*తాళం తో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది!*
*ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు!!*
*అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు!*
*******************
*తూటాకంటే శక్తివంతమైనది మాట! ఒక్క మాటతో సంబంధం తెంచు కోవచ్చు!*
*ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు!*
*************************
*మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి! కత్తెర లాగ కాదు!!*
*సూది పని ఎప్పుడూ జోడించడమే! కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే!!*
*అందరిని కలుపుకుంటూ బ్రతకాలి! కత్తెర లాగా విడదీస్తూ కాదు!!*
**************************
*నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు!*
*కానీ ప్రపంచాన్ని మార్చేశక్తి నిజానికి ఉంది!!*
************************
*నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమస్యలు లేవని కాదు!*
*వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నీకు ఉన్నాయని!!*
***************************
*స్నేహితుడిని నీ దుఃఖ సమయము లోను,*
*యోధుడిని యుద్ధంలోను,*
*భార్యను పేదరికంలోను,*
*గొప్పవ్యక్తిని అతని వినయంలోను, పరీక్షించాలి!*
**************************
*చేసిన తప్పుకు క్షమాపణ*
*అడిగేవాడు ధైర్యవంతుడు!*
*ఎదుటి వారి తప్పును*
*క్షమించగలిగిన వాడు*
*బలవంతుడు!!*
*కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే, సుఖమై నిన్ను ప్రేమిస్తుంది!*
.
No comments:
Post a Comment