Sunday, November 10, 2024

ఉసిరికాయ గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

ఉసిరికాయ గురించి సంపూర్ణ వివరణ  - ఉపయోగాలు .

  ఉసిరికాయను సంస్కృతంలో ఆమలకి , శ్రీఫలా , ధాత్రికా , అమృతా అని అంటారు. 

       ఉసిరిచెట్టు పెద్ద వృక్షం , ఆకులు సన్నగా చింతాకు వలే ఉండును. పువ్వులు సన్నగా కాడల వెంట పచ్చగా పూయును. కాయలు గుండ్రముగా సన్నని ఆరురేఖలు కలిగి ఉండును. ఈ కాయలు ఫాల్గుణ మాసాంతం మొదలు పండుట ఆరంభించును. చైత్రమాసంలో పండి పరిపూర్ణంగా ఉండును. అప్పుడు తెచ్చి ఎండించి దాచి సంవత్సరం వాడవచ్చు . కాయపైన బెరడు ఔషధాల్లో ఉపయోగిస్తారు . ఇవి సర్వత్రా తోటల్లో అరణ్యాలలో ఉండును.

  ఉసిరికాయ ఉపయోగాలు  -

* ఉసిరికాయ వగరుగా, పులుపుగా , మధురంగా ఉండును. శీతలతత్వం కలిగి ఉండును.

* ఉసిరికాయ ఆయువు మరియు ఆరోగ్యాలను ఇచ్చును.

* శరీరంలోని వేడిని , వాంతిని , ప్రమేహాన్ని , నంజును హరించును .

* కఫాన్ని హరించును . రుచికరంగా ఉండును.

* రక్తములో దోషాన్ని హరించును . శరీర శ్రమని పోగొట్టును .

* మలబద్ధకాన్ని పోగొట్టును .  కడుపుబ్బరాన్ని తగ్గించును . అమృతంతో సమానం అయినది.

* ఉసిరికాయ కరక్కాయతో సమానమైన గుణం కలిగినది . రక్తపిత్త రోగాన్ని పోగొట్టును .

* ధాతువృద్ధిని కలిగించును. వాతం, పిత్తం, కఫం మూడింటిని హరించును . త్రిదోష హరమైనది.

* వెంట్రుకలకు మేలు చేయును . మంచి విరేచనకారి.

* నోరు అరుచి రోగమును పోగొట్టును . తొందరగా ముసలితనం రానివ్వదు.

* శరీరంలోని విషపదార్ధాలను హరించును . జ్వరాన్ని తగ్గించును .

* ఎండించిన ఉసిరికాయలను తీసుకొవడం వలన విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోనును.

* నేత్ర సంబంధ సమస్యలు ఉన్నవారు ఎండించిన ఉసిరికాయలు తీసుకోవడం వలన చాలా మంచి మేలు జరుగును.

* ఎండించిన ఉసిరికాయలను అరగదీసి శరీరముకు గంధం వలే పూయుట వలన శరీరం యొక్క కాంతి పెరుగును .

* శరీరము నందు కొవ్వు ఉన్న సమస్యతో ఇబ్బంది పడువారు ఎండించి ఉసిరికాయలను సేవించుట వలన కొవ్వు కరుగును.

* ఉసిరికాయలు నుంచి తీసిన ద్రవము త్రిదోషములను , రక్తదోషమును , పిత్తమును , మోహమును నాశనం చేయును .

* ఉసిరికాయ పచ్చడి అన్నం మొదటిముద్దలో తినడం వలన జీర్ణరసాలు సరిగ్గా ఊరతాయి.

* ముత్ర విసర్జన సమయంలో మంట , నొప్పి ఉంటే ఉసిరి కషాయం బెల్లంతో కలిపి తీసుకుంటే మంచి ఉపశనం ఉంటుంది.

* రాచ (పెద్ద ) ఉసిరి గింజలను బూడిదగా మార్చి కొబ్బరినూనెలో కలిపి చిక్కగా చేసి రాస్తుంటే శరీరం పైన వచ్చు చిడుము నివారణ అగును.

* ఉసిరికాయల కషాయం అరకప్పు తాగుతుంటే జ్వరం తగ్గును.

* ఆవనూనెలో రాచ ఉసిరికాయలు వేసి ఉసిరికాయలు మునిగేంత వరకు నూనె పోసి వారం రోజులు నానబెట్టి పైన తేరుకున్న నూనెని తలకు రాయుచున్న తలతిప్పు రోగం నయం అగును.

* ఉసిరికలో "సి" విటమిన్ పుష్కలంగా ఉంది. కావున "సి" విటమిన్ లోపం వలన వచ్చు వ్యాధులకు అద్భుత ఔషధం .

* "స్కర్వి" అనే ఈ వ్యాధిలో ఉసిరి అత్యద్భుత ఔషధం . ఈ వ్యాధి సముద్రప్రయాణం ఎక్కువుగా చేసే వారికి వచ్చును.

* ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఉసిరికాయలు తినుచున్నచో ఎక్కిళ్లు వెంటనే తగ్గును.

* ఉసిరికాయల రసంలో పసుపుకొమ్ము చూర్ణం కలిపి కుంకుడు గింజ అంత మాత్రలు చేసి ఉదయం , సాయంత్రం రెండు పూటలా తీసుకుంటూ చప్పిడి పథ్యం పాటిస్తే కామెర్ల వ్యాధిని తగ్గును.

* పేగుల్లో పురుగులు ఉన్నప్పుడు పెద్ద ఉసిరికాయలు తింటూ ఉంటే కడుపులో పురుగులు నశించును.

* పెద్ద ఉసిరికాయలను ఎండబెట్టి చూర్ణం చేసి దానికి సమానంగా పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం , సాయంత్రం రెండుపూటలా అరచెంచా చొప్పున తీసుకుంటూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది.

* కళ్లు ఎరుపెక్కి మంట పుడుతుంటే ఎండిన పెద్ద ఉసిరికాయలను గ్లాసెడు మంచినీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన ఆ నీటితో కంటిని కడుగుచున్న కంటి ఎరుపు తగ్గును.

* ఉసిరికాయల రసం తీసి అందులో కొంచం పంచదార కలిపి చేతి వ్రేలితో యోని రంధ్రంలో ఆ రసం వ్రాస్తే యోనిమంట తగ్గును.

              ఉసిరికాయలు దొరికినప్పుడు వాటిని ముక్కలుగా కోసి ఎండించి దాచుకొనవలెను. ఉసిరికాయలు దొరకనప్పుడు వాటిని వాడుకోవచ్చు . అలా ఎండిన వాటిని "ఉసిరిక వొరుగు " అని పిలుస్తారు . 



Friday, November 8, 2024

లివర్ క్లీనింగ్

లివర్ క్లీనింగ్ 

కావాల్సిన పదార్థాలు : ఎప్సం సాల్ట్ 40  grams ( not coloured or scented, it must be colour less) , ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్  5oo ఎం ఎల్ ,పండ్ల రసం (నారింజ , మోసంబి , పైన్ ఆపిల్ ). 

మొదటి రోజు: 
ఉదయం కేవలం పళ్ళ రసం, పండ్లు 
మధ్యాహ్నం కేవలం బాసుమతి రైస్ తో, నూనె లేకుండా వండిన కూరగాయల కూర తో లేదా కూరగాయల రసం తో భోజనం . నూనె అసలు వాడరాదు . 

సాయంత్రం : 6  గంటలకు 1st dose Epsom సాల్ట్ 20 grams +1  గ్లాస్ వాటర్ 
                   8 PM 2nd dose Epsom salt same again
                   10 గంటలకు 175 ml ఆలివ్ ఆయిల్ +175 పండ్ల రసం తాగి కుడి వైపు తిరిగి పడుకోవాలి.  దిండువాడాలి .

2  వ రోజు 

6 am 20 grams 3rd dose ఎప్సం సాల్ట్ 1  గ్లాస్ నీటి తో  
8 am 75  ml ఆయిల్ +75ml జ్యూస్  తాగి కుడి వైపు తిరిగి పడుకోవాలి.  దిండువాడాలి 

10  am 20 gms  4 dose ఎప్సం సాల్ట్ 

చేయ కూడనివి :

బీపీ మందులు వాడరాదు 
వంటలో నూనె వాడరాదు 
ఏ ఇతర పదార్థాలు తినరాదు

Liver Cleansing

Ingredients: Epsom salt 40 grams, extra virgin olive oil 500 ml, fruit juice (orange, mosambi, pine apple).

First day:
In the morning just juice and fruits
Afternoon meal with basmati rice only, vegetable curry cooked without oil or vegetable juice. Oil should not be used.

Evening: Epsom salt 20 grams + 1 glass of water at 6 o'clock
                    8  PM 20 gms  Epsom salt with water. 
                    Drink 175 ml olive oil + 175 fruit juice at 10 am and sleep on right side. Pillow should be used.

2nd day

6 am 20 grams epsom salt with 1 glass of water
8 am Drink 75ml oil +75ml juice and lie on right side. Use a pillow

10 am 20 gms epsom salt
Don'ts:
BP drugs should not be used
Do not use oil in cooking
Do not eat any other ingredients

Monday, November 4, 2024

𝗦𝗲𝗰𝗿𝗲𝘁 𝗼𝗳 𝗛𝗮𝗽𝗽𝗶𝗻𝗲𝘀𝘀....*

*𝗦𝗲𝗰𝗿𝗲𝘁 𝗼𝗳 𝗛𝗮𝗽𝗽𝗶𝗻𝗲𝘀𝘀....*


*ఈమధ్య ప్రతిరోజూ ఉదయాన్నే ఇంట్లో నేను మా ఆవిడ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగటం అలవాటు గా మారింది.*

