా పక్షి మిరియాలు వంటి ఇతర పేర్లతో కూడా పిలువబడే కారపు మిరియాలు, దాని రుచికి అలాగే ఔషధ గుణాలకు చాలా కాలంగా ప్రసిద్ధి చెందింది. 

👉కారపు మిరియాలు సాధారణంగా మసాలా వంటకాల తయారీలో ఉపయోగిస్తారు.

👉ఇవి కొలెస్ట్రాల్‌కు మూలికా ఔషధంగా పనిచేసే మూలికా సప్లిమెంట్‌గా ప్రసిద్ధి చెందింది. 

👉రక్త ప్రసరణ వ్యవస్థతో సంబంధం ఉన్న క్రమరాహిత్యాలను సరిదిద్దడంలో కారపు మిరియాలు చాలా కాలంగా ప్రసిద్ధి చెందాయి.

👉 ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రిస్తుంది మరియు కొలెస్ట్రాల్‌కు నివారణగా ప్రభావవంతంగా ఉంటుంది.

👉కారపు మిరియాలు పని చేసే విధానం ఏమిటంటే, శరీర కొవ్వును ఎక్కువసేపు ఉంచకుండా వేగంగా మరియు త్వరగా ప్రాసెసింగ్ చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. తద్వారా శరీరం కొవ్వు వినియోగాన్ని తగ్గిస్తుంది. 

👉శరీరం నుండి కొవ్వును విసర్జించే సామర్థ్యాన్ని బట్టి, కారపు మిరియాలు కొలెస్ట్రాల్‌కు సమర్థవంతమైన ఇంటి నివారణగా గుర్తించబడింది.

✍️ గుగ్గులు:

👉గుగ్గులుఅనేది భారతీయ బెడెల్లియం యొక్క సాంప్రదాయ ఆయుర్వేద పేరు.

👉ఇది చెట్టు యొక్క కాండం నుండి ఉత్పత్తి చేయబడిన గమ్(జిగురు) .

👉 గుగ్గుల్ సాంప్రదాయకంగా ఆర్థరైటిస్ నుండి స్థూలకాయం మరియు చర్మ సమస్యల వరకు వివిధ రకాల ఆరోగ్య పరిస్థితుల చికిత్సలో ఉపయోగించబడుతుంది.

👉గుగ్గుల్ ట్రైగ్లిజరైడ్స్ మరియు ఎల్‌డిఎల్‌ను తగ్గిస్తున్నట్లు కనుగొనబడింది. 

👉 గుగ్గుల్ క్యాప్సూల్స్ రూపంలో అందుబాటులో ఉంది, ఇది కొలెస్ట్రాల్‌కు వ్యతిరేకంగా సమర్థవంతమైన నివారణలుగా రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు . కానీ వైద్యుని పర్యవేక్షణలో తీసుకోవచ్చు.

✍️మెంతులు:

👉మెంతులు ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా కాలంగా సంబంధం కలిగి ఉన్నాయి. 

👉 అర టీస్పూన్ మెంతి గింజలు మరియు అర టీస్పూన్ అల్లం రెండు కప్పుల నీటిలో వేసి బాగా మరిగించి వడగట్టి గోరువెచ్చగా తీసుకోవాలి.

👉 సమర్థవంతమైన ఉపశమనం కోసం రోజుకు రెండు కప్పుల చొప్పున త్రాగవచ్చు.

✍️ ఓట్స్:

👉 కొలెస్ట్రాల్‌ ని తగ్గించడంలో మొదటి ఆయుర్వేద ప్రధాన్యతలలో ఓట్స్ ప్రధానమైనవి. 

👉వోట్మీల్ ఆరోగ్యానికి మంచిది మరియు తక్కువ కొవ్వు ఆహారంగా ఉపయోగపడుతుంది.

👉రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది. 

✍️ నట్స్:

👉కొలెస్ట్రాల్‌కు సులభమైన మరియు రుచికరమైన ఇంటి రెమెడీ రోజూ గింజలను తీసుకోవడం. 

👉గింజలు మంచివి, పోషకమైనవి, రుచికరమైనవి మరియు రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. 

👉మీరు వేరుశెనగ, హాజెల్‌నట్స్, పిస్తాపప్పులు, బాదం, వాల్‌నట్‌ వంటి అనేక రకాల గింజలను ఎంచుకోవచ్చు, ఇవన్నీ రక్త కొలెస్ట్రాల్ స్థాయిలపై ఒకే విధమైన ప్రభావాలను కలిగి ఉంటాయి.

👉కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వాటి పాత్రతో పాటు, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడంలో గింజలు కూడా పాల్గొంటాయి. 

👉 చివరికి, కరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్నవారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. 

👉 కానీ రోజువారీగా తీసుకోవాల్సిన గింజల యొక్క ఆదర్శ పరిమాణం రోజుకు సుమారు 3 ఔన్సుల వద్ద ఉంటుందని అంచనా వేయబడింది.

✍️ తేనె:

👉కొలెస్ట్రాల్ కోసం ఒక సాధారణ ఇంటి నివారణ, ఇది మీకు ఎక్కువ ఖర్చు చేయదు మరియు మీ ఉత్సాహాన్ని కూడా పెంచుతుంది. 

👉మీరు ఒక కప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ తేనెను జోడించి, మీ అధిక కొలెస్ట్రాల్ స్థాయిల కోసం అద్భుతాలు చేయగల ఒక రుచికరమైన వేడి పానీయాన్ని రూపొందించవచ్చు. 

👉తేనె అనేది అనేక రకాల వ్యాధులకు ప్రకృతి యొక్క ఉత్తమ ఔషధం మరియు మిమ్మల్ని నిరాశపరచని ఒక పరిష్కారం.
Note: షుగర్ సమస్య ఉన్నవాళ్లు ఇది వాడకూడదు.

✍️ రైస్ బ్రాన్ ఆయిల్:

👉మీరు తీసుకురావాలనుకుంటున్న ఒక జీవనశైలి మరియు ఆహారం మార్పుకు ఇది మొదటి మెట్టు.

👉కొలెస్ట్రాల్ కోసం ఆయుర్వేద నియమాలను ప్రయత్నించినప్పుడు మొదటగా రైస్ బ్రాన్ ఆయిల్ పై దృష్టి పెట్టాలి.

👉వంట యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ మంచి మూలం అని కనుగొనబడింది.

👉కొలెస్ట్రాల్‌కు మరొక ఇంటి నివారణ ఏమిటంటే రైస్ బ్రాన్ ఆయిల్‌ను కుసుమ నూనెతో కలపడం మరియు కూరగాయల నూనె లేదా మొక్కజొన్న నూనె వంటి సాధారణ వంట నూనెల కోసం బ్లెండెడ్ నూనెను భర్తీ చేయడం.

👉రెండు నూనెలను మిళితం చేసే ఈ పద్ధతి యొక్క సమర్థత మరియు సీరం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. 

✍️ ఆపిల్ మరియు వెనిగర్:

👉కొలెస్ట్రాల్‌కు ఆయుర్వేద చికిత్సగా ఆపిల్ చురుకైన పాత్రను పోషించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

✍️ కొత్తిమీర:

👉 ఆయుర్వేద చికిత్సగా కొత్తిమీర మరియు కొత్తిమీర గింజలు ఉపయోగించినప్పుడు మంచి ఫలితాన్ని చూపుతాయి.

👉రెండు టేబుల్‌స్పూన్ల గింజలను ఒక గ్లాసు నీటిలో మరిగించి, చల్లార్చి, రోజుకు రెండు లేదా మూడు సార్లు త్రాగాలి.

✍️ నీరు:

👉మానవ జాతిని పీడించే అనేక రుగ్మతలకు ఈ సరళమైన మరియు సంపూర్ణ సహజమైన పరిష్కారం నీరు. 

👉 సరైన అవయవ పనితీరు కోసం నీరు చాలా అవసరం మరియు రోజుకు 2 నుండి 3 లీటర్ల నీరు త్రాగడం వల్ల కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుతుంది.

కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.


అలెర్జీలు- ఎన్ని రకాలు- వాటికి ఆయుర్వేద నివారణ మార్గాలు:

✍️ అలెర్జీలు- ఎన్ని రకాలు- వాటికి ఆయుర్వేద నివారణ మార్గాలు:

👉ఆయుర్వేద సంప్రాప్తి (పాథోజెనిసిస్) ప్రకారం, అలర్జీలు పుప్పొడి రేణువులు, దుమ్ము, ఏదైనా బలమైన రసాయన వాసన వంటి వాటి వల్ల జరిగే ప్రతిచర్యే అలెర్జీ.

👉ఈ అలెర్జీ ప్రతిచర్యలు వాత రకం, పిత్త రకం మరియు కఫా రకంగా వర్గీకరించబడ్డాయి.

👉వాత-రకం అలెర్జీలు కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ అసౌకర్యం లేదా పేగు కోలిక్ ద్వారా వర్గీకరించబడతాయి. 

