Friday, November 29, 2024

60 దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు

*60 దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు*
ఎందుకంటే 100 కి 11 మంది మాత్రమే 60 దాట గలుగుతున్నారు. ఏడు మంది మాత్రమే 65 దాటి 70 చేర గలుగు తున్నారు.  
మీరు ఆనందంగా ఉండడానికి పది చిట్కాలు 
1. దప్పిక అనిపించినా లేకున్నా *నీరు తాగుతూ ఉండాలి*. రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. 
2. ఆడతారో, తిరుగుతారో, నాట్యం చేస్తారో మీ ఇష్టం కదులుతూ ఉండండి. లేకపోతే కీళ్ల న్నీ బిగుసుకుపోతాయి . 
3 . బ్రతకడానికి తినండి తినటానికి బ్రతకకండి పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి. ముఖ్యంగా *రాత్రిపూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి*. 
4. *వీలైనంత వరకు నడవండి* లేదా సైక్లింగ్ చేయండి 100 నుంచి 200 మీటర్ల దూరం వాహనం వాడకండి, నడవండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎలివేటర్ వాడొద్దు రైల్వేస్టేషన్లలో ఎస్క లేటర్లు వాడొద్దు వాహనాలు వాడొద్దు. *మెట్లు ఎక్కండి రాంప్ పై నడవండి*. 
5. కోపం తగ్గించండి. తక్కువ మాట్లాడండి. మీ నివాస ప్రాంతంలో *" కోప నిషేధ స్థలం "* బోర్డు పెట్టండి. అది మీకు కోపం రాకుండా ఉంచుతుంది. మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. 
6. ధనం పై వ్యామోహం వదిలిపెట్టండి జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి డబ్బు వెంట మీరు పరిగెత్తకండి డబ్బు మీ వెంట పరిగెత్తాలి . 
7 మీరు కోరుకున్నది దక్కకపోతే బాధపడకండి. నిన్ను నీవు దూసించుకో వద్దు. దానిని మర్చిపోండి. 
8 *డబ్బు, తెలివి, సౌందర్యం, అధికారం, కులం, పదవి వీటి వల్ల అహంకారం పెరుగుతుంది*. దీనిని *వదిలిపెట్టాలి* దీనికోసం పై వాటిపై నియంత్రణ సాధించాలి‌. వినయంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి. ఆనందంగా నవ్వుతూ గడపాలి అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు. 
9. తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు. *కాళ్లు అనుమతించి నంతకాలం యాత్రలు చేయండి* ఆనందంగా ఉండండి తెల్లజుట్టు వార్దక్యానికి సంకేతం కాదు. 
10. అందరితో స్నేహంగా కలిసి మెలిసి ఉండండి ఒక్కోక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు . నేను పెద్దవాడిని *అందరు నాకు నమస్కరించాలి, గౌరవించాలి అని ఆశించకండి‌* నిశ్శబ్దంగా ఉన్న వారిని కూడా ఆప్యాయంగా పలకరించండి.
ఈ 10 చిట్కాలు పాటించండి. 
గమనించండి మన జీవితం ఎంత హాయిగా, ఆనందంగా, యవ్వనంగా గడిచి పోతుందో

మనకు విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది!

మనకు విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది! భీష్మపితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు, ధర్మరాజుతో సహా. కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?

అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తినీ అక్కడున్న వారినందిరినీ వుద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది" అని అడిగారు. 

ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"

ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"  

స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"

మళ్ళీ నిశబ్దం.

స్వామివారు చెప్పడం మొదలుపెట్ట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, అందరూ కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని యుదిష్టురుడిగాడు. 

"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.  

శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.  

"అదేలా" అని అందరూ అడిగారు. 

శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. 

శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు. 

ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం hu ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

జయ జయ శంకర ! హర హర శంకర !! గురుభ్యో నమ:

యుగములు

యుగములు

 అసలు యుగాలు ఎన్ని దేవతలకు - మానవులకు మద్య సమయ వ్యత్యాసమెంత - 

దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి).
మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. 
మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. 
ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). 
ఇది మనకు ఒక చతుర్యుగకాలానికి సమానము.
ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును
కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది)
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందనీ, త్రేతాయుగంలో మూడు పాదాలపైన, ద్వాపర యుగంలో రెండు పాదాలపైన, కలియుగంలో ఒక పాదంపైన నడుస్తుందని చెబుతారు.

చతుర్యుగ విశేషాలు

వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగు. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఏ యుగం ఎలా ఆరంభమైంది, ఎలా ముగిసింది...

 నాలుగు యుగాల్లో ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు, మంత్రి అని చెబుతున్నారు. మరి పురాణాలూ, శాస్రాలు యుగాల గురించి ఎం చెబుతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. కృతయుగం:

నాలుగు యుగాలలో మొదటిది కృతయుగం. దీనినే సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగం నందు నారాయణుడు లక్ష్మి సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము పదిహేడు లక్షల ఇరవై ఏడూ వేల సంవత్సరములు. ఈ యుగం లో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యుగంలో అకాలమరణాలుండవు.
ఇక ఈ కృతయుగమునకు రాజుగా సూర్యుడు అంటే రవి మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు. బంగారమునకు అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారుమయముగా ఉండేది. ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేదము విరోధము లేక చక్కగా కాలకు నడిచినది. సూర్య ప్రభావము చేత సుక్షత్రియులు, గురు ప్రభావము చేత సద్బ్రాహ్మనులు జనించి ధర్మ మయిన పాలన నడిచినది.

ఇక సకాలమునకు వర్షం మంచి పంటలు పాడి పశువులు అభివుద్ది చెంది ప్రజలు సుఖమయిన జీవనము గడుపుతూ ధర్మమయిన పాలన సాగుతుంది. సూర్య, గురు వులు వారికి మిత్ర గ్రహములయైన కుజ, చంద్ర, కేతువుల సహాయముతో ధర్మమయిన పాలన చేస్తూ ఉన్నారు. శని, శుక్ర, బుధ, రాహు గ్రహములు కదలక మెదలక కొంత వరకు వాగ్వివాదము కల్పించ ప్రయత్నము చేసిరి.

శని, శుక్ర, బుధ, రాహు గ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగు వానిని చూసి శాపానుగ్రః శక్తి గలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడై పుట్టేందుకే ఇటువంటి అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడు తున్నాడు అని అనడము వలన ఆ తపోశక్తి శాప రూపమున త్రేతాయుగములో రాక్షస వంశము అధికమయ్యెను. తపస్సుచే దైవబలమును సంపాదించారు కాని కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగములో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహము పెంచేవారు అధికమయ్యారు. ఈవిధముగా కృతయుగమున సవ్యముగా నడిచి త్రేతాయుగము ఆరంభమయినది.

2. త్రేతాయుగము:

త్రేతాయుగము లో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగం కాల పరిమాణము పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము మూడు పాదములపై నడుస్తుంది.
ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు అంటే మంగళుడు. మంత్రిగా శుక్రుడు నియమితులైయ్యారు. కుజుడు పురుష కారకుడు యువకుడు , యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహు బాల పరాక్రమ వంతుడు, సత్యము పలుకు వాడు రాజుగా ఆచారమునకు కట్టుబడి ఉండక తిరుగువాడు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు మాయ మంత్ర తంత్రవాది కుజునకు పరమ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలము పాలించవలసి వచ్చింది.
రాక్షస గురువు శుక్ర బలమున దుష్ట శక్తి, మాయా మంత్రం ప్రభావము చేత రాక్షసులను పురిగోలిపి యజ్ఞ యాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు , రూపవతులయిన స్త్రీలకూ, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవాడు.
రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్య పాలనను బ్రష్టు పట్టించి స్త్రీ వ్యామోహము వలన కలహము పెంచి ప్రజలను పీడించి రూపవతులు అగు స్త్రీలచే, యువకులకు ప్రాణ హానిని కలిగించేవారు. నాలుగు హంగులలో ప్రథమ మయిన మంత్రము యజ్ఞ యాగాదులు మొదలగు దైవ కార్యములు వాటిని జరిపించు బ్రాహ్మన వంశాములను అంతరించేలా చేసేవారు. ఇలా రాక్షసుల వలన, దుర్మార్గుల వలన మంత్రి సామంతుల వలన త్రేతాయుగములో నాలుగింట ఒక భాగము దెబ్బతిన్నది. కుజ గ్రహ బలము చేత ధనుర్ విద్యా పారంగతులు అయిన రాజ యువకుల చేత రాక్షస సంహారము చేయించుచు, అధర్మపరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకూ రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించెను. ఈవిధంగా త్రేతాయుగమున ధర్మము నాలిగింట ఒక పాదము తగ్గి ద్వాపరయుగం మొదలవుతుంది.

3. ద్వాపరయుగం:

ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ యుగం కాల పరిమాణము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది. ద్వాపర యుగమున రాజుగా చంద్రుడు , మంత్రిగా బుధుడు నియమితులయి పాలన చేస్తున్నారు. చంద్రుడు గురు గ్రహ వర్గమునకు చెందినా వాడు బుధుడు శని వర్గమునకు చెందిన వాడు. వీరు ఒకరికి ఒకరు పడనివారు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు, దుష్టులకు ఇచ్చి సాదువుల సజ్జనుల, రూపవతుల, పతివ్రతలకు, కన్యలకు అపకారము చేయు వారిని పురిగొల్పుతాడు.

బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్థ భాగము నశింప చేసి, రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మారుస్తాడు.
ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచింది.
బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్థ భాగము నశింప చేసి, రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మారుస్తాడు. ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచింది. చంద్రుడు సకల విద్యా పారంగతుడు బలవంతుడు మనో కారకుడు మాతృ కారకుడు కాన రాజుల విధ్యాపారంగుతులను చేసి ధనుర్ విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనము చేయుటకు స్వయముగా భగవానుడే కృష్ణుడిగా అవతరించి దేవతా వర్గమున కొందరిని అంటే ఇంద్రుని అంశలు ధర్మ రాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు తోడుచేసుకొని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటు మాయం చేస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగమున ధర్మము రెండు భాగాలు నశించి కలియుగము ప్రారంభము అవుతుంది. అంటే మంత్రం యుగము అంతరించి యంత్రయుగము ప్రారంభము అవుతుంది.

4. కలియుగము:

మన ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని చెబుతారు. కలియుగం కాల పరిమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు. సూర్య సిద్ధాంత ప్రకారము క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభం అయింది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు.
ఈ కలియుగమునకు రాజు శని మంత్రులు రాహు కేతువులు. రాహువు కేతువు ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కొంత కాలము రాహువు మంత్రిగా కొంత కాలము కేతువు మంత్రిగా పాలన చేయుచున్నారు. నాలుగు ధర్మ శాస్త్రములు అదృశ్యం అవ్వగా అప్పుడు కలియుగము ముందుకు నడిచేను. ధర్మమును నిలబెట్టు శాస్త్రములు ఉన్న తన పని సాగదని కలియుగము నడవదని తలంచి కలియుగ ఆరంభములోనే శాస్త్రములను వారిని రక్షించు ధార్మికులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపు చేస్తూ వచ్చాయి. ఇక అప్పటినుండి కూరము, కుచ్చితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి, వర్ణ సంకరములు మొదలై, దొరలే దొంగలయ్యారు. దైవభక్తి తగ్గి, గురుభక్తి, మాతృపితృ భక్తి అపురూపము అయింది. దైవమును నమ్మి పూజించు కాలము పోయి గురువును పూజించు కాలము వచ్చింది. ఇక హింసా సిద్ధాంతము ఎక్కువ అయి, పాపము వలన దుఖము అనుభవిస్తాము అన్న భయమే లేకుండా పోయింది. పుణ్య కార్యములు కరువయ్యాయి. ఎలాగైనా ధనాన్ని, స్త్రీని పొందినవాడే గొప్పవాడని అనుకునే వారు ఎక్కువయ్యారు. దొంగలకు దారి చూపే వారు ఎక్కువయ్యారు. ఇంకా ప్రజలు స్వధర్మమును వీడి అన్య ధర్మములను ఆచరించు కాలమునాకు పోయారు. వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. అయితే కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలములో కొంత మంది ధర్మాత్ములు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు పనులు చేస్తున్నారు.
ఈవిధంగా కలియుగం మంచి అనేదానికి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతూ నడుస్తుంది. 
కలియుగం అంతంలో భగవంతుడు కల్కి గా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమము చేస్తాడని చెబుతారు..🙏

శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా?*

*శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా?*

*శంఖం పూరిచకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది.*

*పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు.* 

*మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం అది సముద్ర మథన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే.* 

*అలా బయటపడిన దానిని శ్రీమహావిష్ణువు ధరించాడు,దానికే పాంచజన్యం అని పేరు*. 

*దాని తరువాత వచ్చిన లక్ష్మి దేవిని కూడా స్వామి స్వీకరించాడు. ముందుగా శంఖం దాని వెంటే లక్ష్మీదేవి రావటంతో శంఖాన్ని ఆ దేవి అన్నగారిగా వర్ణిస్తారు.* 

*దేముడు గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం.*
 
*ఈ శంఖంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణావృత శంఖం, రెండవది వామావృత శంఖం.*

*దక్షిణావృత శంఖాలని ఎక్కువగా పూజావిదానంలో వాడరు.*

*ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీరంగు గీత ఉంటుంది. ఇది కుడి వైపు తెరుచుకుని ఉంటుంది.*

 *ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి ధారపోస్తే కంటికి సంబందించిన రోగాలు తగ్గుతాయి.*
 
*ఎడమవైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు.*

*ఇది పేరుకి తగ్గట్టు ఎడమవైపుకి తెరుచుకుని ఉంటుంది. అన్ని పూజా విధానాల్లో మనం తరచుగా వాడేది దీనినే.*

*ఇది ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఆ దరిదాపులకి కూడా రావట.*

*వైదికశాస్త్ర ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయట.*

*దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది.*

 *1929లో బెర్లిన్ యూనివర్సిటీలో దీనిని మళ్లీ నిర్ధారించారు.*

 *ఈ శంఖధ్వనికి రెండువేల ఆరువందల అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పి పోతాయట.*

*అంతేకాదు వైద్యశాస్త్రంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉంది. రోజూ శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబందిత వ్యాధులు దగ్గరకి రావట.*

*ఆస్త్మా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. రాత్రి పూట శంఖాన్ని నీళ్ళతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మసంబందిత వ్యాదులు దూరమవుతాయట.*

*ఇంట్లో దీనిని ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి.* 

*శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయట.*

*ఈ శంఖాల వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుతాయని ఒక నమ్మకం.*

*శంఖాలలో అనేక రకాలు ఉన్నాయి. అందులో గోముఖ శంఖం ఒకటి. ఇది ఆవు మొహం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనస్సులో ఉన్న కోరికలు తీరుతాయి.*

*దీనిని షాపులో ఉంచుకొని పూజించిన వారికి రోజూ వ్యాపార,ధనాభివృద్ది కలుగుతుంది* . 

*శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదు.*

 *ఏ ఇంట్లో శంఖాన్ని దేముడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుందిట.*

 *ఇన్ని ఉపయోగాలున్న శంఖాన్ని పూజించడం, ఆరాదించడం, పూజా విధానాలలో ఉపయోగించడం ఎంతో మంచిది.*

పంచ దేవతలు ఎవరు?

పంచ దేవతలు ఎవరు?

🌸🌸🌸🌸🌸

"పంచాయతనము" గురించి క్లుప్తంగా తెలుసుకుందాము:-

"ఆదిత్య మంబికా విష్ణుం, గణనాథ మహేశ్వరమ్!
సర్వేష్టం సారభూతం చ, పంచదేవాయ సేవనమ్!!"

తాత్పర్యం:- 
సూర్యుడు, అంబిక, విష్ణు, గణపతి, ఈశ్వరుడు వీరినే పంచ దేవతలు అంటారు. వీరు కలియుగ పాపకర్మలు భరించలేక కొన్ని ప్రత్యేక శిలల్లో ఉన్నట్లు 'సిద్ధాంత శేఖరం'లో చెప్పబడినది. ఆ శిలలో మాత్రమే ఆ దేవతా విగ్రహాలను మలచి పూజలు సల్పిన సత్ఫలితము లొసంగును. దేవతా పూజా నిరాటంకముగా (ఆటంకం లేకుండా) సాగ గలదు.

పంచదేవతా పూజ చాలా ప్రశస్తమని 'దేవీ భాగవతము' నందు కలదు. కలియుగ ధర్మాన్ని అనుసరించి ఈ అయిదుగురు దేవతలు ఆయా సాలగ్రామ శిలలోనే ఉంటారట.

1) సాల గ్రామ లింగం (విష్ణువు):-
ఈ శిలలు నేపాల్ లో ముక్తినాథ దగ్గర గండకీ నది యందు లభించును. ఈ శిలలు చిన్న చిన్న రంధ్రములు కలిగి ఉంటాయి. నీటిలో రాయి వేసి తులసీ దళం వేసిన ఆ రంధ్రానికి దగ్గరగా తులసి చేరునట. విష్ణువుని మధ్యలో పెట్టి మిగతా దేవతా విగ్రహాలు శాస్త్ర ప్రకారము పెట్టిన, అది విష్ణు పంచాయతన మందురు. అట్లు పూజించిన వారికి విష్ణు సాయుజ్యము కలుగునని పద్మ పురాణంలో గలదు. 

