*. పిల్లల పాల ఉబ్బసం వ్యాధి నివారణ కొరకు అద్బుత యోగం -
. పాల ఉబ్బసం వచ్చే పిల్లలకు ముందుగా రొమ్ము మీద పొట్ట మీద ఆముదం రాయాలి. తరువాత వేడిగా ఉన్న ఆవుపాలల్లో కాటన్ గుడ్డని తడిపి బాగా పిండి ఆ గుడ్డతో ఆముదం రాసి ఉన్న పొట్ట , రొమ్ము మీద కాపడం పెడితే వెంటనే పాల ఉబ్బసం నుండి పిల్లలు తేరుకుంటారు. ఈ విధంగా అవసరాన్నిబట్టి రెండు మూడు సార్లు చేస్తే పాల ఉబ్బసం తగ్గిపోతుంది .
ఇది నేను ప్రయోగించిన యోగం .
*. గాయాలలో రక్తం ధారగా పోతున్నప్పుడు -
. ఏదన్నా ప్రమాదాలలో గాయాల పాలు అయినప్పుడు రక్తస్రావం తీవ్రంగా ఉంటుంది. ఆ స్థితిలో పత్రబీజం ఆకులను ముద్ద చేసి గాయం పైన వేసి కట్టుకట్టి మరుక్షణమే పత్రబీజం ఆకులు మెత్తగా దంచి 10 నుండి 20 గ్రాములు మోతాదుగా ఒక చెంచా పటికబెల్లం పొడి కలిపి లొపలికి తాగించాలి.వెంటనే గాయాలు నుండి రక్తం కారడం ఆగుతుంది . రక్తస్రావం త్వరగా ఆగకపోతే మరో రెండు మూడు మోతాదులు గా కూడా ఒక గంట వ్యవధిలో లొపలికి ఇవ్వవచ్చు. అప్పుడు తప్పకుండా రక్తం ఆగి ప్రాణాలు దక్కుతాయి.
. ప్రమాదాలు జరిగినప్పుడు దెబ్బలు తగిలి ఆయా అవయవాలు పిప్పిపిప్పిగా నలిగిపోయినప్పుడు వైద్యులు ఈ అవయవాలను సరిచేసి వాటిపైన ఈ పత్రబీజం ఆకులు కట్టేవారు . చితికిపోయిన మాంసం ముద్ద యధాస్థితికి వచ్చి అతి త్వరలోనే ఆ అవయవం ఆరోగ్యాన్ని పుంజుకొని మామూలుగా పనిచేస్తుంది .
దీనిని సామాన్య పరిభాషలో "రణపాల " అని పిలుస్తారు .
*. అమీబియాసిస్ వ్యాధి నివారణ కొరకు -
. తులసి దళాలు , వాయువిడంగాలు సమ బాగాలుగా దంచి 2 పూటలా పూటకు రెండున్నర గ్రాముల మోతాదుగా సేవిస్తూ ఉంటే అమీబియాసిస్ హరించిపోతుంది.
గమనిక - వాయువిడంగాలు మీకు ఆయుర్వేద పచారి షాపుల్లో దొరుకుతాయి.
*. తియ్యటి కంఠస్వరం కొరకు -
. రోజు రెండు పూటలా పూటకు 5 గ్రాములు దోరగా వేయించిన శొంటి పొడి , పటికబెల్లం పొడి 5 గ్రాములు , తేనె 10 గ్రాములు కలిపి ఒక మోతాదుగా సేవిస్తూ ఉంటే గొంతు బాగుపడి తియ్యటి కంఠస్వరం వస్తుంది.
గోరుచుట్టుకు నేను ప్రయోగించిన రహస్య సిద్ద యోగం -
. చాలా మంది గోరుచుట్టు రాగానే నిమ్మకాయ కి రంధ్రము చేసి వేలికి తొడుగుతారు . మరికొంతమంది గేద పేడ వేసి కట్టడం మరియు ఉల్లిగడ్డ వేసి కడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం మరియు తీవ్రమైన బాధని కలుగచేస్తుంది . క్రమేణా రక్తం , చీము బయటకి వెలువడి శస్త్రచికిత్స కూడా అవసరం అగును.
ఇటీవల ఒక వ్యక్తి గోరుచుట్టు తో తీవ్రవేదనతో నన్ను కలిశాడు . అతనికి నేను చేసిన చికిత్స వివరాలు తెలియచేస్తున్నాను .
. మొదట 100 గ్రాములు గుల్లసున్నం తీసుకుని సీసాలో వేసి నీరుపోసి బాగా కలిపాను. కొంతసేపటికి సున్నం అంతా కిందికి చేరుకొని పైన తేరుకున్న నీటిని వేరొక సీసాలో పోసి ఆ నీటికి సమానంగా ఆముదం ఆ నీరు గల సీసాలో పోసి బాగా కదిపాను . 15 నిమిషముల తరువాత నీరు మరియు ఆముదం కలిసి తెల్లని రంగు గల ద్రవం ఏర్పడినది .
. ఆ ద్రవాన్ని దూదిపైన వేసి వాపు ఉన్నంతవరకు రాసి కట్టుకట్టాను . కేవలం 3 రోజుల్లో గోరుచుట్టు కరిగిపోయింది. బాధ కూడా తగ్గిపోయింది .
. నిమ్మకాయ సరాసరి గోరుచుట్టు ఉన్న వేలికి పెట్టరాదు . నిమ్మకాయలో సున్నం మరియు పసుపు కలిపిన పారాణి ముద్ద పెట్టిన తరువాతే నిమ్మకాయ పెట్టండి . లేదా నిమ్మకాయ లేకుండా ఆ పారాణి ముద్దని కట్టండి.
.
No comments:
Post a Comment