✍️ _*అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు.*_
👉ప్రస్తుత ఆహార అలవాట్లు, జీవన విధానం లో మార్పుల వల్ల ప్రతి వంద మందిలో తొంభై తొమ్మిది మందికి పైన చెప్పిన సమస్యలు ఉన్నాయి.
✍️ *అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి?*
👉శరీరం శ్రమపడే ఏ పని చేయకుండా , ఎంతో శ్రమ చేస్తేనే జీర్ణమయ్యే కఠినమైన ఆహారాన్ని తీసుకోవడం.
👉ఆ భుజించే ఆహారం కూడా సరిగా నమలి తినకుండా ఎదో కొంపలు మునిగిపోతున్నట్లు త్వర త్వరగా తినేయడం.
👉తినేటప్పుడు ఆహారం మీద ధ్యాస పెట్టకుండా ఏ టీవీ మీదనో లేక అతిగా మాట్లాడుతూనో, లేక గొడవలు పడుతూనో, లేక ఏవో ఆలోచనలతో భుజించడం.
👉ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన కూరలని మళ్ళీ మళ్ళీ వేడి చేసి తినడం.
👉ఒకసారి తిన్న ఆహారం జీర్ణం కాకముందే భోజన సమయం అయింది అని మళ్ళీ తినడం.
👉తిన్న వెంటనే కనీసం వంద అడుగులైనా వేయకుండా వెంటనే కూర్చోవడం, లేదా పడుకుని నిద్రపోవడం, లేక రాత్రి సమయంలో నిద్రపోకుండా ఎక్కువగా మేలుకోవడం.
👉మద్యపాన మరియూ ధూమపానం లక్షణాలు. అధిక మసాలా మరియూ అధికంగా నూనె పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం.
✍️ *ఆయుర్వేద నివారణ మార్గాలు:*
👉కరక్కాయ బెరడు, శొంఠి ఈ రెంటినీ సమభాగాలుగా తీసుకుని పెనం మీద దోరగా వేయించి చూర్ణంగా చేసి దానికి పాత బెల్లం కానీ లేక సైన్ధవ లవణ చూర్ణం కానీ కలిపి నిలువ ఉంచుకుని రోజూ ఆహారం తీసుకునే ముందు ఐదు గ్రాముల మోతాదులో తీసుకుంటే ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
👉ధనియాలు మరియూ శొంఠి సమ భాగాలుగా తీసుకుని మంచినీటితో కలిపి కషాయం చేసి గోరు వెచ్చగా ఉన్నపుడు త్రాగితే అజీర్తి వల్ల వచ్చే కడుపు నొప్పి, కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి.
👉నిద్ర లేవగానే బద్ధకంగా అనిపిస్తూ, నిన్న తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల సుఖ విరేచనం కాలేక చాలా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు అశ్రద్ధ చేయకుండా పైన తెలిపిన కరక్కాయ బెరడు, శొంఠి మరియు సైన్ధవ లవణాల మిశ్రమం అర టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదులో చల్లని నీళ్ళలో కలిపి త్రాగి తరువాత సులభంగా జీర్ణం అయ్యే ఆహారం పరిమితంగా భుజిస్తే ఆనాటి అజీర్ణ సమస్య తగ్గిపోతుంది.
👉శొంఠి, పిప్పళ్లు, మిరియాలు,వాము, సైన్ధవ లవణం, తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్రలను సమ భాగాలుగా తీసుకుని దానికి పొంగించిన ఇంగువ కొంచెం కలిపి చూర్ణం చేసుకుని భోజనం చేసే ముందు మొదటి ముద్దలో ఈ చూర్ణం మూడు నుండి ఐదు గ్రాముల వరకు కలిపి అందులో తగు మోతాదు నెయ్యి వేసి కలిపి తీసుకుంటే అజీర్ణ వాయురోగాలు హరించిపోతాయి. కడుపులో జఠరాగ్ని ఎల్లప్పుడూ సమంగా ఉండి రక్త వృద్ధి, శరీర పుష్టి కలుగుతుంది.