*మొన్నామధ్య ఉదయాన్నే నేను పేపర్ చదువుకుంటూన్నప్పుడు కాఫీ కలుపుకుని వచ్చి ఓ కప్పు నాకందిస్తూ నా పక్కన కూర్చొంది మా ఆవిడ.*

*"ఏమిటోనండి ! జీవితం ఆనందంగా లేదు"అంది.*

*ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను. ఆమెకు ఏమి లోటు ఉంది ?*

*"ఎందుకు అలా అనిపిస్తోంది?" అని అడిగాను.*

*"అందరూ అంటారు నాకు అన్నీ ఉన్నాయి అని.. కానీ నాకు ఎందుకో సంతోషంగా మాత్రం లేదు" ఆమె జవాబు.* 

*అదే ప్రశ్న నాకు నేను వేసుకుంటే నా జవాబు కూడా అలాగే అనిపిస్తోంది.*

*ఆలోచిస్తే కారణం ఏమీ కనిపించడం లేదుకానీ నేను కూడా సంతోషంగా లేను.*

*వెతకడం మొదలుపెట్టాను. ఎందరినో అడిగాను. సమాధానాలు తృప్తిని కలిగించలేదు.* 

*చివరికి ఒక ఎండోక్రినాలోజిస్ట్ డాక్టరు మితృడు  చెప్పిన సమాధానం నా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చింది.*

*ప్రపంచం లో అత్యంత ఆనందకరమైన వ్యక్తులయ్యేందుకు అవి మీతో పంచుకుందా మనిపించింది.*

_*మీ కోసం ఆ వివరాలు :*_

*మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు.*

*1. ఎండార్ఫిన్స్.. Endorphins,*
*2. డోపామిన్.. Dopamine,*
*3. సెరిటోనిన్.. Serotonin,*
*4. ఆక్సిటోసిన్.. Oxytocin.*

*ఈ నాలుగు హార్మోనుల గురించి మనం తెలుసుకుంటే మనం సంతోషంగా ఉండడం ఎలాగో తెలుస్తుంది.*

*ఇవి మనలో ఉంటే మనం సంతోషంగా ఉండగలం.* 

*1.Endorphins: మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఈ Endorphins మన శరీరం లో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి.*

*మనం మన వ్యాయామాన్ని ఎంజాయ్ చెయ్యగలుగుతాము. అందుకు కారణం ఈ Endorphins.*

*నవ్వడం వలన కూడా ఈ Endorphins ఎక్కువగా విడుదల అవుతాయి. అందుకే యోగా లో హాస్యాసనం కూడా ఒక ఆసనం గా మన పూర్వీకులు నిర్ధారించారు. చివరిగా నవ్వడం అనే ప్రక్రియను నిర్వచిస్తారు.*

*"నవ్వడం ఒక భోగం - నవ్వలేకపోవడం ఒక రోగం" అన్నారు జంధ్యాల.*

*ప్రతిరోజూ 30 నిముషాల వ్యాయామం చేస్తూ, చక్కటి హాస్య భరిత జోకులు చదువుతూ, కామెడీ వీడియోలు లు చూస్తూ ఉండండి.*

*2. Dopamine: నిత్య జీవితం లో ఎన్నో చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో మనలో Dopamine హార్మోను ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెంచుకోవడం వలన మనం ఆనందం గా ఉంటాము.*

*భర్త ను విమర్శించకుండా, ఎందుకు అని ప్రశ్నించి, అర్థం చేసుకొని, పొగడటం / ఇంట్లో చేసిన వంటను మెచ్చుకోవడం వలన మీ ఆవిడలో డోపామిన్ స్థాయిని మీరు పెంచగలరు.*

*ఆఫీస్ లో మీ పని మెచ్చుకుంటే మీ డోపామిన్ స్థాయి పెరుగుతుంది.*

*అలాగే కొత్త మోటార్ సైకిల్ కొన్నప్పుడు, కొత్త చీర కొనుక్కున్నప్పుడు , కొత్త నగ చేయించినప్పుడు, షాపింగ్ కి వెళ్ళినపుడు మీకు ఆనందం కలగడానికి కారణం ఈ Dopamine విడుదల కావడం.* 

*కాబట్టి మమిత్రులారా...*

*షాపింగ్ బడ్జెట్ పెంచండి.*

*లేదా..!*

*పొగడడం నేర్చుకోండి. పైసా ఖర్చు లేదు కదా..!* 

*3. Serotonin: ఇతరులకు సహాయం చేసినపుడు, వారికి మేలు చేసినపుడు ఈ సెరిటోనిన్ విడుదల అవుతుంది.*

*మనం స్నేహితులకు , సమాజానికి మేలు చేకూర్చే ఏదైనా మంచి పని చేసినపుడు మనలో విడుదల అయ్యే ఈ Serotonin ఎక్కవగా విడుదల అవుతుంది.*

