చేజారిన విద్యావ్యవస్థ:
బడాయి బసవయ్యల డాబుసరే వాళ్ళ ప్రాణానికొచ్చింది !
✅ సత్తె కాలం ..
ఏడో తరగతి లో పబ్లిక్ పరీక్షలు .
అదొక వార్నింగ్ సిగ్నల్ .
అటు పై పది ...
సరిగా చదవని వాళ్ళు ఫెయిల్ అయ్యేవారు .
ఇంటర్ ..
పది లో తప్పించుకున్నా... సరుకు లేనివారు ఇంటర్ లో ఫెయిల్ అయ్యేవారు .
ఇష్టపడి చదివే వారు , ప్రతిభ ఉన్న వారు మాత్రమే డిగ్రీ దాక చేరేవారు .
డిగ్రీ కి ఒక విలువ... గౌరవం .
డిగ్రీ చదువంటే సొంతకాళ్ళ పై నిలబడి గౌరవంగా జీవించడానికి పాస్ పోర్ట్ .
ఆ సత్య కాలం లో ... ✅✅
నూటికి ... అరవై డెబ్భై మంది పది లేదా ఇంటర్ లో ఫెయిల్ అయ్యేవారు .
వారికి వాస్తవం తెలిసొచ్చేది .
నిజాయతీ .. కష్టపడడం లాంటి విలువలు తెలిసొచ్చేది .
ఆలస్యంగా నైనా చదువు విలువ తెసులుసుకొన్న వారు కష్టపడి చదివి పది/ఇంటర్ పాస్ అయ్యి ఉన్నత చదువులకు వెళ్లే వారు .. పది లో ఫెయిల్ అయ్యి అటుపై ఐఏఎస్ సాధించినవారు కూడా వున్నారు .
చిన్నప్పుడే దెబ్బ తగలడం తో ITI లాంటి చదువు చదివినా BHEL లాంటి సంస్థలో జాబ్ కొట్టేవారు . ఇలాంటి ప్రతిభ లేని వారు unskilled లేబర్ గా స్థిరపడేవారు ..
వృత్తి ఏదైనా కష్ట పడి పని చేసేవారు .
ఆ సత్య కాలం లో ఆవారా గాళ్ళ సంఖ్య తక్కువ. ✅
❌❌కలికాలం చదువుల మాయా ప్రపంచం .. ఆవారా గాళ్ళ లోకం!
ఏడో క్లాస్ పరీక్షల్ని ఎత్తేసారు .
ఇప్పుడు .. పదో తరగతి పరీక్షలంత బోగస్ వ్యవహారంప్రపంచం లో ఇంకోటి ఉండదు .
కంచె దగ్గరుండి మరీ చేను మేయిస్తుంది.
డీఈవో స్థాయినుంచి ప్రయత్నించి అందరినీ పాస్ చేయిస్తారు .
మాస్ కాఫీయింగ్ కూడా రాని వారు ... ఆన్సర్ షీట్ పై కనీసం ప్రశ్నలని ..అయిదారు సార్లు రాయడం రాని వారు మాత్రమే .. పదిలో ఫెయిల్ అవుతారు .వారిని కూడా జూన్ లోగా ఇంకో ఎక్సమ్ పెట్టి పాస్ చేయించి ఇంటర్ లో చేరేలా చేస్తారు
నిజాయితీగా పదో తరగతి పరీక్షలు జరిగితే ఉత్తీర్ణతా శాతం ముప్పై దాటదు.
ఆలా జరిగితే ఇంటర్ కళాశాలలు సగానికి పైగా మూసేసుకోవాల్సిందే .
పదో క్లాసులో మాస్ కాఫీయింగ్ లో పాస్ అయ్యిన చెత్త సరుకు కార్పొరేట్ జూనియర్ కాలేజీ లో చేరుతుంది .
." మా వాడు కార్పొరేట్ లో ఐఐటీ సెక్షన్ లో ఉన్నాడు" అని అమ్మ అబ్బా గొప్పలు చెప్పుకొంటారు .
కైనెటిక్ ఎనర్జీ అనే పదాన్ని తప్పులు లేకుండా రాయడం రాదు . వాడికి ఐఐటీ సీట్ వస్తుందని ఆ కార్పొరేట్ వాడు చెప్పడం .. దాన్ని నువ్వు నమ్మడం .. కిట్టి పార్టీ ల లో / మందు పార్టీ ల లో గొప్పలు చెప్పుకోవడం .... ఈ తమాషా ఏంటి ? అని ఎవరూ అడగరు.
ఇంటర్ ..
