Friday, December 27, 2024

ఉబ్బసం నివారణా యోగాలు -

ఉబ్బసం నివారణా యోగాలు -

 * ఉబ్బసం ఉధృతంగా ఉండి శ్వాస ఆడనప్పుడు వాము గింజలను వేడిచేసి గుడ్డలో కట్టి ఛాతిపైన , గొంతుకకు కాపడం పెడితే నొప్పి శ్వాస సులువుగా ఆడుతుంది.

 * వస కొమ్ము చూర్ణం ఉబ్బసం ఎక్కువుగా ఉన్నప్పుడు ప్రతి మూడు గంటలకి ఒకసారి ఉసిరిగింజంత నీటిలో కలిపి తాగాలి.ఇలా రెండు లేక మూడు మోతాదులలో తేలిక అగును.

 * మారేడు ఆకుల రసం అరచెంచా , తేనె అరచెంచా కలిపి ఉదయం , సాయంత్రం రెండుపూటలా తీసుకోవాలి . 40 రోజులు క్రమం తప్పకుండా వాడుకోవాలి. తగ్గకుంటే మరొక్క 40 రోజులు వాడండి. తప్పక తగ్గును.

 * పూటకొక యాలుక్కాయ తినినచో ఉబ్బసం తగ్గును.

 * ఎండు జిల్లేడు ఆకుల పొగని తరుచూ పీల్చుచుండిన ఉబ్బస రోగం నివారణ అగును.

 * ప్రతినిత్యం ఒక పచ్చి కాకరకాయని తింటున్న పోతుంది. రోజురోజుకు మార్పు కనిపించును. తగ్గేంత వరకు వాడవలెను.

 * ప్రతి నిత్యం ఉదయం , సాయంత్రం కప్పు పాలలో నాలుగు వెల్లుల్లి రేకలు చితగ్గొట్టి వేసి పొయ్యి పైన మరిగించి ఆ పాలను తాగుచున్న ఉబ్బసం హరించును .

 * ఉబ్బసం ఎక్కువుగా ఉండి కఫం పట్టేసి ఉన్నచో కుప్పింటాకు రసాన్ని మూడు చెంచాలు లొపలికి తీసుకొనుచున్న కఫం కరిగి బయటకి వచ్చును.

 * అల్లం రసం , తేనె సమభాగాలుగా కలిపి మూడు గంటలకి ఒకసారి చెంచా చొప్పున తీసుకొనుచున్న ఉబ్బస ఉధృతి తగ్గును.

 * ఉత్తరేణి చెట్టుకు సమూలంగా తీసుకుని నీడన ఎండించి భస్మం చేయవలెను . ఆ భస్మమును మూడు పూటలా కందిగింజ అంత తేనెతో కలిపి లోపలికి తీసుకొనిన ఉబ్బసం తగ్గును . ఇది తిరుగులేని యోగం . 

శరీరంపైన లేచే వ్రణాలను హరించు యోగాలు -

   శరీరంలోని కొన్ని భాగాలలో ఎత్తుగా , గట్టిగా గడ్డలు ఏర్పడును . ఈ గడ్డల వలన పోటు , విపరీతమైన నొప్పి ఉండును. కొన్ని మెత్తగా ఉండి పోటు , సలుపు కలిగి ఉండును. వ్రణాలు లొపల చీము మరియు నెత్తురుతో కూడుకుని ఉండును. పక్వానికి వచ్చి పగిలిన తరువాత లొపల ఉన్న చెడు బయటకి వెళ్లడం వలన నొప్పి మరియు పోటు ఉపశమించును.

 

No comments:

Post a Comment