Saturday, March 23, 2024

సంతానలేమి - వీర్యకణాల లోపం - అంగస్తంభన - శీఘ్రస్ఖలనం సమస్యలు మరియూ అద్భుతమైన ఆయుర్వేద వాజీకరణ చికిత్స నియమాలు:*

✍️ *సంతానలేమి - వీర్యకణాల లోపం - అంగస్తంభన - శీఘ్రస్ఖలనం సమస్యలు మరియూ అద్భుతమైన ఆయుర్వేద వాజీకరణ చికిత్స నియమాలు:* 

గమనిక: ఎంతోమంది మిత్రుల అభ్యర్థన మేరకు అందరికి అర్థం అయ్యేలా చాలా వివరంగా ఈ సమస్య గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొంచెం ఓపిక పెట్టి పోస్టు మొత్తం చదవండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఈ పోస్ట్ కింద కామెంట్ పెట్టండి. తప్పకుండా మీ కామెంట్ కి సమాధానం ఇవ్వడం జరుగుతుంది.

👉కామోత్తేజానికి, నవయవ్వనానికి, ఆరోగ్యవంతమైన సంతానానికి, ఆయుర్వేద శాస్త్రం
చెప్పిన అద్భుతమైన దాంపత్యవేదం "వాజీకరణ చికిత్స"

👉పురుషుడు పురుషత్వాన్ని, శక్తిని, యుక్తిని, పౌరుషత్వాన్ని కలగని వాడైతే ఆ తప్పు అతనిది కాదు. అతన్ని గన్న తల్లిదండ్రులది. 

👉ఏశక్తీ లేనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ సంతానాన్ని పొందినట్లయితే ఆ సంతానానికి మూలమైన వీర్యానికి ఏ శక్తి లేకపోతే అతను ఆరోగ్యవంతుడు ఎలా అవుతాడు.

👉 తండ్రి నుండి వారసత్వాన్ని, వీర్యాన్ని పొంది తల్లి రక్తమాంసాలతో అభివృద్ధి చెందే పిండానికి జీవం లేని రక్తమాంసాలను, చలనశక్తిలేని వీర్యకణాలను అందిస్తే ఆ సంతానం ఎలా ఆరోగ్యవంతమవుతుంది.

👉 అందుకే నేడు 15 శాతంకు పైగా భార్యాభర్తలకు సంతానయోగం లేకపోతోంది.

👉శాస్త్రాలన్నా, శాస్త్రీయత అన్నా వినడమేగాని పూర్తిగా తెలుసుకొని, పాటించనివారికి ఎలాంటి సమస్యలు వస్తాయో తెలిసే ఉంటుంది. శాస్త్రం, శాస్త్రీయత అనేది ఎన్నో సంవత్సరాలు పరిశోధించి తెలుసుకున్నవేగాని కంప్యూటర్ సాఫ్ట్ వేర్ తయారు చేసినంత తేలికైనది కాదు.

👉నేటి జీవనవిధానం, ఆహారం, కాలుష్యం, భౌగోళిక మార్పులు కారణాలతో శుక్రంలో శుక్రకణాలు లేకుండాపోతున్నాయి. 

👉పట్టణ ప్రాంతాల్లోని యువకుల్లో వందలో 60 మందికి శుక్రకణాలు ఉండాల్సిన స్థాయికంటే తక్కువగా ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. 

👉పల్లె వాతావరణంలో కూడా 40 శాతం మందికి ఇదే పరిస్థితి ఉంది. ఇలా ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వం కుటుంబ నియంత్రణ చేయించాల్సిన పనిలేదు. 50 శాతం దంపతుల్లో పిల్లలయ్యే అవకాశం లేని పరిస్థితి వస్తుంది. ఆరోగ్యవంతమైన సంతానం కూడా లేకుండా పోతోంది.

👉నపుంసకత్వం గురించి చెప్పడానికి నేటి లైంగిక సమస్యల వైద్యుల దగ్గరకు వెళ్ళే రోగులే ఉదాహరణ. 

👉చాలామంది యువకులు నీరసం, నిస్సత్తువ, శరీరంలో వేడిలాంటివే కాకుండా భాషలో చెప్పలేనన్ని సమస్యలు వివరిస్తున్నారు. 

👉వివరంగా అడిగితే రోజూ హస్త ప్రయోగం అలవాటు ఉందని చెబుతున్నారు. 

👉మనకు శక్తిని, యుక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని, మేధస్సును, శరీర పటుత్వాన్ని అందించే వీర్యాన్ని రోజూ తమ హస్త ప్రయోగం చేత బయటకు పంపుతుంటే ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు ఇంతా అంతా కావు.

👉 బలవంతంగా దేన్ని బయటకు పంపరాదు అలాగే బయటకు వెళ్ళే వాటిని ఆపకూడదు. అలా బలవంతంగా పంపడం వల్ల నపుంసకత్వం, శీఘ్రస్కలనం లాంటివెన్నో సమస్యలు వస్తాయి.

👉 వీర్యం అనేది వివాహబంధం తరువాత పునర్జన్మ నివ్వడానికి విత్తనం లాంటిది. దానిని బయట పంపి శరీరంలో వీర్యశక్తి లేకుండా చేస్తే ఇంక ఏ శక్తి ఉంటుంది.

👉నేటి జీవన విధానంలో మీ ఆహారం ఏంటనడిగితే ఉదయం ఇడ్లీ, మధ్యాహ పప్పుచారు, అన్నము, సాయంత్రం పుల్కాలు (రొట్టెలు) అనే సమాధానాలు వస్తున్నాయి. 

👉ఆహారంలో శరీరానికి కావలసిన శక్తే దొరకదు. దీనివల్ల శరీరము పెరగుతుంది. వీర్యశక్తిని, అండవృద్ధిని ఎక్కడ కలిగించుతాయి. అంతేకాదు నేడు 40 శాతం స్త్రీలకు 30 ఏళ్ళు దాటకముందే గర్భసంచి తీసేయాల్సిన స్థితి వస్తున్నది.

👉ఇలాంటి పరిస్థితి కలగకుండా రోజూ శరీరానికి అదనంగా వాజీకరణ శక్తిని పెంచే ఆహారాలు, ఔషధాలు అవసరం. మన మహర్షులు, ఋషులు పరిశోధించి చెప్పిన సత్యాలు, జీవన వేదాలు తెలుసుకుని వాటిని ఆచరించండి.

✍️ *వాజీకరణ చికిత్స:*

👉మానవుడు పురుషశక్తి పెంచుకోవడానికి, ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన సంతానాన్ని పొందడానికి ఉపయోగపడే, అష్టాంగాలలో ఒకటైనటువంటి, వాజీరకణ చికిత్స గురించి తెలుసుకుందాము.

✍️ *వాజీకరణ చికిత్స అంటే ఏమిటి?*

“యేన నారీషు సామర్థ్యం వాజీవల్లభతే నరః ప్రజేచ్ఛాభ్యధికం యేన వాజీకరణమేవ తత్॥ అపత్యసంతానకరం యత్ సథ్యసంప్రహర్షణం వాజీవాతిబలో యేన యాత్యప్రతిహతః స్త్రియః||"

👉ఏ చికిత్సా పద్ధతి పురుషున్ని స్త్రీతో అశ్వవేగంతో రతిక్రియలో పాల్గొనే శక్తిని కలిగింపచేస్తుందో ఆ చికిత్సని వాజీకరణ చికిత్స అని అంటారు లేదా పురుషునికి గుఱ్ఱానికున్నంత రతిశక్తిని కలిగించి పిచ్చుకలా ఎక్కువ పర్యాయములు రతిలో పాల్గొనే శక్తి కలిగిస్తుందో దాన్ని వాజీకరణ చికిత్స అని అంటారు.

👉 ఏ చికిత్స ఆర్యోగవంతమైన, శక్తివంతమైన శుక్రకణాలను పెంచి శీఘ్రంగా కామోత్తేజాన్ని కలిగించి శక్తివంతమైన, ఆరోగ్యవంమైన సంతానాన్ని కలిగిస్తుందో దాన్ని వాజీకరణ చికిత్స అంటారు.

👉"అవాజీం వాజీం కరోతీతి వాజీకరణం"
వాజీ అంటే అశ్వము, బలము, శుక్రము. అవాజీ అంటే బలహీనుడు, శుక్రహీనుడు, సంభోగ సమర్థత తగ్గినవాడు. శుక్రక్షయము కలిగినవాణి, బలము తగ్గినవాన్ని, సంభోగ సామర్థ్యము లేనివాన్ని బలవంతునిగా, శుక్రవంతునిగా, గుఱ్ఱానికున్నంత సంభోగ సామర్థ్యవంతునిగా తయారుచేసే చికిత్సా పద్ధతిని వాజీకరణ చికిత్స అని అంటారు. 

✍️ *వాజీకరణ చికిత్స ప్రాముఖ్యత :*

👉నేడు మారుతున్న ఆహారపుటలవాట్లు, పారిశ్రామికీకరణ, పెరుగుతున్న కాలుష్యము, ఉద్యోగ పరిస్థితులు ఆర్థిక పరిస్థితుల వల్ల పురుషుల్లో రతిశక్తి తగ్గడమే కాకుండా, వాళ్ళల్లో శుక్రకణాల (Sperm count) సంఖ్య తగ్గిపోతున్నాయి. దానివల్ల చాలామంది దంపతులకు సంతానయోగము లేకుండా పోతోంది. 

👉సంతానము కొరకు దంపతులు Sperm banks నుండి Sperm doners ద్వారా వచ్చే శుక్రకణాలపై ఆధారపడవలసిన దుస్థితి వస్తున్నది. ఈ నికృష్ట కర్మ నుంచి బయటపడడానికి ఆయుర్వేద మహర్షులు శుక్రాన్ని, శుక్రకణాలను, రతిశక్తిని పెంచేటటువంటి వాజీకరణ చికిత్సను ప్రపంచానికి అందించారు.

✍️ *వాజీకరణ చికిత్స ఉపయోగాలు:*

1. ఆరోగ్యవంతమైన శుక్రము, శుక్రబీజాలని పెంచి తద్వారా ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన సంతానాన్ని, వంశాన్ని శాఖోపశాఖలుగా పెరగడానికి ఉపయోగపడుతుంది.

2. వాజీకరణ ఔషధాలను సేవించేవాళ్ళలో అతి శీఘ్రంగా ఉత్తేజాన్ని, కామేచ్ఛను పెంచుతుంది.

3. అశ్వానికున్నంత రతిశక్తిని పెంచి, పిచ్చుకలాగా ఎక్కువ పర్యాయాలు రతిక్రియలో పాల్గొన్నా శుక్రక్షయము జరుగకుండా, ఏనుగులాగా ప్రభూత శుక్రవిసర్జన చేసేట్లు ఉపయోగడుతుంది.

4. సప్తధాతువులకు పుష్ఠిని కలిగిస్తుంది.

5. వయస్సు పెరిగినా, శరీరంలో శుక్రము తగ్గకుండా కాపాడుతుంది. 

6. శీఘ్రస్కలనాన్ని నిరోధిస్తుంది.

7. ధ్వజభంగము (అంగము మెత్తబడడము) రాకుండా ఎల్లవేళలా అంగము గట్టిపడడానికి ఉపయోగపడుతుంది.

8. శుక్రక్షయాన్ని శుక్రకణాల అల్పత, శుక్రకణాల దోషాలని తొలగిస్తుంది. 

9. భార్యాభర్తల్లో ప్రీతిని పెంచుతుంది.

10. ధర్మ, అర్థ, కామ పురుషార్థాల సాధనలో ఉపయోగపడుతుంది. 

11. వాజీకరణ ఔషధాలు తీసుకోనట్లయితే, నిర్వీర్యమైన బీజకణాల వల్ల నిర్వీర్యమైన, రోగపూరిత సంతానము కలుగును. 

👉దానివల్ల మానవజాతి అంతరించిపోయే ఆస్కారముంటుంది. నేడు పాశ్చాత్య దేశాలలో ఇదే జరుగుతున్నది. 

👉వాజీకరణ ఔషధాలు ముఖ్యంగా 20 సం॥ల నుండి 70 సం||ల వయస్సువారు తీసుకున్నట్లయితే బలమైన, ఆరోగ్యవంతమైన బీజకణాలతో, విశ్వంలో మానవజాతి కొనసాగేట్లు ఉపయోగ పడుతుంది.

✍️ *సంభోగశక్తి తగ్గడానికి కారణాలు:*

👉 *జరయా:* 
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో శుక్రక్షయము జరిగి సంభోగశక్తి, సంభోగ ఇచ్ఛ తగ్గిపోతుంది.

👉 *చింతయా:* 
కుటుంబ సమస్యలతో గాని, ఉద్యోగ సమస్యలతో గాని మనస్సు ఎల్లప్పుడూ ఏదో ఒక చింత, ఆలోచనలతో ఉన్నట్లయితే వాజీకరణ శక్తి
తగ్గుతుంది.

👉 *వ్యాధిభి:* 
చిన్న వయస్సులోనే శరీరము మధుమేహము, స్థూల కాయము (obesity), క్షయ, రుమాటిజమ్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినపుడు రతి ఇచ్ఛ, రతిశక్తి పూర్తిగా తగ్గిపోతుంది.

👉 *కర్మ కర్షనాత్:* 
శక్తిని మించి శ్రమ చేసేవాళ్ళలో, IT Industry లో పనిచేసేవాళ్ళలో, పరిశ్రమలలో పనిచేసేవాళ్ళలో, కూలిపని చేసేవాళ్ళలో శరీరం కృశించడంవల్ల కామేచ్ఛ, రతిశక్తి తగ్గుతుంది.

👉 *అనశనాత్:* 
ఎపుడూ పనిలో నిమగ్నమై సరైన వేళల్లో భోజనము చేయనట్లయితే, సంపూర్ణాహారము తీసుకోనట్లయితే వాజీకరణ శక్తి తగ్గుతుంది. 

👉 *స్త్రీ అతిసేవనాత్:* 
ఒకరికన్నా ఎక్కువ భార్యలుండడము వల్ల, illegal sex వల్ల, వాజీకరణ ఔషధాలు తీసుకోనట్లయితే శుక్రము తగ్గి రతి శక్తి తగ్గిపోతుంది.

👉 *భయాత్ :* 
రకరకాల కారణాల వల్ల కలిగే భయము వల్ల (చిన్నచిన్న ఇండ్లు ఉండడం వల్ల పిల్లలు చూస్తారని భయము, పెద్దవాళ్ళు చూస్తారని భయము, కోరికలు తీరుతాయో లేదో అన్న భయము, అప్పులవాడి భయము, తలపెట్టిన పని అయిపోలేదని భయము, అక్రమంగా సంపాదించిన డబ్బు వల్ల భయము లాంటి రకరకాల భయాల వల్ల మనస్సు నిర్మలంగా లేకపోవడము) రతిఇచ్ఛ. రతిశక్తి తగ్గిపోతుంది.

