Monday, February 26, 2024

స్థూలకాయం - అధికబరువు సమస్య - అద్భుతమైన ఆయుర్వేద గృహ చిట్కాలు:*

✍️ *స్థూలకాయం - అధికబరువు సమస్య - అద్భుతమైన ఆయుర్వేద గృహ చిట్కాలు:*

*స్థూలకాయం అంటే?*

👉శరీరంలో పరిమితికి మించి కొవ్వు సంచితమైనప్పుడు మేదో రోగం లేదా ఒబేసిటీ అంటారు. 

👉శక్తి నిలువలు శారీరక అవసరాలకు మించి తయారైనప్పుడు జీవక్రియలో సమతుల్యం దెబ్బతిని కొవ్వు చేరుతుంది.

👉పెద్దల్లో 80 శాతంమంది అధికబరువు కలిగి ఉన్నారు. చిన్నపిల్లల్లో 25 శాతంమంది అధికబరువు కలిగి ఉన్నారు. 

👉మధుమేహ వ్యాధి 80 శాతం కేసుల్లో స్థూలకాయం వల్ల ప్రాప్తిస్తోంది! గుండెజబ్బులు 70 శాతం కేసుల్లో స్థూలకాయం వల్ల ప్రాప్తిస్తున్నాయి!

👉రొమ్ముక్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్లు 42 శాతం కేసుల్లో స్థూలకాయం వల్ల ప్రాప్తిస్తున్నాయి.

👉అధిక రక్తపోటు 26 శాతం కేసుల్లో స్థూలకాయం వల్ల ప్రాప్తిస్తోంది !

✍️ *స్థూలకాయం (అధికబరువు) సమస్యకు గృహచికిత్సలు:*

👉ముల్లంగి రసం మోతాదుకు మూడు చెంచాల చొప్పున రోజుకి 3 సార్లు పుచ్చుకోవాలి.

👉కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని మోతాదుకు అరచెంచాడు చొప్పున రెండు పూటలా తేనెతోగాని లేదా వేడినీళ్లతోగాని పుచ్చుకోవాలి.

👉రేగు ఆకుల ముద్దను ఉలవచారు లేదా శనగలతో చేసిన చారుతో కలిపి సేవిస్తే స్థూలకాయంలో చక్కని ఫలితం కనిపిస్తుంది. చక్రదత్త అనే చికిత్సాగ్రంథం సూచించిన మంచి గృహ చికిత్స ఇది.

👉ప్రతిరోజూ ఉదయం ఒక తమలపాకులో 10 మిరియం గింజలను చుట్టి తిని, వెంటనే ఒక గ్లాసు చన్నీళ్లు తాగాలి. ఇలా రెండు నెలలు చేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది. వైద్యమనోరమ అనే చికిత్సా గ్రంథం సూచించిన తేలికపాటి, ప్రభావవంతమైన గృహ చికిత్స ఇది.

👉ఆముదం ఆకులను కాల్చి బూడిద చేసి నిల్వచేసుకోవాలి. దీనిని మోతాదుకు చిటికెడు చొప్పున చిటికెడు ఇంగువ పొడిని కలిపి రెండు పూటలా బియ్యం కడుగుతో (బియ్యం కడిగిన నీళ్లతో) కలిపి పుచ్చుకోవాలి.

👉కటుకరోహిణి చూర్ణం 3 భాగాలు, చిత్రమూలం వేరు బెరడు చూర్ణం 3 భాగాలు, శిలాజిత్ భస్మం 2 భాగాలు, గలిజేరు (పునర్నవ) పంచాంగ చూర్ణం 5 భాగాలు... ఈ నిష్పత్తిలో కలిపి నిల్వచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోతాదుకు అరచెంచాడు చొప్పున తేనెతో ఆహారం ముందు రెండు పూటలా పుచ్చుకోవాలి.

👉తిప్ప సత్తు (గుడూచి సత్వం), తుంగముస్తలు, వీటి చూర్ణాన్ని 2 పూటలా తేనె అనుపానంగా, మోతాదుకు 3 గ్రాముల చొప్పున తీసుకోవాలి.

👉వాయువిడంగాల చూర్ణం పూటకు అరచెంచాడు మోతాదుగా తేనెతో కలిపి రెండు పూటలా పుచ్చుకోవాలి.

