Saturday, December 28, 2024

గర్భం గురించి విషయం

[28/12, 11:04] Prod Lakshmi Kavalli: ఓ౩మ్ న భూమిమ్ వాతో అతి వాతి నాతి పశ్యతి కశ్చన,
స్త్రియశ్చ సర్వా: స్వాపయ శునశ్చేన్ద్రసఖా చరన్. (అథర్వ 4-5-2)
పుణ్యగంధయ:=పుణ్యకర్మలు చేయువారు 
ఎవరైతే భౌతిక ఉన్నతియే కాక ఆధ్యాత్మిక ఉన్నతిని కూడ కోరుతారో వారిని పుణ్యగంధ:అంటారు. 
👉ముఖ్యముగా రాత్రి పన్నేండు దాటిన తర్వాత దినము యోక్క సంయోగము జరుగును 
ఈ సమయమున భూమి పైన వాయువు మందముగా ప్రవహించును,అంధకారముండును ఏ ప్రాణికూడ బహుదూరమున గల వస్తువును చూడలేదు ఈ సమయము సవితా కాలము అనగా సృష్టికర్తను ఉపాసించుకాలము,
జీవాత్మ పరమాత్మ కలయిక కాలము,👇
[28/12, 11:04] Prod Lakshmi Kavalli: 👆
ఎటుల తల్లిగర్భమున శిశువునకు పౌష్టిక ఆహారము ఆలోచనలు కోరికలు శారిరిక వికాసము తల్లిద్వారానే జరుగును. 
అందుకే గర్భిణీ స్త్రీ ని సర్వవిద్యలచేత అలంకరణ చేయుదురు అదియే లోకమున సీమంతోనయన ఉత్సవము. 
అటులనే పన్నెండు తర్వాత జీవాత్మ పరమాత్మ కలయిక ఆకాశమున నక్షత్రాలు లోపించడం సూర్యోదయ ప్రకాశము ,
యోగాభ్యాసులకు ఈ రహస్యము తెలుసు,
[28/12, 11:04] Prod Lakshmi Kavalli: ☝️
జీవాత్మ పరమాత్మలు చక్కటి మిత్రులు రహస్య మిత్రులు 
రాత్రిదిన సంయోగములో వీరి కలసనచో తప్పకుండా గర్భధారణ జరుగును 
మాతృగర్భమున పురుషుడు రేతస్సు ప్రవేశపరుచును,
అటులనే పరమాత్ముడు జీవునిని ఉదయసంయోగమున తన గర్భములోకి ప్రవేశింపజేసుకొని అత్మకు కావలసిన సమస్త జ్ఞానోపదేశము చేయును,👇
[28/12, 11:04] Prod Lakshmi Kavalli: ఎటుల గర్భవతీస్త్రీకి ఏడవనేల పూర్ణత్వమును ఇచ్చునో అటులనే మూడుగంటల నుండి అయిదు గంటలు సమయము జీవాత్మ కు పూర్ణత్వ స్థితి ఉండును 
9వ నెల తల్లి శిశువురాకను ఎదురుచూసినంటు 
పరమాత్ముడుకూడ తల్లిస్థానమున ఉండి అయిదు తర్వాత జీవునిని కర్తవ్యాల వైపు తన గర్భద్వారమును తెరిచి బయటకు పంపును.
[28/12, 11:04] Prod Lakshmi Kavalli: లేత నెలలో శిశువు యోక్క వికాసము 
అటులనే రాత్రిపన్నెండు తర్వాత జీవాత్మ కూడ పరమాత్ముని గర్భమున లేతనేలలు 
ఏడవ నెల గర్భము పూర్ణస్థితి 
అంటే ఏడవ నెల నుండి తొమ్మిది పడేవరకు పూర్ణశరీరము 
తొమ్మిదవ నెలలో జన్నించిన శిశువు సంపూర్ణ ఆరోగ్య వంతుడు 
అటులనే పన్నెండుగంటలకు పరమాత్ముని గర్భమున ప్రవేశించిన జీవాత్మ 5-30 తర్వాత బయటకు వచ్చిన జీవాత్మ సంపూర్ణ యోగి .

manchimatalu

[23/12, 07:46] Prod Lakshmi Kavalli: 👉కత్తిని వ్యతిరేక దిశలో ఉపయోగించుకొనినచో అది మన హస్తమును గాయపరుచును 
అటులనే సుమతికూడ 
దానిని విద్వాంసుల సహాయముతో ఉపయోగించుకొని వ్యవస్థకు విరుద్ధముగా వెల్లనిచో సుహృదులు ఉన్న లోకమున ప్రవేశించగలము.
[23/12, 07:46] Prod Lakshmi Kavalli: సుకర్మీయులు తమ శరీరమున గల సమస్త రోగములను తొలగించుకొని ఆనందలోకమున ప్రవేశించెదరు,
ఎచట లోకకల్యాణము కొరకు యాగములు జరుగునో అచటనైన జన్మించవలయును,
కాని కుకర్మలు చేసి అపుణ్యలోకమునకు వెల్లరాదు
[23/12, 07:46] Prod Lakshmi Kavalli: ఓ౩మ్ యత్రా సుహార్ద: సుకృతో మదంతి విహాయ రోగమ్ తన్వ: స్వాయా:,
తమ్ లోకమ్ యమిన్యభిసంబభూవ సా నో మా హింసీత్ పురుషాన్ పశూంశ్చ (అథర్వ 3-28)
ఈ సృష్టి పరమాణువుల సంయోగముతో ఏర్పడినది 
ఇందులో జీవుడు కర్మానుసారముగా జ్ఞానానుసారముగా వివిధశరీరాలను పొంది సుఖదు:ఖాలను అనుభవించుచున్నాడు 
సుమతి *ఇది గొప్ప సాధనము 
పదునైన కత్తి దారిలో ఉన్న ముండ్లబాటలు ఎలా తొలగించగలదో ఈ సుమతి అంతే
[23/12, 07:46] Prod Lakshmi Kavalli: మానవుని జ్ఞానము రెండువిధములు 
ఒకటి స్వాభావిక జ్ఞానము
రెండవది నైమిత్తిక జ్ఞానము
[23/12, 07:46] Prod Lakshmi Kavalli: అప్పుడే ఆత్మ పరమాత్మ ప్రకృతి యోక్క వివేక జ్ఞానము బోధపడును
[23/12, 07:46] Prod Lakshmi Kavalli: నైమిత్తిక జ్ఞానము గురువుద్వారానే వికసింపబడును 
కాని ఆ గురువు ప్రత్యక్షానుప్రమాణాలతో సృష్టిని ఆత్మ తత్వమును పరమాత్మతత్వమును నిరూపించగలిగే గురువు ఉండాలి.
[23/12, 07:46] Prod Lakshmi Kavalli: నేడు సంస్కృత వేదవాఙ్మయాల అధ్యయనము లోపించినది 
గోమేధము =ఇంద్రియాల మథనము 
అశ్వమేధము =ఇంద్రియాల మథనము 
ఇంద్రవృత్తాసురులు =ఇంద్రియాల మథనము ఈ అర్థాలను మరచిపోయాము 
గోమేధము =లేగను బలి ఇచ్చుట 
అశ్వమేధము =గుర్రమును బలి ఇచ్చుట ఈ విధముగ వేదమంత్రాల భావార్థములు లోకమున విపరీత అర్థముతో వ్యాప్తిచేయబడినవి

Friday, December 27, 2024

ఉబ్బసం నివారణా యోగాలు -

ఉబ్బసం నివారణా యోగాలు -

 * ఉబ్బసం ఉధృతంగా ఉండి శ్వాస ఆడనప్పుడు వాము గింజలను వేడిచేసి గుడ్డలో కట్టి ఛాతిపైన , గొంతుకకు కాపడం పెడితే నొప్పి శ్వాస సులువుగా ఆడుతుంది.

 * వస కొమ్ము చూర్ణం ఉబ్బసం ఎక్కువుగా ఉన్నప్పుడు ప్రతి మూడు గంటలకి ఒకసారి ఉసిరిగింజంత నీటిలో కలిపి తాగాలి.ఇలా రెండు లేక మూడు మోతాదులలో తేలిక అగును.

 * మారేడు ఆకుల రసం అరచెంచా , తేనె అరచెంచా కలిపి ఉదయం , సాయంత్రం రెండుపూటలా తీసుకోవాలి . 40 రోజులు క్రమం తప్పకుండా వాడుకోవాలి. తగ్గకుంటే మరొక్క 40 రోజులు వాడండి. తప్పక తగ్గును.

 * పూటకొక యాలుక్కాయ తినినచో ఉబ్బసం తగ్గును.

 * ఎండు జిల్లేడు ఆకుల పొగని తరుచూ పీల్చుచుండిన ఉబ్బస రోగం నివారణ అగును.

 * ప్రతినిత్యం ఒక పచ్చి కాకరకాయని తింటున్న పోతుంది. రోజురోజుకు మార్పు కనిపించును. తగ్గేంత వరకు వాడవలెను.

 * ప్రతి నిత్యం ఉదయం , సాయంత్రం కప్పు పాలలో నాలుగు వెల్లుల్లి రేకలు చితగ్గొట్టి వేసి పొయ్యి పైన మరిగించి ఆ పాలను తాగుచున్న ఉబ్బసం హరించును .

 * ఉబ్బసం ఎక్కువుగా ఉండి కఫం పట్టేసి ఉన్నచో కుప్పింటాకు రసాన్ని మూడు చెంచాలు లొపలికి తీసుకొనుచున్న కఫం కరిగి బయటకి వచ్చును.

 * అల్లం రసం , తేనె సమభాగాలుగా కలిపి మూడు గంటలకి ఒకసారి చెంచా చొప్పున తీసుకొనుచున్న ఉబ్బస ఉధృతి తగ్గును.

 * ఉత్తరేణి చెట్టుకు సమూలంగా తీసుకుని నీడన ఎండించి భస్మం చేయవలెను . ఆ భస్మమును మూడు పూటలా కందిగింజ అంత తేనెతో కలిపి లోపలికి తీసుకొనిన ఉబ్బసం తగ్గును . ఇది తిరుగులేని యోగం . 

శరీరంపైన లేచే వ్రణాలను హరించు యోగాలు -

   శరీరంలోని కొన్ని భాగాలలో ఎత్తుగా , గట్టిగా గడ్డలు ఏర్పడును . ఈ గడ్డల వలన పోటు , విపరీతమైన నొప్పి ఉండును. కొన్ని మెత్తగా ఉండి పోటు , సలుపు కలిగి ఉండును. వ్రణాలు లొపల చీము మరియు నెత్తురుతో కూడుకుని ఉండును. పక్వానికి వచ్చి పగిలిన తరువాత లొపల ఉన్న చెడు బయటకి వెళ్లడం వలన నొప్పి మరియు పోటు ఉపశమించును.

 

Thursday, December 26, 2024

గోమాత గొప్పదనం గురించి తెలుసుకుందాం.*



 *గోమాత గొప్పదనం గురించి తెలుసుకుందాం.* 
*ఆవుదూడ పుట్టిన మొదటి రోజునే పేడ వేస్తుంది. అప్పుడే పుట్టిన లేగ దూడ మొదటి సారివేసిన పేడ పదివేల రూపాయలకు కూడ ఎక్కడా దొరకదు. అది బ్లడ్‌ క్యాన్సర్‌కు అత్యుత్తమ ఔషధం. ఫిట్సుకు కూడ ఇది ఉపయోగ పడుతుంది. దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది. అందువలన అది దొరకుట చాలా కష్టం. పడక కురుపు, పుండు వున్న ఒక స్త్రీకి ఆవు పిడకల బూడిద (కచ్ఛిక) పొడి పుండుకు పట్టించుట మొదలు పెట్టగా నెల రోజులలో పుండు నయమైనది. ఆ పుండు ఎముక కనిపించేంత లోతైనది.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ఆవు పేడతో అగరు వత్తులు తయారవుతాయి. ఆ అగరు వత్తుల బూడిదను ఔషధంగా వాడవచ్చు. పిల్లలకు దెబ్బ తగిలిన, ఆ పొడి రెండు రోజులు వాడిన అది తగ్గుతుంది.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*మధుమేహ వ్యాధిగ్రస్థులకు దెబ్బలు, పుండ్లు కూడ ఆవు పేడ బూడిద వ్రాసిన త్వరగా తగ్గుతాయి.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ఏవైనా విష క్రిములు కుట్టినప్పుడు, (తేనెటీగ, కందిరీగ మొదలగునవి) ఈ బూడిద వేసిన ఒక నిమిషంలో తగ్గుతుంది.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*వరదలు, తుఫానులు వచ్చినప్పుడు, ఇతర సమయాలలో నీరు బురదగా వున్నప్పుడు, నీరు కాచి త్రాగుతారు. ఒక బిందెడు నీటిలో ఆవు పిడకల బూడిద ఒక స్పూను కలిపిన ఆ నీటిని కాయవలసిన పనిలేదు. ఆ నీరు త్రాగిన వారికి కలరా, తలనొప్పి, జ్వరము, విరేచనములు రావు. కావున వరద సమయాలలో ఆ బూడిదను పంచిన రోగాలు రావు.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ప్రయాణాలు చేసే వారు ఆవు కచ్చికల బూడిదను వెంట తీసుకువెళ్ళి బయట నీరు త్రాగవల్సి వచ్చిన బాటిలు నీటిలో ఒక చిటికెడు బూడిద కలిపి వాడిన ఎలాంటి రోగాలు రావు. (అగర వత్తుల భస్మం) సేకరించి వుంచుకోండి. ఆవు పేడతో చేసినవి మాత్రమే.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ఆవు పేడతో చేసిన అగరు వత్తులు వాడిన ఆ ధూపము ఇల్లంతా వ్యాపించి, ఆ ఇంటి దారిద్య్రము తొలగిపోతుంది.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ఆవు పిడకల పొడితో పళ్ళపొడి తయారు చేసిన, పంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. పంటినొప్పి, కదులుట తగ్గుతుంది. పళ్ళు గట్టిపడతాయి.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ఆవు పేడతో చేసిన పండ్లపొడిని నోటిలో ఉంచి ఐదు నిమిషముల తర్వాత పండ్లు వేలితో రుద్దాలి. చిగుళ్ళను వేలితో మర్ధన చేయాలి. బ్రష్‌ను వాడవల్సిన పనిలేదు. వ్రేలితో తోమినప్పుడే పళ్ళు బాగా గట్టిపడతాయి.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ఈ ఆవు పిడకల పొడి క్రిమిసంహారిణి. అందువలన దీనితో చేసిన పండ్లపొడి ప్రపంచంలోనే ఉన్నతమైన శాస్త్రీయమైన పండ్లపొడి.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*నాలుకను టంగ్‌క్లీనర్‌ను వుపయోగించి శుభ్రం చేస్తాము. అలా కాకుండా రెండు వేళ్ళతో బాగా రుద్దిన, గొంతులోని ప్రాతం కూడా శుభ్రపడుతుంది.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ఆవు పేడతో చేసిన సబ్బులు వుపయోగించిన చర్మవ్యాధులు రాకుండా, ఒకవేళ వున్నచో తగ్గుటకు, చెమటలు పట్టుట తగ్గుటకు తోడ్పడుతుంది. ఇతర సబ్బులలో కెమికల్స్‌ కలియుటచే చర్మానికి మంచిది కాదు.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ఆవు పేడ విషనాశకము. విష పదార్థములు తీసుకున్నప్పుడు, ఆవు పేడతో చేసిన బూడిద నీళ్ళలో కలిపి త్రాగిన విషం విరుగుతుంది. నీటిలో బూడిద కలిపి స్నానం చేయించిన విష ప్రభావము తగ్గుతుంది.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
. *పాముకాటుకు గురైన వ్యక్తి చనిపోయినట్లు డాక్టరు చెప్పగా, ఒక యోగి అతని శరీరానికి పలుమార్లు పూర్తిగా ఆవు పేడ పట్టించగా, లోనవున్న విషమంతా విరిగి రెండోరోజుకు అతను శ్వాస పీల్చుకోవడం జరిగింది. అందువలన ఆవుపేడ అద్భుతమైన విష నాశని.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ఆవు పిడకల పొడిని నీళ్ళలో కలిపి స్నానం చేయాలి. ఒంటికి నలుగు పెట్టవచ్చు. పుల్లటి మజ్జిగలో కలిపి తలకు పట్టించండి. పొడిబారిన చర్మం గల వారు పాలలో కలిపి ఫేస్‌ప్యాక్‌గా వాడవచ్చు. చర్మము స్వచ్ఛమై మృదువుగా తయారవుతుంది*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*దెబ్బతగిలి నొప్పి వున్న చోట, ఇతర నొప్పులకు నీటిలో కలిపి పట్టీ వేయించండి. బాగా అలసినచో, లలాట భాగంలో మందముగా ఆ లేపనాన్ని పూసిన 30 నిమిషాల్లో అది ఆరిపోయి తాజాగా తయారవుతారు.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ఆవు మలం కాదు. దానిని గోమయం అంటారు. దానిని పూజల్లో, యజ్ఞాల్లో, వాకిట్లో కళ్ళాపిగాను, పవిత్ర కార్యాలలోను ఉపయోగిస్తాము. అందువలన అది విశిష్టమైనది.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*పొలాల్లో ఆవు పేడను ఎరువుగా ఉపయోగించిన ఆహారపదార్థాలు అద్భుతమైన రుచిని కలిగిస్తాయి. పండ్లు మంచి వాసన కలిగి వుంటాయి. పంజాబ్‌లో రసాయనిక ఎరువులు వాడుట వలన అచట ఎక్కువ మంది క్యాన్సర్‌ వ్యాధికి గురైనారు.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ఇవన్ని మీరు నమ్మకపోవచ్చు ఎందుకంటే ఇది మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన గోమాతకు సంబంధించినవి కాబట్టి. అదే ఇంగ్లీషు మందులు తగ్గుతాయో లేదో అనే ఆలోచన కూడా మనకి రాదు. మనల్ని ఈ విధంగా మార్చేసింది మన విద్యావిధానం... చెప్పడం మాత్రమే మా బాధ్యత. నమ్మడం నమ్మకపోవడం అది మీ వ్యక్తిగతం.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*సర్వేజన సుఖినోభవంతు‌‌.*
  **

మంచి మాటలు

*_ఒక మంచిమాట పలకడం వల్ల మనిషికి వేయి ఏనుగుల బలం వస్తుంది. చెడుమాట పలకడం వల్ల మనిషి మనసు నీరసించిపోతుంది._*

*_చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు కూడా చక్కని సంగీతానికి, మధుర స్తుతులకు, బుజ్జగించే మాటలకు తలలూపుతూ అనుకూలంగా వ్యవహరిస్తాయని మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెబుతారు._*

*_కాబట్టి, కలలోనైనా చెడు మాట నోటినుంచి వెలువడరాదు. "ప్రాణం పోయినా సరే చెడుమాటను మాత్రం ఎన్నడూ పలకను " అని తమ జీవితాన్నే ధారపోసిన పూర్వపురుషులెందరో ఉన్నారు._*

*_వారి మాట పూలబాట. ప్రియభాషణం వల్లనే రాముడు ఆదర్శ మానవోత్తముడైనాడు. ప్రియభాషణంతోనే మహర్షులు గర్వాంధులైన రాజులకు కనువిప్పు కలిగించారు._*

*_నేటి కాలంలో ధనం కోసం, అధికారం కోసం, ఆధిపత్యం కోసం, అక్రమార్జనల కోసం, అనుచిత సుఖాల కోసం, దుర్వ్యసనాల కోసం..._*

*_మనుషులు తోటివారిని మాటలతో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఉద్వేగకర వ్యాఖ్యల కారణంగా ఎందరో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొంటున్నారు._*

*_మనిషిలో ఆత్మవిమర్శ కలగాలి. ఒక్కమాట కూడా రెచ్చగొట్టకుండా ఉండే విధంగా సంయమనాన్ని పాటించాలి. అదే మనిషి ఉన్నత వ్యక్తిత్వానికి దర్పణం._*

*_ఆదర్శం పై మనకున్న ప్రేమకు నిదర్శనం మనం చేసే సేవలో కనిపిస్తుంది._*

*_ఆనందమయ జీవితమంటే తాను ఆనందంగా ఉండటమే కాక ఆ ఆనందాన్ని ఇతరులకు కూడా పంచి ఇవ్వడం._*

*_అందువలన ఆనందాన్ని పొందేందుకు తిరిగి పంచేందుకు మనలను మనం సిద్ధం చేసుకోవాలి._*

*_అందుకున్న ఆనందాన్ని మనలో నిలుపుకుంటూ దానిని నలుగురికి పంచగలగాలి._*

*_దీనిని ప్రేమతోనూ, సేవాభావంతోనూ చేయాలి. ప్రతిఫలంగా ఏదీ ఆశించక భగవదర్పణ భావంతో మెలగాలి._*

*_స్వార్థభావంతో ఉంటే దుఃఖం ఏదో రూపేణా వెన్నాడుతూనే ఉంటుంది. ఈ దుఃఖానికి, అసంతృప్తికి ఏవో కారణాలని పేర్కొనవచ్చు._*

*_కానీ, మూలం స్వార్థ బీజమే అయి ఉంటుంది. మనలోని స్వార్థపుటాలోచనలకు స్వస్తి పలకాలంటే దానికి మార్గం నిస్వార్థ భక్తి, పవిత్రతలే అని గ్రహించాలి._*

*_‘నేను’ ‘నాది’ అనేవి నశించినప్పుడు ఇంక అప్పుడు ఎల్లలు ఉండవు.☝️_*

ఇంట్లో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలా.

