Saturday, February 24, 2024

అల్జీమర్స్ (మతిమరుపు వ్యాధి) పూర్తి వివరణ మరియూ అద్భుతమైన ఆయుర్వేద పరిష్కారాలు

✍️ *అల్జీమర్స్ (మతిమరుపు వ్యాధి)  పూర్తి వివరణ మరియూ అద్భుతమైన ఆయుర్వేద పరిష్కారాలు:*

👉అలోయిస్ ఆల్ జీమెర్ (ALOIS ALZHEIMER) అనే వ్యక్తి ఈ వ్యాధిని మొదటిసారిగా వివరించినారు కనుకనే ఈ వ్యాధి పేరు ఆ వ్యక్తి పేరుతో గుర్తించబడినది. 

👉ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి. 

👉జ్ఞాపక శక్తి కోల్పోవడం ప్రధాన లక్షణం.

✍️ *ఆల్జీమర్స్ వ్యాధి లక్షణాలు:*

*1. జ్ఞాపకం తగ్గిపోవడం:*

👉ఇటీవలే తెలుసుకొన్న విషయాలు గుర్తులేకపోవడం అనేది ఈ వ్యాధి చూపే సర్వ సాధారణమైన ఆరంభ సూచనల్లో ఒకటి. 

👉సదరు వ్యక్తి తరచూ మతిమరుపుకు లోనవడం, తర్వాత దానిని గుర్తు తెచ్చుకోలేకపోవడం జరుగుతుంది.

*2. తెలిసిన పనులు చేయడానికి కష్టపడటం:*

👉ఈ వ్యాధి ఆరంభదశలో ఉండేవారికి రోజువారీ పనులను క్రమపధ్ధతి లో సరిగా ముందుగానే ఆలోచించుకొని చేసుకోలేక, పనులు పూర్తిచేయలేకపోతారు. 

*3. భాషతో సమస్యలు :*

👉ఈ వ్యాధి ఉన్న వారికి చిన్నచిన్న సులభమైన పదాలను సైతం మర్చిపోవడం, కొత్త పదాలతో వాటిని ప్రయోగించడం, లేదా వారి సంభాషణగానీ, రాతగానీ అర్థం కాకుండా ఉంటుంది. 

👉ఉదాహరణకి వారు వారి టూత్ బ్రష్ ను వెతికి పట్టుకోలేకపోతారు. పైగా అదెక్కడపోయిందో అని అడగటానికి ‘నా నోటిలో వాడేదెక్కడని’ అడుగుతారు.

*4. కాలాన్నీ , స్థలాన్నీ మర్చిపోవడం:*

👉ఈ వ్యాధి ఉన్న వారు, వారి ఇంటికి వెళ్లే దారినీ, వారెక్కడికి వెళుతున్నారో , ఎక్కడనించి వచ్చారో, ఎన్ని గంటలకు బయల్దేరారో కూడా మర్చిపోతారు.

*5. నిర్ణయ లోపం:*

👉ఈ వ్యాధితో ఉన్న వారు, వస్త్రధారణ సరిగ్గా చేయరు. 

👉మంచి ఎండాకాలంలో స్వెట్టర్ వేయడం, చలికాలంలో తక్కువ దుస్తులు వేయడం చేస్తుంటారు. 

👉వీరి నిర్ణయ లోపం ఎలా ఉంటుందంటే, ముక్కూమొకం తెలీని వారికి డబ్బులిచ్చేస్తూంటారు.

*6. ఆలోచనా లోపం:*

👉 ఈ వ్యాధి ఉన్న వారిలో క్లిష్టమైన పనులకు బుర్ర పనిచేయదు. ఎలాంటి సంఖ్యలను ఎలా వాడాలో సైతం తెలియక సతమతమౌతారు.

*7. వస్తువులను ఎక్కడంటే అక్కడ పెట్టేయడం :*

👉 ఈ వ్యాధి ఉన్న వారు ఆయా వస్తువులను వాటి స్థలాల్లో కాక ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూంటారు.

*8. మూడ్ లో లేదా ప్రవర్తనలో మార్పు :*

👉ఈ వ్యాధి ఉన్న వారిలో మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అంత వేగంగా మారిపోతూ ఉంటుంది. అంతలో ఆనందం, అంతలో కోపం - అకారణంగా అలా జరిగిపోతుంది.

