స్త్రీ ప్రసవించుటకు ముందు కనిపించే చిహ్నములు - ప్రసవ సమయము నందు తీసుకోవలసిన జాగ్రత్తలు .
* మూత్రకోశము నందు దురద లేక మంట కలుగును. పొత్తికడుపు నందు నొప్పి కలుగును.
* మాటిమాటికి మూత్రం మరియు మలం విసర్జించవలెను అని అనిపిస్తూ ఉంటుంది.
* శరీరము నందు వణుకు , ఎత్తివేస్తున్నట్లు అనిపిస్తుంది.
* యోని రంధ్రము నుండి రక్తం కారును .
* వాంతి కలుగును. ఇలా వాంతి అవ్వడం మంచిది .
* కడుపునొప్పి పై కడుపు నుండి ప్రారంభం అయ్యి పొత్తికడుపునకు దిగును . ప్రారంభము నందు నొప్పి కొద్దిగా ఉండి రానురాను ఎక్కువ అగును. నడుముకు , వీపుకు ఎక్కువుగా ఉండును.
ప్రసవం ఏర్పడుటకు వారం ముందైనను లేక రెండు వారములకు ముందైనను ప్రసవవేదన వంటి వేదన కలుగును. దీనిని కృత్రిమనోప్పి అంటారు. నిజమైన ప్రసవవేదన కలిగినచో స్త్రీలు వంపుకలిగిన కుర్చీమీద కూర్చోవచ్చు. అటుల సాధ్యం కానిచో బాగుగా పడుకోవడం మంచిది . ప్రసవవేదన కలిగిన వెంటనే మాటిమాటికి మలమూత్రములు విసర్జించుచుండవలెను. ఇలా జరగటం చాలా మంచిది . ప్రసవించుటకు పూర్వం కడుపు నందు మలమూత్రములు లేకుండిన సుఖప్రసవం కలుగును. ప్రసవవేదన పడున్నప్పుడు ఆహారం ఇవ్వరాదు. అటువంటి సమయంలో ఆహారం ఇవ్వవల్సివచ్చినచో తేలికైన ఆహారం మాత్రమే ఇవ్వవలెను. త్వరగా జీర్ణం అయ్యేలా ఉండవలెను . దాహమునకు కావలిసినంత చన్నీటిని మాత్రమే ఇవ్వవలెను.
ప్రసవవేదన కలిగినప్పుడు ప్రసవించబోవు స్త్రీ తనకు నడుచుటకు శక్తి సరిపోవునంత వరకు అటుఇటు సంచరించవలెను. అటుల సంచరించు సమయంలో శిశువు బయటపడుటకు ప్రయత్నించుచున్నది అని తోచినచో పడక మీద కూర్చోండవలెను. అప్పుడు వాంతి అయినచో శిశువు బయటకి రావడానికి ప్రయత్నించుచున్నది అని తెలుసుకొనవలెను. కొందరు ఈ సమయమున గట్టిగా ముక్కినచో శిశువు బయటకి వచ్చును అని భావిస్తారు. కాని ఇలా చేయుట వలన ఇటువంటి ప్రయోజనం ఉండదు. ఇలా చేయుటవలన ప్రసవ సమయము నందు ఒక్కోసారి మూర్చ రావడానికి అవకాశం కలదు. ఈ విషయములో తగుజాగ్రత్త తీసికొనవలెను.
No comments:
Post a Comment