*🙏🕉️ఇంట్లో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలా..?*

🌸సాధారణంగా చాలామంది అక్షంతలు ఇంట్లో అంతగా ఉపయోగించరు. ఎప్పుడైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు లేదా పెళ్లి సమయాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

🌿శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే.. అక్షంతలు శుభాన్ని సూచిస్తాయి కనుక వాటిని ఇంట్లో ఉంచుకుంటే.. అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు చేకూరుతాయని నమ్మకం.

🌸1. పూజలో ఉపయోగించిన అక్షంతలని ఒకచోట దాచుకుని ప్రయాణాలకి వెళ్లే వేళ ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లెటప్పుడు తలపై వేసుకుని బయల్దేరాలి.

🌿ఇలా చేస్తే మీరు తలపెట్టిన లేదా చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తిచేస్తారు. ఇంకా చెప్పాలంటే.. ఎవరైనా మనకి పాదాభివందనం చేస్తే.. వాళ్లని ఆశీర్వదించడానికి కూడా వాడొచ్చు.

🌸2. పూజామందిరంలో దైవాన్నే ఉంచి పూజించాలి తప్ప మన బంధువుల, తల్లిదండ్రులు..

🌿ఇలా ఎవరి చిత్రాలను ఉంచి పూజించకూడదని పురాణాలు చెబుతున్నాయి. పూజ గదిలో దైవాన్ని తప్ప వేరే ఎవ్వరని ఆరాధించరాదని చెప్తున్నారు.

🌸కనుక దైవారాధనకు మాత్రం ఓ ప్రశాంతమైన గదిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మీరు చేయాలనుకున్న పూజ కార్యలు సక్రమంగా జరుగుతాయి.

🌿3. తనంత తానుగా వెలసిన మూలవిరాట్టు పుంగవులచే ప్రతిష్టమైన, మూలవిరాట్టుండి, ప్రవహించే నది ఒడ్డున ఏ దేవాలయంలో కనిపిస్తుందో దానిని క్షేత్రమని అంటారు.

🌸అలా కానిది దేవాలయం. ఇక శిఖరం, ధ్వజస్తంభం అనేవి లేనిది మందిరం.

ఏకాదశ సరస్వతీ దేవాలయములు :

శ్రీ మాత్రే నమః 

శ్లో||
శరదిందు సమకారే ! పరబ్రహ్మ స్వరూపిని!!

వాసరా పీఠ నిలయే! సరస్వతీ నమోస్తుతే!!

ఏకాదశ సరస్వతీ దేవాలయములు  : 

1) శృంగేరి : సువర్ణ శారదాదేవి, 
శారదాపీఠము, కర్నాటక రాష్ట్రము.

2) సూరత్ : తెల్లని పాలరాతి విగ్రహము, గుజరాత్ రాష్ట్రము.

3) బికనీర్ : కోటలో ఎరుపురంగు కలిగిన పసుపు ఛాయతో వెలసిన అమ్మవారు, రాజస్థాన్.

4) పుష్కర్ : గాయత్రీ నామమున వెలసియున్నారు. బ్రహ్మసరోవర  తీరము,
11 కి.మీ. అజ్మీర్, రాజస్థాన్.

5) కుత్తునూర్: మైలాడుదురై, తిరువార్ బస్సు మార్గంలో అరసిలార్ నదిగట్టుపై నున్న ఆలయం, తంజావురు జిల్లా, తమిళనాడు.

6) పూందోట్టం : సరస్వతీ  అమ్మవారి చక్కని విగ్రహం, తమిళనాడు.

7) పిలానీ: అతి సుందర సున్నిత పాలరాతి కట్టడము, శారదాదేవి ఆలయము, రాజస్థాన్.

8) కాశ్మీర్ : ష్రౌఢ సరస్వతీ పీఠము -- అష్టాదశ పీఠములలో ఒకటి.

9) బాసర : ఆదిలాబాద్ జిల్లాలో బాసర క్షేత్రము కలదు. ఇది జ్ఞాన సరస్వతీ దేవాలయము.

10) శనిగరం: కరీమ్ నగర్ జిల్లాలో - హైదరాబాద్ నుండి కరీమ్ నగర్ 
వచ్చుదారిలో  ఈ గ్రామంలో సరస్వతీ దేవాలయం కలదు.

11) కాలేశ్వరము : కరీమ్ నగరకు 130 కి.మీ. దూరంలో కాళేశ్వరంలో  మహా సరస్వతీ దేవాలయము కలదు.

పంచభూతాలు మన అరచేతిలోనే ఉన్నాయా!

🎻🌹🙏పంచభూతాలు మన అరచేతిలోనే ఉన్నాయా!

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸మీరు ఎప్పుడైనా పండితులు, పురోహితులు ఆరాధన చేస్తుండగా చూసారా. వివిధ ఆలయాల్లో అర్చకులు దేముడికి హారతి ఇచ్చేటప్పుడు, నైవేధ్యం పెట్టేతాప్పుడు గమనించారా. 

🌿ఆ సమయంలో వాళ్ళు అరచేతిని తిప్పుతూ వేళ్ళతో కొన్ని ముద్రలు పెడుతూ ఉంటారు. అలాగే భరతనాట్యం, కూచిపూడి మొదలైన నాట్యాలలో కూడా చేతి ముద్రలకి ఎంతో విశిష్ఠ స్థానం ఉంది.

🌸యోగా చేసేటప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది చేతులతో వివిధ రకాలైన ముద్రలు వెయ్యటం మనం చూస్తూ ఉంటాం.

🌿మన పురాతనమైనసాంప్రదాయాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకు ఎంతో సులువుగా అర్ధమయ్యేది ఏంటో తెలుసా? మన చేతి వేళ్ళల్లోనే పంచభూతాలు నిక్షిప్తమై ఉన్నాయి అని. మనకే తెలియని శక్తి మన చేతి వేళ్ళలో దాగి ఉంది. 

🌸బొటను వేలిలో అగ్ని, చూపుడు వేలిలో గాలి, మధ్య వేలిలో ఆకాశం, ఉంగరం వేలిలో భూమి, చిటికిన వేలిలో నీరు ఉంటాయట. మన చేతిలో ఉన్న శక్తి మనకి తెలియట్లేదు.

🌿 చేతి వేళ్ళలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తుంది. అలాగే మేడగు నుంచి నరాల ద్వారా వేళ్ళల్లోకి ప్రసరిస్తుంది. అందుకే ఆశీర్వచనానికి కూడా మనం పెద్ద పీట వేశాం.

🌸 పెద్దవాళ్ళు పిల్లల్ని ఆశీర్వదించటం ద్వారా వారి చేతిలో ఉన్న శక్తి కలిపిన అక్షింతలకు అంటి మన తల మీద పడేసరికి మనకి ఏదో తెలియని బలం వచ్చినట్టు అనిపిస్తుంది.

🌿అలా పంచభూతాలు మన అరచేతిలోనే ఉండటం వల్ల మనం వేసే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క శక్తి ఆవహించి ఉండి దాని పని అది చేసుకుని పోతుంది. చేతితో అన్నం తినటం కూడా మన పెద్దవాళ్ళు మంచిదని ఊరికే చెప్పలేదు.

🌸 అన్నాన్ని ముందుగా నీటితో శుద్ధి చేసుకుని చేత్తో తినటం వల్ల చేతిలో ఉన్న శక్తి తరంగాలు అన్నం జీర్ణం అయ్యేలా చేస్తాయి. మనం తినే అన్నంలో ఏవైనా దోషాలు ఉన్నా అవి తగ్గుతాయి కూడా. 

🌿మన శక్తి మనకి తెలియక పాశ్చాత్య ధోరణులకి ఆకర్షించబడి మనం స్పూన్స్ తో తినటం అలవాటుచేసుకుంటున్నాం. 
అందుకే తినే పదార్థాలు శుద్ధి కాక మనకి ఇన్ని అనారోగ్యాలు

🌸అంతేకాదు మన చేతి వేళ్ళల్లో ఇలా శక్తి తరంగాలు, పంచభూతాలు నిక్షిప్తమై ఉండటం వల్ల మనం చేతితో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం కూడా మనపై ఎంతో ఉంటుంది.

🌿 జపం చేసేవాళ్ళు మానసిక ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తులసి పూసలు చేత్తో తిప్పుతూ జపం చేస్తారు. అలాగే మనం నిశితంగా పరిశీలిస్తే చేత్తో ఎక్కువసేపు పెన్ను పట్టుకుంటే కాసేపయ్యేసరికి పేపర్ కనిపిస్తే ఏదో ఒకటి రాయాలని లేదా ముగ్గులు వెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. 

🌸అలాగే కర్ర కాసేపు పట్టుకుని ఉంటే దానితో దేనినైనా కొట్టాలని అనిపిస్తుంది. అలాగే కత్తి చేత్తో పుచ్చుకుంటే కాసేపయ్యేసరికి దేని మీదైనా విసిరి అది విరిగేలా చెయ్యాలనిపిస్తుంది లేదా దేనినైనా పొడవాలనిపించి ఆఖరికి కూరగాయలని అటు ఇటు గాట్లు పెడతాం. 

🌿ఇలా మనం చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజ గుణాన్ని మన చేతులు గ్రహించి వాటితో చేసే పనులు మనం స్వయంగా చేసేలా చేస్తాయి.

🌸ఆఖరికి మన జీవితం ఎలా ఉంటుందో కూడా మన అరచేతిలోనే ఉంటుంది. అందుకే హస్తసాముద్రికంలో మన చేతిలోని రేఖలని చూసి మన జాతకం చెపుతారు. 

🌿ఇంకా మనకి తెలియని ఎన్నో విద్యలలో కూడా చేతి వేళ్ళను ఉపయోగించి చికిత్స చేసే విధానం కూడా ఉంది. అంత శక్తి ఉన్న చేతులు మనకి ఉన్నాయని గుర్తించకపోవటం మన తప్పే. 

🌸ఇలా పంచాభూతలనే మన చేతిలో పెట్టిన దేముడికి ఎన్నిసార్లయినా చేతులెత్తి మొక్కచ్చు..స్వస్తీ....🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Wednesday, December 25, 2024

చక్కెర తీపీ చేదూ*

*చక్కెర తీపీ చేదూ* 

తీపి పదార్థాలంటే ఎవరికి ఇష్టముండదు? పరిణామక్రమంలో భాగంగానే మనకు వీటిని తినటం అలవాటైంది. ఆదిమ మానవుల దగ్గరి నుంచి ఆధునిక మానవుల వరకూ అంతా తీపికి దాసులే. దీనికి కారణం వీటిల్లోని చక్కెర. శరీరానికి అవసరమైన శక్తిని అందించటమే కాకుండా ఆనందాన్నీ ఇవ్వటం దీని ప్రత్యేకత. ఇది ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందే. చక్కెర అతిగా తింటే అధిక బరువు, ఊబకాయం, మధుమేహం వంటి జబ్బుల ముప్పు పెరుగుతుంది. అలాగని అతి తక్కువగా తింటే మెదడు, మనసుకు సంబంధించిన రకరకాల సమస్యలు తలెత్తొచ్చు. ఇంత చిత్రమైన చక్కెర కథేంటో? అది మెదడు మీద ఎలాంటి ప్రభావాలు చూపుతుందో? తెలుసుకుందాం.

చక్కెరకూ మనదేశానికీ అనాదిగా విడదీయరాని సంబంధముంది. దీని మీద మనకు గల ‘ప్రేమ’ అంతా ఇంతా కాదు. ఆ మాటకొస్తే- చెరకు రసాన్ని తొలిసారిగా పంచదార పలుకులుగా మార్చింది మనమే. అదీ 3,000 ఏళ్ల క్రితం. ప్రాచీన ఆయుర్వేద శాస్త్రాచార్యులైన శుశ్రుతుడు మొట్టమొదటిసారిగా మధుమేహంలో మూత్రం తీయగా ఉంటుందని వర్ణించారు. అధికబరువు గలవారిలో, ఎక్కువగా తినేవారిలో ఈ గుణం సాధారణమని క్రీస్తుపూర్వమే వివరించారు. అధర్వణ వేదం కూడా చక్కెరను కోరికతో ముడిపడిన దినుసుగా పేర్కొంది. మన ఆచారాల్లోనూ పంచదార తొలిస్థానంలో నిలుస్తుంది. ఇంటికి కొత్తవాళ్లు వచ్చినా, పాత మిత్రులు, బంధువులు వచ్చినా నోరు తీపి చేయకుండా ఉండలేం. ఇప్పుడంటే మిఠాయిలు ఇస్తున్నాం గానీ ఒకప్పుడు ముందుగా గుప్పెడు పంచదార నోట్లో పోసేవారు. స్వాగతం పలికినా, శుభాకాంక్షలు తెలిపినా, ఆశీర్వదించినా అన్నీ తీపితోనే. పిల్లాడు పరీక్షలకు వెళ్తున్నా, అమ్మాయి ఇంటర్వ్యూకు బయలుదేరుతున్నా తల్లులంతా చేసే మొదటి పని నోరు తీపి చేయటమే. ఇది మెదడు చురుకుగా పనిచేసేలా చేయటమే దీనికి కారణం కావొచ్చు. ఉప్పు దుష్ప్రభావాల గురించి తరచూ మాట్లాడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు. కానీ చక్కెర తెచ్చిపెట్టే అనర్థాలను పెద్దగా పట్టించుకోరు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే- చక్కెర తినటమనేది సంపదకు చిహ్నంగా భావించటం. ప్రేమ చూపటమంటే పిల్లలకు తీపి పదార్థాలు ఇవ్వటంగానూ భావిస్తుండటం. కానీ మన శరీరం కొద్ది మోతాదుల్లోనే చక్కెరను అనుమతిస్తుంది. 

 *తక్కువైతే ఏమవుతుంది?* 

చక్కెర తీపీ చేదూ
మన శరీరంలోని అన్ని కణాలకు అవసరమైన శక్తిని అందించేంది గ్లూకోజే. ఇదీ ఒకరకం చక్కెరే. మెదడులో కోట్లాది నాడీ కణాలుంటాయి. అందుకే దీనికి ఇంకాస్త ఎక్కువ శక్తి అవసరం. నిజానికి మన శరీరంలోని మొత్తం గ్లూకోజులో సగం వరకూ మెదడే ఉపయోగించుకుంటుంది. ఆలోచనలు, జ్ఞాపకశక్తి, నేర్చుకోవటం వంటి పనులకు ఇది చక్కెర మీద ఆధారపడుతుంది. అందువల్ల ఇది (గ్లూకోజు) తగ్గితే నాడుల మధ్య సమాచారాన్ని చేరవేసే రసాయనాలు (న్యూరోట్రాన్స్‌మిటర్స్‌) ఉత్పత్తి కావు. నాడుల మధ్య సమాచార వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది, విషయగ్రహణ సామర్థ్యం మందగిస్తుంది. డొపమిన్‌ హార్మోన్‌ తగ్గటం వల్ల పార్కిన్సన్స్‌ జబ్బుకు దారితీస్తుంది. అసిటీల్‌కొలీన్‌ తగ్గటంతో అల్జీమర్స్, మయస్థీనియా గ్రేవిస్‌ జబ్బుల ముప్పు పెరుగుతుంది. గ్లుటమేట్, గాబా తగ్గటం వల్ల మూర్ఛ రావొచ్చు. సెరటోనిన్‌ తగ్గితే తీవ్ర కుంగుబాటు తలెత్తొచ్చు.
 వదలని రుచి
తీపి పదార్థాలను వదిలిపెట్టటం మహా కష్టం. మత్తు పదార్థాల మాదిరిగానే చక్కెర కూడా మెదడులోని నాడీ మార్గాలను ఉత్తేజితం చేస్తుంది. చక్కెరను తిన్నప్పుడు మత్తు గ్రాహకాలు ప్రేరేపితమవుతాయి. ఇవి హాయి భావనను కలిగించే డొపమిన్‌ హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్‌ మోతాదు తగ్గగానే మళ్లీ తీపిని తినేలా పురికొల్పుతాయి. దీంతో మరింత ఎక్కువగా తినాలనే కోరిక కలుగుతుంది. ఇది వదల్లేని స్థితికీ చేరొచ్చు. ఎందుకంటే వ్యసనంతో ముడిపడిన మెదడులోని భాగాలనూ చక్కెర ప్రేరేపిస్తుంది. కొకైన్‌ను తీసుకున్నప్పుడు మెదడులో ఉత్తేజితమయ్యే భాగాలే చక్కెర తిన్నప్పుడూ ప్రేరేపితమవుతున్నట్టు ఫంక్షనల్‌ ఎంఆర్‌ఐ స్కాన్‌ అధ్యయనాల్లో బయటపడింది. 