. కొంత మంది ఫెయిల్ .
బట్టి కొట్టి... అటుపై కాపీ కొట్టి... ఉదార మార్కుల స్కీమ్స్ తో మిగతా వారు పాస్ .
ఫెయిల్ అయ్యిన వాడు సప్లిమెంట్ లో పాస్ .
ఐఐటీ లో సీట్ కొట్టేవాడు ఎవడో కార్పొరేట్ వాడికి ముందుగానే తెలుసు .
వారికి సీవో బ్యాచ్ కోచింగ్ .
మిగతా వారికి జనరల్ బ్యాచ్ లో .. వాచి పోయింగ్ .
ఇంటర్మీడియట్ అని ఆంగ్లంలో తప్పులు లేకుండా రాయడం కూడా రాని లక్షలాది మంది . చదువుకొన్న నిరక్షరాస్యులు ఇంటర్ సర్టిఫికెట్ పట్టుకొని ఉన్నత విద్య కోసం తయారు . .
"అమ్మ నాన్న దగ్గర డబ్బుంది.. నాకు మంచి కాలేజ్ లో సీట్ గ్యారెంటీ" అని వారికి తెలుసు .
డాబుసరి పేరెంట్స్ .. డబ్బు లేకపోయినా పొలం పుట్రా అమ్మేయాలి .
తప్పదు !!
" మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు?" అని పక్కింటి వాళ్ళు .. పై ఇంటి వాళ్ళు ప్రాణాలు తోడేస్తారు .
కడుపు చించుకొంటే కాళ్లపై పడుతుంది .
బిల్డ్ అప్ లేకపోతె ఎలా ?
సరిగ్గా ఇలాంటి .. పొట్ట పొడిస్తే అక్షరం రాని వారి కోసమే గత ఇరవై ఏళ్లగా దేశ వ్యాపితంగా అనేక ఇంజినీరింగ్ కళాశాలలు .. స్టార్ హోటల్స్ ను తలపించే ప్రైవేట్ యూనివర్సిటీ లు వెలిసాయి .
తాజ్ హోటల్ .. గ్రాండ్ కాకతీయ హోటల్స్ లెవెల్ లో వీరి బిల్డింగ్ లుంటాయి .
పేరు గొప్ప ..‼️‼️
ఇమేజ్ బిల్డ్ అప్ కోసం ప్రైవేట్ యూనివర్సిటీ వాడు వీవీఐపీ ల ను తెస్తుంటాడు .
ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు పండగ .
రామోజీ ఫిలిం సిటీ ని మరిపించేలా సెట్టింగ్స్ వేసి హంగామా చేస్తారు .
మా వాడు ఫలానా కాలేజీ / యూనివర్సిటీ అని డాబు సరి పేరెంట్స్ గొప్పలు .
పొట్ట పొడిస్తే అక్షరం రాని సుంటకు డబ్బు కట్టి సీట్ ఇప్పించామని వాళ్లకు తెలుసు .
ఆ మాటకొస్తే అందరికీ తెలుసు .
ఎవడూ మాట్లాడడు .
... రాజు గారి దేవత వస్త్రాల సీక్వెల్ స్టోరీ .
ఊరు పరమ దిబ్బ .❌❌
అక్కడ ఒకటో- అయిదు శాతం ఫాకల్టీ మాత్రమే చదువు చెప్పే ప్రతిభ కలిగుంటారు.
మిగతా... బోగస్ సర్టిఫికెట్స్ బ్యాచ్ .
పది శాతం విద్యార్థులు చదువు పై ఫోకస్ పెడితే ఎక్కువ .
మిగతా వారికి చదువు అలవాటు ఎప్పుడో ఆరో తరగతిలోనే తప్పింది .ఇప్పుడు ఎలా చదవగలరు ? అసలు అంత అవసరం ఏమొచ్చింది ?
అమ్మ అబ్బా సంపాదించిన డబ్బు ఉందని వారికి తెలుసు .
చేరింది... క్లబ్ లాంటి విద్య సంస్థలో .
బయటే అదొక విద్య సంస్థ .
లోన జరిగేది వేరు .
ఫస్ట్ ఇయర్ బ్యాచ్ కే కాలేజీ కొన్ని రూమ్స్... ఒక ఫ్లోర్... అలాట్ అయిపోతుంది ..
అక్కడ తాగొచ్చు .
రీల్స్ తీసుకోవచ్చు .
బయటకు రాకుండా ఏమైనా చేసుకోవచ్చు .
ప్రిన్సిపాల్ గారి ఆజ్ఞ .
పాపం అంత కన్నా ఏమి చేయగలడు ?