2)బాణ లింగం(శివుడు):- 
మధ్యప్రదేశ్ లో ఓంకారేశ్వర్ దగ్గర నర్మదానదిలో లభించును. బాణలింగ సహిత రుద్రుని పూజించుట వల్ల ఆత్మజ్ఞానం లభించును. బాణలింగ సహిత రుద్రుణ్ణి మధ్యలో పెట్టి పూజించిన శివాపంచాయతనమందురు.

3)స్ఫటిక లింగం (సూర్యుడు):- 
ఈ స్ఫటిక లింగాలు తంజావూరు దగ్గర కావేరీ నదిలో లభించును. ఆదిత్యం ఆరోగ్యం అన్నట్లు సూర్య పూజ వల్ల ఆరోగ్యం లభించును. సూర్యుని మధ్యలో పెట్టి పూజించిన సూర్య పంచాయతనమందురు. 

4)అంబికా లింగం (అంబిక):- 
ఈ లింగములు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కాళహస్తి దగ్గర గల సువర్ణముఖీ నదిలో దొరుకును. అంబికాలింగ సహిత పూజ సల్పిన భోగం లభించునని సిద్ధాంత శేఖరంలో గలదు. దేవీస్తానమందు దుర్గనుగాని, లక్ష్మినిగాని, సరస్వతిని గాని, శక్తి శ్రయాన్ని అర్చించవచ్చు.

5)శోణలింగం (గణపతి):-
ఉత్తరప్రదేశ్ లోని శోణభద్ర జిల్లాలో యున్న నదిలో కల శిలలు మైనాక పర్వతం నుండి ఉత్తరంగా వచ్చి గంగలో(పాట్నా వద్ద) కలియుచున్నది. ఈ శోణలింగ సహిత గణపతి పూజ వల్ల కార్యములు నిర్విఘ్నముగా నెరవేరును. గణపతిని మధ్యలో పెట్టి ఉంచిన గణపతిపంచాయతన మందురు.

హరిః ఓమ్🙏🌹

Tuesday, November 26, 2024

ప్రోటీన్స్ గురించి సంపూర్ణ వివరణ -

ప్రోటీన్స్ గురించి సంపూర్ణ వివరణ -

     ప్రొటీన్స్ ని రసాయనిక పరిక్ష చేస్తే పంచదార యొక్క , కొవ్వు పదార్దాల యొక్క మూలద్రవ్యాలు ఉన్నట్టు కనపడుతుంది. అందువలనే మాంసకృత్తులు స్వంతకార్యాన్నే కాకుండా అవసరం వెంబడి కొవ్వు , చక్కర యొక్క కార్యాన్ని కూడా పూర్తిచేస్తాయి. కాని పంచదార , కొవ్వులు మాత్రం మాంసకృత్తుల కార్యాన్ని మాత్రం చేయలేవు . ప్రొటీన్స్ ని తెలుగులో మాంసకృత్తులు అని అంటారు.

           ఈ మాంసకృత్తులు రెండు రకాలు .

   1 - జంతు జన్యాలు ( Animal proteins ) .

   2 - స్థావర జన్యాలు ( vegitable Proteins ).

 
 * జంతు జన్యాలు -

       జంతువుల మాంసాన్ని పరీక్షిస్తే ఆ మాంసంలో మాంసకృత్తులు ఉన్నట్టు తెలుస్తుంది. కాని ముత్ర ఆమ్లం ( Uric Acid ) అనబడే ద్రవ్యం కూడా ఒకటి . ఇది మాంసాహారం వలన ఉత్పత్తి అవుతుంది. ఈ మూత్రామ్లం శరీరంలో నుంచి త్వరగా బైటికి పోవాలి . అలా జరిగితే మాంసాన్ని తిని మాంసకృత్తులుని పోషించుకోవచ్చు. బైటికి పోకుండా ఈ ముత్రామ్లం శరీరంలో నిలబడితే కొన్ని రోగాలు వచ్చును.

 * స్థావర జన్యాలు -

       మొక్కలని పరీక్షిస్తే వాటిలో కూడా చాలా రకాల మాంసకృత్తులు ఉన్నట్టు తెలుస్తుంది. కాని అవి జంతుజన్యాల అంత శ్రేష్ఠంగా ఉండవు.స్థావర మాంసకృత్తులు చాలా బలిష్టంగా ఉండి జఠరాగ్ని సంయోగం వలన బద్దలవడానికి వీలుగా లేని ఒక గట్టి పొరలో ( cellulose ) ఇమిడి ఉన్నాయి . ఈ కారణం చేతనే గోధుమల్లో ఉండే మాంసకృత్తులు జీర్ణం అవ్వడం లేదు . జంతు మాంసాన్ని పూర్తిగా వదిలివేసి కేవలం స్థావరాలనే తినేవారి మలాన్ని పరీక్షిస్తే ప్రధానద్రవ్యం అయిన నత్రజని నలభైరెండు వంతులు జీర్ణం అవ్వకుండా పోతుందని తెలుసుకున్నారు.

               మనం తీసుకున్న మాంసకృత్తులు శరీరంలో పూర్తిగా దగ్ధం అవ్వడం లేదు . అందుచేతనే "యూరియా " అనే ద్రవ్యం ఏర్పడి మూత్రం గుండా పోతూ ఉంది.మరికొన్ని విషాలు కూడా మాంసాన్ని తింటే పుడుతున్నాయి.ఈ విషాలు పెద్దపేగుల్లో కనిపిస్తున్నాయి . ఈ విషాలు పేగుల్లోంచి రక్తంలోకి పోతే Auto Intoxication అనే దారుణావస్థ సంభవిస్తుంది. 


60 దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు

*60 దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు*
ఎందుకంటే 100 కి 11 మంది మాత్రమే 60 దాట గలుగుతున్నారు. ఏడు మంది మాత్రమే 65 దాటి 70 చేర గలుగు తున్నారు.  
మీరు ఆనందంగా ఉండడానికి పది చిట్కాలు 
1. దప్పిక అనిపించినా లేకున్నా *నీరు తాగుతూ ఉండాలి*. రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. 
2. ఆడతారో, తిరుగుతారో, నాట్యం చేస్తారో మీ ఇష్టం కదులుతూ ఉండండి. లేకపోతే కీళ్ల న్నీ బిగుసుకుపోతాయి . 
3 . బ్రతకడానికి తినండి తినటానికి బ్రతకకండి పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి. ముఖ్యంగా *రాత్రిపూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి*. 
4. *వీలైనంత వరకు నడవండి* లేదా సైక్లింగ్ చేయండి 100 నుంచి 200 మీటర్ల దూరం వాహనం వాడకండి, నడవండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎలివేటర్ వాడొద్దు రైల్వేస్టేషన్లలో ఎస్క లేటర్లు వాడొద్దు వాహనాలు వాడొద్దు. *మెట్లు ఎక్కండి రాంప్ పై నడవండి*. 
5. కోపం తగ్గించండి. తక్కువ మాట్లాడండి. మీ నివాస ప్రాంతంలో *" కోప నిషేధ స్థలం "* బోర్డు పెట్టండి. అది మీకు కోపం రాకుండా ఉంచుతుంది. మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. 
6. ధనం పై వ్యామోహం వదిలిపెట్టండి జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి డబ్బు వెంట మీరు పరిగెత్తకండి డబ్బు మీ వెంట పరిగెత్తాలి . 
7 మీరు కోరుకున్నది దక్కకపోతే బాధపడకండి. నిన్ను నీవు దూసించుకో వద్దు. దానిని మర్చిపోండి. 
8 *డబ్బు, తెలివి, సౌందర్యం, అధికారం, కులం, పదవి వీటి వల్ల అహంకారం పెరుగుతుంది*. దీనిని *వదిలిపెట్టాలి* దీనికోసం పై వాటిపై నియంత్రణ సాధించాలి‌. వినయంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి. ఆనందంగా నవ్వుతూ గడపాలి అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు. 
9. తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు. *కాళ్లు అనుమతించి నంతకాలం యాత్రలు చేయండి* ఆనందంగా ఉండండి తెల్లజుట్టు వార్దక్యానికి సంకేతం కాదు. 
10. అందరితో స్నేహంగా కలిసి మెలిసి ఉండండి ఒక్కోక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు . నేను పెద్దవాడిని *అందరు నాకు నమస్కరించాలి, గౌరవించాలి అని ఆశించకండి‌* నిశ్శబ్దంగా ఉన్న వారిని కూడా ఆప్యాయంగా పలకరించండి.
ఈ 10 చిట్కాలు పాటించండి. 
గమనించండి మన జీవితం ఎంత హాయిగా, ఆనందంగా, యవ్వనంగా గడిచి పోతుందో

Friday, November 22, 2024

ఏకముఖి రుద్రాక్ష గురించి సంపూర్ణ వివరణ - 1

ఏకముఖి రుద్రాక్ష గురించి సంపూర్ణ వివరణ - 1

      దీనినే శివరుద్రాక్ష అంటారు. దీనిని శివుని ప్రతిరూపంగా భావిస్తారు . ఇది అసలైనది దొరుకుట మహాదుర్లభం. ఈ ఏకముఖి రుద్రాక్ష వృక్షజాతి రత్నం. ఈ ఏకముఖి రుద్రాక్షని సూర్యుని స్వరూపముగా భావిస్తారు . దీనిని ధరించటం వలన సూర్యగ్రహ అనుగ్రహం లభించును. ఈ రుద్రాక్ష మాల ధరించటం వలన ఆధ్యాత్మిక శక్తులు వశం అగును. అత్యంత అరుదుగా లభించే ఈ అద్భుత రుద్రాక్ష జీడిపప్పు ఆకారంలో (అర్ధ చంద్రాకారంలో ) లభించును. మంత్ర , తంత్ర ప్రయోగాలు తిప్పికొట్టబడును. 

                ఏకముఖి రుద్రాక్ష ధారణ వలన పని మీద ఆసక్తి పెరుగును . మనస్సులో భక్తి పెరుగును . ఆర్థికాభివృద్ధి జరుగును. జీవితంలో ఉన్నతస్థితి కలుగును. ఈ మాలను ధరించు సమయమున రుద్రాక్ష మంత్రమును 11 సార్లు జపించవలెను . దీని ధారణ వలన బ్రహ్మహత్యా దోషం నివారణ అగును. ఇంద్రియ నిగ్రహం కలుగును. టీబీ మరియు ఆస్తమా వంటి మొండివ్యాధులను తగ్గించును . తలనొప్పి , కంటి సమస్య , లివర్ సమస్యలకు కూడా అద్భుతంగా పనిచేయును . ఈ రుద్రాక్షను పూజామందిరంలో ఉంచుకుని పూజించుచున్న సంపదలు తరలివచ్చును . సుఖసంతోషాలు కలుగును.

           రాజకీయ నాయకులు ఈ రుద్రాక్ష ధారణకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. రాజకీయ నాయకులలో శ్రీమతి ఇందిరాగాంధీ , n .t .రామారావు గారి వద్ద మాత్రమే ఈ ఏకముఖి రుద్రాక్ష ఉండేది. కాని ఇందిరా గాంధీ మరణానికి కొన్ని రోజుల ముందే ఈ రుద్రాక్ష ఆమె దగ్గర నుంచి మాయం అయ్యింది . అది ఇప్పటివరకు ఏమైందో ఎవ్వరికి తెలియదు. 

                         ఏకముఖి రుద్రాక్ష పరమతత్వాన్ని బోధిస్తుంది. అలాంటి ఆలోచన ఉన్నవారు మాత్రమే దీనిని ధరించవలెను . దీని దర్శనం కూడా దుర్లభమే .శివరాత్రి పర్వదినమున ఈ రుద్రాక్షను పూజించిన సాక్షాత్తు శివుడ్ని పూజించిన ఫలితం వచ్చును.  

      

ఏకముఖి రుద్రాక్ష గురించి సంపూర్ణ వివరణ - 2

ఏకముఖి రుద్రాక్ష గురించి సంపూర్ణ వివరణ - 2 .

    
           నిన్నటి పోస్టులో ఏకముఖి ధరించటం వలన కలుగు ఉపయోగాలు వివరించాను. ఈరోజు మరికొంత సమాచారం వివరిస్తాను.

    ఈ ఏకముఖి రుద్రాక్షలో 4 రకాలు కలవు. ఒక్కోరకం ధరించటం వలన ఒక్కో రకమైన ఫలితాలు వస్తాయి. వాటి గురించి వివరిస్తాను.

 1 - శ్వేత వర్ణ ఏకముఖి -

           వ్యాధుల నుండి విముక్తి.

 2 - రక్తవర్ణ ఏకముఖి -

           బ్రహ్మహత్యా పాతకం నుండి దూరం చేయును .

 3 - పీతవర్ణ ఏకముఖి -

         భోగము మరియు మోక్షమును ప్రసాదించును.

 4 - శ్యామవర్ణ ఏకముఖి -

         ఆరోగ్య లాభము , సాత్విక ప్రసన్నత కలిగించును. 

          పైన చెప్పినవిధముగా ఒక్కో రంగు ఏకముఖి రుద్రాక్ష ధరించటం వలన ఒక్కొ రకమైన ఫలితాన్ని పొందవచ్చు.

        ఇప్పుడు మీకు అసలు మరియు నకిలీ రుద్రాక్షల మధ్య బేధం ఎలా కనుగొనాలో మీకు వివరిస్తాను. 

 * రెండు రాగిరేకుల మధ్య రుద్రాక్షని ఉంచినట్లయితే అది తనచుట్టూ తానే సవ్యదిశలో తిరుగును. అపసవ్య దిశలో తిరిగిన అశుభ ఫలితాలు కలుగును. కావున సవ్య దిశలో తిరగవలెను.

 * ఒక చిన్నగిన్నెలో మంచినీరు పోసి దానిలో రుద్రాక్షని వేసినట్లు అయితే నకిలీది మునగకు తేలుతుంది. అంతేగాక రంగు వెలిసిపోయినట్లు ఉన్నచో అది నకిలీదిగా గుర్తించవలెను .

 * ఆవుపాలలో అసలైన రుద్రాక్షని వేసి ఉంచిన ఆ పాలు 48 గంటల నుండి 72 గంటల వరకు చెడిపోకుండా విరగకుండా ఉంటాయి.

 * ఒక చిన్న గ్లాసులో రుద్రాక్ష మునిగేంత ఎత్తుటి వరకు చల్లని నీరు నింపి రుద్రాక్షని ఉంచి ఒక అరగంట తరువాత ఆ నీటి ఉష్ణోగ్రతని ధర్మామీటరుతో కొలిచినట్లైతే కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి ఉండును.

 * రుద్రాక్షలలో అర్ధనారీశ్వర రుద్రాక్షలు ఉంటాయి. వాటిని నకిలీలుగా తయారుచేయుటకు రెండు రుద్రాక్షలను శిలపైన అరగదీసి అతికిస్తారు. కావున జాగ్రత్తగా గీతను గమనించవలెను .

 * రెండు పాత్రల మధ్య రుద్రాక్షని ఉంచినప్పుడు రుద్రాక్ష తిరుగును.

 * పురుగులు తిన్నవి , పగిలినవి ధరించరాదు .

 * రుద్రాక్షని బాగా వేడిగా ఉన్న నీటిలో వేస్తే మునిగిపోతే అది నిజమైనదిగా భావించాలి . కొంతమంది ఇరుగుడు చెట్టు కొయ్యతో రుద్రాక్షలు తయారుచేస్తారు. కావున జాగ్రత్తగా ఉండవలెను .

 * రుద్రాక్షని ఒక వారంపాటు నూనెలో ముంచి ఉంచాలి. అవి ఏరంగు రుద్రాక్ష అయిన దాని రంగు ప్రభావితం అగును. ఆ తరువాత కాగితం లేక దూదితో శుభ్రపరచి బావినీటితో కడిగించాలి. అతరువాత ధరించినచో రంగు ప్రభావితం కానిచో అవి అసలైన రుద్రాక్షలు .

 * రుద్రాక్షలు ఎక్కువుగా కాశి , హరిద్వార్ లలో లభ్యం అగును. అసలైన రుద్రాక్ష నీటిలో మునుగును. ఒక నిజమైన రుద్రాక్షను ధరించినచో మంచి ఆరోగ్యం మరియు ఉన్నతస్థితిని ఇచ్చును. రుద్రాక్షలో ప్రకృతి సిద్ధముగానే రంధ్రం ఉండును. చిన్న రుద్రాక్షమాల గొప్ప ఫలితాన్ని ఇచ్చును.  