_*ఇందుకు మనం ఏమేమి పనులు చెయ్యవచ్చు ?*_

*1. స్నేహితుల ఇళ్ళకు వెడుతూ ఉండడం.*

*(వాళ్లకి ఆనందం కలగడం కోసం ... ఏమేమి కొత్తవి కొనుక్కున్నారో ఎంక్వయిరీ కోసం కాదు సుమా)*

*2. మొక్కలు నాటడం..*

*3. రోడ్ల గుంతలు పూడ్చడం..*

*4. రక్త దానం..*

*5. అనాధ ప్రేత సంస్కారం..*

*6. అనాధలకు సేవ..*

*7. యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాల నిర్వహణ.*

*8. మంచివిషయాలు పేస్ బుక్ లో బ్లాగ్స్ లో పోస్ట్ చెయ్యడం.*

*ఇవి అన్నీచేయ్యడం లో మన మన సమయాన్ని మన జ్ఞానాన్ని పంచుతున్నాము కనుక మనలో సెరిటోనిన్ విడుదల అవుతుంది.*

*4. Oxytocin: ఇది నిత్య జీవితం లో మనం పెళ్లి అయిన కొత్తలో బాగా విడుదల అయ్యే హార్మోను. ఎవరిని అయినా మనం దగ్గరకు తీసుకునేటప్పుడు మనలో విడుదల అయ్యే హార్మోను. ఎదుటివారిలో కూడా విడుదల అవుతుంది.*

*స్నేహితులను ఆలింగనం చేసుకోవడం వలన ఇది విడుదల అవుతుంది*
*మున్నా భాయ్ లో " జాదూ కి జప్పీ" లాగ..!*

*అలాగే కరచాలనం, (Covid తగ్గిన తర్వాత)*

*సినిమా యాక్టర్ ని, రాజకీయ నాయకుడిని కరచాలనం చేస్తే మనం పొంగిపోయేది అందుకే..!*

*గుర్తుకు తెచ్చుకోండి... మీ మొదటి స్పర్శను మీ బిడ్డను, మీ జీవిత భాగస్వామిని మొదటి సారిగా కౌగలించుకున్న మొదటి క్షణాలు.*

*ఇప్పటికీ మరపు రావు తలచుకున్న వెంటనే ఎంతో ఆనందం కలుగుతుంది*

*అలాగే మీ పిల్లలను దగ్గరకు తీసుకున్నప్పుడు కూడా..!* 

*అందుచేత..*

*మన ఆనందం కోసం ప్రతిరోజూ ఇలా చెయ్యడం అలవాటు చేసుకుందాము.*

*1. Endorphins కోసం రోజులో ఒక అరగంట నుండి గంట వరకూ కేటాయించి వ్యాయామం చేద్దాము.*

*2. Dopamine కోసం చిన్న చిన్న లక్ష్యాలను సాధించి మనలను మనం పొగుడుకుంటూ Dopamine పెంచుకుందాము.*

_*మగవారికి ప్రత్యేకం.*_

*1. వంటను రోజూ మెచ్చుకోండి.*
*2. డ్రెస్ మెచ్చుకోండి.*
*3. మేకప్ మెచ్చుకోండి.* 

_*ఆడవారికి ప్రత్యేకం.*_

*1. గుర్రు పెట్టారని తిట్టకండి.*

*2. కూరలు తేలేదని చిరాకు పడకండి. కంది పచ్చడి, టొమోటో కూర చేసి పెట్టండి. సాంబార్ చెయ్యండి.*

*3. మీ ఆయన్ను పొగడడం వలన మీకే లాభం అని గుర్తు పెట్టుకోండి.* 

*Serotonin కోసం మంచిపనులు చెయ్యడం నేర్చుకోండి. రోజుకు ఒక పది రూపాయలు ఇతరులకు ఖర్చు పెట్టండి గుడిలోదక్షిణ గానో, గుడి బయట బిచ్చగాళ్ళకు దానం గానో ఇవ్వండి.* 

*ఏడాదికి ఒక మొక్కను నాటండి.* 

*ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలకో , సమాజ హితానికి జరిగే పనికో కొంచెం సొమ్ము ఇవ్వండి . అలాంటి పనులలో పాల్గొనండి.* 

*పైన అటువంటి వారి ఉదాహరణలు కొన్ని ఇచ్చాను కదా వారి కార్యక్రమాలను ఫాలో కండి.* 

4. *ఆక్సిటోసిన్ కోసం మీ భార్య/ భర్త ను హగ్ చేసుకుంటూ ఉండండి. పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు హగ్ చేసుకుంటే వారికి సాంత్వన ఎందుకు కలుగుతుందో అర్ధం అయ్యింది కదా..!*

*అలాగే ఇంట్లోవాళ్ళని , స్నేహితులను కూడా హగ్ చేసుకునే అలవాటు చేసుకోండి.*

*ఇందులో ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితులు తెచ్చుకోకండి.* 

