Monday, November 20, 2023

✍️మధుమేహ సమస్యకు అద్భుతమైన ఆయుర్వేద నియమాలు మరియు గృహ చిట్కాలు:

✍️మధుమేహ సమస్యకు అద్భుతమైన ఆయుర్వేద నియమాలు మరియు గృహ చిట్కాలు:

👉పంచవ్యాప్తంగా మధుమేహం విస్తరిస్తోంది. మారిన ఆధునిక జీవనశైలిలో మధుమేహుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. 

👉ఇవాళ చాలామందికి జీవితంలో ఈ వ్యాధి నియంత్రణ ఓ తప్పనిసరి అంశం అవుతోంది. 

👉వైద్య విధానంలో విప్లవాత్మకమైన ఆవిష్కరణలు జరిగినా, ఆరోగ్య రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నా, కొత్త ఔషధాల కోసం పరిశోధనలు జరుగుతున్నా, కొత్తకొత్త మందులు మార్కెట్లో అందుబాటులోకొచ్చినా, మధుమేహ నివారణ ఇప్పటికీ అసాధ్యంగానే ఉన్నదని చెప్పాలి.

👉అభివృద్ధిచెందిన దేశాలను పట్టిపీడిస్తున్న సమస్య లలో ముఖ్యమైన సమస్య మధుమేహం.

👉పాశ్చాత్య దేశాల మాట ఎలా ఉన్నా మన దేశంలో 30-40 సంవత్సరాల వయస్సువారు కూడా మధుమేహం బారిన పడుతున్నారు. 

👉ఈ వ్యాధికి నివారణ, నియంత్రణ చర్యలే ప్రధానం. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకో వడం మినహా తగ్గించే మందులు లేవు.

👉మనల్ని ఇంతలా పట్టిపీడిస్తున్న మధుమేహ వ్యాధి నియంత్రణ, నివారణ గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించాలి.

👉మధుమేహ నియంత్రణ, నివారణపై ఎన్నో పరి శోధనలు సాగుతున్నాయి. కొన్ని విజయవంతం కూడా అయ్యాయి. వీటితోపాటు ప్రత్యామ్నాయ వైద్యాల అన్వేషణ కూడా ఎంతో అవసరం అవుతుంది.

👉వ్యాధిని అదుపులో ఉంచడానికి, ఎటువంటి సమ స్యలు రాకుండా చూసుకోవడానికి సాంప్రదాయక ఔష ధులు కొన్ని విశేషంగా పనిచేస్తాయి. అవి- 

✍️మారేడు:

👉మారేడు (ఏగ్లె మార్మె లోస్) గురించి పెద్దగా పరి చయం అక్కర్లేదు. ఈ చెట్టు శివాలయాల్లో తప్పని సరిగా దర్శనమిస్తుంది. మారేడు పత్రితో శివుణ్ణి పూజించడం ప్రతీతి. మాన వాళి ఆరోగ్య పరిరక్షణ కోసం మహాదేవుడే ఈ చెట్టుని సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి.

👉మారేడు వలన మానవాళికి ఎన్నో లాభాలున్నాయి. ఆయుర్వేదంలో మారేడుకి విశిష్ట స్థానం ఉంది. దీనిని ఆయుర్వేద ఔషధాల తయారీలో విరివిగా ఉపయోగి స్తారు. 

👉మారేడు వేర్లు, ఆకులు, ఫలాలు, విత్తనాలలో ఔషధ గుణాలు అపారం. ఈ మారేడు ఆకులలో మధుమేహాన్ని నివారించే ఔషధ విలువలు ఉన్నాయి.

👉ఆకుల్ని మెత్తగా నూరుకొని ప్రతిరోజూ నీటిలో కలిపి తీసుకుంటే మధుమేహం దరికిరాదు. 

👉ఈ ఆకుల నుంచి తీసిన కషాయంలో ఒక చిటికెడు నల్లమిరియాల పొడి కలుపుకుని తాగితే ఇంకా మంచిది.

👉 రక్తహీనత, ఉబ్బసం, పచ్చకామెర్లు, అధిక రక్తపోటు నివారించే ఔషధగుణాలు మారేడులో సమృద్ధిగా ఉన్నాయి. 

👉మామూలు వ్యాధులలో కూడా మారేడు మంచి ఔషధంలా పనిచేస్తుంది.

✍️మెంతి:

👉మెంతి (ట్రిగొనెల్లా ఫొనెమ్ గ్రేకమ్) అద్భుత మైన ఔషధ ఆహారం. రోజూ ఆహారంలో తీసు కుంటే మంచిది. 

👉ప్రతి రోజూ రెండు టీ స్పూన్ల మెంతిపొడిని తీసుకుంటే మధుమేహం, కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చును. 

👉మూత్రంలో చక్కెర పోవడాన్ని మెంతి అదుపుచేస్తుంది. మధుమేహ లక్షణాల్ని తగ్గిస్తుంది. 

