Monday, February 28, 2022

మర్మకళ - శరీరం నందు ఉండు మర్మస్థానములు

మర్మకళ  - శరీరం నందు ఉండు మర్మస్థానములు  

        మర్మ కళ అనే యుద్ధవిద్య భారతీయ ప్రాచీన రహస్య యుద్ధవిద్యలలో ఒకటి. ఈ యుద్దవిద్య ఎక్కువుగా కేరళలో అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ విద్యకు మూలపురుషుడు పరమశివుడు . దీనికి వర్మ కళ అని మరొక పేరుతో కూడా వ్యవహరిస్తున్నారు.

            మనిషియొక్క శరీరంలో ప్రాణశక్తి అనేది శరీరములో గల పది మార్గాలనుంచి పైనుంచి క్రిందకి , క్రింద నుంచి పైకి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ మార్గాలను "దశ నాడులు " అని పిలుస్తారు . ఈ ప్రాణశక్తి ప్రవహించే మార్గాలలో ఎటువంటి అడ్డు ఏర్పడినపుడు మనుష్యునికి రోగాలు సంభవిస్తాయి. శరీరములో రక్తం ప్రవహించుటకు రక్తనాళాలు ఎలా ఉన్నాయో అదేవిధముగా వాయువు శరీరం అంతా పరిభ్రమించుటకు కొన్ని ప్రత్యేక మార్గాలు కలవు. ఈ మార్గాలనే నాడులు అని పిలుస్తారు . ఈ నాడులు లో వాయవు ఉంటుంది. పైన చెప్పిన ప్రాణశక్తి అనేది వాయవు రూపంలో ఉంటుంది.

            మర్మస్థానం గురించి వివరించాలి అంటే అదొక ట్రాఫిక్ జంక్షన్ లాంటిది. జంక్షన్ లో సమస్య లేనంతవరకు వాహనాలు ఎటు వెళ్ళేవి అటు ప్రశాంతముగా వెళ్తాయి. ఏదన్నా సమస్య వస్తే ఒకదానివెంట ఒకటి ఆగి సమస్య ఎలా వస్తుందో అదేవిధముగా మర్మస్థానము పైన దెబ్బ తగిలిన వెంటనే శరీరం నందు ఒక్కసారిగా మార్పు వస్తుంది . అవయవాలు చచ్చుబడుట , కోమాలోకి వెళ్లడం , మరణించడం ఈ మూడు రకాల సమస్యలు సంభంవించును. ఏ సమస్య అనేది మర్మస్థానం మరియు మర్మస్థానం పైన దెబ్బ ఎంత బలంగా తగిలింది అనేదానిని బట్టి ఉంటుంది.

         మనుష్య శరీరములోని సిరలు గురించి చెప్పాలంటే వాత , పిత్త , కఫ , రక్త వాహకాలు అని నాలుగు రకాలుగా ఉంటాయి.ఇవి మొత్తం 700 సిరలు శరీరం నందు ఉండును. ఈ సిరలును ఆశ్రయించి మర్మస్థానాలు ఉంటాయి. ఈ మర్మ స్థానముల యందు దెబ్బ తగిలినప్పుడు లేదా గాయం అయినపుడు ప్రాణానికి ముఖ్యమైన రక్తం అధికంగా స్రవించును . రక్తము వలనే మిగిలిన ధాతువులు అన్నియు వృద్ధిచెందుతూ ఉండును. గాయం వలన రక్తం అధికంగా పోయినచో శరీరం నందలి మిగిలిన ధాతువులు క్షీణించును. ఎప్పుడైతే ధాతుక్షయం జరిగినదో వాతం ఒక్కసారిగా వృద్దిచెంది తేజోరూపమైన పిత్తమును ప్రేరణ చెందించును. దీనివల్ల దెబ్బ లేదా గాయం అయిన మర్మస్థానం నందు మిక్కిలి తీవ్రమైన మంట, పోటు మున్నగు బాధలు కలుగును. తీవ్రమైన దప్పిక , శోష , భ్రమ కలుగును. ఆ తరువాత శరీరం పైన తీవ్రంగా చెమట పట్టి అవయవాలు చచ్చుబడుతూ నరకాన్ని అనుభవిస్తూ మరణిస్తాడు. పైన చెప్పిన లక్షణాలన్నీ మర్మస్థానం పైన దెబ్బ తగిలినప్పుడు సంభంవించును. ఈ అత్యంత ప్రాచీన రహస్యమైన మర్మకళ ని సంపూర్ణంగా అభ్యసించిన వ్యక్తికి మాత్రమే మనుష్య శరీరంలో మర్మ స్థానాలు ఎక్కడ ఉంటాయో చక్కగా తెలుస్తుంది. ఈ మర్మస్థానాలనే మన తెలుగుభాషలో ఆయువుపట్లు అంటాము.

                          ఇప్పుడు మీకు మర్మస్థానముల గురించి  వివరిస్తాను. మనుష్య శరీరం మొత్తం మీద 107 మర్మస్థానాలు ఉండును. నాకున్న పరిధినిబట్టి కొంత సమాచారం మాత్రం మీకు వివరిస్తాను. తొడలు ,చేతులు ఈ నాలుగు అంగముల యందు ఒక్కోదానియందు 11 మొత్తము 44 . ఉదర భాగము నందు 3 , రొమ్ము భాగము నందు 9 , వీపున 14 , కంఠము పై భాగము నందు 37 ఉండును. ఇవ్వన్ని కలిపి మొత్తం 107 మర్మములు ఉండును.

          ఆయా భాగములలోని మర్మస్థానాలలో దెబ్బలు గాని గాయాలు గాని సంభవించినపుడు కలుగు విపరీత పరిస్థితుల గురించి మీకు వివరిస్తాను. కాలు యందు ఉండు పదకొండు మర్మస్థానములలో ఒకటి నడిమివేలికి అభిముఖంగా , పాదమధ్య భాగము నందు తల హృదయమును మర్మస్థానం ఉండును. ఈ స్థానము నందు దెబ్బ తగిలినచో తీవ్రమైన నొప్పి కలిగి వెంటనే మరణం సంభంవించును. బొటనవేలికి మరియు మిగిలిన వేళ్ళకి మధ్య క్షిప్రం అను మర్మస్థానం ఉండును. ఈ ప్రదేశము నందు దెబ్బ తగిలినచో అవయవాలు చచ్చుబడి మరణం సంభంవించును. క్షిప్ర మర్మస్థానము నకు రెండు అంగుళాల పైభాగము నందు కూర్చమ్ అను మర్మస్థానం ఉండును. దీనిపైన దెబ్బ తగిలినచో పాదము నందు వణుకు పుట్టును .

           కీలు భాగము నందు ఉండు మర్మలో దెబ్బ తగిలినచో నొప్పి కలిగి కీలు యొక్క గమనం మందగించును. పిక్క మధ్యభాగము నందలి దెబ్బ తగిలి రక్తం వెడలి ఎక్కువ మోతాదులో బయటకి పొయినచో ఆ వ్యక్తికి మరణం తప్పదు. కావున గాయం అయిన వెంటనే రక్తం బయటకి పోకుండా జాగ్రత్త పడవలెను. పిక్కకి మరియు తొడ మధ్యభాగము నందు ఉండు కీలు నందు జాను అను మర్మస్థానం ఉండును. అక్కడ దెబ్బ తగిలినచో మరణించును. ఒకవేళ చికిత్స ద్వారా కాపాడబడినను కుంటితనం సంప్రాప్తిస్తుంది.

        పైన చెప్పిన విధముగా అనేక మర్మస్థానములు మన యొక్క శరీరం నందు ఉండును. వాటిలో కొన్నిస్థానాల పైన దెబ్బలు తగిలితే వెంటనే మరణం సంభంవించును. మరికొన్ని స్థానాలలో దెబ్బలు తగిలితే కొన్నిరోజుల సమయంలో హఠాత్తుగా మరణించటం జరుగును. మరికొన్నిసార్లు శాశ్వత అంగవైకల్యం లేదా తాత్కాలిక అంగవైకల్యం సంప్రాప్తినిచ్చును . ఈ మర్మస్థానం ల యందు దెబ్బలు తగలడం వలన వచ్చు జబ్బులకు 
అత్యంత కష్టసాధ్యముతో నయం చేసినప్పటికీ దానిప్రభావం మాత్రం పోదు .

            మర్మకళ ని నేర్చుకోవాలి అనుకునే వ్యక్తికి చాలా అత్యంత కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. ఈ విద్య అందరికి లభించదు. మనస్సుపైన , తన యొక్క భావావేశాలును అదుపులో ఉంచుకోగలిగిన వ్యక్తి మాత్రమే ఈ విద్య నేర్చుకోగలుగుతాడు .

      చివరగా చిన్న విషయం చిన్నపిల్లల తలపైన మొట్టికాయలు వేయడం ప్రమాదకరం ఆ స్థలములో కూడా మర్మస్థానాలు ఉంటాయి. ఒక్కోసారి ఆ స్థానాల్లో దెబ్బ తగలడం వలన విపరీత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

     

పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .

పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .

   ఆవుపెరుగు మిక్కిలి జిడ్డుగా ఉండును. శ్లేష్మాన్ని కలుగచేయును . రక్తం చెడగొట్టును . గ్రామాల యందు పాడిపంటలు విశేషముగా ఉన్నను మనుష్యులు రోగాలబారిన పడుటకు ముఖ్యకారణం పెరుగు తీసుకొను విషయంలో నియమాలు పాటించకపోవడమే ప్రధాన కారణం. రాత్రి యందు పెరుగు ఉపయోగించుట మంచిది కాదు. 

          పెరుగు ప్రీతికరమైన పదార్థం కావడం మూలాన పిల్లలు , పెద్దలు మితిమీరి సేవించెదరు. అందువలన రక్తం చెడి రక్తపిత్త రోగం , విసర్పి కలుగును. విసర్పి అనగా శరీరం నందు రక్తం చెడి మాంసం , చర్మములతో కలిసి సర్పం పాకే విధముగా తొందరగా శరీరం అంతా గుడ్లగుడ్లగా ఉండును. ఇది తరచుగా చిన్నపిల్లలకు వచ్చును. కుష్టు , పాండురోగం , పచ్చకామెర్లు మొదలగు వ్యాధులు వచ్చును. పెరుగు వేడిచేయును . అదే దానికి కొంచం నీరు కలిపి మజ్జిగలా చేసుకుని తాగితే చలువచేయును . అందుకే వేసవికాలం నందు పెరుగు తీసుకోరాదు . శీతాకాలం , వర్షాకాలం నందు పెరుగు పగలు తీసుకోవచ్చు . 

              మూత్రం బొట్లుబొట్లుగా పడు వ్యాధి నందు , రొంప, చలిజ్వరం , నోటికి రుచి లేకపోవటం , శరీరం కృశించి ఉండు రోగములు కలిగి ఉండువారు పెరుగు వాడటం మంచిది . పెరుగు శుక్రాన్ని పెంచును.

  పెరుగు తీసుకొనువారు పాటించవలసిన నియమాలు - 

 *  పెరుగుతో కోడిమాంసాన్ని భుజించరాదు .

 *  పెరుగుతో నిమ్మపండు భుజించరాదు .

 *  పెరుగుతో అరటిపండు భుజించరాదు . 

 *  పెరుగు వేడివేడి అన్నంతో పాటు తినరాదు.

 *  పెరుగు రాత్రి పూట భుజించరాదు .శరీరంలో కఫం వృద్ధిచెందును. మరియు జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.

    పగలు పెరుగు భుజించువారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవలెను.

 *  తేనె - పెరుగు = మంచి రుచి కలుగును.