*పిల్లలను హ్యాపీ గా ఉంచడం కోసం.* 

*1. గ్రౌండ్ కి వెళ్లి ఆడుకోనివ్వండి*
*-Endorphins.*

*2. వాళ్ళు సాధించిన దానికి పొగడండి* 
*-Dopamine.*

*3. పంచుకునే తత్వాన్ని అలవాటు చెయ్యండి* 
*-Serotonin.*

*4. దగ్గరకు తీసుకోండి* 
*-Oxytocin.*

*Have a Happy Life.*
😊😊😊
*ఓ మిత్రమా మీ జీవితం ఎల్లప్పుడూ ఆనందకరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..👍🧡🙏

Monday, October 14, 2024

మౌనంగానే ఎదగాలి!!!*

*మౌనంగానే ఎదగాలి!!!*
            
వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.

అయిదు ‘శాంతి’లలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు.

‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత. ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’ అన్నారుస్వామి వివేకానంద.

 మౌనం మూడు రకాలు:
    
*#1. ఒకటవది:వాక్‌మౌనం.* 

*వాక్కును నిరోధించడమే* *వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు.* *ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి.*

*#2.రెండోది అక్షమౌనం.*

*అంటే ఇంద్రియాలను నిగ్రహించడం.*
```
*#3. మూడోది కాష్ఠమౌనం.*

*దీనినే ‘మానసిక మౌనం’ అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దాన్నీ అరికట్టినప్పుడే కాష్ఠమౌనం సాధ్యపడుతుంది.*

*మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, అంతర సౌందర్యాలను పెంచుతుంది.* *మనోశక్తులు వికసిస్తాయి.* *ఎదుటివారిలో  పరివర్తన  తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగ మవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యమిచ్చారు.*

*మౌనాన్ని అవలంబించిన మహాత్ముల్లో రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ వంటి వారెందరో ఉన్నారు.*

*ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం.*
*నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు.*

*రోజూ అరగంట మౌనంగా ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.*
*మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ,  టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్‌ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని మాటను, మనసును మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది.*

*ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు’ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి.*

*ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే…‘మౌనం!’*

*ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది. భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే. మనందరం మౌనంగానే ఎదుగుదాం.*

Tuesday, October 1, 2024

మందార తైలం.....*

*మందార తైలం.....*
 *కేవలం 30 నిమిషాల్లో మందార తైలం తయారు!!*
 అద్భుతమైన మందార తైలాన్ని ఇంట్లోనే... అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా అద్భుతమైన నేచురల్ మందార తైలాన్ని తయారు చేసుకునే విధానం....
*కావాల్సిన పదార్ధాలు...*
1. తాజా ఒక్క రెక్క మందార పూలు 500gms.
2. పచ్చి పెద్ద ఉసిరికాయలు 100gms
3. తాజా మందార ఆకులు 100gms
