*దేశ వాలి ఆవు నెయ్యి..*
*నెయ్యి లో ఉండే పోషకాలు,ఉపయోగాలు.*
*అనారోగ్య సమస్యలకు నెయ్యి వాడే విధానం*..
ఇంతకు ముందు భాగంలో నెయ్యి మనకు ఎలా దూరమైంది,దానికి గల కారణాలు,నెయ్యి విశిష్టత నీ తెలిపే కొన్ని గ్రంథాల పేర్లు,నెయ్యి లో రకాలు,నెయ్యి లో ఉండే మంచి ఫ్యాటీ యాసిడ్స్ పేర్లు తెలుసుకునం.
ఇంకా ఈ రోజు అంశం లో కి వెళ్దాం..
*యావత్ జీవేత్ సుఖం జీవేత్,*
*రుణం కృత్వా ఘృతo బిబెత్*
ఆయుర్వేదం లో చెప్పిన ఒక మంచి మాట. జీవితం మొత్తం సుఖంగా ఉండాలి అంటే,అప్పు చేసి అయిన kiఆవు నెయ్యి తినాలి.
ఇలా ఎందుకు చేపారో అని చివర్లో అర్థం అవుతుంది.
*ఆవు నెయ్యి పసుపు రంగులో ఉండటానికి కారణం బీటాకేరోటిన్.*
నెయ్యి లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలుపుష్కలంగాఉన్నాయి
మీకో చిన్న చిట్కా చెబుతాను..మీకు ఎప్పుడైనా దెబ్బలు (గాయాలు) తగిలితే వెంటనే కొంచం ఆవు నెయ్యి లో తేనె కలిపి రాయండి. శరీరం పై కాలినమచ్చలు,గాయాల వలన ఏర్పడిన మచ్చలు కూడా తోలిగిపోతాయి. కొని పరిశోధనలో తేలిన విషయం. ఇంత అద్భుతం గా పని చేయటానికి పైన చెప్పిన యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం ప్రధాన కారణం.ఇంకా అసలు విషయం కి వెళ్దాం. నెయ్యి లో ఉండే పోషకాలు ఏమిటి?
ఒకపుడు పెద్దలు,పురాణాలు,గ్రంథాలు చెప్పిన మాటలు వినేవారు, జనరేషన్ మరి టెక్నాలజీ మారిన ఈ యుగంలో లో వున నేటి తరానికి NO పెద్దలూ,పురాణాలు.పెద్దల మాటలు ఈ కాలం లో చద్ది అన్నం ముటలే. ఈ బిర్యానీ యుగం లో చద్ది అన్నం కి విలువ ఎక్కడిది.చద్ది అన్నం లా చలువ చేసేది మన ఆయుర్వేదం ,చెప్పే మాటలు నమ్మే కాలం పోయింది.
ఇపుడున టెక్నాలజీ తో ఎన్నో విషయాలు తెలుసుకో గలుగుతునం. మన పరంపర శాస్త్ర విజ్ఞాననీ ఈ టెక్నాలజీ లతో శోధించి ఆసలు నిజాలు బయటకి తీయ గలిగితే మన దేశ ఆభివృద్ధి ని ఆపేది ఏదీ లేదు. మారుతున్న కాలానికి ఆధ్యాత్మికత తో కాకుండా సైన్స్ తో కలిపి చెబితేనే అర్థం అవుతుంది.
ఈ టెస్టింగ్స్ అన్ని కూడా చాలా ఖర్చు తో కుడుకునవి. మన వద్ద ఉన్న వస్తువు ఎంత నాణ్యమైనదో తెలియాలి అంటే టెస్ట్ చేయక తప్పదు.
మేము చేయించిన టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన అంశాలు పోషక విలువలు క్రింద ఇవ్వడం జరిగింది.
100 గ్రాముల నెయ్యి లో*
*Lab Report*
Omega 3Fatty Acid 0.25
Omega 6Fatty Acid 2.30
omega 9Fatty Acid 17.48
Vitamin E 0.044.
Vitamin D <10.0.
vita min k <50.
vitamin A 1.03.
(Energy 897.84. RDA%44.89)
Carbohydrates <1.0.
Protein <0.5.
Cholesterol. 162-47.
(Saturated fat. 76.663.
RDA-22. RDA%-348.47).
Sodium <0.5
RDA- 2000.
Trans fat <0.10
RDA 2.
PUFA 2.602.
MUFA 21.675.
Unsaturated fat 23.097.
పైన తెలిపిన పోషకాలు అన్ని ఆవు లలో ఒకే రకం గా ఉండవు. జాతి,ఆది తినే గడ్డి,మనం ఇచే పోషకాలు,ఆది తిరిగే వాతావరణం, ప్రాంతం ఇలా చాలా అంశాలపై ఆధార పడి వుంటుంది. నేను గమనించిన దాంట్లో గుజరాత్ కి చెందిన గిర్ ఆవుల పాలలో, నెయ్యి లో పోషకాల శాతం ఎక్కువ.
ఇపుడు పైన ఉన్న పోషకాలు మనకు ఎలా ఉపయోగ పడతావో చూదాం.. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను..ఈ విషయం లో ఎంతో అనుభవం ఉన్న వారు కుడా మన గ్రూప్స్ లో వున్నారు..మీ అనుభవాలు పంచుకోగలరు..