👉 *విస్రంభాత్ :* 
ఎప్పుడూ ప్రతిదానికి శంకించే స్వభావము ఉండడం వల్ల, కొంతమంది పురుషులు వాళ్ళ స్త్రీలను అనుమానిస్తుంటారు. దానివల్ల కూడా సంభోగ ఇచ్ఛ, సంభోగశక్తి తగ్గిపోతుంది.

👉 *శోకాత్:* 
మనసు ఎప్పుడూ నచ్చిన వస్తువు ఏదో ఒక వస్తువు పోయినదనిగాని, ఇష్టమైన వారు దూరమైనా, ఇలాంటి శోకాలవల్ల కూడా రతిశక్తి తగ్గిపోతుంది. 

👉 *స్త్రీ దోష దర్షనాత్:* 
స్త్రీలలో ఎప్పుడూ ఏదో ఒక తప్పు చూడడమువల్ల
కూడా వాజీకరణ శక్తి తగ్గిపోతుంది.

👉 *నారీ నామరసజ్ఞాత్వత్:* 
స్త్రీలు వారి భాగస్వామిని ఉత్తేజపరచకపోయినా కూడా వాజీకరణ శక్తి తగ్గుతుంది. 

👉 *అవిచారాత్:* 
స్త్రీ సుఖము అనుభవించాలని మనస్సులో కోరిక, సంకల్పము లేకపోవడము వల్ల కూడా రతిశక్తి తగ్గుతుంది.

👉 *అసేవనాత్:* 
భార్యాభర్తల మధ్య విభేదాల వల్ల చాలాకాలము వరకూ ' కలవకపోవడమువల్ల, ఉద్యోగరీత్యా భర్త ఒక స్థానంలో, భార్య ఒక స్థానంలో ఉండడము వల్ల కూడా సంభోగ ఇచ్ఛ, సంభోగశక్తి తగ్గిపోతుంది.

👉కాబట్టి కామేచ్ఛ తగ్గినవాళ్ళు, రతిశక్తి తగ్గినవాళ్ళు పైన చెప్పుకున్న కారణాలు అన్నింటిని తగ్గించుకొని, వాజీకరణ ఔషధాలు తీసుకున్నట్లయితే వాళ్ళలో తగ్గిన కామేచ్ఛ, రతిశక్తి తిరిగి ఉద్భవిస్తుంది.

✍️ *వాజీకరణశక్తిని, కామోద్దీపాన్ని కలిగించే యోగాలు:*

👉 *లింగశైథిల్యం (అంగస్తంభన) అరికట్టే యోగాలు:*

1. పిప్పళ్ళ చూర్ణము, మినపపిండి, ఎఱ్ఱబియ్యము పిండి, బార్లీ పిండి, గోధుమ పిండి, నెయ్యిలను సమానంగా తీసుకొని కండచెక్కర, పాలు కలిపి పాయసంగా చేసి తిన్నట్లయితే లింగశైథిల్యము జరుగదు.

2. రావిఫలాలు, రావి మూలము, రావిమొగ్గలు, రావిపట్ట పాలలో కలిపి మరిగించి ఆ పాలకు కండచెక్కర కలిపి త్రాగినట్లయితే అనేక పర్యాయములు రతిక్రియ జరిపే శక్తి వస్తుంది.

3. కౌంచబీజాలు (దూలగొండి), నీరు గొరిమిడి గింజల చూర్ణాన్ని సమానంగా కలిపి 5 గ్రాముల చూర్ణాన్ని వేడి వేడి పాలు కండచెక్కర కలిపి తాగినట్లయితే లింగశైథిల్యము జరుగదు.

👉 *కామవాంఛను పెంచే యోగాలు:*

1. ఎఱ్ఱబియ్యంతో అన్నము చేసి ఆ అన్నాన్ని మినపపప్పు రసము నెయ్యి కలిపి భోజనము చేసి, తర్వాత కండచెక్కర కలిపిన పాలు తాగినట్లయితే పరమ కామవాంఛను పెంచుతుంది.

2. పల్లేరు గింజలు, విదారికంద (నేలగుమ్ముడు) చూర్ణాన్ని సమానంగా తీసుకొని దానికి నాలుగు భాగాలు పాలు కలిపి మరిగించి దాంట్లో మినపపిండి, ఎఱ్ఱబియ్యం, నెయ్యి, కండచెక్కర కలిపి పాయసంగా చేసి ఆ పాయసము తిన్నట్లయితే కామేచ్ఛను పెంచుతుంది.

3. 5 గ్రాముల అతిమధురము చూర్ణము, ఒక చెంచా తేనె, అరచెంచా నెయ్యి కలిపి తిని అనుపానంగా కండచెక్కర పాలు కలిపి తాగిన ట్లయితే ప్రతిరోజూ కామేచ్చను కలిగి ఉంటారు.

4. అరలీటరు పాలల్లో పదిగ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని కలిపి చిక్కగా కాచి దానియందు పటికబెల్లము కలిపి తీసుసున్నట్లయితే ప్రబలమైన కామేచ్ఛ పెరుగుతుంది.

5. పావులీటరు నెయ్యి, ముప్పావు లీటరు పిల్లిపీచర (శతావరి) రసాన్ని కలిపి దానికి పదిరెట్లు పాలు కలిపి నెయ్యి మిగులు వరకు కాచి చల్లార్చి దానియందు నెయ్యికి నాలుగవ భాగము పిప్పళ్ళ చూర్ణము, పటికబెల్లం, తేనె కలిపిన మిశ్రమాన్ని రోజూ ఉదయం, సాయంత్రం ఒక చెంచా చొప్పున తిన్నట్లయితే ఉత్తమ వాజీకరణంగా పనిచేస్తుంది.

👉 *శుక్రస్తంభన యోగాలు లేదా శీఘ్ర స్కలనాన్ని నివారించే యోగాలు:*

1. అశ్వగంధ, శతావరి, కోకిలాక్ష (నీరుగొరిమిడి) బీజాలు, ఆత్మగుప్త బీజాలు (కౌంచబీజాలు), అక్కలకర్ర, మినపపప్పు వీటిని సమానంగా తీసుకుని చూర్ణంగా చేసి పటికబెల్లము కలిపి ఒక చెంచా చూర్ణాన్ని పాలల్లో ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే శీఘ్రస్కలనాన్ని నిరోధిస్తుంది.

2. మినపప్పు, మర్కటి బీజాలు (ఆత్మగుప్త), విదారికంద, శతావరి, అశ్వగంధ, యష్టిమధు, నేలతాడి గడ్డలు వీటిని సమానంగా తీసుకొని వాటికి 16 రెట్లు నీటిని కలిపి కషాయంగా చేసి దానియందు ముప్పావు లీటరు నెయ్యి ముప్పావు లీటరు నేలగుమ్ముడు (విదారికంద) రసము, ముప్పావులీటరు చెరుకు రసము, ఏడు లీటర్ల ఆవు పాలు కలిపి మందాగ్నిపై పాలు, కషాయము ఇగిరిపోయే వరకుకాచి కొద్దిగా చల్లారిన తర్వాత దాని యందు సరిపడినంత తేనె, పటికబెల్లం, వెదురుప్పు, 50 గ్రాముల పిప్పళ్ళ చూర్ణము కలిపి భద్రపరచుకోవాలి. ఈ విధంగా తయారైన మిశ్రమాన్న ఒకచెంచా ఉదయం, సాయంత్రం భోజనము ముందు తీసుకున్నట్లయితే జననాంగాలు శక్తివంతంగా అవడమే కాకుండా.. శీఘ్రస్కలనము నివారింపబడుతుంది.

👉 *శుక్ర ప్రమాణాన్ని, శుక్ర కణాలను పెంచే యోగాలు:*

1. కౌంచబీజాలు, మినపబీజాలు, ఖర్జూరము, పిల్లిపీచర, శొంఠి, ఎండుద్రాక్ష వీటిని సమానంగా 20 గ్రా. చొప్పున తీసుకుని దానికి ముప్పావులీటరు పాలు, ముప్పావు లీటరు నీరు కలిపి మరిగించాలి. ముప్పావు లీటరు మిగిలేవరకు మరిగించాలి. దాన్ని వడబోసి దానికి సమానపాళ్లలో కండచెక్కర, వంశలోచనము, నెయ్యి కలిపి భద్రపరచాలి. ఈ మిశ్రమాన్ని ఒక చెంచా మాత్రలో తేనె అనుపానంతో తీసుకున్నట్లయితే శుక్ర ప్రమాణము శుక్రకణాలు బాగా పెరుగుతాయి.

2. పెసలు, మినుములు, కౌంచబీజాలు, అశ్వగంధ, శతావరి, గోక్షుర (పల్లేరు), నీరుగొరిమిడి బీజాలు, వృద్ధదారు (సముద్రపాల), సఫేద ముస్లి, నేలతాడిదుంపలు, విదారికంద (నేలగుమ్ముడు), పెద్దబెండ ఈ వన మూలికలను అన్నింటిని సమానంగా తీసుకుని చూర్ణంగా చేసి 5 గ్రా. చూర్ణము ఉదయం సాయంత్రం పాలతో తీసుకున్నట్లయితే శరీరంలో శుక్రధాతువుని పెంచే శుక్రకణాలను పెంచుతాయి. అదేవిధంగా ఉత్తమ వాజీకరణ ఔషధంగా పనిచేస్తాయి.

3. ఖర్జూరము, మినపప్పు, పిల్లిపీచర, అతిమధురము, ఎండుద్రాక్ష, కౌంచబీజాలు సమానంగా తీసుకుని వాటికి 16 పాళ్ళలో నీరు కలిపి నాల్గవవంతు మిగిలేవరకు మరిగించి, దానికి ముప్పావులీటరు పాలు కలిపి కేవలము పాలు మిగిలేవరకు మరిగించి చల్లారిన తరువాత కండచెక్కర కలిపి తీసుకున్నట్లయితే శుక్రధాతువుని, శుక్రకణాలను బాగా పెంచుతుంది.

అన్ని రకాల వెన్నుముక సమస్యలు (spinal disorders) - అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు:*

✍️ *అన్ని రకాల వెన్నుముక సమస్యలు (spinal disorders) - అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు:*

👉మన శరీరంలో అత్యంత ముఖ్యమైన, సున్నితమైన భాగం ఈ వెన్నుముక. దీనికి ఏ చిన్న గాయమైనా ప్రాణం విలవిల్లాడుతుంది. రోజువారీ పనులపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే, వెన్నెముక సమస్యలను వెంటనే గుర్తించలేం. సమస్య వచ్చిన తర్వాత తగ్గించలేం. అందుకే, మొదటి నుంచి మనం జాగ్రత్తగా వ్యవహరించాలి.

👉వయసుతో సంబందం లేకుండా చాలామంది మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపడుతుంటారు. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. 

👉కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్రపిండాలలో రాళ్లదాకా నడుము నొప్పికి కారణాలు చాలా ఉన్నాయి.

✍️ *నొప్పికి ముఖ్య కారణం డిస్క్(disc problem):*

👉శరీరానికి ఒక ఆకృతి రావడానికి ఉపయోగపడే వెన్నుపాములో 29 వెన్నుపూసలు ఉంటాయి. 

👉మెడ భాగంలో C1 నుంచి C7 వరకు మొత్తం ఏడు వెన్నుపూసలు, ఆ తరువాత రొమ్ము భాగంలో ఉండే పన్నెండు వెన్నుపూసలు D1 నుంచి D12. ఇక నడుము భాగంలో ఉండే వెన్నుపూసలు అయిదు. అవి L1 నుంచి L5. ఆ తరువాత కాలి ఎముకలకు ముందు ఉండే వెన్నుపూసలను S1 నుంచి S5 గా పిలుస్తారు. 

👉ప్రతి రెండు వెన్నుపూసల మధ్య మెత్తని గిన్నె లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్నే డిస్క్ (Intervertebral disc) అంటాం.

👉 దీని పై భాగం గట్టిగా ఉన్నా లోపల జెల్లీలాంటి పదార్థం ఉంటుంది. 

👉డిస్కులు వెన్నుపామును షాక్స్ నుంచి రక్షిస్తాయి. డిస్కులు జారడం వల్ల గానీ, అవి అరిగిపోవడం వల్ల గానీ నొప్పి మొదలవుతుంది. 

👉వెన్నుపూసల నుంచి బయలుదేరే నాడులన్నీ కలిసి పిరుదుల భాగంలో ఒక్క నాడిగా ఏర్పడి కాలి కింది భాగంలోకి వెళతాయి. ఈ నరాన్నే సయాటిక్ నరం అంటారు. డిస్కులో సమస్యలున్నప్పుడు ఏర్పడే ఏ నడుంనొప్పి అయినా ఈ సయాటిక్ నరం గుండా కాలిలోకి పాకుతూ వెళుతుంది. అందుకే డిస్కుల వల్ల కలిగే ఈ నడుంనొప్పిని సయాటికా (Sciatica) నొప్పి అని కూడా అంటారు.

✍️ *డిస్క్ జారడం (slipped disc):*

👉రెండు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు జారడాన్నే డిస్క్ ప్రొలాప్స్ (Disc prolapse) లేదా స్లిప్‌డ్ డిస్క్ (Slipped disc) అని గానీ అంటారు.

👉 డిస్కు జారడమంటే గిన్నె లాంటి నిర్మాణం మొత్తం పక్కకు జారిపోతుందని అనుకుంటారు. కానీ డిస్కు పై భాగంలో పగులులా ఏర్పడి లోపలున్న జెల్లీ పదార్థం బయటకు వస్తుంది. ఇది డిస్కు వెనుక ఉన్న స్పైనల్ నరంపై ఒరిగిపోతుంది. దానివల్ల నరం ఒత్తిడికి గురయి నొప్పి వస్తుంది. 

👉ఏ వెన్నుపూసల మధ్య ఉన్న డిస్కు జారిందన్న దాన్ని బట్టి దాని వల్ల కనిపించే నొప్పి లక్షణాలు కూడా వేరుగా ఉంటాయి. లక్షణాలను బట్టి ఏ డిస్కు జారివుంటుందో కూడా చెప్పవచ్చు.

👉ఉదాహరణకి L4, L5 వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు జారినప్పుడు తొడ భాగంలో పక్కవైపు నుంచి కాలు కింది వరకూ నొప్పి ఉంటుంది. నడుంనొప్పి కన్నా కాళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారిగా పక్కకు తిరగడం, బరువు ఎత్తడం, వంగడం వల్ల నొప్పి మొదలవుతుంది.

👉 ఒక్కసారిగా కూర్చున్న చోట నుంచి లేచినా డిస్కు స్లిప్ అవుతుంది. జెర్క్ ఉన్న ఏ కదలిక వల్లనైనా డిస్కు జారవచ్చు. 

👉L5, S1 మధ్య ఉన్న డిస్కు జారితే తొడ వెనుక భాగం అంటే వెనుక వైపు తొడ నుంచి కాలి పాదం వరకూ నొప్పి ఉంటుంది.

