Saturday, February 1, 2025

పుదీనా గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు

పుదీనా గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

     ఆయుర్వేదం నందు పుదీనా కు ప్రత్యేక స్థానం ఉన్నది. 100 గ్రాముల పుదీనా ఆకు 56 క్యాలరీల శక్తిని ఇస్తుంది. ఇవే కాకుండా మరెన్నొ పోషకాలు ఉన్నాయి . వాటి గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను 

 100 గ్రాముల పుదీనా ఆకులో ఉండే పోషకాలు - 

 పిండిపదార్దాలు - 8 .40 గ్రా , ప్రొటీన్స్ - 5 .90 గ్రా , 0 .70 గ్రా ఫ్యాట్స్ , క్యాల్షియం - 440 మి.గ్రా , ఫాస్ఫరస్ - 70 మి.గ్రా , ఐరన్ - 19 .2 మి.గ్రా , విటమిన్లు - A , B1 , B2 , నియాసిన్ , ఆక్సాలిక్ ఆసిడ్ ఉన్నాయి.  

            పుదీనా ఆకు ఎక్కువుగా మాంసాహార వంటకాలలో వాడతారు . పచ్చడిగా మనవారు చాలాకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. పుదీనా ఆకు నుంచి " పిప్పర్మెంట్ " నూనె తయారగును. దీనితో కూడా అనేక వైద్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నూనెని ఘనీభవింపచేసిన మనము కిళ్ళీలలో వాడే " పిప్పరమెంట్ " తయారగును. పిప్పర్మెంట్ నోట్లో వేసుకొనిన వేడిగా ఉండి బయట గాలి కొద్దిగా సోకగానే చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. 

  పుదీనా ఆకుతో చికిత్సలు - 

  * పుదీనా ఆకు రసములో 1 స్పూన్ నిమ్మరసం , కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ 3 సార్లు చొప్పున తీసుకొనుచున్న అజీర్తి , కడుపునొప్పి , పొట్ట ఉబ్బరం , పొట్టలో గ్యాస్ , విరేచనాలు , విరేచనములో నులిపురుగులు , రక్తహీనత సమస్యల నుండి విముక్తి లభించును. 

 * పుదీనాకు కషాయం రోజుకి 2 లేక 3 పర్యాయాలు సేవిస్తున్న ఎక్కిళ్లు , దగ్గు , జలుబు , అజీర్తి తగ్గును. 

 * బహిష్టులో నొప్పికి పుదీనాకు కషాయం బహిష్టుకు 3 నుంచి 4 రోజుల ముందుగా సేవించటం మొదలుపెట్టిన బహిష్టునొప్పి రాదు . 

 * పుదీనాకు కషాయం నందు కొంచం ఉప్పు కలిపి గొంతులో పోసుకొని గార్గిలింగ్ ( గుడగుడ ) చేయుచున్న గొంతునొప్పి తగ్గును. 

 * క్షయ , ఉబ్బసం , కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులకు ఆయా మందులతో పాటు ఒకస్పూను పుదీనాకు రసములో 2 స్పూనుల వెనిగార్ , తేనె , కేరట్ రసము కలిపి రోజుకి 2 సార్లు సేవించిన మంచి టానిక్ లా పనిచేస్తుంది . 

 * నోటి దుర్వాసన గలవారు ప్రతిరోజు పుదీనాకు కొంచం నములుతున్న దుర్వాసన నిర్మూలమగును . ఇంకా దంతాలు పుచ్చుట తగ్గిపోయి దంతాలు గట్టిపడును. 

 * దంతాల నుండి చీముకారు సమస్య ఉన్నవారు పుదీనాకు నములుతున్న చీము కారుట తగ్గును. దంతాలు ఊడుట తగ్గును. 

 * ప్రతిరోజూ నిద్రించుటకు ముందు పుదీనాకు ముఖమునకు రాసుకొనుచున్న ముఖంపైన మొటిమలు తగ్గిపోయి ముఖచర్మం మృదువుగా , అందముగా తయారగును. 

 * గజ్జి , దురద వంటి చర్మవ్యాదులలో పుదీనాకు రసం పైపూతగా వాడుచున్న చర్మవ్యాధులు అంతరించును. నొప్పులు తగ్గును. 

 * పిప్పరమెంట్ తైలములో కొద్దిగా పంచదారను కలిపి 2 నుంచి 3 చుక్కలు కడుపులోకి తీసుకొనుచున్న కడుపుబ్బరం , ఆహారం అరగకుండా ఉండటం , అజీర్తి తగ్గును. 

 * కొబ్బరినూనెలో కొద్దిగా పిప్పరమెంట్ తైలం కలిపి కీళ్ళనొప్పులకు పైపూతగా రాయుచున్న గుణం కనిపించును. 

 * గొంతునొప్పికి , గొంతులోని టాన్సిల్స్ కు పైపూతగా పిప్పరమెంట్ తైలాన్ని రాయుచున్న తగ్గును. 

 * పిప్పరమెంట్ నూనెలో కొద్దిగా లవంగ నూనె కలిపి పుచ్చుపళ్ళలో పెడుతున్న నొప్పి తగ్గుటయే కాక క్రమక్రమంగా పుచ్చు అంతరించును. 

 * నిమ్మరసములో కొద్దిగా పిప్పరమెంట్ తైలము కలిపి రాత్రిపూట ఒంటికి పట్టించుకుని పడుకున్న దోమలు దరిచేరవు . 

        పైన చెప్పిన యోగాలే కాకుండా విరేచనాలు , జిగటవిరేచనాలు యందు పనిచేయును . హృదయమునకు మంచిది . గర్భాశయ దోషాలను పోగొట్టి రుతుస్రావం సరిగ్గా అగునట్లు చేయును . బాలింతలకు వచ్చు జ్వరం నందు పుదీనాకుల రసం తీసి రెండు చెంచాలు చొప్పున తాగించుట మంచిది . జలుబు నందు పుదీనాకు ముద్దగా చేసి నుదురుకు పట్టించి జలుబు , తలనొప్పి తగ్గును. 

            సమాప్తం 

 
     

అగద తంత్రము - విషం , దాని పుట్టుక లక్షణాలు.

అగద తంత్రము - విషం , దాని పుట్టుక లక్షణాలు.

 ఈ అగద తంత్రము . ఆయుర్వేదాన్గములలో ఒకటి అసలు ఆయుర్వేదంగములు 8 . అవి 

 1. శల్య తంత్రము.
 2. శౌలాక్య తంత్రము.
 3. కాయ చికిత్స .
 4. భూత విద్య.
 5. కౌమార భ్రుత్యము.
 6. అగద తంత్రము.
 7. రసాయన తంత్రము.
 8. వాజికరణ తంత్రము.

 ఈ 8 విభాగములు ఆయుర్వేదం లొని భాగాలు అందులొ ఈ అగద తంత్రము అనునది అనేక రకమయిన విషాలు శరీరం నందు ప్రవేశించి నానా విధములగు బాధలు శరీరమున ఏర్పడినప్పుడు అట్టి భాధలను ఉపశమింప చేసి మరణం కలగకుండా కాపాడుటకు ఉద్దేశింపబడింది . 

       అనేక రకములు అగు పాములు , తేళ్ళు, ఎలుకలు, పిచ్చి కుక్కలు , సాలిళ్ళు , దోమలు మొదలగు జంతువులు విష జంతువులు. ఈ జంతువుల యెక్క బాగాలు అనగా శుక్రము, చొంగ మొదలగు భాగములు కూడా విషం అనియు అవి తీవ్రమయిన వ్యాధులను కలుగజేయు ప్రభావం కలవు అని మన పూర్వీకులు కనుగొన్నారు .

 విషము పుట్టుక - 

 దేవదానవులు అమృతం కొరకు పాలసముద్రం చిలుకుతున్నప్పుడు అమృతం కంటే విశేష కాంతి కలదియు , నీలవర్ణం అయిన వస్తువోకటి పుట్టి లోకమును నశింప చేయుటకు క్షణక్షణం వ్యాపించచుండగా దానిని చూసి జగత్తు అంతా విషాద భరితం అయ్యెను . అందువలన దానికి విషం అని పేరు వచ్చింది. అప్పుడు ఆ విషం ఈశ్వరునిచే ఎదుర్కొనబడినది. ఆ తరువాత ఆ విషం తన అసలు రూపం వదిలి కృత్రిమ రూపం ధరించి స్థావర, జంగమ ల యందు ప్రవేశించెను .

 విష భేదములు - 

 స్థావరం, జంగమం అను విషములు రెండు విధములు . ఇవి ఆక్రుతిమములు ( రూపం కలవి )
అందు స్థావరమునకు 10 , జంగమునకు 16 ద్రవ్యములను ఆశ్రయించుకొని ఉండును. అదే విధంగా సవిషయమనియు , సవిశావిషములు అనియు రెండు విధములు . 

            రసాది దాతువుల యందును , ముస్తకాది కందల యందు ఉండు విషములను స్థావర విషములు అనియు, పాము , ఎలుక , తేలు మొదలగు వానియందు ఉండు విషములను జంగమ విషములు అని అందురు. ఇవి విషములు అన్నింటిలోను తీవ్రమైనవి.

 విష లక్షణ గుణములు - 

 విషములు అన్నియు ఆర్చుట, ఉష్ణం , తీక్షణం , చిక్కదనం లేకుండా ఉండుట, ముందు శరీరం అంతా వ్యాపించి తరువాత జీర్ణం అగుట , శీగ్రంగా చంపుట, అలగే శరీరం నుండి పోవుచూ శరీర బంధాలును ( బాగాలు ) శిధిలం చేయుట , సూక్ష్మ నాళాల యందు కూడా ప్రవేశించుట, జట రాగ్ని వలన కూడా జీర్ణం కాకుండా ఉండుట, దోష ధాతువులను క్షీనింప చేయుట , సూక్ష్మ తత్వం వలన శరీరం యందు అవయవాల నందు ప్రవేశించి వికారం కలగచేయును .

 విష ప్రభావం - 

 విషములు యందు గుణములు తీక్షనములు . అందువలన అవి త్రిదోషములను ప్రకొపిమ్పచేయును . అట్లు విషము చే ప్రకోపించబడిన త్రిదోషములు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించ లేకపోవును. అందువలన విషము పిత్తము వలన జీర్ణం కాలేకపోవడం వలన ప్రాణం బంధించును. విషంతో కూడిన శ్లేష్మం చే పోవు త్రోవ మార్గము శ్లేష్మంచే నిరోదింప బడటం ములాన ఉచ్చ్వాసం బంధింపబడును. అందువల్ల ప్రాణం ఉన్నప్పటికి లేని వాడివలే సంజ్ఞా రహితుడై పడి ఉండును.

          విషం మొదట శరీరం నందు ప్రవేశించి మొదట రక్తమును, తరవాత కఫమును, పిత్తమును,వాతమును వాటి పనులను చెడగొట్టి చివరికి హృదయం నందు ప్రవేశించి ప్రాణాలు హరించును.

 స్థావర విషం యుండు స్థానములు - 

 వేరు , ఆకు , పండు, పువ్వు పట్ట, పాలు, చేప బంక, దాతువులు, దుంప ఈ పది స్థానములు విషం నిలువ ఉండు స్థానములు . అలాగే శుశ్రుతం నందు అశ్హ కూర , గుంజ, సుగంద, నల్ల యష్టిమధుకం , గన్నేరు , గురువింద, ఈశ్వరి, పోత్తిదుంప, గంజాయి మొక్కల వేర్లు విషపురితమైనవి .

    నేపాళ గింజ మద్య ఉండు సన్నని ఆకు , చేదు అనప, పాల టేకు, ప్రెంకనమ్ , అందుగ, మొక్కల యెక్క ఆకులు విషం కలవి.

     ఈ విధంగా స్థావర విషాలు 55 రకాలుగా ఉంటాయి అని శుశ్రుతుడు తన గ్రంధంలో వివరించాడు.

 ధాతు విషాలు - 

 పాదరసం, తాలకం , తామ్రము , సత్తు, సీసము , తగరము, అంజనము, మణిశిల, పాషానములు , మణులు ఇవి ధాతు విషములు .

 కంద విషాలు - 

 సక్తుకము, ముస్తకము, కూర్మము , నార్వికము, సర్షపము , ఫైకథమ్ , వత్స నాదము,శ్వేత శృంగి, కాలకుటము , మేష శృంగి, ధర్దుకము, హాలాహలము, కర్మాట ము గ్రంది. , హరిధ్రకము, రక్త శృంగి, కీసరము, యమధంష్ట్రా అనునవి 18 కంద విషములు 

        పైన చెప్పిన 18 విధములు అగు కంద విషములు ప్రాణాంత కములు. మొదటి 8 ఔషధాల యందు , మిగిలిన 10 రసవాదం ( బంగారం తయారు చేయు విద్య.) యందు ఉపయోగిస్తారు.

 స్థావర విషం లక్షణాలు - 

 స్థావర విషం జ్వరము, ఎక్కిళ్ళు, దంత హర్షము, మింగుడు పడకుండా ఉండుట, మరపు వచ్చుట, వమనం ( వాంతి ) , అరుచి, శ్వాస, మూర్ఛ వీటిని కలుగచేయును .

 మూల విషం లక్షణాలు. - 

 మూల విషం భక్షణ వలన చుట్టుకొని పొవుట, ప్రలాపం, మొహం కలుగును. పత్ర విషం 
( ఆకు లొని ) విషం వలన ఆవులింతలు, శరీరం చుట్టుకొని పొవుట, శ్వాస లొ ఇబ్బంది కలుగును.
ఫల విషం వలన వృషణాల వాపు , దాహం , అన్నా ద్వేషం కలుగును. పుష్ప విషం వలన వాంతి , మూర్ఛ కలుగును. పట్టచేప జిగురు విషము వలన నోటి వాసన, జిహ్వాకాటిన్యం , తలనొప్పి, సొల్లు కారుట, కలుగును. క్షార విషం వలన నోట నురుగ వచ్చుట, విరేచనం , నాలుక బరువు ఎక్కుట కలుగును. ధాతు విషం వలన గుండె యందు పీకుడు , మూర్ఛ కలుగును. సాధారణంగా ఈ విషములు అన్నియు తినిన కొంతకాలం తరువాత ప్రాణములు హరించును.

 స్థావర విషం లక్షణములు -

 స్థావర విషం తిన్న వానికి మొదటి వేగమున నాలుక నల్లగా మారి మోద్దుబారుతుంది. మూర్ఛ , శ్వాస, వాంతి కలుగును. రెండొ వేగమున వణుకు, తాపము, కం టం నందు భాద కలుగును, మూడో వేగమున గుండె యందలి భాద మొదలగును. ఆమాశయం నందు శుల మొదలై కన్నులు రంగు మారి పచ్చబడి వాచుట కలుగును. నాలుగో వేగమున పక్వాశయం నందు పోటు , ఎక్కిళ్లు , దగ్గు తలబరువు కలిగించును. అయిదో వేగమున కఫం కారుట, కళ్ళు పోటు, ఆరో వేగమున తెలివి నశించి విరేచనం ఎక్కువ అగును. ఏడో వేగమున మెడ, వీపు, నడుములు నిలవకపోవుట ఆతరువాత ప్రాణం పొవుట సంభవించును .

  మాటలు సరిగ్గా రానివారికి మాటలు తెప్పించే రహస్య యోగం -

వసకొమ్ముని దంచి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక పాత్రలో పోసి ఆ చూర్ణం నిండేవరకు ఉసిరికాయలు రసం పొసి బాగా కలిపి ఒక రాత్రి నానబెట్టి తరువాత ఎండబెట్టి బాగా ఎండబెట్టి బాగా ఎండిన తరువాత మళ్ళి దంచి మెత్తగా తయారుచేసుకుని ఆ చూర్ణాన్ని రోజూ పూటకు మూడు గ్రాముల మోతాదుగా ఒక చెంచా తేనె కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే మాటలు తడబడే వారికి , మాటలు ముద్దగా పలికేవారికి , మాటలు ఆగిఆగి మాట్లాడేవారికి ఆ సమస్యలు తొలగి స్వచ్చముగా మాటలు వస్తాయి.
 
     లేత మర్రి ఊడలు సాన పైన అరగదీసి ఆ గంధమును నాలిక పైన రాయుచున్నను మాటలు త్వరగా వచ్చును . 

 
   

పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .

పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .

   ఆవుపెరుగు మిక్కిలి జిడ్డుగా ఉండును. శ్లేష్మాన్ని కలుగచేయును . రక్తం చెడగొట్టును . గ్రామాల యందు పాడిపంటలు విశేషముగా ఉన్నను మనుష్యులు రోగాలబారిన పడుటకు ముఖ్యకారణం పెరుగు తీసుకొను విషయంలో నియమాలు పాటించకపోవడమే ప్రధాన కారణం. రాత్రి యందు పెరుగు ఉపయోగించుట మంచిది కాదు. 

          పెరుగు ప్రీతికరమైన పదార్థం కావడం మూలాన పిల్లలు , పెద్దలు మితిమీరి సేవించెదరు. అందువలన రక్తం చెడి రక్తపిత్త రోగం , విసర్పి కలుగును. విసర్పి అనగా శరీరం నందు రక్తం చెడి మాంసం , చర్మములతో కలిసి సర్పం పాకే విధముగా తొందరగా శరీరం అంతా గుడ్లగుడ్లగా ఉండును. ఇది తరచుగా చిన్నపిల్లలకు వచ్చును. కుష్టు , పాండురోగం , పచ్చకామెర్లు మొదలగు వ్యాధులు వచ్చును. పెరుగు వేడిచేయును . అదే దానికి కొంచం నీరు కలిపి మజ్జిగలా చేసుకుని తాగితే చలువచేయును . అందుకే వేసవికాలం నందు పెరుగు తీసుకోరాదు . శీతాకాలం , వర్షాకాలం నందు పెరుగు పగలు తీసుకోవచ్చు . 

              మూత్రం బొట్లుబొట్లుగా పడు వ్యాధి నందు , రొంప, చలిజ్వరం , నోటికి రుచి లేకపోవటం , శరీరం కృశించి ఉండు రోగములు కలిగి ఉండువారు పెరుగు వాడటం మంచిది . పెరుగు శుక్రాన్ని పెంచును.

  పెరుగు తీసుకొనువారు పాటించవలసిన నియమాలు - 

 * పెరుగుతో కోడిమాంసాన్ని భుజించరాదు .

 * పెరుగుతో నిమ్మపండు భుజించరాదు .

 * పెరుగుతో అరటిపండు భుజించరాదు . 

 * పెరుగు వేడివేడి అన్నంతో పాటు తినరాదు.

 * పెరుగు రాత్రి పూట భుజించరాదు .శరీరంలో కఫం వృద్ధిచెందును. మరియు జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.

    పగలు పెరుగు భుజించువారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవలెను.

 * తేనె - పెరుగు = మంచి రుచి కలుగును.

 * ఉసిరిక పచ్చడి - పెరుగు = శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను పోగొట్టును . 

 * నెయ్యి - చక్కెర - పెరుగు = వాతాన్ని తగ్గించును , ఆహారాన్ని జీర్ణం చేయును . 

 * చక్కెర - పెరుగు = దప్పిక, తాపాన్ని హరించును . 

 * పెసరపప్పు - పెరుగు = రక్తంలోని వాతాన్ని హరించును . 

