Monday, July 14, 2025

నెయ్యి లో ఉండే పోషకాలు*



*4 వ భాగం*

ఈ రోజు అంశం 
*దేశీ వాలి ఆవు నెయ్యి..*
*నెయ్యి లో ఉండే పోషకాలు*
*వాటి ఉపయోగాలు*
*నెయ్యి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది*
*ప్రతి రోజు ఎంత మోతాదు లో వాడాలి*
*వివిధ ఆనరోగ్య సమస్యలకు నెయ్యి వాడే విధానం*
*నెయ్యి ఎన్ని రకాలు..*
*ఆయుర్వేదం లో నెయ్యి విశిష్టత*

మృత్యువుని దరిచేరనివ్వని దానిని *అమృతం* అంటారు.మరి ఈ భూలోకం లో మానవులకు ఇచ్చిన అమృతమే ఆవు నెయ్యి.అందుకే ఆవుని గోమాత అని పిలిచేది పూజించేది.ఈపాటికే మీ మనసులో అనిపించవచ్చు వీడికి కూడా గోభక్తి పిచ్చి పీక్స్ వెళ్ళి ఆవు అమృతం ఆవకాయ ఏదేదో చెబుతున్నాడు అన్ని. కొద్దిగా ఓపికతో అంత చదివితే మీకే అర్థం అవుతుంది. ఇంత కాలం మనం ఎలాంటి ఆహారానికి దూరం గా ఉన్నామో, ఇంత విలువైన దాని మనం ఎందుకు గుర్తించ లేదు అని.
నా కూడా ఒక సంవత్సరం క్రితం వరకు పైన చెప్పిన భావననే ఉండేది.ఈ మధ్య కాలంలో జరుగుతున గో సంరక్షణ వాటిపై జరుగుతున అరాచకాలు, వాటిని కాపాడటానికి మహానుభావులు చేస్తున ప్రయత్నాలు కూడా నా ఆలోచనలో మార్పు కి ఒక కారణం. ఆసలు ఆవు పాలు,నెయ్యి ఇతర పదార్థాల లో ఏమి అంశాలు ఉనవి అనే దానితో నా ప్రయాణం మొదలు అయింది.అందరూ చెప్పేవి కాకుండా ఇపుడు వున సైన్స్ ఏమి చెబుతుంది అని చాలా స్టడీ చేశాను.ఇంకా చేస్తూనే ఉన్నను.చాలా విషయాలు అర్థం అయినవి.ఇంకోచం లోపలికి వెళ్తే ఆయుర్వేదం లో ఆవు నెయ్యి గురించి ఏమి ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేశాను.
 జీవితం లో మనకు అనుకోకుండా చేసిన కొన్ని పనులు మనకు అపుడపుడు చాలా ఉపయోగ పడతాయి.కరోనా సమయంలో కాళిగా వున్నపుడు కొంతమంది మిత్రులతో మాట్లాడుతునపుడు వృక్ష ఆయుర్వేదం గురించి చర్చ వచి దానిపై ఒక సంవత్సరం పై స్టడీ చేసి ఎన్నో ప్రయోగాలు చేసిన అనుభవం ఇపుడు ఉపయోగ పడింది. కరోనా సమయం అందరికి తెలిసిందే కదా ఒక రీసెర్చ్ మరియు ప్రయోగాలు చేయాలి అంటే డబ్బు తో కూడిన విషయాలు. ఇంట్లో వాలు ఇప్పుడు ఇది అవసరమా మీకు ....అని
ఇది చెబుతుంటే ఒక విషయం గుర్తుకు వస్తుంది నాకు. 20 సంవత్సరాలక్రితం నేను రాక రకాల పనులు చేసేవాడిని, ఏది నచ్చేది కాదు అలా జీవితం లో ఓ 40ఫీల్డ్స్ మారి ఉంటాను. ఆపుడు మా అమ్మ నాన్న లు,బంధువులు చాలా తిట్లు తిట్టే వారు.నాకు చాలా కోపం వచ్చేది.ఏదో ఒక పని పై ద్యాస పెట్టాడు, రోజుకో కొత్త పని చేస్తాడు, ఇలా చేస్తే జీవితం లో బాగు పడవు అని.
నాకు చిన్నతనం నుంచి ఒక అలవాటు ఉంది.నచ్చని పన్ని నీ చేయడం అన్న ఒక వయసు వచ్చిన తర్వాత ఒకరి కింద పని చేయడం అంటే నచ్చేది కాదు.అపుడు *మా అమ్మమ్మ ఒక విషయం చెప్పింది. జీవితం లో నీకు నచ్చింది చెయ్యి*,*ఎవరు ఏమి అన్న పటించుకొకు*, *నీవు చేసిన ప్రతి పని నీ జీవితం లో ఎక్కడో ఒక దగ్గర కచ్చితం గా ఉపయోగ పడుతుంది* అన్ని. ఇది అంత ఎందుకు చెబుతాను అంటే ఏదో చేయాలి అనుకుంటాం అందరికి చెబుతాం ఎవరో ఏదో ఒకటి అంటారు ఇంకా ఆ పని అంతే. మీ విషయం లో మీ పిల్లల విషయం లో నచ్చింది చేయండి చేయనివండి.పోయేది ఏమి లేదు. వచ్చే ఓ గొప్ప అనుభవం ముందు.*అనుభవంతో కూడిన విద్యా, విజ్ఞానం ఏపటికైన నిన్ను రాజుగానే నీలా బెడుతుంది* అని నా అభిప్రాయం.. ఏంటి రా బాబు ఈ సోది అనుకోవద్దు ఇది నేను నేర్చుకున పాఠం. ఎ ఒకరికైనా ఉపయోగ పడవచ్చని అనుకుంటున్నాను.
ఇక అసలు విషయం కి వద్దము..