Wednesday, November 20, 2024

క్రియాయోగ మూల రహస్యమైన #అంతర్ముఖ_ప్రాణాయామం గురించి శ్రీలాహిరీ మహాశయులు వారు

#క్రియాయోగ మూల రహస్యమైన #అంతర్ముఖ_ప్రాణాయామం గురించి శ్రీలాహిరీ మహాశయులు వారు...
🔥🙏🔥

#యోగిరాజులు తమద్వారా వెల్లడయిన క్రియాయోగ
#ప్రాణాయామాన్ని మూడు భాగాలుగా విభజించారు--
#అధమం (12sec⬆ + 12sec⬇)
#మధ్యమం (18sec⬆ + 18sec⬇)
#ఉత్తమం (22sec⬆ + 22sec⬇)

【అంతర్ముఖ ప్రాణాయామంలో కేవలం రేచక, పూరకాలే, కుంభకం ఉండదు గమనించగలరు.】

ప్రారంభస్థితిలో అనభ్యాస కారణంగా(అలవాటు లేక) సాధకుడికి.....
◆ #అధమ_ప్రాణాయామం జరుగుతుంది. ఈ సమయంలో ఎక్కువగా #చెమట పడుతుంటుంది అటు పైన ఇంకా అభ్యాసం చేస్తున్న మీదట.........

◆ #మధ్యమ_ప్రాణాయామం జరుగుతుంది, అంటే శరీరం మధ్యమధ్యలో #అదురుతూ ఉంటుంది; లోపలినుంచి ఏదో తోస్తున్నట్టు ఉంటుంది. దానివల్ల శరీరం వణుకుతూంటుంది; కదులుతూంటుంది, ప్రాణాయామ చేస్తూండగా అలా జరిగినప్పుడు దాన్ని "మధ్యమ ప్రాణాయామం" అంటారు.....
దాని తరువాత.....

◆ #ఉత్తమ_ప్రాణాయామం జరిగినప్పుడు #ఒళ్ళు_తేలిక వడ్డంవల్ల పైకి లేస్తుంది....... ఈ ఉత్తమ ప్రాణాయామంలో "శిం" , "శిం" అన్న శబ్దం పుడుతుంది. దాన్నే #ప్రాణధ్వని అంటారు....... అలా చేస్తూంటే శరీరం సడలిపోతుంది. ఈ స్థితిలో వాయువు స్థిరం కావడంవల్ల శరీరంలోని కీళ్ళూ కండరాలు పనిలేకుండా పోతాయి; దాని తరవాత మెల్లమెల్లగా #దేహస్పృహ పోతుంది. దానివల్ల చాలా ఆనందం కలుగుతోంది........ ఆసనంతో సహా పైకి లేచి పోతున్నానని కూడా తెలుస్తుంది. వారు అర్ధరాత్రి సాధన సమయంలో వింటూండే #ఓంకార ధ్వని ఇప్పుడు అన్ని వేళలా వినిపిస్తోంది. ఆ ధ్వనే మహాశూన్యం అదే #బ్రహ్మం అనేవారు......

అంటే ఇడా, పింగళా, సుషుమ్నలు మూడూ తలలోపలికి వెళ్ళి కలిసేటంతవరకు #మనస్సు స్థిరం కాదు. వాయువు స్థిరం కానంతవరకు భయం ఏర్పడుతూనే ఉంటుంది........ 
ఇందుకని శక్తిపూర్వకంగా #ఉత్తమ_ప్రాణకర్మ చేస్తూ ఉంటే చివరికి స్థిరత్వం ఏర్పడిన మీదట "ఓంకార" ధ్వని వింటారు; దాంట్లోనే మగ్నులయి పోయినప్పుడు #స్థిరత్వ_పదప్రాప్తి కలుగుతుంది....
🌹🙏🌹

--> పురాణపురుష యోగిరాజ శ్రీశ్యామాచరణ లాహిరీ గ్రంథంలో "యోగసాధనా రహస్యం" అధ్యాయంలో నుంచి.
_

Tuesday, November 19, 2024

గుడి చుట్టూ ప్రదక్షణ కుడి చేతి వైపు నుండే చేస్తారు ఎందుకు?

గుడి చుట్టూ ప్రదక్షణ కుడి చేతి వైపు నుండే చేస్తారు ఎందుకు?
గుడిలో ప్రదక్షిణం సాధారణంగా "మూలవిరాట్టు ప్రదక్షిణం చేసే వ్యక్తికి కుడివైపుగా ఉండేటట్టు" చేస్తారు అని చెప్తే స్పష్టంగా ఉంటుంది. దీన్నే క్లాక్-వైస్ లేదా గడియారం తిరిగే దిశ అంటారు కదా. ఈ పద్ధతిలో నడిస్తే ప్రదక్షిణంగా నడవడమనీ, మూలవిరాట్టు వ్యక్తి ఎడమవైపుకు వచ్చేలా నడిస్తే అప్రదక్షిణంగా నడవడం అనీ అంటారు.

ఇలా ఎందుకు నడుస్తారంటే - నడిచేప్పుడు భక్తులకు కుడిచేతివైపు భగవంతుడు ఉంటాడు. ఇలా ఉండడమే విధాయకం. భార్యాభర్తలు పూజా కార్యక్రమాల్లోనూ, వివాహ క్రతువులోనూ నిలబడినప్పుడు భార్య భర్తకు ఎడమవేపున నిలబడాలి అంటారు. ఈ రెంటికి ఒకటే సూత్రం. (భర్త దేవుడిలాంటివాడు అన్నది కాదండీ, బాబోయ్) చిన్నవారికి కుడిపక్కన పెద్దవారు నిలబడాలి.

ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం వింటూండగా ఈ విషయం ప్రస్తావన వచ్చి - ఏదైనా వేదిక మీదనో, వైదిక క్రతువుల్లోనో వయసులో పెద్దవారు, మన్నించదగ్గవారు ఉంటే ప్రయత్నపూర్వకంగా వారు మన కుడిపక్కన ఉండేటట్టుగా నిలబడాలి తప్పించి, వారు మనకు ఎడమపక్కన ఉండేట్టుగా నిలబడకూడదు అని. వయస్సులో పెద్దవారికే ఇది వర్తించేట్టు అయితే సాక్షాత్తూ భగవంతునికి తప్పకుండా వర్తిస్తుంది కదా. అందుకే ప్రదక్షిణం అన్నది మూలవిరాట్టు మ్న కుడివైపున ఉండేలా ఉంటుందని నా అనుకోలు.

పైన చెప్పిన ప్రదక్షిణ పద్ధతి అన్ని ఆలయాలకు వర్తిస్తుంది కానీ శివాలయానికి వర్తించదు. శివాలయాల్లో మాత్రం వచ్చినవారు ఏ ఆశ్రమంలో ఉన్నారు (బ్రహ్మచర్యం, గృహస్థు, సన్యాసి) అన్నదాన్ని బట్టి వారు ప్రదక్షిణం చేసే పద్ధతి మారిపోతుదంది.

https://chat.whatsapp.com/B8FVG6XJBvnIrc7CPDv2vr

గృహస్థు: శివాలయంలో శివుని లింగానికి చేసిన అభిషేక జలం బయటకు వెళ్ళడానికి ఉండే మార్గాన్ని సోమసూత్రం అంటారు. గుడిలోంచి ఓ ఏనుగు బొమ్మ వంటి రూపం బయటకు పెట్టి అందులోంచి అభిషేక జలం వదులుతారు చూశారా, అది సోమసూత్రం. గృహస్థు దాన్ని దాటకూడదట. ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణంగా (శివుడు కుడిన ఉండేలా) ప్రారంభించి తిరిగి సోమసూత్రం వరకూ వచ్చి, ఆగిపోయి వెనుదిరిగి అప్రదక్షిణంగా సోమసూత్రం వరకూ వెళ్లి, ఆగి వెనక్కి తిరిగి ప్రదక్షిణంగా సోమసూత్రం దాకా నడచి - ఇలా చేయాలట. ఎందుకంటే గృహస్థు శివుని సోమసూత్రాన్ని దాటకూడదట. ఐతే, ఇలా చేసేప్పుడు అప్రదక్షిణంగా వెళ్ళడం, తద్వారా శివుడు భక్తుని ఎడమపక్కన ఉండే అవకాశం ఉంటుంది కదా, ఇలా ఎలా అంటే నాకు తెలియదు మరి.
బ్రహ్మచారి: బ్రహ్మచారికి సోమసూత్రం దాటకూడదన్న నియమం లేదు. (ఎందుకన్నది తెలియదు నాకు) కాబట్టి ప్రదక్షిణం మిగిలిన ఆలయాల్లో ఎలా చేస్తామో అలా పూర్తిగా చేసేయవచ్చు.
సన్యాసి: సన్యాసులు ప్రదక్షిణంగా కాక అప్రదక్షిణంగా (అంటే మూలవిరాట్టు ఎడమపక్క ఉండేలా) తిరగాలి ఆలయం చుట్టూ.
ఇది కూడా చాగంటి వారు చెప్పిందే. శైవాగమం ప్రకారం చేసే ఈ పద్ధతి లింగ పురాణంలో సవివరంగా ఉంది

Monday, November 18, 2024

గర్భముతో ఉన్నప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు , ఆహార నియమాల గురుంచి తెలుసుకొందాం.

గర్భముతో ఉన్నప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు , ఆహార నియమాల గురుంచి తెలుసుకొందాం.


ముఖ్యముగా గర్భముతో ఉన్నప్పుడు తానుతోపాటు తన గర్భములో ఉన్న ఇంకొక జీవిని కూడా దృష్టిలో పెట్టుకొని పోషకాహారం తీసుకోవలసి వస్తుంది. గర్భముతో వున్నప్పుడు మంచి మాంసకృత్తులు కలిగిన పదార్థాలు తీసుకోవటం ,ఐరన్ , కాల్షియమ్ కలిగిన పదార్థాలు మరియు పీచు పదార్థం పుష్కలముగ వున్న పదార్థాలు ఆహారములో తీసుకోవటం. 





గర్భం ధరించినప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు :

1.తగినంత వ్యాయామము మరియు విశ్రాంతి తీసుకోవటం.

2.ఫోలిక్ ఆసిడ్ పుష్కలముగా ఉన్న పదార్థాలు తీసుకోవటం

3.ఆహారములో విటమిన్ డి,కే,ఈ మరియు ,కాల్షియమ్ ,ఐరన్ మరియు జింక్ తగినంత వుండేటట్టు చూసుకోవటం.

4. మానసిక ప్రశాంతత మరియు ఇంటి వాతావరణం మంచిగా ఉండేటట్టు చూసుకోవటం

5.శారీరక పరిశుభ్రత

6. కాఫీ ,టీలు తీసుకోక పోవటం 

7. అధిక బరువులు కలిగిన వస్తువులు ఎత్తకపోవటం 

8. డాక్టర్ సలహా లేనిదే ఎలాంటి మందులు తీసుకోకూడదు 

9. సరిఅయిన బరువు వుండేటట్టు జాగ్రత్త తీసుకోవటం 




ఇనుపు ధాతువు 

రోజుకి 30- 60 మిల్లి గ్రాముల ఇనుము ధాతువు అవసరం. ఇంత కంటే 

తుక్కువ మోతాదు తీసుకుంటే రక్త హీనతకి దారితీస్తుంది. దీనివలన గుండె దడ,ఆయాసం,నీరసం,నిస్సత్తువ లాంటి సమస్యలులాంటివి 

తలెత్తుతాయి.   


గోంగూర ,పొన్నగంటికూర, బచ్చలి కూర, తోటకూరఆకుకూరలు తీసుకోవటం వలన రక్తహీనతని నివారించవచ్చు. 

చిరుధాన్యాలు ,చిక్కుడు గింజల జాతికి చెందినవి,నువ్వులు తీసుకోవటం మరియు పండిన పళ్లలో తగినంత ఐరన్ కలిగి ఉంటుంది. 




కాల్షియం :

ఎముకల పటుత్వానికి ,పెరుగుదలకు అతిముఖ్యమైనది ఈ ధాతువు. అంతే కాకుండా గుండె మరియు నాడి వ్వవస్థ పనితీరుకు కూడా ఈ కాల్షియమ్ చాల అవసరం. 

ఆకుకూరలలోను ,రాగి ,సజ్జ లాంటి పదార్థాలలో పుష్కలముగా ఉంటుంది. 

పళ్ళరసాలలో ,అంజిర్,ఆక్రూట్,బాదం మొదలగులాంటి వాటిలో కాల్షియమ్ ఉంటుంది.





ఫోలిక్ యాసిడ్

మొదటి మూడు నెలల్లో ధాతువు చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది.డి.ఎన్,ఏ నిర్మాణ క్రియకి మరియు ఎముకుల పెరుగులకి ఈ ధాతువు తోడ్పడుతుంది.గర్భిణలకి రోజుకి 150-300 మైక్రోగ్రాములు అవసరం.

టమెటోలు,అరటిపళ్ళు,బీట్ రూట్ ,కేపీసీకం,పచ్చిబఠాణి,పెసర పప్పు ,క్యాలీఫ్లవర్ లాంటివాటిలో ఫోలిక్ యాసిడ్ పుష్కలముగా ఉంటుంది. 





విటమిన్-ఏ 

రోగ నిరోధకశక్తిని ,కంటి చూపుని మెరుగు పరుస్తుంది. 

ఆకు కూరలు,కెరెట్,బీట్రూట్ ,మామిడి,తర్భుజా,చిలగడదుంపలు,సిమ్లామిర్చి, వెన్నలాంటి వాటిలో విటమిన్-ఏ పుష్కలముగా ఉంటుంది.


విటమిన్-బి 

కండరాలకి,నరాలకు బలాన్ని ఇస్తుంది. రక్తపుష్టిని చేకురుస్తుంది. 

ఆకు కూరలు, మొలకెత్తిన గింజలు ,ఖర్జురం,కొబ్బరి నీళ్లు ,బాదం,పుట్టగొడుగులు,పాలకూర లాంటివి పుష్కలముగా విటమిన్-బి ఉంటుంది. 





విటమిన్- సి 

రోగనిరోధక శక్తికి ,రక్తనాళల బలానికి ముఖ్యమైనది. 

నిమ్మ జాతి పళ్ళలో - నిమ్మ,నారింజ ,బత్తాయి,ఉసిరి ,తాజాపళ్ళలో ,మునగ ,టమాటో ,బచ్చలి కూరలో విటమిన్- సి పుష్కలముగా ఉంటుంది. 


విటమిన్-డి  

ఎముకుల పుష్టికి,దేహం ఆరోగ్యకరమైన పెరుగుదలకు విటమిన్-డి చాల అవసరం.  

సూర్య రశ్మితో మన శరీరం స్వతంత్రముగా చేసుకోగలదు. వెన్న ,ఎండిన పుట్టగొడుగులలో విటమిన్-డి ఉంటుంది. 

 





విటమిన్ -కె 

రక్తం గడ్డ కట్టటానికి ఉపయోగపడుతుంది.

కాలిఫ్లవర్ ,క్యాబేజి ,బచ్చలి కూర ,కీరదోసకాయ,పచ్చి బఠాణి,వేరుసెనగగుళ్ళు లాంటివాటిలో విటమిన్ -కె పుష్కలముగా లభిస్తుంది.


విటమిన్-ఇ 

పిండం అభివృద్ధికి,గర్భస్రావం కాకుండా కాపా డుతుంది. అంగవైకల్యము రాకుండా కాపాడుతుంది. మునగ ,చిరుధ్యానములలో ,గానుగ నూనె, వండిన పాలకూరలో ,ప్రొద్దుతిరుగుడు గింజలలో, కీరా దోసకాయలో 

విటమిన్-ఇ పుష్కలముగా ఉంటుంది.


పైన చూసిన పోషకాలుతోపాటు ఆరోగ్యకరమైన కణజాలాలాకి అవసరమైన మంచి మాంసకృతువులు కలిగిన ఆహరం తీసుకుంటే పండంటి బిడ్డని ప్రసవిస్తారు. 

గరిక పచ్చడి. 

కావలసిన పదార్థాలు

గరిక -1 కప్పు

మిరియాలు - 1 చెంచా

ధనియాలు - 1 చెంచా 

జీలకర్ర- 1 చెంచా

ఆవాలు- ½ చెంచా 

ఇంగువ- 2 చిటికెలు 

నూనె- 3 చెంచాలు 

సైన్ధవ లవణం - రుచికిసరిపడినంత

కొబ్బరి - ½ కప్పు 

అల్లం - చిన్న ముక్క 

కరివేపాకు - 1 రెమ్మ 

తయారు చేయు విధానం :

మూకుడులో మిరియాలు,జీలకర్ర,ధనియాలు దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి . 

మూకుడులో కొంచం నూనె తీసుకొని శుభ్రం చేసుకొన్న గరికను మగ్గా పెట్టుకొని చల్లార్చుకోవాలి. 

చల్లర్హుకొన్న గరిక, జీలకర్ర ,మిరియాలు, అల్లం , కొబ్బరి ,సైన్ధవ లవణం కలిపి రుబ్బుకోవాలి. 

ఆవా లు,కరివేపాకు ఇంగువతో పోపు పెట్టుకొని పైన రుబ్బుకొన్న గరిక పచ్చడిని ఈ పోపుకి కలుపుకొంటే ఎంతో కమ్మని గరిక పాకేహ్హది తాయారు అవుతుంది. 

