అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 1 .
ఆయుర్వేదం నందు వ్యాధుల గురించి తెలుసుకొనుటకు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. ఈ రకమైన పద్ధతులు ద్వారా వ్యాధినిర్ధారణ చేయుటకు అనుభవం కూడా ప్రధానమైంది . ముందు అసలు ఆయా పద్దతుల గురించి మీకు సంపూర్ణముగా వివరిస్తాను . సమస్త వ్యాధుల గురించి తెలుసుకోవడానికి 8 స్థానాలను మొదట పరీక్షించవలెను . అవి
* నాడి .
* స్పర్శ . ( తాకుట ) .
* రూపము .
* శబ్దము .
* నేత్రములు .
* పురీషము .
* మూత్రము .
* జిహ్వ ( నాలుక ) .
ఈ 8 రకాల స్థానాలను ముందుగా పరీక్షించిన తరువాత మాత్రమే రోగనిర్ధారణ చేయవలెను . ఇప్పుడు మీకు ఒక్కొక్కదాని గురించి సంపూర్ణముగా వివరిస్తాను .
* నాడి -
దీనిని ఆంగ్లము నందు Pulse అని పిలిచెదరు . చరక , సుశ్రుతాది గ్రంథముల యందు ఎక్కడ కూడా నాడీవిషయము చెప్పబడలేదు . అయినాకూడా రోగములను గుర్తించుటకు కాని , వాటికి చికిత్స చేయుటకు గాని ఈ నాడీపరిక్షే ప్రథమస్థానం ఆక్రమించుచున్నది . మనిషి యొక్క ఒక ఉచ్చ్వాస నిశ్వాసమునకు ( Respiration ) 4 సార్లు నాడి స్పందనము ( Beating of the pulse ) కలుగును .
వయస్సును అనుసరించి నాడీ స్పందన -
గర్భములో పిండము - నిమిషానికి - 150 - 130 .
పుట్టగానే - నిమిషానికి - 140 - 130 .
1 సంవత్సరం లోపు - నిమిషానికి - 130 - 115 .
2 సంవత్సరాల లోపు - నిమిషానికి - 115 - 100
3 సంవత్సరాల లోపు - నిమిషానికి - 100 - 90 .
7 - 14 సంవత్సరాల వరకు - " - 90 - 75 .
14 - 20 సంవత్సరాల వరకు - " - 85 - 75 .
21 - 60 సంవత్సరాల వరకు - " - 75 - 65 .
60 సంవత్సరాల పైన - " - 85 - 75 .
జీర్ణజ్వరము , రక్తక్షీణము , దౌర్బల్యము , భోజనానంతరం , మలవిసర్జన అనంతరం నాడి క్షీణించును . ఎంతవ్యాధి యున్నను వయస్సులో ఉండువానికి 120 కంటే నాడీస్పందన మించరాదు . నాడీస్పందన 150 సంఖ్య సమీపించిన అపాయము .
ఈ నాడీ పరీక్ష శరీరంలో 8 ప్రదేశాలలో చేయవలెను . తరవాతి పోస్టు నందు వాటి గురించి తెలియచేస్తాను .
No comments:
Post a Comment