4. వేప ఆకులు లేదా ఎండిన పండ్లు 50gms
5. గోరింటాకు ఆకులు 50gms
6. తొక్క తీసిన అలోవెరా గుజ్జు 100gms
7. రాత్రి నానబెట్టిన మెంతులు 50gms
*తయారు చేసుకునే విధానం.....*
 పైన చెప్పిన వీటన్నిoటిని తీసుకొని, ఒక్కొక్క పదార్థాన్ని రోట్లో వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి. అలా నూరుకున్న పేస్టును ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
 స్టవ్ పైన గిన్నెపెట్టి, గానుగలో పట్టించిన అర కేజీ స్వచ్ఛమైన తెల్ల నువ్వుల నూనెను పోసుకొని వేడి చేయాలి. ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత ముందుగా నూరి పెట్టుకున్న ఆయిల్లో వేసి మెల్లగా కలపాలి.
 స్టవ్ స్లిమ్ లో పెట్టి..... వేసిన పేస్టు మొత్తం నూనెలో ఇంకిపోయే వరకు మరుగనివ్వాలి. నూనెలో నీటి శాతం మొత్తం ఆవిరి అవ్వాలి. తరువాత స్టవ్ ఆర్పే.. నూనె చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకోవాలి.

*వాడే విధానం....*
 ఆడవాళ్ల అయితే వారానికి 2,3 సార్లు జుట్టుకు బాగా పట్టించాలి. మగవాళ్లు పిల్లలు రెగ్యులర్ గావాడాలి.
 *ఆయిల్ యొక్క రిజల్ట్స్.......*
1.హెయిర్ ఫాల్ వెంటనే తగ్గుతుంది.
2.జుట్టు నల్లగా బలంగా పెరుగుతుంది.
3. డాండ్రఫ్ తగ్గుతుంది.
4. హెయిర్ గ్రోత్ వెంటనే ఫలితం వస్తుంది.
5. జుట్టు బలంగా దృఢంగా పెరుగుతుంది.
6. జుట్టుకు కావాల్సిన ఎన్నో పోషకాలు ఇందులో లభిస్తాయి.
 ఈ అద్భుతమైన మందార తైలాన్ని ఇంట్లో చేసుకోగలిగిన వాళ్లు హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తయారు చేసుకోలేని పరిస్థితి ఉన్నట్లయితే మేము తయారు చేసి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. మరొక విషయం ఇది కేవలం ఆరోగ్య ప్రయోజనాల కోసమే తప్ప వ్యాపార ప్రయోజనాల కోసం కాదు. వ్యాపారమే చేయదలుచుకుంటే మీకు ఎలా తయారు చేయాలో అని మీకు తెలియజేసే వాళ్ళం కాదు దయచేసి గమనించగలరు........
 

కుప్పింటాకు మొక్క యొక్క ఉపయోగాలు..!*

*కుప్పింటాకు మొక్క యొక్క ఉపయోగాలు..!* 

ఎన్నో రకాల మొక్కలను మన చుట్టూ పరిసరాలలో చూస్తూనే ఉంటాము. అయితే అందులో కొన్ని మొక్కలు విషపూరితమైనవి ఉంటాయి. మరి కొన్ని మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు రకమైనవి ఉంటాయి. అలాంటి వాటిలో కుప్పింటాకు కూడా ఒకటి. ఇలాంటి మొక్క చాలా అరుదుగా దొరుకుతుంది మనకు. ఇది ఎటువంటి నేల‌లోనైనా సుల‌వుగా పెరుగుతుంది. రోడ్ల‌కు ఇరువైపులా, ఖాళీ ప్ర‌దేశాల్లో, పొలాల ద‌గ్గ‌ర‌, చేల దగ్గ‌ర ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఈ మొక్క పెరుగుతుంది. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..

1.కుప్పింటాకు మొక్క పంటి నొప్పిని తగ్గిస్తుంది . అందుకే దీనిని పిప్పెంటి ఆకు అని అంటారు. పంటి నొప్పిలన్నిటికీ ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

2.ఈ మొక్క వేర్లతో పళ్ళను తోమితే దంతాలు తెల్ల పడతాయి. అంతేకాకుండా చిగుళ్ల నుంచి కారే రక్తాన్ని కూడా ఆపుతుంది.

3.ఈ ఆకు రసం రెండు చుక్కలు ముక్కులో వేస్తే ఎటువంటి మొండి తలనొప్పి అయిన తగ్గుతుంది.

4.కుప్పింటాకు ఆకులను మిరియాలతో కలిపి నూరి తేలు కాటుకు, పాము కాటుకి కట్టు కడితే విషాలను విరిచేస్తుంది.

