Monday, February 26, 2024

కండరాల బలహీనత సమస్య, ఈ సమస్య వల్ల కలిగే ఇతర ఇబ్బందులు మరియు అద్భుతమైన ఆయుర్వేద పరిష్కార మార్గాలు:*

✍️ *కండరాల బలహీనత సమస్య, ఈ సమస్య వల్ల కలిగే ఇతర ఇబ్బందులు మరియు అద్భుతమైన ఆయుర్వేద పరిష్కార మార్గాలు:*

👉సౌష్టవమైన ఆకృతిని, దృఢత్వాన్నీ కలిగించేవి కండరాలే.

👉 చర్మం లోపల సన్నని దారాల్లా ఉండడంతో మొదలు, శరీరంలోని అన్ని అవయవాల నిర్మాణం దాకా కండరాలే కీలక పాత్ర వహిస్తాయి. 

👉సిక్స్ ప్యాక్, ఎయిట్‌ప్యాక్ బాడీ బిల్డింగ్‌లోనూ ముఖ్య భూమిక కండరాలదే.

👉కండరాలు బలహీనపడిన వ్యక్తి బక్కచిక్కిపోతాడు. చర్మం సైతం తన ప్రభను కోల్పోయి ముడుతలు పడుతుంది.
పైగా ఏపనీ చేయలేని అశక్తత, నిరుత్సాహం వెంటాడతాయి. 

👉ఇదంతా సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు. లేదా రక్తహీనత, క్షయ, గ్రహణి (ఐబిఎస్), తరుచూ వచ్చే జ్వరాలు, దీర్ఘకాలిక వ్యాధుల వల్లనూ కావచ్చు. 

👉గర్భిణిగా ఉన్నప్పుడు ఏర్పడిన పోషకలోపాల కారణంగా పుట్టిన బలహీన శిశువు మొదలు, వృద్ధుల దాకా అందరూ కండరాల సమస్యను ఎదుర్కొనే వారే. 

👉ఇలాంటి వారికి కొన్ని ప్రత్యేక తైలాలతో మర్ధన చికిత్స చేస్తే ఆరోగ్యంతో పాటు కండర పుష్టీ పెరుగుతుంది. రక్తప్రసరణా వ్యవస్థ బలపడి చర్మంతోపాటు శరీర అవయవాలన్నీ తమతమ కార్యకలాపాలను సవ్యంగా జరుపుకోగల్గుతాయి. ఫలితంగా ఆరోగ్యమూ కుదుటపడుతుంది.

✍️ *చందన బలా లక్షాది తైలం :*

👉చందనం, బలామూలం, లాక్ష్యానిర్యాసం, ఉశీర అనే నాలుగు వనౌషదుల కషాయం కాచిపెట్టుకుని దీనికి తగినన్ని పాలు కూడా కలుపుతారు. 

👉ఈ మొత్తానికి నాలుగో వంతు నువ్వుల నూనె చేరుస్తారు. నూనెలో నాలుగోవంతు చందన చెక్క, వట్టివేర్లు, సోంపు, దేవదారు చెక్క, పసుపు, కోష్టు, మంజిష్టా, అగరు, సుగంధిపాల, అశ్వగంధ, బలామూలాలు, కస్తూరి పసుపు, మూర్వా, తుంగ ముస్తలు, ముల్లంగి, ఏలకులు, దాల్చిన, నాగకేసరాలు, రాస్నా, లాక్షా, అజమోద, చంపక, చోరపుష్టి మొదలగు వాటి చూర్ణాలను ముద్దగా చేసి పైన తెలిపిన కషాయం, పాలు, నూనెలు ఉన్న పాత్రలోకి చేర్చి 'తైలపాక విధి' లో తయారు చేయడం జరుగుతుంది.

*ఈ తైలం యొక్క ఉపయోగాలు:*

👉స్త్రీలలో రక్తస్రావ లక్షణాలు ఉండే గర్భకోశ వ్యాధులు (మెనొరేజియా, మెట్రోరేజియా), రక్తస్కందన లోపాలు ఉండే హీమోఫిలియా, మెటికియల్ హెమరేజ్ వంటి సమస్యలకు ఈ తైలంతో మర్ధన చికిత్స చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

👉దగ్గు, దమ్ము, క్షయ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి ఛాతిపైన, ముందూ వెనుక మర్ధన చేస్తే ఛాతీలో కండరరపట్లు పోయి సమస్యలు తేలిగ్గా ఉపశమిస్తూ ఔషధ చికిత్సలో సహకరిస్తాయి.