*ఆసలు అమృతం లాంటి నెయ్యి నీ విషం గా ఎవరు మార్చారు,అందుకు గల కారణాలు...*
భారతదేశ సంస్కృతిలో ఆవు నెయ్యికి చాలా ప్రాధాన్యం ఉంది. ఏ పవిత్ర కార్యమైన పూజకైనా నెయ్యి ఉండాల్సిందే ముఖ్యంగా యజ్ఞ యాగాదుల్లో ఈ నెయ్యి లేనిదే ఏది జరగదు. భోజనంలో నెయ్య లేకుండా భోజనం చేయకూడదని పెద్దలు చెప్పేవారు. భారతీయ జీవన విధానాన్ని శాసించిన ఆయుర్వేదంలో నెయ్యికి చాలా ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. నెయ్యికి జీవని గుణం ఉంటుందని ఆరోగ్యం మేరుగుపడుతుందని, పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయని, శారీరక బలం పెరుగుతుందని, ఆయుర్వేదం నెయ్యి గురించి చెప్పడం వలన శతాబ్దాలుగా భారతీయులు నెయ్యిని వెన్నని తమ ఆహారంలో ఒక భాగంగా వాడుతూ వచ్చారు.
  1970 తర్వాత యురోపియన్ దేశాలలో గుండె జబ్బుల పై పరిశోధనలు జరిగి దానికి గల కారణాలు తెలియజేశారు. వారి దేశాల్లో లభించే చీజ్, మరియు జంతువుల కోవ్వుల నుండి తీసే పదార్థాలను తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు పెరిగి గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. ఎందుకంటే ఆ దేశాలలో ఇవే ముఖ్యమైన ఆహారం . వారికి నెయ్యి గురించి గానీ తయారు చేసే విధానం గాని తినే అలవాటు గాని ఏమీ లేదు.మన డాక్టర్స్, శాస్త్రవేత్తలు వాటిని ప్రామాణికం గా తీసుకొని నెయ్యి వలన శరీరంలో కొవ్వు పెరిగి గుండె జబ్బులు వస్తాయని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఏ శాస్త్రీయ ప్రమాణం లేకుండా ఏ రీసెర్చ్ లేకుండా తొందరపడి చేసిన ఒక తప్పు అని నా భావన.అది ఇప్పటికీ మారలేదు, గానుగ నుండి వచ్చే నూనెలు వాడకం కూడా ఈ ప్రచారం వలనే తగ్గిపోయి రిఫైన్డ్ ఆయిల్ వాడకం పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో వీటి పై పరిశోధనలవల ప్రాధాన్యత తెలిసి తిరిగి వాడటం మొదలుపెట్టారు.
మన సాంప్రదాయ పద్ధతుల్లో చేసిన నెయ్యి వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఆయుర్వేదంలో నెయ్యి తయారీ వాడే విధానం గురించి చాలా వివరంగా చెప్పారు. నాకు తెలిసిన కొన్ని విషయాలు.....

*ఆయుర్వేదంలో నెయ్యి విశిష్టతను తెలియజేసే కొన్ని గ్రంథాలు* 
సుశ్రుత సంహిత.
భావప్రక్ష. 
చరక సంహిత. 
క్షేమకుతూహలం. 
 రజనీ ఘాoటూ.
హరిత సంహిత. 
భోజన కుటుహలం. 
అష్టాంగ హృదయం.

*ఆయుర్వేదంలో తెలపబడిన కొన్ని ఘృత లు*
ఘృతం అంటే నెయ్యి అని అర్థం.
 *1.కళ్యాణకఘృతం.*
*2.సరస్వతీఘృతం.*
*3.కుష్ముండఘృతం.*
*4.బ్రహ్మీఘృతం.*
*5.సుకుమారఘృతం.*
*6.ఆశ్వగంధఘృతం.*
*7.మహతిక్తాఘృతం.*
*8.పంచనింభదిఘృతం.*
ఇలా చాలా రకాలు ఉన్నాయి. పైనవి అన్ని ఆయుర్వేదం లో వన మూలికలతో నెయ్యి నీ కలిపి చేసిన ఔషధాలు. 
సింపుల్ గా చెప్పాలి అంటే మెడికేటెడ్ (గీస్) నెయ్యి.


*నెయ్యిలో ఉండే కొని మంచి* *ఫ్యాటీ యాసిడ్స్*

బ్యూట్రిక్ ఆమ్లం,కాప్రోయిక్ ఆమ్లం,కాప్రిక్,లారిక్,మిరిస్టిక్,
పెంటా డికనోయిన్,పాలింటిక్, హెప్టాడికనోయిన్,స్టిమిరిక్,
మీరీ స్టోలిక్, పాల్మీ టోలిక్, ఒలిక్,లీనో లేయిక్,లీనో లెనిన్, CLA ఇలా ఎన్నో మంచి చేసే ఆమ్లాలు ఆవు నెయ్యి లో కలవు. పైన తెలిపిన ఈ ఆసిడ్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఏది ఎలా పనిస్తుంది అనేది ముందు ముందు తెలుసుకుందాం...

మిగతా విషయాలు అని రేపు తెలుసుకుందాం..చాలా ముఖ్యమైన అంశాలు..*ఆసలు నెయ్యి లో ఉండే పోషకాలు, మేము చేక్ చేసిన ల్యాబ్ రిపోర్ట్స్ ఏమి వచాయి*.ఇంకా ఎన్నో ఆసక్తి కర విషయాలు...

      

No comments:

Post a Comment