*రెండవ భాగం*
ఇక ఈరోజు అంశంలోకి వచ్చేద్దాం.
*పాలు ఎన్ని రకాలు?*
*A1,A2 అంటే ఏమిటి?*
*వీటిని ఎలా వర్గీకరిస్తారు?*
*ఏ పాలు మంచివి.*
*ఏ పాలు హాని కలిగిస్తాయి వాటి ప్రభావాలు ఎలా ఉంటాయి*
ఈరోజు క్లుప్తంగాతెలుసుకుందాం
*A1 మరియు A2 పాలు అంటే ఏమిటి?*
మిత్రులందరికీ ఒక సందేహం రావచ్చు పాలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా మళ్లీ ఈ A1,A2 ఏంటి అని. చలో ఇక అసలు విషయం తెలుసుకుందాం. పాలలో ప్రోటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఫ్యాట్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మన సినిమాలో హీరో ప్రోటీన్, ఈ ప్రోటీన్ రెండు రకాలు ఒకటి 1.కేసిన్ ప్రోటీన్ 2.వే ప్రోటీన్.
ఈ ప్రోటీన్ మొత్తంలో 80% కేసిన్ ఉంటుంది.
తిరిగి ఈ కేసిన్ నాలుగు రకాలుగా ఉంటుంది.
1 .ఆల్ఫా s1
2. ఆల్ఫా s2
3. బీటా కేసిన్
4. గామా కెసిన్.
పై నాలుగులో బీటా కేసిన అనేది చాలా ముఖ్యమైనది. ఇది మన సెకండ్ హీరో.
అసలుA1,కిA2 తేడా అంతా ఇక్కడే ఉంటుంది. ఇక మన సినిమాలో ట్విస్ట్ అంతా ఇక్కడ నుండి ఉంటుంది. ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి.
మన హీరో ప్రోటీన్ గురించి అసలు *ఈ ప్రోటీన్స్ ఎలా తయారవుతాయి.*
ప్రోటీన్స్ అన్నీ కూడా ఎమినో ఆసిడ్స్ తో తయారవుతాయి ఇక మన సెకండ్ హీరో బీటా కేసిన్ వద్దకు వెళ్దాం.
* *ఈ బీటా కేసిన్ 209 అమినో యాసిడ్స్ తో తయారవుతుంది*
A1 పాలలో A1 బీటా కేసిన్ ఉంటుంది.
A2 పాలలో A2 బీటా కేసిన్ ఉంటుంది.
ఇక్కడి నుండి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పటికే అర్థం కాక బుర్ర వేడెక్కి ఉంటుంది మిత్రులకి. ఎందుకంటే మనం డాక్టర్లు సైంటిస్టులు కాదు కదా, రోజు ఈ పేర్లు విని ఉండము.
ఇప్పుడు ఒకసారి సింపుల్ గా క్లుప్తంగా చూద్దాం
1. పాలుA1,A2 రెండు రకాలు.
2. పాలలో 80% ప్రోటీన్స్ ఉంటాయి.
3. ప్రోటీన్స్ రెండు రకాలు
1 కేసిన్ 2 వే ప్రోటీన్.
4. ప్రోటీన్స్ లో 80% కేసీన్ ఉంటుంది (హీరో 1).
5. కేసిన్ నాలుగు రకాలు 1.ఆల్ఫా s1
2. ఆల్ఫా s2
3. బీటా కేసిన్
4. గామా కేసిన్
6.పై 4 లో బీటా కేసిన్ (హీరో2).
7. ప్రోటీన్స్ అమినో ఆసిడ్స్ తో తయారవుతాయి.
8. మన హీరో 2 బీటా కెసిన్ 209 అమినో యాసిడ్స్ తో తయారవుతుంది
9. A1,A2 కి తేడా అంతా మన బీటా కేసిన్ వద్దే ఉంది.
ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది రాకపోతే ఒకసారి పై 9 పాయింట్స్ చదవండి. ఇప్పుడు మన సినిమా సగం అయింది. ఇంకా అన్ని మర్చిపోయి మన ఇద్దరు హీరోలనే గుర్తు పెట్టుకోండి.
ఇంతకుముందు
చెప్పుకున్నట్టు మన సెకండ్ హీరో బీటా కేసిన్ 209 ఎమినో ఆసిడ్స్ తో తయారవుతుంది. ఉదాహరణ 1, 2, 3, 4, 10, 20, 40, 60, 65, 66, 67, 68, 69, 70, 75, 100, 200, 206, 207,208, 209 ఈ రకంగా అమినో ఆసిడ్స్ లింక్ ఉంటుంది.
ఇకA1,A2 పాలకి తేడా అంతా 67వ అమినో యాసిడ్ వద్ద వచ్చింది.