 *  ఉసిరిక పచ్చడి - పెరుగు =  శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను పోగొట్టును . 

 *  నెయ్యి - చక్కెర - పెరుగు =   వాతాన్ని తగ్గించును , ఆహారాన్ని జీర్ణం చేయును . 

 *  చక్కెర -  పెరుగు =   దప్పిక, తాపాన్ని హరించును . 

 *  పెసరపప్పు - పెరుగు  =  రక్తంలోని వాతాన్ని హరించును . 

  మజ్జిగ ఉపయోగాలు - 

  
    పెరుగునకు నాలుగోవ భాగం నీరు కలిపి బాగుగా మజ్జిగ తయారుచేయవలెను. దానిలో వెన్న తీయరాదు. ఇటువంటి మజ్జిగని ఉదయం , మధ్యాహ్న భోజనంలో ఉపయోగించుచున్న ఏ వ్యాధితోను బాధపడరు.  బాగుగా చిక్కగా ఉండి వెన్నతీయని  మజ్జిగ పుష్టిని కలుగచేయును . కఫాన్ని కలిగించును. శ్రమను , దప్పికను పొగొట్టును. బాగుగా చిలికి వెన్నతీసిన మజ్జిగ తేలికగా జీర్ణం అగును.

          శరీరంలో వాతం పెరిగినపుడు మజ్జిగలో శొంటి, సైన్ధవలవణం లేదా ఉప్పు కలిపి లొపలికి తీసికొనవలెను. శరీరంలో పైత్యం పెరిగినపుడు మజ్జిగతో పంచదార కలిపి వాడవలెను. శరీరంలో కఫం ఎక్కువైనప్పుడు శొంటి, పిప్పిళ్లు , మిరియాల చూర్ణం కలిపి మజ్జిగతో కలిపి తాగవలెను . 

                మన శరీరంలో జఠరాగ్ని మందగించి ఆకలి లేనపుడు మరియు వాత వ్యాధుల్లో మజ్జిగ అమృతంగా పనిచేయును . విషం , వాంతులు , నోటి నుండి నీరు కారుట, విషమజ్వరం , పాండువు , రక్తవిరేచనాలు , మేథస్సు, మొలలు , భగన్దరం , అతిసారం , ప్లీహానికి సంబంధించిన వ్యాధులు , ఉదరరోగం , బొల్లి , కుష్టు , క్రిములను మొదలయిన వాటిని మజ్జిగ సేవించుట వలన పోగొట్టుకోవచ్చు. 

          మజ్జిగ భూమిపైన పోసిన అక్కడ ఉన్న గడ్డిపోచలు , పచ్చిక వంటివి మాడిపోయి మరలా మొలవవు. ఇదే సూత్రం మొలలు వ్యాధికి సంక్రమించును. మొలల వ్యాధిలో మొలకలు ఊడిపోవుటకు మజ్జిగ సేవనం తప్పనిసరి . మజ్జిగ తాగుట వలన వాత, శ్లేష్మములచే ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయి రక్తప్రసరణ సాఫీగా జరుగును. దీనివలన శరీరపుష్టి పెరుగును . మజ్జిగ తాగుట వలన 80 రకాల వాతరోగాలు నయం అగును.

  మజ్జిగలోని రకాలు  - 

  *  పెరుగును కవ్వముతో చిలికి అందు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ.

 *  పెరుగును చక్కగా కవ్వముతో చిలికి అందు వెన్నను సగం మాత్రమే తీసివేసిన మజ్జిగ .

 *  పెరుగును చక్కగా కవ్వముతో చిలికి వెన్నను ఎంతమాత్రం తీయకుండా ఉంచిన మజ్జిగ.

     కఫం ఎక్కువ ఉన్నప్పుడు , అగ్ని మందగించినప్పుడు మిక్కిలి బలహీనంగా ఉన్నప్పుడు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ వాడవలెను.

      పైత్యం ఎక్కువ అయ్యి , అగ్నిమాంద్యం ఉన్నప్పుడు బలం మధ్యమంగా ఉన్నప్పుడు సగం వెన్న తీసిన మజ్జిగను వాడాలి.

     వాతం ఎక్కువుగా ఉన్నప్పుడు వెన్న అసలు తీయని మజ్జిగని వాడవలెను.

 
  వెన్న ఉపయోగాలు - 

    
         ఆవు వెన్న బలం కలిగించును. జఠరాగ్ని పెంచును. వాతం మరియు పిత్తాన్ని పోగొట్టును రక్తదోషాలను, క్షయరోగం, మొలలు , దగ్గు పోగొట్టును . చిన్నపిల్లలకు అమృతం వలే పనిచేయును . బక్కచిక్కి ఉన్నచిన్నపిల్లలకు ఉదయాన్నే తేనె , ఆవు వెన్న , పంచదార కలిపి తినిపించిన బలం కలుగును. క్షయరోగులు బాగా చిక్కి శల్యం అయినపుడు ఈ ప్రయోగం చాలా బాగా పనిచేయును . 

          గేదె పెరుగు బలకరం . మిక్కిలి చమురు కలిగి ఉండును. వాతం , శ్లేష్మం కలుగచేయును . మధురంగా ఉండును. పచ్చిపాలు తీసిన వెన్న సేవించిన కండ్లకు మంచిది . ఎల్లప్పుడూ అప్పటికప్పుడు తీసిన వెన్న మంచిది . నిలువ వెన్న చాలా రోగములను తెచ్చిపెట్టును. కావున విడిచిపెట్టవలెను. 

     

త్రిఫలా చూర్ణం - ఉపయోగాలు .

త్రిఫలా చూర్ణం  -  ఉపయోగాలు .

 *  శిరోవ్యాధులకు  - 

        త్రిఫలా చూర్ణం 30 గ్రా , పటికబెల్లం చూర్ణం 30 గ్రా కలిపి బధ్రపరచుకోవాలి. రొజూ 2 పూటలా పూటకు 10 గ్రా చొప్పున మోతాదుగా సేవిస్తూ ఉంటే తలలో పుట్టే వంద రకాల శిరోవ్యాదులు హరించి పోతాయి.

 *  మూర్చ  -  అపస్మారం  -

      త్రిఫల చూర్ణం అర టీ స్పూన్ మోతాదుగా ఒక టీ స్పూన్ తేనే కలుపుకుని రోజు సాయంత్ర సమయాలలో సేవిస్తూ ఉంటే క్రమంగా మూర్ఛ వ్యాధులు నయం అవుతాయి.

 *  కామెర్లు  -  ఉబ్బస రోగం . -

      
       ఉదయం పూట త్రిఫలా చూర్ణం కషాయం పెట్టి ఒక ఔన్స్ కషాయంలో ఒక టీ స్పూన్ అల్లంరసం , రెండున్నర గ్రాముల బెల్లం కలిపి సేవించాలి . రాత్రిపూట త్రిఫలా చూర్ణం , అతిమధురం సమంగా  కలిపి ఆ చూర్ణాన్ని 5 గ్రా మోతాదుగా మంచినీళ్ళతో వేసుకోవాలి. ఈ విధంగా రెండు వారాలపాటు ఈ ఔషధాన్ని సేవిస్తే మూర్చలు, దగ్గులు , కామెర్లు, ఉబ్బసం హరించి పొతాయి.

 *  కడుపు నొప్పుల కోరకు  - 

       త్రిఫలా చూర్ణం , అతిమధుర చూర్ణం , ఇప్పచెక్క చూర్ణం సమంగా కలుపుకుని పూటకు అర టీ స్పూన్ మోతాదుగా రెండు పూటలా నెయ్యి కలుపుకుని సేవిస్తూ ఉంటే కడుపులో వచ్చే అన్ని రకాల నొప్పులు అదృశ్యం అవుతాయి.

 *  విరేచనాలు కొరకు  - 

       త్రిఫలా చూర్ణం , కాచు చూర్ణం సమభాగాలు గా కలిపి పూటకు 1 టీ స్పూన్ మోతాదుగా మజ్జిగతో గాని , తేనెతో కాని రెండు పూటలా సేవిస్తూ ఉంటే రక్తం , జిగట, అజీర్ణ , నీళ్ల విరేచనాలు అన్ని కట్టుకుంటాయి. కాచు అనేది పచారి షాపుల్లో దొరుకును.

 *  అతిమూత్ర వ్యాదికి   - 

      త్రిఫలా చూర్ణం అర టీ స్పూన్ మోతాదుగా పావు గ్లాస్ మంచి నీళ్లలో కలిపి రొజూ పడుకునే ముందు తాగుతూ ఉంటే మూత్రంలో చక్కర తగ్గిపోయి అతిమూత్రం అరికట్టబడును.

 *  శరీరం ఉబ్బు  - 

       50 గ్రా త్రిఫలా కషాయంలో రెండు గ్రా గో మూత్ర శిలాజిత్ భస్మం కలిపి పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే ఇంత అసాధ్యం ఐన ఉబ్బురోగం హరించి పొతుంది.

 *  కామెర్ల వ్యాధి  నివారణ  - 

        10 గ్రా త్రిఫల రసంలో కొంచం తేనే కలిపి రెండుపూటలా ఇస్తూ ఉంటే కామెర్ల వ్యాధి హరించును.

 *  పైత్య రోగాలు   - 

       ప్రతిరోజూ 2 పూటలా అర టీ స్పూన్  త్రిఫలా చూర్ణం లో ఒక టీ స్పూన్ తేనే కలిపి సకల పైత్య రోగాలు హరించి పొతాయి.

 *  యోని దుర్వాసన  కొరకు  - 

       త్రిఫల కషాయంలో ప్రతిరోజు మూడు పూటలా స్త్రీలు తమ యోనిని కడుగుతూ ఉంటే భోజనంలో తీపి పదార్దాలు కొంచం ఎక్కువుగా తింటూ ఉంటే యోని దుర్గంధం హరించిపొయి భర్తకు ఇష్టులవుతారు.

 *  దగ్గుల కొరకు   - 

       త్రిఫలా చూర్ణం , శోంటి , పిప్పిళ్ళు , మిరియాలు కలిపిన దానిని త్రికటుక చూర్ణం అంటారు. ఈ రెండు  చుర్ణాలని కలిపి పూటకు అర టీ స్పూన్ మోతాదుగా తేనెతో కలిపి  సేవిస్తూ ఉంటే పొడిదగ్గు , నసదగ్గు, కళ్ళే దగ్గు, కళ్లెలో రక్తం పడే దగ్గు ఇలా అన్ని రకాల దగ్గులు అంతం అయిపోతాయి. 

            పైన చెప్పిన శొంటి , పిప్పిళ్ళు , మిరియాలు త్రిఫలా చూర్ణం తో కలిపే ముందు విడివిడిగా దొరగా వేయించుకొని చూర్ణం చేసుకొవాలి .

  కంటి మసకలకు  - 

   
     త్రిఫల చూర్ణం 30 గ్రా , మూడు లీటర్ల మంచి నీళ్లతో కలిపి ఒక లీటరు నీరు మిగిలేవరకు సన్నని సెగ మీద మరిగించి వడపోసి ఆ లీటరు కషాయంలో అర లీటరు పాలు , పావు కిలొ నెయ్యి కలిపి పొయ్యి మీద పెట్టి నెయ్యి మాత్రం మిగిలేవరకు మరిగించాలి. ఈ నెయ్యిని ప్రతిరోజు రెండు పూటలా పూటకు ఉసిరికాయంత మోతాదుగా తింటూ ఉంటే కంటి మసకలు తగ్గిపొయి దృష్టి పెరుగుతుంది.