 *వాడకంలో మనమే ముందు* 
గత శతాబ్దం నుంచీ ప్రపంచవ్యాప్తంగా పంచదార వినియోగం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో రెండో స్థానం మనదే. వినియోగంలోనైతే మొదటిస్థానంలో ఉంటున్నాం. కాకపోతే సగటు వాడకంలో అమెరికాదే పైచేయి. సగటున రోజుకు 24-36 గ్రాముల చక్కెర తీసుకోవచ్చన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు. అమెరికాలో సగటున 126.4 గ్రాములు తీసుకుంటుండగా.. ఉగాండాలో అతి తక్కువగా 2 గ్రాములే తింటారు. మనదేశంలో సగటుకన్నా తక్కువగా రోజుకు 20.5 గ్రాములు తీసుకుంటారు. మనదేశం మధుమేహ రాజధానిగా మారింది. సుమారు 11% మంది మధుమేహంతో బాధపడుతుండగా.. మరో 15% మంది ముందస్తు మధుమేహం (ప్రిడయాబిటిస్‌) గలవారే. ఇందుకు జీవనశైలి, ఆహార మార్పులే ప్రధానంగా దోహదం చేస్తున్నట్టు ఐసీఎంఆర్‌-ఇండియాబ్‌ అధ్యయనం పేర్కొంటోంది. మధుమేహం గలవారిలో పట్టణాల్లో 16% మందికి, పల్లెల్లో 9% మందికి ఇవే ముప్పు కారకాలుగా పరిణమిస్తున్నట్టు వెల్లడించింది. మదుమేహం మూలంగా పక్షవాతం, గుండెజబ్బు, అధిక రక్తపోటు జబ్బులెన్నో ముంచుకొస్తుండటం ఆందోళనకరం. 

 *ఎక్కువైతే ప్రమాదమే* 
చక్కెర మరీ ఎక్కువగా తింటే మెదడులో అనుసంధాన వ్యవస్థ క్షీణిస్తుంది. నాడీకణాలను అదుపులో పెట్టే రసాయనాలు అస్తవ్యస్తం కావటం వల్ల ప్రవర్తన, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం సన్నగిల్లుతాయి. జ్ఞాపకశక్తికి కీలక కేంద్రమైన హిప్పోక్యాంపస్‌ కూడా అస్తవ్యస్తమవుతుంది. దీంతో మతిమరుపు తలెత్తుతుంది. మెదడు పరిమాణమూ కుంచించుకుపోవచ్చు. సూక్ష్మ రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడొచ్చు. మెదడులో రక్త ప్రసరణ తగ్గుతుంది. విషయగ్రహణ సమస్యలు, మెదడుకు త్వరగా వృద్ధాప్యం రావటం, కుంగుబాటు, ఆందోళన, మెదడులో వాపు తలెత్తుతాయి. మెదడు ప్రొటీన్‌ (బ్రెయిన్‌ డిరైవ్డ్‌న్యూట్రోఫిక్‌ ఫ్యాక్టర్‌) తగ్గుతుంది. నాడీ కణాల వృద్ధి, మనుగడకు తోడ్పడే దీని మోతాదులు తగ్గితే మెదడు త్వరగా వృద్ధాప్యంలోకి జారుకుంటుంది. చక్కెర ఎక్కువైతే భయం, ఒత్తిడి, ఆందోళన ప్రతిచర్యలు సైతం ఎక్కువవుతాయి. టైప్‌-2 మధుమేహం గలవారికి అల్జీమర్స్‌ వచ్చే అవకాశం ఎక్కువ. దీన్ని టైప్‌-3 మధుమేహమనీ అనటం గమనార్హం.

మితం మీద దృష్టి
శతాబ్దాలు, దశాబ్దాలుగా చక్కెర మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చేసింది. ఈ ధోరణిని మళ్లించటానికి కఠినమైన నియమాలు అవసరం. ప్రస్తుతం తీపి, శక్తి కలిగించే పదార్థాలు ఎక్కడంటే అక్కడ అందుబాటులో ఉంటున్నాయి. ఆదిమ మానవుల మాదిరిగా ఎక్కడికో వెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బిస్కట్లు, చాక్లెట్లు, కేక్‌లు, మిఠాయిలు, కూల్‌డ్రింకుల రూపంలో అన్నిచోట్లా దొరుకుతోంది. దురదృష్టవశాత్తూ ఇప్పటికీ మన మెదళ్లు మన పూర్వీకుల మెదళ్ల మాదిరిగానే పనిచేస్తున్నాయి. దీంతో అవసరం లేకపోయినా ఎక్కువెక్కుగా తీసుకుంటూ వస్తున్నాం. చక్కెర విషయంలో పరిమితి పాటించటం మనందరి కర్తవ్యం. జంక్‌ఫుడ్‌ లేబుళ్ల మీద హెచ్చరికలు ముద్రించటం, ప్రకటనలను నిషేధించటం వంటి చర్యలతో చిలీ, ఇజ్రాయెల్, సింగపూర్‌ దేశాలు మంచి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. అక్కడ చక్కెర వినియోగం 18 నెలల్లోనే 25% వరకూ తగ్గటం గమనార్హం.

Tuesday, December 24, 2024

పురుషోత్తమ ప్రాప్తియోగము*(పదునైదవ అధ్యాయము

3️⃣9️⃣6️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

*15. పురుషోత్తమ ప్రాప్తియోగము*
(పదునైదవ అధ్యాయము)
_________________________

*11. యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్l* *యతన్తోఽప్యకృతాత్మానోనైనం పశ్యన్త్యచేతసఃll*

చాలా మంది ఆత్మసాక్షాత్కారం కొరకు ప్రయత్నిస్తుంటారు. వేదములు, శాస్త్రములు చదివి జ్ఞానం సంపాదిస్తారు. యోగులు అవుతారు. కాని కొంత మందికి మాత్రమే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. చాలా మందికి కలుగదు. దానికి కారణం చిత్తశుద్ధి లేకపోవడమే. వారిలో ఉన్న అహంకారము నశించకపోవడమే.

కొంతమంది యోగులు జ్ఞానమును సంపాదించి, జ్ఞాన నేత్రముతో ఆత్మను చూడగలుగుతున్నారు. వారిలో కొంత మందికి జ్ఞానం ఉంటుంది కానీ వివేకం కలగదు. అటువంటి వారి మనస్సు నిశ్చలంగా ఉండదు. చంచలంగా ఉంటుంది. ఎందుకంటే వారికి వేషభాషల మీద ఉన్న శ్రద్ధ ఆత్మజ్ఞానము మీద ఉండదు. కేవలం సన్యాసుల మాదిరి వేషం వేసుకుంటారు. ధ్యానము, పూజలు చేస్తుంటారు కాని వారి చిత్తము మలినంగా ఉంటుంది. అటువంటి వారికి అత్మసాక్షాత్కారం కలగడం కష్టం. ప్రతి వాడూ ఆత్మసాక్షాత్కారం కొరకు ప్రయత్నించేవారే. కానీ వారిలో కొంత మంది మాత్రమే జ్ఞానము సంపాదించి, ఆత్మసాక్షాత్కారం పొందుతారు. వారిలో కూడా కొంత మందికి మాత్రమే చిత్తము నిశ్చలంగా ఉంటుంది. వారు మాత్రమే ఆత్మసాక్షాత్కారం పొందగలరు. మలినమైన చిత్తము కలవారు. సంస్కారము లేని వారు, అందుకు అనర్హులు. వారికి పాండిత్యము ఉంటుంది కాని చిత్తము మలినంగా ఉంటుంది. కాబట్టి ఆత్మసాక్షాత్కారము కావాలంటే అందుకు తగిన ప్రయత్నం ఉండాలి. చిత్తము శుద్ధంగా ఉండాలి. అచేతసులు అంటే చిత్తము పరిశుద్ధంగా లేనివారు, మూర్ఖంగా ఆలోచించేవారు. ఆత్మసాక్షాత్కారం పొందలేరు. ఎందుకంటే వీరు ఎన్ని ప్రయత్నములు చేసినా వీరి ప్రయత్నములు వక్రమార్గంలో నడుస్తాయి. చిత్తశుద్ధి ఉండదు. ఆ కారణంగా వీరికి అత్మసాక్షాత్కారం కలుగదు. అటువంటి వారికి గురువు గారి మార్గదర్శకత్వము అవసరము.

ఇప్పటి వరకు కృష్ణుడు అర్జునుడికి అత్మ, పరమాత్మ తత్వములను గురించి ఉపదేశించాడు. పరమాత్మ యొక్క అంశయే అంటే ప్రతిబింబమే ఆత్మ అనీ, అది మనోబుద్ధి అహంకారాలతో చేరి జీవాత్మగా రూపొంచి బాహ్యప్రపంచంలో తిరుగుతూ ఉంటుందనీ, ఆ ఆత్మను, పరమాత్మను తెలుసుకోవడానికి జ్ఞాననేత్రము కావాలనీ తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ పరమాత్మయే ప్రకృతి రూపంలో బాహ్యంగా ప్రకటితము అవుతున్నాడు. అంటే ఈ దేహంలో జీవుడుగా ఉన్నది ఆ పరమాత్మస్వరూపమే, బయట ప్రకృతిగా ఉన్నదీ ఆ పరమాత్మ స్వరూపమే. అంటే పరమాత్మ సర్వవ్యాపి. ఇక్కడ జీవుడు అంటే మనలో ఉండే చైతన్యము, బయట ఉన్న అఖండ చైతన్యమే శరీరంలో పరిమిత చైతన్యంగా ఉంది. ఈ విషయాన్నే పోతన గారు ప్రహ్లాదుడి నోటి వెంట పలికించాడు. "ఇందుకలడు అందు లేడు అని సందేహము వలదు. చకి సర్వోపగతుండు." అంటే ఆ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహమే అక్కరలేదు. పరమాత్మ నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. అందుకే కళ్లు మూసుకొని నీలో ఉన్న పరమాత్మ యొక్క ప్రతిబింబ స్వరూపము అయిన ఆత్మను చూడు. కళ్లు తెరిచి బయట ఉన్న ప్రకృతి అంతటా నిండి ఉన్న పరమాత్మను చూడు.

*12. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్l*
 *యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ది మామకమ్ll*

ఏ తేజస్సుతో అయితే సూర్యుడు ఈ సమస్తజగత్తును ప్రకాశింపజేస్తున్నాడో, ఆ సూర్యుని కాంతి పడిన చంద్రుడు ఏ విధంగా అయితే రాత్రిపూట ప్రకాశిస్తున్నాడో, అగ్ని ఏ తేజస్సు, వెలుగు, వేడి కలిగిఉన్నదో, అదిఅంతా నేనే.

ఈ శ్లోకంలో కృష్ణుడు సూర్యచంద్రుల, అగ్ని యొక్క విభూతుల గురించి చెబుతున్నాడు. ఇక్కడ మనకు తేజస్సును ఇచ్చే మూడు మూల పదార్థాలు ఉన్నాయి. మొదటిది సూర్యుడు. ఆయనకు స్వయంప్రకాశకుడు. తనకు తానుగా ప్రకాశిస్తుంటాడు. చంద్రుడికి స్వయం ప్రకాశము లేదు. సూర్యుడి వెలుగు పడితేనే ప్రకాశిస్తాడు. అగ్ని ఏదో ఒక చర్య వలన మాత్రమే వెలుగుతుంది. అంటే రెండు వస్తువుల రాపిడి వలన అగ్ని పుడుతుంది కానీ తనకు తానుగా అగ్ని పుట్టదు. అందుకే మనకు ప్రకాశమును ఇచ్చే విభిన్నమైన మూడు మూల పదార్థాలను ఉపమానాలుగా తీసుకున్నాడు కృష్ణుడు.

సూర్యుడు, సూర్యుని వలన చంద్రుడు ప్రకాశిస్తున్నారు. భూమి మీద ఉన్న అన్ని వస్తువులను ప్రకాశింపజేస్తున్నారు. ఈ సూర్యుని తేజస్సు "అఖిలమ్" అంటే ఖిలము కానిది. కోట్ల సంవత్సరాల వరకు తరిగిపోనిది, నిరంతరం ప్రకాశిస్తూ మనకు వేడిని వెలుతురును అందిస్తూ ఉంటుంది. నూర్యుడి తేజస్సు ఉన్నంత వరకు చంద్రుడు కూడా ప్రకాశిస్తూ మనకు వెలుగును ఇస్తుంటాడు. అందుకే ఆచంద్రార్కం అంటే సూర్యుడు, చంద్రుడు ఉన్నంతవరకు అని అర్థం. సూర్యచంద్రుల వెలుగు పడితేనే గానీ ఏ వస్తువు మనకు కనపడదు. ఇది అందరికీ తెలుసు. అలాగే అగ్ని కూడా మండుతూ తన కాంతులను విరజిమ్ముతుంది. సూర్యుడు, చంద్రుడు లేని వేళల్లో మనం అగ్ని సాయంతోనే అగ్ని యొక్క వెలుగులోనే వస్తువులను చూడగలుగుతున్నాము. కాబట్టి ఈ లోకానికి పగలు సూర్యుడు, రాత్రిళ్లు చంద్రుడు, అన్నివేళల్లో అగ్ని ప్రకాశాన్ని ఇస్తుంటారు. ఈ సూర్య చంద్రులకు, అగ్నికి వెలుగును ఇచ్చి ప్రకాశింపజేసేది నేనే అని తెలుసుకో అంటున్నాడు. పరమాత్మ తరువాతి శ్లోకాలలో ఈ సూర్య తేజస్సు, చంద్రుని తేజస్సు, అగ్ని శక్తి ఈ ప్రకృతిలో ఏమేమి పనులు చేస్తున్నాయో, మనకు ఎలా ఉపయోగపడుతున్నాయో వివరంగా తెలియజేసాడు పరమాత్మ.
(సశేషం)

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P793

సప్త జ్ఞాన భూమికలు

*సత్సంగం!!!* 

  *🕉️సప్త జ్ఞాన భూమికలు🕉️*
                 
మానవాళిలో రెండు రకాలవారున్నారు: ``` 
*1.జ్ఞానులు,* 
*2. అజ్ఞానులు.*
```
జ్ఞానంలో ఏడు స్థితులు ఉన్నాయి. వీటినే``` *“సప్తజ్ఞాన భూమికలు”*``` అంటాం.``` 
*1.శుభేచ్ఛ,* 
*2, విచారణ,* 
*3. తనుమానసం,* 
*4.సత్త్వాపత్తి,* 
*5. అసంసక్తి,* 
*6. పదార్థ భావని,* 
*7. తురీయం 
అన్నవే *“సప్తజ్ఞాన భూమికలు”*

*1.”శుభేచ్ఛ”:*```
“నాకు బ్రహ్మజ్ఞానం కావాలి” అన్న ఇచ్ఛ; “నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి” అన్న తీవ్ర ఆకాంక్ష.
```
*2. “విచారణ”:*```
 “బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి” అన్న మీమాంస; ‘బ్రహ్మజ్ఞాన ప్రాప్తి విధానం -ధ్యానం, స్వాధ్యాయం, సజ్జనసాంగత్యం’ అని తెలుసుకోవడం.”```

*3. “తనుమానసం”:*```
ఇంక విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక, “తత్” సాధనలో నిమగ్నులై ఉండడమే “తనుమానసం”. అంటే “తత్” సాధనలో నిమగ్నులై ఉండడమే! అంటే ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడం. అదే తనుమానసం.```

*4. “సత్త్వాపత్తి”:*```
శుద్ధసాత్వికం సాధించడమే ‘సత్త్వాపత్తి.’ అంటే ఇప్పుడు తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి.

ఇక మిగిలింది శుద్ధ సాత్వికమే. 

“తమోగుణం” అంటే “సోమరితనం” 
“రజోగుణం” అంటే “నాకు తెలుసు” అనే అధికారదర్పం. 
ఈ నాల్గవ జ్ఞానభూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్ర స్థాయినందుకునే స్థితి; ఆ తీవ్రత ద్వారా నాడీ మండలం పూర్తిగా శుద్ధమైన స్థితి; మనస్సు పూర్తిగా కంట్రోలు అయిన స్థితి; అదే “యోగి” అయిన స్థితి.

“అహం బ్రహ్మాస్మి” అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. 
”బ్రహ్మవిదుడు” అయిన స్థితి.```

*5. “అసంసక్తి”:*```
దివ్యచక్షువు ఉత్తేజితమవుతూన్న స్థితి. “తనువు మరి సంసారం రెండూ తాత్కాలికమైనవే” అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక, ఈ రెండింటి మీదా పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి; అదే “అసంసక్తి” దీన్నే “పద్మపత్రమివాంభసా” అన్నాడు కృష్ణుడు గీతలో.

అయితే ఇతనికి సంసారంలో అసంసక్తి ఉన్నా ధర్మనిష్టుడు మరి కర్మనిష్టుడు; తనువు పట్లా మరి సంసారం పట్లా తటస్థ దృష్టి కలిగి వున్నవాడు. దివ్యచక్షువు ఉత్తేజితమైంది కనుక, “సత్యద్రష్ట” కాబోతున్నాడు. కనుక, పూర్తిగా దాని మీదే ఆసక్తినీ, ఏకాగ్రతనూ నిలిపినవాడు. ఇదే ‘ఆసంసక్తి’. ఇతనినే “బ్రహ్మవిద్వరుడు” అంటాం.```

*6. ”పదార్థభావని”:* ```
అంటే దివ్యచక్షువును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్నవాడు. ప్రతి ‘పదం’ యొక్క ‘అర్థం’ లో ప్రతి ‘వస్తువు’ యొక్క ‘భావం’ లో ప్రత్యక్షంగా నివసిస్తున్న వాడు. అంటే “బ్రహ్మ విద్వరీయుడు” అయిన స్థితి. ఇదే “సిద్ధ స్థితి”; ఇదే “సవికల్ప సమాధి స్థితి” కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా “కొద్దిగా, సంశయాలు ఉన్న స్థితి.”```

*7.“తురీయం”:*```
ఇది మానవుని యొక్క “పూర్ణ వికాస స్థితి” సిద్ధుడు ‘బుద్ధుడు’ అయిన స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధుళ్ళుగా, బుద్ధుళ్ళుగా మలచడానికి కంకణం కట్టుకుని తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై ఉన్నవాళ్ళనే “బుద్ధుళ్ళు” అంటాం. ఇదే ‘సహస్రదళ కమలం’; ఇదే ‘వేయి పడగల పాము’.