  మజ్జిగ ఉపయోగాలు - 

  
    పెరుగునకు నాలుగోవ భాగం నీరు కలిపి బాగుగా మజ్జిగ తయారుచేయవలెను. దానిలో వెన్న తీయరాదు. ఇటువంటి మజ్జిగని ఉదయం , మధ్యాహ్న భోజనంలో ఉపయోగించుచున్న ఏ వ్యాధితోను బాధపడరు. బాగుగా చిక్కగా ఉండి వెన్నతీయని మజ్జిగ పుష్టిని కలుగచేయును . కఫాన్ని కలిగించును. శ్రమను , దప్పికను పొగొట్టును. బాగుగా చిలికి వెన్నతీసిన మజ్జిగ తేలికగా జీర్ణం అగును.

          శరీరంలో వాతం పెరిగినపుడు మజ్జిగలో శొంటి, సైన్ధవలవణం లేదా ఉప్పు కలిపి లొపలికి తీసికొనవలెను. శరీరంలో పైత్యం పెరిగినపుడు మజ్జిగతో పంచదార కలిపి వాడవలెను. శరీరంలో కఫం ఎక్కువైనప్పుడు శొంటి, పిప్పిళ్లు , మిరియాల చూర్ణం కలిపి మజ్జిగతో కలిపి తాగవలెను . 

                మన శరీరంలో జఠరాగ్ని మందగించి ఆకలి లేనపుడు మరియు వాత వ్యాధుల్లో మజ్జిగ అమృతంగా పనిచేయును . విషం , వాంతులు , నోటి నుండి నీరు కారుట, విషమజ్వరం , పాండువు , రక్తవిరేచనాలు , మేథస్సు, మొలలు , భగన్దరం , అతిసారం , ప్లీహానికి సంబంధించిన వ్యాధులు , ఉదరరోగం , బొల్లి , కుష్టు , క్రిములను మొదలయిన వాటిని మజ్జిగ సేవించుట వలన పోగొట్టుకోవచ్చు. 

          మజ్జిగ భూమిపైన పోసిన అక్కడ ఉన్న గడ్డిపోచలు , పచ్చిక వంటివి మాడిపోయి మరలా మొలవవు. ఇదే సూత్రం మొలలు వ్యాధికి సంక్రమించును. మొలల వ్యాధిలో మొలకలు ఊడిపోవుటకు మజ్జిగ సేవనం తప్పనిసరి . మజ్జిగ తాగుట వలన వాత, శ్లేష్మములచే ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయి రక్తప్రసరణ సాఫీగా జరుగును. దీనివలన శరీరపుష్టి పెరుగును . మజ్జిగ తాగుట వలన 80 రకాల వాతరోగాలు నయం అగును.

  మజ్జిగలోని రకాలు - 

  * పెరుగును కవ్వముతో చిలికి అందు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ.

 * పెరుగును చక్కగా కవ్వముతో చిలికి అందు వెన్నను సగం మాత్రమే తీసివేసిన మజ్జిగ .

 * పెరుగును చక్కగా కవ్వముతో చిలికి వెన్నను ఎంతమాత్రం తీయకుండా ఉంచిన మజ్జిగ.

     కఫం ఎక్కువ ఉన్నప్పుడు , అగ్ని మందగించినప్పుడు మిక్కిలి బలహీనంగా ఉన్నప్పుడు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ వాడవలెను.

      పైత్యం ఎక్కువ అయ్యి , అగ్నిమాంద్యం ఉన్నప్పుడు బలం మధ్యమంగా ఉన్నప్పుడు సగం వెన్న తీసిన మజ్జిగను వాడాలి.

     వాతం ఎక్కువుగా ఉన్నప్పుడు వెన్న అసలు తీయని మజ్జిగని వాడవలెను.

 
  వెన్న ఉపయోగాలు - 

    
         ఆవు వెన్న బలం కలిగించును. జఠరాగ్ని పెంచును. వాతం మరియు పిత్తాన్ని పోగొట్టును రక్తదోషాలను, క్షయరోగం, మొలలు , దగ్గు పోగొట్టును . చిన్నపిల్లలకు అమృతం వలే పనిచేయును . బక్కచిక్కి ఉన్నచిన్నపిల్లలకు ఉదయాన్నే తేనె , ఆవు వెన్న , పంచదార కలిపి తినిపించిన బలం కలుగును. క్షయరోగులు బాగా చిక్కి శల్యం అయినపుడు ఈ ప్రయోగం చాలా బాగా పనిచేయును . 

          గేదె పెరుగు బలకరం . మిక్కిలి చమురు కలిగి ఉండును. వాతం , శ్లేష్మం కలుగచేయును . మధురంగా ఉండును. పచ్చిపాలు తీసిన వెన్న సేవించిన కండ్లకు మంచిది . ఎల్లప్పుడూ అప్పటికప్పుడు తీసిన వెన్న మంచిది . నిలువ వెన్న చాలా రోగములను తెచ్చిపెట్టును. కావున విడిచిపెట్టవలెను. 

     

చర్మవ్రణము ( keloid ) గురించి వివరణ -

చర్మవ్రణము ( keloid ) గురించి వివరణ - 

      చర్మవ్రణ సమస్య ప్రస్తుత కాలంలో కనిపించే ప్రధానమైనది. ఈ సమస్యకు అల్లోపతి మరియు హోమియోపతి వైద్యవిధానములో సంపూర్ణ పరిష్కారం లేదు . ఆయుర్వేదం నందు ఈ సమస్యకు సంపూర్ణ పరిష్కారం కలదు. ఈ సమస్యలో ప్రధానంగా శరీరం మీద కొన్ని భాగాలలో ముఖ్యముగా ఛాతి మధ్యభాగములో మరియు ఉదరము , గడ్డము కింద , భుజముల దగ్గర ఉబ్బెత్తుగా వ్రణము లేచును . అది రాయివలె గట్టిగా ఉంటుంది. కొంతకాలము అయిన పిదప దాని నుంచి తెల్లటి పదార్ధము బయటకి వచ్చును . ఇది చిన్నగా వ్యాప్తి చెందుతూ మిగిలిన భాగాలకు కూడా వ్యాపించును . 

         ఈ సమస్య ప్రధానముగా రక్తదోషము వలన సంభంవించును . శరీరం నందు అధికమైన వాతాది దోషములు ప్రకోపము చెంది రక్తము పైన ప్రభావం చూపించుట మూలన రక్తం దోషము పొంది చర్మముపైన వ్రణము ఏర్పడును . ఈ సమస్య గురించి మరింత సమాచారం మీకు అందచేస్తాను . ముందు వ్రణాల గురించి మీకు వివరిస్తాను . 

         వ్రణాలు 2 రకాలు . అవి వరసగా 

             * శారీరకములు . 

             * ఆగస్తకములు . 

     వాతాదిదోషములు చేత జనియించిన వ్రణములు శారీరకములు . శస్త్రాలు , మిగిలిన ఆయుధాలు వలన కలుగు దెబ్బల చేత జనియించిన వ్రణములుని ఆగస్తకములు అని పిలుస్తారు . 

 * వాతదోషము పొందుట వలన కలుగు వ్రణ లక్షణాలు - 

     వ్రణము కదలకుండా గట్టిగా ఉండును. చీము మెదలైనవి మెల్లగా స్రవించును . అధికమైన బాధ కలిగి ఉండును . పోటు కలుగును . అదురుచుండును . శ్యామవర్ణం కలిగి ఉండును . ఈ లక్షణములు కలిగిన వ్రణము వాతముచే జనియించింది అని తెలుసుకొనవలెను . 

 * పిత్తజ వ్రణ లక్షణములు - 

       దప్పిక , మూర్చ , జ్వరం , తాపము , లోపల చెడిపోయి పగులుతున్నట్లు ఉండటం , దుర్గన్ధముతో కూడిన చీము స్రవించుట మొదలైన ఈ లక్షణములు కలిగినది పిత్తప్రకోపముచే జనించిన వ్రణము అని తెలుసుకొనవలెను . 

 * కఫజ వ్రణ లక్షణము - 

       మిక్కిలి జిగటగా ఉండటం , భారముగా ఉండటం , నునుపు కలిగి ఉండటం , నిశ్చలముగా ఉండటం , కొంచము నెప్పి కలిగి ఉండటం , తెల్లటి రంగుతో కలిగి ఉండటం , చీము కొంచము స్రవించుట , వ్రణము పక్వము చెందుటకు చాలా సమయం పట్టును . ఇటువంటి లక్షణాలు కలిగింది కఫదోషము వలన జనియించిన వ్రణము అని తెలుసుకోవలెను . 

     పైన చెప్పిన విధముగా శరీరంలో ఏర్పడు దోషముల వలన శరీరంపైన వ్రణాలు ఏర్పడును .
ఈ చర్మవ్రణములు వృద్ధిచెందుతూ మనిషిని కురుపిని చేయును . 

      ఈ చర్మవ్రణాల నివారణకు ప్రత్యేకమైన చికిత్స అవసరం . ఈ సమస్యతో ఇబ్బందిపడువారు చికిత్సకోరకు నన్ను సంప్రదించగలరు.  

      

కండ్ల కలక నివారణ మార్గాలు -

కండ్ల కలక నివారణ మార్గాలు - 

 * 30 గ్రాముల పసుపు చూర్ణమును ,250 ml నీటిలో వేసి కలిపి ఆ నీటితో కండ్లను శుభ్రపరచుకొనుచున్న కండ్ల కలకలు తగ్గును . కొట్టిన పసుపు మంచిది . 

 * పంచదార 3 గ్రాములు 100 ml నీటిలో వేసి కరిగించి గంటకొకసారి ఆ నీళ్లతో కండ్లు తడుపుచున్న కండ్ల కలక హరించును . 

 * పటిక చూర్ణము 3 గ్రాములు , కోడిగుడ్డు తెల్ల సొనతో నూరి గుడ్డకు పట్టించి నేత్రములపై పట్టి వలె వేయుచుండిన యెడల కండ్లు నీరుకారుట , కండ్ల వాపులు హరించును . 

 * నీరుల్లి ( Red onion ) రసం రెండు లేదా మూడు చుక్కలు కండ్లలో వేయుచుండిన యెడల కండ్ల కలకలు హరించును . 

 * కలబంద మట్ట పైన పచ్చటి పోర తీసివేసి లోపలి జిగురు వంటి భాగం 11 సార్లు కడిగి పసుపు అద్ది కళ్లు మూసుకుని కనురెప్పల పైన వేసి జారకుండా శుభ్రమైన గుడ్డతో కట్టుకట్టి గంట పాటు ఉంచవలెను . ఇలా రెండుపూటలా చేయుచున్న కంటి ఎరుపులు , దురద , వాపు తగ్గును . 

    పైన చెప్పిన ఔషధ యోగాలలో మీకు సులభముగా ఉన్నది పాటించి సమస్య నుంచి బయటపడగలరు . 

  
   

నిమ్మకాయతో చికిత్స -

నిమ్మకాయతో చికిత్స - 

  అజీర్ణం ( Dyspepsia ) - 

   గుండెల్లో మంటకు , పులిత్రేపులకు నిమ్మపండు మంచి మందు. కొద్దినీటిలో ఒక చెక్క నిమ్మరసం కలిపి దానిని ఒక మోతాదుగా పుచ్చుకొనవలెను.దీనివలన జీర్ణాశయం గోడలు శుభ్రం అగును. ఉపవాసం ఉన్నప్పుడు కాని , జీర్ణకోశం ఖాళీగా ఉన్నప్పుడు కాని నిమ్మరసం సేవించవలెను. 

  మలాశయం బాధ ( Bowel Trouble ) - 

    నిమ్మరసం అతిసారం , అతివిరేచనమును కట్టును. నిమ్మపండు నిజరసమును గాని కొంచం నీటితో కాని ఆసన మార్గము ( Enema ) ద్వారా పంపించిన కలరా , ఆమపాతం ( Macocolitis ) , ఆంత్రభ్రంశము ( prolapse of the bowels ) మొదలుగా గల కఠినమగు పేగు బాధలు నివారణ అగును. ఇంతే కాకుండా ఆమపాతంతో కూడిన శీతబేది ( Dysentry with slonghing of the mucous membrens ) అనగా జిగట విరేచనాలు తీవ్రమయిన ఈ జబ్బుతో రోగికి 12 ఔన్సుల మోతాదు ఇవ్వవలెను.

 స్థూలకాయం ( Obesity ) - 

    నిమ్మనీరు కాని , ఉడికించిన నిమ్మ పండ్లు కాని అతి స్థూలకాయమునకు మంచి మందు. మూడు నాలుగు గ్లాసుల తీపి కలపని నిమ్మనీరు కాని దానికి సరిపోవు పూర్తి పండ్ల పదార్ధం కాని దినదినము పుచ్చుకొనవలెను . దీనితో పాటు మితముగా భుజించుటయు , మధ్యాహ్నం రెండు గంటల తరువాత భోజనం చేయకుండా ఉండుట అభ్యాసం చేయవలెను . మధ్యాహ్నం 2 గంటల తరువాత తినిన ఆహారం అతిగా కొవ్వును పెంచును. అదే విధముగా శరీరం నందు నీరు , అంతర్మలములు ( Waste Poisons ) కూడా పెంచును. వీటన్నిటిని నిమ్మరసం తొలిగించును.

 ముఖ సౌందర్యం ( cosmetic ) - 

   సామాన్యంగా ముఖము పైన దీనిని వాడినప్పటి కంటే లొపలికి తీసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేయును. నిమ్మకాయ చెక్కని తలపైన రుద్దిన చుండ్రు ( Dandruff ) పోవును . మొటిమలు ( acne spots ) , శరీర నిగారింపు ( oily skin ) కలవారు నిమ్మరసం వాడుట చాలా మంచిది. ముఖం పైన , చేతుల పైన మచ్చలు , వాపు , గజ్జి వంటివాటిని నిమ్మరసం పోగోట్టును . 

  చలి జ్వరం - ( Maleria ) 

     నిమ్మరసం పాలు కలపని కాఫీ లో ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేయను. కాలిక వ్యాధులు ( Chronic Disorders ) అన్నింటిలో పండు పదార్థం వాడినంతను అద్భుతంగా పనిచేయను.నిమ్మ తొక్కలో క్రిమిసంహారకం అగు నూనె , నిమ్మ కాయ దూది యందు స్వాభావిక జీర్ణం అగు సారములు ఎన్నొ కలవు. చాలాకాలం నుంచి చలి జ్వరమునకు , రొంపలకు ముందుగా వాడుచున్న సింకోనా క్వయినా తయారగు చెట్టు బెరడును ఉండు గుణములు అన్నియు దీనియందు కలవు. 

   అపస్మారం వల్ల కలిగిన గుండెదడ కి 15 గ్రాములు నిమ్మరసం ఇచ్చిన నిమ్మళించును.

 రక్తస్రావం - 

    శ్వాసకోశములు ( Lungs ) , అన్నకోశం , ప్రేగులు మూత్రపిండములు మొదలగు వాటినుండి లోపల భాగాలలో రక్తస్రావం అవుతున్నప్పుడు నిమ్మరసం ఇవ్వవలెను. ఉప్పు కలిపి రోజుకి ఒక నిమ్మకాయ తినుచున్నచో ప్లీహవృద్ధి అనగా Enlargement of Spleen కడుపులో బల్ల పెరుగుట హరించును. 

    నిమ్మతైలము ని మర్దన కొరకు వాడవచ్చు. 

  దంతశుద్ధి - 

     దంతములు బలహీనంగా గాని , రంగుమారి కాని ఉన్నచో వాటిబాగుకై పేస్ట్ వాడరాదు. అవి హానిచేయును. అటువంటి సమయాలలో నిమ్మపండ్ల రసంలో తడిపిన కట్టెబొగ్గు లేదా నీళ్లతో పలుచన చేసిన నిమ్మపండ్ల రసం. కాని ఇది వాడిన తరువాత నీటితో నోరు బాగా పుక్కిలించవలెను. చిగుళ్ల వాపుకు , నోటి పూతకు నిమ్మకాయ రసమును నీటిని సమాన భాగాలుగా తీసుకుని పుక్కిటబట్టుట మంచిది.

          

శరీరానికి కావలిసిన అతిముఖ్య విటమినులు - అవి లభించు పదార్ధాలు .

శరీరానికి కావలిసిన అతిముఖ్య విటమినులు - అవి లభించు పదార్ధాలు .

     A , B , C , D , E అను పేర్లతో విటమిన్లు ప్రాముఖ్యం పొందినవి. వీటిని "దేహనిర్మాతలు " అని తెలుగులో పిలుస్తారు. ఇవి మనం తిను ఆహారం నందు లేకున్న శరీరపోషణం సరిగ్గా జరగదు. గుడ్లు , పాలు , పండ్లు , దంపుడు బియ్యం మొదలగు సహజసిద్ధముగా లభించు పదార్ధములలో ఈ విటమిన్లు ఎక్కువుగా ఉండును. 

           ఇప్పుడు ఈ అయిదు ముఖ్యవిటమిన్ల గురించి మీకు వివరిస్తాను.

 * "A" విటమిన్ -

       ఇది లోపించినవారికి "రేచీకటి" వచ్చును. కన్ను , నోరు , ఊపిరితిత్తులు మొదలైన సున్నితమైన చర్మం ఎండిపోయి రోగములు తెచ్చు సూక్ష్మజీవులు దాడిచేయుటకు అనువుగా ఉండును. శరీరం చక్కగా ఎదుగుటకు , గర్భధారణకు , బాలింతలుగా ఉన్న సమయమున ఈ విటమిన్ చాలా అవసరం .

              ఈ "A" విటమిన్ ఎక్కువుగా పాలు , పెరుగు , వెన్న , నెయ్యి , గుడ్లు , చేపలు , పచ్చికూరలు , కాడ్ లివర్ ఆయిల్ , టొమాటో , బొప్పాయి , నారింజపండ్లు , బచ్చలి , తొటకూర మొదలైన వాటిలో ఎక్కువుగా ఉండును.

 * "B" విటమిన్ -

         ఇది లోపించిన నరముల నిస్సత్తువ , ఉబ్బసరోగం కలుగును.

           ఈ "B" పచ్చికూరలు , మాంసము , పప్పుదినుసులు , గుడ్లు మొదలయిన వాటిలో లభించును. "B6" విటమిన్ తెల్లరక్త కణాలు తయారీకి ఉపయోగపడును. అరటిపండులో , పచ్చటి ఆకుకూరలలో , పప్పుదినుసుల్లో , చిక్కుడు , బంగాళాదుంపలలో ఈ విటమిన్ ఎక్కువుగా ఉండును. "B12" విటమిన్ ఇది లోపించిన పెదవుల్లో పగుళ్లు వస్తాయి. ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి , నాడీమండలం వ్యవస్థకు , నీరసం , జ్ఞాపకశక్తి తగ్గటం , నోటిపూత , నరాల కణాలు నశించిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ "B12" విటమిన్ పాలఉత్పత్తుల్లో , సోయాచిక్కుడు పాలలో పుష్కలంగా ఉండును.

 * "C" విటమిన్ -

          శరీరంలో ఈ విటమిన్ "స్కర్వీ " అను వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ యాంటిబయాటిక్ గా పనిచేయును . జీర్ణశక్తిని పెంచును. విటమిన్ C లోపించిన ఐరన్ ను ప్రేగులు గ్రహించలేవు . ఐరన్ లోపిస్తే రక్తహీనత ఏర్పడును . ఈ విటమిన్ ఎక్కువుగా నిమ్మకాయ , ఉశిరికాయ , కొత్తిమీర , పండ్లరసములు , మొలకెత్తిన గింజలలో , కలబందలో , వెల్లుల్లిలో , ముల్లంగిలో , పైనాపిల్ లో , కొబ్బరిబోండాలలో , మునగ ఆకులో పుష్కలంగా లభించును.