  *  సిగిరెట్లు తాగడం వలన వచ్చే నోటి దుర్వాసన -

       త్రిఫలా చూర్ణం , సన్నజాజి ఆకులు సమంగా కలిపి మంచినీళ్ళలో వేసి సగానికి మరిగించి కషాయం కాచి ఆ కషాయం తో రోజుకీ రెండు మూడు సార్లు పుక్కిలిస్తూ ఉంటే పొగ త్రాగటం వలన వచ్చే నోటి దుర్వాసన పొతుంది.

  
     

శరీరం నందు రక్తం వృద్ది అవుటకు సులభ యోగాలు

శరీరం నందు రక్తం వృద్ది అవుటకు  సులభ యోగాలు  - 

 
 *  బూడిద గుమ్మడికాయ శరీర ఆరోగ్యానికి చాలా మంచిది . రోజుకు ఒక కప్పు బూడిద గుమ్మడి కాయ రసాన్ని తాగుతూ ఉంటే శరీరంలో మంచిరక్తం వృద్ది అగును. బూడిద గుమ్మడి కాయలోని గుజ్జుని గట్టి గుడ్డలో వేసి బాగా పిండితే రసం కారుతుంది. దానిని కప్పులో వేసుకొని తాగవచ్చు .

 *  కిసీమిస్ లేదా ద్రాక్షా పండ్లు బాగా తింటూ ఉంటే రక్తం వృద్ది అవుతుంది. పచ్చివి దొరకనప్పుడు ఎండువి తినవచ్చు.

 *  రాత్రులు గుప్పెడు ఎండు ద్రాక్ష కాయలు గ్లాసెడు నీటిలో నానవేసి ఉదయం వాటిని బాగా పిసికి పిండి ఆ పిప్పి పారవేసి ఆ గ్లాసు నీటిని తాగవలెను .అలా రోజూ తాగుతుంటే ఒక నెలలోనే మంచిరక్తం వృద్ది అవుతుంది.

 *  ఎండు ఖర్జూరాలని కూడా పైన చెప్పిన విధముగా చేసి ఆ నీటిని తాగుచున్న రక్తం వృద్ది అగును. 

 *  శనగలు గుప్పెడు రాత్రి సమయంలో నీటిలో నానవేసి ఉదయం తింటూ ఉంటే రక్తం వృద్ది అయ్యి శరీరం పుష్టి అగును.  వ్యాయమం చేసేవారికి ఈ విధానం చాలా మంచిది . 

              పైవిధంగా  నానబెట్టిన గింజలు మొలకెత్తిన తరువాత తింటూ ఉంటే ఇంకా అద్బుత ఫలితాలు వస్తాయి . 

 *  కుంకుమపువ్వు ప్రతినిత్యం తీసుకుంటున్నా కూడా రక్తం వృద్ది అగును. 

 *  అంజీర్ పండ్లు అత్తి పండ్లతో కలిపి తింటున్నా రక్తం వృద్ది అగును. 

 *  లేత కొబ్బరి నీరు మరియు లేత కొబ్బరి తింటూ ఉంటే శరీరంలో మంచి రక్తం వృద్ది అగును.

 
 రక్తవృద్ది కొరకు నేను ప్రయోగించిన అద్బుత యోగం  - 

          ప్రతి రోజు రెండు పూటలా ఒక గ్లాసు దానిమ్మ రసం నందు ఒక స్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి లొపలికి తాగించాను . అదే విధంగా మధ్యాహ్నం ఒక యాపిల్ పండు భోజనానికి గంటన్నర ముందు తినిపించాను .

             కేవలం నెలరోజుల్లో రక్తం యొక్క శాతం పెరిగింది. 

 
     

Saturday, February 19, 2022

స్త్రీ ప్రసవించుటకు ముందు కనిపించే చిహ్నములు - ప్రసవ సమయము నందు తీసుకోవలసిన జాగ్రత్తలు .

స్త్రీ ప్రసవించుటకు ముందు కనిపించే చిహ్నములు  - ప్రసవ సమయము నందు తీసుకోవలసిన జాగ్రత్తలు .

 *  మూత్రకోశము నందు దురద లేక మంట కలుగును. పొత్తికడుపు నందు నొప్పి కలుగును.

 *  మాటిమాటికి మూత్రం మరియు మలం విసర్జించవలెను అని అనిపిస్తూ ఉంటుంది.

 *  శరీరము నందు వణుకు , ఎత్తివేస్తున్నట్లు అనిపిస్తుంది.

 *  యోని రంధ్రము నుండి రక్తం కారును .

 *  వాంతి కలుగును. ఇలా వాంతి అవ్వడం మంచిది .

 *  కడుపునొప్పి పై కడుపు నుండి ప్రారంభం అయ్యి పొత్తికడుపునకు దిగును . ప్రారంభము నందు నొప్పి కొద్దిగా ఉండి రానురాను ఎక్కువ అగును. నడుముకు , వీపుకు ఎక్కువుగా ఉండును.

         ప్రసవం ఏర్పడుటకు వారం ముందైనను లేక రెండు వారములకు ముందైనను ప్రసవవేదన వంటి వేదన కలుగును. దీనిని కృత్రిమనోప్పి అంటారు. నిజమైన ప్రసవవేదన కలిగినచో స్త్రీలు వంపుకలిగిన కుర్చీమీద కూర్చోవచ్చు. అటుల సాధ్యం కానిచో బాగుగా పడుకోవడం మంచిది . ప్రసవవేదన కలిగిన వెంటనే మాటిమాటికి మలమూత్రములు విసర్జించుచుండవలెను. ఇలా జరగటం చాలా మంచిది . ప్రసవించుటకు పూర్వం కడుపు నందు మలమూత్రములు లేకుండిన సుఖప్రసవం కలుగును. ప్రసవవేదన పడున్నప్పుడు ఆహారం ఇవ్వరాదు. అటువంటి సమయంలో ఆహారం ఇవ్వవల్సివచ్చినచో తేలికైన ఆహారం మాత్రమే ఇవ్వవలెను. త్వరగా జీర్ణం అయ్యేలా ఉండవలెను . దాహమునకు కావలిసినంత చన్నీటిని మాత్రమే ఇవ్వవలెను.

              ప్రసవవేదన కలిగినప్పుడు ప్రసవించబోవు స్త్రీ తనకు నడుచుటకు శక్తి సరిపోవునంత వరకు అటుఇటు సంచరించవలెను. అటుల సంచరించు సమయంలో శిశువు బయటపడుటకు ప్రయత్నించుచున్నది అని తోచినచో పడక మీద కూర్చోండవలెను. అప్పుడు వాంతి అయినచో శిశువు బయటకి రావడానికి ప్రయత్నించుచున్నది అని తెలుసుకొనవలెను. కొందరు ఈ సమయమున గట్టిగా ముక్కినచో శిశువు బయటకి వచ్చును అని భావిస్తారు. కాని ఇలా చేయుట వలన ఇటువంటి ప్రయోజనం ఉండదు. ఇలా చేయుటవలన ప్రసవ సమయము నందు ఒక్కోసారి మూర్చ రావడానికి అవకాశం కలదు. ఈ విషయములో తగుజాగ్రత్త తీసికొనవలెను.

    

Wednesday, February 16, 2022

భూచక్రగడ్డ విశేషాలు -

భూచక్రగడ్డ విశేషాలు  -

       సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఈ భూమి మీద ఎన్నో వింతలు , విశేషాలు ఉన్నాయి. అవి నిగూఢముగా ఉన్నాయి. వాటిలో వృక్షజాతిలో ఎన్నో విచిత్రాలు కలవు. నేను  ఛత్తీస్ గడ్ అడవులలో వెదురుబొంగులు కొట్టిన తరువాత భూమి యందు ఉండు బొంగు ముక్క నుంచి తెల్లటి వెలుగు రావటం గమనించాను. అలా కొన్ని ప్రదేశాలలో మాత్రమే కనిపించింది. సూర్యోదయం అయ్యేప్పుడు పూర్తిగా సూర్యునివైపు తిరిగే చెట్లు ఉన్నాయి అని అక్కడి కొండజాతివారు చెప్పారు . వారి వైద్యవిధానం కూడా బహుచిత్రంగా ఉన్నది. చెయ్యి విరిగినవారికి కేవలం మూడురోజుల్లో చెయ్యి ఎముక అతుక్కునే విధంగా చెయ్యగలరు. వారు ఉపయోగించే మొక్కని మాత్రం నాకు చూపించలేదు.  నా కాలుకి దెబ్బతగిలి రక్తం పోతున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న వెదురుబొంగు పైన పచ్చరంగులో ఉన్నది చాకుతో గీకి మెత్తటి చూర్ణం చేసి దానికి సున్నం కలిపి నా గాయం పైన చల్లి అద్దడం జరిగింది.వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. ఆ తరువాత ప్రతినిత్యం దానిపైన వేయుటకు మరికొంత చూర్ణం ఇచ్చారు . ప్రతినిత్యం ఉదయం , సాయంత్రం దానిపైన చల్లడం వలన అది ఒక చెక్కు మాదిరి గట్టిగా అయ్యి గాయం నయం అయ్యాక ఊడి వచ్చింది. అక్కడివారు చెప్పినదాని ప్రకారం గాయం అయినపుడు ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోరు. కేవలం దీనితోనే వారు ఎటువంటి గాయాన్ని అయినా మాన్పుకుంటారు. ఇదంతా మీకు చెప్పడానికి ప్రధాన కారణం ఎమిటంటే ప్రకృతిలోని వృక్షజాతుల్లో అంత గొప్ప ఔషధవిలువలు ఉన్నాయి. 

          ఇలాంటి వృక్షవిచిత్రాలలో ఒకటైన భూచక్రగడ్డ గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు రహదారుల పక్కన భూచక్రగడ్డ పేరు చెప్పి అడివి లో దొరికే కొన్ని గడ్డలను అమ్ముతున్నారు. అసలైన భూచక్రగడ్డ అనేది పాత ఎద్దులబండి చక్రం అంత వెడల్పుగా ఉంటుంది. ఇది అత్యంత దట్టమైన కీకారణ్యాలలో మాత్రమే లభించును. కొన్ని చోట్ల ఈతచెట్ల కింద అత్యంత అరుదుగా ఉంటుంది. ఇది ఏ వృక్షం కింద అయితే ఉంటుందో ఆ వృక్షం పైన బంగారు రంగులో ఒక తీగ అల్లుకుని ఉంటుంది. భూమిలో ఉన్న గడ్డకు చెట్టు పైన ఉన్న తీగకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఆ రెండు గొప్ప అయస్కాంత శక్తితో సంబంధం ఏర్పరచుకొని ఉంటాయి. 

             భూమిలో గడ్డ ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించుటకు ఆ ప్రదేశం మొత్తం రెల్లుగడ్డి పరిచి నిప్పు అంటించండి. కేవలం గడ్డ ఉన్న ప్రదేశంలో రెల్లుగడ్డి ఏ మాత్రం చెక్కుచెదరదు. మిగిలిన గడ్డి కాలిపోవును. కాలని ప్రదేశం ఉన్న భాగం అంతా ఆ గడ్డ ఉన్నది అని నిర్ధారించుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి ఇష్టదైవాన్ని ప్రార్ధించి చాలా జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించాలి . ఇది అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని. తవ్వే సమయంలో ఏ మాత్రం భూమి అదిరినను ఆ గడ్డ ఆ ప్రదేశం నుంచి జరిగిపోవును. కావున అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని.