👉వాత అలెర్జీ శ్వాసలో గురక, తుమ్ములు, తలనొప్పి, చెవులు రింగింగ్ లేదా నిద్రలేమికి దారితీయవచ్చు. ఉదాహరణకు, కొంతమంది వ్యక్తులు, దుమ్ము లేదా పుప్పొడికి గురైనప్పుడు, అకస్మాత్తుగా శ్వాసలో గురక రావడం జరుగుతుంది.

👉 వాత దోషం కారణంగా శ్వాస నాళాలు కుంచించుకుపోవడం వల్ల శ్వాసలో గురక వస్తుంది. ఆ వ్యక్తి నిద్రలేమి మరియు ఇతర వాత-రకం లక్షణాలను కూడా అనుభవించవచ్చు.

👉పిత్త రకం అలెర్జీలో రసాయనాలు, ఘాటైన వాసనలు, నిర్దిష్ట సింథటిక్ ఫైబర్‌లు వంటి అలెర్జీ కారకాలతో వ్యక్తికి ఇబ్బంది కలుగుతుంది. 

👉పిత్త దోషంలో దాని వేడి మరియు పదునైన లక్షణాల కారణంగా కేశనాళికల ద్వారా చొచ్చుకొనిపోయి దద్దుర్లు, దురద, అలెర్జీ చర్మశోథ లేదా తామర లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

👉వసంత కాలంలో మొక్కలు మరియు చెట్లు తమ పుప్పొడిని వాతావరణంలోకి పంపినప్పుడు కఫా అలర్జీలు కలిగిన వ్యక్తులు తరచుగా సమస్యలను ఎదుర్కొంటారు. 

👉 మన కంటికి కూడా కనిపించని పూల పుప్పొడిని పీల్చినప్పుడు, అవి నాసికా-శ్వాసకోశ మార్గంలోకి ప్రవేశిస్తాయి మరియు కొందరిలో అవి సున్నితమైన శ్లేష్మ పొరను చికాకుపెడతాయి. తద్వారా గవత జ్వరం, జలుబు, రద్దీ, దగ్గు, సైనస్ ఇన్ఫెక్షన్, మరియు ఆస్తమా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

👉అలర్జీని సమర్థవంతంగా చికిత్స చేయడానికి, మొదట అది వాత, పిత్త లేదా కఫా రకమా అని తెలుసుకోవాలి. అప్పుడే దానిని శాశ్వతంగా పరిష్కరించవచ్చు.

✍️వాత రకం అలర్జీలకు చికిత్స:

👉బస్తీ (ఎనిమా)-
 వాత-రకం అలెర్జీలకు అత్యంత ప్రభావవంతమైన నివారణలలో ఒకటి దశమూల టీ బస్తీ (ఎనిమా). 
1 టేబుల్ స్పూన్ హెర్బల్ కాంపౌండ్ దశమూలను 1గ్లాస్ నీటిలో 5 నిమిషాలు ఉడకబెట్టి టీ తయారు చేయండి. దానిని చల్లబరచి వడకట్టండి మరియు ద్రవాన్ని ఎనిమాగా ఉపయోగించండి. 

👉గురక, తుమ్ములు, గొంతు పొడిబారడం, పెద్దప్రేగు పొడిబారడం, మలబద్ధకం మరియు ఉదర అసౌకర్యానికి దారితీసే వాత లక్షణాలను ఈ దశమూల టీ బస్తీ ద్వారా వెంటనే సరిచేయవచ్చు.

👉ఈ మూలికా సూత్రాన్ని ఉపయోగించండి:

అశ్వగంధ 1 భాగం 
బల 1 భాగం
విదారి 1 భాగం

ఈ మూలికలను సమాన నిష్పత్తిలో కలపండి మరియు 4 టీస్పూన్ల పొడిని రోజుకు 3 సార్లు గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. వాత అలెర్జీల నుండి ఉపశమనం పొందుతుంది.

👉విపరీతమైన శ్వాస సమస్యను తగ్గించడానికి, 
ఒక కప్పు అల్లం లేదా లికోరైస్ టీని తయారు చేయండి.

 1 టీస్పూన్ హెర్బ్‌ను 1 కప్పు నీటిలో సుమారు 3 నిమిషాలు ఉడకబెట్టండి. అప్పుడు 5 నుండి 10 చుక్కల మహానారాయణ నూనె వేసి, బాగా కలపండి మరియు ప్రతి 10 నుండి 15 నిమిషాలకు 1 సిప్ తీసుకోండి. (మీ దగ్గర మహానారాయణ నూనె లేకపోతే, మీరు ½ టీస్పూన్ సాదా నెయ్యిని భర్తీ చేయవచ్చు.)

✍️పిత్త-రకం అలెర్జీలకు చికిత్స:

👉మూలికా సూత్రం-

శతావరి 8 భాగాలు
కామ దుధా ½ భాగం
గుడుచి 1 భాగం
శంక భస్మ 4 భాగం

ఈ మిశ్రమాన్ని రోజుకు 2 లేదా 3 సార్లు భోజనం తర్వాత, కొద్దిగా గోరు వెచ్చని నీటితో ½ టీస్పూన్ తీసుకోండి.

👉దద్దుర్లు, దురద, చర్మశోథ లేదా తామర కోసం, చర్మంపై వేప నూనె లేదా టిక్తా ఘృత (చేదు నెయ్యి) రాయండి.

👉పిత్త దోషం వల్ల కలిగే అలెర్జీ లో రక్త శుద్ధి చాలా అవసరం. ఇందుకోసం మీరు రక్తాన్ని శుభ్రపరిచే మూలికా కలయికను ఉపయోగించవచ్చు. 

మంజిష్ఠ 1 భాగం
వేప 1 భాగం తీసుకోండి

భోజనం తర్వాత గోరువెచ్చని నీటితో రోజుకు 3 సార్లు ఈ మిశ్రమాన్ని ½ టీస్పూన్ తీసుకోండి. అది ఖచ్చితంగా రక్తాన్ని శుభ్రపరుస్తుంది.

👉పాశ్చాత్య హెర్బ్ burdock కూడా రక్త శుద్ధికి అద్భుతంగా పనిచేస్తుంది.

మీరు ఒక కప్పు వేడినీటికి ½ టీస్పూన్ బర్డాక్ వేసి టీ తయారు చేసి రోజుకు 2 లేదా 3 సార్లు త్రాగవచ్చు.

✍️కఫ-రకం అలెర్జీలకు చికిత్స:

👉 కఫా అలెర్జీలు సాధారణంగా శ్వాసకోశ-పల్మనరీ రద్దీ, దగ్గు, జలుబు, ఉబ్బసం లేదా గవత జ్వరం రూపంలో ఉంటాయి. ఈ పరిస్థితుల నుండి ఉపశమనం కోసం, కింది మూలికా సూత్రాన్ని ఉపయోగించండి:

శీతోపలాడి 4 భాగాలు
యష్టి మధు 4 భాగాలు
అబ్రక్ భస్మ భాగం

ఈ మిశ్రమాన్ని సుమారు 4 టీస్పూన్లు తేనెతో రోజుకు 3 సార్లు తీసుకోండి.

👉ప్రక్షాళన చికిత్స- (విరోచన క్రియ):

కడుపు మరియు ఊపిరితిత్తులలో అదనపు కఫా చేరినప్పుడు కఫా-రకం అలెర్జీలు సంభవిస్తాయి. ఈ రద్దీని తగ్గించడానికి ఒక మార్గం ప్రక్షాళన చికిత్స (విరోచన క్రియ). 

👉అవిసె గింజల నూనెను ఉపయోగించండి ( సహజ ఆహార దుకాణాలలో లభిస్తుంది), మరియు 1 టీస్పూన్ రోజుకి 2 లేదా 3 సార్లు... ఇలా 2 లేదా 3 రోజులు తీసుకోండి. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. లేదా మీరు త్రిఫల ఉపయోగించవచ్చు.

👉వాంతి చికిత్స- (వమన చికిత్స):

కడుపు మరియు శ్వాసకోశం నుండి అదనపు కఫాను తొలగించడానికి ప్రత్యేకంగా ప్రభావవంతమైన ఆయుర్వేద చికిత్స వమన లేదా వాంతి చికిత్స.

👉మీరు దీన్ని ప్రయత్నించాలనుకుంటే చాలా జాగ్రత్తగా వైద్యుని పర్యవేక్షణలో చేయడం మంచిది.  

లైకోరైస్ టీ మరియు ఉప్పు నీటిని కడుపు నిండా తాగడం మరియు దానిని తిరిగ వాంతి ద్వారా బయటికి తెప్పించి కడుపుని ఖాళీ చేయించాలి.