👉ఒంటిపైన పొడిదురదలు లేదా మంటలు ఉన్నప్పుడు ఈ తైలంతో మర్ధన చేస్తే తక్షణమే ఉపవమనం లభిస్తుంది. 

👉రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు వచ్చే వాపులు గానీ, రక్తకణాల క్షీణతతో వచ్చే కామెర్ల జబ్బు ( హీమోలైటిక్ జాండిస్)లో గానీ, ఈ తైౖలాన్ని వాడుకోవచ్చు.

👉తలపోటు, కళ్ల మంటలు ఉన్నప్పుడు తలకు మర్ధించుకోవచ్చు.

 👉కాళ్లు, చేతులు పట్టేస్తున్నప్పుడు ( క్రాంప్స్) ఈ తైలంతో మర్ధనచేస్తే ఉపశమనమే కాకుండా సమస్యలు శాశ్వతంగా తగ్గిపోతాయి.

👉తరుచూ వచ్చే కొన్ని దీర్ఘకాలిక జ్వరాలకు ఈ తైలంతో అభ్యంగనం చేస్తే శరీరం శక్తిని పుంజుకోవడంతో పాటు జ్వర సమస్యలు కూడా పూర్తిగా పోతాయి.

👉 ప్రొటీన్, క్యాల్షియం లోపాలతో చిన్న పిల్లల్లో వచ్చే ' ఫక్కా'( రికెట్స్, మరాస్మస్, క్యాషియోర్కర్) వంటి వ్యాధులు, పుట్టుకతోనే వచ్చే మెదడు ఎదగకకుండా పోయే సెరిబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మజిల్ డిస్ట్రోఫీ వ్యాధకులకు కూడా ఈ ఈ తైలంతో అభ్యంగనం చేస్తే ప్రయోజనం ఉంటుంది.

✍️ *మహామాష తైలం:*

👉అశ్వగంధ, దేవదారు, బలా, రాస్నా, ప్రసారణీ, కుష్ఠం, భారంగీ, విదారీకంద, పునర్నవా, శతావరీ, జీరక, హింగు, శతపుష్పీ, గోక్షురా, పిప్పలీ మూల, చిత్రక, సైందవ లవణం, జీవనీయ గణం వంటి వనౌషధుల చూర్ణకల్కం ఒక భాగం తీసుకుని దానికి నాలుగు రెట్లు నూనె, నూనెకు నాలుగు రెట్లు మినుముల ( మాష) కషాయం, పాలు కలుపుతారు.

👉 ఆ తరువాత అన్నిటినీ ఒక పాత్రలో చేర్చి 'తైలపాక విధి' లో నువ్వుల నూనె మిగిలేట్లు కాచి తయారు చేయడం జరుగుతుంది.

*ఈ తైలం యొక్క ఉపయోగాలు:*

👉దీర్ఘకాలిక పక్షవాతాలు లేదా నరాల సంబంధ వ్యాదుల్లో కండరాలు, స్నాయువులు (లిగమెంట్లు ) బలహీనపడుతూ ఉంటాయి. వీరికి మహా మాష తైలంతో మర్ధన చేస్తే కండరాలు, స్నాయువులు తిరిగి పుష్టిగా తయారవుతాయి.

👉మాటిమాటికీ మూర్ఛలు వచ్చే వారికి, దవడలు పట్టేసే వారికి ఈ తైల మర్ధన ఎంతో మేలు చేస్తుంది.

👉కొన్ని నరాల జబ్బుల్లో కండరాలు ఎండిపోతుంటాయి. ఆ స్థితి రాకముందే ఈ తైలంతో మర్ధన చేస్తూ ఉంటే కుంటి, గూని, మూతివంకర, చేతివాతం వంటి సమస్యలు తొలగిపోతాయి.

👉పురుషుల్లో ధాతుక్షయం, ప్రత్యేకించి శుక్రక్షయం కారణంగా సంతానం కలగనప్పుడు మహా మాష తైలంతో మర్ధన చేసుకోవడతో పాటు కడుపులోకి కూడా తీసుకుంటే ఫలితం ఉంటుంది.

✍️ *సూచనలు:*

👉పైన పేర్కొన్న వ్యాధులకు తైల మర్ధనంతో మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కడుపులోకి కొన్ని మందులు కూడా తీసుకున్నప్పుడు ఆ ఫలితాలు రెట్టింపుగా ఉంటాయి. ఇక ఈ వ్యాధులకు అల్లోపతి వైద్య చికి త్సలు తీసుకునే వారు కూడా మర్ధన కోసం మహామాష తైలాన్ని నిస్సంకోంచంగా వాడుకోవచ్చు.

*పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.*

No comments:

Post a Comment