Monday, July 21, 2025

విటమిన్ D



*దేశ వాలి ఆవు నెయ్యి లో ఉండే పోషక విలువలు మొదలగు అంశాలు...*
ఇంతకు ముందు చాలా అంశాలు తెలుసుకున్నాం.ఈరోజు ..

*విటమిన్ D*
సహజం గా ఉదయం పూట ఎండ నుండి శరీరం తీసుకుంటుంది.మన శరీరం లో కాల్షియం తయారీకి ఈ విటమిన్D చాలా అవసరం.ఇది తగిన మోతాదు లో లేనపుడు
ఎపుడు అలసటగా వుండటం,నడుము లో నొప్పి,కాళ్ళు,చేతులు బాగా లాగటం,ఎముకలు బలహీనం గా ఉండటం ఇలా కొని లక్షణాలు కనిపిస్తాయి.సాధారణం గా విటమిన్D లెవెల్ 30 ఉండాలి.20 కంటే తక్కువ ఉంటే సమస్యలు మొదలు అవుతాయి.ఒక సర్వేలో తేలిన విషయం ఏమిటంటే భారత్ లో ప్రతి సంవత్సరం చాలా వేగంగా ,ముఖ్యం గా స్కూల్ పిల్లలు ఐటీ ఉద్యోగులు లోఎక్కువ వస్తుంది.20% వరకు స్కూల్ పిల్లలో ఈ లోపం ఉంది అని సర్వే చెబుతుంది.

*విటమిన్ D లోపం రావటానికి గల కారణాలు..*
మారిన మన లైఫ్ స్టైల్. పట్టణాలలో పెరిగిన అపార్ట్ మెంట్స్, సరైన ఎండ ఇంట్లోకి రాకపోవడం,ఈ మధ్యల చాలా మంది ఎక్సర్సైజ్ లు కొరకు జిమ్ కి వెళ్తున్నారు. అక్కడ ఉదయం పూట ఎండ తగలదు.ఇంకా ఇపుడు ఏసీ జిమ్ లు కూడా వచాయి. ఎక్కడికి వెళ్ళినా ఏసీ కారులోనే ప్రయాణం. ఆఫీసు లో కూడా ఏసీ నే ఇంకా అందరి కి అర్థం అయి ఉంటుంది.కారణాలు.

*పరిష్కారం..*
రోజు కాసేపు ఉదయం పూట ఎండలో నిలబడటం..సముద్రపు చేప అయిన సల్మాన్ చేపలో కూడా విటమిన్ డి లభిస్తుంది.ఈ చేప ఆయిల్ కూడా లభిస్తుంది.దీని తో టాబ్లెట్ లు కూడా చేస్తున్నారు.మరి మేము వెజిటేరియన్ అంటారా పుట్ట గొడుగులు లో కూడా కొంత శాతం ఉంటుంది. మన దేశీ ఆవు నెయ్యి లో కూడా పుష్కలంగా ఉంటుంది. 
ఆవు మోపురం లో సూర్య కేతి నాడి ఉంటుంది అది సూర్యుడి నుండి వచ్చే కాస్మిక్ ఎనర్జీ గ్రహించి పాల ద్వారా మనకు ఇస్తుంది.అందుకే పాలు బంగారు వర్ణంలో ఉంటాయి.

మానవ శరీరం లో ఎలాంటి సమస్య వచ్చిన శరీరానికి కావలసిన పోషకాలు ఇస్తే శరీరం తనకు తానే రిపేరు చేసుకొనే గుణం ఉంది. జీవితాంతం ఉదాహరణ కు బీపీ,షుగర్,మోకళ్ల నొప్పులు,థైరాయిడ్,ఇలా చాలా రకాలు ఉన్నాయి వీటిలో ఏదో ఒకటి వచి హాస్పిటల్ కి వెళ్తే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే.... కారణం ఒక సారి ఆలోచించండి..
వైద్యం చేస్తే రోగాలు తగ్గాలి కానీ......
. ఇది మీ ఆలోచనకే వదిలేస్తునను...

