* రుద్రాక్ష మాల ధరించాలనుకునేవారు పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించి ఆవుపాలతో శుద్ధిచేసి ధరించగలరు.
* సంవత్సరానికి ఒకసారి రుద్రాక్ష అధిష్టాన దేవత పూజ చేయించి ఆ పూజలో రుద్రాక్షమాలను ఉంచి మరలా ధరించవలెను .
* ఎల్లప్పుడూ రుద్రాక్ష మాలని ధరించువారు కనీసం సంవత్సరానికి ఒకమారు ఆ రుద్రాక్ష మాలకు " మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం " చేసినచో చాలా మంచిది .
* రుద్రాక్ష మాలను బంగారంతో గాని వెండితో గాని చుట్టించుకొని తీసుకువచ్చి గంగాజలంతో శుభ్రపరచి , పంచామృతాలతో శుద్దిచేసి ఆయా రుద్రాక్ష యొక్క అధిష్టాన దేవత మందిరంలో ఉంచి పూజించి ధరించవలెను .
* రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు పౌర్ణమి , త్రయోదశి , చతుర్దశి , మహాశివరాత్రి , కార్తీకమాస సోమవారముల యందు ధరించవలెను .
* రుద్రాక్షలను రుద్రాక్ష పూజా మంత్రములతో పూజచేయకుండా ధరించిన ఫలితం ఉండదు.
* రుద్రాక్షలు కొన్ని సంవత్సరాల పాటు మన్నికగా ఉండవలెను అనిన వాటికి ఆవునెయ్యి నెలకొకమారు రాయవలెను.
* ప్రతినిత్యం స్నానం చేయునపుడు రుద్రాక్షమాల తీసి పక్కన పెట్టి స్నానం చేయుట మంచిది .
* రుద్రాక్షలతో ముత్యాలు , పగడములు , స్పటికములు , శంఖాలు , తులసి పూసలు , నవరత్నాలు కలిపి ధరిస్తారు . ఇలా ధరించేప్పుడు కనీసం రుద్రాక్షలు 27 గాని , 54 గాని ఉండవలెను .
* శివరాత్రి పర్వదినమున రుద్రాక్షలతో పూజ చేయుట చాలా శ్రేష్టం .
రుద్రాక్ష ధారణకు శుభసమయ వేళలు -
* మేష , కర్కాటక , తులా , మకర , కుంభ లగ్నముల యందు రుద్రాక్ష ధారణ చేయవలెను .
* అశ్వని , మృగశిర , పునర్వసు , పుష్యమి , హస్త , స్వాతి , అనూరాధ , శ్రవణం , రేవతి నక్షత్రాలలో రుద్రాక్ష ధారణ చాలా మంచిది .
* పంచమి , సప్తమి , దశమి , ఏకాదశి , త్రయోదశి , పౌర్ణమి తిథులలో ధరిస్తే మంచిది .
* సోమవారం ధరిస్తే చాలా మంచిది . లేదా శనివారం కూడా ధరించగలరు . కృష్ణపక్షంలో (పౌర్ణమి తదుపరి బహుళపాడ్యమి నుండి అమావాస్య వరకు ) ధరిస్తే మంచిది .
* కార్తీకమాసంలో ధరిస్తే చాలా మంచిది . లేదా మార్గశిర మాసంలో కూడా ధరించవచ్చు . భాద్రపద , పుష్య , శ్రావణ , అశ్వయుజ మాసంలో కూడా ధరించవచ్చు .
* రుద్రాక్షమాల ధారణకు మహాశివరాత్రి పర్వదినం చాలా ఉత్తమం.
రుద్రాక్షధారణ కు పాటించవలసిన నియమాలు -
* సోమరులు అయి ఉండకూడదు. సేవా కార్యక్రమాలు యందు ఆసక్తి కలిగిఉండవలెను.
* అపద్దాలు ఆడకూడదు . దయ, దాక్షిణ్యం , ఏకాంతం , క్షమాగుణములలో సాత్విక అభిప్రాయంతో , శాంతస్వభావులై ఉండవలెను .
* కామ, క్రోధ, లోభ, మోహ , మద మాత్సర్యాలను వదిలిపెట్టి సంప్రదాయ బద్ధమైన విషయాలను నిందించకూడదు .
* పాపాత్ములతో సావాసం చేయరాదు .
* వితంతువులు రుద్రాక్ష ధారణ చేయుట మంచిది .
* రుద్రాక్ష ధరించువారు ధూమపానం మానివేయవలెను .
* రుద్రాక్ష ధారణ చేసినవారు వెల్లుల్లి , నీరుల్లి , మద్యమాంసాదులు మానివేయవలెను .
No comments:
Post a Comment