Monday, February 26, 2024

మూత్రనాళ సమస్యలు - మూత్రనాళ ఇన్ఫెక్షన్ - మూత్రంలో అల్బుమిన్ ప్రోటీన్ పోవడం లాంటి సమస్యలు మరియూ అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు:*

✍️ *మూత్రనాళ సమస్యలు - మూత్రనాళ ఇన్ఫెక్షన్ - మూత్రంలో అల్బుమిన్ ప్రోటీన్ పోవడం లాంటి సమస్యలు మరియూ అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు:*

👉 చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు పైబడిన వారి వరకు ఎవరికైనా మూత్రంలో ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. 

👉 ఇన్‌ఫెక్షన్లు రావడానికి కిడ్నీలో రాళ్లు కారణం కావచ్చు. ప్రొస్టేట్ గ్రంథిలో సమస్య కావచ్చు. మూత్రనాళంలో అడ్డంకులు కావచ్చు. కారణం ఏదైనా మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

👉కిడ్నీ, యూరేటర్స్, బ్లాడర్, మూత్రనాళానికి సంబంధించిన ఇన్‌ఫెక్షను మూత్రాశయ ఇన్ ఫెక్షన్లుగా పరిగణించవచ్చు.

👉 అయితే కొన్ని రకాల ఇన్ ఫెక్షన్లు తొందరగా తగ్గిపోతే, మరికొన్ని ఇన్‌ఫెక్షన్లు తీవ్రమవుతాయి. చలిజ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

✍️ *ఈ సమస్య ప్రధాన లక్షణాలు:*

👉మూత్రంలో మంట, మూత్రవిసర్జన తరువాత మంట, మూత్రవిసర్జన సరిగ్గా రాకపోవడం, ఆగి, ఆగి రావడం, అర్జంటుగా వెళ్లాల్సి రావడం, మూత్రం వచ్చినట్టు అనిపిస్తుండటం, రాకపోవడం, మూత్రం పచ్చగా, చిక్కగా, పసుపు రంగులో, వాసన కూడా ఉండటం, పొత్తి కడుపులో నొప్పి, వికారం, వాంతులు, కొద్దిపాటి జ్వరం, నీరసం, నొప్పులు, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది.

✍️ *ఎవరిలో ఈ సమస్యలు ఎక్కువగా రావచ్చు?*

👉చిన్న పిల్లల్లో, యుక్తవయస్సు వారిలో, ఎక్కువ శాతం స్త్రీలలో, వయసు పైబడిన వారిలో రావచ్చు. 

👉చిన్న పిల్లల్లో జ్వరం, దగ్గు, ఆయాసం, తీవ్రమైన జ్వరం, పక్క తడపడం వంటివి నులి పురుగుల వల్ల రావచ్చు.

👉యుక్తవయస్సు వారిలో గనేరియా, సిఫిలిస్, క్యాండిడియాసిస్, ఈకొలై, ఎయిడ్స్, హనీమూన్ సిస్టైటిస్, ఫైమోసిస్ స్ట్రిక్చర్స్, పారా ఫైమోసిస్ వల్ల, సెక్స్ ద్వారా వ్యాపించే ఇతర జబ్బుల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. 

👉స్త్రీలలో పురుషుల కంటే మూత్రనాళం సైజు తక్కువగా ఉండటం వల్ల, మల ద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్స్‌కు త్వరగా గురవుతారు. 

👉గర్భిణి స్త్రీలలో గర్భాశయ పెరుగుదల (పిండం ఒత్తిడి వల్ల) బ్లాడర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. 

👉ఇక వయసు పైబడిన వారిలో ప్రొస్టేట్ గ్రంధి వాపు, గనేరియా, లైంగిక వ్యాధులు, ఎయిడ్స్, డయాబెటిస్, కేన్సర్, కాలేయ వాపు, కిడ్నీ ఇన్‌ఫెక్షన్లు, అధిక రక్తపోటు వంటి వ్యాధుల వల్ల, కిడ్నీ స్టోన్స్, నీళ్లు తక్కువ తాగడం, గుండె సంబంధ వ్యాధులు, పక్షవాతం, ఎముకలు విరగడం, ఎక్కువ రోజులు మంచానికి పరిమితం కావడం, మానసిక క్షోభ, నిద్రలేమి, రోగనిరోధక శక్తి సన్నగిలడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల కలిగే మానసిక ఒత్తిడి, ఇతర ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, నియంత్రణ లేని డయాబెటిస్ వ్యాధి, హెర్నియా, ఎలిఫెంటాయిసిస్, కణుతులు, గడ్డలు, రేడియేషన్ ట్రీట్‌మెంట్స్, వెన్నెముక గాయాలు, తలకు గాయం, ఎక్కువ రోజులు క్యాథెటర్ శరీరంలో ఉండటం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్లు రావచ్చు

👉స్ర్తి పురుష భేదాన్ని పరిగణిస్తే ఈ వ్యాధి పురుషుల్లో రెండు రెట్లు ఎక్కువ. అలాగే వయసుతోపాటు ఈ సమస్య కూడా పెరుగుతుంది. వ్యాధి ఇతివృత్తం ఈ సమస్య ఎక్కువమందిలో యాదృచ్ఛికంగా బయటపడుతుంది. 

👉అధిక రక్తపోటు, మధుమేహం వంటివి ఉన్నాయని తెలిసినప్పుడు చేయించే రొటీన్ పరీక్షల్లో ఆల్బూమినూరియా ఉన్నట్లు బయటపడుతుంది. ఆల్బూమినూరియా ఉన్నంత మాత్రాన దానిని ప్రమాదభరితమైన మూత్రపిండాల వ్యాధులకు ముడిపెట్టాల్సిన పనిలేదు.