 బీరకాయ తెలగ పిండి కూర

 కావాల్సిన పదార్థాలు :

బీరకాయ ముక్కలు - 1 కప్పు 

ఉల్లి తరుగు - ½ కప్పు 

పచ్చిమిర్చి తరుగు - 2 చెంచాలు 

కర్వేపాకు - 1 రెమ్మ 

కొత్తిమీర - పిడికెడు 

వెల్లుల్లి రెబ్బలు - 10

తెలగ పిండి - ¼ కప్పు 

జీలకర్ర -1 చెంచా 

ధనియాల పొడి - 1 చెంచా 

ఉప్పు - రుచికి సరిపడినంత 

నూనె - 3 చెంచాలు 

పోపు సామాను - 2 చెంచాలు ( ఆవాలు,సెనగ పప్పు ,మినపప్పు)


తాయారు చేయువిధానం :

బీరకాయ శుభ్రం చేసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. 

తెలగ పిండిలో వేడి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. 

మూకుడులో నూనె తీసుకొని పోపు సామానుతో పోపు పెట్టుకొని మగ్గిన తరువాత దంచిన వెల్లుల్లి రెబ్బలు,జీలకర్ర ,పచ్చిమిర్చి ,ఉల్లి తరుగు వేసుకొని మగ్గబెట్టి బీరకాయ ముక్కలు పసుపు వేసుకొని బీరకాయ ముక్కలు ఉడికేదాకా మగ్గ పెట్టుకొని వేడి నీళ్ళలో నాన బెట్టుకొన్న తెలగ పిండి కలుపుకొని కొంచం సేపు మగ్గా పెట్టుకొని కొత్తిమీర కలుపుకుంటే ఎంతో కమ్మని తెలగ పిండి బీరకాయ కూర తయారు అవుతుంది. 

ఊద నువ్వుల కుడుములు 

కావలసిన పదార్థాలు 

ఊద బియ్యం - 1 కప్పు 

బెల్లం - ½ కప్పు 

కొబ్బరి తురుము - ¼ కప్పు 

నెయ్యి - 5 చెంచాలు 

నువ్వులు - 4 చెంచాలు 

యాలకుల పొడి - ½ చెంచా  

తాయారు చేయు విధానం 

ముందుగా ఊద బియ్యం 4 గంటలు నానబెట్టుకొని వడగట్టుకొని నీడలో 20 శాతం చమ్మ వుండేటట్టు ఆరబెట్టుకొని పిండి మరపట్టి పెట్టుకోవాలి. 

నువ్వులు దోరగా వేపుకొని పొడికొట్టి పెట్టుకోవాలి. 

మూకుడులో 3 చెంచాలు నెయ్యి తీసుకొని వేడి అయిన తరువాత కొబ్బరి తురుము వేసుకొని దోరగా వేపుకొని 1 కప్పు నీళ్ళు చేర్చుకొని నీళ్ళు మరిగేటప్పుడు బెల్లం తురుము వేసుకొని బెల్లం కరిగి ఒక తీగ పాకం వచ్చిన తరువాత నువ్వులపొడి,తయారుగా పెట్టుకొన్న ఊద పిండి ,యాలకుల పొడి కలుపుకొని దగ్గరికి అయ్యే దాకా కలుపుకొని చల్లారినతరువాత కుడుములు వత్తుకొని 12 నిమిషాలు ఆవిరి పెట్టుకొంటే ఎంతో కమ్మని ఊద కుడుములు తాయారు అవుతాయి.  




పెసర బీట్రూట్ సూప్ 

కావలసిన పదార్థాలు 

పెసర పప్పు - ¼ కప్పు 

బీట్రూట్ - 1 కప్పు 

పుదీన- పిడికెడు 

కొత్తిమీర -పిడికెడు

వెల్లుల్లి తరుగు - 3 చెంచాలు 

నిమ్మ రసం - 3 చెంచాలు 

మిరియాల పొడి - 1. 5 చెంచాలు 

జీలకర్ర - 2 చెంచాలు 

ఉప్పు - రుచికి సరిపడినంత 

నెయ్యి - 3 చెమ్చాలు 

బెల్లం - 2 చెమ్చాలు 

తయారు చేయు విధానం 

పెసర పప్పుని శుభ్రం చేసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. 

ఒక పాత్రలో 10 కప్పులు నీళ్ళు చేర్చుకొని ఈ నీళ్ళు బాగా మరిగేటప్పుడు పెసర పప్పుని చేర్చుకొని పెసర పప్పు సగం ఉడికిన తరువాత బీట్రూట్ ముక్కలు చేర్చుకొని బీట్రూట్ ముక్కలు సగం ఉడికిన తరువాత పొయ్యే కట్టేసి బీట్రూట్ ,పెసర పప్పుని వడ కట్టుకొని ఈ నీటిని పక్కన పెట్టుకోవాలి. 

బీట్రూట్ ,పెసర పప్పు చల్లారిన తరువాత పుదీనా చేర్చి మెత్తగా రుబ్బుకొని ఈ మిశ్రమాన్ని పైన పక్కన పెట్టుకొన్న నీటికి చేర్చి ,ఉప్పు కూడా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగ బెట్టుకోవాలి. 

మూకుడులో నెయ్యి తీసుకొని జీలకర్ర ,వెల్లుల్లి తరుగుతో పోపు పెట్టుకొని ఈ పోపుని పైన మరుగుతున్న సూప్ కి కలిపి మిరియాల పొడి ,కొంచం బెల్లం ముక్క కలుపుకొంటె ఎంతో కమ్మని పెసర బీట్రూట్ సూప్ తాయారు అవుతుంది. 

సర్వ చేసుకొనే ముందు నిమ్మ రసం కొత్తిమీర కలుపు కొంటె సూప్ కి మరింత కమ్మధనం పెరుగుతుంది.








ఊద మునగాకు కిచిడి

కావలసిన పదార్థాలు 

ఊదలు - 2 కప్పులు

పెసరపప్పు - 1 కప్పు

మిరియాలు 1 చెంచా

జీలకర్ర - 1 చెంచా

ఇంగువ- 3 చిటికెలు

అల్లం తురుము- ½ చెంచా

ఉప్పు - రుచికిసరిపడినంత

నూనె - 3 చెంచాలు

మునగాకు - 1 కప్పు


తాయారు చేయువిధానం

1.ఊద బియ్యం, పెసరపప్పు 3 గంటలు విడివిడిగా నాన బెట్టుకోవాలి.

2.పాత్రలో నీళ్లుతీసుకొని బాగామారగానివ్వాలి.

3.మరిగే నీళ్ళలో పెసరపప్పు వేసి సగంఉడికిన తరువాత ఊద బియ్యంవేసి 90 శాతం ఉడికిన తరువాత ఉప్పు ,మునగాకువేసి ఉడికించుకోవాలి.

4.చివరగా జీలకర్ర, మిరియాలు,అల్లంతో పోపుపెట్టుకుంటే ఎంతో కమ్మని ఊద మునగాకు కిచిడి తాయారు అవుతుంది.



జొన్న పుదీన గార్లిక్ సూప్ 

పుదీనా - 1 కట్ట  

వెల్లుల్లి - 10 పాయలు 

కొత్తిమీర - పిడికెడు 

నిమ్మకాయలు -2

మిరియాల పొడి - 1 చెంచా 

జీలకర్ర - 1. 5 చెంచాలు 

జొన్న పిండి - 4 చెంచాలు 

నెయ్యి - 2 చెంచాలు 

ఉప్పు - రుచికి సరిపడినంత 


తయారు చేయు విధానం:

జొన్న పిండిని దోరగా వేపుకొని చల్లారిన తరువాత పుదీనా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. 

 రుబ్బుకొన్న మిశ్రమానికి 6 కప్పుల నీరు చేర్చి పొయ్యి మీదపెట్టి బాగా మరిగిన తరువాత మిరియాల పొడి,ఉప్పుచేర్చుకోవాలి.

  జీలకర్ర , వెల్లుల్లితో పోపు పెట్టుకొని నిమ్మరసం కొత్తిమీర చల్లుకొంటే ఎంతో కమ్మని జొన్న పుదీనా వెల్లుల్లి సూప్ తయారు అవుతుంది. 







గోరు చిక్కుడు వేపుడు 

కావలసిన పదార్థాలు 

గోరు చిక్కుడు - 1 కప్పు  

అల్లం - చిన్న ముక్క 

పచ్చిమిర్చి - 2

కర్వేపాకు -1 రెమ్మ 

కొత్తిమీర - పిడికెడు 

నూనె - 3 చెంచాలు 

పోపు సామాను - 2 చెంచాలు 

ఉప్పు - రుచికి తగినంత 

పుట్నాల పొడి - 3 చెంచాలు 


తయారు చేయు విధానం: 

గోరు చిక్కుడు కాయలు శుభ్రం చేసుకొని ముక్కలు చేసుకొని ఆవిరిలో ఉడక పెట్టుకొని పెట్టుకోవాలి. 

మూకుడులో నూనె తీసుకొని పోపు సామాను వేసుకొని మగ్గిన తరువాత అల్లం పచ్చిమిర్చి ముద్దని వేసుకొని బాగా మగ్గిన తరువాత కర్వేపాకు వేసుకొని తయారుగా పెట్టుకొన్న గోరు చిక్కుడు కాయ ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు చేర్చి పుట్నాల పొడి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో కమ్మని గోరుచిక్కుడు వేపుడు తాయారు అవుతుంది. 

100 గ్రాముల పుట్నాల పొడి తాయారు చేయు విధానం : 

 పుట్నాలు (50 గ్రాములు)

 ,కరివేపాకు( 20 గ్రాములు) ,మిరియాలు( 10 గ్రాములు),జీలకర్ర ( 10 గ్రాములు) ,వెల్లుల్లి ( 10 గ్రాములు)

వేపుకొని పొడి చేసుకోవాలి. 


మునగాకు పెసర కట్టు

కావలసిన పదార్థాలు 

పెసర పప్పు- 1 కప్పు 

పసుపు - 1 చెంచా 

జీలకర్ర - 1 చెంచా 

ఆవాలు -½ చెంచా 

మెంతులు -½ చెంచా 

మిరియాల పొడి - 1 చెంచా 

ఉప్పు -రుచికి సరిపడినంత

ఇంగువ- 3 చిటికలు

నూనె / నూనె- 3 చెంచాలు

వెల్లుల్లిరెబ్బలు - 6

మునగాకు - 1 కప్పు

కర్వేపాకు - 1 రెమ్మ

కొత్తిమీర - 1 పిడికెడు

తాయారుచేయు విదానం:

పెసరపప్పు శుభ్రంచేసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి.

2. ఒకపాత్రలో 5 కప్పులు నీళ్ళు తీసుకొని పొయ్యేమీద పెట్టి మరుగుతున్నప్పుడు నానబెట్టుకొన్న పెసరపప్పు,పసుపు వేసి ఉడికిన తరువాత మునగాకు మిరియాల పొడి , ఉప్పు చేర్చుకొని మూత పెట్టి 7 నిముషాలు వుడికొన తరువాత పొయ్యే కట్టేసి పప్పు గుత్తితో ఎనుపుకొవాలి . 

 3. మూకుడులో నూనె /నెయ్యి తీసుకొని వేడి ఆయన తరువాత ఆవాలు, జీలకర్ర,మెంతులు ,ఇంగువ ,కర్వేపాకుతో పోపుపెట్టుకొని పైన తయారుగా ఉన్న పప్పుకు కలుపుకొని కావాలంటే కంచెం నిమ్మ రసం కలుపుకొంటే ఎంతో కమ్మని మునగాకు పెసర కట్టు తాయారు అవుతుంది. 


ఊద అన్నం :

ఊద బియ్యాన్ని 4 - 6 గంటలు నాన పెట్టుకొని ఒకటికి రెండు నీళ్ళు పోసి ఈ పాత్రని ఇడ్లి పాత్రలో పెట్టి 15-18 నిమిషాలు ఆవిరి పట్టుకొంటే ఊద అన్నం తాయారు అవుతుంది.

పుదీనా అల్లం మజ్జిగ 

కావలసిన పదార్థాలు 

మజ్జిగ - 1 లీటర్  

పుదీనా - 1 కట్ట 

అల్లం - 20 గ్రాములు 

పచ్చిమిర్చి - 2

జీలకర్ర పొడి - 2 చెంచాలు 

ఉప్పు - రుచికి సరిపడినంత 

తాయారు చేయు విధానం 

పుదీనా ,అల్లం,పచ్చిమిర్చి మెత్తగా రుబ్బుకొని ఈ ముద్దని జీలకర్ర పొడిని ఉప్పుని మజ్జిగ కి కలుపుకొంటే ఎంతో కమ్మని పుదీనా అల్లం మజ్జిగ తయారుఅవుతుంది . 

గమనిక : వెన్న తీసిన మజ్జిగ తీసుకోవాలి. పచ్చిమిర్చి లోని గింజలు తీసేయాలి.

Sunday, November 17, 2024

_తిరుమల తిరుపతి .. విశేషాలు_*

*కళ్ళకు కట్టి నట్లున్న*

*_తిరుమల తిరుపతి .. విశేషాలు_*

(_పూర్తిగా చతివితే తిరుమల తిరుపతి దర్శనం అయినట్లే_)

*_శ్రీవారి ఆలయ నిర్మాణం.._*

*క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది.*

శ్రీవారి ఆలయంలో మొత్తం 
*మూడు ప్రాకారాలున్నాయి.*
_ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది._ 

_ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచు కోవడానికి వేర్వేరుగా గదులున్నాయి._ _వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి._

ఆలయంలోని నిర్మాణాలు ఇలా ఉంటాయి

*1 వ ప్రాకారం :-*
*మహాద్వార గోపురం :- (ఇత్తడి వాకిలి)*

శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించడానికి శ్రీవారి ఆలయంలో ప్రవేశించే .... ప్రధాన ప్రవేశద్వార గోపురమే ఈ మహాద్వార గోపురం.
*పడికావలి, సింహద్వారం, ముఖద్వారం*
అని ఈ ద్వారానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. 
దీనినే తమిళంలో *”పెరియ తిరువాశల్‌”* అని కూడా అంటారు. *అనగా *పెద్దవాకిలి అని అర్థం.*

ఈ ప్రధాన ద్వార గోపురంతో అనుసంధింపబడుతూ నిర్మించిన ప్రాకారమే మహాప్రాకారం. వైకుంఠం క్యూకాంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో మాత్రమే వెళ్లి స్వామివారిని దర్శించవలసి ఉంటుంది.

ఇక్కడే మనం క్రింద ఉన్న పైపుకు గల రంధ్రాల ద్వారా వచ్చే నీటితో కాళ్ళు కడుగుకొని లోపలికి ప్రవేశిస్తాం.

ఈ వాకిలి దక్షిణవైపున గోడపై అనంతాళ్వారులు ఉపయోగించిన గుణపం ఉంటుంది.

*శంఖనిధి - పద్మనిధి*
మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉంటాయి. 
వీరే శ్రీవేంకటేశ్వరుని సంపదలకు నవనిధులను రక్షించే దేవతలు. దక్షిణదిక్కున ఉన్న రక్షక దేవత రెండుచేతుల్లోనూ రెండు శంఖాలు ఉంటాయి ఈయన పేరు శంఖనిధి, కుడివైపున ఉన్న రక్షకదేవత చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి ఈయన పేరు పద్మనిధి.

*కృష్ణదేవరాయమండపం :-*

మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్తంభాలతో 27' ×25' కొలతలు ఉన్న ఎతైన మండపమే కృష్ణరాయ మండపం. దీనినే *ప్రతిమా మండపం* అని కూడా అంటారు. 

ఈ మండపం లోపలికి ప్రవేశిస్తున్నపుడు కుడివైపున రాణులు తిరుమల దేవి, చిన్నాదేవులతో కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు ఉన్నాయి.

అలాగే ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతిరాయల రాగి ప్రతిమ, ఆ ప్రక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమల యాత్ర చేసి శ్రీ స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తనపేరిట *అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని* నిర్వహించాడు.

*అద్దాలమండపం*

ప్రతిమా మండపానికి 12 అడుగుల దూరంలో, ఎతైన అధిష్టానంమీద నిర్మింపబడి ఉన్న దీన్నే *అద్దాలమండపమని*
*అయినామహల్ అని అంటారు. 43'×43' కొలతలున్న ముఖమండపంలో శ్రీవారి అన్నప్రసాదాలు అమ్మే అరలు ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమవంతుకు వచ్చే శ్రీవారి ప్రసాదాలను భక్తులకు తగిన వెలకు విక్రయించేవారు ఒకప్పుడు. ఈ అరల ప్రాంతాన్నే *ప్రసాదం పట్టెడ* అంటారు.

*తులాభారం :-*

శ్రీకృష్ణదేవరాయలు మండపానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ పిల్లల బరువుకు సరిసమానంగా ధనం, బెల్లం, కలకండ, కర్పూరం రూపేణ గాని తులాభారంగా శ్రీస్వామివారికి సమర్పిస్తారు.

*రంగనాయక మండపం :-*

_కృష్ణరాయమండపానికి దక్షిణం వైపుగా 108 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగి ఎతైన రాతి స్తంభాలతో అనల్ప శిల్ప శోభితమై విరాజిల్లుతూ ఉన్నదే_ 

*”రంగనాయకమండపం”.* 
★ _శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు. ఒకప్పుడు నిత్యకల్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలయిన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి._

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతో పాటు శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు.