*Omega 3 fatty acid* వ్యాధి నిరోధకతను పెంచుతుంది.
(ఇమ్మ్యూనిటి బాగా ఆభివృద్ధి చేస్తుంది.)
ఎసిడిటీ,గ్యాస్టిక్ లను తగిస్తుంది.
గుండె కు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
నెయ్యి లో వుండే *బ్యూటరేట్* అనే రసాయనం వలన శరీరం లో వుండే వాపును తగిస్తుంది.మా అమ్మ గారికి మోకాళ్ళ నొప్పులు,మరియు కాళ్ళు విపరీతం గా వాయటం జరుగుతుండేది.వాడినా 15 రోజులకి కాలు వాపు తాగింది. నొప్పులు కూడా ఇంతకు ముందు అంత లేవు.ఈ బ్యూటరేట్ గుండె సంబంధిత సమస్యలను తగిస్తుంది.
*కంజి గ్రేటెడ్ లినోలిక్ ఆసిడ్* ఉండటం వలన శరీరం లో ఉన్న చేడు కొలెస్ట్రాల్ ను తగిస్తుంది.శరీర బరువు(ఉబకాయం) తగ్గుతుంది.గత మూడు నెలల్లో నేను 2.5కేజీ ల బరువు తగ్గటం జరిగింది. ఒక విషయం గుర్తు పెట్టుకోండి గేదె నెయ్యి బరువును పెంచుతుంది. ఆవు నెయ్యి కేవలం శరీరం లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మాత్రమే తీసివేస్తుంది. లావు ఎక్కడం అనేది కొలెస్ట్రాల్ వలన జరిగే ఒక ప్రక్రియ.
ఈమధ్యనే ఒక సర్వే తేలిన విషయం ఏమిటంటే భారతదేశం లో సుమారు 40 కోట్లమంది ఊబకాయం(obecity) తో బాధపడుతున్నారని తేలింది. సాగం రోగాలకు ఇదే కారణం.దీని గురించి తెలుసుకోవాలి అంటే ఇదో పెద్ద సబ్జెక్ట్.
డయాబెటిస్ ను కలిగించే ట్రైగ్లిజరైడ్స్ ను అదుపులో ఉంచుతుంది. ఈ షుగర్ వ్యాధి గురుంచి ఇంకో సందర్భం లో వివరంగా తెలుసుకుందాం.ఒక మిత్రుని సహకారం తో కొని ప్రయోగాల తరువాత ఒక మెడికేటెడ్ గృతం చేయడం జరిగింది.చాలా మందికి ఇవ్వటం జరిగింది.results చాలా బాగునవి.ఇంకా మెరుగైన ఫలితాలకు ప్రయత్న చేస్తున్నాం.
*విటమిన్ K* చర్మం మృదువుగా ఉంటుంది. ముడతలు పడకుండా,యవ్వనం గా ఉండటానికి ఉపయోగపడుతుంది. గాయాలు తొందరగా మానటానికి ఉపయోగ పడుతుంది.
*Vitamin A*
పాల లో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ A మారుతుంది.రోగ నిరోధక శక్తి పెంచుతుంది.శరీరం లో ఉండే చెడు కొలెస్ట్రాల్ LDL తగ్గిస్తుంది.కీళ్ల సమస్యలు తగ్గిస్తుంది.ముఖ్యం గా మెదడు చురుకుగా ఉండటానికి ఇది ఎంతో కీలకమైంది.నెయ్యి లో బీటకేరోటిన్ తో పాటు *లూటిన్* అనే పోషకం ఉంటుంది.సాధారణం గా ఈ లూటిన్ పాలకూర,క్యారెట్
లలో ఉంటుంది.అందుకే కంటికి మంచిది అని చెప్తారు.
మెదడు లో కణాల ఆభివృద్ధికి
జ్ఞాపక శక్తికి,ఏకాగ్రతను పెంచుతుంది. కాబట్టి నెయ్యి అనేది పిల్లల కి ముఖ్య ఆహారం గా ఉండాలి.
నెయ్యి లో వుండే shart chain fatty acids, omega 3 fatty acids, DHA, EPA, వలన మెదడు చురుకుగా ఉండటానికి పని చేస్తుంది.
అందుకే *ఆయుర్వేదం లో నెయ్యి ని*
*మేధ్యా రసాయనం అంటారు*.
అంటే మేధస్సు ని పెంచేది అని అర్థం.
సాఫ్ట్ వేర్ జాబ్ చేసే వాళ్లకి ఇది అత్యంత అవసరమైన ఆహారం.
ఒక చిన్న సూచన ఇంత గొప్ప ఔషధం లాంటి నెయ్యి లో ఎంతో కల్తీ జరుగుతుంది.కల్తీ తో పాటు అచ్చం ఆవు నెయ్యి రంగు,వాసన లా ఉండటం కొరకు కొన్ని రకాల కెమికల్స్ కూడా కలుపుతున్నారు.on line prouduts తో జాగ్రత్త.మీకు అందుబాటులో ఉండే గోశాల కు వెళ్ళి చూసి ,ఇంకా వీలు ఐతే అక్కడే కూర్చుని నెయ్యి కాయించి తీసుకోండి.లేదా నమ్మక మైన వారి వద్ద తీసుకోండి.
No comments:
Post a Comment