✍️ *డిస్కు అరుగుదల:*

👉డిస్కు అరిగిపోవడం ప్రారంభమైన తొలిదశలో నడుంనొప్పి అంత తీవ్రంగా ఉండదు. తరువాత ఎక్కువ అవుతుంది. ఎక్కువ సేపు కూర్చున్నా, నిల్చున్నా నొప్పి ఎక్కువ అవుతుంది. విశ్రాంతిగా ఉన్నప్పుడు తక్కువ అవుతుంది. 

👉డిస్కు అరుగుతున్నకొద్దీ సమస్య తీవ్రం అవుతుంది. డిస్కు అరిగిపోవడంతో రెండు వెన్నుపూసలు గీరుకుంటాయి. నరం ఒత్తిడికి గురవుతుంది. 

✍️ *స్పాండైలో లిస్థెసిస్ (spondylolisthesis):*

👉వయసురీత్యా కలిగే మార్పులలో వెన్నుపూసలు పక్కకు జరిగిపోవడం (స్పాండైలో లిస్థెసిస్) కూడా ఒకటి. 

👉చిన్న వయసులోనే వెన్నుపూసలు జరిగిపోయాయంటే మాత్రం ప్రమాదాలే కారణం. యాక్సిడెంట్ వల్ల వెన్నుపూసల వెనుక ఉండే లింకులో ఫ్రాక్చర్ వల్ల వెన్నుపూసలు పక్కకు జరుగుతాయి. ఇలాంటప్పుడే నడుంనొప్పి స్థిరంగా ఉంటుంది. 

👉ఇదీ సయాటికా నొప్పే. నిటారుగా ఉన్నవాళ్లు పక్కకు తిరిగినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. కింద కూర్చుని పైకి లేచేటప్పుడు కూడా నొప్పి పెరుగుతుంది. రెండు కాళ్లలోనూ నొప్పి ఉంటుంది. ఆడవాళ్లలో ఈ రకమైన నడుంనొప్పి ఎక్కువగా కనిపిస్తుంది.

✍️ *స్పైన్ ఇన్‌ఫెక్షన్(spine infection):*

👉వెన్నుపాము ఇన్‌ఫెక్షన్లలో అతి సాధారణంగా కనిపించేది క్షయ. ఎముక టిబి వల్ల కూడా కనిపించే ముఖ్య లక్షణం నడుంనొప్పే. ఎముక టిబి ఉన్నవాళ్లలోరావూతిపూట నొప్పి ఎక్కువగా ఉంటుంది. నొప్పితో పాటు జ్వరం ఉంటుంది. బరువు తగ్గిపోతారు. ఆకలి ఉండదు. చెమట ఎక్కువగా పడుతుంది. టిబి వల్ల నరాలు దెబ్బతిని కాళ్లు చచ్చుబడిపోయే అవకాశం కూడా ఉంది.

✍️ *స్పైన్ ట్యూమర్స్(spine tumors)*

👉వెన్నుపాము కింది ఎముకలో క్యాన్సర్ కణుతులు ఏర్పడినప్పుడు కూడా నడుంనొప్పి ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గుతారు. కానీ జ్వరం మాత్రం ఉండదు.

✍️ *సాగిటల్ ఇంబ్యాపూన్స్(Sagittal Imbapoons):*

👉అయిదు పదులు దాటిన తరువాత కొంతమంది మెల్లమెల్లగా ముందుకు వంగిపోతారు. వెన్నుపాము నిర్మాణంలో తేడా రావడం వల్ల పిరుదులు, తొడ భాగాల్లో నొప్పిగా ఉంటుంది. పడుకుని ఉన్నప్పుడు నొప్పి ఉండదు. వెన్నుపామును సాధారణ స్థితికి తేవడానికి కండరాలన్నీ ప్రయత్నించడం వల్ల నొప్పి మొదలవుతుంది.

👉90 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో నడుంనొప్పితో బాధపడతారు. వీరిలో 80 శాతం మందికి ఆరువారాల్లోగా నొప్పి తగ్గిపోతుంది. మిగిలిన 20 శాతం మంది మాత్రం తీవ్రమైన నడుంనొప్పితో నిత్యం బాధపడుతుంటారని అంచనా. వీరిలో 10 శాతం మందికి మాత్రం ఆపరేషన్ అవసరం అవుతుందని అమెరికా అధ్యయనాలు తెలుపుతున్నాయి. అమెరికాలాంటి దేశంలోనే గణాంకాలు ఇలా ఉంటే ఇక మన ఇండియాలాంటి దేశంలో ఈ సమస్య మరింత ఎక్కువనే చెప్పాలి.

✍️ఇతర కారణాలు:

👉కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి ఉన్నప్పటికీ దానికి వెన్నుపాముతో ఎటువంటి సంబంధం ఉండదు. అలాగని అశ్రద్ధ చేయడం పనికిరాదు. ఇలాంటప్పుడు ఇతరత్రా సమస్యలేవైనా ఉండవచ్చు. అయితే నొప్పి లక్షణాన్ని బట్టి అది ఏ అవయవానికి సంబంధించిన సమస్యో కొంతవరకు నిర్ధారించవచ్చు.

👉కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు కూడా నడుంనొప్పి ఉంటుంది. అయితే ఇది అలా వచ్చి ఇలా పోతుంది. వచ్చినప్పుడల్లా పది నుంచి 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. నొప్పితో పాటు మూత్రంలో మంట ఉంటుంది. నొప్పి ఒకేచోట ఉంటుంది. కాళ్లలోకి పాకదు. ఒక్కోసారి కిడ్నీలో నీళ్లు నిండిపోయినప్పుడు (హైవూడోనెవూఫోసిస్) కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. దీంతోపాటు మూత్రం తక్కువ లేదా ఎక్కువ సార్లు రావడం, ఇతరత్రా మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఉంటాయి.

👉వెన్నెముక కాకుండా కేవలం కండరాలకు సంబంధించిన నొప్పే అయితే గనుక ఆ కండరాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది. ఆ కండరం ఒత్తిడికి గురయ్యేలా బరువు ఎత్తినా, పక్కకు తిరిగినా నొప్పి ఉంటుంది.

👉పాంక్రియోటైటిస్ లాంటి జీర్ణవ్యవస్థ సంబంధమైన సమస్యలున్నప్పుడు బొడ్డు నుంచి వెనక్కి నొప్పి వ్యాపిస్తుంది.

👉గర్భాశయం, ఓవరీలలో సమస్యలున్నప్పుడు పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ (పిఐడి) సమస్య వల్ల పిరుదుల భాగంలో నొప్పి, బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ నొప్పితో పాటు రుతు సంబంధ సమస్యలుంటాయి..

✍️ *వెన్నుముక సమస్యలకు ఆయుర్వేద గృహ చిట్కాలు:*

👉ఆయుర్వేద రస శాస్త్రంలో గుగ్గులుతో కూడిన మూలికా మిశ్రమాలతో కలిగిన ఔషధాలు ఉన్నాయి. ఇందులో కాంచన, త్రిఫల, త్రయోదశాంగ, కైశోర, నవక, పంచతిక్త, అమృతాది, గోక్షురాది, మహారాజ, సింహనాద, రాన్సాది గుగ్గులు ఉన్నాయి. ఇవి కీళ్లవాతం, సంధివాతం, వెన్నుముక సమస్యలు, చర్మరోగాలు, కొలెస్ట్రాల్‌ తగ్గిస్తాయి. 

👉ఆయుర్వేద ఔషధ మూలికల్లో శొంఠిపొడి, నల్లనువ్వులు, ఆముదం చెట్టు బెరడు, గింజలు, వేర్లు, కరక్కాయ, తిప్పతీగ, నల్లేరు, పారిజాతం మొక్క, మెంతాకు, రావి చెక్క, వావిలి, మునగాకు ముఖ్యమైనవి. నియామానుసారం ఆహార, విహార, రుతు నియమాలు పాటిస్తే అనారోగ్యం దరిచేరకుండా చూసుకోవచ్చు

👉ప్రభావవంతమైన మార్గాలలో నొప్పి లేదా ఉద్రిక్తమైన కండరాలను సున్నితంగా మసాజ్ చేయడం మంచిది.

👉నడుము నొప్పితో బాధపడేవారికి వ్యాయామాలు మంచివి. కండరాలను పునరుద్ధరించడంలో సహాయపదుతుంది మరియు తదుపరి నొప్పి నుండి మిమ్మల్ని రక్షించవచ్చు. కొన్ని వ్యాయామాలు (మైదానంలో నడవడం, నిలబడి వంగిగడం ,కోబ్రా భంగిమ మొదలైనవి) లక్షణాలను తగ్గించగలవు. 

👉వెన్నునొప్పిని తగ్గించడానికి వేడి మరియు శీతల కాపడాలు మంచి మార్గాలు . గాయం అయిన వెంటనే, స్ట్రెయిన్ వంటి వాటిని ఉపయోగించినప్పుడు ఐస్ ప్యాక్‌లు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. టవల్‌లో చుట్టిన ఐస్ ప్యాక్‌ను నేరుగా నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టడం వల్ల మంట తగ్గుతుంది. హీటింగ్ ప్యాడ్ గట్టి లేదా బాధాకరమైన కండరాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఏదైనా హీటింగ్ ప్యాడ్‌లోని సూచనలను చదివి, అనుసరించాలి మరియు అది చాలా వేడిగా లేదని నిర్ధారించుకోవడానికి ఉష్ణోగ్రతను పూర్తిగా పరీక్షించాలి.

రక్త హీనత - అనీమియా సమస్యల పూర్తి వివరణ మరియూ అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు:*

✍️ *రక్త హీనత - అనీమియా సమస్యల పూర్తి వివరణ మరియూ అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు:*

ఇది ముఖ్యంగా మూడు కారణాల వల్ల వస్తుంది.

*1).పౌష్టికాహార లోపం -*

ఐరన్ (ఇనుము ధాతువు) కలిగిన ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారంలోను ఎక్కువ నిల్వలుంటాయి. ఇవి కలిగిన ఆహారం సమతుల్యంతో తీసుకోకపోవడం.

*2).రక్తం నష్టపోవడం -*

 స్త్రీలు ఋతుస్రావం ద్వారా, పిల్లలు కడుపులో నత్తల ద్వారా, క్రమేపి రక్తాన్ని కోల్పోయి, రక్తహీనతకి గురి అవుతారు.

*3).రక్తం తయారీలో అవరోధం -*

 జబ్బుల వలన (ఉదా. మలేరియా, రక్తంలోని ఎర్ర కణాలు ధ్వంసం అయి మరల పెరగవు.) దీంతో రక్తం తయారవక రక్తహీనత కనపడుతుంది.

✍️ *రక్తహీనత లక్షణాలు:*

👉నాలుక, కనురెప్పలలోపలి భాగాలు పాలిపోవడం, 

👉అలసట, 

👉చికాకు, 

👉ఆకలి లేకపోవడం, 

👉మైకం, కళ్ళు తిరగడం, 

👉అరచేతుల్లో చెమట, 

👉చేతుల గోళ్ళు వంగి గుంటలు పడడం,

 👉పాదాలలో నీరు చేరడం, 

👉చిన్న పిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి, నీరసం మొదలైనవి.

✍️ *రక్త హీనత అంటే ఏమిటి?*

👉మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం.

👉 ఇది తయారవడానికి మాంసకృత్తులతో పాటు ఇనుము అనే పోషక పదార్థం ముఖ్యంగా అవసరం.

👉 మన శరీరంలో హీమోగ్లోబిన్ పరిమాణం ఒక మోతాదులో ఉంటుంది. 

👉 మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు,

👉ఆడవారిలో 12 గ్రాములు, 

👉6 సంవత్సరంలోపు పిల్లల్లో 11 గ్రాములు,

👉 గర్భిణీ స్త్రీలలో 11 గ్రాములు,

👉 బాలింతలలో 12 గ్రాములు, 

👉6 నుండి 12 సం.ల లోపు పిల్లలలో్ 12 గ్రాములు ఉండాలి. 

👉ఒకవేళ హీమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తగ్గితే రక్త హీనతతో వారు బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు.

👉రక్తహీనతకు (అనీమియా) గురైన వ్యక్తి శరీ రంలో ఎర్ర రక్త కణాలు (రెడ్‌బ్లడ్‌సెల్స్‌- ఆర్‌ బిసి- లేదా ఎరిత్రోసైట్స్‌) సంఖ్య తగ్గిపోతుంది. 

👉రక్త పరీక్షలో ఆర్‌బిసి కౌంట్‌ ద్వారా రోగి రక్తంలో ఎన్ని ఎర్రరక్తకణాలున్నాయనే విష యాన్ని తెలుసుకోవచ్చు. 

👉రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య 38 శాతం నుంచి 48 శాతం వరకూ ఉంటుంది.

👉 ఆర్‌బిసి లో ఆక్సిజన్‌ను తీసుకునివెళ్లే కణాలను హీమో గ్లోబిన్‌ అంటారు.

👉ఆరోగ్యవంతుల్లో హీమోగ్లోబిన్‌ ఒక డెసి లీటర్‌కు 12 గ్రాములుంచి 16 గ్రాముల మధ్య ఉంటుంది.

👉 ఆర్‌బిసి కౌంట్‌ ఒక మైక్రోలీటర్‌కు 4.4నుంచి 5.8 మిలియన్ల వరకూ ఉంటుంది.

👉 ఆర్‌బిసిలోని హీమోగ్లోబిన్‌ ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళుతుంది. 

👉ఆక్సిజన్‌ రవాణా వ్యవస్థగా ఎర్ర కణాలు ఉపకరిస్తాయి. ఆక్సిజన్‌ శరీరానికి ఇంధనంగా ఉపయోగపడుతుంది.

👉రక్తహీనతకు గురైన వ్యక్తిలో అవసరమైన స్థాయిలో ఎర్ర రక్త కణాలు ఉండవు. 

👉ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ అందదు. 

👉రోగి ఎంతో అలసట పొందడం, చివరకు శ్వాస తీసు కోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది.

👉 రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు తమలో శక్తి పూర్తిగా నశించిపోయినట్లు భావిస్తారు . 

👉ఆర్‌బిసి లలో ఉన్న హీమోగ్లోబిన్‌ కణాల నుంచి కార్బన్‌ డై ఆక్సైడ్‌ అనే వ్యర్థ పదార్థాన్ని సేకరించి, ఊపిరితిత్తులకు అందజేస్తుంది. ఊపిరితిత్తులు ఈ వ్యర్థపదార్థాన్ని విసర్జిస్తాయి.

👉శరీరంలో ఉండే ఎరిత్రోప్రోటీన్‌ అనే హార్మోన్‌ బోన్‌ మారోను ఉత్తేజపరిచి, ఎర్ర రక్తకణాల సంఖ్యను నియంత్రించేలా చేస్తుంది. 

👉శరీరంలో ఉండే దాదాపు మొత్తం ఎరిత్రోప్రోటీన్‌ను మూత్రపిండాలు ఉత్పత్తి చేస్తాయి. 