👉 అనేక కప్పుల లైకోరైస్ టీని త్రాగడం ద్వారా ప్రారంభించండి, దాని తర్వాత 1 టీస్పూన్ ఉప్పును కలిపి ఒక 250mi నీరు త్రాగండి. మీ కడుపు నింపడానికి తగినంతగా త్రాగండి, ఆపై నాలుక వెనుక భాగంలో రుద్దండి మరియు వాంతి చేయండి.

ముఖ్యమైన జాగ్రత్త: మీకు అధిక రక్తపోటు, తక్కువ రక్తపోటు, హయాటల్ హెర్నియా లేదా గుండె సమస్యల చరిత్ర ఉంటే, వమన థెరపీ చేయవద్దు.

✍️అన్ని రకాల అలెర్జీలకు వైద్యం చేసే మార్గదర్శకాలు

👉త్రిఫల ఉపయోగించండి-
మూడు రకాల అలర్జీలకు, రాత్రిపూట ½ నుండి 1 టీస్పూన్ త్రిఫల తీసుకోవచ్చు. త్రిఫల భేదిమందు మరియు ప్రక్షాళన రెండింటిలోనూ పనిచేస్తుంది. 

👉ఆహార మార్పులు-
అలెర్జీలు ఉన్న వ్యక్తులు పాలు మరియు పెరుగు, మాంసం మరియు పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ మరియు డైరీ, పుచ్చకాయ మరియు ధాన్యాలు లేదా పండ్లు మరియు ధాన్యాలు వంటి అననుకూల ఆహార కలయికలను తినకుండా ఉండటం చాలా ముఖ్యం.

👉 బనానా మిల్క్ షేక్స్ మరియు పాలతో చేసిన "ఫ్రూట్ స్మూతీస్" వంటి వాటికి దూరంగా ఉండండి. 

✍️చాలా అలెర్జీలకు, తక్షణ కారణాన్ని నివారించడానికి ప్రయత్నించాలి: 

👉అలెర్జీ కారకాలైన పిల్లులు, కుక్కల వెంట్రుకలు, పుప్పొడి, అచ్చు మొదలైన వాటికి అలెర్జీ ఉన్న వ్యక్తులు వాటికి దూరంగా వుండడానికి ప్రయత్నించాలి.

👉 సాధారణంగా, శ్వాసకోశ మార్గం దుమ్ము మరియు ఇతర అలెర్జీ కారకాలను కలిగి వున్నప్పుడు వాటి ప్రభావాన్ని తగ్గించడానికి ఒక మార్గం నెయ్యితో నాసికా శ్లేష్మ పొరను ద్రవపదార్థం చేయడం. ఇది శ్లేష్మ పొరతో అలెర్జీ కారకం యొక్క ప్రత్యక్ష సంబంధాన్ని నిరోధిస్తుంది.

👉 పర్యావరణ అలెర్జీ కారకాల ప్రభావాన్ని తగ్గించడానికి లేదా నివారించడానికి మరొక మార్గం వేప నూనెను శరీరం యొక్క బహిర్గత భాగానికి పూయడం. వేప యొక్క క్రిమిసంహారక లక్షణాలు అలెర్జీ కారకంతో సంబంధాన్ని తగ్గిస్తాయి.

గమనిక: వేప హెర్బలైజ్డ్ నూనెను ఉపయోగించండి-అంటే, నువ్వులు లేదా మరొక నూనెలో వండిన వేప ఆకుల సారం. స్వచ్ఛమైన వేప సారం చాలా బలంగా ఉంటుంది. వేపనూనె కూడా చాలా బలంగా ఉందని మరియు దురద లేదా మంటను సృష్టిస్తుందని మీకు అనిపిస్తే కొబ్బరి నూనెతో సగం కలపండి.

👉ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ధ్యానం చేయండి. చాలా అలెర్జీలు ఒత్తిడికి సంబంధించినవే. ఒత్తిడి కారణంగా, మనస్సు మరియు శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది.

✍️యోగ భంగిమలు- 

👉కఫా మరియు వాత అలెర్జీలకు అత్యంత ఉపయోగకరమైన యోగా ఆసనం సూర్య నమస్కారం.

👉పిత్త అలెర్జీల కోసం, చంద్ర నమస్కారం చేయండి.

✍️శ్వాస వ్యాయామాలు-

👉గవత జ్వరం, గురక మరియు తుమ్ములు వంటి శ్వాసకోశ అలెర్జీలకు ప్రత్యామ్నాయం నాసికా శ్వాస ప్రభావవంతంగా ఉంటుంది. 

👉భస్త్రికా (అగ్ని శ్వాస) కఫా-రకం రక్తప్రసరణ అలెర్జీలకు మంచిది.

👉 అలాగే, ఉజ్జయి ప్రాణాయామం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు అన్ని రకాల అలెర్జీలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మీ సమస్య మీకే అర్థం కానప్పుడు కొంతమంది వ్యాపారవేత్తల లాభాపేక్ష కారణంగా వాళ్ళు చెప్పే కొన్ని అసత్య తీపి ప్రకటనలకు ఆసక్తి కనపరచి దీనితో మన సమస్య పూర్తిగా పోతుంది అనుకుని ఎంత డబ్బులు అయినా ఇచ్చేస్తాము. కానీ ఇక్కడ జరిగేది కేవలం మోసం. దయచేసి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని మా విజ్ఞప్తి🙏
✍️గమనిక: 

మిత్రులు స్వయంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పైన తెలిపిన పదార్థాలు మీకు అవగాహన కలిగించడానికి తెలపడం జరిగింది. ఈ పదార్థాలను ఎంతెంత మోతాదులో కలిపి చూర్ణంగా తయారు చేయాలో కూడా ఇవ్వడం జరిగింది. స్వయంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరైనా వైద్యుని పర్యవేక్షణ లో మాత్రమే తయారుచేసుకోవడం మంచిది. పైన సూచించిన అన్ని పదార్థాలు ప్రస్తుత ఆయుర్వేద దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా చేసుకోలేకపోయినా లేదా శాశ్వత పరిష్కారం కావాలని ఎదురుచూస్తున్న మిత్రుల సౌకర్యార్థం మేమే స్వయంగా తయారుచేసి సిద్ధంగా ఉంచడం కూడా జరిగింది. కావాల్సిన మిత్రులు వాట్సప్ ద్వారా సంప్రదించండి.

వారంలో ఒకరోజు కొన్ని మార్పులు చేసుకుంటే చాలు ఆయురారోగ్యాలను వరంగా పొందవచ్చు.!*

✍️ *వారంలో ఒకరోజు కొన్ని మార్పులు చేసుకుంటే చాలు ఆయురారోగ్యాలను వరంగా పొందవచ్చు.!*

👉ఇంతకీ ఆ రోజు ఏంటి? ఎలాంటి మార్పులు చేసుకోవాలి?

👉మిగిలిన ఆరు రోజలు కూడా ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని కళ్ళలో ఒత్తులు పెట్టుకుని మరీ ఎదురుచూస్తుంటారు. అన్ని రోజులు వేచి చూసిన తరువాత వచ్చిన ఆరోజు ఒక పండుగ కంటే ఎక్కువ వేడుకగా చేసుకోవడానికి ఎన్నెన్నో ప్లాన్లు చేసుకుని మరీ వేచి చూస్తుంటారు.

👉మితిమీరిన ఆహారపు రుచులు, అదుపు లేని ఆల్కహాల్ పార్టీలు , పబ్ లు రెస్టారెంట్లలో చేసుకునే విందులు వినోదాల కోసం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి మిత్రులతో కలిసి ప్లాన్ చేసుకుని అనారోగ్యానికి రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానించే ఆ రోజే " ఆదివారం" .

👉సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుండి రోజువారీ కూలీల వరకు, పేరు మోసిన దిగ్గజ వ్యాపార వేత్తల నుండి బిక్షగాళ్ల వరకూ కూడా పేద ధనిక వ్యత్యాసాలు లేకుండా ఈ ఆదివారం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. 

👉ఆ ఒక్క రోజు చేస్తున్న తప్పిదం ఎన్నో అనారోగ్యాలకు దారి తీస్తున్నది. పిల్లల నుండి పెద్దల వరకు కూడా ఎన్నో అంతులేని జబ్బల బారిన పడి హాస్పిటల్స్ చుట్టూ క్యూలు కడుతున్నారు. అరవై ఏళ్ళలో రావాల్సిన జబ్బులు ఇరవై ఏళ్ళకే వచ్చేస్తున్నాయి. జబ్బులేని మనిషి ఎవరైనా ఉన్నారా అంటే లేరు ఆనే సమాధానం 100% వినపడుతున్నాయి.

👉ఈ ఒక్కరోజు ఈ నాలుగు పనులు చేయడం ద్వారా మీ ఆరోగ్యంతో పాటూ ఆయుష్షును కూడా పొందవచ్చు. 

✍️ *ఈ ఒక్కరోజు మీ మొబైల్ ఫోన్ ను పక్కన పెట్టేయండి.!*

👉ఈ ఫోన్ వల్ల మీకు కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువ అని మీకు తెలుసా? 

