Saturday, July 12, 2025

రోజు అంశం దేశీ ఆవు పాలు



*ఆవు పాలలో ఉండే పోషకాలు.*
*ఆవు పాల వలన కలిగే లాభాలు*

గంగిగోవు పాలు గరిటడైనను చాలు 
కడివేడైననెల ఖరముపాలు..
వేమన గారు చెప్పిన ఈ పద్యం అందరికి తెలిసిందే 

దేశీ ఆవు అయిన గిర్ ఆవు పాల లో ఉండే పోషకాలు.
100 ml లో
*1.క్యాల్షియం. 171.54mg* 
*2.ఫాస్పరస్. 86.83mg*
*3.మెగ్నీషియం 14.15mg* 
*4.విటమిన్A. 93.47iu* 
*5.విటమిన్ B12 0.10mcg* 
*6.జింక్. 0.36mg* 
*7.ప్రోటీన్. 3.15g*
*8.కాలరీస్. 69kcal*

పై విషయాలు మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వున ప్రముఖ ల్యాబ్ రేటర్ లో చెక్ చేసి చెబుతున విషయాలు.
నాకు తెలిసిన కొని ముఖ్యమైన విషయాలు..
ఈ పోషకాలు అన్ని ఆవు జాతుల లో ఒకే రకం గా ఉండవు.వాటికి మనం పెట్టే గడ్డి,మరియు దాన, ఇతర పోషకాలు,వాతావరణ పరిస్థితులు,వాటి ఆరోగ్యం,ఆరు బయట తిప్పడం,వాటి పరిసరాలు పరిశుభ్రం ఉంచడం,వాటికి ఒక రకమైన ఆహ్లాదకర మైన వాతావరం కల్పించడం ఇలా ఎన్నో అంశాలపై పాల నాణ్యత దిగుబడి మరియు పోషకాలు లభ్యత అనేది ఆధారపడి ఉంటుంది.

*ఆవు పాల వలన కలిగే లాభాలు*
పైన చూసిన ఈ పోషకాలు అని మీకు మనం రోజు వాడే టాబ్లెట్స్ పై స్పష్టం గా చూడవచ్చు.
ఆవు పాలను సంపూర్ణ ఆహారగా పిలుస్తారు ఎందుకంటే మనకు కావలసిన అని పోషకాలు దీంట్లో ఉంటాయి కనుక. విటమిన్స్ A,D,E,K , ప్రోటీన్స్, ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఉదాహరణకు కొన్ని చూద్దాం..

*కాల్షియం:* 
1 ఎముకలు దృఢం గా బలం గా ఉండటానికి , కండరల పనితీరునుమెరుగుపరుస్తుంది.
3. గుండె ను బలంగా ఉంచుతుంది.
4.మరియు రక్తప్రవాహంలో ఇతర ఖనిజాల (పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్) స్థాయిని కంట్రోల్ చేస్తుంది.
5.ప్రతి రోజు మనిషికి 1000 mg వరకు అవసరం.
*విటమిన్ A:* కంటి చూపుకు,చర్మ సంరక్షణకు చాలా ముఖ్యం..వ్యాధి నిరోధక శక్తికి,గర్భం లో వున శిశువు పెరుగుదలకు...
*విటమిన్ బి12:* రక్త కణాల అభివృద్ధి, హిమో గ్లోబిన్ పెరుగుదల ఉంటుంది.ఒక వేళ B12 శరీరంలో తగితే మతి మరుపు పెరిగే అవకాశం ఉంది
*జింక్:* దీని లోపం వలన జుట్టు రాలిపోవడం,శరీరం పొడి బారిపోవడం,చిరాకు పెరగడం,తొందరగా అలసి పోవడం,ఏకువ నిద్ర రావడం .... చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి..

ఇపుడు వస్తున అనారోగ్య సమస్యలకు చాలా కారణాలు ఉన్నవి.నాకు తెలిసినవి కొన్ని..
1. మనం వ్యవసాయం లో వాడుతున యూరియా, పురుగుమందులు, గడ్డి మందులు.వీటి వలన ఆటు భూమి కి సారం పోతుంది మనిషికి ప్రాణం పోతుంది.
2. వాతావరణ కాలుష్యాలు మనం పిలుస్తున గాలి,నీరు అంత కాలుష్యాలతో నిండి పోతుంది. ఉదాహరణ మన రాజధాని డిల్లీ.
3. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పు. ప్యాక్డ్ ఫుడ్,జంక్ ఫుడ్ కి మనుషులు బాగా అలవాటు పడ్డారు.
4. నాకు తెలిసి ఈ అనారోగ్య సమస్యలకు సగం కరణం సరైన పోషక ఆహారం తీసుకోక పోవడం.
5. ఇంకో ముఖ్య కారణం కల్తీ మాఫియా.ఉదయం మనం తీసుకొనే టీ పొడి పాల నుండి మొదలై రాత్రి తీసుకునే తాంబూలం వరకు అన్ని కళ్తినే. ఇది కూడా ఒక కారణం..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి.
సరే ఇక పాల విషయానికి వస్తె ఒకపుడు పాలలో నీళ్లు కలిపి అమ్మే వారు,తరువాత పలచగా ఉంటే అడుగుతున్నారని నీళ్ళు తో పాటు,పాల పౌడర్,తరువాత నూనెలు ఇంకా నాణ్యత పెంచాలి అని యూరియా,తరువాత కొన్ని రకాల కెమికల్స్,ఇంకా ఇపుడు ఈ నాణ్యత సరిపోవడం లేదని పాలే లేకుండా పాలని సృష్టిచేస్తున విశ్వమిత్రులను కూడా ఈ మధ్యన మన టీవీ లలో చూస్తున్నాం.ఇంకా ప్యాకెట్ పాలు వీటి గురించి చెప్పవలసిన అవసరం లేదు.ఇంతకు ముందు పూతన గురుచిచేపుకునం కదా ఈ పూతన కి తోడు ఇపుడు ఈ విశ్వామిత్రులు ఏమి చేయగలం..
ఇలాంటి పాలు తాగినపుడు ముఖ్యంగా చిన్న పిల్లలో బుద్ధి మందగించడం,అధికం గా లావు పెరగడం,ఆర్టిజం,హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వలన చిన్న వయసు లోనే అమ్మాయిలు మెచ్యూర్ కావడం, పెద్దల్లో క్యాన్సర్ , హార్ట్ ఎటాక్, థైరాయిడ్ సమస్యలు శరీరంలో ఇమ్యూనిటీ తగ్గడం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 
పాలు కొనే ముందు ఒకసారి ఆలోచన చేయండి. దొరికితే మంచి ఆవు పాలు త్రాగండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే ఒక ఆవుని కొనుక్కోండి. మనం సంపాదించే ఆస్తులకంటే కంటే మన పిల్లల మన ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. 
రేపటి అంశం లో 
*నెయ్యి దాని ప్రాముఖ్యత*
*నెయ్యిలో ఉండే పోషకాలు*
*మన అనారోగ్య సమస్యల నివారణలో నెయ్యి పాత్ర ఏమిటి?*
*నెయ్యి యొక్క విశిష్టతలు*
*సాంప్రదాయక పద్ధతిలో నెయ్యి తయారీ విధానం*
 గురించి తెలుసుకుందాం...

       

No comments:

Post a Comment