Monday, November 18, 2024

గర్భముతో ఉన్నప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు , ఆహార నియమాల గురుంచి తెలుసుకొందాం.

గర్భముతో ఉన్నప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు , ఆహార నియమాల గురుంచి తెలుసుకొందాం.


ముఖ్యముగా గర్భముతో ఉన్నప్పుడు తానుతోపాటు తన గర్భములో ఉన్న ఇంకొక జీవిని కూడా దృష్టిలో పెట్టుకొని పోషకాహారం తీసుకోవలసి వస్తుంది. గర్భముతో వున్నప్పుడు మంచి మాంసకృత్తులు కలిగిన పదార్థాలు తీసుకోవటం ,ఐరన్ , కాల్షియమ్ కలిగిన పదార్థాలు మరియు పీచు పదార్థం పుష్కలముగ వున్న పదార్థాలు ఆహారములో తీసుకోవటం. 





గర్భం ధరించినప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు :

1.తగినంత వ్యాయామము మరియు విశ్రాంతి తీసుకోవటం.

2.ఫోలిక్ ఆసిడ్ పుష్కలముగా ఉన్న పదార్థాలు తీసుకోవటం

3.ఆహారములో విటమిన్ డి,కే,ఈ మరియు ,కాల్షియమ్ ,ఐరన్ మరియు జింక్ తగినంత వుండేటట్టు చూసుకోవటం.

4. మానసిక ప్రశాంతత మరియు ఇంటి వాతావరణం మంచిగా ఉండేటట్టు చూసుకోవటం

5.శారీరక పరిశుభ్రత

6. కాఫీ ,టీలు తీసుకోక పోవటం 

7. అధిక బరువులు కలిగిన వస్తువులు ఎత్తకపోవటం 

8. డాక్టర్ సలహా లేనిదే ఎలాంటి మందులు తీసుకోకూడదు 

9. సరిఅయిన బరువు వుండేటట్టు జాగ్రత్త తీసుకోవటం 




ఇనుపు ధాతువు 

రోజుకి 30- 60 మిల్లి గ్రాముల ఇనుము ధాతువు అవసరం. ఇంత కంటే 

తుక్కువ మోతాదు తీసుకుంటే రక్త హీనతకి దారితీస్తుంది. దీనివలన గుండె దడ,ఆయాసం,నీరసం,నిస్సత్తువ లాంటి సమస్యలులాంటివి 

తలెత్తుతాయి.   


గోంగూర ,పొన్నగంటికూర, బచ్చలి కూర, తోటకూరఆకుకూరలు తీసుకోవటం వలన రక్తహీనతని నివారించవచ్చు. 

చిరుధాన్యాలు ,చిక్కుడు గింజల జాతికి చెందినవి,నువ్వులు తీసుకోవటం మరియు పండిన పళ్లలో తగినంత ఐరన్ కలిగి ఉంటుంది. 




కాల్షియం :

ఎముకల పటుత్వానికి ,పెరుగుదలకు అతిముఖ్యమైనది ఈ ధాతువు. అంతే కాకుండా గుండె మరియు నాడి వ్వవస్థ పనితీరుకు కూడా ఈ కాల్షియమ్ చాల అవసరం. 

ఆకుకూరలలోను ,రాగి ,సజ్జ లాంటి పదార్థాలలో పుష్కలముగా ఉంటుంది. 

పళ్ళరసాలలో ,అంజిర్,ఆక్రూట్,బాదం మొదలగులాంటి వాటిలో కాల్షియమ్ ఉంటుంది.





ఫోలిక్ యాసిడ్

మొదటి మూడు నెలల్లో ధాతువు చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది.డి.ఎన్,ఏ నిర్మాణ క్రియకి మరియు ఎముకుల పెరుగులకి ఈ ధాతువు తోడ్పడుతుంది.గర్భిణలకి రోజుకి 150-300 మైక్రోగ్రాములు అవసరం.

టమెటోలు,అరటిపళ్ళు,బీట్ రూట్ ,కేపీసీకం,పచ్చిబఠాణి,పెసర పప్పు ,క్యాలీఫ్లవర్ లాంటివాటిలో ఫోలిక్ యాసిడ్ పుష్కలముగా ఉంటుంది. 





విటమిన్-ఏ 

రోగ నిరోధకశక్తిని ,కంటి చూపుని మెరుగు పరుస్తుంది. 