👉మొబైల్ ఫోన్లు రేడియో తరంగాల రూపంలో విద్యుదయస్కాంత వికిరణాన్ని విడుదల చేస్తాయి. ఈ రేడియేషన్‌ వల్ల మెదడు పనితీరులో మార్పులు జరిగి శారీరక మరియు మానసిక ఆరోగ్యాల పైన ప్రభావం చూపి, మన నడవడిక లో మార్పులు వచ్చి అనారోగ్యానికి దారి తీస్తుంది. 

👉దీర్ఘకాలిక మొబైల్ ఫోన్ వినియోగం మరియు కొన్ని క్యాన్సర్‌లు, ముఖ్యంగా మెదడులో కణితులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

👉నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం వల్ల నిద్రను నియంత్రించే హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. మొబైల్ ఫోన్ స్క్రీన్‌ల ద్వారా వెలువడే నీలిరంగు కాంతి నిద్రకు అంతరాయం కలిగించి సహజమైన నిద్రకు భంగం కలిగిస్తుంది. . దీనివల్ల నిద్రపోవడం కష్టం, నిద్ర నాణ్యత సరిగా ఉండదు మరియు పగటిపూట మగతగా ఉంటుంది.

👉ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మెడ మరియు వెన్నెముకపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది మెడ నొప్పి, దృఢత్వం మరియు భంగిమ సమస్యలకు దారితీస్తుంది. చిన్న స్క్రీన్‌లపై తరచుగా సందేశాలు పంపడం లేదా టైప్ చేయడం కూడా బొటనవేలు లేదా మణికట్టు సమస్యలకు కారణమవుతుంది.

👉స్మార్ట్‌ఫోన్ వ్యసనం లేదా అధిక ఫోన్ వినియోగం వంటి పరిస్థితులు ఆందోళన, నిరాశ, ఒంటరితనం కు గురవ్వడం తో పాటు రోజువారీ పనితీరులో అంతరాయానికి దారితీయవచ్చు. 

👉చాలామంది యువత మొబైల్ ఫోన్ ను ప్యాంట్ జేబులో పెట్టుకుంటుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల మగవారిలో శీఘ్ర స్ఖలనం, వీర్య కణాల లోపాలు సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

👉అధిక మొబైల్ వినియోగం వల్ల మొబైల్ ఫోన్ లో వెలువడే నీలి కిరణాలు కంటి సమస్యలను పెంచుతాయి. చూపులో తేడాలు కనిపిస్తాయి. రాను రాను కంటి చూపు తగ్గడం, సైట్ లాంటివి రావడం జరుగుతుంది.

✍️ *మీ నాలుకను అదుపులో పెట్టుకోండి.!*

👉నాలుక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకి మాట్లాడేటప్పుడు ఎంత ఆలోచించి మాట్లాడితే అంత మంచిది. అలాగే లోపలికి తీసుకునే ఆహారంలో ఎంత రుచులను తగ్గిస్తే అంత మంచిది.. ఆలోచించకుండా అధికంగా మాట్లాడే వారు సమాజంలో నవ్వుల పాలు అవుతారు. అధిక రుచులను ఆస్వాదిస్తే అనారోగ్యం పాలు అవుతారు..

👉సాధారణంగా నాలుక ఈ విశ్వం అందించే అన్ని వంటకాల కోసం ఆరాటపడుతుంది. కానీ ఆయుర్వేదం యొక్క నియమం ఏమిటంటే, మీకు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి. ముందు తిన్న ఆహారం జీర్ణం అవకుండా తదుపరి ఆహారం తీసుకోకూడదు. మీరు మీ ఆహారంలో మొత్తం ఆరు రుచులను చేర్చుకోవాలి (తీపి, ఉప్పు, పులుపు, చేదు, ఒగరు మరియు ఘాటు). కానీ నాలుక ఏమి చేస్తుంది అంటే ఒకటి లేదా రెండు అభిరుచులతో కొనసాగాలని కోరుకుంటుంది. ఆ రుచులే మనకు అనారోగ్యాన్ని తెచ్చి పెడుతాయి. మిగిలిన రుచులు మన ఆరోగ్యాన్ని చక్కబెడుతాయి కానీ వాటిని నాలుక పక్కన పెట్టేస్తుంది. 

👉హైపర్-యాక్టివ్ మైండ్ యొక్క దురాశ కారణంగా వ్యక్తి వివిధ రకాల ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాడు. జీర్ణసమస్యలను కొని తెచ్చుకొంటారు. తద్వారా ఊబకాయం, మధుమేహం లాంటి ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. 

✍️ *మీ కుటుంబంతో పాటూ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి ఒడిలో గడపండి!*

👉మొబైల్ ఫోన్ ను ఎలాగైతే పక్కన పెట్టేశామో అలాగే ఈ ఒక్క రోజు మాంసాహారం, ఆల్కహాల్, ధూమపానం ను పక్కన పెట్టేయండి. అలాగే పబ్ లు రెస్టారెంట్లకి వెళ్లి మిత్రులతో పార్టీలు చేసుకోవడం ఆపి ఈ ఒక్కరోజు కేవలం కుటుంభం తో విహారాలకు ప్లాన్ చేసుకోండి.

👉విహారాలు వెళ్ళడానికి సమయం లేకపోతే పిల్లలతో కలిసి ఇంటి పెరట్లో ఉన్న మొక్కలు నాటడం, నీళ్లు పోయడం, మొక్కల మధ్య ఉన్న కలుపు తీయడం లాంటి పనులు చేయండి.

👉మీ ఇంట్లో పనులకు పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటూ, పాడుకుంటూ మీ శ్రీమతికి సహాయంగా నిలవండి. ఇలా చేయడం వల్ల మీ శ్రీమతి తో పాటు మీ పిల్లలు కూడా చాలా సంతోషంగా వుంటారు. ఆ సంతోషానికి కారణం మీరే అవుతారు. 

👉ఆ రోజు మొత్తం కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోండి.. పిల్లలకి ప్రకృతి గురించి, ఆయుర్వేద జీవన విధానం గురించి వివరించండి. మంచి చెడుల గురించి చెప్పండి. వారి ప్రవర్తనను గమనించండి. వారితో సన్నిహితంగా ఉండండి. వారి సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుని వారి సమస్యలను తీర్చండి. ఇలా చేయడం వల్ల కుటుంభం లో ఒక మంచి వాతావరణం అలవాటు అవుతుంది.

👉పిల్లలకి ఆటలు అలవాటు చేయండి. అవసరం అయితే మీరు కూడా వాళ్ళతో కలిసి ఆడండి. పిల్లలకి సెలవు ఇచ్చిన రోజు ఒక చెట్టుని నాటడం అలవాటు చేయండి. ఇంటి చుట్టూ చెట్లను పెంచడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వారికి తెలియజేయండి.

✍️ *మన పూర్వీకుల నుండి మనకు వచ్చిన ఆయుర్వేద జీవన విధానాన్ని ఈ ఒకరోజు పాటిద్దాము!*

👉ఇది చాలా కీలకమైన బాధ్యతగా భావించాలి. ఏదో నోటికి వచ్చింది ఇక్కడ తెలపడం లేదు. ఆయుర్వేద జీవన విధానం అంటే మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఆరోగ్య సంపద. వాళ్ళు ఎన్నో తరాలుగా ప్రయోగాలు చేసి ఏది తింటే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఏవి తింటే అనారోగ్యానికి దారి తీస్తాయి అనే అంశాలతో పాటుగా వాటిని ఏ ఏ రూపాల్లో తీసుకుంటే మనకు ఉపయుక్తంగా ఉంటాయి అని వారు తిని ఆరోగ్యంగా జీవించిన తరువాత మనకి వాటిని అలవాటు చేశారు. 

👉ఆయుర్వేదం అంటే కేవలం మందులు ఇచ్చేసి పంపేది కాదు. ఆయుర్వేదం అంటే మన బ్రతుకు బండిని నడిపే జీవన వేదం. ఆచరిస్తే ఆరోగ్యంతో పాటు ఆయుష్మంతులు కూడా అవుతారు. 

👉ఈ ఒక్క రోజు సూర్యోదయానికి ముందు అనగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి.

👉 లేచిన వెంటనే మొబైల్ ఫోను కోసం వెతకడం ఆపి దేవుని రూపం చూసి చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన అయ్యాక మనస్ఫూర్తిగా కాసేపు నవ్వండి. ఇలా నవ్వడం వల్ల ఆ రోజు అంతా మీరు ఒక సంతోషకరమైన వాతావరణంలో జీవిస్తున్న భావన కలిగి ఉంటారు. 