👉శొంఠి, వాయువిడంగాలు, యవక్షారం, కాంతలోహభస్మం వీటి చూర్ణాన్ని 2 పూటలా పూటకు గ్రాము మోతాదుగా తేనె అనుపానంతో తీసుకోవాలి.

👉అరచెంచాడు తుంగముస్తల చూర్ణంకు పావు చెంచాడు వాము పొడి కలిపి వేడి నీళ్లతో రోజుకు రెండుసార్లు చొప్పున 40 రోజులపాటు వాడాలి.

👉అగ్నిమంథ (నెల్లిచెట్టు) ఆకులను దంచి రసం పిండి రోజూ రెండు పూటలా పూటకు 2 చెంచాలు మోతాదులో తీసుకోవాలి.

👉పాతగుగ్గిలంను (గుగ్గులు) ఉదయ, సాయంకాలాలు పూటకు 3 గ్రాముల మోతాదుగా 30-60 రోజులపాటు తీసుకోవాలి.

👉చిత్రమూలం వేరు బెరడును ఎండబెట్టి పొడిచేసి నిల్వ చేసుకోవాలి. దీనిని మోతాదుకు పావు చెంచాడు చొప్పున రెండు పూటలా వేడినీళ్లతోగాని లేదా తేనెతోగాని పుచ్చుకోవాలి.

👉త్రికటు (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు), త్రిఫలాలు (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ), వాయువిడంగాలు, చిత్రమూలం, తుంగముస్తలు వీటిని ఒక్కోదానినీ రెండేసి భాగాలుగా తీసుకోవాలి. దీనికి 1 భాగం శుద్ధ గుగ్గిలాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మోతాదుకు 3-6 గ్రాముల చొప్పున తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

*చవ్యాది సక్తు :* 

👉చవ్యం, జీలకర్ర, త్రికటు చూర్ణం, ఇంగువ, చిత్ర మూలంవేరు బెరడు వీటిని ఒక్కోటి ఒక్కో భాగం తీసుకోవాలి. బార్లి ఒక భాగం తీసుకొని కలపాలి. దీనిని మోతాదుకు రెండు చెంచాలు చొప్పున తీసుకొని జావ మాదిరిగా చేసుకొని తాగితే స్థూలకాయం తగ్గుతుంది. భైషజ్య రత్నావళి అనే చికిత్సా గ్రంథం చెప్పిన చక్కని ఔషధ యోగం ఇది.

*విడంగాది చూర్ణం:* 

👉వాయు విడంగాలు, శొంఠి, యవక్షారం, లోహభస్మం, ఉసిరి వలుపు, బార్లి... వీటిని సమాన భాగాలు తీసుకొని మెత్తగా దంచి నిల్వచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోతాదుకు అరచెంచాడు. చొప్పున తేనెతో రెండు పూటలా పుచ్చుకోవాలి.

✍️ *స్థూలకాయం (అధికబరువు) సమస్యకు ఆయుర్వేద ఔషధాలు:*

👉స్థూలకాయం సమస్యకు సమర్ధ వంతమైన ఆయుర్వేద ఔషధాలు అనేకం ఉన్నాయి. అయితే సమస్య తీవ్రత, వ్యక్తిగత ప్రకృతి, ఇతర వ్యాధుల ప్రభావం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఔషధాలను సూచించాల్సి ఉంటుంది. 

👉ముఖ్యంగా త్రిఫలా గుగ్గులు, శిలాజిత్ చూర్ణం, నవక గుగ్గులు, ఆరోగ్యవర్ధిని వటి, తక్రారిష్టం, త్రిఫలా చూర్ణం, విడంగాది లోహ చూర్ణం, చిత్రకాదివటి, పునర్నవాది గుగ్గులు అనే ఔషధాలు స్థూలకాయంలో చక్కని ఫలితాలను ఇస్తాయి. 

👉ఇవి నిరపాయకరమైనవి. వీటిని వ్యక్తిగత ప్రకృతిని బట్టి తగిన అనుపానంతో నిర్ణీతకాలం పాటు సరైన వైద్య పర్యవేక్షణలో వాడాలి.