👉అక్కడినుంచి ఎరిత్రోప్రోటీన్‌ బోన్‌మారోకు చేరుతుంది. ఇక్కడే ఎర్ర రక్తకణాలు తయారవుతాయి. 

👉ఒక వ్యక్తి మూత్రపిండాల వ్యాధికి గురైన ప్పుడు మూత్రపిండాలు అవసరమైన స్థాయిలో ఎరిత్రోప్రోటీన్‌ను ఉత్పత్తి చేయలేవు. 

👉ఎరిత్రోప్రోటీన్‌ లేకుండా, బోన్‌మారో తగి నంత సంఖ్యలో ఎర్ర రక్తకణాలను తయారు చేయలేవు.

👉 ఫలితంగా శరీరావసరాలకు సరిపో యేంత ఆక్సిజన్‌ అందదు.

👉మూత్రపిండాలు విషపదార్థాలను, ద్రవాలను శరీరంనుంచి తొలగిస్తాయి. 

👉మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారిలో ఈ పని డయాలిసిస్‌ ద్వారా కొంత జరుగుతుంది.

👉కాని, ఎరిత్రోప్రోటీన్‌ను తయారు చేయడం మాత్రం మూత్రపిండాల వ్యాధికి గురైన ప్పుడు సంభవం కాదు.

✍️ *రక్త హీనత ఎవరిలో ఎక్కువగా కనబడుతుంది?*

👉గర్భిణీ స్త్రీలు, 
👉బాలింతలు,
👉15-45 సం.వయస్సు గల స్త్రీలు,
👉11 సం.ల లోపు పిల్లలలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. 
👉అయితే మగవారిలో కూడా రక్తహీనత చోటుచేసుకోవడం అసాధారణం కాదు.

✍️ *రక్త హీనత వల్ల కలిగే దుష్పరిణామాలు:*

👉బలహీనత, 
👉గర్భస్రావం, 
👉తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, 
👉పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం, 
👉పనిచేసే సామర్థ్యం తగ్గుదల, 
👉రోగాలు తేలికగా వెంటవెంటనే రావడం,
👉 చదువులో వెనుకపడడం, 
👉ఎక్కువసేపు పనిచేయలేకపోవడం,
👉 ఆటలు ఆడలేకపోవడం మొదలైనవి.

✍️ *రక్తహీనతను నివారించడం ఎలా?*

👉రక్తహీనతను నివారించడానికి భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒక ప్రజారోగ్య కార్యక్రమాన్ని చేపట్టింది. 

👉రక్తహీనతకు తేలికగా గురికాగల గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఉపకేంద్రం ద్వారా ఇనుమున్న ఎర్రగోలీలు (ఐరన్, ఫోలిక్ ఆసిడ్ మాత్రలు) ఉచితంగా ఇవ్వబడుతున్నాయి.

👉 ఈ గోలీలను గర్భిణీ స్త్రీలయితే 6వ నెల మొదటి నుండి 100 రోజుల పాటు, బాలింతలు చనుబాలు ఇస్తున్నంత కాలం లేదా 100 రోజుల పాటు, 11 సం. వయస్సులోపున్న రక్తహీనతగల పిల్లలు సంవత్సరంలో కనీసం 100 రోజులపాటు క్రమం తప్పకుండా రోజుకొక్కగోలీ చొప్పున తీసుకోవడం వల్ల వారి శరీరానికి పూర్తి రక్తపుష్టి చేకూరుతుంది.

👉ఈ మాత్రలు తీసుకొనేవారి మలం నల్లబడడం, వికారం కల్గడం సహజం. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు.

👉ఆకుకూరలు రక్తహీనత నివారణకు సులభమైన ఉపాయం

✍️ *చికిత్సా విధానం :*

👉చిన్న పిల్లలకి పొట్ట పురుగుల మందు ఇవ్వాలి.

👉 మల విసర్జన తరువాత చేతులు సబ్బుతో తోముకునేలా అలవాటు చేయించాలి. 

👉ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం (ఆకుకూరలు, పొట్టుతోటి ధాన్యాలు, మాంసాహారం) తీసుకునేట్లు చేయాలి. 

👉యుక్త వయస్సు నుండి సంతానం పొందు వయసు మధ్యలో గల స్త్రీలందరికి ఎ.ఎన్.ఎం. సహాయంతో ఉచితంగా లభ్యం అయ్యే ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి.

👉ఇనుము ఎక్కువగా వుండి, సులభంగా లభించి, చవకగా అందరికీ అందుబాటులో ఉండే అన్ని రకాల తాజా ఆకుకూరలు అంటే తోటకూర, పుంటికూర, పాలకూర, మెంతి కూర, బచ్చలి కూర, గంగబాయిల కూర రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. 

👉ఇవేగాక ఖరీదైన ఎండినపండ్లు, అంటే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూర్, మాంసం, కాలేయం వంటి పదార్థాల్లో కూడా ఇనుము పుష్కలంగా లభిస్తుంది. 

👉వీటితోపాటు, రోజూ తీసుకొనే ఆహారంలో మొలకెత్తిన పప్పుధాన్యాలు విటమిన్ సి ఎక్కువగా వుండి నిమ్మ, ఉసిరి, జామ లాంటివి కలిపి తీసుకోవడం ద్వారా రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.

👉రక్తహీనతను అశ్రద్ధ చేయకండి. అది నీరసానికి బలహీనతకు మాత్రమే దారితీయదు. ప్రాణాహానిని కూడా కల్గించవచ్చు. 

👉రక్తహీనతను దరిచేరనీయకండి. ఇనుము పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు రోజూ తీసుకోండి.

👉రక్తహీనత ఉన్నవారు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా వందరోజులు తీసుకోండి.

✍️ *మంచి ఆహారంతో ఎనీమియాకు దూరం...*

👉ప్రస్తుతం మహిళలను వేధిస్తోన్న సమస్య ఎనీమియా (రక్తహీనత). లేచింది మొదలు గొడ్డు చాకిరీ చేసే మహిళలకు రోజంతా... పనితోనే సరిపోతుంటే ఇక తినేందుకు సమయమెక్కడ ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా ఆ... ఏం తింటాలే... అని ఊరుకునే మహిళలు ఎంతమందో..! దీని ఫలితమే రక్తహీనత.

 👉విటమిన్ బి12 తప్పనిసరి..!
తాజా కూరగాయలలో పాలకూర, క్యారట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలలోనూ....

 👉ఇక పండ్ల విషయానికొస్తే... అరటిపండు, యాపిల్, ద్రాక్ష, ఆప్రికాట్‌లలోనూ ఐరన్ అధికంగా లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది...

👉అంతేగాకుండా వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు తగ్గిపోవడం వల్ల, రుతుసమయంలో అధిక రక్తస్రావం వల్ల, ఫైల్స్ సమస్య వల్ల కూడా రక్తహీనత వస్తుంది. 

👉దీనివల్ల రక్తంలో ఎర్రకణాల సంఖ్య తగ్గిపోయి శారీరక బలహీనత ఏర్పడుతుంది. దీని కారణంగా ఒంట్లో నీరసంగా ఉండటం, కళ్ళు తిరగటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, తలనొప్పి తదితర సమస్యలు కలుగుతాయి.

👉మరి దీనికి పరిష్కారమే లేదా..? అంటే ఉందని చెప్పాలి. అదేంటంటే... మందులకన్నా... ప్రతిరోజూ వీరు తీసుకునే ఆహారంలో ఐరన్ అధికంగా లభించే వాటినే తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా కాయగూరలు, పండ్లలో ఉంటుంది.

✍️ *రక్తహీనత బారినపడొద్దు -ముందే జాగ్రత్త పడటం :*

👉మనదేశంలో రక్తహీనతతో బాధపడుతున్న స్త్రీలు, పిల్లలు ఎంతోమంది. 

👉దీని బారినపడ్డవారి రక్తంలో ఎర్రకణాలు తగ్గిపోతాయి. 

👉దీంతో శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్‌ సరిగా అందదు. 

👉రక్తహీనత తీవ్రతను బట్టి.. నిస్సత్తువ, పనులు చేస్తున్నప్పుడు శ్వాస కష్టంగా ఉండటం, మగతగా అనిపించటం, తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి తగ్గటం, గుండె సరిగా కొట్టుకోకపోవటం వంటివీ ఉండొచ్చు. 

👉కాబట్టి రక్తహీనత బారిన పడకుండా ముందే జాగ్రత్త పడాలి.

👉ఇనుముతో నిండిన యాపిళ్లు, అరటిపండ్లు, ఆకుకూరల వంటివి ఎక్కువగా తినాలి. 

👉మాంసం, ముడిధాన్యాలు కూడా మంచివే.

👉సి విటమిన్‌ ఇనుమును ఎక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. అందువల్ల బత్తాయి, నిమ్మ, ఉసిరి వంటి సి విటమిన్‌ గల పదార్థాలు, పానీయాలు కూడా అధికంగా తీసుకోవాలి.

👉భోజనం చేసిన వెంటనే కాఫీ, టీలు తాగటం మానెయ్యాలి. ఇవి ఇనుమును గ్రహించుకోకుండా అడ్డుకుంటాయి.

👉 ఫోలిక్‌యాసిడ్‌, విటమిన్‌ బి12తో నిండిన పాలకూర వంటి ఆకుకూరలు, కాలేయం, ముడిధాన్యాలు తగినంత మోతాదులో ఉండేలా చూసుకోవాలి. 

👉కిస్‌మిస్‌ వంటి ఎండు ఫలాల్లోనూ ఇనుము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఆహారంలో విధిగా చేర్చుకోవాలి.

small changes on lifestyle

✍️ *వారంలో ఒకరోజు కొన్ని మార్పులు చేసుకుంటే చాలు ఆయురారోగ్యాలను వరంగా పొందవచ్చు.!*

👉ఇంతకీ ఆ రోజు ఏంటి? ఎలాంటి మార్పులు చేసుకోవాలి?

👉మిగిలిన ఆరు రోజలు కూడా ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని కళ్ళలో ఒత్తులు పెట్టుకుని మరీ ఎదురుచూస్తుంటారు. అన్ని రోజులు వేచి చూసిన తరువాత వచ్చిన ఆరోజు ఒక పండుగ కంటే ఎక్కువ వేడుకగా చేసుకోవడానికి ఎన్నెన్నో ప్లాన్లు చేసుకుని మరీ వేచి చూస్తుంటారు.

👉మితిమీరిన ఆహారపు రుచులు, అదుపు లేని ఆల్కహాల్ పార్టీలు , పబ్ లు రెస్టారెంట్లలో చేసుకునే విందులు వినోదాల కోసం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి మిత్రులతో కలిసి ప్లాన్ చేసుకుని అనారోగ్యానికి రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానించే ఆ రోజే " ఆదివారం" .

👉సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుండి రోజువారీ కూలీల వరకు, పేరు మోసిన దిగ్గజ వ్యాపార వేత్తల నుండి బిక్షగాళ్ల వరకూ కూడా పేద ధనిక వ్యత్యాసాలు లేకుండా ఈ ఆదివారం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. 

👉ఆ ఒక్క రోజు చేస్తున్న తప్పిదం ఎన్నో అనారోగ్యాలకు దారి తీస్తున్నది. పిల్లల నుండి పెద్దల వరకు కూడా ఎన్నో అంతులేని జబ్బల బారిన పడి హాస్పిటల్స్ చుట్టూ క్యూలు కడుతున్నారు. అరవై ఏళ్ళలో రావాల్సిన జబ్బులు ఇరవై ఏళ్ళకే వచ్చేస్తున్నాయి. జబ్బులేని మనిషి ఎవరైనా ఉన్నారా అంటే లేరు ఆనే సమాధానం 100% వినపడుతున్నాయి.

👉ఈ ఒక్కరోజు ఈ నాలుగు పనులు చేయడం ద్వారా మీ ఆరోగ్యంతో పాటూ ఆయుష్షును కూడా పొందవచ్చు. 

✍️ *ఈ ఒక్కరోజు మీ మొబైల్ ఫోన్ ను పక్కన పెట్టేయండి.!*

👉ఈ ఫోన్ వల్ల మీకు కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువ అని మీకు తెలుసా? 

👉మొబైల్ ఫోన్లు రేడియో తరంగాల రూపంలో విద్యుదయస్కాంత వికిరణాన్ని విడుదల చేస్తాయి. ఈ రేడియేషన్‌ వల్ల మెదడు పనితీరులో మార్పులు జరిగి శారీరక మరియు మానసిక ఆరోగ్యాల పైన ప్రభావం చూపి, మన నడవడిక లో మార్పులు వచ్చి అనారోగ్యానికి దారి తీస్తుంది. 

👉దీర్ఘకాలిక మొబైల్ ఫోన్ వినియోగం మరియు కొన్ని క్యాన్సర్‌లు, ముఖ్యంగా మెదడులో కణితులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

👉నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం వల్ల నిద్రను నియంత్రించే హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. మొబైల్ ఫోన్ స్క్రీన్‌ల ద్వారా వెలువడే నీలిరంగు కాంతి నిద్రకు అంతరాయం కలిగించి సహజమైన నిద్రకు భంగం కలిగిస్తుంది. . దీనివల్ల నిద్రపోవడం కష్టం, నిద్ర నాణ్యత సరిగా ఉండదు మరియు పగటిపూట మగతగా ఉంటుంది.

👉ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మెడ మరియు వెన్నెముకపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది మెడ నొప్పి, దృఢత్వం మరియు భంగిమ సమస్యలకు దారితీస్తుంది. చిన్న స్క్రీన్‌లపై తరచుగా సందేశాలు పంపడం లేదా టైప్ చేయడం కూడా బొటనవేలు లేదా మణికట్టు సమస్యలకు కారణమవుతుంది.

👉స్మార్ట్‌ఫోన్ వ్యసనం లేదా అధిక ఫోన్ వినియోగం వంటి పరిస్థితులు ఆందోళన, నిరాశ, ఒంటరితనం కు గురవ్వడం తో పాటు రోజువారీ పనితీరులో అంతరాయానికి దారితీయవచ్చు. 

👉చాలామంది యువత మొబైల్ ఫోన్ ను ప్యాంట్ జేబులో పెట్టుకుంటుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల మగవారిలో శీఘ్ర స్ఖలనం, వీర్య కణాల లోపాలు సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

👉అధిక మొబైల్ వినియోగం వల్ల మొబైల్ ఫోన్ లో వెలువడే నీలి కిరణాలు కంటి సమస్యలను పెంచుతాయి. చూపులో తేడాలు కనిపిస్తాయి. రాను రాను కంటి చూపు తగ్గడం, సైట్ లాంటివి రావడం జరుగుతుంది.

✍️ *మీ నాలుకను అదుపులో పెట్టుకోండి.!*

👉నాలుక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకి మాట్లాడేటప్పుడు ఎంత ఆలోచించి మాట్లాడితే అంత మంచిది. అలాగే లోపలికి తీసుకునే ఆహారంలో ఎంత రుచులను తగ్గిస్తే అంత మంచిది.. ఆలోచించకుండా అధికంగా మాట్లాడే వారు సమాజంలో నవ్వుల పాలు అవుతారు. అధిక రుచులను ఆస్వాదిస్తే అనారోగ్యం పాలు అవుతారు..