👉మలమూత్ర విసర్జన ప్రక్రియ పూర్తి చేసి పిల్లలు అయితే 1 నుండి 2 గ్లాసులు, పెద్దవారు అయితే 750ml నుండి 1 లీటర్ వరకు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 

👉కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి మధ్యలో కనీసం 45 నిమిషాల నుండి ఒక గంట వరకూ వ్యాయామం చేయండి. 

👉వ్యాయామం పూర్తి అయ్యాక నువ్వుల నూనె, ఆవ నూనె మరియూ కొబ్బరి నూనె సమాన నిష్పత్తిలో తీసుకుని గోరువెచ్చగా కాచి ఆ నూనెతో తల నుండి కాళ్ళ వరకు బాగా మసాజ్ చేసి 1 గంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీనినే అభ్యంగనం అంటారు.

👉దంతాల శుభ్రత కోసం వేప పుల్లని, అలాగే తల స్నానం కోసం కుంకుడు, శీకాయ మిశ్రమాన్ని వాడండి.

👉ఉదయం తీసుకునే అల్పాహారం కోసం కీరా, క్యారెట్, బీట్రూట్ లతో పాటుగా చిరుధాన్యాల తో చేసిన ఇడ్లిలు కానీ లేదా జావ గా కానీ తీసుకోవాలి. 

👉మధ్యాహ్నం భోజనానికి పాలిష్ చేసిన సన్న బియ్యాలతో చేసిన అన్నం కాకుండా దంపుడు బియ్యంతో కానీ బ్రౌన్ రైస్ తో కానీ చేసిన అన్నం తో పాటు ఆకు కూరలు, కూరగాయలతో చేసిన కూరలను ఎక్కువగా తీసుకోవాలి.

👉రాత్రి భోజనం 7:30 లోపల పూర్తి చేయాలి. ఆయిల్ లేకుండా నిప్పుల మీద కాల్చిన చపాతీ మరియూ ఆకు కూరలతో చేసిన కర్రీతో కలిపి తీసుకోవాలి. 

👉అల్పాహారం కి మధ్యాహ్న భోజనానికి మధ్య ఏదైనా ఆకు కూరలతో కానీ కూరగాయలతో కానీ చేసిన జ్యూస్ (కీరా, బీర, పొట్లకాయ, బూడిద గుమ్మడి, పుచ్చకాయ , దోసకాయ లాంటి వాటితో చేసిన ఏదైనా ఒకరకం జ్యూస్ ని) తీసుకోవాలి.

👉భోజనం తర్వాత తప్పకుండా ఏదైనా సీజనల్ ఫ్రూట్ తీసుకోవాలి. 

👉మధ్యాహ్న భోజనానికి మరియూ రాత్రి భోజనానికి మధ్య స్నాక్స్ సమయంలో మొలకెత్తిన విత్తనాలు కానీ, బొప్పాయి లేక దానిమ్మ సీ విటమిన్ కలిగిన పండ్లు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఏవో ఒకటి తీసుకోవాలి. నువ్వులు, పల్లీలు, బెల్లం తో తయారు చేసిన ఉండలు కానీ, చిక్కీలు కానీ తీసుకోవాలి.

👉రాత్రి 9 గంటలలోపు పడుకోవాలి. నిద్రకు ముందు టీవీ కానీ మొబైల్ కానీ అసలు చూడకూడదు. వీలైతే ఒక మంచి సందేశం ఉన్న పుస్తకం కాసేపు చదవండి.

👉ఆనందంగా జీవించాలి అంటే ఆస్తులు అవససరం లేదు. ఆరోగ్యదాయకమైన అలవాట్లు ఉంటే చాలు. రోజూ ఎలాగో చేయలేరు. కనీసం ఇలా వారానికి ఒకరోజు చేసి చూడండి. ఫలితాన్ని మీరే స్వయంగా చూస్తారు. ఇలా మీ జీవితంలో చిన్న మార్పులు చేసుకుంటే చాలు.... హాస్పిటల్స్ లో అడుగు పెట్టాల్సిన అవసరం రాదు.


Friday, November 17, 2023

ఒబేసిటీని తగ్గించుటకు ఆయుర్వేద ఔషధాలు -

ఒబేసిటీని తగ్గించుటకు ఆయుర్వేద ఔషధాలు -

     అంతకు ముందు పోస్టులో ఒబేసిటీ గురించి మీకు వివరించాను. ఇప్పుడు అది తగ్గించుకొనుటకు కొన్ని సులభ యోగాలు మీకు వివరిస్తాను.

 సులభ యోగాలు -

 * దేహశ్రమ అధికంగా చేయుట , మైధున ప్రక్రియ ఎక్కువ చేయుట .

 * అధిక దూరం నడవడం , జాగరణ చేయుట అనగా తక్కువ సమయం నిద్రించుట .

 * యావలు , చామలు వంటి సిరిధాన్యాలు వాడవలెను. నీరు ఎక్కువుగా ఉన్న అన్నము భుజించటం.

 * ఉదయాన్నే తేనెతో గోరువెచ్చని నీటిని తాగవలెను.

 * ఉదయాన్నే వేడి అన్నంగాని గంజి గాని తాగవలెను.

 * చవ్యము , జీలకర్ర, శొంటి, మిరియాలు , పిప్పిళ్లు , ఇంగువ, సౌవర్చ లవణం , చిత్రమూలం వీటిని సత్తుపిండి, నీరు, మజ్జిగ యందు కలిపి తీసికొనవలెను.

 * వాయువిడంగములు, శొంటి, యవాక్షారం , ఎర్రచిత్రమూలం, యావలు , ఉసిరిక రసం వీటి చూర్ణాలను మజ్జిగతో కలిపి సేవించినను శరీరం నందు కొవ్వు కరుగును.

 * త్రికటు చూర్ణం అనగా శొంటి, పిప్పళ్లు, మిరియాలు సమాన బాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణమును ఆహారం తీసుకున్న తరువాత ఒక పావు స్పూన్ మజ్జిగ లో కలిపి ఉదయం , రాత్రి సమయాలలో తీసికొనవలెను.

 * మారేడు లేత ఆకులను తీసుకుని నూరి ఉదయం , సాయంకాల సమయాలలో శరీరానికి బాగా పట్టించి ముఖ్యంగా చంకలు , గజ్జలు వంటి బాగాలలో పట్టించి గంట సమయం తరువాత స్నానం చేయుచున్న శరీరంలోని కొవ్వు పేరుకొని పోవడం వలన శరీరం నుంచి వచ్చు దుర్గంధం హరించును .

 * గోమూత్రం ప్రతినిత్యం 10ml నుంచి 15ml వరకు ఒక కప్పు నీటిలో ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న శరీరం సన్నబడును.

       ఒబేసిటీ తగ్గించుకొనుటకు ఔషధ సేవన ఒక్కటే సరిపోదు . మనం తినే ఆహారంలో కూడా మార్పులు చేసుకోనవలెను . 

       
  పాటించవలసినవి -

      పాతబియ్యం , వెదురు బియ్యం, చామలు , కొర్రలు , ఆళ్ళు , జొన్నలు , యావలు , ఉలవలు, పెసలు , కందులు, మాసూరపప్పు, తేనె , పేలాలు, ఎక్కువ కారం, చేదు గల పదార్దాలు, వగరు కలిగిన పదార్దాలు, మజ్జిగ, వేయించిన వంకాయ (నూనె తక్కువ) , ఆవనూనె ఆహరంలో ఉపయోగించటం , పాయసం, ఆకుకూరలు , వేడినీరు తాగుట, ఎండ యందు తిరుగుట, ఏనుగు , గుర్రపు స్వారీ చేయుట , అధిక శ్రమ చేయుట , స్త్రీ సంగమం , నలుగు పెట్టుకొనుట , శనగలు, చిరు శనగలు , త్రికటుకములు, వాము తినటం, 

 పాటించకూడనివి - 

     చన్నీటి స్నానం, శాలి బియ్యం, గొధుమలు, అతిగా సుఖపడటం , పాలు , మీగడ , పెరుగు , పన్నీరు , మినుములు , కడుపు నిండా భోజనం , చెమట పట్టని ప్రదేశాలలో పని, చేపలు , మాంస పదార్దాలు , ఎక్కువసేపు నిద్రించడం , సుగంధ పదార్దాలు అతిగా వాడటం , తియ్యటి పదార్దాలు అతిగా తినటం , చద్ది అన్నం , చెరుకు రసంతో చేయబడిన అన్నం . 

       పైన చెప్పబడిన నియమాలు తప్పక పాటించినచో శరీరం నందు కొవ్వు తగ్గి శరీరం నాజూకుగా అవ్వును.

    

Wednesday, November 15, 2023

మెదడు నరాల్లో కణుతులు ఏర్పడి వచ్చు మూర్ఛలు కొరకు నివారణా యోగం -

మెదడు నరాల్లో కణుతులు ఏర్పడి వచ్చు మూర్ఛలు కొరకు నివారణా యోగం - 

        వావిలి ఆకు రసం , కస్తూరి , వెల్లుల్లిపాయ రసం కలిపి ముక్కులో వేయుచున్న శాశ్వతంగా కణుతులు కరిగిపోయి మూర్చలు తగ్గిపోతాయి. 