 * "D" విటమిన్ - 

         బిడ్డల ఎదుగుదలకు ఈ విటమిన్ చాలా అవసరం . ఇది లోపించిన బిడ్డలు దొడ్డికాళ్ళు వారగును. ఇది A విటమిన్ తో కలిసి వెన్న , గుడ్డు లొని పచ్చసొనలో ఉండును. ఉదయం , సాయంకాలం శరీరముకు సూర్యరశ్మి తగులుట వలన శరీరానికి కావలసిన D విటమిన్ బాగుగా లభించును. ఈ విటమిన్ శరీరంలో కొంతమొత్తంలో తయారగును.

              ఈ D విటమిన్ మనశరీరంలో ఎముకలు క్షీణించకుండా చూస్తూ వాటిని దృడంగా ఉంచును. రోగనిరోధక శక్తి బలోపెతం చేసేగుణం ఈ విటమిన్ కు ఉండును. ఇన్సులిన్ శరీరం సంగ్రహించుటకు తోడ్పడును. విటమిన్ D కణవిభజనను నియంత్రిస్తుంది. ఫలితముగా క్యాన్సరు నివారణకు తోడ్పడును . విటమిన్ D లోపము వలన పేగు క్యాన్సరు,రొమ్ము క్యాన్సరు , ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సరు , క్లోమ క్యాన్సరు ముప్పుని తొలగించును. ఉదయం 6 నుంచి 8 లోపు సూర్యనమస్కారాలు చేయుట మంచిది . ఈ విటమిన్ లోపం ఉన్నవాళ్లు తరచుగా పాలు , గోధుమలు , మరియు దేశివాళీ ఆవునెయ్యిలో తరచుగా తీసికొనవలెను .

 * "E " విటమిన్ -

          ఇది లోపించిన నపుంసకత్వం కలుగును. A విటమిన్ మరియు C విటమిన్లను మరియు ప్రోటీయాసిడ్స్ ని శరీరం నుండి నశించకుండా రక్షించే గుణం పైనాపిల్ లో ఉన్న E విటమిన్ లో ఉన్నది. వేరుశనగలో , బాదంలో , కాయగింజలలో , సొయాచిక్కుడు , గట్టి గింజలలో దొరుకును . గోధుమ , మొలకెత్తిన గింజలలో , మాంసములో ఎక్కువుగా లభించును.

              వీటితో పాటు విటమిన్ K కూడా మనకి ముఖ్యమయినది. ఈ విటమిన్ K రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడింది. ఈ విటమిన్ K లోపించడం వలన రక్తం గడ్డకట్టడం జరగదు. ఈ విటమిన్ K పచ్చిబఠాణీ , ఆవునెయ్యి , క్యారెట్ లలో ఎక్కువుగా ఉండును.

          

తిప్పసత్తు తయారీ విధానము -

తిప్పసత్తు తయారీ విధానము - 

   ముదిరిన తిప్పతీగ వ్రేళ్ళను తెచ్చి కత్తితో పైన పొట్టు తీసి సన్నని ముక్కలుగా కొట్టి దంచి నీటిలో కడగవలెను . జిగురు వచ్చు వరకు దంచి కడగవలెను. కడిగిన నీళ్లు ప్రత్యేకముగా ఉంచవలెను. జిగురు రాకపోయినా దంచి కడుగుటను మాని మొదట కడిగిన నీళ్లను వెడల్పాటి పళ్ళెములో పోయవలెను. సత్తు అంతా తెల్లగా అడుగున పేరి నీరు పైకి తేలును. ఆ నీటిని వంచివేయవలెను . ఈ విధముగా రెండోసారి , మూడోసారి తిప్పతీగని కడిగిన నీటిని పళ్ళెము లొ పొసి ఉంచవలెను. ఇందులొ తయారు అగు సత్తు మొదటి దాని అంత తెల్లగా ఉండదు. పైకి తేలిన నీటిని ఎప్పటికప్పుడు వంచివేయచుండవలెను . ఇటుల చేరిన సత్తుని బాగుగా ఎండు వరకు ఉంచిన అవి ముక్కలు అగును. ఇది రెండు రొజులలొ తయారు అగును . 

                 రాత్రుల యందు పాత్ర ను మూతతో కప్పి ఉంచవలెను. మూలికను దంచునప్పుడు రోలుకు కాని , రోకలికి కాని సున్నము తగలరాదు. సున్నము తగిలినచో సత్తు విరిగిపోవును. పళ్లెము కి కూడా సున్నము తగలనివ్వరాదు. 

             ఈ సత్తుని ప్రత్యేకంగా వాడుట యే కాక ఇతర ఔషదాలతో కూడా కలిపి ఇవ్వవచ్చు.

 దీని ఉపయోగాలు - 

 * దీనిని తేనెతో తీసుకుంటే కఫం పోవును .

 * బెల్లముతో తీసుకున్నచో మలబద్దకం పోవును . 

 * పంచదారతో ఇచ్చిన పైత్యమును , నేతితో ఇచ్చిన వాతమును హరించును. 

  * దీనిని అనుపానములతో ఇచ్చిన సర్వరోగములు పోగొట్టును . 

 * షుగర్ వ్యాధిగ్రస్తులు విడవకుండా వాడితే షుగర్ 
అదుపులో ఉండటానికి తోడ్పడుతుంది. 

 * ఎప్పుడు నోరు పూస్తుంది అనేవారు తిప్పసత్తుని కర్పూర శిలజిత్ ని పంచదారతో గాని నేతితో గాని కలిపి తీసుకుంటే శరీరంలో అతివేడి తగ్గును . 

 * పొడిదగ్గు కి కూడా ఇదే మిశ్రమాన్ని వాడవలెను.

 * వేడి శరీరం ఉన్నవారు ప్రతిరోజు తిప్పసత్తు వాడితే ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి.

 గమనిక - ఆయుర్వేద పచారి షాపుల్లో మీకు తిప్పసత్తు దొరకును. మీకు వీలుంటే సొంతంగా చేసుకోవచ్చు .

    

మనుష్యుల రోగాలకు కారణం అయ్యే విరుద్ద ఆహారపదార్థాలు -

మనుష్యుల రోగాలకు కారణం అయ్యే విరుద్ద ఆహారపదార్థాలు - 

 
     ఈ సకలసృష్టిలో ప్రతిప్రాణి జీవించుటకు ముఖ్యమయినది ఆహారం. ఒక్కొ ప్రాణి తన దేహాన్ని మరియు స్థితిని బట్టి ఆహారం తీసుకుంటుంది. ఈ సకల ప్రాణుల్లో మనుష్యజాతి ప్రధానం అయినది. మనిషికి రోగాలు ఎక్కడినుంచో ప్రత్యేకంగా రావు . సరైన అవగాహన లేకుండా మనం తీసుకునే విరుద్ద ఆహారపదార్థాలు మనకి రోగాన్ని కలుగచేస్తాయి. అటువంటి విరుద్ద ఆహారపదార్థాలను కొన్నింటిని మీకు తెలియచేస్తాను.

  విరుద్ద ఆహారపదార్థాలు - 

 * నీరు ఎక్కువుగా ఉండు పల్లపు ప్రాంతాలలో ఉండు జంతువుల లేక పక్షి మాంసాలు తినరాదు.

 * తేనె , బెల్లం, పాలు , నువ్వులు , ముల్లంగి, తామర గడ్డలు, మొలకెత్తిన ధాన్యము వీటిలో ఏ ఒక్కదాన్ని మరొకదానితో కలిపి భుజించరాదు . 

 * ఆవనూనెతో పావురం మాంసం వేయించుకొని తినరాదు. 

 * కోడి మాంసంతో పెరుగు కలిపి తినరాదు.

 * చేపలు వేయించగా మిగిలిన నూనెతో పిప్పిళ్లు వేయించరాదు.

 * చేపలు తిని పాలు , పాలపదార్థాలు ఏవి కూడా తీసుకోరాదు . 

 * పుల్లగా ఉండు పదార్థాలతో పాలు చేరిన విషమగును. కావున పులుపుతో చేసిన పదార్థాలు తినిన తరువాత పాల సంబంధమైన ఉత్పత్తులు అసలు సేవించరాదు . ముఖ్యంగా పుల్లని రుచి కలిగిన మామిడి, రేగు , నేరేడు , వెలగ , చింత, దానిమ్మ, కొబ్బరి వంటి వస్తువుల తీసుకున్నపుడు పాలు వాడరాదు. 

 * ఉలవలు, అరిగెలు , కొర్రలు, మినుములు , పెసలు పాలతో తీసుకోరాదు 

 * ముల్లంగి భుజించునప్పుడు పాలు వాడరాదు.

 * మినపప్పు, బెల్లం, పాలు , పెరుగు , నెయ్యి, ఏ ఒక్కదానితోను నిమ్మపండు భుజించరాదు .

 * మద్యం, తేనె , పెరుగు ఈ మూడింటిని వేడిగా ఉండు వస్తువులచే తినరాదు.

 * ఉప్పు కలిపిన పాలు కాని , అన్నం కాని భుజించరాదు .

 * ఆకుకూరలు తిను సమయంలో వెన్న తినరాదు.

 * పాత బియ్యం , కొత్తబియ్యం కలిపి ఒకేసారి వండి తినరాదు.

 * పక్వముకాని వస్తువుని , పక్వము అయిన వస్తువుని కలిపి భుజించరాదు .

 * తేనె , నెయ్యి , జంతువుల కొవ్వు , నువ్వులనూనె , ఆవనూనె, ఆముదం వీటిలో ఏ రెండింటిని కాని , ఏ మూడింటిని కాని సమానంగా కలిపి వాడినచో విషమగును 

 * ప్రస్తుతం డాల్డాను నెయ్యితో కలిపి అమ్ముతున్నారు . దీనిని వాడినచో ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వచ్చును.

 * నువ్వుపిండి , బచ్చలికూర కలిపి భుజించినచో అతిసారవ్యాధి కలుగును.

 * ముల్లంగి ఆకు, ఉల్లిగడ్డలు , మునగాకు , తెల్ల తులసి, అడవి తులసి , నల్ల తులసి మున్నగు ఆకు కూరలు తినిన వెంటనే పాలు తాగిన కుష్టువ్యాది కలుగును.

 * తుప్పు పట్టిన గంటె లు , పాత్రల యందు వొండిన భోజనం మరియు విషలక్షణాలు కలిగిన వంటచెరుకు చేత వండబడిన ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని నాశనం చేయును 

 * రాగిపాత్రలో చేపల కూర వండి తినిన మరణం తప్పదు.

 * బియ్యం వండినప్పుడు పూర్తిగా ఉడకకుండా , అధికంగా చిట్లినట్లు ఉండటం మరియు మాడిపోయిన అన్నం వీటిని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరాదు . 

 * అరటిపండు మరియు మజ్జిగ కలిపి తీసుకోరాదు . 

     పైన చెప్పిన విధంగా విరుద్ద ఆహార పదార్థాలను భుజించినచో శరీరం దారుణమగు రోగాలపాలు అగును.విస్పోటకం అనగా శరీరంపై పొక్కులు లేచే రోగం , గుల్మం, కడుపులో పుండు , క్షయ , రక్తపిత్తం, వాతరోగం, మూత్రాశయంలో రాయి, కుష్టు , భగంధరం ,గ్రహణి వంటి రోగాలు కలుగును.

 
    

పాలుతో ఔషదాలు తీసుకొనడం వలన ఉపయోగాలు -

పాలుతో ఔషదాలు తీసుకొనడం వలన ఉపయోగాలు - 

 * లంఘనం ( ఉపవాసం ) చేత బలహీనుడు అయినవాడు క్షీరం పానం చేయడం వలన బలవంతుడు అగును. అట్టివానికి జ్వరం నశించును. 

 * కాగి చల్లారిన పాలు , కొంచం ఉష్ణంగా ఉన్న పాలు కాలమునెఱిగి జ్వరపీడితుడు సేవించవలెను 
కాచబడినదియు , గోరువెచ్చగా ఉండని పాలను జ్వరపీడితుడు సేవించిన మృత్యుడు అగును.

 * పాలయందు శొంటి , ఖర్జురపు కాయ , ద్రాక్ష వీటిలో ఏదైనను కాచి అందు చెక్కర కాని , నెయ్యి గాని , తెనే కాని వేసి చల్లార్చి అనుపానంగా సేవించిన యెడల దప్పిక , తాపము వీటిని నివర్తింప చేయును . 

 * పాల యందు ద్రాక్ష , చిట్టాముదపు వేరు , యష్టిమధూకం , సుఘంద పాల వేరు , పిప్పిలి , చందనం వీటిచే కాచబడిన పాలు సేవించిన లేక పాలకు నాలుగింతలు నీరు పోసి పిప్పిలి వేసి నీరంతా ఇగురునటుల కాచి తగినంత వేడిగా ఉన్నప్పుడు లొపలికి తీసుకున్న జ్వరం నశించును. 

 * జ్వరం గలవాడు పంచమూలములు పాలల్లో వేసి కాచి అనుపానంగా సేవించిన యొడల చిరకాల జ్వరం నశించుటయే కాక కాసాశ్వాస , తలనొప్పి , పార్శ్వపునొప్పి కూడా నశించును.

 * పాలయందు ఆముదపు వేరు గాని లేక బిల్వపత్రములు గాని వేచి కాచి అనుపానంగా సేవించిన జ్వరం , మలబద్దకం నశించును. 

 * పాల యందు శొంటి , చిట్టాముదపు వేరు , వాకుడు , పల్లేరు , బెల్లము వీటిని వేసి కాచి అనుపానంగా సేవించిన రక్తపిత్తము , అతిసారం , దప్పికతో కూడిన నొప్పులు అన్ని నివర్తించును.

  
    

బహిష్టు నందు అతి రక్తం స్రవించు సమయంలో అతిరక్తంను ఆపుటకు నేను ప్రయోగించిన సులభ యోగం -

బహిష్టు నందు అతి రక్తం స్రవించు సమయంలో అతిరక్తంను ఆపుటకు నేను ప్రయోగించిన సులభ యోగం - 

     కొందరి స్త్రీలలో ముఖ్యముగా యుక్తవయస్సులో ఉన్నటువంటి బాలికలలో అతిరక్తస్రావం జరుగుతుంది. నెలకు 10 నుంచి 15 రోజుల వరకు కూడా బహిష్టు రూపంలో రక్తస్రావం జరుగును. మరికొందరిలో నెలకు రెండుసార్లు బహిష్టు అవుతారు. ఎదిగే వయస్సులో అటువంటి సమస్య రావటం వలన రక్తం విపరీతంగా బయటకి పోయి శరీర దౌర్బల్యానికి గురిఅవుతారు. 

     కొన్ని రోజుల క్రితం ఇటువంటి సమస్యతో బాధపడుతున్న ఒక కుటుంబం నన్ను సంప్రదించారు . యువతి వయస్సు 18 సంవత్సరాలు . ఆ యువతికి బహిష్టు సమయంలో విపరీత రక్తస్రావం జరుగుతుంది.దానివలన బాగా బలహీన పడిపోయింది . 

        బహిష్టు సమయంలో జరిగే రక్తస్రావమునకు మగ్గిన చక్కెరకేళి అరటిపండుకు నాటు ఆవునెయ్యి పూసి తినిపించమని చెప్పాను . కేవలం 3 రోజుల్లో సమస్య తీరినది. 
  
  గర్భాశయము నందు కణతులు లేదా గడ్డలు ఉండి అధిక రక్తస్రావం ఉన్నచో చికిత్స తప్పక చేయవలెను . ఈ మధ్యకాలంలో ఇటువంటి సమస్యలకు ఆపరేషన్ చేసి గర్భాశయం తీసివేస్తున్నారు ఇలా చేయడం వలన శరీరము నందు హార్మోన్స్ అసమతుల్యత ఏర్పడి విపరీతంగా శరీర బరువు పెరిగి అనేకరకాల సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టును . 

     గర్భాశయం తీయాల్సిన పని లేకుండా ఆయుర్వేదము నందు చాలా మంచి చికిత్సలు కలవు . 

 
    

శుశ్రుతాచార్యుడి గర్భాధారణ రహస్యాలు -

శుశ్రుతాచార్యుడి గర్భాధారణ రహస్యాలు -

 * శుక్రము నీటి గుణము కలిగి ఉంటుంది. స్త్రీ యొక్క ఆర్థవం తేజోగుణం కలిగి ఉంటుంది. 

 * ఈ శుక్రశోణితములు యందు పంచభూతాలు సూక్ష్మ రూపము కలిగి ఉండును. 

 * స్త్రీపురుష సంయోగ కాలం నందు శుక్రం అధికంగా ఉండిన యొడల పురుష సంతానం , స్త్రీ యొక్క ఆర్థవం పురుషుడి యొక్క శుక్రం కన్నా ఎక్కువుగా ఉన్నయెడల స్త్రీ సంతానం జనించును. శుక్రం మరియు స్త్రీ యొక్క ఆర్థవం సమాన స్థాయిలో ఉన్న నపుంసకుడు జనించును.

 * స్త్రీ ఋతు స్నానం చేసినది మొదలు 12 దినములు వరకు స్త్రీ యందు ఆర్థవం ఉత్పత్తి అగును. అందుకనే ఆ 12 దినములను ఋతు కాలం అనెదరు . కొన్ని గ్రంధములలో ఋతుకాలమును 16 దినములుగా పేర్కొన్నారు . అనగా స్త్రీ ఋతువు అయిన 3 దినములు వదిలివేసి మిగిలిన 12 దినముల కాలం ను గర్భాదారణ కు మంచి సమయం అని అర్థం . 

 * స్త్రీ ఋతుసమయం 3 దినములు అయిపోయిన వరసగా 4 - 6 - 8 - 10 - 12 దినముల యందు స్త్రీ , పురుష సంయోగం వలన పుత్రుడు , 5 - 7 - 9 - 11 దినముల యందు స్త్రీ పురుష సంయోగం వలన కన్యక జనియించును

 * ఆయాసం , బడలిక, దప్పి , తొడల యందు బలం లేకుండా ఉండటం , యోని యందు వణుకు అను లక్షణాలు స్త్రీ యందు కనిపించినచో ఆ స్త్రీ గర్బం ధరించినది అని తెలుసుకొనవలెను . ఇవి ప్రాధమిక లక్షణాలు .

 * చనుమొనలు నలుపురంగుకు మారు ట , కనురెప్పలు ఒకదానికొకటి కలియిచుండుట , కారణం లేకుండానే వాంతి అగుట. మంచి సువాసన గిట్టకుండా ఉండటం. నోటి యందు నీరు ఎక్కువ వూరుట , శరీరం సడులు ట ఇట్టి లక్షణములు గల స్త్రీ గర్భిణి అని తెలియవలెను . 

