🌟 *మన జీవన వికాసము – నాలుగు మానసిక స్థాయిలు:*
🌻 *జీవితంలో మనము ఎదుర్కొనే Comfort Zone → Fear Zone → Learning Zone → Growth Zone అనే నాలుగు దశలు మన వికాసాన్ని నిర్ణయిస్తాయి. ఈ దశల పరిణామము ద్వారా మనము సాధారణ స్థితిలోనుంచి అసాధారణ వ్యక్తిత్వ స్థితికి ఎదగగలము.*
🟦 *1. సౌకర్య పరిధి (Comfort Zone) అంటే ఏమిటి?*
✅ *ఇది మనకు ఆశ్రయము, మన నియంత్రణలో ఉండే స్థితి.*
🌹 *కొన్ని సంవత్సరాల నుండి అలవాటైన పనులు, పాత ఆలోచనలు, భద్రతభావముతో నిండి ఉంటుంది.*
🔍 *మన అనుభూతి: చాలా సులువు, శాంతమైనది, కానీ... ఎటువంటి వికాసం లేకుండా నిశ్చలంగా ఉంటుంది.*
⛔ *దుష్పరిణామాలు: మన అభివృద్ధికి అడ్డుకట్ట, జీవితానికి నిస్సారతను, మరియు భవిష్యత్తులో "మనము ఎందుకు ప్రయత్నించలేకపోయా ము?" అనే విచారమును కలిగిస్తుంది.*
🚪 *ముందుకు సాగాలంటే: మనము సౌకర్యపు గడిలో ఉన్నామా? అని ఆత్మపరిశీలన చేయాలి*
🌹 *“ఈ స్థితి నన్ను నిజంగా అభివృద్ధి చేస్తుందా?” అని ప్రశ్నించుకోవాలి*
🌹 *చిన్న చిన్న అసౌకర్యాలను అంగీకరించాలి – అదే మొదటి అడుగు*
🟥 *2. భయ పరిధి (Fear Zone) అంటే ఏమిటి?*
✅ *సౌకర్యపు పరిధిని విడిచిన వెంటనే మనం చేరే దశ*
🌹 *భయము, అనిశ్చితి, ఆత్మవిశ్వాసలోపము ఈ దశలో చాలా సహజము*
🔍 *మన అనుభూతి: “మన వల్ల కాదు” అనే అనుమానము, ఇతరుల అభిప్రాయాలపై భయము మరియు తిరిగి సౌకర్య పరిదధిలోకి వెళ్ళాలనిపించటము.*
⛔ *ప్రమాదం: భయమే మన వికాసానికి మొదటి అడ్డుగోడ అవుతుంది. మన కలలను వదులుకోవడానికి కూడా కారణం అవుతుంది*
🚪 *ముందుకు సాగాలంటే: భయాన్ని అంగీకరించి ధైర్యంగా ముందడుగు వేయాలి, మనకు మద్దతు ఇవ్వగల వారితోనే కలిసి ముందుకెళ్ళాలి మరియు మనము “ఎందుకు? లేదా అవసరమా?" అని మనసులో ప్రశ్నించుకొని, లక్ష్యము కొరకు పని చెయ్యాలి.*
🟨 *3. అభ్యాస పరిధి (Learning Zone)అంటే ఏమిటి?*
✅ *భయాన్ని ఎదుర్కొన్న తరువాత చేరే దశ*
🌹 *ఇక్కడ మనం నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటాము మరియు గత తప్పుల నుంచి కూడా ఎదుగుతాము.*
🔍 *మన అనుభూతి: ఉత్సాహభరితంగా, సవాళ్లతో కూడినదిగా ఉంటుంది మరియు స్వీయ అవగాహన పెరుగుతుంది*
✅ *ప్రయోజనాలు: మన సౌకర్య పరిధి అంతరించిపోతుంది, నూతన నైపుణ్యాలు, విజ్ఞానము పెరుగుతుంది మరియు ఆత్మవిశ్వాసము మరింతగా బలపడుతుంది*
🚪 *ముందుకు సాగాలంటే: నిత్యం కొత్త విషయాలను నేర్చుకునే అలవాటును పెంచుకోవాలి, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి మరియు చిన్న చిన్న విజయాలకు కూడా ఆనందించే గుణమును పెంచుకోవాలి.*
🟩 *4. వికాస పరిధి (Growth Zone) అంటే ఏమిటి?*
✅ *ఇది లక్ష్య స్పష్టత, ధార్మిక జీవన దిశ మరియు సంతృప్తిని కలిగించే దశ. ఇదే మన యొక్క "అసలైన స్థితి” కి చేర్చే దశ*