*తిరుమలరాయమండపం:-*

రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాలు, తిరుమలేశుడు భక్తులపై చూపుతున్న తరగని ఉదారత్వానికి మచ్చుతునక ఈ తిరుమలరాయ మండపం. 
ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించాడు (సాళ్వ నరసింహ మండపం). శ్రీస్వామి వారికి *"అన్నా ఊయల తిరునాళ్ళ"* అనే ఉత్సవాన్ని నిర్వహించే నిమిత్తం క్రీ.శ. 1473 లో ఈ మండపం నిర్మించాడు. ఆ తర్వాతి కాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించాడు.
అణ్ణై అనగా తమిళంలో *హంస*.🕊 బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీస్వామివారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.

*రాజ తోడరమల్లు:-*

ధ్వజస్తంభం మండపానికి 10 అడుగుల దూరంలో స్వామి వారికి నమస్కరిస్తున్నట్లు 3 విగ్రహాలు ఉంటాయి. సహజంగా కళ్యాణం ముగించుకున్న భక్తులు సాధారణ భక్తులతో కలిసే మార్గంలో ఉంటాయి.
 అవి రాజా తోడరమల్లు
అతని తల్లి మోహనాదేవి
అతని భార్య పితాబీబీ విగ్రహాలు. 
ఈయన అనేక సంవత్సరాలు తిరుమలను దుండగుల బారినుండి రక్షించారు.

*ధ్వజస్తంభ మండపం :-*

ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండివాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. 

*_ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం అంటారు._*

*ధ్వజస్తంభం:-*

వెండివాకిలి ఎదురుగా సుమారు15 అడుగుల దూరంలో చెక్కడపు రాతి పీఠంపై ధ్వజదండంవలెనున్న ఎతైన దారుస్తంభం నాటబడింది. అదే ధ్వజస్తంభం.

*బలిపీఠము :-*

ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారు రేకు తాపబడింది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు *బలిని (అన్నాన్ని )* ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.

*క్షేత్రపాలక శిల (గుండు) :-*

ధ్వజస్తంభం కు ఈశాన్య (north - east) మూలలో అడుగున్నర ఎత్తుగల చిన్న శిలాపీఠం ఉంది. దీనినే *క్షేత్రపాలక శిల* అంటారు.
ఇది రాత్రిపూట ఆలయానికి రక్ష. అర్చకులు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడికితాళం వేసి తర్వాత ఈ శిలపై ఉంచి నమస్కరించి మరలా ఉదయం ఇక్కడి నుండే శిలకు నమస్కరించి *తాళం చెవులను* తీసుకువెళతారు.

*సంపంగి ప్రాకారం :-*

మహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి (వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. 

ప్రతి ఆలయానికి స్థల వృక్షాలనేవి ఉండడం పరిపాటి. తిరుమల ఆలయం *స్థలవృక్షం సంపంగి*. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా _సంపంగి చెట్లు ఉన్నందువల్ల ఇలా పిలవబడుతోంది._

*కళ్యాణ మండపం :-*

సంపంగి ప్రదక్షిణం దక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంగా కల్యాణమండపం నిర్మించబడింది. ఇందులో తూర్పుముఖంగా ఏర్పాటు చేయబడిన కల్యాణవేదికపై శ్రీమలయప్పస్వామి వారికి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కల్యాణోత్సవం జరుగుతుంది.

*ఉగ్రాణం :-*

స్వామివారి పూజా సంభారాలు నిల్వ ఉంచేగది.
సంపంగి ప్రదక్షిణకు (north west) వాయువ్య మూలగా ఉంటుంది.

*విరజానది :-*

వైకుంఠంలోని పరమ పవిత్రమైన నది శ్రీవారి పాదాలక్రిందగా ప్రవహిస్తూ ఉంటుందని నమ్మకం.

ఆలయం లోపలి బావులలో ఈనది నీరు ప్రవహిస్తుందని అందుకే ఆలయ బావులలోని నీరు పరమ పవిత్రమైనవిగా భావించి స్వామివారి అభిషేకాదులకు మాత్రమే వాడతారు.

*నాలుగు స్థంభాల మండపం :-*

సంపంగి ప్రదక్షిణానికి నాలుగు మూలలా సాళ్వ నరసింహ రాయలు ఆయన భార్య , ఇద్దరు కుమారులు పేర స్థంభాలు కట్టించాడు.

*పూలబావి :-*

పూలగదికి ఉత్తరంగా ఉంటుంది. స్వామి వారికి ఉపయోగించిన పూల నిర్మాల్యాలన్నీ ఇందులో వేస్తారు.
దర్శనానంతరం ప్రసాదం తీసుకుని ముందుకు వెళ్ళేటపుడు ఎత్తైన రాతికట్టడం మాదిరిగా ఉంటుంది.

*వగపడి :-*

భక్తులు సమర్పించిన ప్రసాదాలు స్వీకరించే గది.

*ముఖ మండపం :-*

అద్దాల మండపంనకు ముందుభాగంలో ఉంటుంది.
కళ్యాణం చేయుచుకున్న భక్తులకు ప్రసాదాలు దీని ప్రక్కమార్గంలో అందచేస్తారు.

 *2 వ ప్రాకారం :-*

వెండి వాకిలి – నడిమి పడికావలి...

ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండివాకిలి నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండివాకిలి గుండా వెళ్లి శ్రీస్వామి వారిని భక్తులు దర్శిస్తారు. 

★ _ప్రవేశ_ 
_ద్వారమంతటా వెండి రేకు_ _తాపబడినందువల్ల దీన్ని వెండివాకిలి అని అంటారు._ 

ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీ వేంకటేశ్వరస్వామి పాచికలాడుతున్న శిల్పం ఉంది.

*విమాన ప్రదక్షిణం :-*

వెండివాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణం. దీనినే అంగప్రదక్షిణం అనికూడా అంటారు. సుప్రభాత సేవ జరిగేటపుడు వెలుపల అంగప్రదక్షిణం చేసే భక్తులు కూడా ఉంటారు.

ఈ ప్రదక్షిణ మార్గంలో వెండివాకిలికి ఎదురుగా శ్రీరంగనాధ స్వామి, వరదరాజస్వామి, ప్రధానవంటశాల,
పూలబావి,
అంకురార్పణ మండపం,
యాగశాల,
నాణాల పరకామణి,
నోట్ల పరకామణి,
చందనపు అర
విమాన వేంకటేశ్వర స్వామి,
రికార్డుల గది,
భాష్యకారుల సన్నిధి,
యోగనరసింహస్వామి సన్నిధి,
ప్రధాన హుండి
విష్వక్సేనుల వారి ఆలయం
మొదలగు ఉప ఆలయాలను దర్శించవచ్చు. వీటినే చుట్టుగుళ్ళుగా పేర్కొంటున్నారు.

*శ్రీరంగనాథుడు :-*

★ _వెండి వాకిలి గుండా లోపలకు ప్రవేశించగానే ఎదురుగా ఆదిశేషునిపైన కనిపించేది శ్రీరంగనాథుడు._ 

~ _ఈయనకు పైన వరదరాజస్వామి క్రింద వెంకటేశ్వరస్వామి మూర్తులు చిన్న బంగారు ఫలకాలపై ఉంటాయి._

*అంగప్రదక్షిణం ఇక్కడి నుంచే మొదలవుతుంది.*

వీనినే *పొర్లుదండాలు* అంటారు.

*శ్రీ వరదరాజస్వామి ఆలయం :-*

విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయమూలన శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో (సుమారు 4 అడుగుల) నిలువెత్తు శ్రీ వరదరాజస్వామి వారి శిలామూర్తి ప్రతిష్ఠింపబడింది.

*బంగారు బావి :-*

★ _దర్శనానంతరం వెలుపలకు రాగానే అద్దాల గదిలో బంగారు తాపడంతో ఉంటుంది._ 

★ _ఇందులోని నీటినే స్వామి వారి అభిషేకాలకు ప్రసాదాలకు వాడతారు._ 

ఇందులో వైకుంఠం లోని విరజానది నీరు చేరుతుంది అని అత్యంత పవిత్రమైనది గా చెపుతారు.

*వకుళాదేవి :-*

★ _బంగారుబావి ప్రక్కన మెట్లు ఎక్కి ఎడమవైపు పశ్చిమ అభిముఖంగా ఉంటుంది._

*శ్రీవారి తల్లి (పెంచిన). ద్వాపరయుగంలో యశోదయే ఈ కలియుగంలో స్వామి వారి కళ్యాణం చూడడానికి వకుళాదేవిగా అవతరించింది.*

*అంకురార్పణ మండపం :-*

బంగారుబావికి దక్షిణం వైపు ఉంటుంది. ప్రతి ఉత్సవాలకు నవధాన్యాలను భద్రపరుస్తారు.
ఇంకా గరుడ, విష్వక్సేనుల, అంగద, సుగ్రీవ, హనుమంత విగ్రహాలను భద్రపరుస్తారు.

*యాగశాల :-*

హోమాది క్రతువులు నిర్వహించే ప్రదేశం. కాని ఇప్పడు సంపంగి ప్రాకారంలోని కళ్యాణ వేదిక వద్ద చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడే యజ్ఞ యాగాదులు చేస్తారు.

*సభ అర :-*

★ _కైంకర్యాలకై ఉపయోగించే బంగారు వెండి పాత్రలు కంచాలు గొడుగులు ఉంచే ప్రదేశం._

★ _ఏకాంత సేవలో ఉపయోగించే బంగారు మంచం, పరుపు, విశనకర్రలను కూడా ఇక్కడే భద్రపరుస్తారు._

*సంకీర్తన భాండాగారం :-*

సభ అర ప్రక్కనే ఉన్న గది. దీనికి ఇరువైపులా తాళ్ళపాక అన్నమాచార్యులు ఆయన పెద్ద కుమారుడైన పెద్ద తిరుమలాచార్యుల విగ్రహాలు ఉంటాయి. ఇందులో తాళ్ళపాక వంశం వారు రచించిన దాదాపు *32,000 సంకీర్తనలను భద్రపరిచారు.*

*సాధుసుబ్రమణ్యశాస్త్రి* గారి విశేష కృషి వలన ఈనాడు మనం వాటిని మననం చేసుకోగలుగుతున్నాము.

*భాష్యకార్ల సన్నిధి :-*

ఇందులో *శ్రీమద్ రామానుజాచార్యులు గారి విగ్రహం ఉంటుంది.* శ్రీవారికి ఏం ఏం కైంకర్యాలు ఏవిధంగా చేయాలో మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి.

★_తన 120 సం.ల కాలంలో 3 పర్యాయాలు తిరుమలకు మోకాళ్ళ మీద వచ్చాడు._ 

అలా వస్తున్నపుడు ఆయన ఆగిన ప్రదేశమే *మోకాళ్ళ పర్వతం.*

ఈ నాటికీ కాలినడకన వచ్చే భక్తులు ఈ పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కడం గమనించవచ్చు.

*ప్రధాన వంటశాల (పోటు) :-*

విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను *పోటు* అంటారు. 
ఈ వంటశాలలో *దద్దోజనం, చక్కెరపొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరా, మాత్రాలతో పాటు కల్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్‌ పాయసం, అప్పం మొదలైనవాటిని తయారు చేస్తారు.* ఆయా నియమాలను అనుసరించి వీటిని స్వామివారికి నివేదన చేస్తారు.

*పరకామణి :-*

స్వామి వారికి భక్తులు సమర్పించిన నగదు లెక్కించే ప్రదేశం.

*చందనపు అర :-*

స్వామి వారికి సమర్పించే చందనాన్ని భద్రపరిచే ప్రదేశం.

*ఆనందనిలయ విమానం :-*

ఆనందనిలయం పైన ఉన్న బంగారు గోపురాన్ని ఆనందనిలయ విమానం అంటారు.

★ _గరుత్ముంతులవారే ఈ గోపురాన్ని వైకుంఠం నుండి భూమిమీదకు తీసుకు వచ్చారని చెప్తారు. దీనిమీద దాదాపు 64 మంది దేవతా ప్రతిమలు ఉన్నట్లు చెపుతారు._

*విమాన వెంకటేశ్వరస్వామి :-*

గోపురంపై వెండిద్వారంతో ప్రత్యేకంగా ఉండే స్వామివారు. 

*రికార్డు గది :-*

స్వామి వారి ఆభరణాలు వివరాలు, జమ ఖర్చులు భద్రపరచు గది.

*వేదశాల :-*

రికార్డు గది ప్రక్కనే వేద పఠనం చేసే పండితులు ఉండేగది. ఇక్కడే మనం వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.
  

*శ్రీ యోగనరసింహస్వామి సన్నిధి :-*

రామానుజాచార్యులుచే ప్రతిష్టితం చేయబడింది.

శ్రీ నరసింహాలయం *క్రీ.శ 1330-1360 మధ్య నిర్మించబడిందని పరిశోధకుల అభిప్రాయం.* క్రీ.శ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది. 
*'అళగియ సింగర్‌' (అందమైన సింహం)* అని, *వేంకటాత్తరి (వేంకటశైలంపై ఉన్న సింహం)* అని ప్రస్తావన ఉంది.

చాలాచోట్ల ఈ విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ ధ్యాన ముద్రలో ఉండడం ప్రత్యేకం.
ఇక్కడ అన్నమాచార్యులు కొన్ని సంకీర్తనలు చేశారు.

*శంకుస్థాపన స్థంభం :-*

రాజా తోడరమల్లు ఆనందనిలయం విమాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం.

*పరిమళ అర :-*

శంకుస్థాపన స్థంభంకు వెళ్ళే దారిలో ఉంటుంది. స్వామి వారి సేవకు ఉపయోగించే వివిధ సుగంధ పరిమళాలను భద్రపరిచే అర. ఈ గది గోడపై రాసిన భక్తుల కోరికలను స్వామి తీరుస్తాడని నమ్మకం.

*శ్రీవారి హుండి :-*

భక్తులు కానుకలు వేసే ప్రాంతం.
శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చాలా మార్పులు జరిగిననూ మార్పు చెందని ఒకేఒక స్థలం. దీని క్రింద 
★ _శ్రీచక్రయంత్రం ధనాకర్షణ యంత్రం ఉందని నమ్మకం._

*బంగారు వరలక్ష్మి :-*

హుండి ఎడమగోడపై బంగారు లక్ష్మీ దేవి విగ్రహం కలదు. ఈవిడ భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్మకం.
 
*కటహ తీర్థం :-*

అన్నమయ్య సంకీర్తన భాండాగారం ఎదురుగా హుండీకి ఎడమవైపు ఉన్న చిన్న తొట్టి లాంటి నిర్మాణం. ఇందులో స్వామి వారి పాదాల అభిషేక జలాలు సంగ్రహిస్తారు.

*విష్వక్సేన :-*

హుండి ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చాక ఎడమవైపు ఉండే చిన్న ఆలయం. ఈయన విష్ణు సేనాధ్యక్షుడు. ప్రస్తుతం ఈ విగ్రహం అంకురార్పణ మండపంలో ఉంది.

*ఘంట మండపం :-*

బంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్యగల ప్రదేశం. 
*బ్రహ్మాది సకల దేవతాగణాలు స్వామి వారి సందర్శనకు వేచిఉండే ప్రదేశం.*
 దీనినే మహామణి మండపం అంటారు.

పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. 
హారతి సమయాలలో వీనిని మ్రోగించేవారు. దీనిని *ఘంటపని* అనేవారట. 
ఈ గంటలననుసరించే స్వామి వారి ఆహారసేవనలు పూర్తి అయ్యాయని భావించి తదనంతరం చంద్రగిరి రాజులు ఆహారం సేవించేవారట.

ఇప్పుడు రెండూ ఒకేచోటికి చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం ప్రక్కనే ఉంటాయి.

*గరుడ సన్నిధి :-*

మూలవిరాట్ కు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా గరుడాళ్వారులు గారు ఉన్న మండపం. బంగారు వాకిలి ఎదురుగా, గరుడాళ్వార్‌ మందిరం ఉంది. శ్రీస్వామివారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో సుమారు 5 అడుగుల ఎత్తు ఉన్న గరుడాళ్వారు శిలాప్రతిమ ప్రతిష్టించబడింది. 
ఈ మందిరానికి వెలుపల అంతటా బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్‌ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.

*ద్వారపాలకులు :-*

బంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు.
మహాలఘుదర్శనం ఇక్కడే చేసుకొంటారు.

*3 వ మూడవ ప్రాకారం :-*

*బంగారువాకిలి :-*

శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధికి వెళ్లడానికి అత్యంత ప్రధానమైన ఏకైకద్వారం బంగారువాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారువాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాతం పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం *భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీ మలయప్పస్వామి వారికి* ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది.

*స్నపన మండపం :-*

బంగారువాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే *‘స్నపనమంపం’. క్రీ.శ. 614 లో పల్లవరాణి రామవై ఈ మండపాన్ని నిర్మించి, భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించిందట. ఈ స్నపనమండపాన్నే తిరువిలాన్‌కోయిల్‌* అంటారు. ఆనందనిలయం జీర్ణోర్ధరణ సమయంలో ఈ మండపం నిర్మించబడిందని చెబుతారు.