👉సాధారణంగా నాలుక ఈ విశ్వం అందించే అన్ని వంటకాల కోసం ఆరాటపడుతుంది. కానీ ఆయుర్వేదం యొక్క నియమం ఏమిటంటే, మీకు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి. ముందు తిన్న ఆహారం జీర్ణం అవకుండా తదుపరి ఆహారం తీసుకోకూడదు. మీరు మీ ఆహారంలో మొత్తం ఆరు రుచులను చేర్చుకోవాలి (తీపి, ఉప్పు, పులుపు, చేదు, ఒగరు మరియు ఘాటు). కానీ నాలుక ఏమి చేస్తుంది అంటే ఒకటి లేదా రెండు అభిరుచులతో కొనసాగాలని కోరుకుంటుంది. ఆ రుచులే మనకు అనారోగ్యాన్ని తెచ్చి పెడుతాయి. మిగిలిన రుచులు మన ఆరోగ్యాన్ని చక్కబెడుతాయి కానీ వాటిని నాలుక పక్కన పెట్టేస్తుంది. 

👉హైపర్-యాక్టివ్ మైండ్ యొక్క దురాశ కారణంగా వ్యక్తి వివిధ రకాల ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాడు. జీర్ణసమస్యలను కొని తెచ్చుకొంటారు. తద్వారా ఊబకాయం, మధుమేహం లాంటి ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. 

✍️ *మీ కుటుంబంతో పాటూ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి ఒడిలో గడపండి!*

👉మొబైల్ ఫోన్ ను ఎలాగైతే పక్కన పెట్టేశామో అలాగే ఈ ఒక్క రోజు మాంసాహారం, ఆల్కహాల్, ధూమపానం ను పక్కన పెట్టేయండి. అలాగే పబ్ లు రెస్టారెంట్లకి వెళ్లి మిత్రులతో పార్టీలు చేసుకోవడం ఆపి ఈ ఒక్కరోజు కేవలం కుటుంభం తో విహారాలకు ప్లాన్ చేసుకోండి.

👉విహారాలు వెళ్ళడానికి సమయం లేకపోతే పిల్లలతో కలిసి ఇంటి పెరట్లో ఉన్న మొక్కలు నాటడం, నీళ్లు పోయడం, మొక్కల మధ్య ఉన్న కలుపు తీయడం లాంటి పనులు చేయండి.

👉మీ ఇంట్లో పనులకు పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటూ, పాడుకుంటూ మీ శ్రీమతికి సహాయంగా నిలవండి. ఇలా చేయడం వల్ల మీ శ్రీమతి తో పాటు మీ పిల్లలు కూడా చాలా సంతోషంగా వుంటారు. ఆ సంతోషానికి కారణం మీరే అవుతారు. 

👉ఆ రోజు మొత్తం కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోండి.. పిల్లలకి ప్రకృతి గురించి, ఆయుర్వేద జీవన విధానం గురించి వివరించండి. మంచి చెడుల గురించి చెప్పండి. వారి ప్రవర్తనను గమనించండి. వారితో సన్నిహితంగా ఉండండి. వారి సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుని వారి సమస్యలను తీర్చండి. ఇలా చేయడం వల్ల కుటుంభం లో ఒక మంచి వాతావరణం అలవాటు అవుతుంది.

👉పిల్లలకి ఆటలు అలవాటు చేయండి. అవసరం అయితే మీరు కూడా వాళ్ళతో కలిసి ఆడండి. పిల్లలకి సెలవు ఇచ్చిన రోజు ఒక చెట్టుని నాటడం అలవాటు చేయండి. ఇంటి చుట్టూ చెట్లను పెంచడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వారికి తెలియజేయండి.

✍️ *మన పూర్వీకుల నుండి మనకు వచ్చిన ఆయుర్వేద జీవన విధానాన్ని ఈ ఒకరోజు పాటిద్దాము!*

👉ఇది చాలా కీలకమైన బాధ్యతగా భావించాలి. ఏదో నోటికి వచ్చింది ఇక్కడ తెలపడం లేదు. ఆయుర్వేద జీవన విధానం అంటే మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఆరోగ్య సంపద. వాళ్ళు ఎన్నో తరాలుగా ప్రయోగాలు చేసి ఏది తింటే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఏవి తింటే అనారోగ్యానికి దారి తీస్తాయి అనే అంశాలతో పాటుగా వాటిని ఏ ఏ రూపాల్లో తీసుకుంటే మనకు ఉపయుక్తంగా ఉంటాయి అని వారు తిని ఆరోగ్యంగా జీవించిన తరువాత మనకి వాటిని అలవాటు చేశారు. 

👉ఆయుర్వేదం అంటే కేవలం మందులు ఇచ్చేసి పంపేది కాదు. ఆయుర్వేదం అంటే మన బ్రతుకు బండిని నడిపే జీవన వేదం. ఆచరిస్తే ఆరోగ్యంతో పాటు ఆయుష్మంతులు కూడా అవుతారు. 

👉ఈ ఒక్క రోజు సూర్యోదయానికి ముందు అనగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి.

👉 లేచిన వెంటనే మొబైల్ ఫోను కోసం వెతకడం ఆపి దేవుని రూపం చూసి చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన అయ్యాక మనస్ఫూర్తిగా కాసేపు నవ్వండి. ఇలా నవ్వడం వల్ల ఆ రోజు అంతా మీరు ఒక సంతోషకరమైన వాతావరణంలో జీవిస్తున్న భావన కలిగి ఉంటారు. 

👉మలమూత్ర విసర్జన ప్రక్రియ పూర్తి చేసి పిల్లలు అయితే 1 నుండి 2 గ్లాసులు, పెద్దవారు అయితే 750ml నుండి 1 లీటర్ వరకు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 

👉కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి మధ్యలో కనీసం 45 నిమిషాల నుండి ఒక గంట వరకూ వ్యాయామం చేయండి. 

👉వ్యాయామం పూర్తి అయ్యాక నువ్వుల నూనె, ఆవ నూనె మరియూ కొబ్బరి నూనె సమాన నిష్పత్తిలో తీసుకుని గోరువెచ్చగా కాచి ఆ నూనెతో తల నుండి కాళ్ళ వరకు బాగా మసాజ్ చేసి 1 గంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీనినే అభ్యంగనం అంటారు.

👉దంతాల శుభ్రత కోసం వేప పుల్లని, అలాగే తల స్నానం కోసం కుంకుడు, శీకాయ మిశ్రమాన్ని వాడండి.

👉ఉదయం తీసుకునే అల్పాహారం కోసం కీరా, క్యారెట్, బీట్రూట్ లతో పాటుగా చిరుధాన్యాల తో చేసిన ఇడ్లిలు కానీ లేదా జావ గా కానీ తీసుకోవాలి. 

👉మధ్యాహ్నం భోజనానికి పాలిష్ చేసిన సన్న బియ్యాలతో చేసిన అన్నం కాకుండా దంపుడు బియ్యంతో కానీ బ్రౌన్ రైస్ తో కానీ చేసిన అన్నం తో పాటు ఆకు కూరలు, కూరగాయలతో చేసిన కూరలను ఎక్కువగా తీసుకోవాలి.

👉రాత్రి భోజనం 7:30 లోపల పూర్తి చేయాలి. ఆయిల్ లేకుండా నిప్పుల మీద కాల్చిన చపాతీ మరియూ ఆకు కూరలతో చేసిన కర్రీతో కలిపి తీసుకోవాలి. 

👉అల్పాహారం కి మధ్యాహ్న భోజనానికి మధ్య ఏదైనా ఆకు కూరలతో కానీ కూరగాయలతో కానీ చేసిన జ్యూస్ (కీరా, బీర, పొట్లకాయ, బూడిద గుమ్మడి, పుచ్చకాయ , దోసకాయ లాంటి వాటితో చేసిన ఏదైనా ఒకరకం జ్యూస్ ని) తీసుకోవాలి.

👉భోజనం తర్వాత తప్పకుండా ఏదైనా సీజనల్ ఫ్రూట్ తీసుకోవాలి. 

👉మధ్యాహ్న భోజనానికి మరియూ రాత్రి భోజనానికి మధ్య స్నాక్స్ సమయంలో మొలకెత్తిన విత్తనాలు కానీ, బొప్పాయి లేక దానిమ్మ సీ విటమిన్ కలిగిన పండ్లు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఏవో ఒకటి తీసుకోవాలి. నువ్వులు, పల్లీలు, బెల్లం తో తయారు చేసిన ఉండలు కానీ, చిక్కీలు కానీ తీసుకోవాలి.

👉రాత్రి 9 గంటలలోపు పడుకోవాలి. నిద్రకు ముందు టీవీ కానీ మొబైల్ కానీ అసలు చూడకూడదు. వీలైతే ఒక మంచి సందేశం ఉన్న పుస్తకం కాసేపు చదవండి.

👉ఆనందంగా జీవించాలి అంటే ఆస్తులు అవససరం లేదు. ఆరోగ్యదాయకమైన అలవాట్లు ఉంటే చాలు. రోజూ ఎలాగో చేయలేరు. కనీసం ఇలా వారానికి ఒకరోజు చేసి చూడండి. ఫలితాన్ని మీరే స్వయంగా చూస్తారు. ఇలా మీ జీవితంలో చిన్న మార్పులు చేసుకుంటే చాలు.... హాస్పిటల్స్ లో అడుగు పెట్టాల్సిన అవసరం రాదు.


Tuesday, March 12, 2024

నిద్రలేమికి సులభ పరిష్కారాలు -

నిద్రలేమికి సులభ పరిష్కారాలు -

    ప్రస్తుతపరిస్థితుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధానకారణం మనయొక్క జీవితములో ఎదుర్కొనే ఒత్తిళ్లు కావచ్చు మిగిలిన సమస్యలు ఏవైనా కారణం కావచ్చు. నిద్ర మనిషి జీవితంలో అత్యంత ప్రధానం అయినది. నిద్ర తక్కువ అవ్వడం రోగాలు రావడానికి ప్రధాన కారణం . నిద్ర తక్కువైన మనిషికి త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చును.

        కావున వీలయినంత వరకు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది . అలాంటి విశ్రాంతి కేవలం మంచి నిద్రతోనే లభిస్తుంది. మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారి కోసం ఇప్పుడు నేను చెప్పబోయే యోగాలు చాలా మంచిఫలితాన్ని ఇస్తాయి .

 * నిద్రపట్టనప్పుడు ఒక స్పూన్ గసగసాలు వేడిచేసి ఒక గుడ్డలో వేసి మూటకట్టి వాసన చూస్తున్న త్వరలో మంచినిద్ర వచ్చును. మంచి గసగసాలనే వాడండి. మార్కెట్లో తొటకూర విత్తనాలను గసగసాలుగా అమ్ముతున్నారు.

 * వెలక్కాయ చిప్పను బియ్యపు కడుగు నీటితో అరగదీసి ఆ గంధాన్ని కణతలకు , నుదురుకు వ్రాసి పడుకున్న నిద్రపట్టును .

 * ఉదయం , సాయంత్రం సర్పగంధి వేళ్ళ చూర్ణం పావుస్పూన్ అరకప్పు నీళ్ళలో వేసి తాగుచున్నచో మంచిఫలితం కనిపించును. రక్తపోటు ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేయును .

 * రాత్రి సమయంలో మజ్జిగ లో రెండు నీరుల్లిపాయ ముక్కలను కలుపుకుని లోపలికి తీసుకొండి. మంచి నిద్ర వచ్చును.

 * నిద్రపోవడానికి ముందు కప్పు వేడిపాలల్లో అరచెంచా మిరియాల కషాయం కలుపుకుని తాగుచున్న సుఖనిద్ర కలుగును.

 * అశ్వగంధ చూర్ణము కూడా బాగా పనిచేయును . ఒక స్పూన్ అశ్వగంధ చూర్ణం ఒక చిన్న గ్లాసు పాలల్లో కలిపి నిద్రపొవడానికి ముందు ప్రతినిత్యం సేవించవలెను .

       పైన చెప్పిన యోగాలలో మీకు అత్యంత సులభమైన యోగాన్ని తీసుకుని పాటించవచ్చు. సర్పగంధ వేళ్ళ చూర్ణం మీకు ఆయుర్వేద పచారీ సామానులు అమ్మే దుకాణాలలో లభ్యం అగును.

    

Friday, March 8, 2024

సైనసైటిస్ సమస్య కి నస్య ఔషధం - ఆయుర్వేద లవణ ద్రావణ చికిత్స:*

✍️ *సైనసైటిస్ సమస్య కి నస్య ఔషధం - ఆయుర్వేద లవణ ద్రావణ చికిత్స:*

👉ఇది సైనసైటిస్,ఎలర్జీలు, ముక్కు కారటం, జలుబు, ఫ్లూ సమస్యలు ఉన్నవారికి అనువైనది.

👉 చెవుల సమస్యలు కలిగినవారికి మంచిది కాదు.

👉సైనస్ లు విడుదల చేసే స్రావాలు ముక్కులోపలకు స్రవించడానికి అడ్డు ఏర్పడడంతో బ్యాక్టీరియా దాడి చేసి సైనసైటిస్ ఇంఫెక్షన్ ను కలిగిస్తాయి.ఇలా సైనస్ లు మూసుకుపోతాయి.

👉దీనికి లవణ ద్రావణ చికిత్స బాగా ఉపయోగపడుతుంది. 

👉ద్రావణం సాంద్రత ఎక్కువ కనుక మ్యూకస్ పొరల్లోని అదనపు ద్రవాంశాన్ని వెలుపలకు లాగేస్తుంది.

👉దీనితోపాటు లోపల స్నిగ్ధత్వం పెరగటమే కాకుండా, శోధ వంటివి తగ్గుతాయి.

✍️ *లవణ ద్రావణ తయారీ విధానం-*

👉1-2 కప్పుల గోరు వెచ్చటి నీళ్లు తీసుకొని 1/4 నుండి 1/2 టీ స్పూన్ ఉప్పు పలుకులను ( అయోడిన్ కలపని సముద్రపు ఉప్పు), చిటికెడు వంటసోడా లను కలపాలి.

👉ఈ మిశ్రమాన్ని జలనేతి పాట్ (మెడికల్ షాప్ లో దొరుకుతుంది) లో నింపుకోవాలి.

👉వాప్బేసిన్ వద్దకు వెళ్లి 45 డిగ్రీల కోణంలో వంగి నిలబడాలి. తలను ఒక పక్కకు వంచాలి. 

👉లవణ ద్రావణాన్ని నాసిక లోపలకు పోయాలి.

👉 నాజిల్ ను ముక్కు రంధ్రం లోపలకు ఒక అంగులం లోపలకు మాత్రమే చొప్పించాలి.