5.కళ్ళు ఉప్పు, పిప్పింటాకు కలిపి నూరి దురద ఉన్న చోట రాస్తే వెంటనే తగ్గుతుంది.

6.రెండు స్పూన్లు పిప్పింటాకు రసాన్ని నిద్ర పోయే ముందు తాగితే మలబద్దకం, నులి పురుగులు అన్ని కొట్టుకు పోతాయి. విరోచనం సాఫిగా అవడమే కాక శరీరం శుభ్రం అవడానికి సహాయపడుతుంది.
కళ్ళు ఎర్రబడటం, జ్వరం, వాంతులు, కఫం లాంటి వ్యాధులకు ఆయుర్వేద ముందుగా పిప్పింటాకు ఉపయోగిస్తారు. గ్లాస్ వాటర్‌లో కొన్ని పిప్పింటాకులు వేసి మరిగించి రాత్రంతా ఉంచాలి. తర్వాతి రోజు ఉదయాన్నే వడకట్టి తాగితే పన్ను నొప్పి తగ్గుతుంది. శ్వాస వ్యవస్థ బాగా పని చేస్తుంది. 

7.కామెర్లకు కుడా ఈ కుప్పింటాకును ఉపయోగిస్తారు.
కురుపులు, మొటిమెలు, అవాంఛిత రోమాలు పోవడానికి కుప్పింట ఆకు, కళ్లు ఉప్పు, పసుపు , నూరి రాస్తే త్వరగా నయం అవుతాయి.


భారతదేశం చరిత్ర

*సమాచారం సేకరించిన మిత్రుడి కృషికి గొప్ప అభినందనలు, ఒక్కసారి చదవండి పదిమందికి పంపండి.
 1 = 1193 *ముహమ్మద్ ఘోరి*
 2 = 1206 *కుతుబుద్దీన్ ఐబాక్*
 3 = 1210 *అరామ్ షా*
 4 = 1211 *ఇల్టుట్మిష్*
 5 = 1236 *రుక్నుద్దీన్ ఫిరోజ్ షా*
 6 = 1236 *రజియా సుల్తాన్*
 7 = 1240 *ముయిజుద్దీన్ బహ్రమ్ షా*
 8 =1242 *అల్లావుద్దీన్ మసూద్ షా*
 9 = 1246 *నాసిరుద్దీన్ మెహమూద్*
 10 = 1266 *గియాసుడిన్ బల్బన్*
 11 = 1286 *కై ఖుష్రో*
 12 = 1287 *ముయిజుద్దీన్ కైకుబాద్*
 13 = 1290 *షాముద్దీన్ కామర్స్*
        1290 *బానిస రాజవంశం ముగుస్తుంది*
 (ప్రభుత్వ కాలం - సుమారు 97 సం.)

 *ఖిల్జీ రాజవంశం*
 1 = 1290 జలాలుద్దీన్ *ఫిరోజ్ ఖిల్జీ*
 2 = 1296 *అల్లాదీన్ ఖిల్జీ*
 4 = 1316 *సహబుద్దీన్ ఒమర్ షా*
 5 = 1316 *కుతుబుద్దీన్ ముబారక్ షా*
 6 = 1320 *నాసిరుదిన్ ఖుస్రో షా*
 7 = 1320 *ఖిల్జీ* *రాజవంశం ముగిసింది*
 (ప్రభుత్వ కాలం - సుమారు 30 సం.)

 *తుగ్లక్ రాజవంశం*
 1 = 1320 *గయాసుద్దీన్ తుగ్లక్ I*
 2 = 1325 *ముహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ*
 3 = 1351 *ఫిరోజ్ షా తుగ్లక్*
 4 = 1388 *గయాసుద్దీన్ తుగ్లక్ రెండవ*
 5 = 1389 *అబూబకర్ షా*
 6 = 1389 *ముహమ్మద్ తుగ్లక్ మూడవ*
 7 = 1394 *సికందర్ షా మొదటి*
 8 = 1394 *నాసిరుదిన్ షా దుస్రా*
 9 = 1395 *నస్రత్ షా*
 10 = 1399 *నాసిరుద్దీన్ మహమ్మద్ షా*
వెంటాడే రెండవ స్థానంలో ఉన్నారు
 11 = 1413 *డోలత్ షా*
 1414 *తుగ్లక్ రాజవంశం ముగుస్తుంది*
 (ప్రభుత్వ కాలం - సుమారు 94 సం.)

 *సయ్యిద్ రాజవంశం*
 1 = 1414 *ఖిజ్ర్ ఖాన్*
 2 = 1421 *ముయిజుద్దీన్ ముబారక్ షా రెండవ*
 3 = 1434 *ముహమ్మద్ షా నాల్గవ*
 4 = 1445 *అల్లావుద్దీన్ ఆలం షా*
 1451 *సయీద్* *రాజవంశం ముగుస్తుంది*
 (ప్రభుత్వ కాలం - సుమారు 37 సం.)

 *అలోడి రాజవంశం*
 1 = 1451 *బహ్లోల్ లోడి*
 2 = 1489 *అలెగ్జాండర్ లోడి రెండవది*
 3 = 1517 *ఇబ్రహీం లోడి*
 1526 *లోడి రాజవంశం ముగుస్తుంది*
 (ప్రభుత్వ కాలం - సుమారు 75 సం.)

 *మొఘల్ రాజవంశం*
 1 = 1526 *జహ్రుదిన్ బాబర్*
 2 = 1530 *హుమయూన్*
 1539 *మొఘల్ రాజవంశం సమయం ముగిసింది*

 *సూరి రాజవంశం*
 1 = 1539 *షేర్ షా సూరి*
 2 = 1545 *ఇస్లాం షా సూరి*
 3 = 1552 *మహమూద్ షా సూరి*
 4 = 1553 *ఇబ్రహీం సూరి*
 5 = 1554 *ఫిరుజ్ షా సూరి*
 6 = 1554 *ముబారక్ ఖాన్ సూరి*