ప్రతిరోజూ తోమాలసేవ అనంతరం కొలువు శ్రీనివాసునకు ఆరోజు పంచాంగం, చేయవలసిన పూజాదికాలు, క్రితంరోజు హుండీ ఆదాయాది జమ ఖర్చులు వివరిస్తారు.

దీనిలో కుడివైపున అనగా దక్షిణ దిక్కున హుండీ మరియు ఎడమవైపున అనగా ఉత్తర దిక్కున శ్రీవారి ఆభరణాలు భద్రపరిచే గది ఉంటాయి.

*రాములవారి మేడ :-*

స్నపనమండపం దాటగానే ఇరుకైన దారికి ఇరువైపుల ఎత్తుగా కనిపించే గద్దెలు. *”రాములవారిమేడ”*. తమిళంలో *మేడు అంటే ఎత్తయిన ప్రదేశం అని అర్థం.*
ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోంది.

*శయనమండపం :-*

రాములవారి మేడ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయనమండపం. శ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.

*కులశేఖరపడి :-*

శయనమండపానికి, శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరప్పడి. 

*పడి అనగా మెట్టు, గడప అని అర్థం.*

 *ఆనందనిలయం :-*

కులశేఖరపడి అనే బంగారు *గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. దీనినే ” *గర్భాలయం* ” అనికూడా అంటారు. ఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే *ఆనందనిలయ విమానం అంటారు.*

*శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) :-*

★ _*గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న పవిత్ర శిలా దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి.*_ నిలబబడివున్నందున ఈ ఆర్చామూర్తిని *”స్థానకమూర్తి”* అంటారు.
అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ”.... *ధ్రువమూర్తి* ....” అని, *”ధ్రువబేరం”* అని కూడా అంటారు.

శ్రీ స్వామివారి మూర్తి అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపజేస్తున్నది. 
*సుమారు 8 అడుగుల ఎత్తుగల స్వయంభూమూర్తి.* 

ఈ మూలమూర్తికి ప్రతినిధులు గా 
కొలువు *శ్రీనివాస మూర్తి*
*భోగ శ్రీనివాస మూర్తి,*
*ఉగ్ర శ్రీనివాస మూర్తి*
*మలయప్ప స్వామి*

అను ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఇంకా 
సీతారామలక్ష్మణులు
శ్రీకృష్ణ రుక్మిణి లు
చక్రతాళ్వారులు
శాలిగ్రామ శిలలు ఉన్నాయి.
(స్వామికి ప్రతిరుపాలుగా వీనికి నిత్య అభిషేకాలు జరుగుతాయి.)

*ముక్కోటి ప్రదక్షిణం* :-

రాములవారి మేడ చుట్టూ చేసే ప్రదక్షిణం.
వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశినాడు ఈ ద్వారం గుండా దర్శనం ఉంటుంది.

*ఓం నమో నారాయణాయ నమః*

 *సర్వే జనాః సుఖినోభవంతు* 
       ~_సేకరణ_

#TTD #TTDevasthanams

ఎవరు రాశారో తెలిస్తే బాగుండేది.చదవండి. భలే ఉంది.

ఎవరు రాశారో తెలిస్తే బాగుండేది.
చదవండి. భలే ఉంది. 

తెలుగు 52 అక్షరాలను 'అ నుంచి ఱ' వఱకు ఆయా అక్షరాలతో ప్రారంభమయ్యే చిన్న వాక్యాలతో చిన్న పిల్లల చేష్టలను వర్ణిస్తూ, ఒక సరదా సంఘటనను సృష్టించుకొని, ఒక చిన్న కథగా చెప్పినారు ఎవరో కవి.

        (అ)మ్మ చేతి గోరుముద్దలు తినిన పిల్లలు
        (ఆ)నందంగా పాఠశాలకు వెళ్లబోతూ,
        (ఇ)ళ్లలోంచి బయట పడుతూనే
        (ఈ)లల గోలల మోతలతో, 
        (ఉ)రుకులు పరుగులతో హడావుడిగా వెళ్లి, బడిలో
        (ఊ)యల, ఉడతల కథలు హాయిగా వింటారు.
        (ఋ)ణ, సంబంధ ఇక్కట్లు తెలియక
        (ౠ) అని తమాషాగా దీర్ఘం తీసుకుంటూ,
        (ఎ)ఱుపు, నలుపు, పసుపు,తెలుపు రంగులు కల
        (ఏ)డు రంగులు కలబోసిన సీతాకోకచిలుకల్లాగా,
        (ఐ)దారుగురు ఆడ,మగ స్నేహితులు కలిసి సరదాగా
        (ఒ)ప్పుల కుప్ప ఒయ్యారి భామా ఆటాడుకుంటూ,
        (ఓ)డల ఒంటెల కథలు ఒకరికొకరు చెప్పుకుంటూ,
        (ఔ)రా నువ్వెంత? నేనే బాగా చెప్పానని విఱ్ఱవీగుతూ, ఇలా
        (అం)దరూ ఎంతగానో సంతోషిస్తూ, ఆనందంగా
        (అః) అః అహహహా అంటూ ముద్దులొలికే నవ్వులతో ఇంటికి వచ్చేస్తారు.

        (క)డుపాత్రం ఎఱిగిన తల్లి అయ్యోపాపమంటూ, అతి ప్రేమగా
        (ఖ)ర్జూరపు పండ్లు నోటిలో దట్టించి పెట్టగా,
        (గ)బ గబా తినేసిన బుజ్జాయిలు, అలా తినిన
        (ఘ)నాహారం జీర్ణమయ్యే వఱకు ఆడుకుంటూ, ఆటల పాటలను
        (జ్ఞ)ప్తికి తెచ్చుకొని, నెమరేసుకుంటూ ఇంటికొచ్చి, తిని, నిద్దరోతారు.

మళ్లీ మరుసటి రోజు యథాప్రకారంగా, అమ్మ పిలుపుతో లేచి,........

        (చ)క చకా తయారై, పాఠశాలకు వెళ్లిపోయి, ప్రార్థన తర్వాత
        (ఛ)లో అనుకుంటూ తరగతుల్లోకి చేరుకోని, 
        (జ)తలు జతలుగా పిల్లలంతా కలసికట్టుగా వెళ్లి
        (ఝ)మ్మని ఎవరి సీట్లలో వాళ్లు సర్దుకొంటుండగా, మాస్టారొచ్చి
        (ఞ) అక్షరాన్ని వ్రాయమంటే, రాక, బిక్కమొహం వేస్తారు. 

        (ట)క్కుటమారు విద్యలనారితేరిన, టక్కరి తుంటరి పిల్లలు
        (ఠ)పీ, ఠపీమని బల్లలపై శబ్దాలు చేస్తుంటే,
        (డ)ప్పుల మోతల్ని మించిన శబ్దాలను విన్న మాస్టారు
        (ఢ)క్కాలు బద్దలు కొట్టినట్లుగా ఎవర్రా అది, అని అరుస్తూండగానే,
        (ణ)ణణణణణ ణ, ణ, ణ అని ఇంటి గంట మోగిన క్షణంలోనే...

        (త)లుపులు తోసేసుకుంటూ,
        (థ)పా థపా మనే శబ్దాలు చేసుకుంటూ,
        (ద)బ్బు దబ్బున తరగతిలోని పిల్లలందరూ
        (ధ)న ధనామంటూ కాళ్ల నడకల శబ్దాల ప్రతిధ్వనులతో 
        (న)లువైపులా పరికిస్తూ, గుడి లాంటి బడి గడప దాటిన పిల్లలు,

        (ప)రుగు పరుగున కొందరు,
        (ఫ)స్టు నేనంటే నేనని పోటీపడుతూ ఇంకొందరు, 
        (బ)యటకు పూర్తిగా వచ్చేసి,
        (భ)లే భలే, ఎవరు ఇళ్లకు ముందుగా చెరుతారని పందెంతో కొందరు,
        (మ)న స్కూలు, 'చాలా మంచి స్కూలబ్బా' అని, ఇంకొందరు,

        (య)థాలాపంగా, ఏ హావభావాలూ లేకుండా కొందరు,
        (ర)య్ రయ్ మంటూ పిచ్చి శబ్దాలతో ఇంకొందరు,
        (ల)గెత్తుకొని, తోటి పిల్లలను తోసేసుకుంటూ,
        (వ)చ్చి పోయే వ్యక్తులను ఓర కంటితో చూస్తూ, దారిపై వచ్చిపోయే
        (శ)కటములను తమాషాగా తప్పించుకుంటూంటే,
        (ష)రా మామూలే, 'వీళ్లెప్పుడూ మారర్రా' అని కొందరనుకుంటుండగా,
        (స)రదాగా అల్లరి చేసుకుంటూ, ఆనందంతో
        (హ)ర్షాతిరేకాలు మిన్ను ముట్టగా, గందరగో-
        (ళ) కోలాహల కలకలాతో రేపు ఆదివారం, సెలవు అనుకుంటూ
        (క్ష)ణాలలో వారి వారి ఇళ్లకంతా, మన కొ-
        (ఱ)కరాని కొయ్యలందరూ తల్లుల ఒడిలోకి చేరి తరిస్తారు.

ఇలా, తమాషాగా 'అఆ ఇఈ లతో, కఖ గఘ లతో' అందమైన ఒక సంఘటనను వర్ణించి చెప్పుకొని ఆనందించవచ్చు. ఇది చదివిన ఉత్సాహవంతులు, భాష మీది 
అభిమానంతో, తెలుగు భాష మీది పట్టుతో, అచ్చులతో హల్లులతో ఇంకా ఎన్నెన్నో అర్థవంతమైన, అందమైన కథలను, సంఘటనలను సృష్టించుకొని, వారి ప్రతిభకు సాన పెట్టవచ్చు. అలాగే, మీ మీ పిల్లలకు ఇలా వ్రాయలని మార్గ దర్శకులు కావచ్చు.

అతి సుందరమైన, సుమధురమైన, సౌమ్యమైన, కమ్మదనం కలబోసిన, తేట తేట తెలుగును, మృదుత్వంతో కూడిన తెలుగునే మాట్లాడండి. తెలుగులోనే వ్రాయండి. తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి. తేనె లొలుకు తెలుగు తియ్యందనాన్ని తనివితీరా జుఱ్ఱుకొని, మనస్పూర్తిగా ఆస్వాదించండి, ఆస్వాదింపజేయండి.

సంపూర్ణ ఆరోగ్యం సిద్దించుట కొరకు ఆయుర్వేద సూత్రాలు

సంపూర్ణ ఆరోగ్యం సిద్దించుట కొరకు ఆయుర్వేద సూత్రాలు - 

 * ప్రాతఃకాలం నందే నిద్ర నుండి మేల్కొనవలెను . బ్రహ్మ ముహూర్తం సరైన సమయం . 

 * ప్రాతఃకాలం నందు నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చటి నీటిని తాగవలెను దీనివలన మలమూత్రాలు సాఫీగా సాగును. 

 * నిద్ర లేచిన వెంటనే మలమూత్ర విసర్జన చేయవలెను . మలమూత్రాలను బలంగా ఆపుట వలన రోగాలు సంప్రాప్తిస్తాయి .

 * దంతధావనం నందు నాలుకను , దంతములను శుభ్రపరచుకోవలెను . నల్లతుమ్మ చెట్టు బెరడు కషాయం నోటి యందు క్రిములను తొలగించు గుణము కలదు 

 * దంతముల పాచిని తొలగించుట కొరకు వనమూలికలతో చేసినటువంటి దంత చూర్ణంని వాడవలెను . చిగుళ్ల యందు వ్యాధులు ఏమైనా ఉన్నచో చిగుళ్లకు నువ్వులనూనె రాయవలెను . 

 * స్నానానికి ముందు నువ్వులనూనెతో మర్ధించుకొని కొంతసేపు నీరెండలో ఉండవలెను . నువ్వులనూనె బదులు కొబ్బరినూనె లేదా ఆవాలనూనె వాడుకోవచ్చు . ఆవాల నూనె చాలా శ్రేష్టం . ఔషధ తైలాలు కూడా వాడవచ్చు . 

 * శరీరంకి నూనె మర్దించుకొనుట వలన చర్మం మృదువుగా , కోమలంగా తయారగును. 

 * కీళ్లు , కండరాలు కదలికలు మంచిగా జరుగును. 

 * రక్తప్రసరణ మంచిగా జరుగును. చర్మం ద్వారా , మలపదార్థాలు త్వరగా తొలగించబడును. 

 * వ్యాయమం చేయవలెను . 

 * స్నానం గొరువెచ్చటి నీటితో చేయవలెను .

 * గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వలన జఠరాగ్ని పెరుగును . రోమకూపములు , స్వేదరంధ్రములు , చర్మము శుభ్రపరచబడి శరీరం నిర్మలంగా ఉండును. 

 * నివశించే ప్రదేశముని బట్టి, కాలం మరియు అలవాట్లని అనుసరించి ఆహారం నిర్ణయించవలెను . తీపి , పులుపు , ఉప్పు, కారం , చేదు , వగరు అను ఆరు రుచులు కలిగి ఉండు ఆహారముని తీసుకొనవలెను . 

 * జీర్ణశక్తికి అనుకూలంగా ఉండు ఆహారముని నిర్ణయించుకొని తీసికొనవలెను . 

 * భోజనం చేయుటకు 10 - 15 నిమిషములు ముందు పచ్చి అల్లం ముక్కలను కొద్దిగా ఉప్పుతో కలిపి తినవలెను . 

 * గట్టిగా ఉండు పదార్థాలను బాగుగా నమిలి తినవలెను . 

 * సాధ్యం అయినంత వరకు ఆహారసేవన తరువాత పెరుగు లేదా మజ్జిగ సేవించవలెను .

 * బాగుగా చల్లగా , వేడిగా ఉన్నటువంటి ఆహారపదార్థాలు తీసుకోరాదు . 

 * ఆహారం తినుటకు 15 నిమిషాల లోపు నీరు తీసుకోరాదు . తిన్నవెంటనే అధిక మోతాదులో నీటిని తీసుకోరాదు . మధ్యమధ్యలో కొంచం కొంచం నీటిని తీసుకోవచ్చు . 

 * ఆలస్యముగా జీర్ణం అయ్యేటువంటి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోరాదు 

 * భోజనం చేసిన వెంటనే అధిక శ్రమ చెయ్యరాదు . భోజనం చేసిన వెంటనే కొంత సమయం విశ్రాంతి తీసికొనవలెను . 

 * తూర్పు , దక్షిణం వైపు తల యుంచి నిద్రించవలెను .

 * నిదురించే గది అత్యంత స్వచ్ఛముగా గాలి వీచే విదముగా ఉండవలెను . 

 * నిద్రించే మంచం ఎత్తు , వంపులు లేకుండా స్థిరంగా ఉండవలెను . 

 * గది వాతావరణం దుష్ప్రభావం లేకుండా ఉండవలెను . 

 * మెదడుని ఉత్తేజిత పరుచు పనులు అనగా గట్టిగా చదువుట , ఆలోచించుట , మద్యపానం , కాఫీ, టీలు సేవించుట మొదలగు వాని తరువాత వెంటనే పడుకోరాదు . 

 * రోజుకి కనీసం 7 గంటలు నిద్రించవలెను . 

 * పగటినిద్ర మంచిది కాదు కేవలం ఎండాకాలం నందు మాత్రమే పగటి సమయం నందు నిద్రించవలెను . 

 * నింద్రించుటకు ముందు అరికాళ్లకు , అరచేతులకు తైలం మర్దించుట వలన కలలు నియంత్రించబడును . అనగా పీడకలలు నియంత్రించబడును. 

 * అధికంగా మైథునం చేయుట వలన శరీరముకు హాని కలుగును. దీనివలన క్షయ మొదలగు వ్యాధులు కలుగును .

 * మైథునం రాత్రి మొదటి భాగం నందు చేయుట ఉత్తమం . తగినంత విశ్రాంతి లభించును. 

 * అసహజ మైధున కర్మలు రోగాలకు మూలకారణం . 

 * వ్యాధులకు చికిత్స తీసుకునే సమయంలో మైధున ప్రక్రియ నిలిపివేయవలెను . లేనిచొ శరీర రోగ నిరోధక శక్తి సన్నగిల్లును. 

 * మూత్రము ఆపుట వలన మూత్రము పోయుటలో బాధ కలుగును. మూత్రములో రాళ్లు ఏర్పడును . మూత్రాశయం యొక్క కండరాలు పటుత్వము కోల్పోవును. మూత్రమార్గంలో వాపు , మంట కలుగును. అందువలన బలవంతంగా మూత్రాన్ని ఆపరాదు . 

 * మలవిసర్జన ఆపుట వలన కడుపులో నొప్పి , కడుపుబ్బరం , అజీర్ణం , అపానవాయువులు , తలనొప్పి , కడుపులో పుండ్లు వంటి సమస్యలు మొదలగును . కావున మలవిసర్జన ఆపకూడదు.

 * శుక్రం బయల్పడే సమయంలో నిరోదించినచో శుక్రం గడ్డలు గడ్డలుగా రావటం వృషణాలలో నొప్పి , సంభోగం చేయు సమయంలో నొప్పి కలుగును. కావున శుక్ర వేగాన్ని నిరోధించరాదు . 