✍️ *శరీర క్రియను బట్టి ఆయుర్వేద ఔషధాల ప్రయోగం :*

👉ధాత్వగ్నిని పెంచేవి : గుగ్గులు, శిలాజిత్తు

👉ఆమపాచకంగా పనిచేసేవి : త్రికటు చూర్ణం, ఖదిరసారం

👉శ్రోతోసోధకంగా పనిచేసేవి : చిత్రమూలం, రసాంజనం, వసకొమ్ము.

👉లోహాలు : విడంగాది లోహం, తాప్యాది లోహం, శిలాజవ్వాది లోహం, నవాయసలోహం, లోహాసవం.

👉గుగ్గులు : త్రిఫలా గుగ్గులు, గోక్షురాది గుగ్గులు, పునర్నవాది గుగ్గులు, చంద్రప్రభావటి, అమృతాది గుగ్గులు.

✍️ *నిషిద్ధాలు (ఆహారంలో వాడకూడనివి) :*

👉 బంగాళాదుంపలు, ఇతర దుంపకూరలు, అరటిపండు, అరటికాయ, సపోట, మామిడిపండ్లు, సీతాఫలం, ఎండుద్రాక్ష, పనసపండ్లు, స్వీట్లు, కేకులు, ఐస్క్రీమ్స్, కూల్డ్రింక్స్, వేపుడు కూరలు, మాంసాహారం, కోడిగుడ్లు, పిండిపదార్థాలు, మద్యం, చిరుతిండ్లు, వేరుశనగచట్నీ, కొబ్బరి చట్నీ, నెయ్యి, డాల్డా, డ్రైఫ్రూట్స్.

✍️ *సూచనలు:*

👉నూనె తగ్గించాలి. 

👉ఉప్పు తగ్గించాలి. 

👉బాగా నీళ్లు తాగాలి.

👉 ఆహారానికి 30 నిమిషాల ముందు నీళ్లు తాగాలి. 

👉వ్యాయామం చేయాలి. నడక మంచిది.

👉 మధ్యాహ్నం నిద్ర పోకూడదు. 

👉విందులు, ఉపవాసాలు మంచివి కాదు. 

👉బద్ధకం వదిలించుకోవాలి.

✍️ *అధికబరువు ని తగ్గించే ఆయుర్వేద చూర్ణం:*

👉స్థూలకాయంతో సమస్యలు అన్నీ ఇన్నీ కావు. దీనికో చక్కని పరిష్కారం...అష్టాంగ హృదయకారుడు పేర్కొన్న 'నవాయస చూర్ణం'.

👉 వ్యక్తిగత ఆహార విహార, పథ్యాపథ్య సూచనలు పాటిస్తూ దీనిని వాడితే కేవలం ఊబకాయాన్ని మాత్రమే కాకుండా దానిని అనుసరించి చోటుచేసుకునే సమస్యలను ఎన్నిటినో తగ్గించుకోవచ్చు.

✍️ *నవాయస చూర్ణం తయారీ విధానం:*

*ద్రవ్యాలు :* శొంఠి 1 భాగం, పిప్పళ్లు 1 భాగం, మిరియాలు 1 భాగం, చిత్రమూలం 1 భాగం, వాయువి డంగాలు 1 భాగం, కరక్కాయ 1 భాగం., తానికాయ 1 భాగం, ఉసిరికాయ 1 భాగం, తుంగముస్తలు 1 భాగం, లోహభస్మం 9 భాగాలు.

*తయారీ విధానం:* 

👉వీటిల్లో పిప్పళ్లను, శొంఠిని ముందుగా దోరగా వేయిస్తే త్వరగాను, తేలికగాను చూర్ణమవుతాయి.

👉 మిగతా ద్రవ్యాలను ఎండబెట్టి చూర్ణం చేస్తే సరిపోతుంది. 

👉చిత్రమూలం వేరు పై బెరడులో మాత్రమే ఔషధ తత్వాలుంటాయి కనుక వీలైనంత వరకూ వేరు పై బెరడును మాత్రమే వినియోగించాలి.

👉వాయువిడంగాలు చూడ్డానికి అచ్చం మిరియాల్లాగా చిన్నగా గుండ్రంగా నొక్కులు లేకుండా కనిపిస్తాయి. 

👉కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను (త్రిఫలాలు) గింజలను తొలగించి, పై బెరడులను మాత్రమే ఉపయోగించాలి. 