 * గర్భిణి అని తెలుసుకున్న మొదలు శ్రమకరమైన పనులు , మైథునం , పూర్తిగా కడుపు నిండగా భుజించరాదు , రాత్రి యందు ఎక్కువుగా మేలుకొని ఉండరాదు. ఎక్కువ లంఖణం అనగా ఉపవాసం చేయరాదు , దుఃఖం చెందరాదు, బండి , గుఱ్ఱము మొదలుగు వాహనములు ఎక్కరాదు , భయంకరమైన పనులు చూడరాదు, కాళ్లు , చేతులు ముడుచుకుని కూర్చోరాదు , ఎత్తుపల్లాలు గల ప్రదేశంలో కూర్చోరాదు , మలమూత్ర వేగములను నిరోధించరాదు . 

 * వాతాదిదోషములు వలన గాని , కర్రదెబ్బల వలన గాని గర్భిణి ఏయే అవయముల యందు వేదన పొందునో గర్భము నందు శిశువు కూడా ఆయా అవయముల యందు వేదన పొందును.

 * గర్బము ను ధరించిన ప్రథమ మాసం నందు జిగట వలే ఉండును. ద్వితీయ మాసం నందు కఫవాతపిత్తం వలన పరిపాకమును చెంది పంచభూతాత్మము అయ్యి స్వల్పంగా ఘనీభవం చెందును . అట్టి గర్భం స్పర్శం వలన పిండాకారంగా ఉండిన పురుష గర్బం , పొడుగుగా ఉండిన స్త్రీ గర్బం అనియు , ఒక ముద్దవలే ఉండిన నపుంసక గర్బం అవును. స్త్రీ గర్భం ఇటుక రాయి ఆకారం వలే ఉండును అనియు , పురుష గర్బం అనునది గుండ్రముగా కఠినముగా ఉండునని , నపుంసక గర్భం అనునది గుండ్రని ఫలం యొక్క అర్ధభాగం వలే ఉండును . భోజుడు తన వైద్య గ్రంథం నందు వివరించాడు.

                  తృతీయ మాసం నందు గర్భమునకు పాదములు , హస్తములు, శిరస్సు అనునవి పుట్టును. మరియు ఆ మాసం నందే చెంపలు , ముక్కు, పెదవులు, నేత్రములు , చెవులు , వ్రేళ్లు మొదలగు ప్రత్యంగములు సూక్ష్మ రూపంలో జనించును.నాలుగోవ మాసం నందు అన్ని అంగములు సూక్ష్మరూపంగా జనించును. ఆ మాసం నందే గర్బం నందు హృదయం ఆత్మకు స్థానం అగుట వలన దానికి ఆత్మకు సంభందం ఏర్పడును . 

                 అయిదోవ మాసం నందు మనస్సు , ఆరోవమాసం నందు బుద్ది, ఎడొవ మాసం నందు హస్తములు , పాదములు , నాసిక , వ్రేళ్లు , కేశములు పూర్తిగా ఏర్పడును . ఎనిమిదో మాసం నందు హృదయం నందు ఓజస్సు సర్వ ధాతువులు ఓజస్సు రూపం నొంది అస్థిరంగా ఉండును. ఎనిమిదో మాసం నందు గర్భిణి ప్రసవించినచో దోషం కలిగి ఉండును. కావున కుమార తంత్రం నందు చెప్పబడిన బలి విధానం ఆచరించవలెను . తొమ్మిదో మాసం నందు సర్వ అంగములు పరిపూర్ణంగా అభివృద్ధి చెంది గర్భిణి పరిపూర్ణ శిశువుని ప్రసవించును.

                గర్బముకు మాంసం , రక్తం , మేథస్సు , మజ్జ లేదా మూలుగ , హృదయం , నాభి , లివరు , ప్లీహం , ఆంత్రములు , గుదము మొదలగు మృదు అంగములు తల్లి నుంచి ఏర్పడును . 

        మొదట దక్షిణ స్థనం నందు పాల ఉత్పత్తి అగును. కుడికన్ను పెద్దదిగా కనపడును. తొలుత కుడితోడ గర్భభారము చేత ఉబ్బి ఉండునట్లు అగుపడును. స్వప్నం నందు కమలములు కనపడుట, మరియు నల్ల కలువలు కనపడును , తెల్ల కలువలు , మామిడిపండ్లు మొదలగునవి కనపడును. మొఖం ఎప్పుడూ ప్రశాంతంగా కనపడును ఇటువంటి లక్షణములు కల గర్భిణి స్త్రీ పుతృనిని కనును. దీనికి వ్యతిరేక లక్షణాలు కలిగిన గర్బిణి పుత్రికను కనును. రెండు తొడలు పెద్దగా కనిపిస్తూ కడుపు ముందుకు వచ్చి పైన చెప్పిన రెండు రకాల లక్షణాలు కలిగిన స్త్రీ నపుంసకుడుకి జన్మనిచ్చును. 

           ఏ గర్భిణి స్త్రీ కడుపు మధ్య భాగం పల్లంగా కనిపించుచుండునో అట్టి స్త్రీ కవలపిల్లలను జన్మనిచ్చును.


    

శిరా వేధ పద్ధతి - ప్రాచీన చికిత్సా పద్దతి .

శిరా వేధ పద్ధతి - ప్రాచీన చికిత్సా పద్దతి . 

      ఈ శిరావేధ చికిత్స మన ఆయుర్వేదము నందు తప్ప ఏ ఇతర వైద్యము నందు లేదు . ఈ శిరావేధ పద్దతి ద్వారా అసాధ్యవ్యాధులను పోగొట్టవచ్చు .
 శిరావేధ పద్ధతిని "రక్తమోక్షణం " అని కూడా అంటారు.ఇప్పుడు ఈ ప్రాచీన చికిత్స గురించి మీకు సంపూర్ణముగా వివరిస్తాను. 

              మానవ శరీరం నందు మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 700 శిరలు కలవు . ఈ శిరలు శరీరమంతటా వ్యాపించి చిన్నచిన్న నీటికాలువలు తోటలోని అన్ని చెట్లకు నీటిని ఎలా అందచేయునో అదేవిధముగా శరీరంలోని అన్ని భాగములకు మనము తినిన ఆహారపదార్ధము వలన జనించు రసాధి ధాతువులను అందచేసి శరీరంను పోషించుచున్నవి. శరీరంలో అవయవములు ముడుచుకొనుట , చాచుట వంటి కార్యక్రములకు తోడ్పడుచున్నవి. శరీరంలోని వాత,పిత్త,కఫములు రక్తమునందు చేరి శరీరము అంతటా ప్రసరించుచున్నవి. శరీరము నందలి వాతాదులు అధికంగా వహించు శిరలకు వెఱువేఱు రంగులు , పనులు ఉండును. హస్త, పాదముల యందు 400 శిరలు కలవు. ఉదరము నందు 136 , శిరస్సు నందు 164 ఇలా మొత్తం 700 శిరలు కలవు. వీటిలో హస్తము , పాదముల యందు 16 శిరలు , ఉదరము నందలి 32 శిరలు , మెడకు పైభాగము వేధింపతగినవిగా గుర్తించవలెను. "ఇక్కడ వేధింపడం అనగా శిరకు రంధ్రం చేసి దుష్టరక్తం తీయటం " శిరావేధ చేయు వైద్యుడు మర్మలకు సన్నిహితముగా ఉండు శిరలను వేధించరాదు . శిరల గురించి వాటి స్థానము గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వైద్యుడు మాత్రమే చికిత్స చేయవలెను . 

    మర్మలకు సన్నిహితముగా ఉన్న శిరలను వేధించిన కొత్తరోగములు వచ్చుట , అంగవైకల్యము సంప్రాప్తిచుట జరుగును . ఒక్కోసారి ప్రాణములు పోవటం కూడా జరుగును. సరిగ్గా చికిత్స చేసిన అసాధ్యరోగములు పోగొట్టవచ్చు .మర్మలు మరియు మర్మస్థానములు అనగా శరీరము నందు వాయుప్రసరణ జరుగు నాడీ జంక్షనులు .ఈ శిరావేధనము బాలలు , వృద్దులు , క్షీణించినవారు , తాత్కాలిక కారణాల వలన నీరసించినవారు మొదలగువారికి నిషిద్దం . ఒకవేళ పాముకాటుకు గురైన నిషేధింపబడిన వారికి కూడా శిరావేదన చికిత్స చేయవచ్చు . అలా చేసిన బ్రతకగలరు . ఇప్పుడు మీకు ఈ శిరావేదన పధ్ధతి గురించి సంపూర్ణముగా వివరిస్తాను. 

                      శిరలను వేధించుటకు ముందుగా శిరస్సు , పాదములు , హస్తములు , ఉదరము , పార్శ్వములు మొదలగు స్థానములందలి శిరలు స్పష్టముగా కనపడేలా గుడ్డతో కట్టిన పిమ్మట వ్రీహిముఖము అను ఒక శస్త్రముతో ఆయాస్థానములు అనుసరించి యవగింజ ప్రమాణము , అర్ధయావగింజ అంత లోతుగా వేధించవలెను . వేధ చేయవలసిన కాలములను సరిగ్గా గుర్తించవలెను . వేధ చేసిన పిమ్మట సువిద్ద ,దుర్విద్ధ లక్షణములు , దుష్టరక్త స్వరూపము , మంచి రక్తస్వరూపము , రక్తము వేధన చేసినను రాకుండా ఉండటం , లేక అధికరక్తస్రావం అగుట , ఎట్టివారికి ఎంత రక్తము తీయవలెను ఇత్యాది లక్షణములను , విధులను బాగుగా గుర్తించి రక్తమోక్షణము చేయవలెను . 

      
      ఈ రక్తమోక్షణం ఏయే భాగాలలో చేస్తే ఏయే వ్యాధులు తగ్గునో మీకు వివరిస్తాను . 

  * పాదదాహము , పాద హర్షము ( గుర్రం మూతి ) , చిప్పము , విసర్పి , వాతరక్తం ( గౌట్ ) , వాత కంటము , విచర్చికా , పాదదారి మొదలగు వ్యాధుల యందు హస్తపాదముల మధ్య ఉండు క్షిప్రమర్మములకు పైభాగమున రెండు అంగుళములలో విహ్రీ ముఖము ( సన్నటి పరికరం ) తో శిరకు రంధ్రం చేసి దుష్టరక్తమును తీయవలెను . 

 * క్రోష్టుక శీర్షము , ఖంజము , పంగు వంటి వాతవ్యాధులకు చీలమండకు పైన నాలుగు అంగుళములలోని పిక్క యందు శిరకు రంధ్రం చేయవలెను . 

 * గృదసీవాతం ( సయాటికా ) నందు మోకాలు సంధికి నాలుగు అంగుళముల కింద గాని , పైన గాని శిరకు రంధ్రం చేయవలెను . 

 * గళ గండ రోగము నందు తొడ మొదట ఆశ్రయించి ఉండు శిరను వేధించిన కంఠమును ఆశ్రయించి ఉండు గళగండ రోగము నివృత్తి అగును. 

 * ప్లీహ ( spleen ) రోగము నందు ఎడమచేయి మోచేతి సంధి యందు ఉండు శిరను గాని లేక చేతి యొక్క చిటికెనవ్రేలుకు , ఉంగరం వ్రేలుకు మధ్య యందు ఉండు శిరను వేధించవలెను . 

 * కాలేయరోగము నందు ప్లీహమునకు చెప్పినట్టు కుడివైపున చేయవలెను . శ్వాసకాసలకు కూడ కుడి పార్శ్వముల యందు ఉండు శిరలను వేధించవలెను . 

 * పరివర్తిక , ఉపదంశ , శుక్రదోషముల యందు , శుక్రవ్యాధుల యందు శిశ్నము మధ్యయందలి శిరను వేధించవలెను . 

 * అసాధ్యములగు అంతర్విద్రదుల యందు , పార్శ్వశూల ( ఒకవైపు తలనొప్పి ) కక్షా స్థనభాగముల మధ్యవుండు శిరను వేధించవలెను . 

 * అసాధ్యమగు తృతీయక జ్వరం నందు ముడ్దిపూసకు మధ్య వెన్నెముక క్రింద ఉన్న శిరను వేధించవలెను . 

 * అసాధ్యమగు చాతుర్ధికా జ్వరం నందు భుజశిరస్సులకు క్రిందగా రెండు పార్శ్వముల యందు ఉండు సిరలలో ఎదైనా ఒకదానిని వేధించవలెను . 

             ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతిరోగానికి ఏయే భాగములో శిరావేధ చేయవచ్చో అత్యంత ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో వివరణాత్మకంగా ఉన్నది . 

ఆయుర్వేదం నందలి నిద్ర నియమాలు -

ఆయుర్వేదం నందలి నిద్ర నియమాలు - 

 * ఆరోగ్యం , శరీరపుష్టి , రోగము , కృశత్వము , బలము , శరీర బలహీనత , పురుషత్వము , నపుంసకత్వం , జ్ఞానము , అజ్ఞానము , జీవితము , మరణము ఇవన్నియు నిద్రకు అధీనములై ఉన్నవి. అనగా నిద్రపైన ఆధారపడి ఉన్నవని అర్థం.

 * నిద్రించుటకు రాత్రియే సరైన సమయము . రాత్రి సమయము నందు 6 లేక 9 గంటల కాలం నిద్రించవలెను. కాలాన్ని అతిక్రమించక నిద్రించవలెను. ఒకవేళ రాత్రి సమయము నందు జాగరణ చేయవలసి వచ్చినచో అట్టి జాగరణ ఎంత సమయం చేసినారో అందు సగం సమయం భోజనమునకు పూర్వము నందే ప్రాతఃకాలము నందే నిద్రించవలెను.

 * రాత్రి సమయము నందు ఎక్కువ కాలం జాగరణ చేసినచో శరీరం నందు రూక్షగుణం ఎక్కువై వాతరోగములు కలుగును.

 * వృద్దులు , బాలురు , బలహీనులు , ధాతుక్షయం కలవారు , శ్వాస , హిక్కా , అతిసారం , దెబ్బలు తగిలినవారు , శూల , దప్పి , అజీర్ణం , ఉన్మాదం రోగములు కలవారు , అధికంగా మాట్లాడుట , ఆయాసం కలిగించు పనులు , గుర్రము , ఒంటె మొదలగువానిపై స్వారి చేయుట , మార్గగమనము , మద్యములు తాగుట , సంభోగం చేసినవారు , భయం , కోపం , శోకములచే శ్రమ పొందినవారు , ప్రతిదినం మధ్యాహ్నం నిద్రించుట అలవాటుగా గలవారు పగలు నిద్రించవచ్చు. అందువలన దోష , ధాతు సమానత కలుగును.

 * ఎక్కువైన మేథస్సు , కఫం కలిగినవారు , గట్టిగా ఉండు ఆహారం తీసుకున్నవారు ఎప్పుడూ పగలు నిద్రించకూడదు. ఇటువంటివారు గ్రీష్మకాలం నందు కూడా నిద్రించరాదు . విషపీడితుడు , కంటరోగం కలవాడు రాత్రులయందు కూడా నిద్రించరాదు .

 * ఆకాలంలో నిద్రించుచున్న ఆరోగ్యమును , ఆయువును నశింపచేయుటయే గాక మోహము , జ్వరం , పీనస , శిరోరగము , వాపు , మూత్రబంధనం వంటిరోగాలు కలుగును.

 * నిద్రయొక్క వేగమును ఆపుట వలన మోహము , తలబరువు , కండ్లునొప్పులు , సోమరితనం , ఆవలింతలు , శరీరం బరువు పెరగటం వంటివి కలుగును. ఇట్టి స్థితి యందు శరీరమర్ధనం , శరీర అంగములు పిసుకుట , నిద్రించుట చేయవలెను .

 * రాత్రినిద్ర తక్కువైనచో అట్టికాలములో మరురోజు ఉదయమున భోజనం చేయకుండా నిద్రించవలెను . రాత్రియందు సక్రమముగా నిద్రపట్టనివారు క్షీరము , మద్యము , మాంసరసము , పెరుగు వీనిని తాగవలెను . అభ్యంగనం , స్నానం మొదలగునవి ఆచరించవలెను.

 * నిద్రించునప్పుడు నిద్రాభంగము కలిగినచో బడలిక , సోమరితనం , తలబరువు , ఆవలింతలు , ఒళ్ళు నొప్పులు , బడలికగా ఉండటం , పనుల యందు ఇష్టం లేకుండా ఉండటం , భ్రమ , అజీర్ణం , వాతరోగములు కలుగును.

 * కూర్చుండి నిద్రపోయినచో కఫవృద్ధి , ఆరోగ్యభంగం కలుగదు .

            

బొట్టు పెట్టుకునే స్థలంలో ఏర్పడే మచ్చ నివారణ కొరకు -

బొట్టు పెట్టుకునే స్థలంలో ఏర్పడే మచ్చ నివారణ కొరకు -

చాలా మంది ఆడవారిలో ఇది ప్రధాన సమస్య . విష రసాయనాలు కలిగిన బొట్టు బిళ్ళలు వాడటం వలన మచ్చ ఏర్పడి అసహ్యకరంగా కనిపిస్తుంది. దాని నివారణ కొరకు ఈ యోగమును ఉపయోగించుకోగలరు .

మారేడు దళము లను మెత్తగా నూరి లేపనం చేస్తుంటే బొట్టు పెట్టుకునే స్థలంలో ఎర్పడే పుండు , మచ్చ పోవును

  
   

అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు -

అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు - 

    కొంతకాలం క్రితం అశ్వగంధ గురించి కొన్ని వివరాలు మీకు అందించాను. ఈ మధ్యకాలంలో అశ్వగంధ గురించి మరింత విలువైన సమాచారం తెలుసుకున్నాను . వీటిలో చాలా వరకు నేను నా పేషెంట్స్ కి ఇచ్చినప్పుడు కొన్ని ఇతర సమస్యలు తీరడం నా దృష్టికి వచ్చింది. ఇప్పుడు నా స్వానుభావాలు మరియు కొన్ని అత్యంత పురాతన గ్రంథ పరిశోధనలో నాకు లభ్యమైనవి కూడా మీకు వివరిస్తాను . 

 స్వచ్ఛమైన అశ్వగంధ తయారీ విధానం - 

      మెట్టభూములు మరియు అడవులలో లభ్యమగు మంచి ముదురు పెన్నేరు గడ్డలను తెచ్చి మట్టి , ఇసుక , దుమ్ము వంటి వ్యర్థపదార్థాలు లేకుండా శుభ్రపరచుకొని నీడ యందు ఎండించవలెను . పూర్తిగా ఎండిన తరువాత కత్తితో ముక్కలుగా కొట్టి ఒక గిన్నెలో వేసి అవి మునుగునంత వరకు దేశి ఆవుపాలు పోసి సన్నటిసెగపైన పాలు ఇగురునంత వరకు ఉడికించవలెను . అలా ఉడికించిన తరువాత గడ్డలను బాగుగా ఎండించవలెను . ఆ దుంపల యందు తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు ఎండించవలెను . లేనిచో ఆ దుంపలకు బూజు పట్టును . ఇలా పూర్తిగా ఎండిన దుంపలను మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా మొత్తం 11 సార్లు చేసి ఆ తరువాత బాగుగా ఎండించి చూర్ణం చేసి వస్త్రగాలితం చేసుకుని వచ్చిన మెత్తటి చూర్ణాన్ని తడి తగలకుండా జాగ్రత్తగా నిలువచేసుకోవలెను . 

 మోతాదు - 

     2 నుంచి 3 గ్రాముల మోతాదులో ఉదయము మరియు సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఆయా సమస్యను బట్టి వైద్యులు సూచించిన అనుపానంతో వాడవలెను . 

