✍️ *గ్యాస్ట్రైటిస్ అంటే ఏమిటి?*
👉గ్యాస్ట్రైటిస్ (కడుపులో పుండ్లు) అనునవి కడుపు యొక్క అంతర్గత లైనింగ్స్ లో ఏర్పడే చికాకు లేక మంట.
👉ఆరోగ్యవంతులైన వ్యక్తులలో కడుపు ఆమ్లాలను, వివిధ ఎంజైములను, మరియు శ్లేష్మమును ఉత్పత్తి చేస్తుంది.
👉పుండ్లు ఏర్పడిన సమయములో శ్లేష్మము తగ్గిపోతుంది మరియు కడుపు తన యొక్క స్వంత ఆమ్లమును ప్రదర్శిస్తుంది, ఇది నొప్పి మరియు కడుపు ప్రాంతములో మంటతో పాటు ఆహారము యొక్క అజీర్ణము మరియు అప్పుడప్పుడూ వాంతులు ఏర్పడుటకు కారణమవుతుంది.
👉ప్రతీ ఒక్కరు వారి జీవితకాలములో కనీసం ఒక్కసారైనా ఈ పరిస్థితిని అనుభవిస్తారు.
👉వాటికి సంబంధించిన కారణాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్, మందులు, ధూమపానం, మద్యపాన వ్యసనం, ఒత్తిడి మరియు రోగ నిరోధక వ్యవస్థ- సంబంధ పరిస్థితులు అనునవి పుండ్లు ఏర్పడడానికి ప్రదాన కారణాలు.
✍️ *గ్యాస్ట్రైటిస్ యొక్క లక్షణాలు:*
గ్యాస్ట్రైటిస్(కడుపులో పుండ్లు) రకాలను ఆధారము చేసుకొని లక్షణాలు ఉంటాయి.
👉 కడుపులో మండే స్వభావము మరియు కడుపు యొక్క మధ్య భాగములో మంట (గుండె మంట) అనునది పుండ్ల యొక్క ఒక సాధారణ లక్షణము.
👉 కొంతమంది ఏ విధమైన లక్షణాలను కలిగి ఉండరు కానీ అజీర్ణ సమస్య రూపములో మాత్రమే కొంత సమస్యను అనుభవిస్తారు.
👉కడుపులో మండే స్వభావము లేక పొత్తి కడుపు యొక్క పై భాగములో మండే స్వభావము కలిగి ఉండడం.
👉గుండె మంట (చాతీ ప్రాంతములో మంట).
👉అధికమైన త్రేన్పులు.
👉 ఆహారనాళము (అన్నవాహిక)లో లేక నోటిలో ఆహారము వెనక్కి రావడం.
👉పొత్తికడుపులో మందకొడిగా ఉండే భావన.
👉కొద్దిగా భోజనం తీసుకున్నా కడుపు నిండినట్లు లేక భారముగా ఉండడం.
👉వికారం.
👉వాంతులు.
👉అజీర్ణం
👉ఆకలి మందగించడం.
👉ఎక్కిళ్ళు లాంటి లక్షణాలు కలిగి ఉంటాయి.
గమనిక: గ్యాస్ట్రైటిస్( పుండ్ల) యొక్క రకము మరియు రోగ కారణము పైన ఆధారపడి లక్షణాల యొక్క తీవ్రత మారుతూ ఉంటుంది. క్రింద ఇవ్వబడిన గుర్తులు మరియు లక్షణాలలో మీరు ఏవైనా కలిగిఉంటే, మీరు మీ డాక్టరును సంప్రదించడం మంచిది.
👉పొత్తికడుపు పై భాగము లేక కడుపు ప్రాంతములో తీవ్రమైన నొప్పి (కత్తితో పొడిచినటువంటి లేక శూలముతో గ్రుచ్చినటువంటి నొప్పి).
👉రక్తముతో కూడిన వాంతి (రక్తము).
👉ముదురు నలుపు లేక నలుపు రంగు మలము బయటకు రావడం.
👉తలతిరగడం (మైకము) లేక నిస్సత్తువ (నీరసము).
👉శ్వాస ఆడకపోవడం.
👉బలహీనత.
👉పాలిపోవడం.
ఈ లక్షణాలు పుండ్ల లేక పుండ్ల కోత యొక్క తీవ్ర రూపమును సూచిస్తాయి, దీనికి సత్వర చికిత్స అవసరమవుతుంది.