మోతాదు 4 నుంచి 5 చుక్కలు . 

 

అతి భయంకరమైన , మొండి నడుము నొప్పి నివారణకు నేను ప్రయోగించిన ప్రాచీన యోగం -

అతి భయంకరమైన , మొండి నడుము నొప్పి నివారణకు నేను ప్రయోగించిన ప్రాచీన యోగం - 

    ఎండు ఖర్జురాలు తీసుకుని ఒక వైపు నుంచి రంధ్రం చేసి లొపలి విత్తనము తీసివేసి లొపల ఖాళి ప్రదేశంలో తెల్ల గుగ్గిలం పొడి నింపి గోధుమ పిండి తడిపి ముద్దలా చేసి ఆ రంధ్రం మూసివేసి అదేవిధంగా కాయ పైన కొంచం మందంగా తడి గొధుమ పిండితో పట్టులా వేసి కర్రబొగ్గుల నిప్పుల పైన వేసి కాల్చి బయటకి తీసి చల్లారిన తరువాత పైన మాడినటువంటి గొధుమ పిండిని తీసివేసి బాగా ఉడికిన ఖర్జురాల్ని బాగా నూరి శనగగింజలు అంత మాత్రలు చేసి రెండు పూటలా ఆహారానికి ముందు నీటితో ఇచ్చాను . 

      అలాగే నువ్వుల నూనె ఒక స్పూన్ తీసుకుని దానిలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి బాగా వ్రేలితో కలిపినప్పుడు తెల్లటి ద్రవం లా మారిన తరువాత ఆ ద్రవంతో పై నుంచి కిందికి ఒక పది నిమిషాలు మర్దన చేయించాను . 

       కేవలం 40 రోజుల్లొ మార్పు వచ్చింది.

 

స్త్రీలలో కలుగు తెల్లబట్ట ( white discharge ) నివారణ కొరకు సులభ ఔషదం

స్త్రీలలో కలుగు తెల్లబట్ట ( white discharge ) నివారణ కొరకు సులభ ఔషదం - 

  
    నూరువరహాల పూవులు 40 తీసుకుని ఒక గ్లాసు నీటిలో మరిగించి వడకట్టుకొని ఆ కషాయంలో ఒక స్పూన్ తాటి కలకండ , అర స్పూన్ జీలకర్ర పొడి కలుపుకుని తాగితే తెల్లబట్ట నివారణ అగును. రోజుకి రెండు సార్లు .2 నుంచి 3 రోజుల్లో నివారణ అగును. 

           వాము , జీలకర్ర కలిపి ఒక స్పూన్ తీసుకుని రసం మింగుతూ చివరికి పిప్పిని కూడా లొపలికి తీసికొనవలెను. ఈ విధంగా కూడా తెల్లబట్ట నివారణ అగును.

   

మానవ శరీరంలోని వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల గురించి వివరణ -

మానవ శరీరంలోని వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల గురించి వివరణ - 

      మానవ శరీరం ఒక సజీవమైన యంత్రం శరీరము నందు ఎలాంటి అన్యపదార్ధము చేరినను దానిని బయటకి బహిష్కరింప చేయుటకు శరీరము పనిచేస్తుంది . ఉదాహరణకు కాలుకు ముల్లుగాని , కొయ్యగాని గుచ్చుకొని విరిగిన దానిని శరీరము నుంచి బయటకి పంపుటకు చీముపట్టి ఆ తరువాత సులభముగా బయటకి వచ్చును. ఇదే విధముగా శరీరంలోని అంతరావయవములలో ఏదేని మలపదార్దము ( అన్య పదార్థము లేదా రోగ పదార్థము ) చేరినచో అది బయటకి పంపుటకు శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు పనిచేయును . ఇప్పుడు వాటి గురించి మీకు వివరిస్తాను . అవి 

     * ప్రేవులు . 
     * మూత్రపిండములు . 
     * ఉపిరితిత్తులు . 
     * చర్మము . 

  * ప్రేవులు - 

        మల పదార్థము మొదట ప్రేవులలో నిలువచేరి వివిధ వ్యాధులను కలుగచేస్తుంది . అందువలనే " సర్వరోగా మలాశయః " అన్నారు. ఈ మల పదార్థం మలబద్ధక సమస్య వలన బయటకి వెళ్లక ప్రేవులలో నిలువ ఉండి అచ్చట కొంతకాలానికి మురిగిపోయి విషవాయువులు తయారైయ్యి రక్తములో కలిసి ప్రవహించి ఇతర అంతర అవయవములకు అవరోధము కలిగించి రోగములను కలుగచేయును . 

                మలబద్ధకం వలన మొదట అజీర్ణము చేయును . అజీర్ణము వలన విరేచనములు ఆ తరువాత బంక విరేచనాలు , రక్తవిరేచనాలు , అమీబియాసిస్ , అసిడిటీ , అల్సర్ ఇలా ఒకదాని తరువాత ఒకటి వచ్చును. ఇవన్నియు జీర్ణకోశ సంబంధ వ్యాదులు. ఈ వ్యాధులన్నింటికి మలబద్ధకమే కారణం . ఈ సమస్య ప్రారంభములోనే జాగ్రత్తవహించని యెడల దీర్ఘకాలిక వ్యాధిగా మారి తరువాత తీవ్ర సమస్యలు తెచ్చును . 

* మూత్రపిండములు - 

 ప్రేవులు పూర్తిగా పనిచేయని స్థితిలో శరీరంలోని మాలిన్యములు బయటకి పంపుటకు మూత్రపిండములు బాగుగా పనిచేయవలసి ఉంటుంది. అందుకే మలబద్దకం సమస్య ఉన్నవారికి మూత్రం అధికంగా వచ్చును. కొంతకాలమునకు మూత్రపిండములు కూడా అలసిపోయి చెడిపోవును . కావున మూత్రపిండములలో రాళ్లు , మూత్రనాళములో రాళ్లు , మూత్రకోశములో రాళ్లు మొదలగు వ్యాధులు సంభవించును . దీనివల్ల రక్తములో మూత్రము కలియుట , రక్తపోటు మొదలగు సమస్యలు కలుగును. 

 * ఊపిరితిత్తులు - 

     మూత్రపిండ వ్యాధులకు మందులు వాడిన శరీరంలోని మురికిని బయటకి పంపుటకు ఉపిరితిత్తులు ప్రయత్నించును. దగ్గు , జలుబు , అలర్జీ , దమ్ము ద్వారా శరీరంలోని తెమడను బయటకి పంపుటకు ప్రయత్నించును. ఈ సమస్యను కూడా అణుచుటకు మందులు వాడుచున్న శరీరం నందలి మలిన పదార్థము చర్మము క్రిందికి వెళ్లి చర్మవ్యాధులను కలగచేయును . 

 * చర్మము - 

     రక్తములో ఉన్న మాలిన్యాలను చర్మము ద్వారా బహిష్కరించుటకు ప్రయత్నించునప్పుడు గజ్జి , తామర , పుండ్లు , గడ్డల రూపములో కనిపించును. దీనిని మనం మందులతో అణిచివేయుచుండిన చర్మవ్యాధి , కుష్టు మొదలగు వ్యాధులు వచ్చును . 

       పైన వివరించిన నాలుగు బహిష్కరణ అవయవాలు చక్కగా పనిచేసినంత కాలం ఏ రోగము దరిచేరదు . ఇందులో ఏ ఒక్కటి తన విధిని సరిగ్గా నిర్వర్తించలేకపోయినా శరీరము అంతా రోగగ్రస్తం అవుతుంది. అంతేకాని శరీరంలో వివిధ అవయవములకు సంబంధం లేదు అనుకోకూడదు. 

             ఈవిధముగా శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు మందుల వలన దోషపూరితమై ఒకదాని పని ఇంకొకటి చేసి రోగగ్రస్తము అగును. కావున సమస్య మొదలగు క్రమము నందే సరైన జాగ్రత్తలు పాటించి ఎప్పటికప్పుడు శరీరంలోని మాలిన్యాలను బయటకి పంపవలెను. 

            ఈ మధ్యకాలంలో చాలా మంది ఉదయాన్నే లేవగానే మలవిసర్జనకు వెళుతున్నాము .మలబద్ధక సమస్య లేదనుకుంటున్నారు. నిజానికి రోజుకు రెండుసార్లు మలవిసర్జన చేయుట అత్యుత్తమ పద్దతి. అదేవిధముగా ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధములు తీసుకుని ఉదరమును మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలెను. ఉదయాన్నే మలవిసర్జన చేసినప్పుడు బయటకి వెళ్లునది కేవలం 60 % మాత్రమే . మిగిలిన 40 % ప్రేవులకు పట్టి ఉండును. అది అలా మురిగిపొయి విషవాయువులు వెలువడి రక్తములో కలిసి శరీరంలోని మిగతా అవయవాలకు చేరుకుని ఆయా అవయవ సంబంధ రోగాలను కలుగ చేయును . కావున ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధాలను తీసుకుని ఉదరము మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలసిందిగా ముఖ్య సూచన . 