           ఈ గడ్డ లభించడం అంటే అమృతం లభించడంతో సమానం . ఈ గడ్డ మందం 4 అంగుళాల నుండి 20 అంగుళాల వరకు ఉంటుంది. ఇది తీపిగాను మరియు వగరు , చిరుచేదు మిశ్రమముగా ఉండును. దీని మోతాదు 30 గ్రాముల ముక్క తిని స్వదేశీ ఆవుపాలు తాగవలెను. దీనిని జాగ్రత్తగా నిలువచేసికొని మండలం (40 ) రోజులపాటు వాడిన శరీరము నందలి సర్వరోగములు నివారణ అగును. దేహము అత్యంత కాంతివంతం అయ్యి బంగారు రంగులో మారును . నరములు శక్తిమంతం అయ్యి మెదడుకు అమితమైన బలం కలిగి ఏకసంథాగ్రాహి అవుతాడు. ముసలితనాన్ని పోగొట్టగల శక్తి దీనికి ఉన్నది. దీనిని ఆయుర్వేదంలో " కాయసిద్ది " అని పిలుస్తారు . దీర్గాయుష్షును ప్రసాదించును.

        పైన చెప్పినవన్నీ అసలయిన భూచక్రగడ్డని సాధించి వాడినప్పుడు మాత్రమే కలుగుతాయి.

    

Monday, February 14, 2022

అతిమూత్ర రోగమునకు నేను ప్రయోగించిన రహస్య యోగం -

అతిమూత్ర రోగమునకు నేను ప్రయోగించిన రహస్య యోగం  - 

   ఇటీవల ఒక వ్యక్తి అతిమూత్ర వ్యాధితో బాధపడుతూ నన్ను సంప్రదించాడు . అతనికి తంగేడు పువ్వులు ఎండించి చూర్ణం చేసి 20gm , 500ml నీటిలో వేసి 250ml నీరు అయ్యేవరకు సన్నని మంట మీద మరిగించి 125ml  నాటు ఆవుపాలు , 30gm పటికబెల్లం చూర్ణం కలిపి ఉదయం సమయంలో ఇచ్చాను . అదేవిధముగా రాత్రి పడుకునే సమయంలో త్రిఫలా చూర్ణం రెండు స్పూన్స్ ఒక పెద్ద గ్లాస్ నీటిలో కలిపి ఇవ్వడం జరిగింది. 40 రోజుల్లో అతిమూత్ర వ్యాధి నుంచి సంపూర్ణంగా బయటపడ్డాడు .

                 

స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ -

స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ - 

          ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును. 

       ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును . 

          సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును . 

              నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య . 

       అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు. 

     
            

Saturday, February 12, 2022

అతిమూత్ర రోగమునకు నేను ప్రయోగించిన రహస్య యోగం -

అతిమూత్ర రోగమునకు నేను ప్రయోగించిన రహస్య యోగం  - 

   ఇటీవల ఒక వ్యక్తి అతిమూత్ర వ్యాధితో బాధపడుతూ నన్ను సంప్రదించాడు . అతనికి తంగేడు పువ్వులు ఎండించి చూర్ణం చేసి 20gm , 500ml నీటిలో వేసి 250ml నీరు అయ్యేవరకు సన్నని మంట మీద మరిగించి 125ml  నాటు ఆవుపాలు , 30gm పటికబెల్లం చూర్ణం కలిపి ఉదయం సమయంలో ఇచ్చాను . అదేవిధముగా రాత్రి పడుకునే సమయంలో త్రిఫలా చూర్ణం రెండు స్పూన్స్ ఒక పెద్ద గ్లాస్ నీటిలో కలిపి ఇవ్వడం జరిగింది. 40 రోజుల్లో అతిమూత్ర వ్యాధి నుంచి సంపూర్ణంగా బయటపడ్డాడు .

                 

జీర్ణశక్తిని వృద్ధిచేసే సులభ ఔషదాలు -

జీర్ణశక్తిని వృద్ధిచేసే సులభ ఔషదాలు - 

   శరీరంలో వ్యాధులు రావడానికి ప్రధమ కారణం జీర్ణశక్తి సక్రమంగా లేకపోవడమే జీర్ణశక్తిని వృద్ధి చేసుకుంటే వ్యాధులు దరిచేరవు . సమయానికి తగు ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే పుష్టిగా , బలంగా ఉండవచ్చు. 

            కొంతమందికి ఒక వయస్సు దాటిన తరువాత జీర్ణశక్తి లోపించడం జరుగుతుంది. వెంటనే వారు ఆయా ఔషదాలు ఉపయోగించుకొని జీర్ణశక్తిని వృద్ది చేసుకోవాలి. 

            జీర్ణశక్తిని వృద్దిచేసే కొన్ని ప్రత్యేక ఔషధాలను మీకు వివరిస్తాను.

 *  శొంఠికొమ్ములను నిప్పులమీద కాల్చవలెను . శొంఠి నిప్పులమీద కాల్చినప్పుడు శుద్ది అగును. కాల్చిన శొంఠిని మెత్తటి చూర్ణంగా చేసి ఒక కప్పు మోతాదులో దానిని తీసుకుని ఆ చూర్ణం మునిగేంతవరకు గింజలు తీసివేసిన నిమ్మరసాన్ని పోయాలి. ఈ విధంగా శొంఠిపొడిని మూడు రోజులపాటు నిమ్మరసంలో నానబెట్టి తరువాత ఒక కప్పు పంచదార దానికి కలిపి పొయ్యిమీద పెట్టి పాకంపట్టి పాకం బిగుసుకున్నాక తరువాత గోళీలు అంత ఉండలు చేసి నిలువచేసుకొని ప్రతి రోజు రెండు ఉండల చొప్పున తీసుకుంటూ ఉంటే అమితమైన జీర్ణశక్తి కలుగును. 

 *  ఎండు ద్రాక్షా , కిస్మిస్ లను గాని తీసుకుని దానికి సమానంగా తేనె మరియు పంచదార కలిపి బాగా నూరి ఒక సీసాలో భద్రపరచుకొని రోజూ ఒక చెంచా ఔషధాన్ని మూడు పూటలా తీసుకుంటూ ఉంటే అజీర్ణవ్యాధి తగ్గిపోతుంది.

 *  అల్లం మెత్తగా దంచి దాంట్లో కొంచం సైన్ధవ లవణం కలిపి ఒక సీసాలో ఉంచుకొని రోజూ అన్నం లో మొదటి ముద్దలో ఒక చెంచా వేసుకొని కొంచం నేతిని కూడా కలిపి తీసుకుంటూ ఉండాలి . దీనివల్ల జీర్ణశక్తి బాగా వృద్ది చెందును . 

 *  కరివేపాకు , కొత్తిమీర , పుదినా , చింతచిగురు , చింతపూలు , తులసి ఆకులు ఎక్కువుగా తినడం వలన జీర్ణశక్తి శాశ్వతంగా బాగుంటుంది.

 *  శొంఠిని కాల్చి ధనియాలు , జీలకర్ర , మిరియాలను కలిపి బాగా నూరి కొంచం ఉప్పు కలిపి అన్నంలో మొదటి ముద్దలో తిన్నా లేదా మజ్జిగలో కలిపి త్రాగినా జీర్ణశక్తి పెరుగును. 

 *  పిప్పిళ్లు కొంచం నెయ్యివేసి  వేయించి చూర్ణం చేసుకుని ఒక కప్పు పొడిని తీసుకుని ఆరుకప్పుల పంచదార పాకం పట్టి పిప్పిళ్ళపొడి పోస్తూ కలపాలి . బాగా బిగుసుకున్న తరువాత చల్లార్చి గోలీలంత  ఉండలు చేసుకుని ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు పిల్లలు అయితే ఒకటి , పెద్దలు అయితే రెండు చొప్పున రెండు పూటలా తిని పాలు తాగుతున్న జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. లివర్ సమస్య ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనం అవుతుంది. ప్రేగులకు మంచి బలాన్ని ఇస్తుంది. జిగట విరేచనాలు అవుతున్న సమయంలొ ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. 

 *  కరక్కాయ , పిప్పిళ్లు , శొంఠి , వాము , సైన్ధవలవణం వీటిని సమభాగాలుగా తీసుకుని శొంటిని నిప్పుల మీద కాల్చాలి. పిప్పిళ్ళని నేతిలో వేయించాలి , కరక్కాయలను లోపలి గింజలు తీసివేసి అన్నిటిని కలిపి బాగా దంచి పొడి చేసుకుని రోజూ అన్నంలో నేతిని కలుపుకుని తింటూ వుంటే జీర్ణశక్తి అమితంగా పెరుగును . 

      పైన వివరించిన యోగాలలో మీకు సులభంగా అనిపించిన  వాటిని ఉపయోగించుకుని జీర్ణశక్తిని పెంచుకోగలరు 

  
   
    

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 6 .

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 6 . 

  మూత్రపరీక్షా విధానము - 

     మూత్రపరీక్ష చేయవలసిన రోగిని 4 ఘడియల   తెల్లవారుజామున నిద్రనుంచి మేల్కొలిపి మూత్రము మొదటి ధార ( మొదట కొంత వదిలి) తరవాతి ధార నిర్మలమగు తెల్లని పాత్ర యందు కాని కుండపెంకు నందు గాని విడుచునట్లు చేసి దానిని సూర్యరశ్మి యందు ఉంచి గడ్డిపోచతో బాగుగా కలియబెట్టి దాని యందు తైలము చుక్కలుచుక్కలుగా వేసి దాని మార్పులను బట్టి దోష వ్యాధి బేధములను తెలుసుకొనవలెను . 

                   ఆరోగ్యవంతునకు మూత్రము లఘువుగాను తెల్లగా ఉండును . పిత్త ప్రకృతి గలవానికి పసుపుపచ్చగా వేడిగా ఉండును . శ్లేష్మప్రకృతి గలవానికి నూనె వలే ఉండును . వాత శ్లేష్మ కలగలసిన వాని మూత్రము చిక్కగా , తెల్లగాను , రక్తవాత  ప్రకృతి కలవానికి కుసుంబా పుష్పము వలే మూత్రము ఉండును . 

           వ్యాధి లక్షణము లేవియు లేక కేవలము మూత్రము చెడుగా కనపడినచో రోగమున్నట్లు నిర్ధారణ చేయకూడదు . అనగా ఇతర వ్యాధి లక్షణములు ఉన్నప్పుడే మూత్రము చెడిపోయినచో రోగము ఉన్నదని నిర్ధారణ చేసుకొనవలెను . 

  వాత దుష్ట మూత్రము - 

      వాతదోషము వలన చెడిపోయిన మూత్రము నూనె వలె మకమకలాడుచుండును . నలుపు పసుపు కలిసిన కొంచము నల్లని వర్ణము కలదిగా కాని కొంచము ఎర్రగా గాని ఉండును . ఇట్టి మూత్రము పైన ఒక నూనె చుక్కను వేసిన ఆమూత్రము యొక్క పైభాగము అంతటను వ్యాపించి వెంటనే చిన్నచిన్న నూనె కణములు పైన కలిగిన చిన్నచిన్న బుడగలుగా బయలుదేరును . అట్టి దానిని వాత దుష్ట మూత్రముగా తెలుసుకొనవలెను . 

        మరియు మూత్రము నందు తైలబిందువులు మండలాకారముగా మార్పు చెందిన వాతరోగము అని గుర్తించవలెను . కొందరు వాతరోగుల మూత్రము ఘృతము ( నెయ్యి) వలే ఉండును . 

  పిత్త దుష్ట మూత్రము - 

       పిత్త దోషము చేత చెడిన మూత్రము ఎర్రగా ఉండును . దాని పైన నూనె చుక్క వేసినచో బుడగలు పుట్టును . పిత్తవ్యాది నందు మూత్రము నందు తైలము వేసినచో బుద్బుదాకారము చెందును . పిత్తరోగి మూత్రము నురుగులతో కూడి ఉండి పులికడుగు రంగుననైన లేక మాదిఫల రస ( కాఫీ రంగు ) రంగు కలిగి ఉండును . 