👉మెంతిలో కాల్షియం, ఇనుము, ఫాస్పరస్ ధాతువులతో పాటు మాంసకృత్తులు కూడా హెచ్చుమోతాదులోనే ఉంటాయి. 

👉జీర్ణ సమస్యలను తగ్గించి... శరీరంలోని విషపదార్థాలను బైటకు పంపి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

👉 కీళ్ళవ్యాధులు నయంచేస్తుంది. పలు ఆరోగ్య సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది.

✍️వెల్లుల్లి:

👉వెల్లుల్లి (అలియమ్ సాటియమ్) ఆహార పదా ర్థంగా, ఔషధంగా ఉప యోగపడుతుంది. 

👉వంటకాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా చాలా రుగ్మతలకు మందులా పని చేస్తుంది. 

👉వెల్లుల్లిలో వాతగుణాన్ని తగ్గించే తత్వం ఉంది.

👉 యాంటీ సెప్టిక్ గుణాలన్నీ వెల్లుల్లిలో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. 

👉డయాబెటిస్ వాతరోగం కాబట్టి వెల్లుల్లి తీసుకోవడం ఎంతో ప్రయోజనకారి.

👉వెల్లుల్లిలోని 'ఎల్లిసిస్' అనే పదార్థం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించేందుకు ఉపకరిస్తుంది.

👉 వెల్లుల్లి రక్తకణాలలోని కొలెస్ట్రాల్ కరిగించి రక్తప్రసరణ సజావుగా సాగడానికి ఎంతగానో సహకరిస్తుంది.

✍️నేరేడు:

👉జామూన్ (సిజిజి యం క్యుమిన్)గా పిలిచే అల్లనేరేడు వంగపండు రంగులో ఉంటుంది.

👉ఆయుర్వేదం అపర సంజీవనిగా పేర్కొనే నేరేడు జీర్ణకోశ సంబంధిత రోగాలకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. 

👉మధుమేహ రోగులు దీన్ని ఎక్కువగా వాడతారు.

👉 ఇది మన శరీరంలో ఉండే పిండి పదార్థాలు చక్కెరగా మారకుండా నియంత్రిస్తుంది. 

👉నేరేడు పండులోని గుజ్జుకంటె గింజలు అత్యుత్తమ ప్రభావాన్ని కలిగివుంటాయి.

👉ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అవి వివిధ రోగాల నుంచి మనల్ని రక్షిస్తాయి. 

👉నేరేడు గింజల పొడిని రోజూ తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.

✍️వేప:

👉ఆరోగ్యదాయకమయినటువంటి వేప (అజాడి రక్తా ఇండికా)లో అనేక ఔషధ గుణాలున్నాయి.

👉 చరిత్రకు అందని కాలంలోనే వేపలోని ఔషధీయ గుణాలను గుర్తించారు భారతీయులు. 

👉వేపచెట్టులోని ఆకులు, వేపగింజలు, బెరడు, వేర్లలో ఔషధగుణాలు సమృద్ధిగా ఉన్నాయి

👉ఔషధాల తయారీలో వేపను విరివిగా ఉపయోగిస్తారు. 

👉నూరిన వేపాకు ముద్దను తగుమోతాదులో రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెరను తగ్గించడానికి తోడ్పడుతుంది. 

👉వేపనూనెను పలు రోగాల నివారణకు వాడతారు.

👉 వేప ఉన్న చోట ఆరోగ్యానికి ఢాకా ఉండదు.

✍️ఉల్లి:

👉ఉల్లిలో ఘాటైన వాసనే కాదు, శక్తివంతమయిన ఆహార విలువలతో పాటు ఘనమైన ఔషధ గుణాలు ఉన్నాయి.

👉ఉల్లిలో హైపోగ్లైసిమిక్ (తక్కువగా చక్కెర) గుణాలు ఉన్నాయి. 

👉దీనిలోని రసాయన గుణాల గురించి ఆయుర్వేదం సంపూర్ణంగా పరీక్షించింది.

👉ఈ ఔషధ గుణాలతోపాటు కామోద్దీపన కలిగించే ధాతువులు కూడా ఉల్లిలో పుష్కలంగా ఉన్నాయి. ఇది లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.

👉శరీరంలో శక్తిని పెంచుతుంది. ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టే ఉల్లి మధుమేహ వైద్యంలో అత్యంత విలువైన ఆహారం అయింది.

✍️కాకర:

👉ఆరోగ్యాన్నిచ్చే కాకర చేదే అయినప్పటికీ ఆరో గ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

👉పూర్వకాలం నుంచి కాకరకాయను మధుమేహానికి ఔషధంగా వినియోగిస్తూనే ఉన్నారు.

👉 కాకర ఆకులను కూడా వైద్య చికిత్సలో వాడుతున్నారు.

👉మధుమేహ రోగులకు ఇది చక్కటి ఔషధి.

👉 కాకరరసంలోని హైపోగ్లైసమిక్ పదార్థం రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

👉 ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా కాపాడుతుంది.