               సమాప్తం 

        

శరీరములో ముల్లుగుచ్చుకొని రానప్పుడు ప్రయోగించవలసిన సిద్ధ యోగం -

శరీరములో ముల్లుగుచ్చుకొని రానప్పుడు ప్రయోగించవలసిన సిద్ధ యోగం - 

     శరీరము నందు యే భాగము నందైనా ముల్లు లోపలిదాకా దిగి బయటకి రాకుండా ఉన్న సమయములో ఆపరేషన్ అవసరం లేకుండా ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న యోగం పాటించండి. 

         ఉమ్మెత్తాకు తీసుకుని బాగుగా శుభ్రపరచి బెల్లము నందు పెట్టి తినిపించవలెను . ఎంతటి ప్రమాదకరమైన ముల్లు అయినా శరీరము నుంచి బయటకి వచ్చును. అదేవిధముగా ఉమ్మెత్త ఆకును శుభ్రపరచి ఆముదంలో వేయుంచి పసుపు కలిపి నూరి ముద్దలా చేసి కట్టినను శరీరంలోపల విరిగిన ఎముకల ముక్కలు , ముళ్లు బయటకి వచ్చును . 

   

మొలలు వ్యాధి ఉన్నవారు పాటించవలసిన జాగ్రత్తలు -

మొలలు వ్యాధి ఉన్నవారు పాటించవలసిన జాగ్రత్తలు -

 * పాతబియ్యం , పాతగోధుమలు వాడవలెను.

 * బార్లీ , సగ్గుబియ్యం జావ వాడవలెను.

 * బీరకాయ, పొట్లకాయ కూరలు తినవలెను .

 * పెసరపప్పు తినవలెను . కందిపప్పు , మినపపప్పు తినవద్దు.

 * కోడి మాంసం , గుడ్డు నిషిద్దం . ఎప్పుడైనా ఒకసారి మేకమాంసం అతి తక్కువ మోతాదులో మసాలా చాలా తక్కువ మోతాదులో కలిపి తీసుకొవచ్చు.

 * పాతపచ్చళ్ళు పూర్తిగా నిషిద్దం.

 * ఎక్కువసేపు ప్రయాణాలు చేయరాదు .

 * పళ్ల రసాలు తీసుకోవచ్చు . ముఖ్యంగా యాపిల్ రసం తీసుకోవలెను .

 * కఠినంగా ఉండే చెక్క కుర్చీల పైన ఎక్కువసేపు కూర్చోరాదు. స్పాంజితో చేసినవి కూడా వాడకూడదు . బూరుగు దూది లేదా పత్తితో చేసినవి వాడవలెను.

 * పెరుగుతోటకూర, మెంతికూర, పాలకూర, గంగపాయల కూర , చక్రవర్తికూర వంటి ఆకుకూరల తరుచుగా తీసికొనవలెను.

 * మలబద్దకం లేకుండా చూసుకొనవలెను. సుఖవిరేచనం అయ్యేలా చూసుకోవాలి .

 * ఆవునెయ్యి , ఆవుమజ్జిగ, ఆవుపాలు వాడుకుంటే మంచిది .

 * శరీరానికి వేడిచేసే పదార్థాలు తీసుకోరాదు . వీలయినంత ఎక్కువ మజ్జిగ తీసికొనవలెను.

 * కొత్తబియ్యం, కొత్తగోధుమలు వాడరాదు.

 * కొత్తచింతపండు , కొత్తబెల్లం నిషిద్దం.

 * నువ్వులు , ఆవాలు , నువ్వు చెక్క వాడరాదు.

 * ఆహారంలో నూనె తగ్గించి వాడుకొనవలెను.

 * కొడి చేప , రొయ్యలు వాడరాదు.

 * చద్దన్నం, చల్లబడినవి , మెత్తపడిన ఆహారాన్ని తినకూడదు.

 * వంకాయ , గోంగూర, సొరకాయ, బచ్చలి ఎట్టి పరిస్థితుల్లోనూ మొలల సమస్య ఉన్నవారు తీసుకోకూడదు .

       మొలల సమస్య ఉన్నవారు శరీరంలో వాతం , వేడి పెరగకుండా జాగ్రత్తపడుతూ సరైన వైద్యుడుని సంప్రదించి చికిత్స తీసుకొనవలెను .

    

గుండెదడ , నీరసము హరించుటకు సులభ ఔషధ యోగము -

గుండెదడ , నీరసము హరించుటకు సులభ ఔషధ యోగము - 

       క్యారెట్ మెత్తగా దంచి రసము తీసి , 50 రసము నందు 20 గ్రాముల పటికబెల్లం చూర్ణము కలిపి పూటకు ఒక మోతాదు చొప్పున ఉదయము మరియు సాయంత్రం రెండు పూటలా తాగుచున్న గుండె దడ , నీరసం , నిస్సత్తువ హరించును . 

       

శరీరం నందలి నీరసం , నిస్సత్తువ హరించుటకు సిద్ద యోగాలు

శరీరం నందలి నీరసం , నిస్సత్తువ హరించుటకు సిద్ద యోగాలు - 

 * మామిడి పండ్లు దొరికే సమయంలో మంచి రకం, పూటకో రకం తినటం వలన త్వరగా నీరసం పోయి శరీరానికి మంచి పుష్టి కలుగును 

 * రోజుకో లేత కొబ్బరి బోండం లోని నీరు తాగుతూ ఆ కొబ్బరిని భక్షిస్తూ ఉన్నచో నీరసం తగ్గును.

 * అప్పుడప్పుడు దాల్చిన చెక్కని బుగ్గన పెట్టుకుని దాని రసాన్ని మింగుతూ ఉంటే నీరసం పోతుంది . 

 * రోజుకి ఒకసారి నేలవేము కషాయాన్ని పావుకప్పు మోతాదుగా నీరసం పోతుంది . జబ్బుతో ఉన్నప్పుడు ఈ కషాయాన్ని లోపలికి ఇవ్వడం వలన త్వరగా కోలుకుంటారు .

 * ఖర్జూరం కాయలు రోజూ తినటం వలన శరీరానికి మంచి పుష్టి కలుగును. నాలుగు ఎండు ఖర్జూరాలు ఒక గ్లాసు నీటిలో రాత్రి సమయంలో నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీటిని తాగినచో శరీరానికి మంచి రక్తం పట్టి కాంతి , రంగు వచ్చును. 

 * తుమ్మజిగురు శరీరానికి మంచి టానిక్కు లాంటిది . ఉసిరికాయ అంత జిగురుని కప్పు నీటిలో కలిపి కొంచం పంచదార చేర్చి రోజుకి ఒకసారి తాగితే నీరసం పోయి బలం వచ్చును.

 * తాజా తాటికల్లుని పులవకుండా ఒక మోతాదుగా రోజూ తీసుకుంటూ ఉంటే శరీరానికి మంచి పుష్టి , బలం కలుగును. దీనిని "నీర " అని పిలుస్తారు . 

 * రోజుకో వెలగపండు బద్ధ తింటూ ఉంటే నీరసం పోయి బలం వచ్చును. 

    

ఆయుర్వేద వైద్యం నందు జలగలు ఉపయోగించే విధానం -

ఆయుర్వేద వైద్యం నందు జలగలు ఉపయోగించే విధానం -

       జలము ఆయువుగా కలవి కావున జలాయుకములు అనియు , జలము నివాసస్థానం కలవి కావున జలౌకలని మరియు జలగలు అని పిలవబడుతున్నవి. ఇవి 12 విధములు గా ఆయుర్వేదం విభజించింది. ఇందు విషము కలిగినవి నల్లటి రంగులోని బేధము వలన 6 విధములు . అందు కృష్ణ అనునది కాటుక రంగు పెద్ద శిరస్సు గలది. కర్బూర అనునది బొమ్మిడ అను చేప వంటి ఆకృతి కలిగి ఒకచోట చిన్నగా , మరొకచోట పెద్దగా ఉండు పొట్ట కలిగి ఉండును. కలగర్ద అనునది ముడుతలతో కూడి ఉండి పెద్ద పార్శ్వములతో కలిగిన ముఖం 
ఉండును. ఇంద్రాయుధ అనునది ఇంద్రధనస్సులోని నానారంగులు గల నీలపు చారలతో కూడుకుని ఉండును. సాముద్రిక అనునది కొద్దిగా నలుపు , పసుపు రంగులతో ఉండి అనేక ఆకృతులుగల తెల్లని మచ్చలతో కూడుకుని ఉండును. గోచందనం అనునది ఆంబోతు బుడ్డ వలే పొట్ట యందు ఒక గీత కలిగి సన్నని ముఖం కలిగి ఉండును.