ఆకు కూరలు,కెరెట్,బీట్రూట్ ,మామిడి,తర్భుజా,చిలగడదుంపలు,సిమ్లామిర్చి, వెన్నలాంటి వాటిలో విటమిన్-ఏ పుష్కలముగా ఉంటుంది.


విటమిన్-బి 

కండరాలకి,నరాలకు బలాన్ని ఇస్తుంది. రక్తపుష్టిని చేకురుస్తుంది. 

ఆకు కూరలు, మొలకెత్తిన గింజలు ,ఖర్జురం,కొబ్బరి నీళ్లు ,బాదం,పుట్టగొడుగులు,పాలకూర లాంటివి పుష్కలముగా విటమిన్-బి ఉంటుంది. 





విటమిన్- సి 

రోగనిరోధక శక్తికి ,రక్తనాళల బలానికి ముఖ్యమైనది. 

నిమ్మ జాతి పళ్ళలో - నిమ్మ,నారింజ ,బత్తాయి,ఉసిరి ,తాజాపళ్ళలో ,మునగ ,టమాటో ,బచ్చలి కూరలో విటమిన్- సి పుష్కలముగా ఉంటుంది. 


విటమిన్-డి  

ఎముకుల పుష్టికి,దేహం ఆరోగ్యకరమైన పెరుగుదలకు విటమిన్-డి చాల అవసరం.  

సూర్య రశ్మితో మన శరీరం స్వతంత్రముగా చేసుకోగలదు. వెన్న ,ఎండిన పుట్టగొడుగులలో విటమిన్-డి ఉంటుంది. 

 





విటమిన్ -కె 

రక్తం గడ్డ కట్టటానికి ఉపయోగపడుతుంది.

కాలిఫ్లవర్ ,క్యాబేజి ,బచ్చలి కూర ,కీరదోసకాయ,పచ్చి బఠాణి,వేరుసెనగగుళ్ళు లాంటివాటిలో విటమిన్ -కె పుష్కలముగా లభిస్తుంది.


విటమిన్-ఇ 

పిండం అభివృద్ధికి,గర్భస్రావం కాకుండా కాపా డుతుంది. అంగవైకల్యము రాకుండా కాపాడుతుంది. మునగ ,చిరుధ్యానములలో ,గానుగ నూనె, వండిన పాలకూరలో ,ప్రొద్దుతిరుగుడు గింజలలో, కీరా దోసకాయలో 

విటమిన్-ఇ పుష్కలముగా ఉంటుంది.


పైన చూసిన పోషకాలుతోపాటు ఆరోగ్యకరమైన కణజాలాలాకి అవసరమైన మంచి మాంసకృతువులు కలిగిన ఆహరం తీసుకుంటే పండంటి బిడ్డని ప్రసవిస్తారు. 

గరిక పచ్చడి. 

కావలసిన పదార్థాలు

గరిక -1 కప్పు

మిరియాలు - 1 చెంచా

ధనియాలు - 1 చెంచా 

జీలకర్ర- 1 చెంచా

ఆవాలు- ½ చెంచా 

ఇంగువ- 2 చిటికెలు 

నూనె- 3 చెంచాలు 

సైన్ధవ లవణం - రుచికిసరిపడినంత

కొబ్బరి - ½ కప్పు 

అల్లం - చిన్న ముక్క 

కరివేపాకు - 1 రెమ్మ 

తయారు చేయు విధానం :

మూకుడులో మిరియాలు,జీలకర్ర,ధనియాలు దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి . 

మూకుడులో కొంచం నూనె తీసుకొని శుభ్రం చేసుకొన్న గరికను మగ్గా పెట్టుకొని చల్లార్చుకోవాలి. 

చల్లర్హుకొన్న గరిక, జీలకర్ర ,మిరియాలు, అల్లం , కొబ్బరి ,సైన్ధవ లవణం కలిపి రుబ్బుకోవాలి. 

ఆవా లు,కరివేపాకు ఇంగువతో పోపు పెట్టుకొని పైన రుబ్బుకొన్న గరిక పచ్చడిని ఈ పోపుకి కలుపుకొంటే ఎంతో కమ్మని గరిక పాకేహ్హది తాయారు అవుతుంది. 

