* తెలుపు గల వస్త్రములు ధరించుట చేత చలువ చేయును . దాహమును అణుచును. వాంతి, కడుపు ఉబ్బు, భ్రమ , మూర్ఛ, క్షయ మొదలగు రోగములను హరించును . శరీరకాంతిని ఇచ్చును.
* ఎరుపురంగు వస్త్రధారణ వలన శరీరం నందు ఉష్ణము , జఠరశక్తి పెరుగును.పిత్తము, శ్లేష్మము, వాతము, అజీర్ణం , వాంతి , నశింపచేయును.
* నలుపురంగు వస్త్రధారణ వలన పిత్తము, విషజ్వరము, అగ్నిమాంద్యం , కాసరోగం, దుస్వప్నాలు నశించును. బలమును ఇచ్చును. మలమూత్ర బంధనం చేయును .స్వప్నస్కలనం హరించును .
* లక్క ఛాయ పట్టుతో చేసిన శాలువ ధరించటం వలన వాతశ్లేష్మములు హరించును . ఇది శరత్కాలమున ధరించిన సుఖముగా ఉండును.
* నారపట్టు వస్త్రధారణ వలన వీర్యమునకు వేడి కలుగును.మిక్కిలి పరిశుద్ధముగా ఉండును. వాతతాపములను హరించును . ఇది హేమంత , శిశిర ఋతువుల యందు ధరించటం చాలా మంచిది .
* కాషాయ వస్త్రధారణ వలన పిత్తమును పోగొట్టుటయే కాక బుద్ధిని వికసింపచేయును. గ్రీష్మ , శరదృతువుల యందు వస్త్రధారణ హితకరంగా ఉండును.
* తెలుపు పట్టు వస్త్రములు ధరించటం మృదువుగా ఉండును. వర్షాకాలం నందు ధరించుట చాలా మంచిది . సమస్త దోషములను హరించి వేయును.
* పసుపు పట్టు వస్త్రములను ధరించటం వలన శ్లేష్మము, ఆశీతవాతములను హరించుటయే కాక ఉష్ణకారిగా ఉండి అశుభములను పొగొట్టును.హేమంత , శిశిర ఋతువుల యందు ఈ వస్త్రమును ధరించటం చాలా మంచిది .
* వన్నె వస్త్రములు కఫవాతములను హరించును . మనోహరమైనవి . శీతపిత్తములను పొగొట్టుటయే కాక బలమును , మేధస్సును వృద్దిచేయును . వాత, తాపము, రజస్సులను హరించును . కాంతిని, సంతోషాన్ని, శరీరపుష్టిని కలుగచేయును .
* పన్నీరు,పచ్చకర్పూరం , కస్తూరి వంటి పరిమళయుక్తమైన ఎరుపు రంగు పట్టు వస్త్రధారణ వలన సమస్త గ్రహపీడలు హరించుటయే కాక చికిత్సా దేవపూజల యందు ధరించిన ఇష్టసిద్ధి కలుగచేయును. ఎరుపురంగు కఫవాత శీతబాధను తొలగించుటయే కాక శశిరఋతువు నందు హితకారిగా ఉండును.
ధరించకూడని వస్త్రములు -
మురికి వస్త్రములు , వేరొకరు ధరించినవి , స్త్రీలు దరించినవి, చినిగిపోయినవి, ఎలుక కోరికినవి , కాలిన వస్త్రములు ధరించకూడదు.
తడిగుడ్డ కట్టుకొనరాదు. తడిబట్ట ధరించటం దిగంబరత్వంతో సమానం. మరియు రోగప్రదం కావున తడిబట్ట ధరించరాదు.
.
No comments:
Post a Comment