దీనినే శివరుద్రాక్ష అంటారు. దీనిని శివుని ప్రతిరూపంగా భావిస్తారు . ఇది అసలైనది దొరుకుట మహాదుర్లభం. ఈ ఏకముఖి రుద్రాక్ష వృక్షజాతి రత్నం. ఈ ఏకముఖి రుద్రాక్షని సూర్యుని స్వరూపముగా భావిస్తారు . దీనిని ధరించటం వలన సూర్యగ్రహ అనుగ్రహం లభించును. ఈ రుద్రాక్ష మాల ధరించటం వలన ఆధ్యాత్మిక శక్తులు వశం అగును. అత్యంత అరుదుగా లభించే ఈ అద్భుత రుద్రాక్ష జీడిపప్పు ఆకారంలో (అర్ధ చంద్రాకారంలో ) లభించును. మంత్ర , తంత్ర ప్రయోగాలు తిప్పికొట్టబడును.
ఏకముఖి రుద్రాక్ష ధారణ వలన పని మీద ఆసక్తి పెరుగును . మనస్సులో భక్తి పెరుగును . ఆర్థికాభివృద్ధి జరుగును. జీవితంలో ఉన్నతస్థితి కలుగును. ఈ మాలను ధరించు సమయమున రుద్రాక్ష మంత్రమును 11 సార్లు జపించవలెను . దీని ధారణ వలన బ్రహ్మహత్యా దోషం నివారణ అగును. ఇంద్రియ నిగ్రహం కలుగును. టీబీ మరియు ఆస్తమా వంటి మొండివ్యాధులను తగ్గించును . తలనొప్పి , కంటి సమస్య , లివర్ సమస్యలకు కూడా అద్భుతంగా పనిచేయును . ఈ రుద్రాక్షను పూజామందిరంలో ఉంచుకుని పూజించుచున్న సంపదలు తరలివచ్చును . సుఖసంతోషాలు కలుగును.
రాజకీయ నాయకులు ఈ రుద్రాక్ష ధారణకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. రాజకీయ నాయకులలో శ్రీమతి ఇందిరాగాంధీ , n .t .రామారావు గారి వద్ద మాత్రమే ఈ ఏకముఖి రుద్రాక్ష ఉండేది. కాని ఇందిరా గాంధీ మరణానికి కొన్ని రోజుల ముందే ఈ రుద్రాక్ష ఆమె దగ్గర నుంచి మాయం అయ్యింది . అది ఇప్పటివరకు ఏమైందో ఎవ్వరికి తెలియదు.
ఏకముఖి రుద్రాక్ష పరమతత్వాన్ని బోధిస్తుంది. అలాంటి ఆలోచన ఉన్నవారు మాత్రమే దీనిని ధరించవలెను . దీని దర్శనం కూడా దుర్లభమే .శివరాత్రి పర్వదినమున ఈ రుద్రాక్షను పూజించిన సాక్షాత్తు శివుడ్ని పూజించిన ఫలితం వచ్చును.
No comments:
Post a Comment