 బీరకాయ తెలగ పిండి కూర

 కావాల్సిన పదార్థాలు :

బీరకాయ ముక్కలు - 1 కప్పు 

ఉల్లి తరుగు - ½ కప్పు 

పచ్చిమిర్చి తరుగు - 2 చెంచాలు 

కర్వేపాకు - 1 రెమ్మ 

కొత్తిమీర - పిడికెడు 

వెల్లుల్లి రెబ్బలు - 10

తెలగ పిండి - ¼ కప్పు 

జీలకర్ర -1 చెంచా 

ధనియాల పొడి - 1 చెంచా 

ఉప్పు - రుచికి సరిపడినంత 

నూనె - 3 చెంచాలు 

పోపు సామాను - 2 చెంచాలు ( ఆవాలు,సెనగ పప్పు ,మినపప్పు)


తాయారు చేయువిధానం :

బీరకాయ శుభ్రం చేసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. 

తెలగ పిండిలో వేడి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. 

మూకుడులో నూనె తీసుకొని పోపు సామానుతో పోపు పెట్టుకొని మగ్గిన తరువాత దంచిన వెల్లుల్లి రెబ్బలు,జీలకర్ర ,పచ్చిమిర్చి ,ఉల్లి తరుగు వేసుకొని మగ్గబెట్టి బీరకాయ ముక్కలు పసుపు వేసుకొని బీరకాయ ముక్కలు ఉడికేదాకా మగ్గ పెట్టుకొని వేడి నీళ్ళలో నాన బెట్టుకొన్న తెలగ పిండి కలుపుకొని కొంచం సేపు మగ్గా పెట్టుకొని కొత్తిమీర కలుపుకుంటే ఎంతో కమ్మని తెలగ పిండి బీరకాయ కూర తయారు అవుతుంది. 

ఊద నువ్వుల కుడుములు 

కావలసిన పదార్థాలు 

ఊద బియ్యం - 1 కప్పు 

బెల్లం - ½ కప్పు 

కొబ్బరి తురుము - ¼ కప్పు 

నెయ్యి - 5 చెంచాలు 

నువ్వులు - 4 చెంచాలు 

యాలకుల పొడి - ½ చెంచా  

తాయారు చేయు విధానం 

ముందుగా ఊద బియ్యం 4 గంటలు నానబెట్టుకొని వడగట్టుకొని నీడలో 20 శాతం చమ్మ వుండేటట్టు ఆరబెట్టుకొని పిండి మరపట్టి పెట్టుకోవాలి. 

నువ్వులు దోరగా వేపుకొని పొడికొట్టి పెట్టుకోవాలి. 

మూకుడులో 3 చెంచాలు నెయ్యి తీసుకొని వేడి అయిన తరువాత కొబ్బరి తురుము వేసుకొని దోరగా వేపుకొని 1 కప్పు నీళ్ళు చేర్చుకొని నీళ్ళు మరిగేటప్పుడు బెల్లం తురుము వేసుకొని బెల్లం కరిగి ఒక తీగ పాకం వచ్చిన తరువాత నువ్వులపొడి,తయారుగా పెట్టుకొన్న ఊద పిండి ,యాలకుల పొడి కలుపుకొని దగ్గరికి అయ్యే దాకా కలుపుకొని చల్లారినతరువాత కుడుములు వత్తుకొని 12 నిమిషాలు ఆవిరి పెట్టుకొంటే ఎంతో కమ్మని ఊద కుడుములు తాయారు అవుతాయి.  




పెసర బీట్రూట్ సూప్ 

కావలసిన పదార్థాలు 

పెసర పప్పు - ¼ కప్పు 

బీట్రూట్ - 1 కప్పు 

పుదీన- పిడికెడు 

కొత్తిమీర -పిడికెడు

వెల్లుల్లి తరుగు - 3 చెంచాలు 

నిమ్మ రసం - 3 చెంచాలు 

మిరియాల పొడి - 1. 5 చెంచాలు 

జీలకర్ర - 2 చెంచాలు 

ఉప్పు - రుచికి సరిపడినంత 

నెయ్యి - 3 చెమ్చాలు 

బెల్లం - 2 చెమ్చాలు 

తయారు చేయు విధానం 

పెసర పప్పుని శుభ్రం చేసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. 

