నిన్నటి పోస్టులో ఏకముఖి ధరించటం వలన కలుగు ఉపయోగాలు వివరించాను. ఈరోజు మరికొంత సమాచారం వివరిస్తాను.
ఈ ఏకముఖి రుద్రాక్షలో 4 రకాలు కలవు. ఒక్కోరకం ధరించటం వలన ఒక్కో రకమైన ఫలితాలు వస్తాయి. వాటి గురించి వివరిస్తాను.
1 - శ్వేత వర్ణ ఏకముఖి -
వ్యాధుల నుండి విముక్తి.
2 - రక్తవర్ణ ఏకముఖి -
బ్రహ్మహత్యా పాతకం నుండి దూరం చేయును .
3 - పీతవర్ణ ఏకముఖి -
భోగము మరియు మోక్షమును ప్రసాదించును.
4 - శ్యామవర్ణ ఏకముఖి -
ఆరోగ్య లాభము , సాత్విక ప్రసన్నత కలిగించును.
పైన చెప్పినవిధముగా ఒక్కో రంగు ఏకముఖి రుద్రాక్ష ధరించటం వలన ఒక్కొ రకమైన ఫలితాన్ని పొందవచ్చు.
ఇప్పుడు మీకు అసలు మరియు నకిలీ రుద్రాక్షల మధ్య బేధం ఎలా కనుగొనాలో మీకు వివరిస్తాను.
* రెండు రాగిరేకుల మధ్య రుద్రాక్షని ఉంచినట్లయితే అది తనచుట్టూ తానే సవ్యదిశలో తిరుగును. అపసవ్య దిశలో తిరిగిన అశుభ ఫలితాలు కలుగును. కావున సవ్య దిశలో తిరగవలెను.
* ఒక చిన్నగిన్నెలో మంచినీరు పోసి దానిలో రుద్రాక్షని వేసినట్లు అయితే నకిలీది మునగకు తేలుతుంది. అంతేగాక రంగు వెలిసిపోయినట్లు ఉన్నచో అది నకిలీదిగా గుర్తించవలెను .
* ఆవుపాలలో అసలైన రుద్రాక్షని వేసి ఉంచిన ఆ పాలు 48 గంటల నుండి 72 గంటల వరకు చెడిపోకుండా విరగకుండా ఉంటాయి.
* ఒక చిన్న గ్లాసులో రుద్రాక్ష మునిగేంత ఎత్తుటి వరకు చల్లని నీరు నింపి రుద్రాక్షని ఉంచి ఒక అరగంట తరువాత ఆ నీటి ఉష్ణోగ్రతని ధర్మామీటరుతో కొలిచినట్లైతే కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి ఉండును.
* రుద్రాక్షలలో అర్ధనారీశ్వర రుద్రాక్షలు ఉంటాయి. వాటిని నకిలీలుగా తయారుచేయుటకు రెండు రుద్రాక్షలను శిలపైన అరగదీసి అతికిస్తారు. కావున జాగ్రత్తగా గీతను గమనించవలెను .
* రెండు పాత్రల మధ్య రుద్రాక్షని ఉంచినప్పుడు రుద్రాక్ష తిరుగును.
* పురుగులు తిన్నవి , పగిలినవి ధరించరాదు .
* రుద్రాక్షని బాగా వేడిగా ఉన్న నీటిలో వేస్తే మునిగిపోతే అది నిజమైనదిగా భావించాలి . కొంతమంది ఇరుగుడు చెట్టు కొయ్యతో రుద్రాక్షలు తయారుచేస్తారు. కావున జాగ్రత్తగా ఉండవలెను .
* రుద్రాక్షని ఒక వారంపాటు నూనెలో ముంచి ఉంచాలి. అవి ఏరంగు రుద్రాక్ష అయిన దాని రంగు ప్రభావితం అగును. ఆ తరువాత కాగితం లేక దూదితో శుభ్రపరచి బావినీటితో కడిగించాలి. అతరువాత ధరించినచో రంగు ప్రభావితం కానిచో అవి అసలైన రుద్రాక్షలు .
* రుద్రాక్షలు ఎక్కువుగా కాశి , హరిద్వార్ లలో లభ్యం అగును. అసలైన రుద్రాక్ష నీటిలో మునుగును. ఒక నిజమైన రుద్రాక్షను ధరించినచో మంచి ఆరోగ్యం మరియు ఉన్నతస్థితిని ఇచ్చును. రుద్రాక్షలో ప్రకృతి సిద్ధముగానే రంధ్రం ఉండును. చిన్న రుద్రాక్షమాల గొప్ప ఫలితాన్ని ఇచ్చును.
No comments:
Post a Comment