నాకు ఒక మిత్రుడు చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది.
*ఆసలు వ్యాధులు ఎలా మొదలు అవుతాయి*.అని అడిగినపుడు చెప్పిన విషయం. మీకు అర్థం అయ్యేలా సింపుల్గా నలుగు మాటలో చెబుతాను.

మన శరీరం లో రక్తనాళాలు ఉంటాయి.దీని వద్ద కొని పొరలు ఉంటాయి.వీటిని *ఎండో తీలియమ్ (endothelium)* అంటారు.ఇది ఎపుడైతే పాడవుతుందో ఇక మనకు సినిమా మొదలు అవుతుంది. ఈ పొరలు దెబ్బతిని గట్టి పడినపుడు రక్తం లో వేడి పెరిగి రక్త ప్రసరణ పై ప్రభావం చూపుతుంది దీనినే మనం *బ్లడ్ ప్రెజర్ (బీపీ)* అని పిలుస్తాము. ఉదాహరణ కు మన పొలం లో పెద్ద మోటార్ పేటి చిన పైపులు వేస్తే ఏమవుతుంది. ప్రేజర్ పెరిగి పైపులు పగిలిపోతాయి.అలాగే మన రక్త నాళాలు కూడా.

ఇంకా రెండవ విషయం *endothelium* డ్యామేజి అయినపుడు ఇన్సులిన్ సరిగా ఉత్పతి అవదు.ఒక వేళ అయిన శరీరం సరిగా తీసుకోదు.దీని వలన *డయాబెటిస్* వస్తుంది. అందుకే షుగర్,బీపీ లు అక్క చెల్లెలు లాంటివి.ఒకరు వస్తె ఇంకొకరు రావాల్సిందే..
ఇంకా మన పెద్ద అన్నయ గురించి తెలుసుకుందాం..

*Endothelium* గట్టి పడినపుడు శరీరం లో ఉన్న కొవ్వు పదార్థాలను తీసుకొని హార్డినరీ నాళాలను బ్లాక్ (మూసివేయడం) చేయడం వలన గుండెపోటు కారణం అవుతుంది.
ఇపుడు అందరికి కొంచం అవగాహన వచ్చింది అనుకుంటున్నాను.. 
వీటి అన్నిటికి కారణం మన ఆహారం లో మార్పు రావటం.
ఇకపై ఫాస్ట్ ఫుడ్,జంక్ ఫుడ్,ప్యాక్డ్ ఫుడ్,కూల్ డ్రింక్స్ వదిలేసి చక్కగా ఇంట్లో వండిన ఆహారం లో కమ్మగా రెండు నేతి చుక్కలు వేసుకొని తింటే సరి.

ఒక మిత్రుడు వాట్స్ అప్ లో ఒక మెసేజ్ పెట్టారు.
ఆవులకు ఏదైనా హెల్త్ సమస్య వచ్చినపుడు ఆవులకు,గేదెలకు,కోళ్లకు రాక రకాల ఇంజెక్షన్స్ , మందులు ఇస్తారు కదా, అలాంటపుడు ఆ పాలు ఎన్ని రోజులు మనం వాడకూడదు అని. నాకు ఈ విషయం పై అంత అనుభవము లేదు. తెలిసిన మంచి అనుభవము కలిగిన మిత్రులు డాక్టర్ సాయి గారిని ఆడిగినపుడు వారు తెలిపిన కొని విషయాలు క్రింద పోటో ను పేటను చూడండి.పశు వైద్యం లో సాయి గారు ఎంతో అపారమైన అనుభవజ్ఞులు..వారి అనుభవాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.

మిగతా విషయాలు రేపు.
రేపటి అంశం లో *ఆవు నెయ్యి లో వున ఇంకొనీ పోషకాల గురించి,సంప్రదాయ పద్ధతిలో ఆవు నెయ్యి తయారీ విధానం.నెయ్యి తయారీలో వాడే పాత్రలు,నెయ్యి కాసే విధానం* మొదలగు అంశాలు..

            

No comments:

Post a Comment