Tuesday, November 12, 2024
గుడిలో శఠగోపం తలమీద పెట్టడం
గుడిలో శఠగోపం తలమీద పెట్టడం ద్వారా ఏ ఫలితం వస్తుందో మీకు తెలుసా...??శఠ గోప్యం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించనంత నెమ్మదిగా కోరికను తలుచుకోవాలి.అంటే...మీ కోరికే షడగోప్యము.మానవునికి శత్రువులైన "కామము,క్రోధము,లోభము, మోహము,మదము, మాత్సర్యముల వంటి వాటికి ఇక దూరంగా ఉంటాను" అని తలవంచి ప్రమాణం చెయ్యడం మరో అర్థం. ఎప్పుడు గుడికి వెళ్లినా *శఠగోపం* తీసుకోవడం మర్చిపోకండి.*రాగి,కంచు,వెండితో చేసిన శఠగోపo పైన విష్ణు పాదాలు* ఉంటాయి. ఈ షడగోప్యం తలమీద పెట్టినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ ఈ లోహం తగలడం వల్ల విద్యుదావేశం జరిగి శరీరంలో *అనవసరవిద్యుత్* బయటకి వెళ్ళిపోతుంది. తద్వారా శరీరంలో ఆందోళన, అధిక ఒత్తిడి ,ఆవేశము తగ్గుతాయి.మన పెద్దలు చేసే ప్రతి పనిలోనూ ఎన్నో సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. అర్ధం చేసుకోవాలి.🙏మన సంప్రదాయాలు గౌరవిద్దాం.కృష్ణం వందే జగద్గురుం🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment