Tuesday, November 12, 2024

ధ్యానంలో కూర్చుంటే పది నిమిషాల్లోనే ఒక ప్రశాంతత లభిస్తుంది. మరి పూజలు, యజ్ఞాలు, జపాలు అవసరమా!!!

*ధ్యానంలో కూర్చుంటే పది నిమిషాల్లోనే ఒక ప్రశాంతత లభిస్తుంది. మరి పూజలు, యజ్ఞాలు, జపాలు అవసరమా!!!* 

🌸 పదినిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటే ఎవరికైనా ప్రశాంతత కాసేపు వస్తుంది. అది ఒక్కటే జీవిత పరమార్ధం కాదు కదా ! జీవుడిని అంటిపెట్టుకుని కర్మ వాసనలుంటాయి. 

🌿చుట్టూ ప్రకృతిలోనే కానరాని సూక్ష్మలోకంలో దుష్టశక్తులు, వాటి ప్రభావాలు ఉంటాయి. వాటిని నివారించడానికి ఎన్నో ఉపాయాలను శాస్త్రం చెప్పింది. 

🌸ఈ ధ్యానం కూడా సనాతన ధర్మశాస్త్రంలోని అంశమే. జపం, యాగం, అర్చన, ధ్యానం... ఇలా ఎన్నో మార్గాలు వేదాధారమైన మన ధర్మంలోని అంశాలే. వీటిలో వేటి ప్రయోజనం వాటికుంది.

🌿 ఒకదానికొకటి ప్రత్యమ్నాయం కాదు. పూజల ద్వారా శారీరకశుద్ధి, ద్రవ్యశుద్ధి ఏర్పడుతుంది. అభీష్టసిద్దులూ ప్రాప్తిస్తాయి. యాగాలకు కూడా అలాంటి ప్రయోజనముంది.

🌸 యాగాదులవల్ల పరిసరాలలో దివ్యత్వం వ్యాపించి వైయక్తిక, సామూహిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. జపం వల్ల, స్తోత్రాల వల్ల కూడా అనేక సిద్ధులున్నాయి.

🌿 శాస్త్రంలోనేకాక అనేకమంది అనుభవాలలో అవి కనబడుతూనే ఉంటాయి. అనేక ప్రయోజనాలు అవసరమైన మానవునికి అనేక శాస్త్రీయపద్ధతులు, వాటి ఫలాలు, ఋషులు ఏర్పరిచినవే. 

🌸అర్చన జరిగే ఇంట్లో దివ్యశక్తి నెలకొని ఉంటుంది. దుష్ప్రభావాలు తొలగుతాయి. అర్చన, యాగం జరిగే పవిత్రమైన చోట చేసే ధ్యానానికి ప్రభావం ఉంటుంది. అలాంటి చోట చేసే జపానికీ మంచి సిద్ధి ఉంటుంది.

No comments:

Post a Comment