👉ఉసిరికాయ బెరడు చూర్ణం 30గ్రా. తానికాయ బెరడు చూర్ణం 60గ్రా. కరక్కాయ బెరడు చూర్ణం 180గ్రా. పటిక బెల్లం చూర్ణం 270గ్రా. అన్ని కలిపి నిల్వ చేసుకుని పూటకి ఐదు గ్రాముల నుండి పది గ్రాముల చొప్పున గోరు వెచ్చని నీళ్లతో కలిపి రెండు పూటలా తీసుకుంటే బాగా అగ్ని దీపనం కలిగి ఆహారం సక్రమంగా జీర్ణమై, సుఖ విరేచనం జరిగి, ఎప్పటికప్పుడు శరీరం శుద్ధి కాబడి ఆరోగ్యంగా ఉంటుంది. ఇది సర్వ రోగ హర చూర్ణం.
👉వాము 50గ్రా. శొంఠి 50గ్రా. సైన్ధవ లవణం 50గ్రా. అన్ని కలిపి ఒక గాజు డబ్బాలో వేసి ఈ పదార్థాలు అన్ని మునిగే వరకు నిమ్మ రసం పోసి మూత పెట్టి ఈ డబ్బాని ఎండలో ఒక రోజంతా పెట్టాలి.. ఆ తర్వాత మళ్ళీ అందులో నిమ్మ రసం పోయాలి.. మరుసటి రోజు మళ్ళీ ఎండలో పెట్టాలి. ఇలా మూడు రోజులు చేస్తే లేహ్యం లాగా తయారు అవుతుంది. ఈ లేహ్యన్ని ఐదు నుండి పది గ్రాముల చొప్పున రోజుకి రెండు పూటలు తీసుకోవాలి. ఇలా చేస్తే అజీర్ణం వల్ల వచ్చే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు, ప్రేగులకు సంబంధించిన సమస్త రోగాలను హరించి రక్త శుద్ధి, రక్త వృద్ధి, దేహ బలం కలుగును.
👉సోంపు 100గ్రా. తెల్ల జీలకర్ర 50గ్రా. పటిక బెల్లం 100గ్రా. మెత్తగా దంచుకుని పూటకి ఐదు గ్రాముల చొప్పున రోజుకి రెండు పూటలు భోజనం తర్వాత తీసుకుని మంచి నీళ్ళు త్రాగుతూ ఉంటే కడుపు ఉబ్బరం, కడుపులో మెలి తిప్పడం, నీళ్ల విరేచనాలు మొదలైన ఉదర సంబంధ సమస్యలు తొలిగిపోతాయి.
👉కరక్కాయ బెరడు చూర్ణం, పిప్పలి చూర్ణం,వాయు విడంగాల చూర్ణం, చిత్రమూలం వేరు చూర్ణం, గానుగ గింజల చూర్ణం సమ భాగాలుగా తీసుకుని కొంచెం దోరగా వేయించి ఈ మిశ్రమానికి సమానముగా పటిక బెల్లం కలిపి ముద్దగా దంచి మిరియాల గింజల సైజులో ఉండలుగా చేసి గాలిలో ఆరబెట్టి నిల్వ ఉంచుకుని రోజుకి మూడు పూటలా ఒక్కో మాత్ర చొప్పున భోజనం తర్వాత తీసుకుంటూ వస్తే సకల అజీర్ణ రోగాలు హరించి, రక్త శుద్ధి మరియు రక్త వృద్ధి జరిగి శరీరం కూడా కాంతివంతంగా మారుతుంది. ఇవి పిల్లలు, పెద్దలు అందరూ కూడా వాడవచ్చు. మిరియాల సైజు కంటే పెద్దగా కాకుండా చూసుకోవాలి
👉అపానవాయువు అధికముగా ఉన్న వాళ్ళు నల్లఉప్పు 50గ్రా. వాము చూర్ణం 100గ్రా. కలిపి రోజుకి రెండు లేక మూడు పూటలు ఈ చూర్ణాన్ని మజ్జిగతో తీసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది.
👉అల్లం, బెల్లం సమ భాగాలుగా తీసుకుని రోజు పరకడుపున తీసుకుంటే పైత్యం, వాంతులు, కడుపులో వికారం లాంటి సమస్యలు తగ్గిపోతాయి.
_*పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.*_
No comments:
Post a Comment