👉శరీరానికి అవసరమయ్యే గ్లూకోజ్ను అందించే శక్తి కాకరకు ఉంది. 

👉ఉత్తరాదివారు కరేలా అని పిలుచుకునే కాకరకాయ చక్కటి ఆరోగ్యాహారం. 

👉కాకరకాయ గింజలతో రక్తంలో గ్లూకోజును తగ్గించే చారన్టిన్ అనే ఇన్సులిన్ వంటి పదార్థం ఉంది.

👉ముదురు ఆకుపచ్చరంగులో గరుకుగా ఉండే కాకర కటిక చేదుగా ఉంటుంది. దానిలో ఉన్న సహజ గుణాలు పోకుండా కాకరను తింటే దాని ఔషధ గుణాల ప్రయోజనాన్ని పూర్తిగా పొందవచ్చును. 

👉కొద్ది మోతాదులో తీసుకునే కాకరకాయ రసం వలన శారీరక శక్తి ఒనగూరుతుంది. రక్షణ వ్యవస్థ మెరుగుపడి, రోగనిరోధకశక్తి కూడా ఇనుమడిస్తుంది.

👉కాకరకాయను ఔషధ రూపంలో తీసుకోవడానికి ముందు మధుమేహ రోగులు వైద్యసలహా తీసుకోవాలి.

👉రక్తాన్ని శుద్ధిచేసే కాకరలో బి1, బి2, బి3, సి విటమిన్లతో పాటు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, జింక్, ఫాస్పరస్, మాంగనీస్ దాతువులు అధిక మోతాదులో తక్కువ క్యాలరీ లతో లభిస్తే, బీటాకెరోటిన్, కాల్షియం, పొటాషియం వంటివి రెట్టింపు మోతాదులో ఉంతాయి.

👉 రోజూ కాకర తినడం మంచిదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రక్తంలో తీపిని తగ్గించే కాకరకాయ మధుమేహ వ్యాధి గ్రస్తులకు ప్రకృతి ప్రసాదించిన వరం.

✍️ ఉసిరి:

👉ఉసిరి (టర్మినిలియా ఆఫోసినియలిస్)లో శరీరానికి కావలసిన ఆమ్లాలు, ధాతువులతోపాటు ఎంతో ముఖ్యమైన విటమిన్ 'సి' సమృద్ధంగా లభిస్తుంది. 

👉ఆయుర్వేదం అద్భుతమైన ఔషధంగా పరిగణించే ఉసిరి శరీరంలో కొత్తకణాల అభివృద్ధిలో ఎంతో ఉపయోగపడుతుందని ప్రతీతి.

👉మధుమేహం ఉన్నవారు ఉసిరిపొడిని, కొంచెం పసుపును ఉదయాన్నే పరగడుపున ఇన్సులిన్ చికిత్స ఏదీ లేకుండా తీసుకుంటే అది మధుమేహాన్ని నివారిస్తుంది. 

👉బరువు తగ్గడానికి కూడా ఇది తోడ్పడుతుంది. ఇది కొలె స్ట్రాల్ని, రక్తంలో చక్కెర నిల్వలను తగ్గిస్తుంది.

✍️పసుపు:

👉పసుపు (కర్క్యూమా లోంగా) ప్రకృతి ప్రసాదించిన సహజ ఆరోగ్య ప్రదాయని.

👉 పదార్థాల రుచిని, రంగును పెంచి, ఆరోగ్యానికి దోహదంచేసే పసుపు సర్వరోగనివారణి.

👉రక్తంలో అధికంగా ఉన్న కొవ్వు నిల్వలను, టైగ్లిజరయిడ్స్ ను తగ్గిస్తుంది. 

👉దీనిలో విశేష ఔషధగుణాల వలన రక్తప్రసరణ మెరుగవుతుంది. 

👉మధుమేహ నివారణలో, నియంత్రణలో పసుపు అత్యంత ఉపయోగకరమైన నివారక ఔషధి. 

✍️త్రిఫలచూర్ణం:

👉త్రిఫల చూర్ణం అంటే ఉసిరి, కరక్కాయ, తాని కాయల సమ్మేళనం.

👉రాత్రి పడుకోబోయే ముందు, ఉదయం లేవగానే ఒక చెంచా త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటే మొత్తం జీవనశైలిని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అది తోడ్పడుతుంది. 

👉ఇది త్రిదోషహరం. ఈ ఔషధులన్నీ మధుమేహం రాకుండా నివారించుకోవడానికి, మధు మేహం బారినపడ్డా ఎట్టి ఆరోగ్య సమస్యలూ తలెత్తకుండా చూసుకోవడానికి ఉపయోగిస్తాయి.

👉జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ వ్యాయామం, నియంత్రిక ఆహారం, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే చక్కెర వ్యాధికి చెక్ పెట్టొచ్చు. ఆనందంగా జీవించవచ్చు.

No comments:

Post a Comment