 * వాంతిని ఆపుట వలన దద్దుర్లు , తలతిరగడం , రక్తహీనత , కడుపులో మంట , చర్మరోగాలు మరియు జ్వరం కలుగును . కావున వాంతులను బలవంతంగా అపరాదు. 

 * తుమ్ములను ఆపుట వలన జలుబు , ముక్కునుండి అదేపనిగా నీరు కారే పీనస రోగం , తలనొప్పి , పార్శ్వపు నొప్పి మొదలగు సమస్యలు కలుగును. ముక్కులో ఉండు మలినాలు , అనవసర పదార్థాలను తొలగించుటకు సహాయపడతాయి. తుమ్ములను బలవంతంగా ఆపరాదు . 

 * త్రేపులను ఆపడం వలన ఎక్కిళ్లు , ఛాతిలో నొప్పి , దగ్గు , ఆకలి మందగించడం , రుచి లేకపోవుట మొదలగు సమస్యలు సంభంవించును. 

 * ఆవలింతలు ఆపుట వలన కండ్లు , గొంతు , చెవి , ముక్కు సంబంధ వ్యాధులు ఉత్పన్నం అగును . 

 * ఆకలి , దప్పిక శరీరంకు కావలసిన పోషకాంశాలు మరియు నీటి ఆవశ్యకత ని తెలియచేస్తాయి . వీటిని అతిగా ఆపుట వలన శరీరంకు అందవలసిన పోషకాలు అందక శరీరం క్షీణించిపోతుంది. శరీరం కావాల్సిన రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల సాంక్రమిక వ్యాధులు సంభవిస్తాయి . శరీరం పొడిగా మారును . 

 * కన్నీటిని ఆపుట వలన మనసిక వ్యాధులు , ఛాతిలో నొప్పి , తలతిరుగుట మరియు జీర్ణకోశ వ్యాధులు కలుగుతాయి . 

 * శ్వాసప్రక్రియని ఆపుట వలన శ్వాసకోశ వ్యాధులు , గుండెజబ్బులు కలిగి మనిషి ని ఉక్కిరిబిక్కిరి చేయును . ఒక్కోసారి మరణం కూడా కలుగును. 

 * నిద్రని ఆపుట వలన నిద్రలేమి , మానసిక వ్యాధులు , జీర్ణకోశ వ్యాధులు , మరియు జ్ఞానేంద్రియ వ్యాధులు సంభంవించును. 

          పైన చెప్పిన వాటిని అధారణీయ వేగాలు అని ఆయుర్వేదంలో పిలుస్తారు . ఇవి మొత్తం 13 రకాలు గా విభజించారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా ఆపరాదు . 

  ఈ నియమాలు నిబద్ధతతో పాటించటం వలన అనారోగ్యాలు కలగకుండా చూసుకోవచ్చు. 


Thursday, November 14, 2024

గోపాష్టమి...**గోపాష్టమి ఉత్సవం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు*

*గోపాష్టమి...*

*గోపాష్టమి ఉత్సవం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు*

*ఇంటింటా ఆవు, గ్రామ-గ్రామము గోశాల, ఇది మన ఆరోగ్యశాల.*

భారతీయ సంస్కృతి అనేది పండుగలు మరియు పండుగల సంస్కృతి, దీని కారణంగా సమాజంలో చైతన్యం మరియు కొత్త జీవితం ఉంటుంది. వేడుక ఉత్సాహాన్ని, ఆనందాన్ని మరియు ప్రేమను సృష్టిస్తుంది. ఉత్సవాలు, పండగలు, పర్వాలు ప్రయోజనం లేనివి కావు, ఏదో ఒక సంఘటన, కథ, కథనంతో సమాజంలో పవిత్రమైన సందేశం ఇచ్చేలా పనిచేస్తాయి. భారతదేశంలో ప్రతిరోజూ ఏదో ఒక పండుగ, పుట్టినరోజు, వర్ధంతి లేదా చరిత్రలోని వివిధ సంఘటనలకు సాక్షి అయినప్పటికీ, ఇంకా కొన్ని పండుగలు సమాజంలో సహజంగా జరుగుతున్నాయి. భారతీయ సంస్కృతి.. గో సంస్కృతి యొక్క స్వరూపము. వివిధ పండుగలలో, గోవులను స్మరించుకుంటాము, పూజిస్తాము మరియు గోవుకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తాము. ఇటువంటి మహాపర్వములలో గోపాష్టమి ఒకటి. 

ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుడు మొదటిసారిగా చెప్పులు లేకుండా గోసంరక్షణకు వెళ్ళాడు. తల్లి యశోద ఈ రోజున కృష్ణుని చేతికి సంకల్ప దారాన్ని కట్టి, కర్రలు మరియు నల్ల కమలం సమర్పించి, తన ప్రియమైన కృష్ణుడిని గోసంరక్షణ కోసం అడవికి పంపింది. ఆ రోజు నుండి కృష్ణుడిని గోపాల్ అని పిలుస్తారు. ఆ రోజు గోప అష్టమి తిథి అంటే *కార్తీక శుక్ల పక్ష అష్టమి.* ఈ తిథిని గోపాష్టమి అంటారు. 

*కార్తీక శుక్ల పక్షం పాడ్యమి నుండి సప్తమి తిథి వరకు గోవర్ధన పర్వతానికి శ్రీకృష్ణుడు మరియు గోరక్షకులు పూజ నిర్వహించారు.* శ్రీకృష్ణుడు ఇంద్రుడితో చేసిన పోరాటమే ఈ కథ సారాంశం. ఇంద్రుడు అహంకారభావం లేకుండ గోసంరక్షకుడు కృష్ణుని శరణువేడుతాడు.

గోవర్ధన్ అంటే గో వంశం వృద్ధి చెందడం మరియు గోమూత్రం + సంపద యొక్క మహత్వము ఈ రోజున సమాజంలో తెలిసింది. ఆవు పేడతో గోవర్ధన పర్వతాన్ని తయారు చేసి పూజించడం అంటే ఆరోగ్యకరమైన గో ఆధారిత వ్యవసాయం కోసం ప్రతిజ్ఞ చేయడం. 

*🚩గోపాష్టమి రోజున ఉదయాన్నే ఆవును, దూడను పూజించాలి.🏹* 
ఆవుకి స్నానం చేయించి, కుంకుమ, పసుపు మొదలైన వాటిని ఆవు శరీర భాగాలకు రాసి, గోవును అలంకరిస్తారు. గోవుకు బెల్లం, అరటిపండ్లు పెట్టి, బట్టలు, నీళ్లతో పూజలు చేయాలి. హారతి ఇవ్వాలి. గడ్డిని తినిపించాలి. ప్రదక్షిణలు చేసిన తర్వాత గోవుతో పాటు కొంతదూరం నడవాలి. 

శాస్త్రీయ దృక్కోణంలో, గోవు-గోవంశ విషయంలో ముఖ్యమైన అంశాలు.

*ఆవులో చాలా సానుకూల శక్తి ఉందని శాస్త్రీయ పరిశోధనలో తేలింది.*

*ఆవు వెనుక వెన్నెముకలో ఉండే సూర్యకేతు నాడి హానికరమైన రేడియేషన్‌ను అడ్డుకోవడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతుంది. ఈ సూర్యకేతువు నాడి సర్వ రోగాలను నశింపజేస్తుంది, సర్వ విషనాశకము.*

*ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్. కెఎన్ ఉత్తమ్ ప్రకారం, ఆవు పేడ న్యూక్లియర్ రేడియేషన్‌ను నాశనం చేస్తుంది. ఆవు పేడ ఆల్ఫా, బీటా మరియు గామా కిరణాలను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.*

*సూర్యకేతువు నాడి సూర్యకిరణాల నుండి వెలువడే శక్తిని గ్రహిస్తుంది, అది బంగారంగా ఉత్పత్తి అవుతుంది. ఆ బంగారం నేరుగా ఆవు పాలు మరియు మూత్రంలో చేరుతుంది. అందుకే ఆవు పాలు, మూత్రం లేత పసుపు రంగులో ఉంటాయి. ఈ పసుపు రంగు కెరోటిన్ మూలకం వల్ల వస్తుంది, ఇది క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులను నివారిస్తుంది.*

*ఈ బంగారం ఆవు పేడ ద్వారా పొలాలకు వెళ్తుంది అందుకే 'గోమయే వసతే లక్ష్మీః' అంటారు.*

*నలుపు రంగు ఆవు పాలు వాత సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి. పసుపు రంగు ఆవు పాలు పిత్త మరియు వాత రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు.*

*ఆవు పేడలో విటమిన్ బి-12 పుష్కలంగా ఉంటుంది. ఆవు పేడను కాల్చడం వల్ల క్రిములు, దోమలు నశిస్తాయి.*

*ఆవు నెయ్యితో హవాన్‌పై రష్యాలో శాస్త్రీయ ప్రయోగాలు జరిగాయి. ఒక తులం (10 గ్రాములు) ఆవు నెయ్యితో యజ్ఞం చేయడం ద్వారా ఒక టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది.*

*గోవు ఆధారిత వ్యవసాయం (సేంద్రీయ వ్యవసాయం) - ఉపాధి యోగ్యమైనది, ఆర్థికంగా ఫలోపేతం చేసేది, ఆరోగ్యాన్ని ప్రోత్సహించేది మరియు పర్యావరణ పరిరక్షణి.*

*ఒక గ్రాము దేశవాళి ఆవు పేడలో కనీసం 300 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బాక్టీరియం పొలాల్లోని అనేక సూక్ష్మక్రిములను చంపడం ద్వారా నేలను సారవంతం చేస్తుంది. భారతీయ ఆవు పేడతో తయారైన ఎరువు వ్యవసాయానికి అత్యంత అనుకూలమైన సాధనం.* భారతీయ ఆవు పేడ వ్యవసాయానికి అమృతంగా పరిగణించబడుతుంది. ఆవు పేడ, గోమూత్రం, వేప, దాతుర, ఆకు ఆకులు మొదలైన వాటిని కలిపి తయారుచేసే పురుగుల మందుతో పొలాలను ఎలాంటి కీటకాల నుండైన కాపాడవచ్చు. 

★ఆవు మూత్రంకు గల క్యాన్సర్ ని నివారించే గుణాలపై అమెరికా నుంచి భారత్ ఇప్పటి వరకు 6 పేటెంట్లు పేటెంట్లు పొందింది.

★అందరి సేవలో సమస్తమూ ఉపయోగపడే ఏకైక జంతువు ఆవు. ఆవు పాలే కాకుండా మూత్రం, ఆవు పేడ, నెయ్యి, పెరుగు, మజ్జిగ, వెన్న మొదలైనవన్నీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. 

★గ్యాస్ మరియు విద్యుత్ సంక్షోభం యుగంలో, ఈ రోజుల్లో గ్రామాల్లో గోబర్ గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ప్రారంభమైంది. గోబర్ గ్యాస్ ప్లాంట్‌లో గ్యాస్ తర్వాత మిగిలిపోయిన పదార్థాన్ని వ్యవసాయానికి సేంద్రీయ ఎరువును తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మొక్కల నుండి సుమారు 70 మిలియన్ టన్నుల కలపను ఆదా చేయవచ్చు, ఇది సుమారు 30 మిలియన్ చెట్లకు ప్రాణం పోస్తుంది. దీనితో పాటు, విడుదలయ్యే సుమారు 30 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను కూడా ఆపవచ్చు. 

★ఆవు చనిపోయిన తర్వాత కూడా 45 ఏళ్లపాటు ఆవు కొమ్ములు సురక్షితంగా ఉంటాయి. ఆవు చనిపోయిన తరువాత, దాని కొమ్మును నాణ్యమైన ఎరువును తయారు చేయడానికి పురాతన కాలం నుండి ఉపయోగించారు.

★ఆవు మూత్రం మరియు పేడ పంటలకు చాలా ఉపయోగకరమైన క్రిమిసంహారకాలుగా నిరూపించబడ్డాయి. 

★ఆవు పేడ మరియు గోమూత్రాన్ని పురుగుమందులుగా ఉపయోగించేందుకు పరిశోధనా కేంద్రాలను తెరవవచ్చు, ఎందుకంటే రసాయనిక ఎరువుల దుష్ప్రభావాలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి ఇవి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీని బ్యాక్టీరియా అనేక ఇతర సంక్లిష్ట వ్యాధులలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆవు మూత్రం తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచుతుంది. తక్కువ ధర, అధిక దిగుబడి, సురక్షితమైన ఉత్పత్తి, ఆరోగ్యవంతమైనది. 

★వ్యవసాయంలో, రసాయన ఎరువులు మరియు పురుగుమందులకు బదులుగా ఆవు పేడను ఉపయోగించడం ద్వారా, భూమి యొక్క సారవంతం పెరుగుతుంది, ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు పండించే కూరగాయలు, పండ్లు లేదా ధాన్యం పంట నాణ్యత కూడా చాలా బాగావుంటుంది. 

★ఎద్దులతో పొలందున్నుతున్నప్పుడు భూమిపై పడిన పేడ, మూత్రం వల్ల భూమి సహజంగానే శక్తివంతమౌతుంది. 

★ప్రకృతిలో 99% కీటకాలు ప్రయోజనకరమైనవి. ఆవు మూత్రం మరియు పులియబెట్టిన మజ్జిగ నుండి తయారైన పురుగుమందులు ఈ సహాయక కీటకాలపై ప్రభావం చూపవు. 

★ఒక ఆవు పేడ 7 ఎకరాల భూమిని సారవంతం చేస్తుంది మరియు మూత్రం 100 ఎకరాల భూమిని చీడపీడల నుండి కాపాడుతుంది. కేవలం 40 కోట్ల ఆవు పేడ మరియు మూత్రంతో భారతదేశం 84 లక్షల ఎకరాల భూమిని సారవంతం చేయవచ్చు. 

★గో-వ్యవసాయము అమృతం వంటిది, చాలా ఉపయోగకరమైన బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది, ఇది పంట నాణ్యత మరియు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.

★చర్మ వ్యాధులలో ఆవు పేడ యొక్క నివారణ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. 

గోపాష్టమి రోజున….

★గోశాలలో. గోసంరక్షణ యజ్ఞము, సేంద్రీయ వ్యవసాయం,సేంద్రీయ ఆహారం, పండ్లు మరియు కూరగాయలు, మరియు ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలపై సెమినార్లు నిర్వహించవచ్చు.

★"నా ఆవు చాలా అందంగా ఉంది", "నా ఎద్దుల జంట చాలా బలమైనది" మరియు ఆవు పేడ యొక్క గోవర్ధన్ పర్వతం వంటి పోటీలను కూడా నిర్వహించవచ్చు, 

★గోమాతను అలంకరించే పోటీలు, గోమాత ముగ్గుల పోటీలు.

★అవకాశం వున్నచోట్ల ఆవు లేదా ఆవుల శోభాయాత్ర(ఊరేగింపు) నిర్వహించి ప్రతి ఇంటి దగ్గర ఆవును పూజించవచ్చు.

★భారతీయ పండుగలు గోశ్రధ, గోభక్తితో కూడి ఉంటాయి. మన కర్తవ్యాన్ని నిర్వర్తించినట్లైతే ఈ పండగలు ప్రాపంచిక మరియు పారమార్థిక సుఖాలను కలగజేస్తాయి.

★గోశాలలో మరియు ఇండ్లలో గోవులు వుండేచోట శ్రీకృష్ణుని పెద్ద చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి. 

★మరొక చోట ఎద్దులు, కోడె దూడలు ఉండేచోట, నాగలి ధరించి వుండే బలరాముని పెద్ద చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి.

★మూడవ చోట శివుని చిత్రపటాన్ని ఉంచాలి.
ఈ మూడు చిత్రాలు/విగ్రహాలు ఏర్పాటుచేసినట్లైతే గోమాతతోపాటు త్రిమూర్తుల ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. 

★మన లక్ష్యం... మాదకద్రవ్యాల రహిత భారతదేశం, ఉపాధి గల యువత, రుణ విముక్త రైతులు, ఆవు-పాలపదార్ధల వాడే భారతదేశం.. ఇవన్నీ ఆవును రక్షించే సాధనాలు

రండి - పదండి - వెళ్దాం - గ్రామం వైపు - గోవు వైపు.

మధుమేహం గురించి సంపూర్ణ వివరణ -

మధుమేహం గురించి సంపూర్ణ వివరణ - 

        మధుమేహము మహారోగములలో ఒకటిగా పేర్కొనబడినది . అధిక ప్రమాణమున మాటిమాటికి మూత్రము ఈ వ్యాధి నందు వెడలుటచే ఇది మేహరోగం అనబడును. ఈ రోగం జనించుటకు ప్రధానకారణాలు గురించి ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అనేక కారణాలు తెలియజేసారు. 