👉ఈ సమయంలో నోటితో గాలి పీలుస్తుండాలి.

👉 ఉప్పునీళ్లు ముక్కు అంతర్భాగం నుండి, నోటి నుంచి ధారగా కారతాయి. ఈ నీళ్లను మింగకపోవడం మంచిది. 

👉రెండవ నాసికతో కూడా ఇదే విధంగా రిపీట్ చేయాలి. 

👉ముక్కును శుభ్రం చేసుకొని రెండవ నాసికతో ఇదే క్రమాన్ని తిరిగి చేయాలి. 

👉తరువాత మిగిలిన ద్రవాన్ని పారబోసి, సామాగ్రిని (జలనేతి పాట్) ఆరబెట్టి జాగ్రత్త చేసుకోవాలి.

👉మండుతున్నా, నొప్పిగా అనిపిస్తున్నా ఉప్పు మోతాదును తగ్గించండి.

👉 తలను మాత్రం వెనక్కి వంచవద్దు. 

👉నోరు తెరచి ఉంచి కేవలం నోటితో మాత్రమే శ్వాస తీసుకోండి.

👉ఒకటి రెండు సార్లు చేసిన వెంటనే మీకు ఫలితాలు కనిపిస్తాయి. 

👉చికిత్సను కొనసాగిస్తున్న కొద్దీ ఫలితాలు మరింత సమర్థవంతంగా ఉంటాయి. 

👉ఈ చికిత్సను రోజుకు ఒకసారి చొప్పున తీసుకుంటే సరిపోతుంది. 

👉లక్షణాలన్నీ పూర్తిగా సమసిపోయిన తర్వాత వారానికి మూడుసార్ల చొప్పున తీసుకుంటూ ఉంటే లక్షణాలు తిరగబెట్టకుండా ఉంటాయి.

*ఈ సమస్య నుండి శాశ్వత పరిష్కారం కావాలి అంటే పైన చెప్పిన విధంగా చేస్తూ మేము సూచించే జీవనశైలి ని పాటిస్తూ మేము ఇచ్చే మందులను కనీసం అంటే మూడునెలల వరకు వాడితే చాలు. తప్పకుండా మీకు అద్భుతమైన పలితం లభిస్తుంది.*


సర్వైకల్ స్పాండిలైటిస్ (cervical spondylitis) సమస్య పూర్తి వివరణ మరియూ నివారణ మార్గాలు:*

✍️ *సర్వైకల్ స్పాండిలైటిస్ (cervical spondylitis) సమస్య పూర్తి వివరణ మరియూ నివారణ మార్గాలు:*

👉ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య మెడనొప్పి. 

👉పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కొంచెం ఎక్కువగానే ఉంటోంది. 

👉ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారినపడుతున్నారు.

*సెర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏమిటి?*

👉స్పాండి అంటే వెన్నెముక , లోసిస్ అంటే సమస్య అని అర్ధము . ప్రతి వెన్నుపూస నడుమ గల దూరము పెంచే లేదా తగ్గించే విధముగా అనుసంధానమై ఉండే కణజాలము సహజముగా క్షీణదశకు వచ్చాక, వెన్నుపూసను ప్రభావితము చేసే ఓ రకమైన ఆర్థ్రైటిస్ నే స్పాడిలైటిస్ లేదా స్పాండిలోసిస్ అంటారు . 

✍️ *సర్వైకల్ స్పాండిలైటిస్ రావడానికి కారణాలు:*

👉మారిన జీవనశైలి, 

👉ఎక్కువ దూరం ప్రయాణించి ఉద్యోగాలు చేయడం, 

👉రోజులో 2-4 గంటల సమయం ప్రయాణానికి కేటాయించడం, 

👉పెరుగుతున్న పని ఒత్తిడి,

👉వ్యాయామం లేకపోవడం,

👉ఆఫీసులో ఎక్కువ సమయం కంప్యూటర్‌పై పనిచేయడం ,

👉వెన్నెముకకు దెబ్బలు తగలటం, 

👉అధిక బరువును ఒక్కసారిగా ఎత్తడం, 

👉సరి అయిన డ్రైవింగ్ పద్ధతులను పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయడం వలన వెన్నుపూసల మధ్య ఒత్తిడి అధికమై ఈ సమస్య వస్తుంది.

👉 వయస్సు పెరిగే కొద్ది వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదల వలన కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వలన కూడా ఇది వస్తుంది. 

👉ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువగా కంప్యూటర్‌మీద పనిచేయడం వలన వెన్నుముక పై ఒత్తిడి పెరిగి చిన్న వయస్సువారు కూడా స్పాండిలైటిస్ బారిన పడుతున్నారు.

✍️ *ఇవి రెండు రకాలు:* 

*1.స్పాండిలోసిస్ (Spondylosis)*

 *2.స్పాండిలైటిస్ (Spondylitis)*

👉ఈ రెండూ మీ వెన్నెముకలోని కీళ్ల సమస్య వల్ల ఏర్పడతాయి. 

👉వెన్నెముక వెన్నుపూసలతో నిండి ఉంటుంది. కీళ్లలోని ప్రతి వెన్నుపూస మధ్య ఉండే పదార్థాన్ని డిస్క్‌లు అంటారు. 

👉కీళ్ళు, డిస్క్‌లు, కాలక్రమేణా అరిగిపోవచ్చు లేదా మంట కలిగించవచ్చు. 

👉స్పాండిలైటిస్(Spondylitis) అనేది ఆర్థరైటిస్‌కు కారణమయ్యే సమస్య.

👉 స్పాండిలోసిస్(Spondylosis) అనేది వెన్నుపూస కీళ్ల అరిగిపోవడం వల్ల ఏర్పడుతుంది. ఫలితంగా డిస్క్‌లు, కీళ్లలో క్షీణత ఏర్పడుతుంది

✍️ *లక్షణాలు:*

👉తల, మెడ నొప్పితో కండరాలు బిగుసుకొనిపోతాయి. 

👉మెడ నుంచి భుజాలు, చేతులకు నొప్పి, తిమ్మిర్లు వ్యాపిస్తాయి. 

👉చేతి కండరాలు బలహీనపడటం, 

👉కళ్లు తిరగడం, 

👉భుజాలు, చేతి వేళ్లలో స్పర్శ తగ్గిపోవడం,

👉 అరుదుగా మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. 

👉నిద్రలేమి, 

👉మానసిక ఒత్తిడి,

👉 మెడ బిగుసుకుపోయినట్లుగా కావడంతో నొప్పి ప్రారంభమవుతుంది. 

👉నొప్పి క్రమంగా భుజాలకు పాకుతుంది. 

👉తలను కదల్చలేకపోతారు. 

👉తీవ్రమైన ఒత్తిడిపడుతున్నట్లుగా ఉంటుంది.

👉 చెవుల్లో శబ్దాలు వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. 

👉తలనొప్పి, 

👉బీపీ పెరిగిపోవడం జరుగుతుంది. 

👉నొప్పి క్రమంగా చేతులకు విస్తరిస్తుంది.

👉నిరక్ష్యం చేస్తే... సర్వైకల్ స్పాండిలైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇతర సమస్యలు మొదలయ్యే అవకాశంఉంది.

👉 దీర్ఘకాలిక మెడ నొప్పి, మల, మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, కండరాలు పటుత్వాన్ని కోల్పోవడం వంటి సమస్యలు మొదలవుతాయి

✍️ *నివారణ మార్గాలు:*

*1.వేప:* 

👉వేపలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని నివారించడంలో గొప్ప గా సహాయపడుతుంది. నొప్పి నివారణ లక్షణాలు మెండుగా ఉన్నాయి.

👉 ఇది నొప్పిని, ఇన్ఫ్లమేషన్ మరియు వాపును తగ్గిస్తాయి .

👉 ఒక చెంచా వేప పౌడర్ లో కొద్దిగా నీళ్ళు పోసి, పేస్ట్ ను వేడి చేయాలి. నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. 

👉అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

*2.ఆపిల్ సైడర్ వెనిగర్:* 

👉ఆపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. 

👉ఇంకా ఇందులో ఉండే ఆల్కలైజింగ్ లక్షణాలు వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ ను నివారించడంలో చాలా మేలు చేస్తుంది . 

👉ఇది మెడ మరియు భుజాల వద్ద చాలా ఎఫెక్టివ్ గా నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. 

👉ఒక కాటన్ టవల్ ను ఆపిల్ సైడర్ వెనిగర్లో డిప్ చేసి మెడచుట్టు అప్లై చేయాలి . ఇలా రోజూ రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

*3.అల్లం:* 

👉అల్లం మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. అల్లం ఒక ఆయుర్వేద మూలిక. ఈ మూలికలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. 

👉ఇది బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది.

👉 దాంతో మెడచుట్టు, భుజాల వద్ద నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. 

👉ప్రతి రోజూ జింజర్ టీని మూడు సార్లు త్రాగడం వల్ల మంచి గా పనిచేస్తుంది. 

👉వేడి నీటిలో అల్లముక్కలు వేసి ఉడికించి, ఆ నీటిని వడగట్టి, తేనె మిక్స్ చేతి తీసుకోవాలి.

*4.నువ్వులు:* 

👉ఇది కూడా మరొక ముఖ్యమైన ఆయుర్వేదిక్ రెమెడీ.

👉నువ్వుల్లో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్, ఫాస్పరస్ మరియు విటమిన్ కె మరియుడిలు పుష్కలంగా ఉంటాయి. 

👉ఇవి ఎముకల ఆరోగ్యానికి మరియు మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . 

👉కొద్దిగా గోరువెచ్చని నువ్వుల నూనెను నొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేసి 10 నిముషాల తర్వాత హాట్ కంప్రెసర్ తో మసాజ్ చేసుకోవాలి. 

👉ఇలా రోజూ మూడు నాలుగు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

👉ఆహారంలో చేర్చుకుని తీసుకోవచ్చు. విడిగా కూడా తీసుకోవచ్చు. 

*5.పసుపు:* 

👉పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వల్ల సర్వికల్ స్పాండిలోసిస్ ను నివారించుకోవచ్చు.

👉 అంతే కాకుండా పసుపు బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది . 

👉ఇది కండర వ్యవస్థ ని దృఢపరిచి నొప్పిని నివారిస్తుంది. 

👉ఒక టీస్పూన్ పసుపును పాలలో మిక్స్ చేసి తక్కువ మంట మీద 5 నిముషాలు వేడి చేసి గోరువెచ్చగా మారిన తర్వాత తేనె కలుపుకొని రోజూ రెండు సార్లు త్రాగితే ఉపశమనం కలుగుతుంది.

*6.వెల్లుల్లి:* 

👉సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలను నివారించడంలో వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది.

👉 ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జిక్ లక్షణాలుండటం వల్ల మెడ, భుజం నొప్పి, వాపు, ఇన్ల్ఫమేషన్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. 

👉రెగ్యులర్ గా పచ్చి వెల్లుల్లి రెబ్బలను కాలీ పొట్టతో తిని, నీళ్ళు త్రాగాలి. 

👉గార్లిక్ క్యాప్సిల్స్ ను డాక్టర్ ప్రిస్క్రిప్సన్ తో తీసుకోవడతో నొప్పి నివారించుకోవచ్చు.

*7.హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్:* 

👉మెడనొప్పి నివారించుకోవడానికి మరో సింపుల్ రెమెడీ ఇది. 

👉నొప్పి ఉన్న ప్రదేశంలో కోల్డ్ అండ్ హాట్ కంప్రెసర్ ను ఉపయోగించాలి. 

👉హాట్ కంప్రెసర్ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది, సోర్ మజిల్స్ ను రిలాక్స్ చేస్తుంది. 

👉కోల్డ్ కంప్రెసర్ వాపును మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

*8.రెగ్యులర్ వ్యాయామం:* 

👉సర్వైకల్ స్పాండిలోసిస్ కు ముఖ్య కారణం వ్యాయామలోపం. 

👉కాబట్టి ప్రతి రోజూ కొన్ని సింపుల్ గా ఉండే ఫిజికల్ ఎక్సర్ సైజులు చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చు. 

👉తలను ముందుకు వెనకకు, మరియు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేయడం మంచిది. 

👉 లెఫ్ట్ షోల్డర్ టు రైట్ షోల్డర్ కు రొటేట్ చేయడం మంచిది.

👉 ఇలా ప్రతి రోజూ రెండు, మూడు సార్లు చేస్తే మంచిది . ఇలా చేయడం వల్ల మెడనొప్పి నివారించుకోవచ్చు.

✍️ *తినకూడని మరియు తినాల్సిన ఆహారాలు:*

👉ఉప్పగా, పుల్లగా ఉన్న ఆహార పదార్ధాలూ, వేపుళ్ళూ, మైదా, రవ్వ వంటివి సర్వికల్ స్పాండిలోసిస్ కి కారణమయ్యే వాత దోషాన్ని పెంచుతాయి. అందుకని అవి తగ్గించడం అవసరం.

👉 అలాగే, అన్నం తగ్గించి గోధుమ తీస్కోవాలి. 

👉వేప పువ్వు, కాకరకాయ, ములక్కాడ, నువ్వులు వంటివి ఆహారం లో చేర్చుకోవాలి.

👉 నీళ్ళు ఎక్కువగా తాగాలి.

👉 ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య లేకుండా ఉంటుంది.

👉పసుపూ, అల్లం, మెంతులూ వంటివి వాపునీ, నొప్పినీ తగ్గిస్తాయి. వీటిని రోజువారీ ఆహారం లో భాగం చేసుకోవచ్చు.


Friday, March 1, 2024

అన్ని రకాల వెన్నుముక సమస్యలు (spinal disorders) - అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు:*

✍️ *అన్ని రకాల వెన్నుముక సమస్యలు (spinal disorders) - అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు:*

👉మన శరీరంలో అత్యంత ముఖ్యమైన, సున్నితమైన భాగం ఈ వెన్నుముక. దీనికి ఏ చిన్న గాయమైనా ప్రాణం విలవిల్లాడుతుంది. రోజువారీ పనులపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే, వెన్నెముక సమస్యలను వెంటనే గుర్తించలేం. సమస్య వచ్చిన తర్వాత తగ్గించలేం. అందుకే, మొదటి నుంచి మనం జాగ్రత్తగా వ్యవహరించాలి.

👉వయసుతో సంబందం లేకుండా చాలామంది మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపడుతుంటారు. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. 

👉కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్రపిండాలలో రాళ్లదాకా నడుము నొప్పికి కారణాలు చాలా ఉన్నాయి.

✍️ *నొప్పికి ముఖ్య కారణం డిస్క్(disc problem):*

👉శరీరానికి ఒక ఆకృతి రావడానికి ఉపయోగపడే వెన్నుపాములో 29 వెన్నుపూసలు ఉంటాయి. 