  శ్లేష్మ దుష్ట మూత్రము - 

      శ్లేష్మ దోషము వలన చెడిన మూత్రము నురుగులతో కూడుకుని ఉండును . చిన్నచిన్న గుంటలలో ఉండు బురద నీటివలె ఉండును . చిన్నచిన్న బిందువుల ఆకారము దాల్చును . శ్లేష్మరోగి మూత్రము శీతలముగా ఉండును . 

       అపక్వ పిత్తదోషము వలన చెడిన మూత్రము తెల్ల ఆవనూనె వలె ఉండును . 

    వాతపిత్తములచే దూషితమైన మూత్రము పైన నూనె చుక్క వేసినచో కొంచము నల్లని రంగుగల బుడగ తేలును . 

       వాతాశ్లేష్మములచే దూషితమైన మూత్రము నందు నూనె వేసినచో మూత్రము వెంటనే నూనెతో కలిసిపోయి పులిసిన బియ్యపు గంజి వలె అగును . 

          పిత్తశ్లేష్మము వలన దూషితమైన మూత్రము నందు నూనె వేసినచో మూత్రము వెంటనే నూనెతో కలిసిపోయి పులిసిన బియ్యపు గంజి వలె అగును . 

   పిత్తశ్లేష్మముల రెండింటివలన దూషితమైన మూత్రము బూడిద రంగు కలిగి ఉండును . 3 దోషములు ప్రకోపించిన యెడల మూత్రము ఎర్రగా గాని నల్లగా గాని ఉండును . అందు పిత్తము మిగిలిన రెండింటి కంటె ఎక్కువ ప్రకోపించిన పైభాగము పచ్చగాను కింది భాగము ఎర్రగా కనిపించును . 

       జ్వరము నందు రసము శేషించినచో మూత్రము పాలవలె ఉండును . పక్వ జ్వరము నందు మేకమూత్రము వలె ఉండును . క్షయ యందు మూత్రము నల్లగా ఉండును . క్షయరోగి మూత్రము నందు నూనె బొట్టు వేసినచో చేప , మేడ , వింజామరం , ఏనుగు , గొడుగు , తోరణముల ఆకారము కనిపించినచో వ్యాధి నయం చేయవచ్చు . తీగె , మద్దెల , మనిషి , చక్రము , సింహము వలే నూనె వికసించిన ఆ రోగము కష్టసాధ్యము . తలలేని మనిషి ఆకారము , స్తంభాకారముగా నైనను కనిపించిన రోగి మృతిచెందును . 

       అతిసార రోగము నందు రోగి యొక్క ముత్ర అడుగు భాగము రక్తవర్ణముగా ఉండును . జలోదరము నందు నేతి కణము వలె ఉండును . ఆమవాతము నందు మూత్రము వస లేక మజ్జిగ వలె ఉండును . వాత జ్వరం నందు కుంకుమ వలె ఎర్రగాను లేక ఎరుపు పసుపు కలిసిన వర్ణముగాను లేక మలినముతో కూడిన పీతవర్ణముగాను అధికంగా వెడలును . పిత్త జ్వరం నందు పసుపు వర్ణముగా స్వచ్ఛముగా ఉండును . సమధాతువు నందు కూప జలము వలె ఉండును . సన్నిపాత జ్వరం నందు కృష్ణవర్ణము ( నల్లని ) కలిగి ఉండును . జ్వరము ఆరంభమయ్యే దశలో రక్తవర్ణము లేక ధూమ్ర వర్ణముగా ఉండును . దీర్ఘరోగము నందు రక్తవర్ణముగా ఉండును . మూత్రము నల్లని రంగులో ఉండిన మరణము చెందును . ప్రమేహరోగము నందు కూడా మూత్రము రక్తవర్ణములో ఉండును . 

  దీర్ఘాయుష్మంతుని ముత్ర లక్షణము - 

      మూత్రము నందు వేసిన తైలబిందువు హంస , కన్నె లేడి , పూర్ణతటాకము , కమలం , ఫలములు , సంపూర్ణ శరీరము , చక్రము , తోరణముల ఆకారంగా కనపడిన దీర్ఘాయుష్షు కలిగినవాడగును . 


                     *   సమాప్తం  * 

    ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

Wednesday, February 9, 2022

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 5 .

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 5 . 

 * జిహ్వ పరీక్ష - 

       వాతరోగము నందు నాలుక పగిలి ముళ్ళ వలే గరగరలాడుచుండును . తడారిపోయి నల్లగా గాని బూడిద వర్ణములో గాని ఉండును . పైత్యవ్యాధుల యందు నాలుక ఎర్రబారి పూసి మంట కలిగి ద్రవం కారుచూ మృదువుగా ఉండును . శ్లేష్మరోగము నందు నాలుక తెల్లగా కరుడుగట్టి పాచి కలిగి ఉండును . మొద్దుగా ఉండును . జ్వరము నందు పాకము కలిగి చేదువాసన కొట్టుచుండును . దోషభేదమును బట్టి జ్వరము నందు నాలుక పాకము చెంది చేదుపట్టి వాసన తీపి జిగటగా అయ్యి సాగుట ఎండిపోవడం వంటి లక్షణాలు కలుగును . 

          సన్నిపాతము నందు ద్రవము లేక నాలుక ముళ్ళు కలిగినట్లుగా మాడి ఉండును . ద్వందరోగమున రెండు రెండు లక్షణాలు కలిగి ఉండును . రక్తపోటు అధికమై రోగికి మంటగా ఉండిన నాలుక ఎర్రగాను తాకిన వేడిగాను ఉండును . మంటతో కూడి జ్వరము నందు నాలుక తడి ఎండిపోయి ఉండును . 

              తీక్షణ జ్వరము నందు భయంకరమగు ఒళ్ళు మంటలు గూడిన వ్యాదుల యందును , అజీర్ణరోగము నందు , వాతవ్యాధుల ప్రారంభదశలో నాలుక తెల్లగా ఉండుటయే కాక దాని మీద ఒక కొత్తపొర కప్పినట్లుగా కనిపించును . త్రిదోష ప్రకోపము వలన జనియించిన జ్వరము నందు నాలుక దళసరి ( మందం ) ఎక్కి ద్రవ హీనమైన పొరచే కప్పబడినట్లు ఉండును . మరియు నల్లనై నిప్పు ఆరిపోయిన బొగ్గు వలే కనిపించును . కాలేయము యొక్క పని సక్రమముగా నిర్వర్తిన్చబడనప్పుడు , పిత్తముకు , మలముకు అవరోధము ఏర్పడినప్పుడు నాలుక పాలిపోయి పొరతో కప్పబడినట్లు ఉండును . కాలేయము మరియు ప్లీహము ( spleen ) దోషము చెందినప్పుడు  అపాయస్థితిలో క్షయ యందు వలే నాలుక పైన పుండ్లు కనిపించును . తీక్షణమగు జ్వరము , అతిసారము , మూర్చ , కాస , శ్వాసల యందు నాలుక తాకిన చల్లగా ఉండును . దౌర్బల్యముగా ఉండును . మంటతో కూడిన వ్యాధుల యందు నాలుక పెద్దది అగును . 

                ఆరోగ్యవంతుని నాలుక ద్రవము కలిగి ఉండును. తాగుడు అలవాటు ఉన్నవారి నాలుక పగిలి ఉండును . వాత వ్యాధుల యందు లాలాజలము ఉప్పగా ఉండును . పైత్యవ్యాధుల యందు చేదుగా , శ్లేష్మ వ్యాధుల యందు తియ్యగాను , రెండురకాల దోషముల కలిగి ఉన్న రెండురకాల లక్షణములు కలిగి ఉండును . 

 *  మూత్రపరీక్ష - 

       పాశ్చత్య వైద్యులు మొదటి ధార వదిలి తరువాతది సీసాలో పట్టి దానియందు కొన్ని రకాల రసాయనాలు కలిపి స్పిరిట్ లాంతరు పైన వేడిచేస్తారు . మూత్రము నందు చక్కెర తెల్ల శ్వేత ధాతువు , వీర్యము , తీపి , మున్నగు వాటిని ఉండకట్టుట , కలిసిపోవుట , రంగు మారు ట , పైకి తేలుట , అడుగున మునిగిపోవుట , ఇసుక వలే పొడిపొడిగా అవ్వుట , వాసన వేయుట మొదలగు బేధములచే వ్యాధిని గుర్తిస్తారు . కొందరు రోగుల మూత్రము నందు వీర్యము ముద్దగట్టి సన్నసన్నని ఇసుక కణములవలె  కనబడును . కొందరి మూత్రము ( మధుమేహరోగులు ) విడిచినచోట బెల్లమునకు వలే చీమలు , ఈగలు , దోమలు ముసురును . మానవుని జీవితము మూత్రము పైన ఆధారపడి ఉండును . మూత్రమును బట్టియే ఆహారము ఎలా జీర్ణమగుచున్నది , సప్తధాతువులు ఎట్టి స్థితిలో ఉన్నవి , రక్తము , బలము ఎలా ఉన్నది చివరకు సంతానము కూడా మూత్రమును బట్టి తెలుసుకొనవచ్చు . 

          

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ -4 .

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ -4 . 

     ఇప్పటివరకు మీకు అష్టస్థాన పరీక్షలలో మొదటిదైన నాడీపరీక్ష గురించి వివరించాను . ఇప్పుడు మిగిలినవాటి గురించి వివరిస్తాను . 

 * స్పర్శము - 

     స్పర్శము అనగా తాకుడు . రోగి యొక్క శరీరాన్ని తాకి చల్లదనము , గరుకుతనము , చమట , ఆవిరి మున్నగు వాటిని గుర్తించుట . 

  వాతము - 

     వాతము నందు శరీరము యొక్క స్పర్శ ఆరిపోయి చిన్నగా చల్లదనం పెరుగుచుండును . 

  పిత్తము - 

     పిత్తము నందు శరీరము వేడిగా ఉండును . 

  శ్లేష్మము - 

     శ్లేష్మము నందు శరీరము చల్లగా ఉండును . 

     జ్వరము నందు శరీరము పొగలుగా , తాపముగా , ఉష్ణము మరణముగా ఉండును . చనిపోవువానికి శరీరము కొయ్య బారిపోవును . 

 *  రూపము  - 

       వాతము నందు శరీరము నలుపు , పిత్తము నందు పసుపుపచ్చ , శ్లేష్మము నందు తెలుపు వర్ణములు కలిగి కనపడును . ఆయా వ్యాదులను బట్టి రోగి యొక్క ఆకారము తెలుపు మున్నగు రంగులను కలిగి ఉండును . పాండు వ్యాధి నందు శరీరము తెల్లని రంగు కలిగి పాలిపోయి ఉండును . క్షయ వ్యాధి యందు శరీరము ఆరిపోవును . శరీరము నందు కొవ్వు ఉండదు . కామెర్ల వ్యాధి నందు శరీరము పచ్చగా ఉండును . ఇలా ఆయా వ్యాధులను బట్టి శరీరం రూపము మారుచుండును . 

 *  శబ్దము - 

       శబ్దము అనగా రోగి యొక్క మాట్లాడు ధ్వనిని వాతము నందు శబ్దము నందు హెచ్చు తగ్గులు కలిగి ఉండి నిలకడ లేకుండా ఉండును . పిత్తము నందు అధికంగా , ఉత్సాహముగా ధ్వని ఉండును. శ్లేష్మము నందు హీనస్వరము కలిగి ఉండును . భ్రమ , అపస్మారము , పైత్యజ్వరము , సన్నిపాతము మున్నగు వ్యాధుల యందు రోగి అతిగా ధ్వని కలవాడై ఉండును . అనగా అతిగా మాటలాడువాడై ఉండును . వికృతముగా అరుచును . రహస్యములు అన్నియు పైకి చెప్పును . భయము , సిగ్గు , దుఃఖము మున్నగు వాటి యందు శబ్దము క్షీణించి ఉండును . ఇలా అన్నింటికి తెలుసుకొనవలెను . 