              సుఖముగా ఉండు ఆసనము పైన ఆసీనుడై యుండి ఏ పనిచేయక సోమరిగా ఉండుట , ఎక్కువసేపు సుఖముగా నిద్రించుట , పెరుగు , జలచరమాంసాదులు , పాలు , బెల్లం , తీపివస్తువులు , కఫవర్ధక పదార్థాలు ఎక్కువుగా సేవించుట , కొవ్వుపదార్ధాలు అధికంగా తీసుకొనుట , శరీరానికి శ్రమ లేకపోవుట , పగటినిద్ర మరియు శీతల , మధుర , స్నిగ్ధ ద్రవముగా ఉండు అన్నపానాదులు అధికంగా సేవించుట వలన ప్రమేహము వచ్చును. 

              ఆరోగ్యవంతుని యందు ఒక పగలు , రాత్రి అంటే 24 గంటల కాలమున విసర్జించబడు మూత్రము యొక్క ప్రమాణము 800 - 2500 మీ.లీ గా ఉండును. పైన పేర్కొనబడిన సాధారణ ప్రమాణము కన్నా అధికముగా మూత్రవిసర్జన జరిగినచో అది ప్రమేహం అనబడును. ఉదాహరణకు ఉదకమేహము ( Daibetes insipidus ) అను సమస్య నందు 5 - 10 లీటర్లు మూత్రము 24 గంటల కాలంలో విసర్జించబడును. ప్రమేహము నందు మూత్రము నిర్మలముగా ఉండక కలుషితమై కలకపరి ఉండును. 

     
         మధుమేహము కారణములను ఆధారం చేసుకుని రెండు విధములుగా పేర్కొనబడినది . 

      1 - సహజము .

      2 - అపథ్య నిమిత్తజము . 

 * సహజము - 

        సహజముగా కలుగు ప్రమేహము తల్లితండ్రుల బీజదోషము వలన కలుగును. శిశువు జన్మకు కారణం అయిన బీజము , శుక్రము యొక్క దోషములు సామాన్యముగా సహజ వ్యాధులకు కారణము. కావున మధుమేహము కూడా బీజదోషముల వలనే జనించును. 

 * అపథ్య నిమిత్తజము - 

        ఇది బీజదోష రహితముగా , జన్మించిన తరువాత అపథ్య ఆహార అలవాట్ల వలన జనియించును. ప్రమేహవ్యాధి జనియించినప్పుడు సరైన చికిత్స చేయక ఉపేక్షించిన యడల ప్రమేహములు ( 20 రకాలు ) అన్నియు మధుమేహములుగా మారును. 

                         మధుమేహము నందు మూత్రము కషాయ , మధుర రసములు కలిగి తెలుపుగా ఉండును. ఈ వ్యాధిని నిర్ధారించుటలో మూత్రపరీక్ష మరియు రక్తపరీక్షలు దోహదపడును. ఈ పరీక్షల ఆధారముగా వ్యాధితీవ్రత మరియు చికిత్సా ఫలితములను అంచనా వేయుట సాధ్యపడును. 

       కడుపులో చిన్నపేగు మొదటి భాగమునకు ( Duodenum) , పిత్తాశయం ( Gallblader ) నకు మధ్యభాగములో పైత్యనాళము (Bileduct ) పక్కగా క్లోమము ( Pancrease ) అను వినాళగ్రంధి ఉండును. ఇందులో ఎంజైములు మరియు హార్మోనులు ఉండును. ఎంజైములు ఆహార జీర్ణక్రియలో పాల్గొనును. ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్ అను రెండు హార్మోనులు ఈ క్లోమగ్రంధి యందు ఉండి రక్తములోని గ్లూకోజ్ ప్రమాణమును నియంత్రించుతూ శరీర అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడును . మధుమేహ రోగికి పలుకారణాల వలన ఇన్సులిన్ అనే హార్మోన్ చురుకుగా లేకపోవడం , కావలిసినంత ప్రమాణముగా అందుబాటులో లేకపోవటం వలన రక్తములో గ్లూకోజ్ స్థాయులు పెరుగును . రక్తములో అధికంగా ఉన్న గ్లూకోజ్ మూత్రపిండాల ద్వారా మూత్రములో బయటకు వెళ్ళును. ఈ విధముగా శరీరంలో పలు జీవక్రియలకు ఆధారమైన మరియు శక్తిని సమకూర్చే గ్లూకోజ్ నిలువలు క్రమేణా తరిగిపోవడం మరియు శరీర అవయవాలు ఉపయోగించుటకు వీలులేని వాతావరణము నెలకొనుట మూలముగా క్రమముగా మధుమేహరోగి కండరాలు క్షీణించి నరముల బలహీనత , కంటిచూపు తగ్గుట మరియు మూత్రపిండముల సామర్ధ్యము తగ్గుట మొదలగు ఉపద్రవములతో మరణించును . సక్రమమైన ఆహారవిహారాలు , క్రమం తప్పకుండా ఔషధసేవన పాటించడం వలన రోగికి వ్యాధి లొంగుబాటులో ఉండి ఆయువును పెంపొందించును. 

                  మధుమేహా సమస్య నివారణలో ఔషధ సేవనతోపాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మీకు తినవలసిన మరియు తినకూడని ఆహారనియమాల గురించి వివరిస్తాను. 

   తినవలసిన ఆహారపదార్ధాలు - 

       యవలు , గోధుమలు , కొర్రలు , రాగులు , పాతబియ్యపు అన్నం , పెసలు , చేదు గల కాయగూరలు , మరియు ఆకుకూరలు , చేదుపోట్ల , కాకరకాయ , మెంతులు , దొండకాయ , వెలగపండు , మారేడు , నేరేడు విత్తనాలు , ఉసిరిక పండు , పసుపు , అడివిమాంస రసములు ఎక్కువుగా వాడవచ్చు . 

  తినకూడని ఆహార పదార్దాలు - 

      కొత్త బియ్యపు అన్నం , అధిక నూనె కలిగిన ఆహారాలు , బెల్లపు పదార్దాలు , నెయ్యి వంటకములు , మద్యము , గంజి , చెరుకు రసము , పుల్లటి పదార్థాలు , చింతపండు , పెరుగు , వెన్న , జున్ను , దుంప కూరలు , కొవ్వులు అధికంగా ఉండు పదార్దాలు వాడకూడదు. అదేవిధముగా పగలు నిద్రించరాదు , ధూమపానం , రాత్రి సమయములో మేల్కొని ఉండటం నిషిద్దం . మలమూత్ర వేగాలను నియంత్రించరాదు.   

        పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినండి. పలుచటి మజ్జిగని మాత్రమే వాడవలెను. శరీరం నందు వేడిమి పెరగకుండా జాగ్రత్తవహించండి. నేను రాసిన గ్రంధాల నందు పెద్ద పెద్ద అనారోగ్యాలకు కూడా చిన్నచిన్న చిట్కాల సహాయంతో తగ్గించుకునే విధముగా అత్యంత సులభయోగాలు ఇచ్చాను . ప్రతి ఇంటి నందు ఉండవలసిన గ్రంధములు . తప్పక చదవగలరు.

             * సంపూర్ణం * 

  
     

Tuesday, November 12, 2024

హరేకృష్ణ మహామంత్రం* *యొక్క విశిష్టత*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

          *హరేకృష్ణ మహామంత్రం*
                 *యొక్క విశిష్టత*
                 ➖➖➖✍️

```అందరూ దయచేసి 2 ని. సమయం వెచ్చించి ఈ క్రింద ఇచ్చిన విశ్లేషణ పూర్తిగా చదవండి...

‘బ్రహ్మాండ పురాణం’ ప్రకారం హరేకృష్ణ మహామంత్రం యొక్క శక్తి అపరిమితమైనదిగా వివరించబడింది.```

*మహామంత్రం*…

"హరేకృష్ణ హరేకృష్ణ
కృష్ణకృష్ణ హరేహరే
హరేరామ హరేరామ
రామరామ హరేహరే!”```

కేవలం ఒకసారి "రామ" నామాన్ని జపిస్తే 1000 సార్లు "విష్ణు" నామాన్ని జపించినప్పుడు వచ్చే ఫలితం వస్తుంది.

ఒకసారి "కృష్ణ" నామాన్ని జపిస్తే 3 సార్లు "రామ" నామాన్ని జపించినప్పుడు కలిగే ఫలితం వస్తుంది. 

"హరేకృష్ణ" మహామంత్రంలో నాలుగు సార్లు "కృష్ణ" నామం మరియు నాలుగు సార్లు "రామ" నామం ఉన్నాయి.

అంటే "హరేకృష్ణ" మహామంత్రంలో నాలుగు సార్లు "కృష్ణ" నామాన్ని జపిస్తాము, అందువల్ల 12 సార్లు "రామ" నామాన్ని జపించిన ఫలితం వస్తుంది.

ఆ విధంగా మహామంత్రంలో 4 "కృష్ణ" నామాలు (అంటే 12 "రామ" నామాలతో సమానం) మరియు మరో 4 "రామ" నామాలు ఉన్నాయి. అంటే మొత్తం కలిసి 16 "రామ" నామాలు ఉన్నట్లు.

1"రామ" నామం =1000 "విష్ణు" నామాలు

16 "రామ" నామాలు =16000 "విష్ణు" నామాలు.

ఒక్క మహామంత్రంలో 16 "రామ" నామాలు = 16000 "విష్ణు" నామాలు ఉన్నట్లు.

అంటే ఒక్కసారి "హరేకృష్ణ" మహామంత్రం జపము చేసినట్లయితే 16,000 సార్లు "విష్ణు" నామాలు జపించడంతో సమానం అవుతుంది.

ఒక మాల జపము అనగా 108 సార్లు జపించడం.

ఒక మాల "హరేకృష్ణ" మహామంత్రం జపము చేసినట్లయితే 108×16000= 17,28,000 సార్లు విష్ణు నామాలు జపించడంతో సమానం అవుతుంది.

16 మాలలు ‌ హరేకృష్ణ మహామంత్రం జపము చేసినట్లయితే 2,76,48,000 సార్లు "విష్ణు" నామాలు జపించడంతో సమానం అవుతుంది.

మన ఆయుష్షు చాలా తక్కువ. అందుకే మనం తక్కువ సమయంలో ఎక్కువ భక్తి, పుణ్యం కలుగాలంటే అపరిమితమైన శక్తి కలిగిన హరేకృష్ణ మహామంత్రం జపము, సంకీర్తన చేద్దాం. భగవద్ధామం చేరుకుందాం, శాశ్వతమైన ఆనందం పొందుదాం.```

*మహామంత్రం*..
🪷🪷🪷🪷🪷
*హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే హరేరామ హరేరామ* *రామరామ హరేహరే*

```ఇప్పుడు ఒక్కసారి అందరం హరేకృష్ణ మహామంత్రం స్మరిద్దాం…✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
         ➖▪️➖

మోక్షం అనగానేమి

*మోక్షం అనగానేమి??*

నేడు ఎవరి నోట విన్న నాకు మోక్షం కావాలి, భగవంతునిలో లీనం అవ్వాలి, అదే నాకోరిక అని చెబుతుంటారు!!
    ఏమిటి ఈ మోక్షమంటే? మోహ క్షయమే మోక్షం!!.. ఇదే మోక్షము, 
           _అనగా ఏమిటి?
     వాయువు వాయువులో చేరినప్పుడు లీనమైపోతుంది, నీరు నీరులో చేరినప్పుడు ఏకమైపోతుంది.  
అగ్ని అగ్నిలో చేరినప్పుడు ఏకమైపోతుంది, 
     అదే విధముగనే, భగవంతుడు జ్యోతి స్వరూపుడు, మనము జ్యోతిగా మారాలి!!
      అప్పుడు దాంతో మనము ఏకమైపోతాము,

     భగవుంతుడు అరూపుడు, కనుకనే మనము మృగతత్వముపై భ్రాంతిని వదిలిపెట్టాలి, అప్పుడు మనము ఏకమైపోతాము,

     కానీ 24 గంటలు లోపలను దేహాభిమానము కలిగినటువంటి మానవుడికి ఎట్లా ఆత్మాభిమానము అర్ధమౌతుంది??...

    కనుక ఆత్మ తత్వముపై మన యొక్క మనస్సు CONCENTRATE ( ఏకీకృతం ) చేయాలి, అప్పుడే ఆత్మ..అత్మ ఏకమైపోతుంది.  

     ఇట్టి ఏకత్వాన్నే సాయుజ్యమన్నారు, దీన్నే మూక్ష ప్రాప్తి అని అన్నారు.

గర్భములో శిశువు పిండ రూపంలో భగవంతుని ప్రార్థిస్తాడా? ఎలా?*

*గర్భములో శిశువు పిండ రూపంలో భగవంతుని ప్రార్థిస్తాడా? ఎలా?*
                 
స్త్రీ గర్భములోనే శేషన దుఃఖముతో జీవుడు ప్రవేశిస్తాడు. ఫలదీకరణము జరిగిన తరువాత శిశువు పరిణామక్రమము...

*ఒక రోజుకు ఖలిలమౌతాడు.
*ఐదు రోజులకు బుద్భుదాకారము పొందుతుంది.
*పది రోజులకు బదరీఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు.
*ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది.
*రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడుతాయి.
*మూడు నెలలకు గోళ్లు, రోమాలు, చర్మము, లింగము, నవరంధ్రములు ఏర్పడుతాయి.
*నాలుగు నెలలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి.
*ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడుతాయి.
*ఆరు నెలలకు జఠాయువు, మావిచేకప్పబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు.
మాతృ భుక్తాన్న పానీయాలచే క్రమక్రమంగా వృద్ది చెందుతూ దుర్గంధ భూయిష్టమైన మల మూత్రాల గుంటలో ఉన్న పురుగులు, సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా, ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్చబోతాడు. నరకయాతన, నరకానుభవము జీవుడు మాతృ గర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది.  
తల్లి తీసుకునే ఆహారములోని, దుస్సాహాలైన కట్వాములు(ఉప్పు) లవణాది పదార్థముల వలన సర్వాంగాల యందు వేదన కలుగుతూ ఉంటుంది. మావి చేత ప్రేవుల చేత చుట్టబడి వక్రీభూతమై పృష్ఠశిరోధరుడై, అధశిరస్కుడై తల్ల కిందులుగా ఉంటాడు. పంజరంలో పక్షి లాగా జీవుడు గర్భంలో బంధింపబడి ఉంటాడు. 

అప్పుడు భగవంతుని దయ వలన, పూర్వ జన్మలలో చేసిన పాపములు గుర్తొస్తాయి. 
అపుడు గత జన్మలో చేసిన పాప పుణ్యముల కారణంగానే కదా ఈ జన్మమునకు వచ్చింది, అని బాధ పడుతూ ఉంటాడు. 

కర్మ ఫలితం అనుభవించడానికే కదా మరలా ఈ జన్మ అని గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. 

అలా పరితపిస్తూ జీవుడు బంధభూతాలైన సప్తధాతువులు కలిగి, భగవంతుని మీద కృతజ్ఞతతో(మరలా మానవ జన్మ ఇచ్చినందుకు) గద్గద స్వరంతో భగవంతుని ప్రార్థించడం గర్భంలోనే ప్ర్రారంభిస్తాడు..

‘గత జన్మలలో చేసిన పాపపుణ్యముల సంఘాతమే కదా ఈ మానవజన్మ’ అని తలంచుచూ భగవంతునికి మాతృ గర్భంలో ఉన్నప్పుడే మాట ఇస్తాడు. ప్రమాణం చేస్తాడు...
“ఓ శ్రీహరీ! నీ మాయచే మోహితుడు కావడం వలన బిడ్డలు, భార్య, అహంకారము, మమకారము, కామము వీటియందు పడి, సంసార నిమగ్నుడనై, సంసారమే బ్రతుకని మంచి, చెడులను విడచి ధర్మము, అధర్మము అని చూడకుండా, ధన సంపాదనే ధ్యేయంగా, చేయకూడని, చెప్పుకోలేని పాపములు జరగడానికి కారకుడయ్యాను. అలా సంపాదించిన ధనము, భాగ్యములను నా భార్యాబిడ్డలు అనుభవించుచున్నారే కానీ నన్ను గురించి పట్టించుకోవడం లేదు. నేను సంపాదించిన ఆస్తిపాస్తులు బిడ్డల పాలు, పాపములు మాత్రం నా పాలు అయినది.
ఓ భగవంతుడా ఈ దుర్గంధముతో ఈ గర్భములో ఇక ఉండలేను. దయచేసి నన్ను బయటపడవేయుము. నేను బయటపడితే ఈ సారి పాపకృత్యముల జోలికిపోను. నన్ను నమ్ముము. మీ చరణారవిందములను విడువను. ఎల్లప్పుడూ మీ చరణాలనే స్మరిస్తూ ఉంటాను. ఈ సారైనా ముక్తి పొందడానికి ప్రయత్నము చేస్తాను. 
ఈ సారి నాకు సంసారబంధములను కట్టబెట్టవద్దు. పొరపాటున కూడా సంసారము జోలికి పోను. పరాత్పరా ఈ మల మూత్ర కూపములోని దుర్గంధమును భరిచలేక, మరియు జఠరాగ్ని రూపంలోని వేడి వలన మాడిపోవుచున్నాను.భరించలేకున్నాను. నన్ను బయట పడవేయుము. మిమ్ములను మరచిపోను!” అని ప్రార్థిస్తాడు జీవుడు.

మరి మాతృ గర్భంలో భగవంతునికి ఇచ్చిన మాటను మనము నిలబెట్టుకుంటున్నామా?