ఆవులతో అనుబంధం ఉన్న కానీ వ్యవసాయం,దేశీ విత్తనాల పైనే ధ్యాస ఉండేది.
ఎందుకో తెలియదు కానీ ఒక సంవత్సరం నుండి ఆవులపై ఆసక్తి పెరిగి, వీటిపై దృష్టిపెట్టడం పెట్టిన తర్వాత కొంత రీసెర్చ్ చేయడం జరిగింది. సుభాష్ పాలేకర్ గారి వలన మొదట ఆవు ప్రాధాన్యం వ్యవసాయం లో వాటి ప్రాధాన్యత తెలిసింది.కానీ ఎక్కడో ఒక చిన్న అనుమానం, మన శాస్త్రాలలో,గ్రంథాల్లో,పెద్దలు చెప్పినవి మొదట్లో అంత నమ్మకం గా అనిపించేవి కావు. ఆవును కేవలం గొప్పగా చూపించాడనికే అనిపించేది. క్రమంగా అర్థం అయింది. పాలు, నెయ్యి, పేడ,మూత్రం కొన్ని అంశాలను సైంటిఫిక్ గా స్టడీ చేయడం,ప్రయోగాలు చేయడం, ఆవుల సంరక్షణ వివిధ రకాల గడ్డి జాతులు, ,పోషకాలు ఇలా ఎన్నో అంశాలు. మొదట్లో ఏముంది లే గడ్డి వేస్తే సరి అనుకున్న. కానీ ఇదో మహా సముద్రం.వ్యవసాయం మాదిరిగానే ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు,సవాల్ లు,మార్కెటింగ్ సమస్యలు..నేను చూసిన ఈ దేశీ ఆవుల డెయిరీ లో నూటికి 50% సక్సెస్ రేటు మాత్రమే ఉంది. చాలా మంది ఆవులు లు పెట్టడం తీసి వేయడం ఎన్నో చూసాను.కారణాలు చాలా ఉన్నాయి. కొత్తగా ఆలోచించి,ఎక్కడ లేని మన వద్దనే దొరికే ,అందరికి అవసరమైన ఒక మంచి నాణ్యమైన ప్రొడక్ట్ మనం సమాజానికి ఇవ్వ గలిగితే వ్యవసాయంలో అయినా డెయిరీ లో అయినా తిరుగుండదు అని నా అభిప్రాయం... సముద్రమంత ఈ గో ప్రపంచం లో నీటి చుక్కంత నా అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
*మొదటి భాగం..*
ఈరోజు దేశీ ఆవులు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
1. భారతదేశంలో 40 కి పైగా గో జాతులు ఉన్నవి.
2. భారతదేశంలో ఉన్న భిన్న వాతావరణ పరిస్థితులు కారణంగా ఆ ప్రాంతానికి అనుగుణంగా ఈ గోజాతులు ఉన్నవి.
3. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వీటికి పేర్లు కలవు. ఉదాహరణకి కొన్ని చూద్దాం.
*అధిక పాల దిగుబడిన కలిగిన జాతులు*
1. సాహివాల్ (పాకిస్తాన్)
2. రెడ్ సింధి (కరాచీ)
3. గిర్ (గుజరాత్)
*పాలకి వ్యవసాయానికి ఉపయోగపడే జాతులు*
1. ఒంగోలు (ఆంధ్ర ప్రదేశ్)
2. దియోని (మహారాష్ట్ర)
3. కాంక్రేజ్ (గుజరాత్ కచ్)
4. థార్ పార్కర్ (పాకిస్తాన్)
5. హర్యానా (హర్యానా)
*కరువు ప్రాంతాలకి అనుకూలంగా ఉండే జాతులు*
1. అమృత మహల్ (కర్ణాటక)
2. హలికర్ (కర్ణాటక)
3. కిలారి (మహారాష్ట్ర)
4. కంగాయం (తమిళనాడు)
5. వేచూర్ (కేరళ)
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
మొదటి నుంచి భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. భారతీయులకు గోవు అత్యంత పవిత్రమైంది. పాడిపంటలకు చాలా కీలకమైంది. భారతదేశంలో యాంత్రికరణకు ముందు అంటే ట్రాక్టర్లు. ఇవి లేనప్పుడు వ్యవసాయంలో మరియు రవాణా అంతా కూడా ఎద్దులు ఇతర జంతువులపైనే ఆధారపడి ఉండేది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,గేదె మన ప్రాంతానికి చెందినది కాదు కొంతమంది చరిత్రకారులు చెబుతున్నది. మొగలులు భారతదేశానికి దండయాత్రకు వచ్చినప్పుడు వారి వెంట తీసుకురావడం జరిగింది. దీనికి ఒక కారణం ఉంది సైనికుల శారీర ధారుడ్యానికి, బలానికి ఈ పాలను వాడేవారు. కానీ ఇప్పుడు ఈ పాలదే సింహభాగం. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత దేశంలో ఆహార సంక్షోభం వచ్చింది. అంటే తిండి కొరత. దీని నివారించడానికి అప్పటి ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది.
*1. హరిత విప్లవం 1960.*
(Green revolution)
*2. శ్వేత విప్లవం 1970.*
(White revolution)
దీనివలన జరిగింది ఏమిటి అంటే పంటల దిగుబడి పెంచడం కోసం మనం ఇప్పుడు వాడుతున్న యూరియా, డిఏపీలు, పురుగుమందులు, హైబ్రిడ్ విత్తనాలు రావడం జరిగింది. ఈ హరిత విప్లవ సృష్టికర్త డాక్టర్ స్వామినాథన్.
*2. శ్వేత విప్లవం*
ఈ విప్లవ సృష్టికర్త వర్గీస్ కురియన్. ఈ విప్లవం ముఖ్య ఉద్దేశం భారతదేశంలో పాల దిగుబడి పెంచడం. దీనిలో భాగంగానే మన వధకు జెర్సీలను హెచ్ఎఫ్ లని తీసుకురావడం జరిగింది.
ఈ రెవల్యూషన్స్ మరియు యాంత్రికరణ వలన క్రమంగా దేశీ ఆవుల ప్రాముఖ్యత తగ్గుతూ వస్తుంది.
*ప్రాముఖ్యత*
1. దేశవాళి ఆవులు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా తట్టుకోగలవు.
2. భూమి సారానికి వీటి పేడ, మూత్రం ఎంతో కీలకమైంది.
3. వ్యవసాయ పనులకు చాలా కీలకం.
4. వీటి పాలు చాలా ఆరోగ్యదాయకం.
మిగతా అంశాలు ముఖ్యమైనవి రేపు తెలుసుకుందాం..ఇవి కేవలం నా అనుభవాలు మాత్రమే.. మీ అనుభవాలు కూడా చేపండి.
*రేపటి అంశం పాలలో ఉండే పోషకాలు,A 1 మిల్క్ A 2 అంటే ఏమిటి? ఏవీ మంచివి,చెడు ప్రభావాలు , నెయ్యి లో ఉండే పోషకాలు,వాటి ఆవశ్యకత*
No comments:
Post a Comment