వదిలేస్తే క్లాసు రూమ్ లోనే ఓటిటీ సినిమాలు జరిగిపోతాయి మరి .
రెండో ఏడాది గడిచే సరికి డ్రగ్స్ .. గ్రూప్ సెక్స్ .
నాలుగేళ్లు ఇదే మార్గం లో ప్రగతి .
బాల్యం నుంచి అలవాటయిన కాఫీయింగ్ ఎలాగూ వుంది .
దగ్గరుండి మరీ ప్రైవేట్ యూనివర్సిటీ/ ఇంజనీరింగ్ కాలేజీ వాడే కాపీ రాయిస్తాడు .
ఇంటర్నల్ మార్కులు వేయిస్తాడు .
డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో పెట్టి convocation పేరుతొ హుంగామ చేయించి మరీ పంపుతాడు .
చేతికి డిగ్రీ సర్టిఫికెట్ వచ్చింది .
"వదినా/అన్నయ్య ! .. మీ వాడికి జాబ్ వచ్చిందా ? ప్యాకెజీ ఎంత??” అని పొడుచుకొని తినే .. పక్కింటి పై ఇంటి వాళ్ళు ఎలాగు ఉన్నారు .
డొల్ల డొక్కు సర్టిఫికెట్ తో ఉద్యోగం ఎవడిస్తాడు ?
దానికీ ఒక మార్గం కనిపెట్టేసారు .
అమెరికా లో ఎవడినో పట్టుకొంటే ప్రాక్సీ ల సాయం తో GRE టోఫెల్ పరీక్షలు రాయించి .. బోగస్ ఇంటర్వ్యూ చేయించి జాబ్ ఇప్పిస్తాడు .
వచ్చే జీతం లో ఇంత శాతం అని వాడిది .
మిగిలిన సగం జీతం లో లో కొంత ఇచ్చి ఇండియా లో ఉన్న వాడితో పని చేయించుకొంటే .. తాను అమెరికా లో కొత్త దందా చేస్తూ కోట్లు కూడా పెట్టవచ్చు .
అన్నీ కలిసొస్తే ఇండియా లో రాజకీయాల్లో చేరి పదవి గౌరవం కొట్టెయ్యొచ్చు .
స్కూల్ దశ నుంచి జాబ్ సాదించే దాక .. బోగస్ పధ్ధతి ని అనుసరించి .. అదే గొప్ప అని నమ్మించి .. డాబుసరి బతుకు బతకడం తెలుగు వాడు నేర్చిన కళ.
కాపీ రైట్స్ .. పేటెంటెడ్ హక్కులు వాడి సొంతం .
ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రైవేట్ యూనివర్సిటీ ల లో చదువు కోసం వెళ్లి కాపీ రాయుళ్ల పీర్ ప్రెషర్ తట్టుకోలేక .. బూజ్ .. డ్రగ్స్... ఫ్రీ సెక్స్ .. దారి పట్టలేక సతమమయిన విద్యార్థులు .. తాను మంచి ఇంజనీరింగ్ కాలేజీ లో చదివినా తనకు రావాల్సిన అమెరికా జాబ్ ను ప్రాక్సీ గాడు తన్నుకు పోవడంతో బాధ పడిన సిన్సియర్ వ్యక్తుల .. ఆత్మ గోష వూరక పోతుందా ?
వచ్చాడు ఒక ట్రంప్ .
ట్రంపో..
వంపో...
ఇసుక తో కట్టిన భవనం నిలుస్తుందా ?
ఎదో కొంత కాలం సాగింది .
వంద మంది వెళ్లారు కాబట్టి దొంగదారి.. రహదారి అయిపోతుందా ?
బడాయి బసవయ్యల పిల్లల జీవితాలు డేంజర్ లో !
తల్లితండ్రుల డాబుసరి .. ఇప్పుడు వారి సంతానం ప్రాణాలకొచ్చింది .
లక్షలు ఖర్చు పెట్టి మందు బాబులను .. మద్యం పాపలను .. డ్రగ్స్ కేటుగాళ్లను .. తయారు చేసి వదిలితే ?
ఎవరిదీ పాపం ?
తొలి విలన్ .. డాబుసరి పేరెంట్స్ .
రెండో విలన్ .. గతి తప్పిన విద్యా వ్యాపారం .
మూడు .. రాజకీయం .
ధర్మం అధోగతి పాలయితే .. కరెక్షన్ తప్పదు .
జరిగింది గోరంత .
జరగబొయ్యేది కొండంత !
చూస్త్తూ .. వుండండి .
No comments:
Post a Comment