 7 = 1555 *అలెగ్జాండర్ సూరి*
 *సూరి రాజవంశం ముగుస్తుంది,*
(పాలన -16 సంవత్సరాలు సుమారు)

 *మొఘల్ రాజవంశం పున ప్రారంభించబడింది*
 1 = 1555 *హుమాయున్ మళ్ళీ సింహాసనం పైన* 
 2 = 1556 *జలాలుద్దీన్ అక్బర్*
 3 = 1605 *జహంగీర్ సలీం*
 4 = 1628 *షాజహాన్*
 5 = 1659 u *రంగజేబు*
 6 = 1707 *షా ఆలం మొదట*
 7 = 1712 *జహదర్ షా*
 8 = 1713 *ఫరూఖ్సియార్*
 9 = 1719 *రైఫుడు రజత్*
 10 = 1719 *రైఫుడ్ దౌలా*
 11 = 1719 *నెకుషియార్*
 12 = 1719 *మహమూద్ షా*
 13 = 1748 *అహ్మద్ షా*
 14 = 1754 *అలమ్‌గీర్*
 15 = 1759 *షా ఆలం*
 16 = 1806 *అక్బర్ షా*
 17 = 1837 *బహదూర్ షా జాఫర్*
 1857 *మొఘల్ రాజవంశం ముగుస్తుంది*
 (ప్రభుత్వ కాలం - సుమారు 315 సంవత్సరాలు.)

 *బ్రిటిష్ రాజ్ (వైస్రాయ్)*
 1 = 1858 *లార్డ్ క్యానింగ్*
 2 = 1862 *లార్డ్ జేమ్స్ బ్రూస్ ఎల్గిన్*
 3 = 1864 *లార్డ్ జాహోన్ లోరెన్ష్*
 4 = 1869 *లార్డ్ రిచర్డ్ మాయో*
 5 = 1872 *లార్డ్ నార్త్‌బుక్*
 6 = 1876 *లార్డ్ ఎడ్వర్డ్ లాటెన్లార్డ్*
 7 = 1880 *లార్డ్ జార్జ్ రిపోన్*
 8 = 1884 *లార్డ్ డఫెరిన్*
 9 = 1888 *లార్డ్ హన్నీ లాన్స్‌డన్*
 10 = 1894 *లార్డ్ విక్టర్ బ్రూస్ ఎల్గిన్*
 11 = 1899 *లార్డ్ జార్జ్ కర్జన్*
 12 = 1905 *లార్డ్ టివి గిల్బర్ట్ మింటో*
 13 = 1910 *లార్డ్ చార్లెస్ హార్డింగ్*
 14 = 1916 *లార్డ్ ఫ్రెడరిక్ సెల్మ్స్ఫోర్డ్*
 15 = 1921 *లార్డ్ రూక్స్ ఐజాక్ రైడింగ్*
 16 = 1926 *లార్డ్ ఎడ్వర్డ్ ఇర్విన్*
 17 = 1931 *లార్డ్ ఫ్రీమాన్ వెల్లింగ్డన్*
 18 = 1936 *లార్డ్ అలెగ్జాండర్ లిన్లిత్గో*
 19 = 1943 *లార్డ్ ఆర్కిబాల్డ్ వేవెల్*
 20 = 1947 *లార్డ్ మౌంట్ బాటన్*

*బ్రిటిషర్స్ పాలన సుమారు 90 సంవత్సరాలు ముగిసింది.*

 *ఆజాద్ ఇండియా, ప్రధాని*
 1 = 1947 *జవహర్‌లాల్ నెహ్రూ*
 2 = 1964 *గుల్జారిలాల్ నందా*
 3 = 1964 *లాల్ బహదూర్ శాస్త్రి*
 4 = 1966 *గుల్జారిలాల్ నందా*
 5 = 1966 *ఇందిరా గాంధీ*
 6 = 1977 *మొరార్జీ దేశాయ్*
 7 = 1979 *చరణ్ సింగ్*
 8 = 1980 *ఇందిరా గాంధీ*
 9 = 1984 *రాజీవ్ గాంధీ*
 10 = 1989 *విశ్వనాథ్ ప్రతాప్సింగ్*
 11 = 1990 *చంద్రశేఖర్*
 12 = 1991 *పివి నరసింహారావు*
 13 = *అటల్ బిహారీ వాజ్‌పేయి*
 14 = 1996 *H.D. దేవగౌడ*
 15 = 1997 *ఐకె గుజ్రాల్*
 16 = 1998 AB *వాజ్‌పేయి*
 17 =2004 Dr. *మన్మోహన్ సింగ్*
*18 = 2014 నుండి నరేంద్ర మోడీ*
*764 సంవత్సరాల తరువాత,పరదేశీ మరియు బ్రిటిష్ వారి బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందబడింది.*

*సుమారు "800" సంవత్సరాలు భారతదశాన్ని మహమ్మదీయలు పరిపాలించారు.*
 
*ఇప్పుడు చెప్పండి ఎవరు మైనారిటీలు ?.*

*ఈ ముఖ్యమైన సమాచారాన్ని యువకులందరి దృష్టిలో వీలైనన్ని సమూహాలలో పంపండి...*

*మనం "1000" సంవత్సరాలు కొన్ని కోట్ల మంది పోరాటం ఫలితంగా ఈ దేశం ఇంకా దేశంగా మనుగడలో ఉన్నది.*
*మన భారతీయ సంస్కృతిని,ధర్మాన్ని అనుసరించి, కులమత బేదాలను విడనాడి ఐక్యఅతను, సమరసతను కాపాడుకోవాలి, స్థిరంగా, దృఢంగా అభివృద్ధి సాధించాలి.*
 *చదువుకోండి చరిత్ర కోసం మరో పదిమందికి షేర్ చెయ్యండి,మిత్రులారా ఇది సేకరించి పంపించిన మహానుభావుడికి ఎంత సమయం పట్టిందో,ఆయన శ్రమ వృధా కాకూడదు.*