ఒక పాత్రలో 10 కప్పులు నీళ్ళు చేర్చుకొని ఈ నీళ్ళు బాగా మరిగేటప్పుడు పెసర పప్పుని చేర్చుకొని పెసర పప్పు సగం ఉడికిన తరువాత బీట్రూట్ ముక్కలు చేర్చుకొని బీట్రూట్ ముక్కలు సగం ఉడికిన తరువాత పొయ్యే కట్టేసి బీట్రూట్ ,పెసర పప్పుని వడ కట్టుకొని ఈ నీటిని పక్కన పెట్టుకోవాలి. 

బీట్రూట్ ,పెసర పప్పు చల్లారిన తరువాత పుదీనా చేర్చి మెత్తగా రుబ్బుకొని ఈ మిశ్రమాన్ని పైన పక్కన పెట్టుకొన్న నీటికి చేర్చి ,ఉప్పు కూడా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగ బెట్టుకోవాలి. 

మూకుడులో నెయ్యి తీసుకొని జీలకర్ర ,వెల్లుల్లి తరుగుతో పోపు పెట్టుకొని ఈ పోపుని పైన మరుగుతున్న సూప్ కి కలిపి మిరియాల పొడి ,కొంచం బెల్లం ముక్క కలుపుకొంటె ఎంతో కమ్మని పెసర బీట్రూట్ సూప్ తాయారు అవుతుంది. 

సర్వ చేసుకొనే ముందు నిమ్మ రసం కొత్తిమీర కలుపు కొంటె సూప్ కి మరింత కమ్మధనం పెరుగుతుంది.








ఊద మునగాకు కిచిడి

కావలసిన పదార్థాలు 

ఊదలు - 2 కప్పులు

పెసరపప్పు - 1 కప్పు

మిరియాలు 1 చెంచా

జీలకర్ర - 1 చెంచా

ఇంగువ- 3 చిటికెలు

అల్లం తురుము- ½ చెంచా

ఉప్పు - రుచికిసరిపడినంత

నూనె - 3 చెంచాలు

మునగాకు - 1 కప్పు


తాయారు చేయువిధానం

1.ఊద బియ్యం, పెసరపప్పు 3 గంటలు విడివిడిగా నాన బెట్టుకోవాలి.

2.పాత్రలో నీళ్లుతీసుకొని బాగామారగానివ్వాలి.

3.మరిగే నీళ్ళలో పెసరపప్పు వేసి సగంఉడికిన తరువాత ఊద బియ్యంవేసి 90 శాతం ఉడికిన తరువాత ఉప్పు ,మునగాకువేసి ఉడికించుకోవాలి.

4.చివరగా జీలకర్ర, మిరియాలు,అల్లంతో పోపుపెట్టుకుంటే ఎంతో కమ్మని ఊద మునగాకు కిచిడి తాయారు అవుతుంది.



జొన్న పుదీన గార్లిక్ సూప్ 

పుదీనా - 1 కట్ట  

వెల్లుల్లి - 10 పాయలు 

కొత్తిమీర - పిడికెడు 

నిమ్మకాయలు -2

మిరియాల పొడి - 1 చెంచా 

జీలకర్ర - 1. 5 చెంచాలు 

జొన్న పిండి - 4 చెంచాలు 

నెయ్యి - 2 చెంచాలు 

ఉప్పు - రుచికి సరిపడినంత 


తయారు చేయు విధానం:

జొన్న పిండిని దోరగా వేపుకొని చల్లారిన తరువాత పుదీనా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. 

 రుబ్బుకొన్న మిశ్రమానికి 6 కప్పుల నీరు చేర్చి పొయ్యి మీదపెట్టి బాగా మరిగిన తరువాత మిరియాల పొడి,ఉప్పుచేర్చుకోవాలి.

  జీలకర్ర , వెల్లుల్లితో పోపు పెట్టుకొని నిమ్మరసం కొత్తిమీర చల్లుకొంటే ఎంతో కమ్మని జొన్న పుదీనా వెల్లుల్లి సూప్ తయారు అవుతుంది. 







గోరు చిక్కుడు వేపుడు 

కావలసిన పదార్థాలు 

గోరు చిక్కుడు - 1 కప్పు  

అల్లం - చిన్న ముక్క 

పచ్చిమిర్చి - 2

కర్వేపాకు -1 రెమ్మ 

కొత్తిమీర - పిడికెడు 

నూనె - 3 చెంచాలు 

పోపు సామాను - 2 చెంచాలు 

ఉప్పు - రుచికి తగినంత 

పుట్నాల పొడి - 3 చెంచాలు 


తయారు చేయు విధానం: 

గోరు చిక్కుడు కాయలు శుభ్రం చేసుకొని ముక్కలు చేసుకొని ఆవిరిలో ఉడక పెట్టుకొని పెట్టుకోవాలి. 