✍️ *నివారణా మార్గాలు:*
👉జీవనశైలి నిర్వహణ:
*1).* *భోజన పధకాలు:*
👉ఎక్కువగా ఆహారం తీసుకోవడం ఫలితముగా ఎక్కువ ఆమ్లము ఏర్పడుతుంది కాబట్టి, తక్కువగా మరియు తరచుగా ఆహారమును తీసుకోవడము బాగా పనిచేస్తుంది, మరియు కడుపు యొక్క సామర్థ్యము కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఆహారము తీసుకునే సమయానికి తీసుకోకపోతే ఎక్కువ ఆమ్లమును ఉత్పత్తి చేస్తుంది, ఇది తరువాత కడుపు యొక్క లైనింగ్స్ ను నష్టపరుస్తుంది.
*2). ప్రొబయాటిక్స్ యొక్క ఉపయోగము:*
👉 ప్రొబయాటిక్స్ అనునది కడుపులో పుండ్లను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. పెరుగు మరియు మజ్జిగ అనునవి సహజమైన ప్రొబయాటిక్స్ .
*3). ఆల్కహాలును దూరముగా ఉంచడం:*
👉ఆల్కహాలు కూడా కడుపు యొక్క లైనింగ్స్ కు చికాకు తెప్పిస్తుంది.
*4). పొగ త్రాగడమును దూరముగా ఉంచడం:*
👉ధూమపానం అనునది కడుపులో ఆమ్ల స్రావాలను పెంచే కారకాలలో ఒకటిగా తెలుపబడింది.
*5). మసాలా గల ఆహారమును దూరముగా ఉంచడం:*
👉మసాలా లేక ఇతర చికాకు కలిగించే ఆహార పదార్థాలు కూడా కడుపు యొక్క ఆమ్ల స్రావాలను పెంచుతుంది మరియు దాని యొక్క లోపలి లైనింగ్స్ కు నష్టము కలుగచేస్తుంది.
*6). బరువు నిర్వహణ:*
👉బరువును కోల్పోవడం లేక బిఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) యొక్క లక్ష్యాన్ని సాధించడం అనునవి చాలా కాలంపాటు ఉన్న పుండ్ల తీవ్రతను తగ్గించడములో సహాయపడతాయి.
*7). ఒత్తిడి నిర్వహణ:*
ఒత్తిడి అనునది కడుపులో ఆమ్ల స్రావాలు పెరగడానికి మరొక కారకము. యోగా, శ్వాస సంబంధ పద్ధతులు, మరియు ధ్యానము వంటివి ఒత్తిడిని నిర్వహించడములో సహాయం చేస్తాయి.
✍️ *ఆహార నియమాలు:*
👉పాతబియ్యం , పాతగోధుమలు వాడవలెను.
👉బార్లీ , సగ్గుబియ్యం జావ వాడవలెను.
👉బీరకాయ, పొట్లకాయ కూరలు తినవలెను .
👉 పెసరపప్పు తినవలెను . కందిపప్పు , మినపపప్పు తినవద్దు.
👉కోడి మాంసం , గుడ్డు నిషిద్దం . ఎప్పుడైనా ఒకసారి మేకమాంసం అతి తక్కువ మోతాదులో మసాలా చాలా తక్కువ మోతాదులో కలిపి తీసుకొవచ్చు.
👉 పాతపచ్చళ్ళు పూర్తిగా నిషిద్దం.
👉 పళ్ల రసాలు తీసుకోవచ్చు . ముఖ్యంగా యాపిల్, బత్తాయి రసం తీసుకోవలెను .
👉పెరుగు,తోటకూర, మెంతికూర, పాలకూర, గంగపాయల కూర , చక్రవర్తికూర వంటి ఆకుకూరల తరుచుగా తీసుకొనవలెను.
👉మలబద్దకం లేకుండా చూసుకొనవలెను. సుఖవిరేచనం అయ్యేలా చూసుకోవాలి .
👉శరీరానికి వేడిచేసే పదార్థాలు తీసుకోరాదు . వీలయినంత ఎక్కువ మజ్జిగ తీసికొనవలెను.
👉కొత్తబియ్యం, కొత్తగోధుమలు వాడరాదు.
👉 కొత్తచింతపండు , కొత్తబెల్లం నిషిద్దం.
👉ఆహారంలో నూనె తగ్గించి వాడుకొనవలెను.
👉చద్దన్నం, చల్లబడినవి , మెత్తపడిన ఆహారాన్ని తినకూడదు.
*పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.*
✍️ *
No comments:
Post a Comment