ఒక్కొక్క మనిషినీ యోగిగా మలచినప్పుడల్లా సహస్ర దళ కమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది. ఇతనినే``` 
*“బ్రహ్మవిద్వరిష్టుడు”* ```అంటాం.
``` *“తురీయం”*``` అంటే సర్వసామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు.``` *“తురీయ”*``` అంటే``` “మూడింటిని దాటిన” ```అని అర్థం. అంటే``` *“నిర్వికల్ప సమాధి స్థితి”* కి ```చేరుకున్న స్థితి.

 *“సమాధి”* ```అంటే “సమాధానాలు తెలుసుకున్న స్థితి”. నిర్వికల్ప సమాధి అంటే ” ఏ సందేహాలూ, ఏ సంశయాలూ లేని స్థితి.”

అప్పు ఇచ్చిపుచ్చుకునే నియమాలు

*అప్పు ఇచ్చిపుచ్చుకునే నియమాలు!!!*🌹 మంగళ, శుక్రవారాలలో ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వకూడదా....? కారణం ఏమిటి...?🌹🌿మంగళ వారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సంగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 🌸6కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు చేయకూడదు.🌿ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు . మంగళవారం అప్పు తీసుకొన్నట్లైతే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది.🌸 కొందరు మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బు ఇవ్వరు, కొందరు బూజులు కూడా దులపరు, కొందరు పుట్టింటినుంచి ఆడపిల్లని పంపరు. ఆడపిల్లని ఇంటి లక్ష్మీ దేవిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ రెండు రోజులూ డబ్బులివ్వటంగానీ, అమ్మాయిని పంపటంగానీ చెయ్యరు.🌿తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో. మరి బూజులు దులపక పోవటానికి కూడా ఒక కధ చెప్తారు.🌸 శ్రీ కాళహస్తీశ్వరుని కధ అందరికీ తెలిసిందే కదా. శ్రీ అంటే సాలె పురుగు, పాము, ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదూ. శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్ధం వుంది. 🌿బూజులు, అంటే సాలె పురుగులు కట్టిన గూళ్ళు కదా వాటిని తీసి ఆ శ్రీలక్ష్మీకి ఎందుకా రోజుల్లో అపచారం చెయ్యాలని బూజులు దులపరు.🙏ఇవి పాటించవలసిన విషయాలేనా ? ఇందులో ఎంత వరకూ నిజం వుంది ?🌸 బూజుల సంగతి వదిలేద్దాం. ఎందుకంటే ఆ రెండు రోజులూ కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు. మరి డబ్బుల సంగతేమిటి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళ, శుక్రవారాలలో డబ్బులు ఇవ్వటం మంచిదా..? చెడ్డదా..?🌿సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ రెండు రోజైలైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము..అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. 🌸ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ, ఇతరుకి గానీ ఆపదసమయాల్లో ఈ నియమం పనికిరాదు. ఇలా చేయ్యటం వల్ల మరింత ధనం పోతుంది.🌿ఆ రోజుకి మళ్ళీ మళ్ళీ చేయించే గుణం వుందిట. అందుకే బ్యాక్ ఎక్కౌంటు తెరిచి డబ్బు దాచుకోదలిచారా ? మంగళవారం నాడు చెయ్యండి. ఆ ఎక్కౌంటు లో మళ్ళీ మళ్ళీ డబ్బు వేస్తూనే వుంటారు.🌸అలాగే ఎక్కువ అప్పు ఏమైనా వుండి కొద్ది కొద్దిగా తీరుద్దామనుకున్నారా? మంగళవారం నాడు తీర్చండి. తొందరలోనే మళ్ళీ మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతారు, త్వరలో ఋణ విముక్తులవుతారు.🌿ఫ్రాంతాలవారీగా కూడా ఈ నమ్మకాలు మారుతూ వుంటాయి. కొందరు మంగళ, శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాదు వైపు కొందరు బుధవారం నాడు, విశాఖ పట్టణం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు. అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు. అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పని చెయ్యవు. ఎవరి నమ్మకాలూ, ఆచారాలూ వారివి.....🌿ఏది ఏమైనా అప్పు ఎదో ఒక రూపంలో తొందరగా తీర్చుకోవడం ఉత్తమం.

Monday, December 23, 2024

కృష్ణ’ శబ్దం మనోహరం!!!*

*కృష్ణ’ శబ్దం మనోహరం!!!*
            
*సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరో రూపమే శ్రీకృష్ణ భగవానుడు. ద్వాపర యుగంలో పుట్టి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసిన కరుణామయుడు. కారుణ్యశీలుడు. ఆదర్శ పురుషుడు. ప్రేమతత్వాన్ని అనేక దృక్పథాలలో విపులీకరించిన ఆదర్శమూర్తి.*

*భగవద్గీత ద్వారా అనేక విధాలైన ఆధ్యాత్మిక మార్గాలను మనకు అందించిన దివ్య పురుషుడు. యుగ ధర్మాలను, సాంఘిక న్యాయాలను, అనంతమైన విశ్వతత్త్వాన్ని తెలియచెప్పిన మహనీయుడు. అలాంటి…. శ్రీకృష్ణ మంత్రం బాహ్యశత్రువులను, అంతఃశత్రువులను హరించే శక్తి కలది.*

*సకల వేదాంతాలందూ చెప్పబడిన పూజ్య మంత్రమిది. సమస్త సంసార చింతనలను, సర్వైశ్వర్యాలను ఇచ్చే దివ్య మంత్రమిది. శ్రీకృష్ణునకు భక్తి పూర్వకముగా ఒక్కసారి నమస్కరిస్తే పది అశ్వమేధ యాగాలు చేసి, అవభృధ స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.*

*శ్రీకృష్ణుని త్రికరణశుద్ధిగా భక్తిశ్రద్ధలతో నమస్కరించిన మాత్రానే జన్మరాహిత్యం కలుగుతుంది. ‘కృష్’అనగా ‘సత్తు’, ‘ణ’ అనగా ఆనందమని అర్థం. అంటే సదానందము లేక సచ్చిదానందమని అర్థం.*

*కలియుగాన ‘కృష్ణ కృష్ణ’ అనే మంత్రాన్ని ఎవరు అహోరాత్రులు స్మరిస్తారో అలాంటివారు సాక్షాత్తు శ్రీకృష్ణ రూపాన్ని పొందుతారని పురాణోక్తి. ఓంకారం మొదలు వేదాల వరకూ ‘కృష్ణ’ అనే రెండక్షరాలు సమస్త విఘ్నాలను హరించి మనోభిష్టాలను నెరవేరుస్తున్నాయి. అలాంటి శ్రీమహావిష్ణువు స్వరూపమయిన శ్రీకృష్ణ భగవానుడు కారణజన్ముడు.*

*మధురలో పుట్టి, గోకులంలో పెరిగి, నంద యశోద ప్రేమకు పాత్రుడైన వాడు. గోపీ మానస చోరుడు, అర్జున రథసారథి అయిన శ్రీకృష్ణ భగవానుడి ఆవిర్భావమే దుష్టశిక్షణ. కంసుని దురాగతాలను అంతమొందించడానికి, నిరాశ్రయులైన దీనులను ఉద్ధరించడానికి అవతరించినవాడు.*

*గోకులంలో పెరిగాడు కాబట్టి గోపాలకృష్ణుడయ్యాడు. యమునా నదీ తీరంలో కాళీయమర్థనం చేసిన మహనీయుడాయన. బాల్యంలోనే తన నోటిలో అండపిండ బ్రహ్మాండాలను చూపించిన దైవం. సాక్షాత్తు శ్రీహరి అంశ అయిన కృష్ణునికి లెక్కలేనన్ని పేర్లు... ఆ స్వామి ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. ఏమిచ్చి అర్చించినా ఆదుకుని అక్కున చేర్చుకుంటాడు.*

*రామ శబ్దానికి, కృష్ణ శబ్దానికి భేదం లేదు. ఈ రెండు అవతారాలు సాక్షాత్తు శ్రీహరి అవతారాలే కావడంవల్లే ఆ స్వాముల నామస్మరణ సాక్షాత్తు శ్రీహరి నామస్మరణంగా భావిస్తారు. అందుకే ‘హరేరామ హరేరామ హరే కృష్ణ హరేకృష్ణ’ అంటారు.*

*ఇంతటి మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని జపిస్తే సమస్త దోషాలూ సమూలంగా మటుమాయమై మానసిక ప్రశాంతత లభిస్తుంది.*

*నిష్కల్మషమైన మనస్సుతో కృష్ణుని పూజిస్తే, ఆ స్వామి కరుణించి కటాక్షిస్తాడు. కుచేలుడు, సుధాముడు లాంటి ఎందరో భక్తులను ఆదరించి, అక్కున చేర్చుకుని, ముక్తిని కల్గించిన అపురూప దైవం శ్రీకృష్ణ భగవానుడు.*

*కృష్ణ నామస్మరణమే పరమావధిగా ఎవరు స్మరిస్తారో, వారి మనస్సులలో శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉంటాడు. అనేక మంది యోగులు, సిద్ధులు యోగాభ్యాస సమయాన శ్రీకృష్ణుని సహస్రారమందు ధ్యానిస్తూ ప్రాణాయామం నిలిపి మోక్షాన్ని పొందారు.*

*వాయువును కపాలమునందున్న సహస్రార చక్రం వరకూ తీసుకొనిపోయే సహజశక్తి ‘కృష్ణ’ శబ్దానికి కలదు. కృష్ణ శబ్దము నోటితో ఉచ్చరించినపుడు ఆయా అక్షరాలకు స్థానాలగు దౌడ, కంఠం, వీనిలో పుట్టిన వాయువు, శబ్దమూలమున శిరస్సునగల సహస్రార చక్రం వరకూ సహజసిద్ధంగా చేరుకొంటుంది.*

*అపుడు ‘వాయువు’ను అంటి చలించే స్వభావంగల వనస్సును, యోగప్రక్రియచే వాయువుతో లయమొనర్చి, సహస్రారమునకు తీసుకునిపోయి నిలువ వచ్చు. ఇలాంటి సిద్ధ ప్రక్రియ. మహాత్ములైన యోగులకు మాత్రమే సాధ్యపడుతుంది.*

*ఈ విషయం సూక్ష్మాతి సూక్ష్మంగా మహాభారతంలో శ్రీకృష్ణ నామతత్వార్థ ప్రభావంగా చెప్పడం జరిగింది.*

Sunday, December 22, 2024

ఆకు కూరలు మరియు వాటిలోని ఔషధ గుణాలు

ఆకు కూరలు మరియు వాటిలోని ఔషధ గుణాలు  

        మనకి ప్రకృతి అనేక రకాలు అయిన ఆహారపదార్థాలని మనకి ప్రసాదించింది. వాటిని సంపూర్ణంగా వినియోగించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . 

         అపథ్యం అని తెలిసీ ఒక పదార్థం రుచిగా ఉంది అని తినకూడదు. ఏది తినవలనో , ఏది తినకూడదో బాగుగా పరీక్షించి పదార్థాలను భుజించవలెను . ఆహారం వలన పుట్టిన ఈ శరీరం ఆహార వైషమ్యం వలన నశిస్తుంది. కావున ప్రతిదినం మనం తీసుకునే ఆహారం వల్ల మన ఆరోగ్యం చెడిపోకుండా కొత్తగా ఏ రోగం రాకుండా చూసుకోవాలి. ఏ ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం రక్షించబడుతుందో ఆ ఆహారాన్ని మనం సర్వదా తీసుకుంటూ ఉండాలి అని చరక మహర్షి వివరించారు . 

            మనలో చాలామంది ఆకుకూరలు తింటారు కాని వాటి యొక్క ఉపయోగాలు చాలా మందికి తెలియదు . కొన్ని రకాల వ్యాధులకు గురి అయినపుడు అయా రకాల ఆకుకూరలు తీసుకోవడం వలన కూడ శరీరానికి పుష్కలంగా విటమిన్స్ లభించి రోగ నిరోధక శక్తి పెరిగి ఆ వ్యాధి నుంచి తేలికగా బయటపడొచ్చు.  

        కొన్ని ముఖ్యమైన ఆకుకూరల గురించి మీకు ఇప్పుడు తెలియచేస్తాను . 

  అవిసె ఆకు కూర - 

 * ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఎరుపు మరియు తెలుపు దీని పువ్వులనుబట్టి చెప్పవచ్చు. 

 * ఏకాదశి ఉపవాసం మొదలయిన ఉపవాసాల్లో ఉన్నవారు ఈ ఆకుకూరని తప్పకుండా ఉపయోగిస్తారు . ఉపవాసం వల్ల వచ్చిన నీరసాన్ని ఇది చాలా బాగా తగ్గిస్తుంది.

 * దీని ఆకులు నూరి చర్మం మీద పట్టుగా ఉపయోగిస్తారు . గాయాలకు , దెబ్బలకు మంచి మందు.

 * జలుబు , రొంప ఉన్నప్పుడు అవిసె ఆకుల రసాన్ని కొన్ని చుక్కలు ముక్కులో వేసుకుంటే రొంప, తలనొప్పి తగ్గును. లొపల నుంచి జలుబు నీరు రూపంలో కారిపోయి తలనొప్పి, బరువు తగ్గును.చిన్నపిల్లలకు ఈ ఆకురసంలో తేనె కలిపి వాడవలెను . 

 * పురిటిబిడ్డలలో పడిసెం ఎక్కువుగా ఉంటే రెండు చుక్కల అవిసె రసంలో 10 చుక్కల తేనె వేసి రంగరించి పాతకాలం లో వైద్యులు ఆ బిడ్డ ముక్కులలో వేలితో పైపైన రాస్తారు . 

 * ఈ అవిసె ఆకులు రుచికి కారంగా , కొంచం చేదుగా ఉంటాయి. కడుపులోని నులిపురుగుల్ని హరించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది . ఈ మధ్య మార్కెట్లో అవిసె కారం దొరుకుతుంది దానిని పిల్లలు మరియు పెద్దలు విరివిగా వాడుకొనవలెను . 

 * సాలీడు , పులికోచ మున్నగు జంతువుల విషాన్ని కూడా ఈ ఆకురసం విరిచేస్తుంది.

 * అవిసె ఆకుల రసం టాన్సిల్స్ కి పూస్తే అవి కరిగిపోతాయి.

 * రేజీకటి రోగం కలవారు అవిసె ఆకులకూర వాడటం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.అవిసె ఆకులు దంచి ముఖ్యంగా రోట్లో కర్ర రోకలి వాడవలెను . ఆ దంచిన పిప్పిని కుండలో వేసి ఉడకపెట్టి రసం తీసి ఆ రసాన్ని 10ml లొపలికి తీసుకోవడం వలన రేజీకటి పుర్తిగా దూరం అగును.

 * నాలుగు రోజులకు వచ్చే జ్వరానికి దీని ఆకురసం అయిదారు చుక్కలు ముక్కులలో వేసుకొని లొపలికి పీలిస్తే మంచి ప్రభావం కనిపించును.

 * అవిసె ఆకు , మిరియాలు కలిపి నూరి రసం పిండి ఆ రసాన్ని ముక్కులలో వేస్తే అపస్మారంలో ఉన్న వ్యక్తి కోలుకుంటాడు.  

 * చిన్నపిల్లలో వచ్చే బాలపాప చిన్నెలకు ఇది అద్భుత ఔషదంగా పనిచేయును 

 * దీనిలో ఉన్న కారం మరియు చేదు ఉన్నను వండాక మధురంగా ఉండును.

 * ఇది క్రిమి రహితం అయ్యి శరీరంలో మలిన పదార్థాలు మరియు మల పదార్థాలు బయటకి పంపును. దీనిని మనకంటే తమిళ సోదరులు ఎక్కువ వాడతారు.

 కరివేపాకు - 

 * దీనిని రావణ , గిరి నింబిక , మహానింబ అని కూడా పిలుస్తారు .

 * ఈ చెట్టుకు ప్రతిరోజు బియ్యం కడిగిన నీరు పోస్తూ ఉంటే లేత కరివేపాకు చెట్లు ఏపుగా ఎదుగుతాయి.అదే విధంగా ముదురు చెట్లకు బియ్యం కడిగిన నీరు పోస్తే వాటి ఆకులు మంచి సువాసనలు వెదజల్లుతాయి .

 * ఈ కరివేపాకు మన ఆహారంలో భాగం చేసుకోవడం వలన శరీరంలో కఫం మరియు వాతాన్ని పోగొడుతుంది. 

 * అగ్నిదీప్తి ఇస్తుంది.

 * దీనిని ప్రతిరోజు తీసుకోవడం వలన గ్రహణి రోగం అనగా విపరీతమైన జిగురుతో కూడిన విరేచనాలు తగ్గించును . 

 * ఈ కరివేపాకు ముద్ద చేసి విష జంతువుల కాట్లకు మరియు దద్దుర్లకు ఉపయోగిస్తారు . 

 * కరివేపాకు చెట్టు ఆకుల కషాయం కలరా వ్యాదిని కూడా నివారించును.

 * కరివేపాకు , మినపప్పు, మిరపకాయలు కలిపి నేతిలో వేయించి రోటిలో నూరి దాంట్లో కొంచం ఉప్పు వేసి నిమ్మకాయ రసం పిండి తయారుచేసే కారానికి కరివేపాకు కారం అంటారు. ఈ పచ్చడి శరీరంలో పైత్యాన్ని తగ్గించి నోటి యెక్క అరుచిని పొగొట్టును.

   కామంచి ఆకు కూర - 

 * దీని ఆకులు నూరి ముద్దగా చేసి కట్టుకుంటే నొప్పులు తగ్గును. ఇదే ముద్దని చర్మంపైన రాసి నలుగు పెట్టుకుంటే చర్మసంబంధమైన సమస్యలు తగ్గుముఖం పట్టును . 