       అశ్వగంధ 7 సార్లు శుద్ది చేయవలెను అని చెప్పుదురు . 11 సార్లు శుద్ది చేసిన ప్రశస్తముగా ఉండును . మరియు బలంగా పనిచేయును . 

  ఔషధోపయోగాలు - 

 * శరీరానికి అమితమైన బలాన్ని ఇచ్చును . శుష్కించు శరీరం కలవారు దీనిని వాడుట వలన శరీరానికి కండపట్టి బలంగా తయారగుదురు . 

 * నిద్రలేమితో బాధపడువారికి ఈ అశ్వగంధ అత్యంతద్భుతముగా పనిచేయును . అశ్వగంధ ప్రధానముగా నరాల మీద పనిచేసి నరాలకు బలాన్ని చేకూర్చును . దీనిని వాడుట వలన ప్రశాంతమైన నిద్ర లభించును . 

 * క్షయరోగముతో ఇబ్బంది పడువారికి ఇది అత్యంత బలవర్ధకమైనది . ఊపిరితిత్తులకు బలాన్ని చేకూర్చుటయే కాక శరీర రోగనిరోధక శక్తి పెంచుటలో అత్యంత వేగముగా పనిచేయును . 

 * విరిగిన ఎముకలు త్వరగా కట్టుకొనుటకు ఈ అశ్వగంధ బాగుగా పనిచేయును . 

 * స్త్రీలు మరియు పురుషలలో కలుగు వంద్యదోషాలను నివారించును . 

 * రక్తము నందలి దోషములను పోగొట్టును . 

 * కీళ్లనొప్పులు నుంచి ఉపశమనం కలిగించును . 

 * నాడీవ్యవస్థ కు చెందిన వ్యాధుల పైన బాగుగా పనిచేయును . 

 * పక్షవాతం మొదలగు వాతవ్యాధుల యందు దీని పనితీరు అద్బుతముగా ఉంటుంది . 

 * మెదడులోని న్యూరాన్ల పైన దీని ప్రభావం ఉంటుంది. దీనిని వాడుట మూలన మెదడు చురుకుగా పనిచేయును . జ్ఞాపకశక్తి మెరుగుపడును . 

 * అగ్నిమాంద్యము , మలబద్దకం నివారించును .

 * బాలింతలకు వచ్చు సూతికారోగము నివారించును . 

 * శరీరంలోని టాక్సిన్స్ బయటకి పంపి శరీరాన్ని శుద్ది చేయును . 

 * కఫ సంబంధ దోషములైన శ్వాస ( ఆయాసం ) , శోష మొదలైన వాటిని నివారించును . 

 * గ్రంధి సంబంధ రోగాలు ఉదాహరణకి థైరాయిడ్ వంటి వాటిపై అమోఘముగా పనిచేయును . 

 * గుండెసంబంధ సమస్యల కలవారు అశ్వగంధ వాడవలెను . 

 * కొంతమంది పిల్లలు శారీరకంగా ఎండుకుపోయి ఉంటారు. అటువంటివారికి తేనె అనుపానంగా ఈ అశ్వగంధ చూర్ణమును ఇచ్చిన మంచి కండపట్టి పుష్టిగా తయారగుదురు . 

 * వృద్ధాప్యము నందు వచ్చు సమస్యలను ఎదుర్కోవడానికి అశ్వగంధ నిత్యము సేవించవలెను . 

 * స్త్రీల శారీరక బలహీనతని పోగొట్టును . ప్రదర రోగములను నివారించును . 

 * మూర్చరోగులకు ఇది వరం వంటిది . 

 * స్త్రీలలో కలుగు బహిష్టు సంబంధ సమస్యలను నివారించును . 

 * స్త్రీ మరియు పురుషులలో హార్మోన్స్ మీద ఇది చాలా అద్బుతముగా పనిచేయును . 

      

ప్రాచీన భారతీయ పురాణాలలో వివరించినటువంటి "బ్రహ్మస్త్రం" గురించి సంపూర్ణ వివరణ -

ప్రాచీన భారతీయ పురాణాలలో వివరించినటువంటి "బ్రహ్మస్త్రం" గురించి సంపూర్ణ వివరణ -

           మన భారతీయ పురాణాలు చదివినవారికి "బ్రహ్మస్త్రం " అనే పేరు అత్యంత సుపరిచితం అయినదే ముఖ్యంగా రామాయణ , మహాభారతాలలో ఎక్కువుగా వినిపిస్తుంది. ఈ బ్రహ్మస్త్ర ప్రయోగం మరియు దాని వివరాలు గురించి భారతీయులమైన మనకంటే పాశ్చాత్య శాస్త్రజ్ఞులకు ఈ విషయాల గురించి సంపూర్ణ అవగాహన ఉన్నది. దీనికి ప్రధాన కారణం మనం నిర్లక్ష్యం చేసి వదిలివేసిన ఎన్నో అద్భుతగ్రంధాలు మరియు విజ్ఞానాన్ని వారు అర్థం చేసుకుని ఆదరించడమే . అలాంటి కొన్ని విజ్ఞానదాయకమైన విషయాలు మరుగునపడిపోయిన ఎన్నో విషయాలను మీకు తెలియచేయడానికి నావంతు ప్రయత్నం చేస్తున్నాను . ఇప్పుడు మీకు ప్రాచీన భారతీయ యుద్ధాలలో ఉపయోగించిన "బ్రహ్మస్త్రం" అనే ఒక భయంకర ఆయుధం గురించి వివరిస్తాను. దీనినే మనం ఈ ఆధునిక యుగంలో "ఆటంబాంబు " అని పిలుచుకుంటున్నాం.

                1945 వ సంవత్సరం జులై 16 వ సంవత్సరం తెల్లవారుజామున 5:30 సమయములో న్యూమెక్సికో ఎడారిలో ఒక బాంబు పరీక్షించారు. ఈ ప్రయోగం సరిగ్గా హిరోషిమా నగరం పైన అణుబాంబు ప్రయోగించడానికి నెలరోజుల ముందు జరిగింది. ఈ ప్రయోగం జరిగిన తరువాత ఓపెన్ హమీర్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త రోచస్టర్ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తున్నప్పుడు ఒక విద్యార్థి "మీ ప్రయోగం ప్రపంచంలో మొదటిసారే కదా ?" అని అడిగినాడు . అందుకు హమీర్ అవును ఇది ఈ ఆధునిక కాలంలో మాత్రం మొదటిది అని భారతదేశంలో జరిగిన పురాతన యుద్ధగాథలు , మహాభారతం గురించి వివరించాడు.

          ప్రాచీన భారతీయ పురాణాలలో బ్రహ్మస్త్రం గురించి ఈ విధముగా ఉన్నది. "అది ఒక్కటే బాణం కాని ఈ విశ్వశక్తి మొత్తం దానిలో ఇమిడి ఉన్నది. పదివేల సూర్యులు పగిలినట్లు మంటలు లేచి గగనాన్ని దేదీప్యమానం చేశాయి. ఒక ఇనుప పిడి లాంటి దానితో బిగించిన ఆయుధం ఇది. అజేయమైన మృత్యుసందేశాన్ని తెచ్చిన పిడుగు అది . సమస్త భవనాలను , కందకాలను బూడిద చేసివేసింది. కాలిపోయిన మనుష్యులెవరో గుర్తుపట్టటానికి వీలుకాలేదు . వెంట్రుకలు , గోళ్లు , కండ్లు , పండ్లు ఊడిపడిపోయాయి . పక్షులు , పశువులు , వృక్షాలు చచ్చి తెల్లగా మారిపోయాయి. కొన్ని గంటల తరువాత ఆహారధాన్యాలు , వాతావరణం విషతుల్యం అయిపోయాయి. సైనికులు బావులలో , నదులలో దూకి మంటలు ఆర్చుకున్నారు" అని చెప్పబడినది. దీని గురించి మరిన్ని విషయాలు " with out trace " అను గ్రంధమున ఉదహరించారు. ఈ హమీర్ అనే శాస్త్రవేత్త సంస్కృతంలో మంచి పండితుడు . ఈయన న్యూ మెక్సికోలో అటామిక్ బాంబు పరిశోధనాలయా డైరెక్టర్ గా వ్యవహరించారు.

           సుప్రసిద్ద సోవియట్ పండితుడు అయిన A .A . గోర్బోవిస్కీ తన గ్రంథం "book of హైపోథెసిస్ " లో కూడా చాలా వివరణలు ఇచ్చారు . మన ప్రాచీన భారతీయులకు అణ్వస్త్ర విషయాల గురించి సంపూర్ణంగా తెలుసు. హరప్పా, మొహంజదారో నాగరికతలు విరాజిల్లిన కొన్ని ప్రదేశాలలో తవ్వకాలు జరిపినప్పుడు అక్కడి వీధుల్లో నల్లగా కాలిపోయిన ముద్దల వంటి పదార్థం దొరికింది . మొదట శాస్త్రవేత్తలకు అది ఎలాంటి పదార్థమో అంతుబట్టలేదు . దానిని ప్రయోగశాలలో పరీక్షించినప్పుడు అది మట్టితో చేసిన కుండపెంకులుగా నిర్దారించబడినవి . ఆ పదార్థం తీవ్రమైన వేడికి కరిగిపోయినదిగా నిర్దారించబడినది. అంతేకాదు ఆ పదార్థం తీవ్రమైన రేడియేషన్ కి గురిఅయ్యినది. ఉండవలసిన రేడియేషన్ స్థాయి కంటే కొన్ని వందల రెట్ల రేడియేషన్ ప్రభావం కనిపించింది.

                 4000 సంవత్సరాల క్రితం మరణించిన ఒక వ్యక్తి అస్థిపంజరంలో మామూలు ప్రమాణం కంటే ఎన్నో వందలరెట్ల రేడియోధార్మికత కనిపించింది. ఈ బ్రహ్మస్త్రాన్ని గురించి దక్షిణ అమెరికాలో కొన్ని పురాతన గ్రంథాలలో కూడా వివరణ ఉన్నది. అక్కడి గ్రంథాలలో దానిని "మాష్ మాకి " అనే పేరుతో పిలుస్తారు . భారతీయ ప్రాచీన వైమానిక శాస్త్రం అయినటువంటి "సమరాంగణ సూత్రధార " లో కూడా ఈ విషయాల గురించి వివరణ ఉన్నది.

          ఇలాంటి ఎన్నో రహస్యమైన భయంకర ఆయుధాలు మరియు పుష్పక విమానాలు వంటి వాటిని మరియు ఎన్నో రహస్య విద్యలకు సంబంధించిన సమస్త సమచారాన్ని కొన్ని రహస్య ప్రదేశాల్లో మన పూర్వీకులు దాచి ఉంచారు .

     

మన ప్రాచీన భారతీయ విజ్ఞానులు ఉపయోగించిన పుష్పకవిమానాల గురించి వివరణ -

మన ప్రాచీన భారతీయ విజ్ఞానులు ఉపయోగించిన పుష్పకవిమానాల గురించి వివరణ -

    ఈ ప్రపంచం లో ఎన్నో విచిత్రమైన , రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. మనిషి ఈ ప్రపంచాన్ని జయించాను అని అనుకుంటున్నాడు. కాని ఇప్పటివరకు తెలుసుకున్నది ఒక్క శాతమే . వాటిలో ముఖ్యమైనది పుష్పకవిమానాలు . ప్రస్తుతం చాలా వీడియోలు మనకి అందుబాటులో ఉన్నాయి . కాని వాటి గురించి పూర్తి సమాచారం ఎవ్వరికి అందుబాటులో లేదు . నా పరిధిని అనుసరించి కొంతసమాచారం నేను సేకరించాను . అది ఇప్పుడు మీకు తెలియచేస్తాను.  

      ఒకనాటి భారతీయ చక్రవర్తి సామ్రాట్ అశోకుడు తొమ్మిది మంది గుర్తుతెలియని వ్యక్తులతో ఒక రహస్య విభాగాన్ని ఏర్పరిచాడు. ఇందులోని వ్యక్తుల అపర మేధావులు వీరి ప్రధాన విధి వివిధ రకాల శాస్త్రాలు శోధించి మధించడం . దీనికి ప్రధాన కారణం అంతకు ముందు జరిగిన యుద్ధాలలో జరిగిన దారుణ మారణహోమం , రక్తపుటేరులు చూసి మనస్సు చలించి బౌద్ధమతం స్వీకరించాడు . ఈ సమయంలో తను అంతకు ముందు నియమించిన రహస్య శాస్త్రవేత్తలు భారతీయ వేదాలు , ప్రాచీన గ్రంధాలు కాచివడబోసి రూపొందించిన ఆధునిక వైజ్ఞానిక సమాచారం బయటకి పొక్కితే దానిని యుద్ధం వంటి దుష్ప్రయోజనాలకి వాడతారేమో అని అశొకుడు భయపడ్డాడు . అందుకే రహస్య విభాగంలోని శాస్త్రవేత్తల కార్యకలాపాల్ని అత్యంత రహస్యముగా ఉంచాడు. 

         అశోకుడు నియమించిన ఈ తొమ్మిది మంది వ్యక్తులు తొమ్మిది వేరువేరు అమూల్యమైన గ్రంథాలు రచించారు. వాటిలో ఒక అద్బుత గ్రంథం " గురుత్వాకర్షణ శక్తి రహస్యాలు " దీని గురించి చరిత్రకారులు కు తెలుసు కాని వారు దాన్ని ఎప్పుడూ చూడలేదు . ఈ పుస్తకం ప్రధానంగా "గురుత్వాకర్షణ శక్తి నియంత్రణ" సమాచారం కలిగి ఉంటుంది. ఈ పుస్తకం ప్రపంచంలో ఎక్కడో ఒక రహస్య గ్రంధాలయంలో ఉంటుంది అని చరిత్రకారులు భావిస్తున్నారు .దీనికోసం చాలామంది రహస్యంగా ప్రయత్నిస్తున్నారు. ఈ గ్రంథం టిబెట్ లేదా భారతదేశంలో ఎక్కడైనా ఉండవచ్చు.  

          కొన్ని సంవత్సరాల క్రితం టిబెట్ లోని లాసాలో కొన్ని ప్రాచీన తాళపత్రాలు చైనీయులకు లభించాయి. అవి ప్రాచీన సంస్కృతంలో ఉన్నాయి . వాటిని అనువాద నిమిత్తం భారతదేశంలోని చండీగఢ్ విశ్వవిద్యాలయానికి పంపించారు. వాటిలో గ్రహాంతర అంతరిక్ష వాహనాల నిర్మాణానికి సంబంధించిన సూత్రాలు ఈ పత్రాలలో ఉన్నాయి అని చండీగఢ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలియచేసారు. 

           లాసాలో లభ్యమైన పత్రాలలో అంతరిక్ష వాహనాలను అస్థ్రాలుగా పేర్కొన్నారు . ప్రాచీన భారతీయులు సదరు వాహనాలలో కొందరు యోధులను ఇతర గ్రహాలకు పంపించి ఉండవచ్చు అని ఈ తాళపత్రాలను పరిశీలించిన డాక్టర్ రైనా తెలియజేసారు. అదృశ్య గ్రాహక శక్తికి పరాకాష్టగా చెప్పుకొనే "యాంటిమ" చిన్న వస్తువుని సైతం కొండంత బరువుగా మార్చే "గరిమ" , పెద్ద వస్తువుని సైతం బరువుతక్కువ గా చేయగల "లగిమ" రహస్యాలు కూడా ఈ ప్రాచీన తాళపత్రాలలో నిగూఢంగా ఉన్నాయి.

         చైనా ఈ తాళపత్ర గ్రంథాలు పంపినప్పుడు భారతీయ పరిశోధకులు అంత సీరియస్ గా తీసుకోలేదు . ఈ ప్రతుల్లోని కొంత డేటా తమ అంతరిక్ష పరిశోధనల్లో చేరుస్తున్నాం అని చైనా ప్రకటించడంతో అప్పుడు ఆ పత్రాల విలువ భారతీయ పరిశోధకులకు తెలిసివచ్చింది . యాంటి గ్రావిటీ గురించి పరిశోధిస్తున్నాం అని ఒక ప్రభుత్వం ప్రకటించడం ఇదే తొలిసారి .

          గ్రహాంతర ప్రయాణం అంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని ప్రాచీన తాళపత్రాలు లో అంత వివరంగా లేదు . కాని మొత్తంమీద చూస్తే చంద్రుడిపైకి మాత్రం ఒకసారి యాత్ర జరిగినట్టు వివరిస్తున్నాయి . భారతీయ ప్రాచీన కావ్యం అయిన రామాయణంలో ఒక విమానంతో చంద్రుడి పైకి అంతరిక్ష యాత్ర చేసినట్టు ఉంది . రావణుని మరణం తప్పించడం కోసం మండోదరి అమృత బాండాన్ని చంద్రుడి పైకి వెళ్లి సాధించుకొని వచ్చి రావణుడికి కూడా తెలియకుండా విభీషణుని సహాయంతో రావణుని ఉదరభాగంలో ప్రతిష్టించింది . ఇది రామాయణంలో నేను కూడా చదివాను. 

           నిజానికి ఈ పత్రాలు భారతీయులు ఉపయోగించిన యాంటీ గ్రావిటీ , ఏరోస్పేస్ టెక్నాలజీ కి సంబంధించిన ఇటీవల లభ్యమైన చాలా స్వల్పమైన సాక్ష్యాధారాలు మాత్రమే . వారి పూర్తిపరిజ్ఞాన్ని మనం అర్ధం చేసుకోవాలి అంటే మనం కాలచక్రంలో చాలా వెనకకి వెళ్లవలిసిందే . 

            ఉత్తర భారతదేశం ,పాకిస్తాన్ లో ఉండేది అని చెబుతున్న "రామరాజ్యం" పదిహేను వేల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో వికాసం చెందింది. ఈ రాజ్యంలో చాలా పెద్ద ఆధునిక నగరాలు ఉండేవి. వీటిలో చాలామటుకు నగరాలను పాకిస్తాన్ , ఉత్తరపశ్చిమ భారత ఎడారుల్లో ఇంకా కనుగొనవలసి ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం మద్యభాగంలో "అట్లాంటియన్ " నాగరికత విలసిల్లిన సమయంలో ఇక్కడ భరత ఖండంలో రాముడు రాజ్యం చేసాడు .రామరాజ్యంలోని గొప్ప నగరాలు మన పురాణాల్లో "సప్తఋషి" నగరాలుగా ప్రసిద్ది చెందాయి. ఈ నగరాల్లో నివసించే ప్రజలు విమానాలుగా పిలిచే యంత్ర వాహనాలు ఉపయోగించే వారని ప్రాచీన బారతీయ గ్రంథాలలో ఉన్నది . భారతీయ పురాణాలు విమానాన్ని అంతర్గత నిర్మాణంలో రెండు అంతస్తులు , పైభాగాన గుమ్మటం ( డోము ) బయట చుట్టూరా రంధ్రాలు ఉండే వృత్తాకార వాహనంగా తెలియచేశాయి .   

           ఈ విమానం అనేది వాయువేగంతో గగనతలంలోకి దూసుకెళ్తూ ఇంపుగా ఉండే హృద్యమైన శబ్దాన్ని వెలువరించేది అని ఆ గ్రంథాలలో పేర్కొనబడినది. అప్పట్లో కనీసం నాలుగు రకాల విమానాలు ఉండేవి . ఈ విమానాల్ని తయారుచేసిన ప్రాచీన భారతీయులు ఆ విమానాలని ఎలా నడపాలో ఫ్లైట్ మాన్యువల్స్ కూడా రూపొందించారు. ఈ విమానాల్లో కొన్ని సాసర్ ఆకారంలో మరికొన్ని సిగిరెట్ ఆకారం లో నిలువుగా కూడా ఉండేవి . 