 *  నేత్రములు - 

      ఇది అత్యంత ముఖ్యమైన పరీక్ష . వాతము నందు కండ్ల చుట్టూ గుండ్రని నలుపు బయలుదేరును . వీర్యనష్టము నందు కూడా ఇటువంటి లక్షణాలు కనిపించును . వాతము నందు బూడిద వర్ణముగా కొంచం నీరు కూడా చేరుచుండును . పిత్తరోగము నందు నేత్రములు పసుపుగాను , ఎర్రగాను త్వరగా పూసులు కట్టును . శ్లేష్మము నందు బరువుగాను తెల్లని పూసి కలిగి నీరు కారుచుండును . 

 *  మల పరీక్ష  - 

      వాతరోగము నందు మలబద్దకం కలుగును . మరియు పురీషము ( మలం)  నల్లనై మిక్కిలి కఠినంగా ( గట్టిగా ) వెడలుచుండును . పిత్తవ్యాధి యందు పసుపుపచ్చగానైనా ఎర్రగా రక్తముతో కూడినదై ఉండును . మరియు మృదువుగా ధారాళముగా విరేచనమగును . శ్లేష్మ వ్యాధుల యందు మలము తెల్లగనను , అజీర్తిగను , బంకగను , నురుగుతో గట్టిగా వెడలుచుండును . ఏవైనా రెండురకాల దోషముల యందు రెండు రెండు లక్షణములుగా ఉండును. వేడిచేసినప్పుడు గుదము పుండై మలము రక్తచారలు కలిగి గాని రక్తముగాని వెడలును . జ్వరము నందు సాధారణముగా మలబద్ధకముగా ఉండును . అనాహము , ఆధ్మానము మున్నగు వ్యాధుల యందు మలము ప్రేగుల యందు బంధించబడి పొట్ట ఉబ్బు చేయును . కడుపునొప్పి కలిగించును . అతిసారం మున్నగు వ్యాధుల యందు మలము జలధాతువుతో కలిసి పల్చనై ప్రేగులంతట నిండి బుడబుడమనే ధ్వనితో పలుమారు వెడలుచుండును . 

            పాశ్చాత్య వైద్యులు మలమును నీటి యందు వేసి పరీక్షించెదరు . నీటి యందు మలము వేసినప్పుడు విడిపోయిన , పైకి తేలినను వాతమనియు , కలిసిపోయిన పిత్తమనియు , నీటి అడుగుపోయిన శ్లేష్మము అనియు తెలుసుకొనెదరు . మలము యొక్క వాసన వర్ణము ( రంగు ) పరిమాణము బట్టి కూడా దోషములను వ్యాధులను పరీక్షించెదరు . 

 
                        

Monday, February 7, 2022

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 3

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 3 . 

 నాడి చూడకూడని వారు  - 

      అప్పుడే స్నానం చేసినవారికి , భుజించిన వారికి , ఆకలిగొన్నవానికి , దప్పికతో ఉన్నవానికి , నిద్రనుండి లేచినవారికి నాడిని పరీక్షించిన ఫలితం స్పష్టముగా తెలియదు . కావున ఆ సమయములలో నాడిని పరీక్షించరాదు . 

  నాడుల పేర్లు - వాటి స్థానములు . 

    నాభికందము నందు ఉండు నాడి సుషుమ్న . ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి ఉండును . మానవుని స్థూల సూక్ష్మ నాడులు అన్ని కలసి మొత్తం 3 1/2 కోట్లు . ఇవి అన్నియు నాభికూర్మము నుంచి 10 నాడులు పైకి , 10 నాడులు కిందకి , 4 నాడులు అడ్డముగా బయలుదేరి శరీరము అంతయు మితిమీరిన సంఖ్యగలవై వ్యాపించుచున్నవి . 

           ఈ సుషమ్న నాడి యందే జీవుని నివాసము . ఈ సుషమ్న నాడి యందలి జీవునకు ఇ ళ , పింగళ నాడులచే తృప్తి కలుగుచుండును . వాటికి సరస్సులు అని పేరు . శరీరమునందు త్రిదోషములు ఎలా ప్రధానమో అదే విధముగా  ఈ నాడులు కూడా ప్రధానములు . మన ఉచ్చ్వాస నిశ్వాసమునకు హంస యని పేరు . 

       ఈ మూడు నాడులు వేణి బంధము వలే కలిసిమెలిసి త్రివేణి సంగమము పేరుతో లలాటం నందు కలిసి ఉండును . నాడి యందలి హంస యొక్క  గతిని బట్టి మనము త్రిదోషముల హెచ్చు తగ్గులుగా ఉండు సంచారములను తెలుసుకోగలము . 

              సుషమ్న నాడి వెన్నుపూసలో నుండి మెడమార్గములో బ్రహ్మ రంధ్రము చేరును . వెన్నుపూసకు బ్రహ్మదండము అని పేరు కలదు . అందులో ఉండు సుషమ్న నాటికి బ్రహ్మ నాడి  అని పేరు కలదు . బ్రహ్మనాడి యందు ఉన్న జీవుడు షట్చక్రముల యందు తిరుగుతూ ఇళ , పింగళ నాడులతో తృప్తిపొందుచుండును . 

     ఇళ నాడి నాభికూర్మము నుండి హృదయము వద్దకు వచ్చి మెడమార్గముగా ఎడమ ముక్కు రంధ్రము వద్దకు వచ్చును . అదేవిధముగా పింగళ నాడి కుడి ముక్కు రంధ్రమును ఆశ్రయించి ఉండును . పంచభూతాలు , లోకములు , నదులు , కులములు , గుణములు మొదలగునవన్ని సుషమ్న నాడి యందు ప్రతిష్ఠములు అయి ఉన్నవి . 

                        

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 2 .

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 2 . 

    ఆయుర్వేద శాస్త్రము అనుసరించి నాడిని 8 చోట్ల పరీక్షించవలెను . అవి 

  * హస్తము . 

  *  పాదము . 

  *  కంఠము . 

  *  నాస  2 వైపులా . 

  *  2 చేతుల మణి బంధనముల యందు . 

  *  2 పాదముల చీలమండల యందు . 

  *  ముక్కు రెండుప్రక్కల యందును కంఠము నందలి ఉండకు రెండు వైపులా నాడీపరీక్ష తెలుసుకొనవలెను . 

  హస్తనాడి - 

      శరీరము అంతయు వ్యాపించి ఉండు ఈ నాడి వాత,పిత్త , కఫములను , రసరక్తములకు సంబంధించి ఉండును . ఇది బ్రొటనవేలి మూలము నందు 3 వ్రేళ్లు పట్టుచోట ధాన్యపుగింజ పరిమితిన చరించుచుండును . దీని ద్వారా ఉచ్చ్వాస , నిశ్వాసముల గమనము బాగుగా తెలియును . 

         ఇది జీవసాక్షిలా శరీరము యొక్క ఆరోగ్య అనారోగ్యములను తెలుపుచుండును . ఉచ్ఛ్వాస నిశ్వాసములు నాసిక ద్వారా శరీరమంతయు వ్యాపించుచుండెను . అలా వ్యాపించునప్పుడు ఎటువంటి ఆటంకము లేకుండా సరిగా వ్యాపించుచుండిన యెడల ఈ నాడి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సమముగా ఉండును . అలా జరగకుండా ఈ ఉచ్చ్వాస నిశ్వాసముల వ్యాప్తి చెందుతున్నప్పుడు త్రిదోషముల ( వాత పిత్త కఫ ) లలో ఏదైనా దోషము అడ్డువచ్చిన యెడల ఉచ్ఛ్వాసనిశ్వాసములు కంగారుపడి జలగ , పాము మున్నగు వాటి నడక ఎలా ఉండునో అలా కష్టముగా లేక నెమ్మదిగా లేక త్వరత్వరగా ఎగురుచున్నట్లు నాడి యొక్క గమనంలో తేడా వచ్చును . 
  
       హస్తనాడి వలన అజీర్ణము , ఆమదోషము , జ్వరము రాబోవు సంగతి , ఆకలిగొనుటను , చెడిపోయిన వాత , పిత్త , కఫముల గురించి తెలియచేయును . వైద్యులు ప్రధానముగా దీనినే 
పరీక్షించెదరు .

  పాదనాడి  - 

        పాదనాడి వలన ఎంతకాలము జీవించునది , శరీరము బరువు లేక తేలికగా ఉండుటయు , జ్వరము తగ్గిన సంగతి తెలియును . ఆరోగ్యవంతునికే ఇది చూడవలెను  

  కంఠనాడి  -  

        గాయములు , భయము మున్నగు బాహ్య కారణముల మూలముగా వచ్చు జ్వరము , తృష్ణ , ఆయాసము , స్త్రీసంగమము , అలయిక , దుఖఃము , కోపము అనువాటి గురించి కంఠనాడి తెలుపును . దీనిని నాడీపరీక్ష యందు నిపుణులు మాత్రమే ఈ నాడిని ప్రత్యేకముగా పరీక్షించి ఫలితాలు తెలుసుకోగలరు . 

  నాసా నాడి  - 

       చనిపోవుటయు , జీవించిఉండుటయు , కామము , నేత్రవ్యాధులను , తలనొప్పిని , కర్ణముఖరోగములు ముక్కునందలి నాడి తెలియచేయును . 

  నాడిని పరీక్షించు విధానము  - 

     వైద్యుడు నాడిని ఉదయము పూట పరగడుపున పరీక్షించవలెను . ముందు రోగి యొక్క మోచేతి భాగము పట్టుకొని పిసికి తన కుడిచేతి 3 బ్రొటనవ్రేళ్ళతో బ్రొటనవేలి మొదటి భాగమున నాడిని చక్కగా పరీక్షించవలెను . 

  స్త్రీపురుషుల నాడి బేధము  - 

       పురుషులకు కుడిచేతి యందు కనిపించు నాడి , స్త్రీలకు ఎడమచేతి యందు కనిపించును . కారణమేమన పురుషులకు నాభి కూర్మ అధోముఖముగా ఉండును . స్త్రీలకు నాభి కూర్మ ఊర్ధ్వముఖముగా ఉండును . ఈ భేదము చేతనే స్త్రీ పురుషుల హస్తనాడులు భేదించుచున్నవి . 

         అనుభవమును బట్టి శాస్త్రము నందు చెప్పబడిన చేతి యొక్క నాడిని పరీక్షించి అనంతరము రెండోవ చేతి యందలి నాడిని కూడా పరీక్షించుట మంచిది . 

     

Saturday, February 5, 2022

షడ్రసముల గురించి సంపూర్ణ వివరణ - 2 .

షడ్రసముల గురించి సంపూర్ణ వివరణ - 2 . 

     
  కటు( కారము ) రసము గుణము - 

   కటు రసము నాలుకకు తగిలినంత మాత్రమే ముక్కును కార్చును . యావత్ శరీరం కంపించును . దీనిని స్వల్పమోతాదులో ఉపయోగించినచో కొన్ని సద్గుణాలు కలవు . ముఖశుద్ధి చేయును . జఠరాగ్ని పెంపొందించును . ఆహారమును శుష్కిoపచేయును . కన్నీరు వచ్చునట్లు చేయును . కఫ సంబంధ జిగురు పోగొట్టును . శరీరవృద్ధి ( శరీరపు లావు ) తగ్గించును . క్రిములను హరించును . వ్రణములు పగులునట్లు చేయును . శ్రోతో నిరోధము ( శరీరం నుండి బయటకి వ్యర్ధాలు వెడలు మార్గములు ) పొగొట్టి విశాలము చేయును .  