మిగతావి అన్ని ఒకే రకంగా ఉన్నవి ఇక్కడే పాలు రెండు రకాలుగా విడిపోయాయి
*67 వద్ద A1 పాలలో హిస్టరీ అనే ఎమినో ఆసిడ్ ఉంటుంది*.
*A2 పాలలో ప్రోలిన్ అనే అమినో ఆసిడ్ ఉంటుంది*.
*ఇకA1,A2 పాలు ఇచ్చే పశుజాతులు ఏంటో తెలుసుకుందాం*
.
అమ్మ ఇప్పటికే బుర్ర వేడెక్కిపోయింది అని అనిపిస్తుంది కదా ఇంకా ఏమి కన్ఫ్యూజన్ ఉండదు.
*A1 పాలు ఇచ్చే జాతులు:* యూరోపియన్ బ్రీడ్స్ అయినా జెర్సీ,HF లలో A1 బీటా కెసిన్ ఉంటుంది. వీటి గురించి తెలుసుకోవాలంటే చరిత్ర చాలా పెద్దది సింపుల్గా చెప్పాలి అంటే యూరోపియన్ కంట్రీస్ లో మాంసం కోసం కృత్రిమంగా తయారు చేసుకున్న ఒక పశువు.
*A2 పాలు ఇచ్చే జాతులు*
మన దేశీ ఆవులు అయినా గిర్,సాహివాల్, కాంక్రేజ్, ఒంగోలు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన దేశీ ఆవులు ఏవైనా కూడా వాటిలోA2 బీటా కేసిన్ ఉంటుంది.
ఇక అసలు విషయంకి వెళ్దాం....
A1 పాలు తాగిన తర్వాత మన శరీరంలో *BCM7* అనే కెమికల్ విడుదల అవుతుంది.
*BCM7 అంటే బీటా కేసో మార్పిన్.* మార్పిన్ అనేది మత్తుమందు లాంటిది.
దీనివలన పాలు తాగినప్పుడు పిల్లల్లో అయితే ఆర్టిజన్ (మతిమరుపు రావడం) , ఎలర్జీస్, ముక్కు ఎప్పుడు కారుతూ ఉండడం, ఆస్తమా ఇంకో ముఖ్య విషయం ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య షుగర్, చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు ఎవరిని వదలడం లేదు. ఒక రీసెర్చ్ లో చెప్పిన విషయం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మంది ఈ షుగర్ బాధితులు ఉన్నారు.
Top1- భారత్ లో 21.2 Cr
Top2- చైనా లో 14cr
Top3-అమెరికా లో 4.2
Top4-పాకిస్తాన్ లో 3.6
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే సంవత్సరానికి భారత్ లో36 వేల కోట్ల రూపాయల టర్నోవర్ కేవలం ఈ షుగర్ మందులది.
! ఈ BCM7 వలన కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ మేటబాలిజం ఆల్టర్ అయ్యి అయ్యి డయాబెటిస్ రావడానికి ఎక్కువ కారణం అవుతుంది.
! హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా కారణం.
ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి ఏ పాలు తాగాలి?
నాకు ఒక చిన్న విషయం గుర్తుకొస్తుంది రాజీవ్ దీక్షిత్ గారు ఈ జెర్సీ, HF ఆవులను పూతనతో పోల్చుతారు, క్షమించాలి వీటిని ఆవులు అని అనకూడదు. పూతన అంటే శ్రీకృష్ణుని బాల్యంలో కంసుడు పంపిన ఒక రాక్షసి కృష్ణుడికి పాలు ఇచ్చి చంపాలని చూస్తుంది, ఇప్పుడు ఈ పూతన లు మనకు పాలిచ్చి చంపుతున్నాయి. ఇప్పుడు మనం తాగుతున్న పాలు ఏవి అని ఒకసారి ఆలోచించండి. ఇంకా మీరు మీ పిల్లలు ఏ పాలు తాగాలో నిర్ణయించుకోండి. ఇప్పుడు మీకు అర్థం అయి ఉంటుంది ఆవుని గోమాత అని ఎందుకు అంటారు.
రేపటి అంశంలో పాలలో ఉండే పోషకాలు నెయ్యి ఇంకా ఇతర విషయాలు తెలుసుకుందాం.నచ్చితే నలుగురికి షేర్ చేయండి కనీసం ప్రజలకి ఆవు విశిష్టత పాలపై అవగాహన ఏర్పడుతుంది అని నా అభిప్రాయం...
* *అన్ని తెలుసుకున్న తర్వాత మీరే అంటారు" జై గోమాత"**
మీ
శివప్రసాద్ రాజు
No comments:
Post a Comment