        విమాన వాయు ప్రయాణం పైన సంపూర్ణంగా వివరించిన అత్యంత ప్రాచీన గ్రంథం "సమరసూత్రధార" ఈ గ్రంధంలో విమానం తయారి , అది బయలుదేరే తీరు , వేలాది మైళ్ళు ప్రయాణించుటకు కావలిసిన వివరాలు , బలవంతంగా దానిని కిందకి దించే విధానం , ఆఖరికి ప్రయాణ సమయంలో పక్షులతో ఢీకొట్టటానికి ఉన్న అవకాశాలతో సహా ప్రతి విషయాన్ని విశదపరిచే 230 శ్లోకాలు ఈ గ్రంధరాజంలో ఉన్నాయి. 

         క్రీస్తు పూర్వం 4 వ శతాబ్దంలో భరద్వాజ మహర్షి రాసిన అద్బుత గ్రంథం "భరద్వాజ వైమానిక శాస్త్రం" ఈ గ్రంధాన్ని 1875 వ సంవత్సరం లో ఒక ఆలయంలో కనుగొన్నారు. విమానాల పనితీరుపైన ఇందులో చాలా ఆసక్త్తికరమైన ముఖ్యవిషయాలు ఉన్నాయి . విమానాన్ని ఎలా నడపాలి , దూరప్రాంతానికి ప్రయాణించేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హఠాత్తుగా విరుచుకుపడే పిడుగులు , మెరుపులు నుంచి విమానాన్ని ఎలా రక్షించుకోవాలి వంటి ముఖ్యవిషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. 

                  భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రం అనే గ్రంథంలో చాలా వివరాలు విపులంగా రాసి ఉన్నాయి . విమానం నడిపేటప్పుడు ఇంధనం ఉపయోగించి మాత్రమే కాకుండా మరోక ఉచిత ఇంధన వనరుని కూడా ఉపయోగించుకోవడం పై విస్కృత సూచనలు ఉన్నాయి . బహుశా ఆ ఉచిత ఇంధనవనరు యాంటి గ్రావిటి కావొచ్చు అని పరిశోధకుల అభిప్రాయం . ఇదే వైమానిక శాస్త్రంలో ఇంధనం నుంచి సౌరశక్తి ఉపయోగించి విమానం నడపడం గురించి కూడా సూచనలు ఉన్నాయి . 

        "వైమానిక శాస్త్ర " లో నిప్పంటుకోని,విరగని సామగ్రి , పరికరాలతో సహా మూడు రకాల విమానాల వర్ణనలు , బొమ్మలతో కూడిన ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి . ఈ వాయువాహనాల్లో ని 31 ప్రధాన భాగాలను , వాటి తయారీకి ఉపయోగించే 16 పదార్థాలు , సామాన్లను కూడా ఈ శాస్త్రం వివరిస్తుంది. ప్రధాన భాగాల తయారికి ఉపకరించే సామాన్లు , పదార్థాలు వేడిమికి , మంటలకు తట్టుకునే కోవకి చెందినవి అని అందుకే విమాన తయారీలో ఈ పదార్థాలు వాడాలి అని స్పష్టంగా సూచించాడు . 

          ఈ విమానాలు ఒక రకమైన యాంటి గ్రావిటీ తో పనిచేస్తాయి అనేందుకు ఎటువంటి సందేహాలు అక్కరలేదు అని చెప్పుకోవచ్చు. విమానాలు నిలువుగా గాలిలో లేచేవి . ప్రాచీన కాలంలో గగనవిహారం పైన దాదాపు 70 మంది సాధికార వ్యక్తులు , 10 మంది నిపుణులను భరద్వాజ మహర్షి తన గ్రంథంలో ప్రస్తావించారు.కాని వారు లిఖించిన గ్రంథాలు ప్రస్తుతం లభించడం లేదు . 

         విమానాలని విమానగృహాలుగా చెప్పబడే వాటిలో భద్రపరచేవారు. విమానాలను కొన్నిసార్లు పసుపుఛాయతో ఉండే తెల్లనిద్రవంతో మరికొన్నిసార్లు ఒకరకమైన పాదరస సమ్మేళనంతో నడిపేవారు అని తెలుస్తుంది . ఈ ఇంధనం విషయంలో చాలమంది పరిశోధకులు సరైన అవగాహనకి రాలేకపోయారు . ఈ విమానాలలో ఈ ప్రత్యేక ఇంధనం ఉపయొగించుటకు పల్స్ జెట్ ఇంజిన్ లను తయారుచేసి ఉంటారు .

          ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాజీలు తమ V -8 "బజ్ బాంబులు" కోసం మొట్టమొదటిసారిగా పల్స్ జెట్ ఇంజిన్ లను తయారుచేశారు . ప్రాచీన భారతావని , టిబెట్ అంటే నాజీలు , వారి అధినాయకుడైన హిట్లర్ కు పడిచచ్చేంత ఆసక్తి చూపేవారు . ఈ దేశాల్లోని ప్రజలు ప్రాచీన కాలంలోనే మంచి వైమానిక పరిజ్ఞానం సాధించారు అని హిట్లర్ కి నమ్మకం . 

            ప్రాచీన భారతావని మరియు టిబెట్ లోని ప్రాచీనులు మంచి వైమానిక పరిజ్ఞానాన్ని సాధించారు అని హిట్లర్ కి అత్యంత గాఢ విశ్వాసం . ఈ నమ్మకంతోనే అందుకు కావలసిన "రహస్య సాక్ష్యాధారాలు" కోసం వాటిని సేకరించడానికి 30 వ దశకం మొదలుకొని ప్రతి ఏడాది ఈ రెండు దేశాలకు రహస్యంగా ప్రతినిధి బృందాలను పంపేవాడు.

         మహాభారతంలోని ద్రోణ పర్వంలో మరియు రామాయణంలో ఒక విమానాన్ని వర్ణించిన తీరు ఈ విధంగా ఉన్నది. విమానం గుండ్రంగా ఉన్నది. పాదరసం వెలువరించే శక్తితో అది గొప్ప వాయువేగంతో దూసుకెళ్లేది చోధకుడు దానిని అన్నివైపులా తిప్పగలిగేలా ఉండేది . మరో ప్రాచీన గ్రంథం "సమర" లో లో పేర్కొన్న విమానాలు ఇనుముతో చక్కగా చేసినవి . వెనుక భాగంలో మండే అగ్నికీలల్ని వెలువరిస్తూ మండే పాదరసం నుంచి వెలువడే శక్తితో పనిచేసేవి అని రాయబడి ఉన్నది. 

      " సమరాంగణ సూత్రధార " ఈ వాహానాలని ఎలా నిర్మించారో వర్ణించింది. పాదరసానికి విమాన చోదనకు మధ్య ఏదో బలీయమైన సంభంధం ఉన్నది. నేను చదివిన ఒక తాంత్రిక గ్రంథంలో కోడిగుడ్డులో పాదరసం నింపి ఎండలో ఉంచిన అది గాలిలో ఎగురును అని రాసి ఉన్నది.

      సోవియట్ పరిశోధకులు తుర్కుమెనిస్థాన్ మరియు గోబీ ఎడారులలో గల ప్రాచీన గుహల్లో కొన్ని అపూర్వమైన పరికరాలు కనుగొన్నారు . వాటిని పూర్తిగా పరిశీలించినప్పుడు అవి ఎగిరే వాహనాలలో ఉపయోగించేవిగా నిర్ధారణ అయ్యింది . ఈ పరికరాలు గాజు మరియు పోర్సోలిన్ తో తయారుచేసిన అర్ధగోళాలు వీటిచివర్లు మొనదేలి ఉన్నాయి . లోపల కొన్నిచుక్కల పాదరసం లభించింది. 

        రామరాజ్యంలో సప్తఋషి నగరాలలో ఒకటిగా భావిస్తున్న మొహంజదారో కనుగొన్న లిపి వంటిదే ప్రపంచంలో మరో ప్రాంతంలో కూడా లభ్యం అయ్యింది .కాని ఆ లిపి యొక్క అర్థం ఇప్పటివరకు కనుగొనలేకపోయారు. మొహంజదారోలో లిపిని పోలిన లిపి లభించిన ప్రాంతం ఈస్టర్ ఐలాండ్ ఇక్కడ ఈ లిపి ని రాంగో లిపి అంటారు. ఈ రెండు లిపిలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.

   భవభతి రచించిన మహావీర ప్రాచీన పతులు అనే గ్రంథం ఎనిమిదోవ శతాబ్దం నాటిది . ఈ గ్రంథంలో అయోధ్య ప్రాంతంలోని ఒక విమానం గురించి విపులంగా ఉన్నది. అదే విధంగా వేదాలు కూడా ఈ విమానాల గురించి వాటిలో ఉండే రకాలు ఆకారాలు గురించి ఎన్నో విషయాలు తెలియచేశాయి . అట్లాటిస్ మరియు రామరాజ్యం మధ్య జరిగిన ఎన్నో భయంకర యుద్ధాలు గురించి చాలా చక్కగా వివరణ ఉన్నది. 

              భారతీయ వేదాలు అత్యంత ప్రాచీన ప్రతులుగా పేరుగాంచాయి. ఇవి హిందూ ప్రాచీన శ్లోకాల మణిహారాలు . ఇవి వివిధ ఆకారాల్లో , పరిమాణాల్లో ఉన్న విమానాల గురించి పలురకాలుగా వివరించాయి.  

      "అగ్నిహోత్ర విమానం" రెండు ఇంజన్ల తో ఉంటుంది. "గజవిమానం" అనేక ఇంజన్లతో ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ విమానాల్ని యుద్ధాలకొరకు ఉపయోగించారు అట్లాంటిస్ నగర వాసులు ఉపయోగించిన విమానాల కంటే ప్రాచీన భారతీయులు ఉపయోగించిన విమానాలు శక్తివంతం అయినవి. పరిశోధకుల అబిప్రాయం ప్రకారం ఇవి 80,000 హార్స్ పవర్ శక్తితో నడిచేవి . 

        పది నుంచి పన్నెండువేల సంవత్సరాల క్రితం అట్లాంటిస్ మరియు రామరాజ్యం మధ్య జరిగిన భయంకర సంగ్రామం గురించి ప్రాచీన భారతీయ గ్రంథాలలో విపులంగా ఉన్నది. ఆనాటి యుద్ధంలో భయంకరమైన విద్వంసక ఆయుధాలు ఉపయోగించారు . వాటిలో అప్పుడు జరిగిన యుద్దం గురించి ఈ విధంగా వివరణ ఉన్నది. 

      " ప్రయోగించిన ఆయుధం విశ్వమంతటి శక్తిని నింపుకొని ఉన్నది. కొన్ని క్షణాల తరువాత ఎక్కడ చూసినా మేఘాలుని ఆవరించిన పొగ ...ఒక్కసారిగా వేయి సూర్యబింబాలు ఉదయించినట్టుగా జ్వాలవంతమైన వెలుగులతో నిండిన అగ్నికీలలు ...మహోగ్రమైన ఉరుముల గర్జన బ్రహ్మన్దమైన మృత్యుసందేశ వాణి ఇవన్ని కలిసి అంధకుల జాతి సమస్తాన్ని సమూలంగా తుడిచిపెట్టాయి " .

       పంటలు మంటల్లో గుర్తుపట్టలేనంతగా మండిపోయాయి. మట్టివస్తువులు ,ఇళ్లు తునాతునకలు అయ్యాయి మిన్ను మన్ను ఏకమైపోయాయి. పక్షులు తెల్లటి రంగులో మారిపోయాయి. కొన్ని గంటల తరువాత ఆహారపదార్థాలు అన్ని ఆ ప్రళయ బీభత్సానికి గురిఅయ్యాయి. దానిబారి నుంచి రక్షించుకొనుట కొరకు , తమ దేహాలు , ఆయుధాలు, వస్తుసామాగ్రి శుభ్రపరచుకోవడం కొరకు సైనికులు మడుగులు , కాలువల్లోకి దూకారు . ఇది అంతా చూస్తుంటే మహాభారతం అణు యుద్ధాన్ని గురించి వివరిస్తున్నట్టుగా ఉన్నది. 

        గత శతాబ్దంలో పురాతత్వ శాస్త్రవేత్తలు మహేంజదారో నగరంలో తవ్వకాలు జరిపినప్పుడు ఏదో విలయం హఠాత్తుగా విరుచుకుపడి విధ్వంసం సృష్టించింది అన్నట్టుగా ఆ నగరం వీధుల్లో చెల్లాచెదురుగా పడిఉన్న అస్థిపంజరాలు కనిపించాయి. ఆ అస్థిపంజరాలలో కొన్నిటికి చేతులు ముడుచుకొని ఉండటం గమనించారు. వాటిని పరీక్షించినప్పుడు ఈ భూమ్మీద ఇప్పటివరకు కనుగొన్న అత్యంత ఎక్కువ రేడియో ధార్మిక ప్రభావానికి గురి అయ్యినట్టుగా తేల్చారు. ఇటుకలు, గాజు కరిగి ముద్దలా పడివున్నాయి . ఒకరకంగా చెప్పాలి అంటే హిరోషిమా , నాగసాకి నగరాల మీద ప్రయోగించిన అణుబాంబులు కంటే కూడా శక్తివంతమైన అణుబాంబుల ప్రయోగం జరిగింది.ఇలాంటి పరిస్థితుల గల నగరాలు ప్రాన్స్ , టర్కీ , స్కాట్లాండ్ దేశాలలో కూడా కనిపించాయి . 

      మహేంజదారో వీధులలో గాజు గోళాల వంటి నల్లటి పదార్థం పెద్దమొత్తంలో పేరుకొనిపోయింది. వీటిని పరిశీలించగా అత్యంత వేడిమిదగ్గర కరిగిన మట్టికుండలు అని తేలింది . ఇక్కడ ఇంకొ ఆసక్తికరమైన అంశం ఇంకొకటి ఉన్నది . మహాసామ్రాజ్య అధినేత అలెగ్జాండర్ రెండువేల సంవత్సరాల క్రితం భారతదేశం పైన దండయాత్రకు వచ్చినపుడు అలెగ్జాండర్ సైన్యం పైన పళ్లెం వంటి ఆకారాలు కలిగిన వాయువాహనాలు విరుచుకుపడ్డాయి అని కాని ప్రమాదకర ఆయుధాలు ప్రయోగించలేదని గ్రీకు చరిత్రకారుల తమ గ్రంథాలలో రాశారు. 

        ఆధునిక పరిశోదకుల అబిప్రాయం ప్రకారం ఈ ప్రాచీన విమానాలు అంతరించలేదు అని వాటిని కొన్ని ప్రత్యేకమైన రహస్య ప్రదేశాలలో ఉంచి వాటిని కొన్ని రహస్య సంఘాలలో సభ్యులు కాపలాగా ఉంటున్నారు అని భావిస్తున్నారు. పశ్చిమ చైనా దేశంలోని లాపనార్ ఎడారి ఈ విమానాలకు మిస్టరీ ప్రదేశంగా ఉన్నది . బహుశా ఈ ఎడారిలోనే చాలా విమానాలని రహస్యంగా దాచి ఉంచారు అని చెప్పుకుంటారు. 

  
   

భూచక్రగడ్డ విశేషాలు -

భూచక్రగడ్డ విశేషాలు -

       సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఈ భూమి మీద ఎన్నో వింతలు , విశేషాలు ఉన్నాయి. అవి నిగూఢముగా ఉన్నాయి. వాటిలో వృక్షజాతిలో ఎన్నో విచిత్రాలు కలవు. నేను ఛత్తీస్ గడ్ అడవులలో వెదురుబొంగులు కొట్టిన తరువాత భూమి యందు ఉండు బొంగు ముక్క నుంచి తెల్లటి వెలుగు రావటం గమనించాను. అలా కొన్ని ప్రదేశాలలో మాత్రమే కనిపించింది. సూర్యోదయం అయ్యేప్పుడు పూర్తిగా సూర్యునివైపు తిరిగే చెట్లు ఉన్నాయి అని అక్కడి కొండజాతివారు చెప్పారు . వారి వైద్యవిధానం కూడా బహుచిత్రంగా ఉన్నది. చెయ్యి విరిగినవారికి కేవలం మూడురోజుల్లో చెయ్యి ఎముక అతుక్కునే విధంగా చెయ్యగలరు. వారు ఉపయోగించే మొక్కని మాత్రం నాకు చూపించలేదు. నా కాలుకి దెబ్బతగిలి రక్తం పోతున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న వెదురుబొంగు పైన పచ్చరంగులో ఉన్నది చాకుతో గీకి మెత్తటి చూర్ణం చేసి దానికి సున్నం కలిపి నా గాయం పైన చల్లి అద్దడం జరిగింది.వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. ఆ తరువాత ప్రతినిత్యం దానిపైన వేయుటకు మరికొంత చూర్ణం ఇచ్చారు . ప్రతినిత్యం ఉదయం , సాయంత్రం దానిపైన చల్లడం వలన అది ఒక చెక్కు మాదిరి గట్టిగా అయ్యి గాయం నయం అయ్యాక ఊడి వచ్చింది. అక్కడివారు చెప్పినదాని ప్రకారం గాయం అయినపుడు ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోరు. కేవలం దీనితోనే వారు ఎటువంటి గాయాన్ని అయినా మాన్పుకుంటారు. ఇదంతా మీకు చెప్పడానికి ప్రధాన కారణం ఎమిటంటే ప్రకృతిలోని వృక్షజాతుల్లో అంత గొప్ప ఔషధవిలువలు ఉన్నాయి. 

          ఇలాంటి వృక్షవిచిత్రాలలో ఒకటైన భూచక్రగడ్డ గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు రహదారుల పక్కన భూచక్రగడ్డ పేరు చెప్పి అడివి లో దొరికే కొన్ని గడ్డలను అమ్ముతున్నారు. అసలైన భూచక్రగడ్డ అనేది పాత ఎద్దులబండి చక్రం అంత వెడల్పుగా ఉంటుంది. ఇది అత్యంత దట్టమైన కీకారణ్యాలలో మాత్రమే లభించును. కొన్ని చోట్ల ఈతచెట్ల కింద అత్యంత అరుదుగా ఉంటుంది. ఇది ఏ వృక్షం కింద అయితే ఉంటుందో ఆ వృక్షం పైన బంగారు రంగులో ఒక తీగ అల్లుకుని ఉంటుంది. భూమిలో ఉన్న గడ్డకు చెట్టు పైన ఉన్న తీగకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఆ రెండు గొప్ప అయస్కాంత శక్తితో సంబంధం ఏర్పరచుకొని ఉంటాయి. 

             భూమిలో గడ్డ ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించుటకు ఆ ప్రదేశం మొత్తం రెల్లుగడ్డి పరిచి నిప్పు అంటించండి. కేవలం గడ్డ ఉన్న ప్రదేశంలో రెల్లుగడ్డి ఏ మాత్రం చెక్కుచెదరదు. మిగిలిన గడ్డి కాలిపోవును. కాలని ప్రదేశం ఉన్న భాగం అంతా ఆ గడ్డ ఉన్నది అని నిర్ధారించుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి ఇష్టదైవాన్ని ప్రార్ధించి చాలా జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించాలి . ఇది అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని. తవ్వే సమయంలో ఏ మాత్రం భూమి అదిరినను ఆ గడ్డ ఆ ప్రదేశం నుంచి జరిగిపోవును. కావున అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని.