         అధికంగా సేవించిన శుక్రము నశించును . మైకము కమ్మును . తల తిరుగును . కంఠము నందు , శరీరము నందు మంటలు పుట్టును . దప్పిక పుట్టి బలము నశించును . వాతరోగములు పుట్టుటకు కారణం అగును . 

 *  తిక్త ( చేదు ) రసము గుణము - 

       తిక్తరసము నాలుకకు తగిలినవెంటనే కంఠము నందు లాగుచున్నట్లు అనిపించును . ముఖము నందలి ( నోటియందలి ) జిగురు పోగొట్టి రోమాంచనం ( వెంట్రుకలు నిక్కబొడుచుకొనునట్లు ) కలుగచేయును . చేదు నాలుకకు రుచిగా అనిపించకున్నను నోటి యందలి అరుచిని పోగొట్టి ద్రవ్యములను రుచిగా ఉండునట్లు చేయును . శారీరక విషాలను హరించును . జ్వరములను హరించును . కుష్ఠు రోగము నందు ఉపయుక్తము . క్రిమి నాశకము , స్తన్యమును శుద్ధిచేయును . మాంసమును దృఢపరచును . జీర్ణకారి . శరీరం నందు ఎచ్చటి  నుండి ఐనా జలం వంటి పదార్థము వెడలుచున్న దానిని ఆపును . శరీరపు కొవ్వు , మజ్జి , వ్రణములు నుండి కారు రసి , చీము , మూత్రము వంటి జల సంబంధమైన వాటిని ఎండించును . 

        దీనిని అతిగా ఉపయోగించిన ధాతువులన్నినింటిని నాశనం చేయును , శరీరం నందు గరుకుతనం కలిగించును . బలం తగ్గును   శరీరం కృశించును . వాతరోగములు పెరుగును . 

  *  కషాయ( వగరు )  రసము గుణము - 

  
         కషాయ రసము నాలుకకు తగిలింత వెంటనే నోరు ఎండిపోయి నాలిక స్థంభించును . కంఠమును బంధించును . హృదయమును పట్టి లాగి సంకోచింపచేయును . గుండెని ఒత్తునట్టు బాధ కలుగచేయును . 

          ఈ వగరు రసము స్వల్పప్రమాణములో భుజించిన సద్గుణములు కలవు . కఫ, రక్త , పిత్త వికారముల యందు ఉపయుక్తము . శరీరద్రవాలను ఆర్చును . వ్రణములను పగలగొట్టును . 
      
            దీనిని అతిగా సేవించుట వలన నోటి రోగములు కలుగును . హృదయము నందు బాధ కలిగించును . ఉదరము ఉబ్బునట్లు చేయును . మలమూత్రములు వంటి వ్యర్ధాలను బయటకు పంపు మార్గాలను బంధించి శరీరముకు నలుపు తెచ్చును . శుక్రమును నాశనం చేయును ఆర్థిత వాతము , పక్షవాతము వంటి వాతరోగములను కలుగచేయును . 


       కావున ప్రతి రసమును మన ఆహారములో భాగము అయ్యేలా చూసుకొన్నచో మన శరీరము ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటుంది. 

             

పిల్లల పాల ఉబ్బసం వ్యాధి నివారణ కొరకు నేను ప్రయోగించిన అద్బుత యోగం -

పిల్లల పాల ఉబ్బసం వ్యాధి నివారణ కొరకు  నేను ప్రయోగించిన  అద్బుత యోగం  - 

    పాల ఉబ్బసం వచ్చే పిల్లలకు ముందుగా రొమ్ము మీద పొట్ట మీద ఆముదం రాయాలి. తరువాత వేడిగా ఉన్న ఆవుపాలల్లో కాటన్ గుడ్డని తడిపి బాగా పిండి ఆ గుడ్డతో ఆముదం రాసి ఉన్న పొట్ట , రొమ్ము మీద కాపడం పెడితే వెంటనే పాల ఉబ్బసం నుండి పిల్లలు తేరుకుంటారు. ఈ విధంగా అవసరాన్నిబట్టి రెండు మూడు సార్లు చేస్తే పాల ఉబ్బసం తగ్గిపోతుంది . 

 
       

ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు -

ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు  - 

 
 *  ఆయుర్వేద ప్రశస్తి .  - 1986 . 

 *  ఆంగ్ల - ఆంధ్ర వైద్య నిఘంటువు  -  1965 . 

 *  లివర్ మరియు స్ప్లీన్ వ్యాధులు  - 1941 . 
 
 *  అగస్త్యప్రోక్త వైద్య శాస్త్రం .

 *  శల్యతంత్రము . 

 *  కౌమారభృత్య తంత్రము  - 1960 . 

 * చరక సంహిత  - ఇంద్రియ స్థానం  - 1930 . 

 * పరిశోధిత ఆయుర్వేద ఔషధ యోగావళి  . 

 * పులిప్పాణి వైద్య శాస్త్రం. 

 * త్రిదోష విఙ్ఞానం . 

 *  చికిత్సాసార తంత్రము . 

 *  గ్రామవైద్య పరీక్షా సంగ్రహం . 

 * సిద్ధమూలికా రహస్యం . 

 * సనారీ విశ్వేశ్వర సంవాదం . 

 *  రోగవిజ్ఞానం  - వికృతి విఙ్ఞానం . 

 *  వైద్యుడు లేనిచోట . 

 *  తంత్రకల్ప తరువు . 

 *  భారతీయ వైద్య విఙ్ఞానం . 

 * శార్గధర సంహిత . 

 *  అష్టాంగ సంగ్రహం. 

 *  ఇంగ్లిష్ - తెలుగు వైద్య నిఘంటువు . 

 *  హరమేఖలా . 

 *  అష్టాంగ సంగ్రహం -సూత్రస్థానం . 

 *  గిరిజన వైద్యమృతం . 

 *  పుష్పాయుర్వేదం . 

 *  అనుపాన పథ్య మంజరి . 

 *  ఆయుర్వేద ఇతిహాసము . 

 *  ఆంధ్ర భైష్యజ రత్నావళి. 

 *  వస్తుగుణ దీపము . 

 *  ఔషధ శబ్దములు .

 *  మాధవనిదానము . 

 * బసవరాజీయము .

 * శుశ్రుత సంహిత . 

 *  వైద్య చింతామణి  - 1 . 

 *  వైద్య చింతామణి  - 2 . 

 *  వస్తుగుణ దీపిక . 

 *  వస్తుగుణ ప్రకాశిక . 

 *  అష్టాంగ హృదయం - చికిత్స  - కల్ప స్థానాలు .

 *  యోగ రత్నాకరం  - 1 .

 *  యోగ రత్నాకరం  - 2 . 

 *   వైద్యయోగ రత్నావళి . 

 *  అష్టాంగ హృదయం - సూత్ర స్థానం . 

 *  చరకస్థాన షట్కమ్ . 

 *  చరక సంహిత . 

 *  ఆయుర్వేదాంగ  శరీర సంగ్రహము. 

 *  శరీర సంగ్రహము . 

 *  వ్యాసప్రోక్త వైద్య శాస్త్రము . 

 *  రసరత్న సముచ్చయం . 

 *  వైద్య విఙ్ఞానం . 

 *  అష్టాంగ సంగ్రహం - సూత్ర స్థానం . 

 *  క్రిమిదోషాలు  - 1 . 
 
 *  క్రిమిదోషాలు  - 2 . 

 *  అగధ తంత్రము . 

 *  రస తంత్రము . 

 *  పశు విజ్ఞాన శాస్త్రం .

 *  రస ప్రయోగ రత్నాకరం. 

 *  వైదిక చికిత్స పద్దతి.
 
 *  ఔషధ కాండ - 1 . 

 *  ఔషధ కాండ  - 2 . 

 *  సిద్ధమూలికా చికిత్స రత్నాకరం . 

 *  తంత్రం - వైద్యం . 

 *  అనుభవ బాలవైద్య శిక్ష . 

 *  గోసాయి చిట్కాలు . 

 *  లోలంబ రాజీయం . 

 *  వైద్య రహస్య చింతామణి  - 1 . 

 *  వైద్య రహస్య చింతామణి  - 2 .

 *  సహదేవ పశువైద్య శాస్త్రం . 

 *  ధన్వంతరి వైద్య చికిత్స సారం . 

 *  వైద్యక శారీర శబ్దకోశం . 

 *  శుశ్రుత సంహిత  - చికిత్స స్థానం . 

 *  రోగ విఙ్ఞాన శాస్త్రం . 

 *  సతిపతి రహస్యములు . 

 *  వాత్సాయన కామసూత్రాలు . 

 *  వైద్యక ప్రయోగ విఙ్ఞానం . 

 *  ఆయుర్వేద శిక్ష . 

 *  ప్రకృతి చికిత్సర్ణవం . 

 *  ప్రకృతి చికిత్సాలయం . 

 *  ఎనిమా పద్దతి. 

 *  ఔషధ కాండ  - 3 . 

 *  ఆహార చికిత్స శాస్త్రం . 

 *  అశ్వక  వైద్య శాస్త్రం . 

 *  ఆయుర్వేద సింధు . 

 *  ఏకమూలికా ప్రయోగ రత్నావళి . 

 *  అర్కప్రకాశిక  . 

 *  నేత్ర సర్వస్వం . 

 *  ద్రవ్యగుణ మౌలిక సిద్ధాంతం . 

 *  త్రిధాతు సర్వస్వం . 

 *  ఆరోగ్య తత్వం . 

 *  ఆయుర్వేద ఔషధ రత్నాకరం . 

 *  సిద్ధ యోగ సంగ్రహం . 

 *  సిద్దనాగార్జున తంత్రం . 

 *  శతరోగ నివారిణి. 

 *  ప్రసూతి స్త్రీ విజ్ఞాన శాస్త్రం . 

 *  ఆయుర్వేద యోగ సింధు . 

 *  భిషక్సు థార్ణవం . 

 *  రస నిఘంటువు. 

 *  రసోపనిషత్తు. 

 *  దత్తాత్రేయ తంత్రం . 

 *  రస కౌముది. 

 *  రాజవల్లభ నిఘంటువు. 

 *  కాసీసం  - వైద్య యోగాలు . 

 *  నారీకేళ సంగ్రహం . 

 *  భల్లాతకామృతం . 

 *  రసహృదయ తంత్రం . 

 *  త్రిదోష విఙ్ఞాన శాస్త్రం . 

 *  రసవాద సర్వస్వము . 

 *  సిద్ధసార నిఘంటువు. 

 *  వైద్యమృతం అను కాలజ్ఞానం . 

 *  కరదీపిక . 

 *  రసౌషధ విఙ్ఞానం  - 1 , 2 , 3 , 4 భాగాలు . 

 *  రాజ మార్తాండం . 

 *  ఔషధ విఙ్ఞానం .  

 *  ఆరోగ్య విజ్ఞానం .  

 *  విష విజ్ఞానం . 

 *  రోగకాండ - దేహస్థితి . 

 *  ధన్వంతరి నిఘంటువు . 

 *  ఆయుర్వేద వైద్య చికిత్సలు . 

 *  పరీక్షా కాండ . 

 *  సర్వరోగ సూక్ష్మ వైద్యం . 

 *  4 రకాల వైద్య విధానాలు . 

 *  5 వైద్య విధానాలు . 

 *  దీర్ఘ జీవిత విజ్ఞానం . 

 *  ఆధునిక చికిత్స - 1 , 2 భాగాలు . 

 *  ధన్వంతరి . 