 * శరీరం ఉబ్బుతో కూడి యున్న వ్యక్తులకు ఈ ఆకుకూర అద్బుతంగా పనిచేయును . 

 * ఎలుక కాటు సమయంలో ఈ ఆకుల రసం పైన రాయవలెను . 

 * ఈ కామంచి ఆకుల రసాన్ని చెవిలో పిండుతూ ఉంటే చెవిపోటు తగ్గి చీముని కూడా హరించును . 

 * ఔషదాలతో పాటు కుష్టు వ్యాధి కలవారు దీనికి కూడా వాడుకుంటే చాలా మంచి ఫలితాలు వేగంగా వస్తాయి.  

కొత్తిమీర - 

 * ధనియాల లేత మొక్కలని మనం కొత్తిమీర అంటాము . 

 * వీటియొక్క రుచి కారంగా మరియు వాసన సుగంధభరితంగా ఉండును. 

 * కొత్తిమీర గాఢ కషాయంలో పాలు మరియు పంచదార కలిపి ఇస్తే నెత్తురు పడే మూలశంఖ అనగా రక్తంతో కూడిన మొలల వ్యాధి , అజీర్ణ విరేచనాలు , జఠరాగ్ని తగ్గుట , కడుపులో గ్యాస్ సమస్య వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది . 

 * కొత్తిమీర శరీరంలో మూడు దోషాల పైన పనిచేస్తుంది . విదాహాన్ని అనగా దాహం ఎక్కువ అయ్యే సమస్యని పోగొడుతుంది . భ్రమ ని తగ్గిస్తుంది . కొత్తిమీర మంచి జీర్ణకారి.

 * కొత్తిమీర రసాన్ని చనుపాలతో కలిపి కళ్లలో వేస్తే నేత్రరోగాలు నయం అవుతాయి.లేదా కొత్తిమీర వెచ్చచేసి కళ్ళకి వేసి కట్టినా సమస్య తీరును .

 * కొత్తిమీర కషాయంలో పంచదార కలిపి పుచ్చుకుంటే బాగా ఆకలి పుట్టిస్తుంది.

 * ప్రాచీన కాలంలో కొన్ని తెగలవారు ప్రసవించే స్త్రీ దగ్గర ఈ కొత్తిమీర ఉంచితే వారు తొందరగా ప్రసవిస్తారు అని ఒక నమ్మకం ఉండేది. ప్రసవింవించిన వెంటనే అక్కడ నుంచి కొత్తిమీర తీసివేయవలెను.

 * నోరు పూసి ఉన్నప్పుడు కొత్తిమీర రసంతో పుక్కిలిస్తే అద్భుతంగా పనిచేయును . 

 * ఈ కూర వండుకుని తినటం మరియు దీనిని కూరల్లో వాడటం వలన మూత్రాన్ని బాగా జారీచేస్తుంది.

 * దీనిని తరచుగా తీసుకోవడం వలన మెదడులో వేడిని అణుచును.

 * దీని ఆకు అవునేయ్యితో వేయించి కొంచం కనురెప్పలు మూసుకొని కనులపై వేసి కట్టిన నేత్రసమస్యలు నివారణ అగును.

 కొత్తిమీర కారం తయారీ విధానం - 

     కొత్తిమీర ఆకులని , పచ్చిమిరపకాయలని 
తొక్కి తగినంత ఉప్పువేసి అందులో నిమ్మకాయ రసం చేర్చి చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. 

          దీనిని తీసుకోవడం వలన శరీరంలో పైత్యం తగ్గును.

 గమనిక - 

           గ్రహణి రోగం తో భాధపడేవారు ఈ కొత్తిమీరని ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు.

 గంగపాయల కూర - 

 * ఇది చూడటానికి ఎర్రని కాడలతో గలిజేరుని పోలి ఉంటుంది. నేలమీద పాకుతుంది. కాడలు , ఆకులు మందంగా ఉంటాయి. ఇది పసుపుపచ్చని పూలు పూస్తుంది.

 * దీని రుచి పుల్లగా ఉంటుంది. ఇది సులభంగా పెరుగును . 

 * ఇది పాలకంటే మరియు వెన్నకంటే మంచిది .

 * దీనిలో A ,B విటమినులు బాగా ఉన్నాయి .పాలకంటే , వెన్నకంటే కూడా జీవశక్తి అధికంగా ఉన్నది అని తమిళనాడు ప్రభుత్వ పరిశోధనలో తేలింది . అదేవిధంగా రోగనిరోధక శక్తి అధికంగా ఉండును అని కూడా పరిశోధనలో తెలిసింది.

 * ఈ కూరలో ఐరన్ , కాల్షియం ఎక్కువుగా ఉన్నాయి. A విటమిన్ ఎక్కువ , B ,C D విటమినులు కొద్దిగా ఉన్నాయి.

 * రక్తహీనత వ్యాధి కలవారు దీనిని తీసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు పొందగలరు.

 * శరీరంలో దుష్ట పదార్థాలను తొలిగించి బయటకి పంపడంలో దీనిని మించింది లేదు .

 * మన శరీర ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలి అంటే " క్షారశిల " అను మూల పదార్థం కావాలి ఈ పదార్థం గంగపాయల కూరతో దేహములోకి చేరును . ఎముకలు మరియు దంతాల పెరుగుదల కొరకు అది అత్యంత అవసరం.

* సంగ్రహణి , కుష్టు , మూత్రాశయం లో రాయి వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ కూరని ఆహారం లో బాగం చేసుకోవాలి .

 * వెంట్రుకలకు బలాన్ని ఇచ్చును.

 * రక్తం కక్కుకునే వ్యాధి వారికి మంచి ఔషధం గా పనిచేయును . 

        ఈ కూరని తప్పకుండా మన ఆహార పదార్థంలో బాగం చేసుకోవలెను . 

 గమనిక - 

            ఈ ఆకుకూరని పారేనీటిలో కడగడం ఉత్తమమైన పని. ఇది నేల మీద పాకును కావున ఇసుక , మట్టి ఎక్కువుగా ఉండును. కావున జాగ్రత్తగా శుభ్రపరుచుకోవాలి 

             దీనిని మరీ అతిగా తినరాదు. ఎందుకంటే ఇది చలువచెసే గుణం కలిగినది.కావున ఎక్కువ తిన్నచో శరీరంలో శ్లేష్మమును పెంచును. కండ్లకు మరియు మూత్రపిండముల పై , తలలో నరములపై కొంచం ప్రభావం చూపించును. కావున 10 రోజులకు ఒకసారి తిన్నచో చాలును.

 గుంటగలగర - 

 * దీనిని కేశరంజన , భృంగరాజ అని సంస్కృతంలో పిలుస్తారు . 

 * దీనిని పితృదేవతల అర్చనల్లో వాడుతారు.

 * తేమగల ప్రదేశాలలో ఉంటుంది. లంక నేలల్లో శీతాకాలంలో పెరుగును .

 * ఇది మూడు రకాలుగా ఉంటుంది. తెలుపు, పసుపు, నలుపు . నలుపు దొరకటం మహాకష్టం దీనిలో పసుపురంగు పువ్వులు పూసేది మంచి ప్రశస్తమైనది.

 * దీనియొక్క రుచి కారం,చేదు కలిసి ఉంటుంది. 

 * దీనిని లోపలికి తీసుకోవడం వలన శరీరం నందలి కఫం మరియు వాతాన్ని పోగొడుతోంది 

 * దంతాలు , చర్మం వీనికి హితంగా ఉంటుంది. ఆయువుని , ఆరోగ్యాన్ని వృద్ధిచేస్తుంది.

 * కుష్టువు, నేత్రరోగం , శిరోరోగం , వాపు , శరీరం యొక్క దురద నివారించును.

 * హెర్నియా , ఆయాసం , పొట్టలోని క్రిములు , ఆమరోగం అనగా రుమాటిజం , పాండు రోగం అనగా భయంకరమైన రక్తక్షీణత , గుండెజబ్బు , చర్మరోగం వంటి వ్యాధులు హరించును . 

 * కొన్ని రకాల ఆకుకూరలు నేత్రాలకు చెడుచేస్తాయి అని అంటారు. కాని ఆకుకూరల్లో పొన్నగంటి కూర తరువాత నేత్రాలకు మేలుచేసేది గుంటగలగర కావున గుంటగలగరని ఉపయొగించవలెను . 

 * గుంటగలగర నేత్రాలకు చలువచేస్తుంది. ఈ ఆకుపసరు సాయంతో తయారైన కాటుక పెట్టుకోవడం వలన కంటిజబ్బులు నయం అవుతాయి. 

 * కేశాలువృద్ధి , మేధావృద్ధి ని కలుగచేస్తుంది.

 * స్ప్లీన్ , కామెర్లు , సుఖఃరోగాల్లో దీనిని వాడటం వలన మంచి ఫలితం కనిపించును.

 * గుంటగలగర ఆకు రసం మజ్జిగలో కలిపి తీసుకోవడం వలన పాముకాటు నుంచి కాపాడవచ్చు.

 * ఎనిమిది చుక్కల తేనెలో రెండు చుక్కల గుంటగలగర ఆకు రసాన్ని వేసి పురిటి బిడ్డల జలుబురోగాల్లో వాడతారు.

 * కడుపులో నులిపురుగులు ఉన్నాయి అని అనుమానం వచ్చినపుడు ఆముదంతో ఈ ఆకుపసరు కలిపి పుచ్చుకోవడం మంచిది .

 * చెవిపోటుగా ఉన్నప్పుడు ఈ ఆకుపసరు ఒకటి రెండు చుక్కలు చెవిలో వేస్తారు.

 * ఈ ఆకులు ముద్దగా నూరి తేలు కుట్టినచోట వేస్తే విషం విరుగును.

 * చర్మరోగాల్లో ఈ ఆకుపసరు బాగా పనిచేస్తుంది .

 * గుంటగలగర ఆకుల పొగని కాని , ఆ ఆకులు వేసి కాచిన నీటి ఆవిరి కాని గుదముకు పట్టించిన మూలశంక రోగం తగ్గును.

 * గుంటగలగర జ్వరాన్ని తగ్గిస్తుంది . 

  గుంటగలగర ఉపయోగించు విధానం - 

     దీనిని తరచుగా కూరగా, పచ్చడిగా ఉపయోగించడం మంచిది . తియ్యకూరగా కాని , పులుసుకూరగా కాని వండుకోవచ్చు. గుంటగలగర ఆకువేయించి చేసిన పచ్చడికి 
కొంతవరకు గోంగూర పచ్చడి రుచి వస్తుంది.
గుంటగలగర ఆకులో ఇనుము ఎక్కువుగా ఉంటుంది. దీనిని లోపలికి తరచుగా తీసుకోవడం వలన శరీరానికి ఇనుము చక్కగా అందును. మరియు నేత్రాలకు చల్లదనం , కేశాలకు వృద్ది కలుగును.

 గోంగూర - 

             వెల్లులి బెట్టి పొగిచిన 
      పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా ?
              మొల్లముగ నూని వేసుక 
       కొల్లగ భుజియింపవలయు గువ్వల చెన్నా !

         పైన చెప్పిన పద్యం గువ్వలచెన్న శతకంలోనిది. దీనిలో ఆ కవి వర్ణించిన తీరు చూస్తుంటే తెలుస్తుంది . గొంగూర యొక్క గొప్పతనం . ఇప్పుడు మీకు దానిలోని పోషక విలువలు మీకు తెలియచేస్తాను. 

 * దీనిని సంస్కృతంలో పీలు , గుచ్ఛఫల , ఉష్ణప్రియ అని కూడా పిలుస్తారు . 

 * ఆకుకూరలలో ఇది మిక్కిలి ప్రశస్తమైనది.

 * ఈ ఆకుల్లో రాగి ఎక్కువ ఉంటుంది.

 * దీనిలో పోటాష్ కూడా ఉంటుంది.

 * ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో గోంగూరని వేడిని కలుగజేసేదిగా పేర్కొన్నది. బలం కలుగచేసే ఆకుకూర గా తెలియచేశారు .

 * రక్తపిత్తవ్యాధి అనగా నోటినుంచి రక్తం పడువ్యాధిని హరించును . 

 * శరీరంలోపలి గడ్డలు , మూలవ్యాధి , స్ప్లీన్ సంబంధ సమస్యల ను నివారించవచ్చు.

 * వాతం , కఫం ఉన్నవారు దీనిని లొపలికి తీసుకోవలెను . 

 * ఇది మంచిరసాయనం . 

 * ఈ గోంగూరలో నాలుగు రకాలు ఉన్నాయి.
గొంగూరలో పుల్లగోంగూర , ఎర్ర గోంగూర , తెల్ల గోంగూర దీనిని దేశివాళి గోంగూర అని కూడా అంటారు. మరొక రకం ధనాసర గోగు అని 4 రకాలు ఉన్నాయి.

 * పుల్లగోంగూర కాయలు ఎర్రగాకాని , తెల్లగా కాని ఉంటాయి. పుల్లగోంగూర ఆకులనే కాకుండగా పువ్వుల్ని కూడా పచ్చడి చేసుకుంటారు . 

 * ఎర్రగోగు చెట్టు కాడలు బూడిద రంగుతో కలిసిన పచ్చని రంగుతో ఉంటాయి.

 * తెల్లగోంగూర సర్వసామాన్యమైనది. దీనిని నాటు గోంగూర లేదా దేశివాళి గోంగూర అని కూడా అంటారు.

 * ధనాసర గోంగూర విదేశీది మలేసియా దేశం లోని తర్నాసరి రాష్ట్రం నుంచి వచ్చింది. తర్వాత దాని పేరు ధనాసరి గా క్రమంగా మారింది. ఇది మంచి పథ్యకరమైనది . బాలింతరాళ్ళకి కూడా పెట్టవచ్చు.

 * పైర గోంగూర అని ఇంకోరకం కూడా ఉన్నది. దీన్ని శీతాకాలంలో సాగుచేస్తారు . ఇది మిగిలిన గోంగూరల కంటే మంచి రుచిగా ఉంటుంది. పచ్చజొన్న , పైరగోంగూర రెండు శ్రేష్టం అయినవని సామెత .

 * నువ్వుల చేలో పండిన గోంగూర అంత పథ్యకరం కానిది అని వైద్యులు చెప్తారు . 

 * గుంటూరు జిల్లాలో పెరిగే గోంగూర చాలా రుచిగా ఉంటుంది. దీని ఆకుతో పులుసు , పచ్చడి చేసుకుంటారు . 

 * గుంటూరు జిల్లాలో దీనిని నిలువ పచ్చడిగా పెడతారు.

  నిలువపచ్చడి పెట్టే విధానం - 

       నిలువ పచ్చడి పెట్టడానికి పైర గోంగూర వేయించాలి . కావాలిసిన ఉప్పు చేర్చి ముందు ఒకసారి తొక్కాలి. ఆ తరువాత పండు మిరపకాయలు కొద్దిగా పసుపు చేర్చి మరలా తొక్కాలి . తరువాత గిన్నెలోకి తీసుకుని ఊరనివ్వాలి . 

 * సంవత్సరానికి పైగా ఊరిన ఈ పచ్చడి చాలా పథ్యకరం అయినది. పైన చెప్పిన పచ్చడి నూనెతో కూడా చేయవచ్చు . కాని పైన చెప్పినవలె నూనె కలిపితే పథ్యకరం కాదు.

 * గోంగూర మంచి బలకారం అయిన శాకం . అందుకే గొంగూర పచ్చడి కోడి మాంసంతో సమానం అయినది అని చెప్తారు . 

 * రేజీకటి రోగం కలవారు ఈ కూర చాలా మేలు చేయును . 

 * గోంగూర ఉడికించిన నీళ్లు తాగుతూ చప్పిడి పథ్యం చేస్తే ఉబ్బురోగాలు తగ్గుతాయి అని చెప్తారు . 

 * మేహ సంభందమైన వ్రణాలు కు గోంగూర ఆకు ఉడికించి కడితే మేహవ్రణాలు పక్వానికి వస్తాయి.

 * గోంగూర నేతితో ఉడికించి వృషణాలకు కడితే వరిబీజాలు నయం అవుతాయి.

 * బోదకాలు వ్యాధి ఉన్నవారు వేపాకుతో పాటు గోంగూరని నూరి కాళ్లకు కడితే గుణకారిగా ఉంటుంది.

 * గేదల లేగదూడలకు నాలుగయిదు గోంగూర ఆకులు పెట్టడం వలన మల సమస్య తీరి ఆరోగ్యంగా ఎదుగుతాయి.

 * గోంగూరని ఎక్కువ ఉడికించడం వలన మరియు కుక్కర్లలో ఉడికించడం వలన దానిలోని జీవపోషకాలు నశిస్తాయి.

  గమనిక - 

       ఈ గోంగూరని ఎక్కువుగా వాడరాదు . శరీరంలో వేడిని పెంచును. మరియు మలబద్దకం సమస్య పెంచును.

 చక్రవర్తి కూర - 

 * దీనిని సంస్కృతంలో వాస్తుక , శాకపత్ర , కంబీరా , ప్రసాదక అనే పేర్లతో పిలుస్తారు . 

 * ఇది తొందరగా జీర్ణం అవుతుంది. రుచిగా ఉంటుంది. 

 * శుక్రవృద్ధిని కలిగి ఉండి , శరీరంలో తొందరగా వ్యాపిస్తుంది.

 * స్ప్లీన్ , రక్తంలో దోషం , పిత్తం అనగా శరీరంలో వేడి తగ్గించును . 

 * మూలవ్యాధి , కడుపులో నులిపురుగులు , త్రిదోషాలు వీటిని పోగొట్టును .

 * ఇది మధురంగాను మరియు కొంచం ఉప్పగాను ఉంటుంది.

 * మలమూత్ర సమస్యలని నివారిస్తుంది.

 * ఈ కూర బుద్ధిబలాన్ని పెంచును.

 * ఆకలి పుట్టిస్తుంది.

 * కళ్ళకు మేలు చేయును . 

 * మలబద్దకం సమస్యని నివారించును.

 * వాత పిత్త శ్లేష్మ దోషాలను నివారించడంలో దీనికిదే సాటి .

 * చర్మరోగాలు ను పోగొడుతుంది . 

 గమనిక - 

     దీనిని ఎక్కువుగా తీసుకొన్నచో మలబద్దకం మరియు ఉష్ణాన్ని చేయును.

 చామ ఆకు - 

 * చామ ఆకు కూర చాలా మంచిది . జబ్బుపడి లేచి నీరసపడిన వారికి ఈ ఆకుకూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది .

 * మూలశంక సమస్యతో బాధపడేవారు దీనిని లోపలికి తీసుకోవడం చాలా మంచిది 

 * ఈ ఆకుకూర మూత్రాన్ని బాగా జారిచేస్తుంది .

 * అరుచి అనగా నోటికి రుచి తెలియకపోవడం వంటి సమస్యని నివారిస్తుంది.

 * ఆకలి పుట్టిస్తుంది.

 * ఈ చామ ఆకులను పులుసుకూరగా తినడం చాలా మంచిది . 

 * ఈ ఆకుని పైన వేసి కట్టు కడితే గాయాలు మానతాయి.

 * రక్తనాళాల నుంచి కారే రక్తం ఆగిపోతుంది.

 గమనిక - 

          దీనిని అధికంగా తీసుకోవడం వలన శరీరంలో వాతం , శ్లేష్మంని కలిగించును.దీనికి పులుసు విరుగుడు కావున పులుసు కూర చేసుకోవడం వలన దీనిలో దుర్గుణాలు నశించును.

  చింతాకు - 

 * కూరగాను , పచ్చడిగాను దీనిని ఉపయోగిస్తారు . దీని లేత చిగురుని చింతచిగురు అంటారు.