           పైనచెప్పిన 6 రకాల జలగలు విషము కలిగి ఉంటాయి. ఇవి కరిచినచో కాటునందు వాపు , మిక్కిలి దురద, మూర్చ, జ్వరం, తాపము , వాంతి కలుగును. 

        ఇప్పుడు మీకు విషము లేని జలగలు గురించి వివరిస్తాను. విషములేని జలగలు మొత్తం 6 రకాలు . అందులో కపిల అనునది ప్రక్కల యందు మనశ్శిలతో రంగు వేసినట్లు ఉండి వీపున నిగనిగలాడుచూ పెసలవలే ఆకుపచ్చ రంగు కలిగి ఉండును. పింగళి అనునది కొంచం ఎరుపు రంగు గుండ్రని శరీరం పచ్చని రంగు ఉండి వేగముగా కదులును. శంఖముఖి అనునది యకృత్ వలే ఎరుపు నలుపు రంగులు కలిగి శీఘ్రముగా రక్తమును తాగే స్వభావం పొడవైన వాడి అయిన ముఖం కలిగి ఉంటుంది. మూషిక అనునది ఎలుక వంటి ఆకారం , రంగు , దుర్వాసన కలిగి ఉంటుంది. పుండరీకం అనునది పెసల వలే పచ్చని రంగు , పద్మముల వలే విశాలమైన ముఖం కలిగి ఉండును. సావరిక అనునది నిగనిగలాడుచూ తామరాకు వంటి రంగు కలిగి 18 అంగుళముల పొడవు కలిగి ఉండును. ఇది ఏనుగులు, గుఱ్ఱములకు చికిత్స చేయుటలో మాత్రమే వాడవలెను .మనుష్యులకు పనికిరాదు. వీటిని నిర్విష జలగలు అందురు.

             ఈ విషము లేనటువంటి జలగలు లభించు ప్రదేశాలు ముఖ్యంగా ఢిల్లీకి పశ్చిమ దిశలోను , సహ్యాద్రి పర్వతాలు అనగా నర్మదా నది ప్రవహించు పర్వత ప్రాంతాలలోను, మధురా ప్రాంతంలోనూ ఈ విషము లేనటువంటి జలగలు ఉండును. ఈ ప్రదేశాలలో లభించు జలగలు పెద్ద శరీరం కలిగి మంచి బలముతో ఉండి శీఘ్రముగా రక్తమును పీల్చెడి స్వభావం ఎక్కువుగా ఉండి విషము లేకుండా ఉండును.

         విషముతో కూడిన చేపలు , పురుగులు , కప్పలు , మూత్రపురీషములు క్రుళ్ళుట చేత పుట్టిన జలగలు మరియు కలుషిత జలము నందు పుట్టిన జలగలు, నీటిలోని పద్మములు కుళ్లుటచేత పుట్టిన జలగలు విషపూరితంగా ఉండును. శుద్ధజలము నందు పుట్టిన జలగలు విషం లేకుండా ఉండును.

            ఇప్పుడు జలగలను పట్టే విధానం వాటిని పోషించే విధానం మీకు తెలియచేస్తాను .

     రక్తముతో కూడిన తోలు , జంతుమాంసం , వెన్న , నెయ్యి, పాలు మొదలగు వాటితో కూడిన అన్నమును జలగలు ఉన్న ప్రదేశంలో వేసినచో అవి పైకి వచ్చును. అప్పుడు వాటిని పట్టుకొని మంచి కుండలో చెరువునీటిని , బురదని పోసి అందులో ఉంచవలెను. వాటికి తిండి కొరకు నాచు, ఎండిన మాంసము , నీటిలో పుట్టే దుంపల చూర్ణం ఇవ్వవలెను. అవి నిద్రించుటకు గడ్డి, నీటి యందు పుట్టే పచ్చి ఆకులను ఆ కుండ నందు వేయవలెను . రెండు మూడు రోజులకు ఒకసారి ఆ కుండ యందలి నీటిని తీసివేసి కొత్తనీటిని పోసి ఆహారం కూడా కొత్తదానిని వేయవలెను . ప్రతి ఏడు రోజులకు ఒకసారి కుండను మార్చవలెను . ఈ జలగలను శరత్కాలం పట్టుకొనుట మంచిది .

      జలగలను వైద్యంలో ఎలా ఉపయోగించాలో మీకు వివరిస్తాను.

            జలగలచే పోగొట్ట తగిన రోగము కలిగిన వానిని కూర్చుండబెట్టి కాని , పడుకోపెట్టి కాని జలగ పట్టించవలసిన ప్రదేశములో వ్రణము లేనిచో ఆ ప్రదేశంలో ఎండించిన ఆవుపేడ చూర్ణం , మన్ను కలిపి మర్దన చేయవలెను . ఆ తరువాత జలగలను తీసుకుని ఆవాలు , పసుపు కలిపి నూరి కలిపిన నీటిలో ముంచి వేరొక మంచినీటి పాత్రలో ముంచి వాటిని రోగమున్న ప్రదేశములో పట్టించవలెను. ఆ తరువాత ఆ జలగకు మంచి కాటన్ గుడ్డ ముక్కతో ముఖము విడిచి శరీరం అంతయు కప్పవలెను. అప్పుడు ఆ జలగ రోగ స్థానమును పట్టును . అలా పట్టనిచో ఆ రోగస్థానం పైన పాలచుక్క గాని రక్తపుచుక్క గాని వేయుట లేక కత్తితో గీయుట చేసినచో జలగ వెంటనే రోగస్థానమును పట్టును . అప్పుడు కూడా జలగ పట్టనిచో దానిని వదిలి వేరొక జలగ పట్టించవలెను .

                   జలగ ఎప్పుడూ తన ముఖమును గుర్రపుడెక్క వలే విస్తరించి స్కంధమును పైకెత్తి రోగస్థానమును తగులుకొనునో అప్పుడు అది రక్తమును పీల్చుతుంది అని అర్ధంచేసుకొనవలెను వెంటనే దానిని తడిగుడ్డతో కప్పి మధ్యమధ్యలో తడుపుచుండవలెను . అలా చేస్తున్నచో రక్తం బాగుగా పీల్చును. ఆ పీల్చుటలో ముందుగా దుష్టరక్తమునే పీల్చును .

            జలగ రక్తం పీల్చుతూ ఉన్నప్పుడు కొంత సమయం తరువాత పోటు , దురద మొదలగుచున్న అప్పటివరకు అది దుష్టరక్తం పీల్చి ఆ తరువాత మంచిరక్తం పీల్చడం మొదలు అయినది అని అర్థం . ఆ తరువాత వెంటనే జలగను తీసివేయవలెను . రక్తం యొక్క రుచి మరిగి ఆ జలగ రానిచో దాని ముఖము పైన సైన్ధవ లవణము వేసినచో విడిచివేయును .

        చెడు రక్తం పీల్చిన జలగను శుద్దిచేయు విధానం గురించి మీకు తెలియచేస్తాను.

      పైన చెప్పినట్టు రోగస్థానమును విడిచిన జలగకు శరీరం పైన బియ్యపు పిండిని పూసి ముఖం నందు నూనె, ఉప్పు కలిపి రాసి ఎడమచేతితో తోకను పట్టుకొని కుడిచేతితో ముఖము వరకు ఆవుపాలు పితికినట్లు చేయవలెను . ఈ విధంగా చేస్తూ తాగిన రక్తమును బయటకి కక్కునట్టు చేయవలెను . ఆ తరువాత ఆ జలగను శుభ్రపరచి మంచినీటితో కూడిన పాత్ర యందు ఉంచవలెను. అప్పుడు అది ఉత్సాహముగా సంచరించును. అలా సంచరించకుండా కదలక మొద్దుగా ఉన్నచో చెడురక్తం దాని శరీరం నుంచి పూర్తిగా బయటకి పోలేదు అని గ్రహించి మరలా కక్కించు ప్రయత్నం చేయవలెను . కక్కించాక మరలా కుండ నందు భద్రపరచవలెను.

       జలగతో రోగనివారణ క్రియ చేశాక చేయవలసిన విధి గురించి వివరిస్తాను.

          జలగ ద్వారా చెడు రక్తం తీసాక ఆ గాయమునకు ఔషదాలు కలిపిన ఆవునెయ్యి పూయవలేను . కొందరికి తేనె కూడా పూయవచ్చు.

      పైన చెప్పిన జలగతో చెడు రక్తాన్ని తీయు విధానాన్ని రక్తమోక్షణం అంటారు. ఈ క్రియను రోగి యెక్క బలం, రోగం యొక్క బలాన్ని అంచనా వేసుకొని మాత్రమే అంచనా వేసుకొని చేయవలెను .

              సంపూర్ణం