మూకుడులో నూనె తీసుకొని పోపు సామాను వేసుకొని మగ్గిన తరువాత అల్లం పచ్చిమిర్చి ముద్దని వేసుకొని బాగా మగ్గిన తరువాత కర్వేపాకు వేసుకొని తయారుగా పెట్టుకొన్న గోరు చిక్కుడు కాయ ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు చేర్చి పుట్నాల పొడి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో కమ్మని గోరుచిక్కుడు వేపుడు తాయారు అవుతుంది. 

100 గ్రాముల పుట్నాల పొడి తాయారు చేయు విధానం : 

 పుట్నాలు (50 గ్రాములు)

 ,కరివేపాకు( 20 గ్రాములు) ,మిరియాలు( 10 గ్రాములు),జీలకర్ర ( 10 గ్రాములు) ,వెల్లుల్లి ( 10 గ్రాములు)

వేపుకొని పొడి చేసుకోవాలి. 


మునగాకు పెసర కట్టు

కావలసిన పదార్థాలు 

పెసర పప్పు- 1 కప్పు 

పసుపు - 1 చెంచా 

జీలకర్ర - 1 చెంచా 

ఆవాలు -½ చెంచా 

మెంతులు -½ చెంచా 

మిరియాల పొడి - 1 చెంచా 

ఉప్పు -రుచికి సరిపడినంత

ఇంగువ- 3 చిటికలు

నూనె / నూనె- 3 చెంచాలు

వెల్లుల్లిరెబ్బలు - 6

మునగాకు - 1 కప్పు

కర్వేపాకు - 1 రెమ్మ

కొత్తిమీర - 1 పిడికెడు

తాయారుచేయు విదానం:

పెసరపప్పు శుభ్రంచేసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి.

2. ఒకపాత్రలో 5 కప్పులు నీళ్ళు తీసుకొని పొయ్యేమీద పెట్టి మరుగుతున్నప్పుడు నానబెట్టుకొన్న పెసరపప్పు,పసుపు వేసి ఉడికిన తరువాత మునగాకు మిరియాల పొడి , ఉప్పు చేర్చుకొని మూత పెట్టి 7 నిముషాలు వుడికొన తరువాత పొయ్యే కట్టేసి పప్పు గుత్తితో ఎనుపుకొవాలి . 

 3. మూకుడులో నూనె /నెయ్యి తీసుకొని వేడి ఆయన తరువాత ఆవాలు, జీలకర్ర,మెంతులు ,ఇంగువ ,కర్వేపాకుతో పోపుపెట్టుకొని పైన తయారుగా ఉన్న పప్పుకు కలుపుకొని కావాలంటే కంచెం నిమ్మ రసం కలుపుకొంటే ఎంతో కమ్మని మునగాకు పెసర కట్టు తాయారు అవుతుంది. 


ఊద అన్నం :

ఊద బియ్యాన్ని 4 - 6 గంటలు నాన పెట్టుకొని ఒకటికి రెండు నీళ్ళు పోసి ఈ పాత్రని ఇడ్లి పాత్రలో పెట్టి 15-18 నిమిషాలు ఆవిరి పట్టుకొంటే ఊద అన్నం తాయారు అవుతుంది.

పుదీనా అల్లం మజ్జిగ 

కావలసిన పదార్థాలు 

మజ్జిగ - 1 లీటర్  

పుదీనా - 1 కట్ట 

అల్లం - 20 గ్రాములు 

పచ్చిమిర్చి - 2

జీలకర్ర పొడి - 2 చెంచాలు 

ఉప్పు - రుచికి సరిపడినంత 

తాయారు చేయు విధానం 

పుదీనా ,అల్లం,పచ్చిమిర్చి మెత్తగా రుబ్బుకొని ఈ ముద్దని జీలకర్ర పొడిని ఉప్పుని మజ్జిగ కి కలుపుకొంటే ఎంతో కమ్మని పుదీనా అల్లం మజ్జిగ తయారుఅవుతుంది . 

గమనిక : వెన్న తీసిన మజ్జిగ తీసుకోవాలి. పచ్చిమిర్చి లోని గింజలు తీసేయాలి.

No comments:

Post a Comment