 * ఈ చింతచిగురు హృదయానికి మేలు చేయును . 

 * ఇది వగరు మరియు పులుపు రసాలని కలిగి ఉంటుంది.

 * రుచిని పుట్టిస్తుంది.

 * బుద్ధికి మేలు చేయును . 

 * జీర్ణక్రియకు మేలు చేయును . 

 * కఫ మరియు వాతాలని అద్భుతంగా నిర్మూలించును.

 * చింతచిగురు ఎక్కువుగా వేసవికాలంలో దొరకును. కాని ఒక ప్రక్రియ ద్వారా అకాలంలో కూడా చింతచిగురు పొందవచ్చు.

 అకాలంలో చింత చెట్టు చిగురించేలా చేసే ప్రక్రియ - 

    మనం ఏ చెట్టుకి అయితే అకాలంలో చింతచిగురు తెప్పించాలి అనుకుంటున్నామో ఆ చెట్టు కొమ్మ పాత ఆకులని రాలిపివేయాలి . ఆ తరువాత ఆ కొమ్మకి సెగ బాగా తగిలేలా అక్కడ తాటాకు మంట వేయాలి . ఈ విధంగా చేసిన వారం పదిరోజుల్లో ఆ చెట్టుకి బాగా చిగురు తొడుగును.ఇలా కొత్తగా వచ్చిన ఆకుతో పచ్చడి చేసుకుని తినవచ్చు 

 * చింతచిగురు శరీరానికి వేడిచేస్తుంది అనుకుంటారు . కాని వేసవికాలంలో దీనిని తినడం వలన ఒక మంచిగుణం ఉంది. వేసవిలో చెమట విస్తారంగా పట్టును . చింతచిగురు తరచుగా ఉపయోగిస్తే చెమట అంత ఎక్కువుగా పట్టదు.

 * చింతచిగురు వాత వ్యాధులని , మూలరోగాన్ని , శరీరంలో ఏర్పడే గుల్మములను తగ్గించును . 

 * పైత్యం , వికారములు ను తగ్గించును . 

 * కొన్ని ప్రాంతాలతో ముదురు చింతాకుని ఎండబెట్టి చింతపండుకి బదులుగా వాడతారు.

 * ఎండబెట్టిన ముదురు చింతాకును పొడిచేసి పుల్లకూరగా వండవచ్చు . ఒంగోలు ఏరియాలో దీనికి ప్రాముఖ్యత కలదు. ఈ పొడికూర చాలా పథ్యకరమైనది మరియు తినదగినది.

 * చింతాకు రసంలో పసుపు కలుపుకుని తాగితే మసూచికా వ్యాధి నివారణ అగును.

 * మోకాళ్ళ వాపు తో చింతాకు ముద్దగా చేసి నీళ్లతో నూరి పట్టు వేయవచ్చు.

 * మొండి వ్రణాలను చింతాకు కషాయంతో కడిగితే అవి త్వరగా నయం అవుతాయి. 

 * ఎర్రగా కాల్చిన ఇనుప గరిటె చింతాకు రసంలో ముంచి ఆ రసం వేడిగా ఉండగానే తాగితే అజీర్తి విరేచనాలు కట్టుకుంటాయి.

 గమనిక - నేత్ర వ్యాధులు కలవారు దీన్ని అధికంగా తినరాదు. కొంచం జఠరాగ్నిని కూడా తగ్గించును . 

 చిర్రికూర - 

 * దీనిని సంస్కృతంలో మేఘనాధ , భండీర , విషఘ్న , కచర అని రకరకాల పేర్లతో పిలుస్తారు . దీనికి పథ్య శాకం అని పేరుకూడా కలదు . అనగా అన్ని రకాల వ్యాధుల్లో దీనిని ఉపయోగించవచ్చు అని అర్ధం .

 * ఇది కొద్దిపాటి తేమగల ప్రదేశాలలో చిర్రికూర బయలుదేరి బాగా పెరుగును . 

 * ఇది చూడటానికి ముళ్లతోటకూరలా ఉంటుంది. కాని దానిలా ముళ్ళు ఉండవు.

 * చిర్రికూరలో మూడురకాల జాతులు కలవు. చిర్రి , నీటి చిర్రి , చిన్న చిర్రి అనేవి కలవు. వైద్యగ్రంధాలలో మాత్రం నీటిచిర్రి గురించి వివరించబడి ఉంది. కాని వంటకాలలో ఉపయోగిస్తున్నట్టు ఎక్కడా కనపడదు.

 * వైద్యగ్రంధాలలో వివరించినదాని ప్రకారం పిత్తాన్ని , కఫాన్ని , రక్తదోషాన్ని పోగొట్టును . 

 * మలమూత్రాన్ని బాగా బయటకి పంపిస్తుంది.

 * నాలుకకు రుచిని పుట్టిస్తుంది.

 * రక్తం కక్కే వ్యాధిని పోగొడుతుంది . శరీరంలో జఠరాగ్ని పెంచును.

 * చిర్రికూర పాషాణాది విషాన్ని , సర్ప విషాన్ని మొదలయిన విషాలను హరిస్తుంది అని పేరు కలదు.

 * విషంతో కూడిన రక్తాన్ని శుభ్రపరచడంలో దీనికి మంచి పేరు ఉంది.

 * పెట్టుడు మందుల విషాన్ని పోగొట్టడానికి 
చిర్రికూర వండిపెడతారు.

 * కందిపప్పు మొదలయిన పప్పుల్లో చేర్చి ముద్దకూరగా , లేదా పొడికూరగా వండవచ్చు.

 * ఈ కూర బాగా ఆకలి కలిగిస్తుంది.

 * వాత, పిత్త, శ్లేష్మాలు అనే త్రిదోషాలను నివారిస్తుంది.

 * కళ్ళజబ్బులు , మెదడు జబ్బులు కలవారికి ఇది మిక్కిలి హితకరం అయినది.

 * ఈ కూరలో ఉక్కు లోహం ఉంది అని చెప్తారు . 

 * రక్తం కక్కుకునే వ్యాధుల్లో , గుండెజబ్బుల్లో చిర్రిఆకుకూర చాలా ఉపయోగికారిగా ఉంటుంది.

 * ఈ కూర తినటం వలన అతిసార వ్యాధి తగ్గును.

  చిలుకకూర - 

 * దీనిని "జలబ్రహ్మి" అని అంటారు.

 * నదుల గట్టులు , చెరువు గట్టులు మొదలయిన తేమగల ప్రదేశాలలో ఈ కూర పెరుగును . 

 * ఇది సరస్వతి మొక్కని పోలి ఉంటుంది. మరియు నీరుగల ప్రదేశాలలో ఉండటం చేత జల బ్రహ్మి అని పేరు వచ్చింది.

 * దీనిలో రెండురకాల జాతులు కలవు. ఒకరకాన్ని పెద్ద చిలకూరాకు రెండో రకాన్ని తెల్ల చిలకూరాకు అని పిలుస్తారు . 

 * ఇది రుచిగా ఉండి బుద్దికి బలాన్ని ఇస్తుంది. 

 * శరీరంలో జఠరాగ్ని పెంచును. 

 * స్ప్లీన్ , రక్తదోషం , త్రిదోషాలు , శరీర అంతర్భాగంలో గల క్రిములను హరించును . 

 * తెల్ల చిలుకకూర తియ్యగా ఉంటుంది. ఇది పిత్తాన్ని హరించును . జ్వరంతో పాటు వచ్చే దోషాలని , త్రిదోషాలని హరించును . 

 * ఇది రుచికి చేదుగా ఉంటుంది.

 * ఇది మంచి విరేచనకారి.

 * కడుపులో నులిపురుగులని హరిస్తుంది.

 * కుష్టురోగాన్ని తగ్గించే గుణంకూడా దీనిలో కలదు.

 * శరీరానికి పుష్టి ఇచ్చే కూరల్లో ఇది చాలా గొప్పది.

 * మూలవ్యాధుల్లో , గ్రహణి రోగం అనగా బంక విరేచనాలలో , ఉబ్బు రోగాల్లో , కడుపులో బల్లలు పెరిగే రోగాల్లో ఈ ఆకుకూర వాడవలెను.

 * మసూచి వంటి వ్యాధుల్లో చిలుకకూరాకు రసంలో తెల్ల చందనం ముద్ద ను రంగరించి తాగితే ఆ రోగము తగ్గును.

  చుక్క కూర - 

 
 * ఈ చుక్కకూర బచ్చలి కూరని పోలి ఉంటుంది. పుల్లగా ఉంటుంది. అందుకే దీన్ని అన్ని ప్రాంతాలలో పుల్లబచ్చలి అంటారు.

 * ఈ చుక్క ఆకులు దళసరిగా , పెళుసుగా ఉంటాయి. ఈ చుక్క ఆకులో జిగురు పదార్థం ఎక్కువుగా ఉంటుంది.

 * దీనిలో 2 రకాల జాతులు కలవు. అవి  
    చుక్కకూర , చిన్న చుక్కకూర .

 * ఈ చుక్కకూర పుల్లగా , తియ్యగా ఉంటుంది. చిన్న చుక్క కూర పుల్లగా కొంచం వగరుగా ఉంటుంది. 

 * ఇది జఠరాగ్ని పెంచును.

 * ఇది రుచిని పుట్టించును . 

 * కఫం , వాతం పోగొడుతోంది . పిత్తాన్ని కలిగిస్తుంది . 

 * గ్రహణి , మూలరోగం , అతిసారం , కుష్టువు వీనిని నశింపచేస్తుంది.

 * మలబద్దకం ని తొలగించి సుఖవిరేచనం కలిగించును.

 * నోటిలో కొంతమందికి అతిగా లాలాజలం ఊరుతుంది.అది కఫ సంబంధమైన సమస్య ఆ సమస్యకి చుక్కకూర తరచుగా తీసుకోవడం వలన సమస్యకి అద్బుతంగా పనిచేయును .

 * వాంతులని అరికట్టడంలో ఈ కూర అద్బుతంగా పనిచేయును . 

 * వేడిశరీరం కలవారికి ఈ కూర చాలా మేలు చేయును .

 * జీర్ణకోశంలో ఏర్పడే మంటని , వేడిని ఇది తగ్గించును . 

 * పైత్యం అధికం అవ్వడం వలన కలిగే విరేచనాలని , రక్తంతో కూడియున్న బంక విరేచనాలని తగ్గించడంలో చుక్కకూర చాలా అద్బుతంగా పనిచేస్తుంది .

 * మూలరోగాలు , గుల్మాలు , క్షయలు , మేహవ్యాధులు మొదలయిన వ్యాధుల్లో ఈ కూరని ఉపయోగించటం వలన మంచి ఫలితాలు ఉంటాయి.

 * గుండెజబ్బులు కలవారు , ఆమవాతం , గుండెల్లో నొప్పిని తగ్గించును . 

 * విషాదోషాలు పొగొట్టును.

 * బుద్దికి చలువచేయును .

 * శరీరం నందు ఉత్సాహాన్ని కలిగిస్తుంది .

 * మలమూత్రాలు సాఫీగా అయ్యేలా చూస్తుంది.

 * పక్వము అవ్వని గట్టిగా ఉండే వ్రణాల పైన చుక్క ఆకు వేసి కడితే మంచి గుణకారిగా ఉంటుంది.

 * చుక్క ఆకు వెచ్చచేసి దాని రసం చెవిలో పిండితే చెవిపోటు నయం అగును.

 * తెలంగాణా ఏరియాలో దీన్ని ఎక్కువుగా వాడతారు.

  చెంచలి కూర - 

   
 * ఏ ఆకు కూరలు దొరకని ఆషాడ మాసంలో ఈ ఆకుకూర దొరుకుతుంది .

 * ఎందుకనో ప్రజలు దీనిగురించి ఎక్కువ పట్టించుకోరు.

 * దీనిలో చెంచలికూర, నీరు చెంచలి కూర అని రెండురకాలు కలవు. సాదారణంగా చెంచలి కూరనే వంటకానికి వాడతారు.

 * ఇది మలాన్ని గట్టిపరుస్తుంది.

 * మేహాంని , త్రిదోషాన్ని పోగోట్టును . 

  తమలపాకు - 

 * దీన్ని సంస్కృతంలో భక్ష్యపత్రి అంటారు.

 * భరత ఖండంలో తమలపాకుల వాడకం అత్యంత ప్రాచీన కాలం నుంచి ఉంది. శుశ్రుత సంహితలో కూడా తమలపాకు గురించి వివరణ ఉన్నది.

 * తమలపాకు ని సంస్కృతంలో తాంబూల వల్లి , నాగవల్లరి అని కూడా పిలుస్తారు . 

 * వానాకాలం వచ్చే తమలపాకులు దళసరిగా , పెద్దగా ఉంటాయి. ఎండాకాలం వచ్చే ఆకులు పలచగా కొద్దిగా ఉంటాయి. వానకాలం తమలపాకుల కంటే ఎండాకాలం వచ్చే తమలపాకులు ఎక్కువ రుచిగా ఉంటాయి.

 * తమలపాకులు శరీరాన్ని శోధనం చేస్తాయి.అనగా శరీరం నుండి వ్యర్థాలను బయటకి పంపుతాయి.

 * రుచిని కలిగిస్తాయి. శరీరంకి వెంటనే వేడి పుట్టిస్తాయి.

 * వగరు , చేదు , ఉప్పు రుచిని కలిగి ఉంటాయి. శరీరంలో వేగంగా వ్యాపించే గుణం కలిగి ఉంటాయి. శ్లేష్మాన్ని , నోటికంపుని , బడలికని పోగొట్టును . 

 * మిగిలిన ఆకుకూరలు చెట్టు నుంచి కోసిన తరువాత ఎంత త్వరగా ఉపయోగిస్తే అంత మంచిది . కాని తమలపాకు విషయంలో దీనికి పూర్తి వ్యతిరేకం . చెట్టు నుండి అప్పుడే కోసిన తమలపాకులు దోషంతో మరియు జడంగా ఉంటాయి. 

 * దోషయుతమైన తమలపాకులు వాడటం వలన వాంతులు , మలం స్థంభించుట , నాలిక రుచి లేకుండా పోవడం . దాహం వేయడం , రక్తదోషం వంటి సమస్యలు సంభంవించును.

 * పండిన తమలపాకులు రుచిలో అత్యుత్తమంగా ఉండి త్రిదోషాలని నాశనం చేస్తాయి . 

 * భోజనం చేసుకున్నాక తాంబూలం వేసుకోవడం వలన మంచి జీర్ణశక్తి పెరుగును .

 * తమలపాకులు అతిగా తినటం వల్ల వచ్చే భుక్తాయాసాన్ని నివారించును.

 * నోటి దుర్వాసన పోగొట్టును 

 * తమలపాకులు వేడిచేసే స్వభావాన్ని కలిగి ఉండి కామోద్రేకాన్ని కలిగిస్తాయి . 

 * వాత , కఫాలని హరిస్తాయి.

 * కంఠస్వరాన్ని బాగుచేస్తాయి.

 * తమలపాకులు పండు ఆకులను సేవిస్తే పసరు పెరగదు . బాలింతలు కూడా తీసుకోవచ్చు .

 * పత్తిచెట్టు వేరు , తమలపాకు రసంతో నూరి ముద్దచేసి ఉపయొగిస్తే వజ్రం కూడా భస్మం అగును.

 * ఇంతగొప్ప లక్షణాలు ఉన్నను తాంబూలం మితిమీరి సేవించరాదు . సేవిస్తే దంతవ్యాదులు కలుగుతాయి.

 * తాంబూలం అతిగా సేవించటం వల్ల నాలిక మొద్దుబారిపోయి పదార్థాల రుచులు మధ్య బేధాన్ని గుర్తించలేకుండా అవుతుంది.

 * భోజనం చేసిన వెంటనే తాంబూలం వేసుకోకూడదు. ఒక గడియసేపు ఆగి తాంబూలం వేసుకోవాలి.స్నానం చేసిన వెంటనే , వాంతి చేసుకున్న వెంటనే , నిద్రలేచిన వెంటనే తాంబూలం వేసుకోరాదు.

 * వెలగపండు , పుల్లనిపండ్లు , పనసతొనలు , అరటిపండ్లు , చెరకు గఢ , కొబ్బరికాయ , పాలు , నెయ్యి తిన్నతరువాత తమలపాకు ఎట్టి పరిస్తతుల్లో తినరాదు.

 * తాంబూలం వేసుకున్నప్పుడు సమస్య అనిపిస్తే చల్లని నీరు విరుగుడు. లేదా నోటితో నీరు పుక్కిలించి పుల్లటి వస్తువుగాని తియ్యటి వస్తువుగాని చప్పరించాలి.

 తొటకూర - 

 * తోటకూర తినటం వలన శరీరంలోని వేడి తగ్గును. శరీరంలో ఉన్న అతివేడిని తగ్గించి శరీరంలో సమశీతోష్ణస్థితిని నిలిపి ఉంచుతుంది.

 * ఋషిపంచమి వంటి పుణ్యదినాల్లో మరియు వ్రతాల్లో దానం చేయతగ్గ పవిత్రశాకం .

 * తోటకూర మూడు లేక మూడున్నర అడుగుల వరకు ఎదిగే చిన్నమొక్క . తోటకూరని ఏడాది పొడుగునా పెంచుకోవచ్చు.

 * విత్తనం మొలకెత్తి మూడో ఆకు వేసేదాకా తోటకూరవిత్తనాలు చల్లిన మళ్ల మీద అరటిసోరగు కాని ఎండు కొబ్బరిఆకులు కాని కప్పి ఉంచాలి. ఇలా చేయడం వలన పక్షుల నుంచి విత్తనాలను కాపాడవచ్చు.

 * మడిలో విత్తులు ఒత్తుగా చల్లడమే మంచిది . లేతగా ఉండగానే నడుమనడుమ కొన్ని మొక్కలని పీకేస్తూ కూరకు ఉపయోగిస్తుంటే ఉన్న మొక్కలు ముదిరి బాగా కాస్తాయి. ఇలా ముదిరిన మొక్కల కాడలు కూరకి మరియు పులుసుకి పనికివస్తాయి.

 * తోటకూరలో అనేక రకాలు ఉన్నాయి.

పెరుగుతోటకూర , కొయ్యతోటకూర , చిలుకతోటకూర , ఎర్రతోటకూర , ముళ్లతోటకూర మెదలైనవి.

 * కొయ్యతోటకూర బాగా వేడిచేస్తుంది.కాబట్టే దీనిని బాలింతలకు , నంజు వ్యాధి కలవారికి విరివిగా వాడవలెను . వాతత్వం కలవారికి ఈ కూర మేలు చేస్తుంది. ఉష్ణశరీరం కలవారికి గుండెలో నొప్పి , కొయ్యతోటకూరని మండు వేసవిలో కూడా పెంచుకొవచ్చు. 

 * ముళ్లతోటకూర ఆకులని పప్పుకూరగా వండి పెడితే బాలింతలకు పాలు పడతాయి.

 * ఈ మొక్కల్ని తెచ్చి ఎండించి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని బట్టలసోడాకు బదులుగా చాకలివారు వాడతారు. దీనికి కారణం ముళ్లతోటకూరలో క్షారపదార్థం విస్తరించి ఉందని తెలుస్తుంది.

 * సోడాపెట్టి ఉతికిన బట్టలు కంటే ముళ్లతోటకూర బూడిద పెట్టి ఉతికే బట్టలు చాలారోజులు మన్నుతాయి. మరియు సోడా పెట్టిన వాటికంటే ఇవి శుభ్రముగా ఉంటాయి.

 * చిలకతోటకూర పెరళ్ళలో బాగా ఎదుగును. పెరుగుతోటకూర ఆకులు నూరిన ముద్దకడితే గాయాలు మానుతాయి. మలబద్ధకాన్ని తొలగించడంలో ఆకుకూరలలో తోటకూర సాటిలేనిది.

 * అన్నిరకాల తోటకూరలో ఇనుము ఉంది అని శాస్త్రవేత్తల పరిశోధనలలో కనుగొనబడినది.

 * ఇది పుల్లకూరగా , తీయకూరగా, పప్పుకూరగా , పులుసుగా వండుకుంటారు.

  దోసకాయ ఆకు కూర - 

 * మనం దోసకాయలను ఆహారంగా తీసుకుంటాం కాని దోస ఆకు లో కూడా చాలా ఔషద గుణాలు ఉన్నాయి. ఇది లొపలికి కూరగా తీసుకొవడం వలన మలమూత్రాలను జారీచేస్తుంది. 

 * పైత్యం పెరగటం వలన బ్రాంతి తగ్గును.

  పుదీనా ఆకు - 

 * నోటియొక్క అరుచి పోగట్టడానికి పుదీనా పచ్చడి చేసుకుని తినవలెను . పుదీనా ఆకులు , ఖర్జురపు కాయలు , మిరియాలు , సైన్ధవ లవణం , ద్రాక్షా మొదలయిన పచ్చడిచేసి అందులో నిమ్మకాయల రసం పిండి ఉపయోగిస్తారు 

