Thursday, October 16, 2025

తొమ్మిది రకాల ముక్తి మార్గాలు*

*తొమ్మిది రకాల ముక్తి మార్గాలు*
             ➖➖➖



1. *శ్రవణం*( వినడం ) భక్తి చేత పరిక్షిత్ మహరాజు తరించాడు.

2. *కీర్తనం*( పాడడం ) చేత నారద మహర్షి, అన్నమయ్య, త్యాగరాజు తరించారు.

3. *స్మరణం* ( నోటితో ఎల్లప్పుడు పలకడం ) చేత ప్రహ్లాదుడు తరించాడు.

4. *పాదసేవనం* తో, లక్ష్మీదేవి, లక్ష్మణుడు తరించాడు.

5. *అర్చనం* తో పృధు చక్రవర్తి తరించాడు.

6. *వందనం* చేత అక్రూరుడు తరించాడు.

7. *దాస్య భక్తి* (సేవ )చేత గరుత్మంతుడు, హనుమంతుడు తరించాడు.

8. *సఖ్యం* భక్తి చేత అర్జునుడు, కుచేలుడు తరించారు.

9. *ఆత్మనివేదనం* తో బలిచక్రవర్తి తరించారు.


మనిషి మహనీయుడు కావాలంటే ఈ క్రింది లక్షణాలు కలిగి ఉండాలి.

జీవితంలో దైవనామాన్ని నిరంతరం 
స్మరిస్తూ తరించు.

జీవితంలో నీ అంతరాత్మకు లోబడి జీవించి తరించు.

జీవితంలో శాస్త్రం ను అనుసరించి జీవించి తరించు.

తత్వ విచారణ చేసి జీవించి తరించు.

యోగ మార్గంలో ఆత్మ విచారణ చేసి జన్మ రాహిత్యం చేసుకొని తరించు.

పూజ పారమార్దం:- పూజ అర్చన జపం.

*స్తోత్రం. ధ్యానం. దీక్ష. అభిషేకం. మంత్రం. ఆసనం. తర్పణం. గంధం. అక్షితలు. పుష్పం. ధూపం. దీపం. నైవేద్యం. ఆచమనీయం. అవాహనం. స్వాగతం. పాద్యం మధుపర్కం. స్నానం. వందనం. ఉద్వాసన.... పూజ-పరమార్థాలు:*


పూజ అనగా పూర్వజన్మ వాసనలను తొలగింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణ ఫలాన్నిచ్చేది.

అర్చన అనగా అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది. దేవతలను సంతోషపెట్టేది.

జపం అనగా అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పర దేవతను సాక్షాత్కరింప చేసేది జపం.

స్తోత్రం అనగా మెల్లమెల్లగా మనస్సునకు ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.

ధ్యానం అనగా ఇంద్రియ నిగ్రహాన్ని మనస్సుతో నియంత్రింప చేసేది, ఇష్ట దేవతను తపింపచేసేది ధ్యానం.

దీక్ష అనగా దివ్య భావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.

అభిషేకం అనగా అహం భావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాన్ని కల్గించేది.

మంత్రం అనగా మననం చేసేవారిని కాపాడేదే మంత్రం అని అంటారు. మంత్ర తత్త్వం వల్ల భయాలు తొలగిపోతాయి. నిరంతర మననం ధ్యానం వల్ల మనసు చంచలత తొలగి, మనిషిని తిరిగి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది.

No comments:

Post a Comment