👉మెడ భాగంలో C1 నుంచి C7 వరకు మొత్తం ఏడు వెన్నుపూసలు, ఆ తరువాత రొమ్ము భాగంలో ఉండే పన్నెండు వెన్నుపూసలు D1 నుంచి D12. ఇక నడుము భాగంలో ఉండే వెన్నుపూసలు అయిదు. అవి L1 నుంచి L5. ఆ తరువాత కాలి ఎముకలకు ముందు ఉండే వెన్నుపూసలను S1 నుంచి S5 గా పిలుస్తారు. 

👉ప్రతి రెండు వెన్నుపూసల మధ్య మెత్తని గిన్నె లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్నే డిస్క్ (Intervertebral disc) అంటాం.

👉 దీని పై భాగం గట్టిగా ఉన్నా లోపల జెల్లీలాంటి పదార్థం ఉంటుంది. 

👉డిస్కులు వెన్నుపామును షాక్స్ నుంచి రక్షిస్తాయి. డిస్కులు జారడం వల్ల గానీ, అవి అరిగిపోవడం వల్ల గానీ నొప్పి మొదలవుతుంది. 

👉వెన్నుపూసల నుంచి బయలుదేరే నాడులన్నీ కలిసి పిరుదుల భాగంలో ఒక్క నాడిగా ఏర్పడి కాలి కింది భాగంలోకి వెళతాయి. ఈ నరాన్నే సయాటిక్ నరం అంటారు. డిస్కులో సమస్యలున్నప్పుడు ఏర్పడే ఏ నడుంనొప్పి అయినా ఈ సయాటిక్ నరం గుండా కాలిలోకి పాకుతూ వెళుతుంది. అందుకే డిస్కుల వల్ల కలిగే ఈ నడుంనొప్పిని సయాటికా (Sciatica) నొప్పి అని కూడా అంటారు.

✍️ *డిస్క్ జారడం (slipped disc):*

👉రెండు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు జారడాన్నే డిస్క్ ప్రొలాప్స్ (Disc prolapse) లేదా స్లిప్‌డ్ డిస్క్ (Slipped disc) అని గానీ అంటారు.

👉 డిస్కు జారడమంటే గిన్నె లాంటి నిర్మాణం మొత్తం పక్కకు జారిపోతుందని అనుకుంటారు. కానీ డిస్కు పై భాగంలో పగులులా ఏర్పడి లోపలున్న జెల్లీ పదార్థం బయటకు వస్తుంది. ఇది డిస్కు వెనుక ఉన్న స్పైనల్ నరంపై ఒరిగిపోతుంది. దానివల్ల నరం ఒత్తిడికి గురయి నొప్పి వస్తుంది. 

👉ఏ వెన్నుపూసల మధ్య ఉన్న డిస్కు జారిందన్న దాన్ని బట్టి దాని వల్ల కనిపించే నొప్పి లక్షణాలు కూడా వేరుగా ఉంటాయి. లక్షణాలను బట్టి ఏ డిస్కు జారివుంటుందో కూడా చెప్పవచ్చు.

👉ఉదాహరణకి L4, L5 వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు జారినప్పుడు తొడ భాగంలో పక్కవైపు నుంచి కాలు కింది వరకూ నొప్పి ఉంటుంది. నడుంనొప్పి కన్నా కాళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారిగా పక్కకు తిరగడం, బరువు ఎత్తడం, వంగడం వల్ల నొప్పి మొదలవుతుంది.

👉 ఒక్కసారిగా కూర్చున్న చోట నుంచి లేచినా డిస్కు స్లిప్ అవుతుంది. జెర్క్ ఉన్న ఏ కదలిక వల్లనైనా డిస్కు జారవచ్చు. 

👉L5, S1 మధ్య ఉన్న డిస్కు జారితే తొడ వెనుక భాగం అంటే వెనుక వైపు తొడ నుంచి కాలి పాదం వరకూ నొప్పి ఉంటుంది.

✍️ *డిస్కు అరుగుదల:*

👉డిస్కు అరిగిపోవడం ప్రారంభమైన తొలిదశలో నడుంనొప్పి అంత తీవ్రంగా ఉండదు. తరువాత ఎక్కువ అవుతుంది. ఎక్కువ సేపు కూర్చున్నా, నిల్చున్నా నొప్పి ఎక్కువ అవుతుంది. విశ్రాంతిగా ఉన్నప్పుడు తక్కువ అవుతుంది. 

👉డిస్కు అరుగుతున్నకొద్దీ సమస్య తీవ్రం అవుతుంది. డిస్కు అరిగిపోవడంతో రెండు వెన్నుపూసలు గీరుకుంటాయి. నరం ఒత్తిడికి గురవుతుంది. 

✍️ *స్పాండైలో లిస్థెసిస్ (spondylolisthesis):*

👉వయసురీత్యా కలిగే మార్పులలో వెన్నుపూసలు పక్కకు జరిగిపోవడం (స్పాండైలో లిస్థెసిస్) కూడా ఒకటి. 

👉చిన్న వయసులోనే వెన్నుపూసలు జరిగిపోయాయంటే మాత్రం ప్రమాదాలే కారణం. యాక్సిడెంట్ వల్ల వెన్నుపూసల వెనుక ఉండే లింకులో ఫ్రాక్చర్ వల్ల వెన్నుపూసలు పక్కకు జరుగుతాయి. ఇలాంటప్పుడే నడుంనొప్పి స్థిరంగా ఉంటుంది. 

👉ఇదీ సయాటికా నొప్పే. నిటారుగా ఉన్నవాళ్లు పక్కకు తిరిగినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. కింద కూర్చుని పైకి లేచేటప్పుడు కూడా నొప్పి పెరుగుతుంది. రెండు కాళ్లలోనూ నొప్పి ఉంటుంది. ఆడవాళ్లలో ఈ రకమైన నడుంనొప్పి ఎక్కువగా కనిపిస్తుంది.

✍️ *స్పైన్ ఇన్‌ఫెక్షన్(spine infection):*

👉వెన్నుపాము ఇన్‌ఫెక్షన్లలో అతి సాధారణంగా కనిపించేది క్షయ. ఎముక టిబి వల్ల కూడా కనిపించే ముఖ్య లక్షణం నడుంనొప్పే. ఎముక టిబి ఉన్నవాళ్లలోరావూతిపూట నొప్పి ఎక్కువగా ఉంటుంది. నొప్పితో పాటు జ్వరం ఉంటుంది. బరువు తగ్గిపోతారు. ఆకలి ఉండదు. చెమట ఎక్కువగా పడుతుంది. టిబి వల్ల నరాలు దెబ్బతిని కాళ్లు చచ్చుబడిపోయే అవకాశం కూడా ఉంది.

✍️ *స్పైన్ ట్యూమర్స్(spine tumors)*

👉వెన్నుపాము కింది ఎముకలో క్యాన్సర్ కణుతులు ఏర్పడినప్పుడు కూడా నడుంనొప్పి ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గుతారు. కానీ జ్వరం మాత్రం ఉండదు.

✍️ *సాగిటల్ ఇంబ్యాపూన్స్(Sagittal Imbapoons):*

👉అయిదు పదులు దాటిన తరువాత కొంతమంది మెల్లమెల్లగా ముందుకు వంగిపోతారు. వెన్నుపాము నిర్మాణంలో తేడా రావడం వల్ల పిరుదులు, తొడ భాగాల్లో నొప్పిగా ఉంటుంది. పడుకుని ఉన్నప్పుడు నొప్పి ఉండదు. వెన్నుపామును సాధారణ స్థితికి తేవడానికి కండరాలన్నీ ప్రయత్నించడం వల్ల నొప్పి మొదలవుతుంది.

👉90 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో నడుంనొప్పితో బాధపడతారు. వీరిలో 80 శాతం మందికి ఆరువారాల్లోగా నొప్పి తగ్గిపోతుంది. మిగిలిన 20 శాతం మంది మాత్రం తీవ్రమైన నడుంనొప్పితో నిత్యం బాధపడుతుంటారని అంచనా. వీరిలో 10 శాతం మందికి మాత్రం ఆపరేషన్ అవసరం అవుతుందని అమెరికా అధ్యయనాలు తెలుపుతున్నాయి. అమెరికాలాంటి దేశంలోనే గణాంకాలు ఇలా ఉంటే ఇక మన ఇండియాలాంటి దేశంలో ఈ సమస్య మరింత ఎక్కువనే చెప్పాలి.

✍️ఇతర కారణాలు:

👉కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి ఉన్నప్పటికీ దానికి వెన్నుపాముతో ఎటువంటి సంబంధం ఉండదు. అలాగని అశ్రద్ధ చేయడం పనికిరాదు. ఇలాంటప్పుడు ఇతరత్రా సమస్యలేవైనా ఉండవచ్చు. అయితే నొప్పి లక్షణాన్ని బట్టి అది ఏ అవయవానికి సంబంధించిన సమస్యో కొంతవరకు నిర్ధారించవచ్చు.

👉కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు కూడా నడుంనొప్పి ఉంటుంది. అయితే ఇది అలా వచ్చి ఇలా పోతుంది. వచ్చినప్పుడల్లా పది నుంచి 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. నొప్పితో పాటు మూత్రంలో మంట ఉంటుంది. నొప్పి ఒకేచోట ఉంటుంది. కాళ్లలోకి పాకదు. ఒక్కోసారి కిడ్నీలో నీళ్లు నిండిపోయినప్పుడు (హైవూడోనెవూఫోసిస్) కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. దీంతోపాటు మూత్రం తక్కువ లేదా ఎక్కువ సార్లు రావడం, ఇతరత్రా మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఉంటాయి.

👉వెన్నెముక కాకుండా కేవలం కండరాలకు సంబంధించిన నొప్పే అయితే గనుక ఆ కండరాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది. ఆ కండరం ఒత్తిడికి గురయ్యేలా బరువు ఎత్తినా, పక్కకు తిరిగినా నొప్పి ఉంటుంది.

👉పాంక్రియోటైటిస్ లాంటి జీర్ణవ్యవస్థ సంబంధమైన సమస్యలున్నప్పుడు బొడ్డు నుంచి వెనక్కి నొప్పి వ్యాపిస్తుంది.

👉గర్భాశయం, ఓవరీలలో సమస్యలున్నప్పుడు పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ (పిఐడి) సమస్య వల్ల పిరుదుల భాగంలో నొప్పి, బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ నొప్పితో పాటు రుతు సంబంధ సమస్యలుంటాయి..

✍️ *వెన్నుముక సమస్యలకు ఆయుర్వేద గృహ చిట్కాలు:*

👉ఆయుర్వేద రస శాస్త్రంలో గుగ్గులుతో కూడిన మూలికా మిశ్రమాలతో కలిగిన ఔషధాలు ఉన్నాయి. ఇందులో కాంచన, త్రిఫల, త్రయోదశాంగ, కైశోర, నవక, పంచతిక్త, అమృతాది, గోక్షురాది, మహారాజ, సింహనాద, రాన్సాది గుగ్గులు ఉన్నాయి. ఇవి కీళ్లవాతం, సంధివాతం, వెన్నుముక సమస్యలు, చర్మరోగాలు, కొలెస్ట్రాల్‌ తగ్గిస్తాయి. 

👉ఆయుర్వేద ఔషధ మూలికల్లో శొంఠిపొడి, నల్లనువ్వులు, ఆముదం చెట్టు బెరడు, గింజలు, వేర్లు, కరక్కాయ, తిప్పతీగ, నల్లేరు, పారిజాతం మొక్క, మెంతాకు, రావి చెక్క, వావిలి, మునగాకు ముఖ్యమైనవి. నియామానుసారం ఆహార, విహార, రుతు నియమాలు పాటిస్తే అనారోగ్యం దరిచేరకుండా చూసుకోవచ్చు

👉ప్రభావవంతమైన మార్గాలలో నొప్పి లేదా ఉద్రిక్తమైన కండరాలను సున్నితంగా మసాజ్ చేయడం మంచిది.

👉నడుము నొప్పితో బాధపడేవారికి వ్యాయామాలు మంచివి. కండరాలను పునరుద్ధరించడంలో సహాయపదుతుంది మరియు తదుపరి నొప్పి నుండి మిమ్మల్ని రక్షించవచ్చు. కొన్ని వ్యాయామాలు (మైదానంలో నడవడం, నిలబడి వంగిగడం ,కోబ్రా భంగిమ మొదలైనవి) లక్షణాలను తగ్గించగలవు. 

👉వెన్నునొప్పిని తగ్గించడానికి వేడి మరియు శీతల కాపడాలు మంచి మార్గాలు . గాయం అయిన వెంటనే, స్ట్రెయిన్ వంటి వాటిని ఉపయోగించినప్పుడు ఐస్ ప్యాక్‌లు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. టవల్‌లో చుట్టిన ఐస్ ప్యాక్‌ను నేరుగా నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టడం వల్ల మంట తగ్గుతుంది. హీటింగ్ ప్యాడ్ గట్టి లేదా బాధాకరమైన కండరాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఏదైనా హీటింగ్ ప్యాడ్‌లోని సూచనలను చదివి, అనుసరించాలి మరియు అది చాలా వేడిగా లేదని నిర్ధారించుకోవడానికి ఉష్ణోగ్రతను పూర్తిగా పరీక్షించాలి.

పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన శాశ్వత పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.


అల్జీమర్స్ (మతిమరుపు వ్యాధి) పూర్తి వివరణ మరియూ అద్భుతమైన ఆయుర్వేద పరిష్కారాలు:*

✍️ *అల్జీమర్స్ (మతిమరుపు వ్యాధి) పూర్తి వివరణ మరియూ అద్భుతమైన ఆయుర్వేద పరిష్కారాలు:*

👉అలోయిస్ ఆల్ జీమెర్ (ALOIS ALZHEIMER) అనే వ్యక్తి ఈ వ్యాధిని మొదటిసారిగా వివరించినారు కనుకనే ఈ వ్యాధి పేరు ఆ వ్యక్తి పేరుతో గుర్తించబడినది. 

👉ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి. 

👉జ్ఞాపక శక్తి కోల్పోవడం ప్రధాన లక్షణం.

✍️ *ఆల్జీమర్స్ వ్యాధి లక్షణాలు:*

*1. జ్ఞాపకం తగ్గిపోవడం:*

👉ఇటీవలే తెలుసుకొన్న విషయాలు గుర్తులేకపోవడం అనేది ఈ వ్యాధి చూపే సర్వ సాధారణమైన ఆరంభ సూచనల్లో ఒకటి. 

👉సదరు వ్యక్తి తరచూ మతిమరుపుకు లోనవడం, తర్వాత దానిని గుర్తు తెచ్చుకోలేకపోవడం జరుగుతుంది.

*2. తెలిసిన పనులు చేయడానికి కష్టపడటం:*

👉ఈ వ్యాధి ఆరంభదశలో ఉండేవారికి రోజువారీ పనులను క్రమపధ్ధతి లో సరిగా ముందుగానే ఆలోచించుకొని చేసుకోలేక, పనులు పూర్తిచేయలేకపోతారు. 