*9. వ్యక్తిత్వంలో మార్పు:*

👉 ఈ వ్యాధితో బాధపడే వారి వ్యక్తిత్వం నాటకీయంగా మారిపోతూంటుంది. 

👉త్వరగా తికమకైపోవడం, సందేహాస్పదంగా ఉండటం, భయపడటం, లేదా అన్ని పనులకు కుటుంబ సభ్యులలో ఎవరిపైనో ఆధారపడటం జరుగుతుంది.

*10. చొరవ తీసుకోలేకపోవడం:*

👉ఈ వ్యాధి ఉన్న వారు స్థబ్దుగా మారిపోవడం, టీవీ ముందు గంటల కొద్దీ కూచోవడం, అనూహ్యంగా ఎక్కువసేపు నిద్రపోవడం, నిత్య కృత్యాలపై ఆనాసక్తితో ఉండటం జరుగుతుంది.

👉ఇలాంటి సూచనలు మీలో కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి.

👉 ఆరంభ దశలో అల్జమీర్ లేదా ఈ లోపాన్ని పొడజూపే వ్యాధిని గుర్తిస్తే, సకాలంలో సరైన చికిత్సను పొంది ఆ వ్యాధినించి విముక్తి పొందవచ్చు.

✍️ *ఎలాంటి సమస్యలు ఉన్న వారిలో ఈ వ్యాధి వస్తుంది:*

*1. నరాలకు సంబందించిన వ్యాధులు*

*2. మెదడులో రక్తనాళాల వ్యాధి*

*3. పక్షవాతము*

*4. మెదడులో గడ్డలు*

*5. రక్తనాళాలలో గడ్డకట్టిన రక్తం.*

*6. మల్టిపుల్ స్ల్కీరోసిస్*

*7. పార్కిన్ సన్స్ వ్యాధి*

✍️పాటించవలసిన నియమాలు మరియు పరిస్కార మార్గాలు:

*1. ఆహారం:* 

👉శాకాహారం, సాత్వికాహారం, ఆవుపాలు, ఆవునెయ్యి, ఉప్పు, కారం, మసాలాలు మానెయ్యాలి. 

👉బాదం, పిస్తా, ద్రాక్ష, దానిమ్మ మంచివి.
 
 *2. విహారం:* 

👉తగినంత విశ్రాంతి, శ్రావ్య సంగీత వాయిద్యాలు, మధురమైన పాటలు ఉపయోగకరం.

👉 వీలును బట్టి ప్రాణాయామం మంచిది. 

👉మేధ్య రసాయన ఓషధులలో బ్రాహ్మీ (సంబరేణు), మండూకపర్ణి (సరస్వతి), శంఖపుష్పి, అపరాజిత (దిరిశెన) ప్రశస్తమైనవి. 

*3. మందులు:* 

👉మహా పంచగవ్య ఘృతం: ఒక చెంచా మందుని నాలుగు చెంచాల ఆవుపాలలో కలిపి, రెండుపూటలా ఏదైనా తినటానికి ముందుగా తాగాలి.

👉  స్మృతి సాగర రసమాత్రలు ఉదయం 1, రాత్రి 1 తిన్న తర్వాత వాడాలి. 

👉సారస్వతారిష్ట ద్రావకం: నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి రెండుపూటలా తాగాలి. 

👉స్వర్ణబ్రాహ్మి మాత్రలు రోజుకి-1.

👉మేధ్య రసాయన ఓషధులలో ఏవైనా ఒక దాని ఆకుల్ని శుభ్రం చేసి, దంచి, స్వరసం తీసి, మూడు చెంచాల మోతాదుని తేనెతో రెండుపూటలా సేవించాలి. దీనికి ఒక చెంచా ఆమలకీ (ఉసిరికాయ) స్వరసం కలిపితే ఇంకా మంచిది.
 
👉వసకొమ్ముని నీళ్లతో నూరి, ఆ ముద్దని రెండు చిటికెల (300 మి.గ్రా) తేనెతో వారానికి రెండుసార్లు నాకిస్తే మంచి మేధ్య రసాయనంగా పనిచేస్తుంది. (ఎక్కువైతే అది వాంతికరం)
 
👉ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ‘ధారాచికిత్స’, మూత్రావస్తి అవసరాన్ని బట్టి అమలుపరిస్తే ఫలితం గణనీయంగా ఉంటుంది.

 *పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన శాశ్వత పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.

🙂 *అందరూ బాగుండాలి.. అందులో  మనం ఉండాలి* 🙂

No comments:

Post a Comment