Tuesday, November 28, 2023

ఉత్తరేణి చెట్టు ఔషధ ఉపయోగాలు -

ఉత్తరేణి చెట్టు ఔషధ ఉపయోగాలు -

   ఉత్తరేణి చెట్టుని "అపామార్గ" అని పిలుస్తారు . తెలుగులో " దుచ్చెన చెట్టు " అని మరొక పేరు . ఆయుర్వేద వైద్యంలో ఈ చెట్టుకు ప్రముఖస్థానం ఉన్నది. ఈ చెట్టు గురించి దీని ఔషధ ఉపయోగాలు గురించి మీకు సంపూర్ణంగా వివరిస్తాను.

 * ఈ చెట్టు సమూల రసం కాని కషాయం చేదుగా మరియు వెగటుగా ఉండును.

 * శరీరంలోని త్రిదోషాలను పోగొట్టును .

 * ఉత్తరేణి చెట్టు విత్తులను పాలతో వండి పాయసంలా చేసుకుని తినుచున్న పరిణామ శూలని పొగొట్టును. పరిణామశూల అనగా ఆహారం తీసుకొనిన తరువాత జీర్ణం అయ్యే సమయంలో కలుగు నొప్పి.

 * ఈ చెట్టు సమూలం తీసికొనివచ్చి నీడలో ఎండించి భస్మం చేసి ఆ భస్మమును 3 గ్రాముల చొప్పున నీటిలో కలిపి తీసుకొనుచున్న అజీర్ణం వలన వచ్చే నొప్పి తగ్గును.

 * ఉత్తరేణి చెట్టు సమూల భస్మం గంజితో కాని , శొంఠి కషాయంతో కాని ఇచ్చిన శరీరపు ఉబ్బు మరియు ఉదర రోగం నివారణ అగును.

 * దీని విత్తనాలను నీళ్లతో నూరి కాని , చూర్ణం చేసి నీళ్లతో ఇచ్చిన వెర్రికుక్క విషపు సంధి (Hydrophobia ) తగ్గును. దీని పూతవెన్నులను కొద్దిగా పంచదార వేసి నూరి మాత్రలుగా చేసి వెర్రికుక్క కరిచిన వానికి ఇచ్చిన విషం హరించును 
పూటకు గచ్చకాయ మోతాదులో రోజుకు రెండుపూటలా 3 నుంచి 4 దినములు ఇవ్వవలెను.

 * ఉత్తరేణి చెట్టు ఆకులను కాని పూత వెన్నులను నూరి తేలు కుట్టినచోట దళసరిగా పట్టించిన బాధ మరియు మంట తగ్గును. పాము కరిచిన చోట పట్టించిన దాని విషం హరించును . జెర్రీ కుట్టినచోట పట్టించిన మంట నివారణ అగును.

 * ఉత్తరేణి చెట్టు సమూల భస్మం తేనెతో కలిపి ఇచ్చిన దగ్గులు , ఉబ్బసం హరించును . మోతాదు 2 గ్రాములు . రోజుకు రెండుపూటలా ఇవ్వవలెను.

 * ఉత్తరేణి చెట్టు సమూల భస్మంలో హరిదళం వేసి నూరి నూనె కలిపి పూసిన వ్రణములు , పులిపిరికాయలు హరించును .

 * ఉత్తరేణి చెట్టు సమూల భస్మం నువ్వులనూనె లో కలిపి ఉదయం , సాయంత్రం 2 చుక్కలు చెవుల్లో వేసిన కర్ణరోగములు మానును .

 * ఉత్తరేణి చెట్టు సమూల రసంలో దూది తడిపి పుప్పిపంటిలో పెట్టిన పుప్పి పన్ను వల్ల వచ్చు నొప్పి మానును .

 * ఉత్తరేణి చెట్టు విత్తనాలు గాని ఆకు గాని నూరి కట్టిన శరీరం పైన లేచు గడ్డల మంట , పక్క నొప్పి ( Pleurodynia ) నివారణ అగును.

 * ఉత్తరేణి ఆకుల రసం లోపలికి ఇచ్చిన సర్పవిషం హరించును .

 * ఉబ్బసం దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను నిప్పులపైన వేసి ఆ పొగ పీల్చిన దగ్గు, ఆయాసం తగ్గును.

 * ఉత్తరేణి ఆకు నీడన ఎండించిన చూర్ణం పుచ్చుకొనిన రక్తగ్రహణి తగ్గును.

 * ఉత్తరేణి చెట్టు పచ్చి ఆకులలో కొద్దిగా మిరియాలు , కొద్దిగా వెల్లుల్లిపాయలు చేర్చి నూరి గచ్చకాయ అంత సైజు మాత్రలు చేసి చలిజ్వరం రాక మునుపు ఇచ్చుచుండిన చలిజ్వరం , వరసగా వచ్చు జ్వరం నివారించును.

 * ఉత్తరేణి ఆకును నీటితో కలిపి నూరి వంటికి పూసిన కందిరీగలు, తేనెటీగలు మొదలయిన పురుగులు కుట్టినప్పుడు కలుగు మంట, బాధ నివారణ అగును.

 
   

No comments:

Post a Comment