*3. భాషతో సమస్యలు :*

👉ఈ వ్యాధి ఉన్న వారికి చిన్నచిన్న సులభమైన పదాలను సైతం మర్చిపోవడం, కొత్త పదాలతో వాటిని ప్రయోగించడం, లేదా వారి సంభాషణగానీ, రాతగానీ అర్థం కాకుండా ఉంటుంది. 

👉ఉదాహరణకి వారు వారి టూత్ బ్రష్ ను వెతికి పట్టుకోలేకపోతారు. పైగా అదెక్కడపోయిందో అని అడగటానికి ‘నా నోటిలో వాడేదెక్కడని’ అడుగుతారు.

*4. కాలాన్నీ , స్థలాన్నీ మర్చిపోవడం:*

👉ఈ వ్యాధి ఉన్న వారు, వారి ఇంటికి వెళ్లే దారినీ, వారెక్కడికి వెళుతున్నారో , ఎక్కడనించి వచ్చారో, ఎన్ని గంటలకు బయల్దేరారో కూడా మర్చిపోతారు.

*5. నిర్ణయ లోపం:*

👉ఈ వ్యాధితో ఉన్న వారు, వస్త్రధారణ సరిగ్గా చేయరు. 

👉మంచి ఎండాకాలంలో స్వెట్టర్ వేయడం, చలికాలంలో తక్కువ దుస్తులు వేయడం చేస్తుంటారు. 

👉వీరి నిర్ణయ లోపం ఎలా ఉంటుందంటే, ముక్కూమొకం తెలీని వారికి డబ్బులిచ్చేస్తూంటారు.

*6. ఆలోచనా లోపం:*

👉 ఈ వ్యాధి ఉన్న వారిలో క్లిష్టమైన పనులకు బుర్ర పనిచేయదు. ఎలాంటి సంఖ్యలను ఎలా వాడాలో సైతం తెలియక సతమతమౌతారు.

*7. వస్తువులను ఎక్కడంటే అక్కడ పెట్టేయడం :*

👉 ఈ వ్యాధి ఉన్న వారు ఆయా వస్తువులను వాటి స్థలాల్లో కాక ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూంటారు.

*8. మూడ్ లో లేదా ప్రవర్తనలో మార్పు :*

👉ఈ వ్యాధి ఉన్న వారిలో మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అంత వేగంగా మారిపోతూ ఉంటుంది. అంతలో ఆనందం, అంతలో కోపం - అకారణంగా అలా జరిగిపోతుంది.

*9. వ్యక్తిత్వంలో మార్పు:*

👉 ఈ వ్యాధితో బాధపడే వారి వ్యక్తిత్వం నాటకీయంగా మారిపోతూంటుంది. 

👉త్వరగా తికమకైపోవడం, సందేహాస్పదంగా ఉండటం, భయపడటం, లేదా అన్ని పనులకు కుటుంబ సభ్యులలో ఎవరిపైనో ఆధారపడటం జరుగుతుంది.

*10. చొరవ తీసుకోలేకపోవడం:*

👉ఈ వ్యాధి ఉన్న వారు స్థబ్దుగా మారిపోవడం, టీవీ ముందు గంటల కొద్దీ కూచోవడం, అనూహ్యంగా ఎక్కువసేపు నిద్రపోవడం, నిత్య కృత్యాలపై ఆనాసక్తితో ఉండటం జరుగుతుంది.

👉ఇలాంటి సూచనలు మీలో కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి.

👉 ఆరంభ దశలో అల్జమీర్ లేదా ఈ లోపాన్ని పొడజూపే వ్యాధిని గుర్తిస్తే, సకాలంలో సరైన చికిత్సను పొంది ఆ వ్యాధినించి విముక్తి పొందవచ్చు.

✍️ *ఎలాంటి సమస్యలు ఉన్న వారిలో ఈ వ్యాధి వస్తుంది:*

*1. నరాలకు సంబందించిన వ్యాధులు*

*2. మెదడులో రక్తనాళాల వ్యాధి*

*3. పక్షవాతము*

*4. మెదడులో గడ్డలు*

*5. రక్తనాళాలలో గడ్డకట్టిన రక్తం.*

*6. మల్టిపుల్ స్ల్కీరోసిస్*

*7. పార్కిన్ సన్స్ వ్యాధి*

✍️పాటించవలసిన నియమాలు మరియు పరిస్కార మార్గాలు:

*1. ఆహారం:* 

👉శాకాహారం, సాత్వికాహారం, ఆవుపాలు, ఆవునెయ్యి, ఉప్పు, కారం, మసాలాలు మానెయ్యాలి. 

👉బాదం, పిస్తా, ద్రాక్ష, దానిమ్మ మంచివి.
 
 *2. విహారం:* 

👉తగినంత విశ్రాంతి, శ్రావ్య సంగీత వాయిద్యాలు, మధురమైన పాటలు ఉపయోగకరం.

👉 వీలును బట్టి ప్రాణాయామం మంచిది. 

👉మేధ్య రసాయన ఓషధులలో బ్రాహ్మీ (సంబరేణు), మండూకపర్ణి (సరస్వతి), శంఖపుష్పి, అపరాజిత (దిరిశెన) ప్రశస్తమైనవి. 

*3. మందులు:* 

👉మహా పంచగవ్య ఘృతం: ఒక చెంచా మందుని నాలుగు చెంచాల ఆవుపాలలో కలిపి, రెండుపూటలా ఏదైనా తినటానికి ముందుగా తాగాలి.

👉 స్మృతి సాగర రసమాత్రలు ఉదయం 1, రాత్రి 1 తిన్న తర్వాత వాడాలి. 

👉సారస్వతారిష్ట ద్రావకం: నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి రెండుపూటలా తాగాలి. 

👉స్వర్ణబ్రాహ్మి మాత్రలు రోజుకి-1.

👉మేధ్య రసాయన ఓషధులలో ఏవైనా ఒక దాని ఆకుల్ని శుభ్రం చేసి, దంచి, స్వరసం తీసి, మూడు చెంచాల మోతాదుని తేనెతో రెండుపూటలా సేవించాలి. దీనికి ఒక చెంచా ఆమలకీ (ఉసిరికాయ) స్వరసం కలిపితే ఇంకా మంచిది.
 
👉వసకొమ్ముని నీళ్లతో నూరి, ఆ ముద్దని రెండు చిటికెల (300 మి.గ్రా) తేనెతో వారానికి రెండుసార్లు నాకిస్తే మంచి మేధ్య రసాయనంగా పనిచేస్తుంది. (ఎక్కువైతే అది వాంతికరం)
 
👉ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ‘ధారాచికిత్స’, మూత్రావస్తి అవసరాన్ని బట్టి అమలుపరిస్తే ఫలితం గణనీయంగా ఉంటుంది.

 *పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన శాశ్వత పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.*

సయాటికా సమస్య - ఆయుర్వేద నివారణా మార్గాలు:*

✍️ *సయాటికా సమస్య - ఆయుర్వేద నివారణా మార్గాలు:*

👉ఈ సమస్య ఉన్న వారికి కండరాలు పట్టేసినట్లు ఉండటమే కాదు భరించలేని నొప్పి ఉంటుంది.

 👉దీనికి ఆధునిక వైద్య విధానంలో శస్త్రచికిత్స ఒకటే మార్గమని చెబుతారు. అయితే అది కూడా తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే. కొంత కాలం తర్వాత ఈ నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది.

👉 కానీ ఆయుర్వేదంలో సయాటికాకు శాశ్వత పరిష్కారం కలదు.

✍️ *అసలు సయాటిక సమస్య అంటే ఏమిటి?*

👉శరీరంలో అతి పొడవైన నరం సయాటిక్. ఇది తొడల నుంచి మోకాళ్లు, పిక్కల ద్వారా అరికాళ్లు, కాలివేళ్ల దాకా వ్యాపించి ఉంటుంది. 

👉మన వెన్నులో ప్రతి రెండు వెన్నుపూసల మధ్య కొంత ఖాళీ ప్రదేశం, ఒక సయాటిక్ నరం, పూసలను బంధించి ఉంచే కొన్ని కండరాలు ఉంటాయి. 

👉మన దైనందిన పనుల్లోని కొన్ని లోపాల వల్ల కొందరిలో ఈ పూసలను బంధించి ఉంచే కండరాలు బలహీనమవుతాయి. ఫలితంగా పూసల మధ్య సహజంగా ఉండవలసిన ఖాళీ తగ్గిపోతుంది. 

👉దీనివల్ల పూసల మధ్య ఉండే సయాటికా నరం ఒత్తిడికి లోనవుతుంది.ఫలితంగా ఆ నరం శరీరంలో ఎంత దూరం వెళితే అంత దూరం నొప్పి వస్తూనే ఉంటుంది. 

👉సయాటిక్ నరం ఒత్తిడికి గురి కావడం వల్ల వచ్చే సమస్య కావడం చేత దీనికి సయాటికా అన్న పేరు స్థిరపడింది. సయాటికాకు ఆయుర్వేద పరిభాషలో గృద్రసి వాతం అని పేరు.

✍️ *సయాటిక సమస్య లక్షణాలు:*

👉సయాటికా సమస్య ప్రారంభం కాగానే కనిపించే లక్షణం నొప్పి. ఆ తరువాత కొంత అసౌకర్యంగా ఉండటం, ఆ భాగంలో ఏదో కదిలినట్టు, చీమలు పాకినట్లు, పొడిచినట్లు అనిపిస్తుంది.

👉 తరువాత ఆ భాగమంతా మొద్దుబారినట్లుగా తయారవుతుంది. 

👉వంగడం కష్టమవుతుంది. ఒకవేళ వంగినా మళ్లీ లేవబోతే చురుకుపెట్టినట్లు అవుతుంది.ఈ లక్షణాలు తుంటి నుంచి కాలి వేళ్ల దాకా ఎక్కడైనా కనిపించవచ్చు. 

👉ఈ సమస్య నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశలో నడుము భాగంలో కండరాలు పట్టేసినట్లు అనిపిస్తుంది. 

👉రెండవ దశలో ఈ నొప్పి నడుము నుంచి పిరుదుల దాకా వెళుతుంది. ఈ దశలో కాస్త తైలమర్ధనం చేసుకున్నా నొప్పి తగ్గుతుంది. 

👉మూడవ దశలో నొప్పితో కాలంతా లాగుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే పొడిచినట్లు, మొద్దుబారినట్లు కూడా అనిపిస్తుంది. 

👉నాలుగవ దశలో నొప్పి కాలంతా పాకడమే కాకుండా కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది.
పడుకుని మరో పక్కకు తిరగబోతే బలంగా చురుకు పెట్టినట్లు అవుతుంది. వంగినా లేచినా ఇదే పరిస్థితి ఉంటుంది. 

👉సయాటికా సమస్య ఉన్న వివాహితుల్లో చాలా మందిలో అంగస్తంభన లోపాలు, శీఘ్రస్కలన సమస్యలు ఉంటాయి. 

👉సయాటికా సమస్యతో వచ్చిన వారికి ఈ సమస్య కూడా ఉంటే రెండింటికీ ఏకకాలంలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. 

👉ఎక్కువ కాలం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే నపుంసకత్వానికి కూడా దారి తీయవచ్చు. 

👉సమస్య మరీ తీవ్రమైతే కొందరిలో రెండు కాళ్లూ చచ్చుబడిపోవచ్చు. 

👉ప్రమాదాల్లో కూడా కొందరిలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయి. 

👉సమస్య మొదలైన మూడుమాసాల్లోపే వస్తే ఇది సులభంగా తగ్గిపోతుంది. కనీసం ఏడాదిలోపు తీసుకున్నా మంచి ఫలితాలే ఉంటాయి. మూడేళ్లు దాటాక చికిత్స తీసుకుంటే సమస్య పూర్తిస్థాయిలో తగ్గదు

✍️ *సయాటిక రావడానికి కారణాలు:* 

👉సయాటికా రావడానికి అస్తవ్యస్తమైన జీవన శైలి ప్రధాన కారణం. ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిన వారిలో కండరాలకు ఎక్కువగా శ్రమ ఉండదు. అరుదుగా ఎప్పుడైనా కాస్త ఎక్కువ బరువు ఎత్తడం, ఎక్కువ గంటలు నిలుచోవడం లేక కూర్చునే భంగిమలో తేడా వల్ల వెన్నుపాము అపక్రమానికి లోనయితే ఈ సమస్య తలెత్తుతుంది. 

👉రోజంతా కూర్చుని లేదా నిలుచుని ఉండే ఉద్యోగ, వ్యాపారాలు చేసే వారు, మరీ ఎత్తయిన హీల్స్ ధరించేవారు, బెల్ట్‌ను మరీ బిగుతుగా పెట్టుకునే వారు, వెయిట్ లిఫ్టింగ్ చేసేవారు, ఏదైనా ప్రమాదానికి గురయిన వారు సయాటికా సమస్యకు గురికావచ్చు.

👉అలాగే దీర్ఘకాలికంగా మధుమేహం, క్షయ, లైంగిక వ్యాధుల కారణంగా వ్యాధి నిరోధక శక్తి కోల్పోయినపుడు కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది.

👉 ఇవే కాకుండా బాల్యంలో తగిలిన దెబ్బల తాలూకు దుష్ప్రభావం శరీరంలో ఉండిపోతుంది. అది పెద్దయ్యాక ఎప్పుడో శరీరం బలహీన పడినప్పుడు సయాటికాగా బయటపడవచ్చు. 

👉ముఖ్యంగా రోజూ చేసే పనుల వల్ల కాకుండా హఠాత్తుగా ఏదైనా బరువైన పనిచేసినప్పుడు ఈ సమస్య రావచ్చు. 

👉ఇక స్త్రీలలో అయితే, గర్భంతో ఉన్నప్పుడు గానీ, ప్రసవ సమయంలో గానీ నడుము మీద పడే ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. 

👉కొంతమంది స్త్రీలలో రుతుక్రమం ఆగిపోయిన తరువాత కాల్షియం లోపాల వల్ల సయాటికా సమస్య రావచ్చు.

✍️ *నివారణా మార్గాలు:*

👉ఈ సమస్య నాలుగు దశల్లో ఉంటుంది. వీటిని డిస్కు బల్జ్, స్లిప్ డిస్క్, హెర్నియేటెడ్ డిస్క్, సీక్వెస్ట్రమ్ డిస్క్ అంటారు.

👉 మొదటి మూడు దశల్లో సమస్యను ఆయుర్వేద మందులతోనే పూర్తిగా తగ్గించవచ్చు. చికిత్సల తరువాత ఎంఆర్ఐ రిపోర్టు చూస్తే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. 

👉చివరి దశ అయినటువంటి సీక్వెస్ట్రమ్‌లో మాత్రం శస్త్రచికిత్స అవసరమవుతుంది. సయాటికాకు ఆయుర్వేద వైద్యవిధానంలో పంచకర్మ చికిత్సలో భాగమైన మేరు చికిత్స బాగా పనిచేస్తుంది.

👉 ఆయుర్వేద మందులతో పాటు ఆహార నియమాలను పాటిస్తే ఫలితం బాగుంటుంది.

*పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.*