 * పుదీనా ఆకుని నేతితో వేయించి కాని పచ్చిది కాని నూరి పచ్చి మిరపకాయలు , ఉప్పు చేర్చి నూరి నిమ్మరసం పిండి ఉపయోగిస్తే చాలా రుచికరంగా ఉంటుంది.

 * జ్వరాలు మొదలయిన వాటితో నీరసపడి లేచినవారికి నోరు రుచి పోతుంది . వారికి ఈ పచ్చడి అద్బుతంగా ఉంటుంది.

 * గుండెలకు పుదీనా చాలా పథ్యకరం అయినది. కలరా రోగాల్లో పుదీనా మంచి గుణకారిగా ఉంటుంది. ఎక్కిళ్లు మరియు వాంతుల్లో మొదలయిన రోగాల్లో పుదీనా వాడతగినది.

 * పుదీనా ఆకుల రసం తేనెతో కలిపి చెవిలో వేస్తే చెవిపోటు తగ్గును. కణతలు కు రాసుకుంటే తలనొప్పి నయం అగును. పుళ్లు మొదలయిన వాటికి రాస్తే తొందరగా నయం అగును. 

 * అజీర్ణ రోగులకు పుదీనా నిత్యం సేవించటం మంచిది .

 పొన్నగంటి ఆకు కూర - 

  
 * ఇది నేత్రవ్యాధులు కలవారికి చాలా అద్బుతంగా పనిచేస్తోంది .

 * ఇది మలాన్ని గట్టిపరుస్తుంది. శీతలంగా ఉంటుంది.

 * కుష్టు వ్యాధి , రక్తదోషం , కఫం , వంటి సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడం చాలా మంచిది . 

 * జ్వరం , శరీరంలో వాపు , దురద , స్ప్లీన్ సమస్య , వాతం , వాంతి , అరుచి వీనిని పోగొడుతుంది.

 * హృదయానికి మేలు చేస్తుంది.

 * ఇది చలువచేయును . జ్వరతాపాలను , అతిదాహం తగ్గిస్తుంది . 

 * ఆవునెయ్యితో ఉడికించి పొన్నగంటి ఆకుని కండ్లకు కడితే వేడివల్ల కలిగే నేత్రవ్యాధులు నయం అవుతాయి.

 * మూలవ్యాధుల్లో కూడా పొన్నగంటికూర చాలా బాగా పనిచేస్తుంది 

 * వేడివలన వచ్చే తలపోట్లలో పొన్నగంటి ఆకు తలకు కట్టడం మంచిది . 

 * పొన్నగంటిఆకు రక్తదోషాలను మరియు కుష్టురోగాలను నయం చేస్తుంది.

  మునగాకు - 

 * ఆషాడ మాసంలో మునగాకు కూర తినవలెను అని పెద్దలు చెపుతారు.

 * మునగాకులో 5 ,000 యూనిట్ల A విటమిన్ ఉంది . అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .

 * మలాన్ని గట్టిపరుస్తుంది. 

 * జఠరాగ్నిని పెంచును.

 * కఫాన్ని , వాతాన్ని హరించును . 

 * శరీరంకు వేడిచేయును . రక్తములో వేడి పెంచును కావున తక్కువ తీసుకోవడం మంచిది .

 * మునగాకుని పప్పులో వేసి ముద్దకూరగా కాని పొడికూరగా కాని వండుకోవచ్చు .

 * ఈ కూర దృష్టిమాంద్యాన్ని పోగొడుతుంది అని చెబుతారు.

 * శరీరంలో చెడ్డ నీరు తొలగించుటకు మునగాకు కూర చాలాబాగా పనిచేస్తుంది .

 * వేడిశరీరం కలవారు ఈ మునగాకుని వాడకుండా ఉంటే మంచిది .

 * స్త్రీ ముట్టులో ఉన్నప్పుడు మునగాకు కూర పెట్టడం చాలా మంచిది . దీనికి కారణం స్త్రీలు ముట్టులో ఉన్నప్పుడు శరీరంలో వాతం ఎక్కువుగా ఉండును. ఈ సమయంలో మునగాకు తినిపించడం వలన వాతం హరించును . 

 
  మెంతి ఆకు - 

 
 * ఈ మెంతులు ఆశ్వయుజ కార్తీక మాసాల్లో చల్లితే చల్లిన నెలా పదిహేను రోజుల్లొ మెంతికూర ఉపయోగించడానికి అనువుగా ఎదుగును.

 * నల్లనేలల్లో శీతాకాలంలో వేసిన మెంతికూర చాలా రుచిగా ఉంటుంది.

 * మెంతికూర పచ్చిగా ఉన్నప్పుడు కాని , ఎండపెట్టి వరుగు చేసి కాని ఉపయోగించుకోవచ్చు.

 * రక్తపిత్తం , అగ్నిదీప్తి , మలాన్ని బందించును., బలాన్ని కలిగించును.

 * జ్వరం , వాంతి , వాతరక్తం , కఫం , దగ్గు , వాయువు అనగా వాతం , మూత్రరోగం , క్రిమి , క్షయ , శుక్రం వీటిని నశింపచేస్తుంది.

 * ఈ ఆకులు నూరిన ముద్ద కాలిన పుండ్లకు , వాపులకు పట్టువేస్తే చల్లగా ఉండి మేలు చేస్తుంది.

 * ఈ మెంతిఆకులు నూరి ముద్దకడితే వెంట్రుకలు మృదువుగా అవుతాయి.వెంట్రుకలు రాలే జబ్బు తగ్గును.

 * మెంతికూర స్త్రీల గర్భాశయాన్ని బాగుపరచడంలో ఋతుస్రావాన్ని సుష్టుచేయడంలో మెంతికూర బాగా పనిచేయును .

 * ఈ మెంతిఆకుల వల్ల కలిగే దోషాల్ని పోగొట్టడంలో పులుసు వస్తువులు వాడవలెను.

  
  

Thursday, December 12, 2024

పూజ-ఆచమనం లోని ఆంతర్యం

*పూజ-ఆచమనం లోని ఆంతర్యం*
            
ఎసోఫెగస్ (Esophagus ) అనేది మన గొంతుని పొట్టకు కలిపేటువంటి ఒక ట్యూబు. ఇది కండరాలతో నిర్మితమై వుండి, ఎప్పుడూ మూసుకునే ఉంటుంది. ఆహారం లోనికి తీసుకునేటప్పుడు మాత్రం తెరుచుకుని మళ్ళీ వెంటనే మూసుకుపోవాలి. అలా మూసుకుని జీర్ణాశయంలో ఉన్న యాసిడ్, ఆహారాలను బయటకు రాకుండా ఆపి రక్షిస్తూ ఉంటుంది. యాసిడ్ బయటకి లీక్ అయ్యి వస్తే దాన్నే మనం ఎసిడిటీ అంటాము. 

భోజనం చేసే ముందు ఈ ఎసోఫెగస్ సాఫీగా తెరుచుకోవడానికి బ్రాహ్మణులు చేసే “ఆచమనం” అనే పద్దతిని అందరూ పాటించాలి. 

పరిశీలిస్తే ఈ ‘ఆచమనం’ అనే ప్రక్రియ ఒక శాస్త్రీయ దృష్ఠితో అలవరచుకున్న ఆరోగ్యకరమైన విధానం అని తెలుస్తుంది. 

కొందరు అనుకున్నట్టు ఒక మూఢాచారం కాదు. కొంచెం నీరు తీసుకుని ఆహారం మొదలుపెడితే ఎసోఫెగస్‌కి లూబ్రికేషన్ జరుగుతుంది, ఆహారం సాఫీగా పొట్టలోకి జారుతుంది. 

అంతేనా? అలాగైతే ముందుగా కాస్త నీళ్ళుతాగి భోజనం చెయ్యమని చెప్పచ్చుగా? కేశవ నామాలు దేనికి అని అనుమానం రావచ్చు. 

ఈ ఆచమనం భోజనం చేసే ముందే కాదు, ఏ పూజచేసేటప్పుడైనా కూడా చేస్తారు. అన్నిటికీ కలిపి ఒకే ప్రాసెస్ ని మనకు నేర్పారు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. 

గొంతులో ‘ఎసోఫెగస్’ ఒక్కటే కాదు. సున్నితమైన శ్వాసనాళము, స్వరతంతంత్రులు వంటివి అనేకం ఉంటాయి. మంత్రోచ్చారణ చేయడానికి ముందు వాటికి కూడా కొంచెం ఒక నిర్ధిష్టపద్ధతిలో వ్యాయామం(వార్మ్ అప్) అవసరం. దానికి భగవన్నామాలతో మొదలు పెట్టమన్నారు. అదీ ఏ నామం పడితే అది అని చెప్పలేదు. కేశవ, నారాయణ, మాధవ అని మాత్రమే అనమన్నారు. 

ఎందుకంటే, ‘కేశవ’ నామం గొంతులోనుంచీ వస్తుంది. ‘నారాయణ’ నామం నాలిక సహాయంతో వస్తుంది. ‘మాధవ’ నామం పెదాల సహకారంతో వస్తుంది. అంటే నోటిలో అన్ని భాగాలకూ ఒక ఎక్సర్సైజ్ అన్న మాట.

మరి నీళ్ళు చేతిలో పోసుకుని నోట్లో ఎందుకు పోసుకోవాలి? ఉద్ధరిణితో నేరుగా నోట్లో పోసుకోవచ్చుకదా!

మన చేతిలో ఎప్పుడూ కొంత విద్యుత్తు (స్టాటిక్ పవర్) ఉంటుంది. ఆ చేతితో నీరు పోసుకుని మింగితే, దానితో చేతిలో ఉన్న విద్యుత్తు, నోటిలోకి పొట్టలోకి ప్రవహించి అన్నిటినీ ఉత్తేజపరచి, సమతుల్యం చేస్తుంది. దానితో ఆహారం స్వీకరించడం తేలికవుతుంది. అలాగే కంఠంలో ఉన్న స్వరతంతంత్రులు కూడా ఉత్తేజితం అవుతాయి. 

ఇది ఒక దృక్పదం. కొందరు మరొక విధంగా చెప్పవచ్చు. కానీ ఈ విధానంలో ఒక శాస్త్రీయత (మనకి పూర్తిగా అర్థం కాకపోయినా) కనిపిస్తుంది.

ఇలాగే ఇంకా మనలో చాలా ప్రశ్నలు సహజంగానే రావచ్చు, వస్తాయి. రావాలి. ఐతే అన్నిటికీ మనకు సమాధానం వెంటనే దొరకకపోవచ్చు. అంటే దాని వెనుకనున్న నాలెడ్జిని మనం కోల్పోయాము. కనుక తిరిగి సంపాదించుకోవాలి అని ప్రయత్నిస్తే, సమాధానాలు అన్నీ ఒకరోజుకి దొరుకుతాయి.✍``

*PS: ఒక శాస్త్రీయ విధానాన్ని సింపుల్ గా మూఢనమ్మకం అని కొట్టేయడాన్ని మించిన మూఢనమ్మకం మరొకటి వుండదేమో*

విషములు వాని లక్షణములు

విషములు వాని లక్షణములు - 

 మహా విష సర్పములు - 

 శ్మశానము , రచ్చ చావిళ్ళు, పాడుబడిన యజ్ఞ స్థానములు, పాడుబడిన ఇండ్లు, నాలుగు దోవలు కలిసిన తావు, నీళ్ల గట్టు, పాడు తోటలు, మాణి తొర్రలు, పాలమాను, వేపచెట్టు, సెలయేళ్ళు, గుహలు, వీనియందు ఉండు సర్పములు , జడలు ధరించిన సర్పములు , చత్రరేఖలు, మత్స్యరేఖలు, కుంభ రేఖలు , త్రిశుల రేఖలు , గల సర్పములు , ఎర్ర ముఖము , ఎర్ర కన్నులు గల సర్పములు కరచిన యెడల వీనికి కాల నియమం లేదు . విషము ఎక్కుటకు క్రమము లేదు . ఈ విషమును తిప్పుటకు మంత్ర ఔషదములు లేవు . ఒకవేళ బలి, నమస్కార , జప, శాంతి, మంత్ర ఔషధుల చేత ఎవడన్నా బ్రతికినా రూపము చెడును. అంగవైకల్యం కలుగును.

 స్థాన విధి దోషము - 

 శ్మశానము, రచ్చ మాకులు వీని యందు పంచమి, పక్ష సంధులు, అష్టమి, నవమి, సంధ్యలు, అర్ధరాత్రి ఈ కాలముల యందు ఎట్టి పాము కరిచినను విషం ఎక్కును.

 నక్షత్ర దోషము - 

 భరణి, కృత్తిక, ఆశ్లేష, విశాఖ, పుబ్బ, పుర్వాబాద్ర, పుర్వాషాడ , మఖ, శతబిషం , నైర్రుత ముహూర్తం , పర్వములు వీని యందు పాము గరిచిన యెడల మనుష్యుడు జీవించుట దుర్లభం .

 విష సాధ్య లక్షణములు - 

  పాము కరిచిన వానికి తలవెంట్రుకలు రాలుట , మూర్చ, శ్వాసము, వెక్కిళ్ళు, దగ్గు , వాంతి , రొమ్ము బరువు, వణుకు, వికారము , వేదన, కన్నులు ఎరుపు ఎక్కుట , గొంతు పట్టుట, పండ్లు నేరేడు పండ్లు వలే నల్లనగుట, నవ రంధ్రముల నుండి రక్తము కనిపించుట, నోట నురుగు వచ్చుట, కాళ్ళు, చేతులు నల్లగా అగుట ఈ లక్షణాలు కనిపించిన ఆ మనుష్యుడు బ్రతకడు. 

 తేలు విషము - 

  సర్ప శరీరములు మురగిన యెడల తేళ్ళు జనించును.మరియు పేడ లొను , శ్మశాన దగ్ధ స్థలముల యందు బుట్టును. వీని విశములు మంత్ర ఔషధములకు సాద్యం కాదు. అవి తెలుపు,ఎరుపు,నలుపు వర్ణములు కలిగియుండును. వీని విషం ఎక్కినవానికి నాలుక మంధమేక్కును , మిక్కిలి నొప్పి , ముక్కున నెత్తురు వచ్చుట, శరీరం చెమర్చుట, మూర్చ, నోరెండుట కలుగును. 

 గర విష లక్షణము - 

 స్త్రీలు పురుషులను వశపరుచుకోనుటకు , అట్లే పురుషులు , స్త్రీలను వశపరుచుకోనుటకు నానా జంతువుల బస్మ, మల, మూత్రాదులు, ఔషధములను , అల్ప వీర్యములు గల విషములు మొదలగు వానితో కుడా చేర్చి అన్నపాన తాంబూలం, మద్యపానం తో నోసంగేదరు. దీనినే గర విషము , పెట్టుడు మందు అనికూడా అంటారు. 

 పెట్టుడు మందు లక్షణము - 

 ముఖము తెల్లగా అగుట,ఓడలు చిక్కుట, అగ్నిమాంద్యము, దగ్గు , ఉబ్బసము , వాత ప్రకోపము, మహోదరము, గుండెలలో నొప్పి , బలహీనత, హీన స్వరము, మోహము, కడుపు ఉబ్బరము, నిద్ర యందు భ్రమ. స్వప్నం నందు నక్క,పిల్లి, ముంగీస, పాము , కోతి, ఎండిన గుంటలు, కాలిన మానులు , వీనిని చూచుట, తన దేహము నానా వర్ణములు గా కనిపించుట, ముక్కు విరిగినట్టుగా ఉండుట, కన్నులు గుంటలు పడుట ఈ లక్షణములు పెట్టుడు మందు వలన కలుగును. ఇవి కనిపించిన వెంటనే చికిత్స చేసిన బ్రతుకును. లేనిచో మరణం తప్పదు. 

 విషాన్న లక్షణము - 

 విషముతో కూడిన అన్నము తేలికగా నుండక దట్టముగా ఉండును.చిరకాలమునకు పక్వమగును. పక్వమైన అన్నము చద్ది అన్నము వలే ఉండును. అన్నం ఉడుకుతున్నప్పుడు దాని మీద ఆవిరి నెమలి కంట మ్ రంగు వలే ఉండును. ఆ అన్నం చూసినప్పుడు మొహము, మూర్చ , నోట నీళ్ళను కనిపించును. వర్ణము, వాసనయు హీనమగును. ఆవిరి యందు తళుకులు కలిగి ఉండును. 

 విషము కలిపిన కూరలు - 

 విషముతో కలిసిన కూరలు ఎండి నట్టు ఉండును. కాషాయ వర్ణం కలిగి రుచిహీనమై వేరొక వికారm చెందును. ఆ కూరల పైన నురుగు వలెను , సీమంత రేకల వలెను , బుగ్గల వలెను కనపడును. ఇలా ఉండిన కూరల యందు విషం కలిసినట్టు . 

 విషాన్న పరీక్ష - 

  విషముతో కూడిన అన్నమును అగ్నిలో వేసిన జ్వాల పుట్టాక ఉండును. పొగ , దుర్గంధం పుట్టును. ఆ అన్నం మీద ఈగలు వాలిన చచ్చును. కాకి చూచినా హీన స్వరముగా కూయును . నెమలికి మంద దృష్టి కలుగును . చిలుకలు, గోరువంకలు చూచిన మిక్కిలి కూయును . కొతి మలం జార్చుకోనును. కావుణ బుద్ధిమంతుడు అయిన వాడు పరీక్షించి తినవలెను. 

 

తామర హరించు సులభ యోగాలు -

తామర హరించు సులభ యోగాలు -

* మెట్టతామర ఆకు పసరు , ఉప్పు కలిపి నూరి రాసిన తామర వ్యాధి తొలగును .

* మెట్టతామర ఆకు పసరు , నిమ్మకాయ రసం కలిపి రాసిన తామర నశించును.

* బొప్పాయి కాయ పాలు గాని , చెట్టు పాలు గాని పూసిన తామర వ్యాధి తొలగును.

* నిమ్మరసం నందు మోదుగ విత్తనం అరగదీసి గంథం తీసి ఆ గంధాన్ని లేపనం చేసిన తామర హరించును .

* చింతగింజని నిమ్మరసం వేసి సాన మీద అరగదీసి ఆ గంధాన్ని తామర మీద లేపనం చేస్తున్న 7 రోజుల్లొ తామర తగ్గును.

* పొగాకు కాడలను కాల్చి ఆ భస్మమును కొబ్బరినూనెతో కలిపి రాయుచున్న తామర హరించును .

* చిక్కుడు ఆకులను నలగొట్టి రసం తీసి ఆ చిక్కటి రసమును తామర పైన రాయుచున్న తామర శీఘ్రముగా తగ్గును.

      తామర సమస్యతో బాధపడువారు చింతపండు పులుపు , చేపలు , కోడిమాంసం , కోడిగుడ్డు, మసాలా పదార్దాలు , అతిగా కారం పూర్తిగా తగ్గేంతవరకు తినకూడదు. 

40 రోజుల్లో గర్భాశయం పుండు హరించుటకు రహస్య యోగం - 

     కలబంద రసం , పాలు మరియు నీరు సమానంగా తీసుకుని కలిపి ఉదయం పరగడుపున సాయంత్రం ఆహారానికి 2 గంటల ముందు సేవిస్తున్నచో 40 రోజుల్లొ గర్భాశయం పుండు హరించును . కడుపులో పుండు అనగా అల్సర్ ని కూడా నివారించును.

          కాఫీ , టీ లు , మసాలా , కారం , పులుపు , పాత పచ్చళ్లు నిషిద్దం . 


Tuesday, December 10, 2024

త్వరగా మేలుకో మిత్రమా...*

*త్వరగా మేలుకో మిత్రమా...*

జాగరూకతో ఉండు... ప్రళయం విజృబిస్తుంది... తెలియకుండానే మింగేస్తుంది. ఇకనైనా మేలుకో మిత్రమా, సత్యాన్ని గ్రహించు.

పిట్టల్లా రాలి పోతున్న ప్రాణాలు, వయసు మీదపడక ముందే చెప్పలేని *రోగాలు*, *చిన్న వయసులోనే ఆకస్మిక గుండెపోట్లు*, టెక్నాలజీ ఇంత ఉన్నా జబ్బుని నయం చేయలేని మందులు, ఆసుపత్రులు... ఎందుకు ఇంత విపరీత ధోరణి, ఏమిటీ కారణం, ఒక్కసారి ఆలోచించండి.