           ఈ గడ్డ లభించడం అంటే అమృతం లభించడంతో సమానం . ఈ గడ్డ మందం 4 అంగుళాల నుండి 20 అంగుళాల వరకు ఉంటుంది. ఇది తీపిగాను మరియు వగరు , చిరుచేదు మిశ్రమముగా ఉండును. దీని మోతాదు 30 గ్రాముల ముక్క తిని స్వదేశీ ఆవుపాలు తాగవలెను. దీనిని జాగ్రత్తగా నిలువచేసికొని మండలం (40 ) రోజులపాటు వాడిన శరీరము నందలి సర్వరోగములు నివారణ అగును. దేహము అత్యంత కాంతివంతం అయ్యి బంగారు రంగులో మారును . నరములు శక్తిమంతం అయ్యి మెదడుకు అమితమైన బలం కలిగి ఏకసంథాగ్రాహి అవుతాడు. ముసలితనాన్ని పోగొట్టగల శక్తి దీనికి ఉన్నది. దీనిని ఆయుర్వేదంలో " కాయసిద్ది " అని పిలుస్తారు . దీర్గాయుష్షును ప్రసాదించును.

        పైన చెప్పినవన్నీ అసలయిన భూచక్రగడ్డని సాధించి వాడినప్పుడు మాత్రమే కలుగుతాయి.

   
   

స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ -

స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ - 

          ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును. 

       ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును . 

          సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును . 

              నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య . 

       అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు. 

      ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నవారు నన్ను సంప్రదించగలరు. ముఖ్యముగా ఆయుర్వేద చికిత్స యందు పథ్యం ప్రధానపాత్ర పోషిస్తుంది . ఇక్కడ పాటించవలసిన ఆహార పథ్యాలు మీకు వచ్చిన ఆనారోగ్య సమస్యకు మాత్రమే తప్ప ఔషధాలుకు కావు . నేను తయారుచేసి ఇచ్చు ఔషధాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  

               

మానవ శరీరంలోని వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల గురించి వివరణ -

మానవ శరీరంలోని వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల గురించి వివరణ - 

      మానవ శరీరం ఒక సజీవమైన యంత్రం శరీరము నందు ఎలాంటి అన్యపదార్ధము చేరినను దానిని బయటకి బహిష్కరింప చేయుటకు శరీరము పనిచేస్తుంది . ఉదాహరణకు కాలుకు ముల్లుగాని , కొయ్యగాని గుచ్చుకొని విరిగిన దానిని శరీరము నుంచి బయటకి పంపుటకు చీముపట్టి ఆ తరువాత సులభముగా బయటకి వచ్చును. ఇదే విధముగా శరీరంలోని అంతరావయవములలో ఏదేని మలపదార్దము ( అన్య పదార్థము లేదా రోగ పదార్థము ) చేరినచో అది బయటకి పంపుటకు శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు పనిచేయును . ఇప్పుడు వాటి గురించి మీకు వివరిస్తాను . అవి 

     * ప్రేవులు . 
     * మూత్రపిండములు . 
     * ఉపిరితిత్తులు . 
     * చర్మము . 

  * ప్రేవులు - 

        మల పదార్థము మొదట ప్రేవులలో నిలువచేరి వివిధ వ్యాధులను కలుగచేస్తుంది . అందువలనే " సర్వరోగా మలాశయః " అన్నారు. ఈ మల పదార్థం మలబద్ధక సమస్య వలన బయటకి వెళ్లక ప్రేవులలో నిలువ ఉండి అచ్చట కొంతకాలానికి మురిగిపోయి విషవాయువులు తయారైయ్యి రక్తములో కలిసి ప్రవహించి ఇతర అంతర అవయవములకు అవరోధము కలిగించి రోగములను కలుగచేయును . 

                మలబద్ధకం వలన మొదట అజీర్ణము చేయును . అజీర్ణము వలన విరేచనములు ఆ తరువాత బంక విరేచనాలు , రక్తవిరేచనాలు , అమీబియాసిస్ , అసిడిటీ , అల్సర్ ఇలా ఒకదాని తరువాత ఒకటి వచ్చును. ఇవన్నియు జీర్ణకోశ సంబంధ వ్యాదులు. ఈ వ్యాధులన్నింటికి మలబద్ధకమే కారణం . ఈ సమస్య ప్రారంభములోనే జాగ్రత్తవహించని యెడల దీర్ఘకాలిక వ్యాధిగా మారి తరువాత తీవ్ర సమస్యలు తెచ్చును . 

* మూత్రపిండములు - 

 ప్రేవులు పూర్తిగా పనిచేయని స్థితిలో శరీరంలోని మాలిన్యములు బయటకి పంపుటకు మూత్రపిండములు బాగుగా పనిచేయవలసి ఉంటుంది. అందుకే మలబద్దకం సమస్య ఉన్నవారికి మూత్రం అధికంగా వచ్చును. కొంతకాలమునకు మూత్రపిండములు కూడా అలసిపోయి చెడిపోవును . కావున మూత్రపిండములలో రాళ్లు , మూత్రనాళములో రాళ్లు , మూత్రకోశములో రాళ్లు మొదలగు వ్యాధులు సంభవించును . దీనివల్ల రక్తములో మూత్రము కలియుట , రక్తపోటు మొదలగు సమస్యలు కలుగును. 

 * ఊపిరితిత్తులు - 

     మూత్రపిండ వ్యాధులకు మందులు వాడిన శరీరంలోని మురికిని బయటకి పంపుటకు ఉపిరితిత్తులు ప్రయత్నించును. దగ్గు , జలుబు , అలర్జీ , దమ్ము ద్వారా శరీరంలోని తెమడను బయటకి పంపుటకు ప్రయత్నించును. ఈ సమస్యను కూడా అణుచుటకు మందులు వాడుచున్న శరీరం నందలి మలిన పదార్థము చర్మము క్రిందికి వెళ్లి చర్మవ్యాధులను కలగచేయును . 

 * చర్మము - 

     రక్తములో ఉన్న మాలిన్యాలను చర్మము ద్వారా బహిష్కరించుటకు ప్రయత్నించునప్పుడు గజ్జి , తామర , పుండ్లు , గడ్డల రూపములో కనిపించును. దీనిని మనం మందులతో అణిచివేయుచుండిన చర్మవ్యాధి , కుష్టు మొదలగు వ్యాధులు వచ్చును . 

       పైన వివరించిన నాలుగు బహిష్కరణ అవయవాలు చక్కగా పనిచేసినంత కాలం ఏ రోగము దరిచేరదు . ఇందులో ఏ ఒక్కటి తన విధిని సరిగ్గా నిర్వర్తించలేకపోయినా శరీరము అంతా రోగగ్రస్తం అవుతుంది. అంతేకాని శరీరంలో వివిధ అవయవములకు సంబంధం లేదు అనుకోకూడదు. 

             ఈవిధముగా శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు మందుల వలన దోషపూరితమై ఒకదాని పని ఇంకొకటి చేసి రోగగ్రస్తము అగును. కావున సమస్య మొదలగు క్రమము నందే సరైన జాగ్రత్తలు పాటించి ఎప్పటికప్పుడు శరీరంలోని మాలిన్యాలను బయటకి పంపవలెను. 

            ఈ మధ్యకాలంలో చాలా మంది ఉదయాన్నే లేవగానే మలవిసర్జనకు వెళుతున్నాము .మలబద్ధక సమస్య లేదనుకుంటున్నారు. నిజానికి రోజుకు రెండుసార్లు మలవిసర్జన చేయుట అత్యుత్తమ పద్దతి. అదేవిధముగా ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధములు తీసుకుని ఉదరమును మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలెను. ఉదయాన్నే మలవిసర్జన చేసినప్పుడు బయటకి వెళ్లునది కేవలం 60 % మాత్రమే . మిగిలిన 40 % ప్రేవులకు పట్టి ఉండును. అది అలా మురిగిపొయి విషవాయువులు వెలువడి రక్తములో కలిసి శరీరంలోని మిగతా అవయవాలకు చేరుకుని ఆయా అవయవ సంబంధ రోగాలను కలుగ చేయును . కావున ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధాలను తీసుకుని ఉదరము మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలసిందిగా ముఖ్య సూచన . 

               సమాప్తం 

        

గుండెదడ , నీరసము హరించుటకు సులభ ఔషధ యోగము -

గుండెదడ , నీరసము హరించుటకు సులభ ఔషధ యోగము - 

       క్యారెట్ మెత్తగా దంచి రసము తీసి , 50 రసము నందు 20 గ్రాముల పటికబెల్లం చూర్ణము కలిపి పూటకు ఒక మోతాదు చొప్పున ఉదయము మరియు సాయంత్రం రెండు పూటలా తాగుచున్న గుండె దడ , నీరసం , నిస్సత్తువ హరించును . 

  

మూత్రపిండములలో రాళ్లు కరిగించు గొప్ప ఔషధ యోగములు -

మూత్రపిండములలో రాళ్లు కరిగించు గొప్ప ఔషధ యోగములు - 

 * కానుగ గింజలలోని పప్పు మూడు గ్రాములు తీసుకుని పొడిచేసి 60 మిల్లీలీటర్ల ఆవుపాలలో కలిపి లోపలికి తీసుకొనుచుండిన మూత్రపిండాలలోని రాళ్లు పడిపోవును .

 * యవాక్షరం , బెల్లం సమాన భాగాలుగా కలిపి రెండు గ్రాముల చొప్పున రోజుకొకసారి ఒక వారం నుంచి పదిరోజులపాటు తినిన రాళ్లు కరిగి పడిపోవును . దీనితో పాటు బూడిదగుమ్మడికాయ రసం కూడా వాడిన ఫలితం తొందరగా కనిపించును.

 * వేపాకు నీడలో ఎండించి కాల్చి భస్మం చేసి పూటకు ఒకటిన్నర గ్రాము చొప్పున ఒకరోజు నిలువ ఉంచిన నీళ్లతో కలిపి తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాయి కరిగిపోవును . రెండుపూటలా తీసికొనవలెను .

 * రణపాల ఆకు రసము 6 గ్రాములు కాచిన వెన్న 13 గ్రాములు కలిపి ప్రతినిత్యము తాగుచున్న రాళ్లు కరుగును.

 * పల్లేరు చూర్ణం ఒక స్పూన్ , కొండపిండి చూర్ణం ఒక స్పూన్ ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాళ్లు నివారణ అగును.

 * పొద్దుతిరుగుడు పువ్వు చెట్టు వేర్లు పొడి 25 గ్రాములు తీసుకుని ఒక లీటర్ తియ్యటి మజ్జిగతో కలిపి తీసుకొనుచున్న రాళ్లు కరుగును.

 * పూటకు రెండు వెల్లుల్లి రేకల గుజ్జు తినుచున్న మూత్రాశయపు రాళ్లు కరుగును. అలా అప్పుడప్పుడు తినుచున్న రాళ్లు పుట్టవు .

  మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు -

 తినవలసిన ఆహారపదార్దాలు -

  పాతబియ్యపు అన్నం , యవలు , గోధుమలు , ఉలవలు , పెసలు , మజ్జిగ , ఆవునెయ్యి , ఆవుపాలు , పెసరకట్టు , ఉలవకట్టు , అల్లం , తియ్యని కల్లు , చక్కెర , ముదురు గుమ్మడికాయ , బూడిద గుమ్మడికాయ , పొట్లకాయ , కొండపిండికూర , పల్లేరుకూర , చిర్రికూర , పెరుగుతోటకూర , ఖర్జురము , వెదురుమొలకలు , కొబ్బరికాయ , తాటిముంజలు , నక్కదోసకాయ , మేకమాంసం .

 తినకూడని ఆహార పదార్ధాలు -

    మలబద్ధకర ఆహారాలు , చద్ది అన్నం , బిరుసుఅన్నం , తాంబూలం , ఎక్కువ ఉప్పు గల ఆహారపదార్థాలు , ఎక్కువ నూనె , పిండివంటలు , నువ్వులపిండి , పులుసు , ఇంగువ , నువ్వులు , ఆవాలు , మినుములు , మామిడికాయ , వెల్లుల్లి మొదలగు వేడివస్తువులు , మలబద్దకాన్ని కలిగించు వస్తువులు , కోడిమాంసం , పందిమాంసం , చేపలు , మద్యం , మైథునం , అతిశ్రమ , మూత్రము , వీర్యము నిరోధము చేయరాదు . 

         పైన చెప్పిన ఆహారపదార్ధాలు పాటిస్తూ ఔషధాలను వాడగలరు .

     

ఆయుర్వేదం నందు నవరత్నాలను ఉపయోగించి చేయు వైద్య ప్రక్రియలు -

ఆయుర్వేదం నందు నవరత్నాలను ఉపయోగించి చేయు వైద్య ప్రక్రియలు -

     నవరత్నాలు అనగా మాణిక్యం , ముత్యము , పగడము , పచ్చ, పుష్యరాగము , వజ్రము , నీలము , వైడూర్యము , గోమేధికము ఈ తొమ్మిదింటిని నవరత్నాలు అని పిలుస్తారు . చాలామందికి ఇవి కేవలం ఆభరణాలలో ఉపయోగించు విలువయిన రాళ్ళగా మాత్రమే పరిచయం . భారతీయ పురాతన ఆయుర్వేద వైద్యులు వీటిలోని ఔషధ గుణాలను తమ పరిశోధనల ద్వారా తెలుసుకుని వాటిని తమ వైద్యములో విరివిగా ఉపయోగించారు. వారు తమ పరిశోధనా ఫలితాలను తమ గ్రంథాలలో సంపూర్ణంగా వివరించారు . ఇవి ఎక్కువుగా సంస్కృత లిపిలో ఉన్నాయి . ఈ మధ్యకాలంలో నేను అటువంటి పురాతన గ్రంథాలను సేకరించి వాటిపైన కొంత పరిశోధన కూడా చేశాను . ఆ విలువైన సమాచారాన్ని ఇప్పుడు మీకు నేను అందించబోవుతున్నాను.

         జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మాణిక్యం అనగా కెంపు సూర్యునకు , ముత్యము చంద్రునకు , పగడము అంగారకునకు , మరకతము అనగా పచ్చ బుధునకు , పుష్యరాగము గురువునకు , వజ్రము శుక్రునకు , నీలము శనికి , వైడుర్యము రాహువునకు , గోమేధికము కేతువునకు ప్రీతికరములు మరియు ప్రతిరూపములుగా పేర్కొన్నారు . మరియు ఆయా గ్రహ దోషములకు ఆయా రత్నములను ధరించి గ్రహపీడ నుండి బయటపడవచ్చు.

            ఇప్పుడు ఆయుర్వేదం నందలి నవరత్నాల ఉపయోగాలు మీకు తెలియచేస్తాను .

 * మాణిక్యం -

           ఈ మాణిక్యం పద్మరాగము అని ప్రసిద్ధి కలిగినది . తామరరేకు వన్నె కలిగి బరువుతో స్ఫుటంగా ఉండును. మిక్కిలి కాంతివంతముగా ఉండును. స్ఫుటముగా , బరువుగా , గుండ్రముగా ఉండు మాణిక్యం పరిశుద్ధం అయినది. ఈ మాణిక్యమును సరైన పద్ధతుల్లో శుద్దిచేసి పుటం పెట్టి ఆ భస్మమును ఉపయోగించిన శరీరము నందలి వాత,పిత్త, శ్లేష్మములను శాంతింపచేసి అగ్నిదీపమును కలిగించును. శరీరముకు దారుఢ్యము కలిగించును. మరియు దీనిని ధరించిన భూత , బేతాళ పీడలు తొలగును . అతి భయం వంటి మానశిక దోషాలలో ఇది మంచి ప్రభావం చూపించును.

 * ముత్యము -

           గుండ్రగా ఉండి తెల్లని కాంతి కలిగి , తేలికైనది , నీటి కాంతి కలిగి , నిర్మలంగా ఉండి అందంగా ఉన్న ముత్యము శుభకరమైనది. వెలవెలపోతూ పైన పొరలుపొరలుగా ఉండి గొగ్గులుగొగ్గులుగా ఉన్నది మంచి ముత్యం కాదుగా గ్రహించాలి.ఇలాంటి ముత్యాలను అసలు వాడకూడదు.

          మంచి ముత్యమును పుఠం పెట్టి భస్మం చేసి ఒక మోతాదులో ప్రతినిత్యం పుచ్చుకొనుచున్న మనుజులకు రక్తపిత్తం, క్షయ వంటి రోగాలు నిర్మూలనం అగును. దేహమునకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును. ఆయుష్షును వృద్దిచేయును . వీర్యవృద్ధి చేయును , శరీరం నందు జఠరాగ్ని వృద్ధిచెందించి శరీరానికి ఉత్సాహం కలుగచేయును .

 * పగడం -

            బాగా పండిన దొండపండు వలే ఎర్రని రంగు కలిగి గుండ్రని నునుపైన బుడిపెలు , వంకరలు , తొర్రలు మొదలగునవి లేకుండా పెద్దగా ఉండు పగడం శ్రేష్టమైనది. శుభప్రదం అయినది. 

          మంచి పగడమును సేకరించి సహదేవి ఆకు రసము నందు నానబెట్టిన శుద్ది అగును. దానిని భస్మము చేసి సేవించిన యెడల క్షయరోగములు , రక్తపిత్తములు , కాసరోగము , నేత్రరోగములు , విషదోషాలు మున్నగు వాటిని శమింపచేయును . అగ్నిదీప్తిని , జీర్ణశక్తిని కలిగించి వార్ధక్యమును పోగొట్టి దేహమునకు కాంతిని , బలమును కలిగించును. దీనిని ముట్టునొప్పికి విశేషముగా వాడుదురు.

 * గరుడ పచ్చ -

         మంచి గరుడపచ్చ ఆకుపచ్చని రంగు కలిగి మెరుగులు తేలుతూ బరువుగా , నున్నగా ఉండును. మిక్కిలి కాంతిమంతంగా ఉండును. దీనిని ఔషధముల యందు ఉపయోగించవచ్చు . తెల్లగా , నల్లగా , బుడుపులు కలిగి ఉన్న , పెలుసుగా ఉన్న ఆ పచ్చ మంచిది కాదు అని అర్థం .

            గరుడ పచ్చను ఆవుపాలలో నానబెట్టి శుద్దిచేసి భస్మము చేసి సేవించుతున్న పాండువ్యాధులు , మొలలు , విషదోషాలు , సన్నిపాత జ్వరాలు , సామాన్య జ్వరాలు , వాంతులు , శ్వాస సంబంధ సమస్యలు , కాసరోగం , అగ్నిమాంద్యం వంటి రోగాలను పోగొట్టును . దేహమున మిక్కిలి కాంతిని ఇచ్చి మేలుచేయును .

 * పుష్యరాగము -

           పుష్యరాగము శుద్ధముగా , నునుపుగా , లావుగా , బరువుగా , ఎగుడుదిగుడు లేనిదిగా ఉండి గోగుపూవ్వు రంగు కలిగి తళతళ ప్రకాశించుచుండును. ఇట్టి లక్షణాలు కలిగినది అత్యుత్తమం అయినది.ఇలా కాక గోరోచనపు రంగు గాని పచ్చగా కాని మిక్కిలి తెలుపుగా గాని ఉండిన మంచిది కాదు.