👉తుంగముస్తలనేవి భూమి అడుగున లభించే గడ్డిజాతికి చెందిన చిన్న దుంపలు గనుక బాగా శుభ్రపరచాలి. 

👉లోహభస్మాన్ని నేరుగా నమ్మకమైన ఫార్మసీ నుంచి కొనుగోలు చేయాలి. 

👉ఈ ఫార్ములాలో చెప్పిన అన్ని పదార్థాలనూ విడివిడిగా చూర్ణం చేసి ఒకటిగా కలిపి వస్త్రగాళితం పట్టి గాలిచొరబడని గాజు సీసాలో నిల్వచేసుకోవాలి.

*ఎలా తీసుకోవాలి:*

👉ఈ చూర్ణాన్ని 250 - 500 మిల్లీగ్రాముల మోతాదుగా తేనెతోగాని, వేడినీళ్లతోగాని తీసుకోవాలి. 

👉ఆహారానికి ముందు వాడితే ఆకలి పెరుగుతుంది. ఆహారం తరువాత వాడితే అరుగుదల పెరుగుతుంది. 

👉స్థూలకాయ చికిత్స కోసం వాడేవారు ఆహారానికి ముందు దీనిని తీసుకొని రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల వెర్రి ఆకలి తగ్గుతుంది.

*ప్రత్యేకత :*

👉ఈ ఫార్ములాలో కలిపే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలు (త్రిఫలాలు) స్థూలకాయుల్లో సాధారణంగా కనిపించే మలబద్ధకాన్ని నిరోధించడమే కాకుండా ఇతర ఔషధ ద్రవ్యాలు శరీరంలోకి తేలికగా చొచ్చుకువెళ్లడానికి సహాయపడతాయి.

👉అలాగే అకాలవార్ధక్యాన్ని నిలువరింపచేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పునఃస్థాపిస్తాయి. 

👉ఈ యోగంలో మటకద్రవ్యాలుగా వాడే శొంఠి, పిప్పళ్లు, మిరియాలు (త్రికటు) ఆహారాన్ని పూర్తిగా పచనం చెందించి కొవ్వు తయారుకాకుండా నిరోధిస్తాయి. 

👉అంతే కాకుండా స్థూలకాయుల్లో సాధారణంగా కనిపించే ఆయాసం, కొవ్వు పేరుకుపోవటం, మూత్రం ద్వారా శారీరక తత్వాలు బయటకు వెళ్లిపోతూ నీరసాన్ని కలిగించటం వంటి అనారోగ్య స్థితులను అదుపులో ఉంచుతాయి. 

👉దీనిలో వాడే చిత్రమూలం క్యాన్సర్ల వంటి ప్రమాదకర వ్యాధులను సైతం నిరోధిస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన క్రొవ్వు అనే మంచును అగ్నిలా కరిగించి వేస్తుంది. కాబట్టి దీనికి అనలం (అగ్ని) అనే పర్యాయపదం ఉంది. 

👉తుంగముస్తలకు స్టౌల్యహర కర్మ ఉన్నట్లుగా అనేక అధ్యయనాల్లోను, పరిశోధనల్లోనూ సాక్ష్యాధారాలతో సహా రుజువయ్యింది. 

👉ఈ ఫార్ములాలో వాడే ముఖ్యమైన ద్రవ్యం లోహభస్మం. స్థూలకాయుల్లో కనిపించే శోథ (వాపు), రక్తహీనత, నిస్త్రాణ, స్వేదాధిక్యత వంటివాటిని ఇది తగ్గించి శరీరాన్ని తేలికగా, ఉల్లాసంగా ఉంచటమే కాకుండా బడలికను దూరం చేసి నూతనోత్తేజాన్ని తెస్తుంది.

✍️ *పొట్ట పెరగనివ్వని కొన్ని ఆహారాలు:*

*1). బాదం, ఇతరనట్స్ (తోలు తొలగించనివి):*

👉కండరాలను పుష్టిగా చేస్తాయి. ఆహారం మీద వెర్ర కోరికను తగ్గిస్తాయి.

👉స్థూలకాయం, గుండెజబ్బులు, కండరాలు ఎండిపోవటం, చర్మంపైన ముడతలు, క్యాన్సర్, అధికరక్తపోటులో ఉపయుక్తం.

