++++++++++++++++++++++
*రాగిలు మాల్ట్ తయారు చేయు విధానం*:-
***************************
ఒక కేజీ "రాగులు రాత్రి నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఒక బట్టలో వేసి మూట గట్టి.. రెండు రోజులు అలాగే ఉంచితే మొలకలు వస్తాయి
వాటిని ఎండబెట్టి.. పొడి చేసి నిలువు చేసి పెట్టుకోవాలి
👉 కావలసిన పదార్థాలు
1.రాగి పిండి 50 గ్రాములు
2. ఖర్జూరం గింజలు తీసినవి-2
3. బెల్లం 20 గ్రాములు
4.నెయ్యి 10-20ml
5. పుచ్చకాయ గింజలు 1/4 చెమ్చా
6. సబ్జా గింజలు పావు చెంచా
7. వేయించిన వేరుశెనగ గింజలు
5 గ్రామలు
8. బాదం, జీడిపప్పు, కిస్మిస్
-20 గ్రాములు
9.నువ్వులు పావు చెంచా
9.నీళ్లు 200ml
👉 తయారుచేయు విధానం:--
200ml లో 50 గ్రాములు రాగిపిండి వేసి వేడి చేయాలి.. 50 ml నీళ్ళ లో
బెల్లము ఖర్జూరము.. విడిగా నానబెట్టుకోవాలి.. రాగి జావ ఉడుకుతున్నప్పుడు దానిలో వేసేయాలి.. స్టవ్ మీద ఉన్నప్పుడు మీగత పదార్థాలు కూడా వేసి వేయాలి... కొద్దిసేపటి తర్వాత తాగడానికి రెడీ గా ఉంటావి
👉ఉదయం లేదా సాయంత్రం పూట దీనిని సేవించవచ్చు..
రాత్రి భోజనం బదులు కూడా సేవించవచ్చు...
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు ఓం సర్వేభవంతు సుఖిన: సర్వే సంతు నిరామయా: సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దు:ఖ భాగ్భవేత్
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.
-: ఓం శ్శాంతిః శ్శాతిః శ్శాంతిః
No comments:
Post a Comment