*కలుషిత వాతావరణమా!*
*కలుషిత నీరా!*
*విషతుల్యమైన ఆహారమా!*
*దారి తప్పిన ఆలోచనలా!*

అవుననే చెప్పాలి, కానీ ఇవ్వన్నీ కొన్ని సంవత్సరాలుగా (అంటే ముఖ్యంగా 40 నుండి 60 సంవత్సరాల నుండి) కొద్ధి కొద్దిగా మార్పులు చెందుతూ (వికృత రూపం దాల్చుతూ) ఉన్నాయి. అప్పుడూ జబ్బులు, గుండెపోట్లూ ఉన్నాయి. కానీ కరోనా వచ్చిన తర్వాత, కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నపటి నుండి ఇమ్మ్యూనిటి పెరుగుతుంది అన్నారు, కానీ ఎందుకు ఒక్కసారి గుండెపోటుకే పోయేంత బలహీనమైన రోగ నిరోధక శక్తి ఆవహించింది. ఎందుకు ఇన్ని ప్రాణాలు కోల్పోతున్నాము, ఒక్కసారి ఆలోచించండి, పరిష్కారం ఏంటి?

జరిగిపోయిన దాన్ని తిరిగి తీసుకొని రాలేము, ఇప్పుడైనా మారుదాము.

1. ఎవరు ఏమి చెప్పినా దాన్ని *తెలుసుకునే* ప్రయత్నం చేయండి. అది డాక్టరైనా, శాస్త్రవేత్త అయినా, ప్రభుత్వ అధికారి అయినా గుడ్డిగా నమ్మకండి. నాకెందుకులే అనుకోకుండా *ప్రశ్నించే* (ఎందుకు, ఏమిటి, ఎలా) ధోరణి అలవాటు చేసుకోండి. సబ్జెక్ట్ మనది కాకపోయినా అవసరం మేరకు *శోధించి* తెలుసుకోండి. ప్రతీ దానికి నాకు తెలుసు అనుకొని వాదించకుండా (argument), చర్చ (discussion) రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేయండి.
2. సాధ్యమైనంత వరకు *బయట తినడం* ఆపేయండి.
3. బ్రాండ్ అనే ఆలోచన లేకుండా, వీలైనంత వరకు *ప్రకృతి సిద్ధమైన ఆహారం* తీసుకోండి.
4. తక్కువ డబ్బులకు దొరుకుతున్నాయి గా అని *కల్తీ ఆహార* వస్తువులను కొనకండి. *ఆర్గానిక్ షాపుల్లోనో*, లేదా నేరుగా *ప్రకృతి సేద్య రైతు* నుండి మాత్రమే ఆహారపు వస్తువులను కొనండి. మార్ట్ లల్లో తక్కువగా దొరుకుతాయి కదా అని ఎగపడకండి. డీ మార్ట్, రత్నదీప్ ఏ మార్ట్ అయినా కొనటం మానేయండి.
5. చికెన్, గుడ్లలో *ప్రోటీన్* ఉంది అని తెగ తినేయకండి, వీలైనంత వరకు మాంసాహరాన్ని మానేయండి. అవసరమైన ప్రోటీన్ సహజమైన *ఆహార గింజలలోనే* ఎక్కువగా ఉంది అనే నిజాన్ని తెలుసుకోండి. కూరగాయలనే (సాత్విక ఆహారాన్నే) ఎక్కువగా తీసుకోండి.
6. వీలైనంత వరకు *పండ్ల రసాలు, కూరగాయల రసాలను* ఇంట్లో తయారుచేసుకొని త్రాగండి.
7. *శారీరక వ్యాయామం* అని జిమ్ ల చుట్టూ తిరగకండి. వాకింగ్, జాగింగ్ సరిపోతుందిలే అనుకోకుండా, వెంటనే *యోగా* ను మొదలు పెట్టండి. కుదిరితే యోగ గురువును ఆశ్రయించండి. నాకు టైమ్ లేదు అనకుండా రోజూ కనీసం 20 నిమిషాలు అయినా *ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం* (మెడిటేషన్) క్రమం తప్పకుండా చేయండి.
8. *డబ్బు, అధికారం* మాత్రమే లోకం అనుకొని పరుగెత్తకుండా *ఆరోగ్యం*, మంచి జీవన విధానానికి ప్రాధాన్యతను ఇవ్వండి.
9. ఇల్లు కొనేటప్పుడు రాజీ పడము, వాహనం (టు వీలర్, ఫోర్ వీలర్) కొనేటప్పుడు రాజీ పడము, నగలు కొనేటప్పుడు రాజీ పడము, వేసుకునే బట్టలు కొనేటప్పుడు రాజీ పడము, చివరకు బయట విడిచే చెప్పులు, బూట్లు కొనేటప్పుడు కూడా రాజీ పడము. అలాంటిది *తినే ఆహారం* దగ్గర ఎందుకు రాజీ పడుతున్నాము. జంక్ ఫుడ్ అని తెలిసినా చాలా ఖరీదు పెట్టి మరీ కొని తింటాము. మంచి ఆహారం అనగానే ఇన్ని డబ్బులు పెట్టాలా, అది నిజంగా స్వచ్ఛమైన దేనా అని ఆలోచిస్తున్నాము. నీ పొట్టకు ఖర్చు పెట్టుకోవడానికే కక్కుర్తి పడుతున్నావు. ఇప్పటికైనా మారి *మంచి ఆహారానికి* మొదటి ప్రాధాన్యతను ఇవ్వు.
10. డబ్బు కన్నా *ఆరోగ్యం, ప్రశాంత మైన జీవనమే* ముఖ్యమని గుర్తెరుగు.
11. డబ్బు, ఆరోగ్య కార్డులు ఉన్నాయిగా అని, మంచి కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చిన్న చిన్నదానికే *ఆస్పటల్* చుట్టూ తిరగకండి. సాధ్యమైనంత వరకు *ఇంటి వైద్యం* చేసుకోండి. అవసరం అయితేనే ఆస్పిటల్ కు వెళ్ళండి. జబ్బు వచ్చాకే మార్పు అనుకోకుండా, ముందు జాగ్రత్తగా ఉండండి. (*Prevention is better than cure.*)
12. వీలైనంత వరకూ *ప్రకృతి* కి దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి.
13. రెస్టారెంట్లు, మాల్స్, పబ్ లు, తాగటానికి, ఆసుపత్రులకు, టైం పాస్ సీరియల్స్ కు టైం కేటాయించకుండా... పార్కులు, గుడులు గోపురాలు, ఫామిలీ గాధరింగ్స్, తీర్థ యాత్రలకు, విహార యాత్రలకు, నిజమైన స్నేహితులకు, మంచి పుస్తకానికి *మీ సమయాన్ని* కొంత కేటాయించండి.
14. *చెట్లను, మొక్కలను* పెంచుదాము, *ప్లాస్టిక్* వాడకాన్ని సాధ్యమైనంత వరకు నివారించుదాము.
15. ఇప్పటికైనా *భగవద్గీత* చదవడం మొదలు పెట్టండి. రామాయణం, భాగవతం, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలుగున్నవి చదవడం మొదలు పెట్టి మన *జీవన విధానం* గురించి తెలుసుకుందాం.
16. చెడు ఆలోచనలు రాకుండా, *మంచి జీవనం* కొరకు ఎప్పుడూ *భగవాన్ నామస్మరణ* చేస్తూ ఉండండి.

*ఆవు మాయమైపోతుంది. కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమైపోయింది, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై పోయాయి. బాంధవ్యాలు దూరమైపోతున్నాయి. ప్రకృతి వ్యవసాయం కనుమరుగైపోతుంది. గురువుకు గౌరవం లేకుండా పోతుంది. విద్య వైద్యం దారి తప్పినాయి. ఆహారం కలుషిత విషతుల్యమై పోయింది. బంధాల కన్నా, నైతిక విలువల కన్నా, ఆరోగ్యం కన్నా డబ్బే ప్రదానమై పోయింది. ఎక్కడ చూసినా మోసాలు, కుళ్లు, కుతంత్రాలు.*

*కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న రెస్టారెంట్లు, హోటల్స్, హాస్పిటల్స్, రోగాలతో కిక్కిరిసిపోతున్న జనాలు. పుట్టగొడుగుల్లా పెరిగి పోతున్న వైన్ షాపులు, పిచ్చి కుక్కల్లా ఎగబడుతున్న జనాలు. రోజు రోజుకు పెరిగిపోతున్న విడాకుల పత్రాలు, వింత పోకడలు. నార్మల్ కాన్పు ఒక విడ్డురం. పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న ఫెర్టిలిటీ సెంటర్లు, ఇప్పటి జనరేషన్ కి పిల్లలు కావడమే ఓ గగనం. చూడటానికి పుష్టిగా కనపడినా, ఒంట్లో సత్తువ లేదు. ఆడపిల్లల్లో అనూహ్య మార్పులు మూతిమీద మీసాలు, 14 సంవత్సరాల లోపే పుష్పవతి అవ్వడం, శరీర భాగాలు సరిగా పెరగక పోవడం, పెరుగుతే అతిగా పెరగడం. నెలసరి సరిగా రాకపోవడం... ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద పుస్తకమే రాయోచ్చేమో. టెక్నాలజీ పేరు చెప్పుకోవడమే కానీ కనీస వనరులని కాపాడుకోవడం తెలియదు. డబ్బు సంపాదించడం తెలుసు గానీ అనుభవించడం ఎలానో తెలియదు. రియల్ ఎస్టేట్ పెరిగిపోతోంది, వ్యవసాయ భూమి తరిగిపోతుంది.*

ఎటు పోతుంది **ఈ జీవితం*. వీటి మీద ఇప్పటికైనా *దృష్టి* పెడుదాము. మారుదాము. మన పూర్వీకులు చెప్పిన జీవన విధానం గురించి తెలుసుకొని ఆచరించుదాం. *మన ఆరోగ్యాన్ని, మన పరిసరాలను, ప్రకృతి ని కాపాడుకుందాము.*

Thursday, December 5, 2024

గోమాత యొక్క హోమియోపతి చికిత్స

గోమాత యొక్క హోమియోపతి చికిత్స
1. నక్స వామికా 200
   కొమ్ములతో కొట్టడం
2. లాక్సెస్ 1000
   కాళ్లతో కొట్టడం
3. ఇగ్నేషియా 200
   పిల్లవాడు చనిపోవడం
4. పీకాక్ 200
    స్థనాల నుండి రక్తం రావడం
5. సిపియా 200
   గర్భాశయం బయటకు రావడం
6. బెల్లాడోనా 200
   స్థనలలో (breast)వాపు 
7. లెడమ్ పాల్ 30
  పదునైన ముల్లు , మేకులు గుచ్చుకోవడం,
8. బోరెక్స్ 200
   పాద వ్యాధి మరియు నోటి వ్యాధి
9. మెర్క్ సాల్ 200
   నోటిలో ఉమ్మి రావడం
10. యూఫ్రాసియా 200
    రాత్రిపూట కంటి సమస్యలు, కంటి ఎరుపు
11. ఫెర్రమ్ ఫాస్ 200
    మూత్రంలో రక్తం, మంట
12. తుజా 200
    ఎక్కువగ వాపు వుండే మొటిమలు 
13. డల్కామారా 200
    ఇతర రకముల మొటిమలు 
14. సిపియా 200
    గర్భాశయం బయటకు రావడం
15. యుపేటోరియం పర్ 200
    గొంతు ఉబ్బరం, జ్వరం, వాపు 
16. కాలెండులా 200
    శరీరపు గాయం, దుర్వాసన
17. కార్బో వెజ్ 200
    మలబద్ధకం, గ్యాస్, పొట్ట ఉబ్బరం
18. ఆలొ 200
    డయేరియా, అతిసారం 
19. మెర్క్ సాల్ 200
   నెత్తుటి సన్నని పేడ
20. బ్రైయోనియా 200
    చలి, జలుబు, దగ్గు ఎక్కువ 
21. కాంతారిస్ 200
    అగ్నితో కాలిన గాయం
22. డయోస్కోరియా విలోసా 200
    కడుపు నొప్పి, రాపిడి ఉండడం 
23. రుస్టాక్స్ 200
    ఎముక విరగడం, బెనుకు, కుంటితనం రావడం 
24. ఇపికాక్ 200
    దగ్గు, శ్వాస సమస్యలు, వాంతులు
25. కాల్కేరియా ఫ్లోర్ 200
    ట్యూమర్, శరీరంలో గడ్డలు
26. ఇగ్నేషియా 200
    చర్మ వ్యాధులు, దురదలు 
27. కాస్టికమ్ 200
    మూత్ర వ్యాధి, తరచుగా రావడం 
28. ఆర్నికా 200
 స్కలనం తర్వాత తరచుగా మూత్రం విసర్జన 
29. సిన్నా 30
    పొట్ట లో పురుగులు 
30. పుల్సేటులా 200
    కంటీలో నుండి నీరు కారడం

Sunday, December 1, 2024

కషాయాలు,ద్రావణాలు

అందరికి నమస్కారం
ప్రకృతి వ్యాసాయ రైతులకు ఉపయోగపడే ఇన్పుట్స్,కషాయాలు,ద్రావణాలు సంబంధించిన YOU TUBE వీడియో లింక్ లు పెడుతున్నాను చూడండి
1 - pmds https://youtu.be/fpCZ25NZ7Fg
2 - ఘనజీవామృతం https://youtu.be/a_5DerUwzZo
3 - ద్రవజీవామృతం https://youtu.be/YbK-ih5WyUM
4 - బీజామృతం https://youtu.be/u_te0XzXhZ4
5 - నీమాస్త్రం https://youtu.be/3ZBC0C3gBTM
6 - వావిలాకు కషాయం https://youtu.be/XC2jbUezDoE
7 - పుల్లటి మజ్జిగ https://youtu.be/rOEmhJtidQM
8 - అగ్నాస్త్రం - https://youtu.be/Q6ZKGbl9xmU
9 - బ్రహ్మస్త్రం https://youtu.be/ZAMnsZCLI34
10 - తూటికాడ కషాయం https://youtu.be/fTQKkHCLpMk
11 - దశపర్ణి కషాయం https://youtu.be/JRwkOqOcglY
12 - వేపగింజల కషాయం https://youtu.be/rcykjclvY3g
13 - కోడిగుడ్లు నిమ్మరస ద్రావణం https://youtu.be/10An3mmVQcg
14 - మీనామృతం https://youtu.be/hRPE8GxghUg
15 - పంచగవ్య https://youtu.be/qYyUX2zP6aY
16 - సొంటి పాల కషాయం https://youtu.be/brnEKFY42Ic
17 - పేడ మూత్రం ఇంగువ ద్రావణం https://youtu.be/qBy1aj7znzg
పై వీడియో లు రైతులందరికీ ఉపయోగపడతాయి 
రైతులకు షేర్ చేయండి

         🙏🙏🙏

🐞🌱🌱🌱🌱🌱🌱🌱🌱🐞

దేవాలయాలు

*సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:* 
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా.

*నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:* 
1. మహానంది
2. జంబుకేశ్వర్ 
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్ 
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా

*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.* 
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  
3. మంజునాథ్.
*శ్వాస తీసుకునే* కాళహస్తీశ్వర్
*సముద్రమే వెనక్కివెళ్లే* 
1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 
2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.
*స్త్రీవలె నెలసరి* అయ్యే 
1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  
2. కేరళ దుర్గామాత.
*రంగులు మారే ఆలయం.* 
1. ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు* 
 1. కాణిపాకం,  
2. యాగంటి బసవన్న,  
3. కాశీ తిలభండేశ్వర్,  
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి

*స్వయంభువుగా* 
సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.
*ఆరునెలలకు ఒకసారి తెరిచే* 
1. బదరీనాథ్,  
2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
3. గుహ్యకాళీమందిరం. 

*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు* 
హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

*12 ఏళ్లకు ఒకసారి*
పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.

*స్వయంగా ప్రసాదం* 
1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం

*ఒంటి స్తంభంతో*
యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

*రూపాలు మారే*
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.

*నీటితో దీపం వెలిగించే* ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.
*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు* 
1. హేమాచల నరసింహ స్వామి.
2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

*మనిషి వలె గుటకలు*  
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.

*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.* 

*ఛాయా విశేషం* 
1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
3. బృహదీశ్వరాలయం

*నీటిలో తేలే* విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ), నేపాల్

*ఇంకా...* 
తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్, కంచి, 
చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం, అన్నవరం etc

*పూరీ* 
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం.

ఇవి తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. * 
హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ 
హరే హరే.    
🙏🕉