 *  వశిష్ఠప్రోక్త వైద్య శాస్త్రము . 

 *  ఖనిజ భస్మరాజము . 

 *  భస్మప్రదీపిక  - 1 , 2  భాగములు . 

 *  చికిత్సా రత్నము . 

 *  అనుభవ అగస్త్య వనమూలికా మర్మశాస్త్రము. 

 *  అనుభవ గృహవైద్య దీపిక . 

 *  బైరాగి చిట్కాలు . 

 *  అనుభవ చికిత్సా దర్పణం. 

 *  ధన్వంతరి  - 2 వ భాగం . 

 *  గోసాయి చిట్కాలు . 

 *  రస ప్రదీపిక . 

 *  అనుభవ వైద్య బాలశిక్ష . 

 *  శరభోజి వైద్య యోగాలు . 

 *  వైద్య వల్లభం . 

 *  గృహవైద్య చికిత్సా సారం  - 1 , 2  భాగాలు . 

 *  అష్టాంగ సంగ్రహ వాఖ్యానం . 

 *  త్రిదోష తత్వము. 

 *  నాడీవిజ్ఞాన సర్వస్వము . 

 *  గృహవైద్యం  - 1 , 2 , 3  భాగాలు . 

 *  ఆహారం - ఆరోగ్యం . 

 *  శరీరతత్వ విజ్ఞానం . 

 *  వైద్య కల్పతరువు. 

 *  వైద్య నిఘంటిక పద పారిజాతం . 

 *  ఆయుర్వేద చికిత్సా సారము . 

 *  రసరత్న సముచ్చయం . 

 *  ఆయుర్వేద శిక్ష - చికిత్సా పద్దతులు . 

 *  రసాయన వాజీకరణ తంత్రం . 

 *  స్త్రీజన కల్పవల్లి  - 1 , 2 భాగములు . 

 *  గద నిగ్రహం  . 

 *  దాంపత్య రహస్యాలు . 

 *  ఆయుర్వేద వైద్య చికిత్సలు . 

 *  గృహవైద్యం  - 4 భాగాలు , బాలరాజు మహర్షి . 

 *  వైద్య చింతామణి . 

 *  కాయచికిత్స  - జ్వరాది వ్యాధులు . 

 *  శాలాఖ్య తంత్రం  - 1 , 2 భాగములు . 

 *  ద్రవ్యగుణ ప్రయోగ విజ్ఞానం . 

 * బిడ్డల సంరక్షణ - వ్యాధులు  - చికిత్స . 

 *  వైద్య వసంతం . వస్తుగుణ మకరందం . 

 *  అశ్విక్ . 

 *  ధన్వంతరి వైద్య చికిత్సా సారము . 

 *  స్త్రీ బాల వైద్య సుధాబ్ధి. 

 *  అనుభవ గృహవైద్యము . 

 * శతాభస్మ యోగములు . 

 *  అష్టోత్తర శత లేహ్య పాకావళి . 

 *  రోగవిజ్ఞానం  - 1 , 2  భాగాలు . 

 *  అంటువ్యాధులు . 

 *  అనుభవ పశువైద్య చింతామణి. 

 *  పశుపోషణ . 

 *  పరిశోధిత ఆయుర్వేద యోగావళి . 

 *  ఆవులు - ఎడ్లు - సుళ్ళు . 

 *  మూలికా ప్రపంచం - తాంత్రిక క్రియలు . 

 *  లక్ష్మణ జల చికిత్స . 

 *  వైద్య చింతామణి  - 1 , 2 , 3 భాగములు . 

 *  వెంకటాద్రియం .

 *  సతీపతి కుతూహల రహస్యములు. 

 *  అభినవ చికిత్సా రత్నాకరం. 

 *  కలరా . 

 *  ప్రౌఢ ప్రభాకరము . 

 *  రోగమేల కలుగును. 

 *  నేత్రరోగ నిదానం . 

 *  లశున సర్వస్వము.

 *  రసయోగ రత్నాకరం. 

 *  మూలికా వైద్యము . 

 *  అనుభవ ఆయుర్వేద శాస్త్రం . 

 *  నపుంసక సంజీవనము . 

 *  వైద్యశిరోమణి . 

 *  రహస్య సిద్ధవైద్య సారము . 

 *  కొక్కోకము . 

 *  వైద్య విజ్ఞానం . 

 *  ఆహారవైద్యము . 

 *  ఇలాజుల్ గుర్భా - యునాని .

 *  తిబ్బే అక్బర్  - యునాని. 

 *  చక్రదత్త . 

 *  వైద్య యోగ రత్నావళి . 

 *  చరకసంహిత - చికిత్సా స్థానం . 

 *  దశభస్మ యోగాలు  . 

 *  చరక సంహిత  - సూత్రస్థానం . 

 *  మానవశరీర నిర్మాణ శాస్త్రం . 

 *  ఆరోగ్య భగవద్గీత. 

 *  వైద్యక పరిభాష. 

 *  వైద్య విద్యార్థి. 

 *  ఆయుర్వేదం - ఆధునిక శాస్త్ర వికాసం. 

 *  గిరిజన వైద్య సర్వస్వము . 

 *  రసేంద్ర మంగళం . 

 *  రసేంద్ర చింతామణి . 

 *  సకల వస్తుగుణ ప్రకాశిక . 

 *  వస్తుగుణ మహోదధి. 

 *  వస్తుగుణ చంద్రిక . 

 *  శుశ్రుత సంహిత  - నిదాన స్థానం . 

 *  శుశ్రుత సంహిత  - కల్ప స్థానం . 

 *  శుశ్రుత సంహిత  - శారీర స్థానం . 

 *  శుశృత సంహిత  - ఉత్తర స్థానం . 

 *  స్వర చింతామణి. 

 *  యాకృత్ప్లీహ తంత్రము . 

 *  రసాయన వాజీకరణ తంత్రములు . 

 *  వస్తుగుణ ప్రదర్శిని . 

 *  మన్కిమిన్కు . 

 *  ద్రవ్య విజ్ఞానము . 

 *  దివ్య మూలికా విజ్ఞాన దీపిక . 

 *  ఆయుర్విజ్ఞానం . 

 *  రావణ కుమార తంత్రము . 

 *  ధాతురత్నాకర శేషః . 

 *  రోగ నామావళి . 

 *  ఆయుర్వేద విజ్ఞానము . 

 *  విరేచనబద్ధములు . 

 *  ఆయుర్వేద చరిత్ర  - 1 , 2 భాగములు . 

 *  సర్వరోగ సులభ చికిత్సా గ్రంథము . 

 *  అన్నవిజ్ఞానము . 

 *  ఆయుర్వేద స్వస్థవృత్తము . 

 *  సరళ గృహవైద్యము . 

 *  గృహవైద్య ప్రకరణలు . 

 *  జంబీర చికిత్స . 

 *  శుష్క పశువైద్య తమో భాస్కరం . 

 *  కర్షక కామధేనువు. 

 *  ప్రసవ శాస్త్రము . 

 *  వ్రణ చికిత్స . 

 *  విషవైద్య చింతామణి. 

 *  బసవరాజీయము . 

 *  మూలికలు వాటి ప్రాధన్యత . 

 *  అనుపాన రత్నాకరం . 

 *  ఆరోగ్య మార్గ భోధిని. 

 *  దంతశోధిని . 

 *  గర్భిణి హితచర్య . 

 *  నాడి విజ్ఞానం . 

 *  సర్పవిషయ సంగ్రహం. 

 *  అష్టాంగ యోగ సారము . 

 *  ఆయుర్వేద వైద్య సారామృతం . 

 *  బృహత్ వైద్యం . 

 *  నాడి ప్రజననము . 

 *  ఋతు చక్రము . 

 *  ఉపవాస చికిత్స . 

 *  వైద్య నిఘంటువు . 

 *  అజీర్ణ మంజరి . 

 *  నాడి విజ్ఞానం . 

 *  పశు పరీక్ష . 

 *  సర్వ ఔషధ నిఘంటువు.

 *  బృహత్ వైద్య రత్నాకరం . 

 *  ఆరోగ్య దీపిక . 

 *  ఆరోగ్య కామేశ్వరి . 

 *  ప్రసూతి తంత్రము . 

 *  ప్రసూతి చికిత్సా తంత్రము . 

 *  పథ్యములు . 

 *  పథ్య - అపథ్యములు . 

 *  సంతాన దీపిక . 

 *  తులసి పూజా విధానం . 

 *  గృహవైద్య రహస్యాలు . 

 *  వస్తుగుణ రత్నము . 

                            సమాప్తం 

 
        

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 1 .

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 1 . 

     ఆయుర్వేదం నందు వ్యాధుల గురించి తెలుసుకొనుటకు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. ఈ రకమైన పద్ధతులు ద్వారా వ్యాధినిర్ధారణ చేయుటకు అనుభవం కూడా ప్రధానమైంది . ముందు అసలు ఆయా పద్దతుల గురించి మీకు సంపూర్ణముగా వివరిస్తాను . సమస్త వ్యాధుల గురించి తెలుసుకోవడానికి 8 స్థానాలను మొదట పరీక్షించవలెను .  అవి 

 *  నాడి .

 *  స్పర్శ . ( తాకుట ) . 

 *  రూపము . 

 *  శబ్దము . 

 *  నేత్రములు . 

 *  పురీషము . 

 *  మూత్రము . 

 * జిహ్వ ( నాలుక ) . 

       ఈ 8 రకాల స్థానాలను ముందుగా పరీక్షించిన తరువాత మాత్రమే రోగనిర్ధారణ చేయవలెను . ఇప్పుడు మీకు ఒక్కొక్కదాని గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 

 *  నాడి  - 

      దీనిని ఆంగ్లము నందు Pulse అని పిలిచెదరు . చరక , సుశ్రుతాది గ్రంథముల యందు ఎక్కడ కూడా నాడీవిషయము చెప్పబడలేదు . అయినాకూడా రోగములను గుర్తించుటకు కాని , వాటికి చికిత్స చేయుటకు గాని ఈ నాడీపరిక్షే ప్రథమస్థానం ఆక్రమించుచున్నది . మనిషి యొక్క ఒక ఉచ్చ్వాస నిశ్వాసమునకు ( Respiration ) 4 సార్లు నాడి స్పందనము ( Beating of the pulse ) కలుగును . 

  వయస్సును అనుసరించి నాడీ స్పందన - 

 గర్భములో పిండము - నిమిషానికి - 150 - 130 . 

 పుట్టగానే                 - నిమిషానికి - 140 - 130 .

 1 సంవత్సరం లోపు  - నిమిషానికి - 130 - 115 . 

 2 సంవత్సరాల లోపు - నిమిషానికి - 115 - 100 

 3 సంవత్సరాల లోపు - నిమిషానికి - 100 - 90 . 

 7 - 14 సంవత్సరాల వరకు - "       - 90 - 75 . 

 14 - 20 సంవత్సరాల వరకు - "     - 85 - 75 . 

 21 - 60 సంవత్సరాల వరకు -  "    -  75 - 65 . 

 60 సంవత్సరాల పైన           - "     -  85 - 75 . 


      జీర్ణజ్వరము , రక్తక్షీణము , దౌర్బల్యము , భోజనానంతరం , మలవిసర్జన అనంతరం నాడి క్షీణించును . ఎంతవ్యాధి యున్నను వయస్సులో ఉండువానికి 120 కంటే నాడీస్పందన మించరాదు . నాడీస్పందన 150 సంఖ్య సమీపించిన అపాయము . 

       ఈ నాడీ పరీక్ష శరీరంలో 8 ప్రదేశాలలో చేయవలెను . తరవాతి పోస్టు నందు వాటి గురించి తెలియచేస్తాను .