*2). బీన్స్, పెసర్లు, మినుములు, ఇతర లెగ్యూమ్స్:*

👉 కండరాలను పుష్టిగా చేస్తాయి. కొవ్వును దహిస్తాయి. అరుగుదలను పెంచుతాయి. 

👉స్థూలకాయం, పెద్దపేగు క్యాన్సర్, గుండెజబ్బులు,
అధికరక్తపోటులో ఉపయుక్తం.

*3).పాలకూర, ఇతర ఆకుపచ్చని కూరలు:*

👉ఫ్రీర్యాడికల్స్ని తటస్థపరుస్తాయి.
అకాలవార్ధక్యాన్ని అదుపుచేస్తాయి. క్యాన్సర్, గుండెజబ్బులు, పక్షవాతం, స్థూలకాయం, ఎముకలు పెళుసెక్కి, గులబారటంలో ఉపయుక్తం.

*4).పాలు, పెరుగు, ఛీజ్, ఇతర వెన్నలేని పాల ఉత్పత్తులు:*

👉ఫ్రీర్యాడికల్స్ ని తటస్థపరుస్తాయి. అకాల వార్ధక్యాన్ని అదుపుచేస్తాయి. 

👉క్యాన్సర్,గుండెజబ్బులు, పక్షవాతం, స్థూలకాయం, ఎముకలు పెళుసెక్కి గుల్లబారటంలో, ఉపయుక్తం.

*5). ఓట్మీల్ (పంచదార కలపనిది):*

👉శక్తిని పెంచుతుంది. కొలెస్టరాల్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరనిల్వలను నిలకడగా ఉంచుతుంది. గుండెజబ్బులు, మధుమేహం, పెద్ద పేగుక్యాన్సర్, స్థూలకాయంలో ఉపయుక్తం.

*6). కోడిగుడ్డు (తెల్లపాన):*

👉కండరాలు పెరగడానికి సహాయపడుతుంది. చర్మాన్ని నునుపుగా చేస్తుంది.

*7).వేరుశనగలు, పీనబ్బట్టర్:*

👉కండరాల వృద్ధికి, అధిక కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది. 

👉స్థూలకాయం, కండరాల క్షీణత, చర్మంపైన ముడతలు, గుండెజబ్బుల్లో ఉపయుక్తం.

*8).ఆలివ్ నూనె:*

👉కొలెస్టరాల్ని తగ్గిస్తుంది. వ్యాధినిరోధకశక్తిని
పెంచుతుంది.

👉స్థూలకాయం, క్యాన్సర్, గుండెజబ్బులు, అధికరక్తపోటులో ఉపయుక్తం.

*9). జల్లించని ధాన్యంతో తయారైన బ్రడ్, ముడిబియ్యం:*

👉శరీరం అదనపు కొవ్వును పోగుచేయకుండా
నిరోధిస్తాయి. స్థూలకాయం, క్యాన్సర్, గుండెజబ్బులు, అధికరక్తపోటులో ఉపయుక్తం.

*10). బెర్రీలు:*

👉గుండె రక్షిస్తాయి. కంటిచూపును రక్షిస్తాయి. జ్ఞాపకశక్తిని కాపాడుతాయి.

👉శరీరపు సమతూకాన్ని, గుండెజబ్బులు, క్యాన్సర్, స్థూలకాయంలో ఉపయుక్తం.

✍️ *ఎలా ఉపయోగించాలి?*

👉వీటిలో రెండు లేదా మూడింటిని ప్రధాన ఆహారంలోను, కనీసం ఒకదానిని స్నాక్స్లోనూ తీసుకోవాలి.

👉ఎప్పుడూ ఒకే రకం కాకుండా పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలూ కలిపి వాడాలి.

*Note: పైన తెలిపిన మూలికలు అన్ని సేకరించి తయారుచేసుకోలేని వారికి మా దగ్గర ఈ మూలికలు అన్ని కలిపి ఎప్పటికప్పుడు తయారుచేసి ఇచ్చే సౌకర్యం కలదు. కావాల్సిన వారు వాట్సప్ ద్వారా సంప్రదించండి.* 

పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.


No comments:

Post a Comment