🔍 *మన అనుభూతి: ఆత్మబలము, ఆశయము, ఆనందము, సేవభావము, ఇతరులకు స్ఫూర్తి మరియు ఇతరులను ప్రభావితము చేయగల స్థితి*
✅ *ప్రయోజనాలు: స్పష్టమైన ఆలోచనా దృక్పథముతో కూడిన జీవనము, ఆత్మసంతృప్తితో కూడిన నిర్ణయాలు, నిరంతర వ్యక్తిత్వ వికాసము అనేది ఒక గొప్ప జీవనశైలి అవుతుంది*
🔄 *గమనిక: ఈ దశకు చేరుకున్న తరువాత కొత్త సవాళ్ళతో మరోసారి కొత్త అభ్యాస దశ కూడా ప్రారంభమవుతుంది. ఇదే అసలైన అభివృద్ధి.*
🔄 *ప్రతి దశలో నుండి ముందుకు ఎలా సాగాలి?*
🌸 *సౌకర్య పరిధి నుండి భయ పరిధికి మారడానికి గాను చిన్న చిన్న సవాళ్లను స్వీకరించాలి, అవసరం లేని అలవాట్లను విడిచిపెట్టాలి.*
🌸 *భయపరిధి నుండి అభ్యాస పరిధిలోనికి ధైర్యంతో ముందుకు సాగాలి, మద్దతును పొందాలి, ఎందుకు చేస్తున్నామో గుర్తించాలి.*
🌸 *అభ్యాస పరిధిలో నేర్చుకున్న దానిని వికాస పరిధిలో పూర్తిగా ఉపయోగించి, లక్ష్యాన్ని స్పష్టంగా ఏర్పరచుకోని, కృషి చెసి, విజయాన్ని పొందాలి.*
🌿 *మన అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతము చేసే కొన్ని పద్ధతులు:*
📝 *1. దినచర్య మరియు ఆత్మపరిశీలన: “నేడు మేమేమి నేర్చుకున్నానము?”, “ఎక్కడ? ఎప్పుడు? ఏవిధంగా అభివృద్ధిని, మేము నివారించాము?” అని ప్రశ్నించుకోవాలి.*
🎯 *2. వికాస లక్ష్యాలు: ప్రతి వారానికి, ప్రతి నెలకు స్మార్ట్ గా స్పష్టమైన లక్ష్యాలను, కాల పరిమితితో ఏర్పాటు చేసుకోవాలి.*
🤝 *3. బలమైన మద్దతు వలయము: మనకు ధైర్యమును, స్పూర్తిని ఇచ్చే వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకోవాలి.*
🧠 *4. మైండ్‌సెట్ మార్పు: "తప్పయితే ఏమవుతుంది?" అనేదానికి బదులుగా "వృద్ధి అయితే ఏమవుతుంది?" అనే దృక్పథమును అలవాటు చేసుకోవాలి*
💬 *స్ఫూర్తిదాయకమైన వాక్యము: "గొప్పగా జీవించాలంటే, జీవితాన్ని గొప్పగా మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ, ఎదో ఒక దశలోనైనా, జీవితాన్ని ధైర్యముతో మొదలు పెట్టకపోతే గొప్పవాళ్ళవ్వలేరు."*
🌸 *ముగింపు సందేశం: మన యొక్క వికాసము, శక్తి, విజయము మరియు జీవన పరిపూర్ణత అనేది సౌకర్యవంతమైన పరిధిని దాటి, భయాన్ని ఎదిరించి, నిరంతరము కొత్త వాటిని అభ్యసిస్తూ, వికాస పథములో ముందుకు సాగడములోనే ఉంది.* 🌱
🪷 *"ఓం యద్భావం తద్భవతి"*
🕉️ *సనాతన ధర్మ భారత మాతాకీ జై*
💪 *స్వాస్థ్య భారత మాతాకీ జై*
🌏 *విశ్వగురు భారత మాతాకీ జై*
🪷 *"సనాతన ధర్మమే ప్రాణము – ఆరోగ్యమే ఆధారము – విశ్వగురుతత్వమే మనందరి లక్ష్యము."*
🌏 *ఓం జో శ్రీ అచ్యుతానంద యోగము, ("5D" నేటి తరానికి అనుగుణముగా నవీకరించబడిన యోగ శాస్త్రాలు మరియు సాధనలు), శ్రీ సౌభాగ్య నగరము (Hyd), తెలంగాణా.*
🙏💚 *ధన్యవాదములు* 🌸🌱
🌏 *అంతా సరిగానే ఉంది*
*ఓం శాంతిః శాంతిః శాంతిః*
🙌 *ఓం తధాస్తు, తధాస్తు, తధాస్తు*.
🪷🌼🌻🌸🌺🏵️💐
No comments:
Post a Comment