👉 మామూలు వ్యాధుల్లో సైతం ఈ లక్షణం కనిపించే అవకాశం ఉంది కనుక ముందుగా ఈ కోణంలో దర్యాప్తు చేయటం అవసరం. ఆల్బూమినూరియా ఉన్నదని తేలినప్పుడు మూత్రంలో ఎరుపుదనం, నురగ, మడమల్లోను వాపు, కంటిచుట్టూ వాపు, వృషణాలూ, యోని పెదవుల్లో వాపు వంటివి అనుబంధంగా ఉన్నాయేమో చూడాలి. 

👉గతంలో అధిక రక్తపోటు కనిపించిన ఇతివృత్తం ఉండటం, రక్తంలో కొలెస్టరాల్ అధికంగా ఉండటం, గర్భధారణలో కిడ్నీలు వ్యాధిగ్రస్తమైన సందర్భాలు ఉండటం, మధుమేహం ఉండటం, కుటుంబంలో ఇతరులకు మధుమేహం ఉండటం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ ల్యూపస్ వంటి ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులుండటం, రేనాడ్స్‌వ్యాధి (చర్మంపైన దద్దురు, కళ్ళు ఎర్రబారటం, కీళ్లు పట్టేయడం) వంటి వ్యాధుల ఇతివృత్తం గురించి తెలుసుకోవాలి. అలాగే మందుల వాడకం గురించి తెలుసుకోవడం కూడా ముఖ్యం.

✍️ *ఆయుర్వేద నివరణా మార్గాలు:*

👉చంద్రప్రభావటి, శిలాజిత్తు, యశదభస్మం, చంద్రకళారసం, స్వర్ణమాక్షీక భస్మం, త్రివంగ భస్మం, యోగేంద్ర రసం, గుడూచిసత్వం, నాగభస్మం వంటివి ఈ వ్యాధిలో ప్రయోగించదగిన ఆయుర్వేద ఔషధాలు.

👉ఆల్బుమినూరియా (లాలమేహం) వ్యాధి స్థితిలో ప్రత్యేకంగా వాస (అడ్డసరం ఆకులు), హరీతకి (కరక్కాయ పెచ్చులు), చిత్రక (చిత్రమూలం వేర్లు), సప్తపర్ణి (ఏడాకులపొన్న) వీటితో కషాయం తయారు చేసుకొని తాగితే హితకరంగా ఉంటుంది.

👉ఉసిరికాయల రసం (20 మిల్లీలీటర్లు), పసుపు (5 గ్రా.) లను రోజుకు రెండుసార్లు ఉదయం, రాత్రి పుచ్చుకోవాలి.

👉త్రిఫలాలు, పెద్దపాపర (విశాల), దేవదారు, తుంగముస్తలు వీటిని సమాన భాగాలు తీసుకొని కషాయ రూపంలో 30 మిల్లీ లీటర్ల మోతాదుగా రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

👉అడవి మల్లె పుష్పాలు (కుటజ), కపిత్థ పుష్పాలు (కపిత్థ), రోహితక పుష్పాలు, విభీతకి పుష్పాలు, సప్తపర్ణ పుష్పాలు (ఏడాకులపొన్న)వీటిని ముద్దగా నూరి ఉసిరిపండ్ల రసానికి కలిపి తీసుకోవాలి.

👉వేప, రేప, ఏడాకుల పొన్న, మూర్వ, పాలకొడిశ, మదుగ వీటి పంచాంగాలను కషాయం రూపంలో అవసరమైతే తేనె చేర్చి తీసుకోవాలి.

👉చంద్రప్రభావటి అనే మందు జాంబవాసవం అనుపానంగా వాడాలి.

👉శిలాజిత్తు (500 మి.గ్రా.), వసంత కుసుమాకరరసం (100 మి.గ్రా) మోదుగపువ్వుల కషాయంతో పుచ్చుకోవాలి.

👉చిల్లగింజలను మజ్జిగతో గంధం తీసి మూత్రవిరేచన క్వాథంతో 20మిల్లీ లీటర్ల మోతాదులో రోజుకు రెండుసార్లు పుచ్చుకోవాలి.

👉 ఆహారం ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. ఆహార పదార్థాలకు అదనంగా ఉప్పు చేర్చకూడదు. ముఖ్యంగా వాపు కనిపిస్తున్న సందర్భాల్లో ఈ సూచన బాగా గుర్తుంచుకోవాలి.

👉ఈ వ్యాధి స్థితిలో ప్రొటీన్ (మాంసకృతులు) పదార్థాల వాడకం గురించి కొంత సందిగ్ధత నెలకొని ఉంది. మధుమేహంతో కూడిన కిడ్నీ వ్యాధుల్లోనూ, గ్లొమరూలర్ వ్యాధుల్లోనూ కనిపించే ఆల్బూమినూరియాలో ప్రొటీన్‌ని తగ్గించటం ద్వారా వ్యాధి కొనసాగే వేగాన్ని తగ్గించవచ్చునని తేలింది. అయితే ప్రొటీన్‌ని తగ్గిస్తే పోషకాహార లోపం (మాల్‌ న్యూట్రిషన్) వల్ల ఇక్కట్లు వచ్చే చిక్కు ఉంది కాబట్టి రోజుకు ఒక కిలో శారీరక బరువుకు ఒక గ్రాము చొప్పున లెక్కకట్టి ప్రొటీన్ వాడకుంటే మంచిది. అంటే, 70 కిలోల బరువుండే వ్యక్తులు రోజుకు 70గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలన్నమాట.

*పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.*


No comments:

Post a Comment