             దీని భస్మం సేవించిన తీవ్రమగు దాహమును , వాంతులను , వాతరోగములను , కుష్టు వ్యాధిని , విషదోషములను పోగొట్టి దేహమునకు మిక్కిలి కాంతిని కలుగచేయును .

 * వజ్రము - 

            ఈ వజ్రము నందు స్త్రీ, పురుష , నపుంసక అని మూడు రకాల జాతులు కలవు.

       ఎనిమిది అంచులు కలిగి , పక్షములు ఎనిమిది , కోణములు ఆరు కలిగి ఇంద్రధనస్సు వలే ప్రకాశించుతూ నీటివలె నీడదేరునది పురుషవజ్రము అనబడును.

             గుండ్రనైన ఆడుకులు గట్టి ఉండు ఆకారం కలిగి ఉండినది స్త్రీ వజ్రం అనబడును.

        మణిగిపోయిన మూలాలు , అగ్రమును కలిగి ఉండి మిక్కిలి గుండ్రముగా ఉండునది నపుంసక వజ్రం అనబడును. 

           మంచి పురుషజాతి వజ్రమును భస్మం చేసి వాడుతున్న సమస్తరోగములను పోగొట్టి వీర్యాభివృద్ధిని కలిగించి వార్థక్యమును పోగొట్టి బాగుగా ఆకలి పుట్టించును . మానవులకు ఇది అమృతప్రాయమై ఉండును. 

 * నీలము -

           దీనిలో జలనీలము , ఇంద్రనీలము అను రెండు విభిన్న రకాలు కలవు. ఇందులో ఇంద్రనీలము శ్రేష్టము . జలనీలము తేలికగా ఉండి తెలుపుతో కూడిన వర్ణము కలిగి ఉండును. ఇంద్రనీలము బరువుగా ఉండి నలుపువర్ణము నందు నీలం మిశ్రితము కాక నీలవర్ణం కాంతి కలిగి నునుపుగా మలినం లేకుండా మృదువుగా మద్యభాగము నందు కాంతి కలిగి ఉండును. ఇది అత్యంత శ్రేష్టం అయినది.

             ఈ నీలమును గాడిద మూత్రములో నానబెట్టి మంచి తీవ్రత కలిగిన ఎండలో ఎండించిన శుద్ధం అగును.

        ఈ భస్మాన్ని ఉపయోగించుతున్న శ్వాస , కాస రోగాలు మానును . వీర్యవర్ధకం , త్రిదోషాలను హరించును . అగ్నిదీప్తిని పెంచును. విషమజ్వరం , మూలశంఖ రోగము , పాపసంబంధ రోగాలను హరించును .

 * వైడుర్యము -

           నలుపు , తెలుపు కాంతి కలిగి సమానమై , స్వచ్ఛమై , బరువై , స్ఫుటమై , లొపల తెల్లని ఉత్తరీయము వంటి పొర కలిగినది శ్రేష్టమైన వైడుర్యము . నల్లగా కాని తెల్లగా కాని ఉండి పారలుపొరలుగా ఉండి లొపల ఎర్రని ఉత్తరీయము వంటి పొర కలిగినది చెడు వైడుర్యముగా గుర్తించవలెను . మంచిది కాదు.

        దీనిని కొండపిండి రసములో నానబెట్టి ఎండించి బాగా కాల్చి ఆ తరువాత గజపుటము వేయవలెను .

         ఈ భస్మము రక్తపిత్తవ్యాధిని హరించును . బుద్ధిని , శరీర బలాన్ని , ఆయుర్వృద్దిని కలిగించును. పిత్తాన్ని పెంచును , అగ్నిదీప్తిని చేయును . మలములను శరీరం బయటకి వెడలించును.

 * గోమేధికం -

            ఇది ఆవుయొక్క మెదడుని పోలి ఉండటం వలన గోమేధికం అని పేరు వచ్చినది . ఇది స్వచ్చమైన గోమూత్రము కాంతి కలిగి నునుపుగా ఉండి హెచ్చుతగ్గులు లేకుండా బరువుగా ఉండి పొరలు లేకుండా దట్టముగా ఉండును. మెరుపు లేకుండా తేలికగా ఉండి కాంతివిహీనం అయి గాజుపెంకు వలే ఉండునది దోషయుక్తము .

          దీనిని గోమూత్రము నందు నానబెట్టి ఎండించి ఆ తరువాత నేలగుమ్ముడు సమూల రసము నందు నానబెట్టి ఆ తరువాత ఎండించిన శుద్ది అగును. ఆ తరువాత నల్ల ఉమ్మెత్తకు రసము నందు నానబెట్టి ఎండించి పుఠం పెట్టిన భస్మం అగును.

        ఈ గోమేధిక భస్మమును శ్లేష్మ, పైత్య రోగాలు , క్షయ , పాండువు వంటి రోగాల నివారణలో వాడతారు. అగ్నిదీప్తిని కలిగించి ఆహారాన్ని జీర్ణం చేయును . రుచికరంగా ఉండును. ఇంద్రియాలకు బుద్దిని , బలాన్ని ఇచ్చును.

         పైన చెప్పినటువంటి రత్నభస్మాలను అనుభవవైద్యుల పర్యవేక్షణలోనే తగినమోతాదులో వాడవలెను. స్వంత నిర్ణయాలు మంచివి కాదు.

  

కర్పూరం గురించి సంపూర్ణ వివరణ - 1

కర్పూరం గురించి సంపూర్ణ వివరణ - 1 . 

    కర్పూరం అనేది ఒక చెట్టు జిగురు. ఈ జిగురుని శుభ్రపరచగా కర్పూరం తయారగును . కర్పూరం నందు అనేక రకాలు ఉన్నవి. వాటిలో ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో అతి ముఖ్యమైన 13 రకాల గురించి చాలా చక్కగా వివరించారు .  

  ఇప్పుడు మీకు ఆ 13 రకాల కర్పూరం పేర్లు తెలియచేస్తాను . అవి 
 
   * పోతాస కర్పూరం . 

   * భీమసేన కర్పూరం . 

   * సితకర కర్పూరం . 

   * శంకరావాస కర్పూరం . 

   * పాంశు కర్పూరం . 

   * పింజ కర్పూరం . 

   * అబ్దసారక కర్పూరం . 

   * హిమాదాలుకాక కర్పూరం . 

   * యూతికా కర్పూరం . 

   * హిమ కర్పూరం . 

   * తుషార కర్పూరం . 

   * శీతల కర్పూరం . 
  
   * ప్రత్త్రికా కర్పూరం .   

           ఇలా అనేక రకాలు కలవు . ఇదియే కాకుండా కర్పూరం చెట్టు యొక్క సారము మరియు జిగురు లక్షణాన్నిబట్టి కూడా 3 రకాలుగా వర్గీకరిస్తారు . అందు చెట్టు యొక్క పైభాగము నుండి తీయు కర్పూరమును "శిరోజం " అని పిలుస్తారు . ఇది మిక్కిలి తెల్లగా ఉండి అద్దము వలే ప్రతిబింబించబడును. మ్రాని మధ్యభాగము నందలి పుట్టునది " మధ్యమం " అనబడును. ఇది పైభాగములో ఉన్న అంత తెల్లగా ఉండక సామాన్యముగా ఉండును. కొంచం గౌరవర్ణములో ఉండును. చెట్టు మిగిలిన భాగములలో లభ్యం అగునది సాధారణముగా ఉండును. ఇప్పుడు మనకి బజారులలో లభ్యం అయ్యేది ఈ సాధారణ రకము. కర్పూరం చెట్టు మధ్య మాను ( కాండం ) నుంచి తీసినది కొంచం పసుపు రంగుతో ఉండును. ఇది కర్పూరములన్నింటిలోను ఉత్తమం అయినది.  

               సరైన అవగాహన లేకుండా వైద్యులు అని చెప్పుకునేవారు హారతి కర్పూరమును పచ్చ కర్పూరముగా చూపించి భ్రమింపచేయుచున్నారు . పచ్చ కర్పూరం లేత పసుపు రంగుతో సువాసనగా ఉండును. తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి వారి లడ్డు ప్రసాదం నందు ఈ పచ్చకర్పూరం విరివిగా వాడుతారు . హారతికర్పూరం విషతుల్యము. ఒక్కోసారి ప్రాణాలు తీయును . లోపలికి ఇవ్వడం నిషిద్దం. 

               

జప మాలలు - ఫలితాలు.

జప మాలలు - ఫలితాలు.

 * స్వచ్చమైన స్పటిక మాలతో జపం చెస్తే రాజ్యాధికారం, లభించును. సర్వ భోగములు సిద్ధించును. గుణవంతులైన సంతానం లబించును.
 
 * ముత్యాల మాలతో జపం చేస్తే సర్వ శాస్రములు, సర్వ విద్యలు నాలుక పై తాండవ మాడును.
 
 * పగడ మాలతో జపం చేసిన లోకం లొని సమస్త మానవులు, జంతువులు, పశువులు, క్రూర జంతువులు ను వశీకరణం చేసుకొవచ్చు .
 
 * ఇంద్ర నీల మణుల మాలతో గాని , మరకత మణుల మాలతో కాని జపం చేయడం వలన శత్రు భయంకరులు అవుతారు.
 
 * బంగారు మాలతో జపం చేయడం వలన అష్టైశ్వర్యములు పొందుదురు.
 
 * మాణిక్య మాలతో జపం చేసిన వారు తాను కొరిన కన్యను పొందుదురు.
 
 * పాదరస గులికలతో కూర్చబడిన మాలతో జపం చేసిన సమస్త ప్రయోజనములు పొందగలుగు శక్తి వంతులగురు .

  
         

డెంగ్యూ జ్వరం వచ్చినపుడు ప్లేట్లెట్స్ సంఖ్య హఠాత్తుగా పడిపోతున్నప్పుడు ఉపయోగించవలసిన అద్బుత యోగం -

డెంగ్యూ జ్వరం వచ్చినపుడు ప్లేట్లెట్స్ సంఖ్య హఠాత్తుగా పడిపోతున్నప్పుడు ఉపయోగించవలసిన అద్బుత యోగం - 

    మొదట ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ తేనే కరిగేలా చేసి దానిలో ఒకస్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి వెంటనే రోగికి తాగించాలి. కొంతసేపట్లో ప్లేట్లెట్ల సంఖ్య పెరగడం మొదలవుతుంది. ఒక గంట తరువాత ఒక పెద్ద గ్లాస్ నీటిలో ఒక బొప్పాయి ఆకు మొత్తం చిన్నచిన్న ముక్కలుగా చేసి పొయ్యి మీద పెట్టి అందులొ తాటిబెల్లం వేసి సగం గ్లాస్ కషాయం మిగిలేలా కాచి దానిని కూడా తాగించడం వలన వేగంగా ప్లేట్లెట్స్ సంఖ్య పెరిగి రోగి ప్రాణాయాపాయ స్థితి నుంచి బయటపడతాడు. ఇది ప్రతి మూడు గంటలకు ఒకసారి ఇవ్వవలెను.

     


  
         

ఉప్పు గురించి సంపూర్ణ వివరణ -

ఉప్పు గురించి సంపూర్ణ వివరణ - 

       ఆయుర్వేదం నందు లవణమును ( ఉప్పు ) 6 రకాలుగా వర్గీకరించారు. అవి 

  * సైన్ధవ లవణము . 

  * సాముద్ర లవణము.

  * బిడా లవణము . 

  * సౌవర్చ లవణము . 

  * రోమక లవణము . 

  * ఔద్బిద లవణము . 

           లవణములు అన్నియు లవణ రసమును కలిగి ఉండి వేడిచేయు గుణమును కలిగి ఉండును. ఆహారంలో ఉపయోగించుటకు అన్ని లవణముల కంటే సైన్ధవ లవణము మంచిది . 

 * సైన్ధవ లవణము - 

      హృద్రోగము నందు , వాపుల యందు , రక్తపోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి ఉప్పు నిషిద్ధమైనప్పటికీ సైన్ధవ లవణమును కొద్దిమోతాదులో వాడవచ్చు . సింధుపర్వత ప్రాంతమున భూగర్భగనుల నుండి సేకరించుట చేత దీనికి సైన్ధవ లవణం అని పేరువచ్చింది. ఇది సహజముగా పరిశుద్ధం అయినది. ఆకలిని పుట్టించును . ఆహారమును జీర్ణం చేయును . చలువ చేయును . నేత్రములకు మంచిది . వాత, పిత్త, కఫ దోషముల యందు పనిచేయును . 

              వ్రణములను శోధించి మాన్పును . నేత్రరోగులకు మంచిది . దాహమును అణుచును . విరేచనం చేయును . శ్లేష్మాన్ని కరిగించును. పాలతో కలిపి పుచ్చుకొనవచ్చు. దీనిని అమితముగా పుచ్చుకొనిన పైత్యమును చేయును . అతిసార రోగమును పుట్టించును . 

 * సాముద్ర లవణము - 

         ఈ లవణమును సముద్రపు నీరు ఎండబెట్టి చేయుదురు . ప్రతిరోజు మనం వాడుకునే ఉప్పు ఈకోవలోకే వచ్చును. ఇది విరేచనకారి , ఆకలిని పెంపొందించును. శ్లేష్మాన్ని వృద్ధిచెందించును . వాతాన్ని అణుచును. కఫవాతము , గుల్మము , విషము , శ్వాసకాస వీనిని హరించును . నేతిలో ఉప్పు వేసి పుచ్చుకొనిన శూలలు ( నొప్పులు ) తగ్గును. పరిణామ శూలతో అనగా ఆహారం అరుగు సమయములో నొప్పితో ఇబ్బందిపడేవారు భోజనం చేసే సమయములో మొదటిముద్దలో కొంచం ఉప్పు కలుపుకుని తినుచున్న పరిణామశూల నయం అగును. 5 గ్రాముల సాముద్ర లవణమును చల్లని నీటితో కలిపి ఇచ్చిన రక్తముతో కూడిన వాంతులు నయం అగును.  

                      తేలు కుట్టినప్పుడు 5 గ్రాముల ఉప్పు నీటితో కలిపి కరిగిన తరువాత ఇచ్చిన తేలు విషం వెంటనే తగ్గును. వేడినీటితో పుచ్చుకొనిన వాంతి చేయును . కడుపులో నొప్పి , గుండెల్లో నొప్పి వచ్చు సమయమున ఉప్పును ఒక కడాయిలో వేసి వేయించి ఒక గుడ్డలో పోసి మూటకట్టి నొప్పి భాగములో కాపడం పెట్టిన తగ్గును. వాతము , శ్లేష్మములను హరించి శరీరానికి వేడిపుట్టించును. 

         ఉప్పును అధికంగా తీసుకోవడం వలన కొన్నిరకాల దుర్గుణాలు కలుగును. ఎముకలు మరియు వీర్యము యొక్క బలాన్ని తగ్గించును . నేత్రవ్యాధులు , రక్తస్రావము , కుష్ఠు , విసర్పి , వెంట్రుకలు రాలిపోవుట , తెల్లబడుట వంటి దుర్గుణాలు కలుగును. 

       మిగిలిన లవణాలు అయిన సౌవర్చలవణము , బిడా లవణము , ఔద్బధ లవణము , రోమక లవణము వంటివి సురేకారముతో తయారుచేయును . వాటిని ఔషధముల యందు మాత్రమే ఉపయోగిస్తారు . ఆహారం నందు వాడుటకు పనిచేయవు . 

               సమాప్తం  

       

కుష్టువ్యాధిని నివారించే రహస్య ప్రక్రియ -

వంద సంవత్సరములు దాటిన వేపచెట్టుని ఉపయోగించి 40 రోజులలో కుష్టువ్యాధిని నివారించే రహస్య ప్రక్రియ - 

     నూరు సమత్సరములు కలిగిన వేపచెట్టు కాండంలో 3 నుంచి 4 శేర్లు నీరు పట్టినంత తొర్రని నిలువుగా ఏటవాలుగా తొలచి అందులో సుమారు సేరు బియ్యము అన్నము వండి చల్లారాక మునుపే ఉంచి ఆ వేపచెట్టు పచ్చికర్రతో ఆ తొర్రకి సరిపడు బిరడా తయారుచేసి బిగించి దానిపైన గాలి లొపలికి పోకుండా పైన ఆవుపేడ పూసి ఒక సంవత్సరం ఉంచి ఆఖరు రోజున ఆ బిరడా తెరిచి చూసిన ఆ అన్నం ఎర్రగా ఉండును.దానిని బాగా ఎండించి పూటకి పావులాయెత్తు ( 5 గ్రా ) చొప్పున 40 దినములు పుచ్చుకొనిన కుష్టురోగం నివారణ అగును. 

       ఇది అత్యంత రహస్య యోగంగా గ్రంధాలలో ఉన్నది . 

  గమనిక -

          బాగా ముదిరిన పెద్ద వేపచెట్టు కాండం దానంతట అది పగిలి దానినుంచి కల్లు వెలువడును. అలా ఎక్కడైనా మీకు దొరికితే విడవకుండా వెంటనే త్రాగండి. ఆ కల్లు తాగడం వలన పొట్టకు విపరీతమైన బలం చేయును. జ్వరము , శరీరంలో పైత్యం హరించును. శరీరతత్వం మార్చును. రక్తం శుభ్రం చేయును . కాని ఉదయం పూట మాత్రమే పుచ్చుకొనవలెను.

     
       

స్త్రీల సౌందర్యానికి చిట్కాలు -

స్త్రీల సౌందర్యానికి చిట్కాలు - 

 నల్లటి మచ్చలు ,మంగు నివారణ -

 * జాపత్రిని మంచినీటితో మెత్తగా నూరి రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపర్చుకొనుచున్న అతిత్వరలోనే ముఖము పైన కల మంగు ,నల్లమచ్చలు మాయం అగును . 

 * మిరియాలు గోరోజనముతో కలిపి నూరి పైకి లేపనం చేయుచున్న మొటిమలు తగ్గును . మచ్చలు పోవును . 

 * బాదం పప్పును నీటితో నూరి వడకట్టగా వచ్చిన పాలను ముఖంపై మర్దన చేయుచున్న క్రమంగా నల్లమచ్చలు , మంగు , మొటిమలు త్వరలోనే హరించును . 

 * ధనియాలు , వస , సుగంధపాల ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణముగా చేసి ఈ చూర్ణమును ఒంటికి నలుగు పిండిలా పట్టించుచున్న నల్లటి మచ్చలు , మొటిమలు తగ్గును . 

 * నిమ్మరసమును పాలతో కలిపి రాత్రిపూట ముఖానికి మర్దన చేసుకుని తెల్లవారిన తరువాత లేవగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకొనవలెను . సబ్బు వాడరాదు . ఇలా క్రమం తప్పకుండా చేయుచున్న మచ్చలు , మంగు పోయి ముఖం కాంతివంతం అగును . 

 * తులసి ఆకుల రసములో కొద్దిగా టంకణం ( Borax ) కలిపి పైకి లేపనం చేయుచున్న ముఖం పైన మచ్చలు , మంగు హరించును . 

 * మంజిష్ట చూర్ణమును ఆవుపాలతో కలిపి అరగదీసి అందులో కొంచం తేనె కలిపి ముఖమునకు లేపనం చేయుచున్న నల్లమచ్చలు , మంగు హరించును .