*_చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు కూడా చక్కని సంగీతానికి, మధుర స్తుతులకు, బుజ్జగించే మాటలకు తలలూపుతూ అనుకూలంగా వ్యవహరిస్తాయని మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెబుతారు._*
*_కాబట్టి, కలలోనైనా చెడు మాట నోటినుంచి వెలువడరాదు. "ప్రాణం పోయినా సరే చెడుమాటను మాత్రం ఎన్నడూ పలకను " అని తమ జీవితాన్నే ధారపోసిన పూర్వపురుషులెందరో ఉన్నారు._*
*_వారి మాట పూలబాట. ప్రియభాషణం వల్లనే రాముడు ఆదర్శ మానవోత్తముడైనాడు. ప్రియభాషణంతోనే మహర్షులు గర్వాంధులైన రాజులకు కనువిప్పు కలిగించారు._*
*_నేటి కాలంలో ధనం కోసం, అధికారం కోసం, ఆధిపత్యం కోసం, అక్రమార్జనల కోసం, అనుచిత సుఖాల కోసం, దుర్వ్యసనాల కోసం..._*
*_మనుషులు తోటివారిని మాటలతో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఉద్వేగకర వ్యాఖ్యల కారణంగా ఎందరో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొంటున్నారు._*
*_మనిషిలో ఆత్మవిమర్శ కలగాలి. ఒక్కమాట కూడా రెచ్చగొట్టకుండా ఉండే విధంగా సంయమనాన్ని పాటించాలి. అదే మనిషి ఉన్నత వ్యక్తిత్వానికి దర్పణం._*
*_ఆదర్శం పై మనకున్న ప్రేమకు నిదర్శనం మనం చేసే సేవలో కనిపిస్తుంది._*
*_ఆనందమయ జీవితమంటే తాను ఆనందంగా ఉండటమే కాక ఆ ఆనందాన్ని ఇతరులకు కూడా పంచి ఇవ్వడం._*
*_అందువలన ఆనందాన్ని పొందేందుకు తిరిగి పంచేందుకు మనలను మనం సిద్ధం చేసుకోవాలి._*
*_అందుకున్న ఆనందాన్ని మనలో నిలుపుకుంటూ దానిని నలుగురికి పంచగలగాలి._*
*_దీనిని ప్రేమతోనూ, సేవాభావంతోనూ చేయాలి. ప్రతిఫలంగా ఏదీ ఆశించక భగవదర్పణ భావంతో మెలగాలి._*
*_స్వార్థభావంతో ఉంటే దుఃఖం ఏదో రూపేణా వెన్నాడుతూనే ఉంటుంది. ఈ దుఃఖానికి, అసంతృప్తికి ఏవో కారణాలని పేర్కొనవచ్చు._*
*_కానీ, మూలం స్వార్థ బీజమే అయి ఉంటుంది. మనలోని స్వార్థపుటాలోచనలకు స్వస్తి పలకాలంటే దానికి మార్గం నిస్వార్థ భక్తి, పవిత్రతలే అని గ్రహించాలి._*
*_‘నేను’ ‘నాది’ అనేవి నశించినప్పుడు ఇంక అప్పుడు ఎల్లలు ఉండవు.☝️_*
No comments:
Post a Comment