Saturday, February 24, 2024

అన్ని రకాల కీళ్లనొప్పుల సమస్యలకు అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు

✍️ *_అన్ని రకాల కీళ్లనొప్పుల సమస్యలకు అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు:_*

👉 *కీళ్లనొప్పి-ఆర్థరైటిస్- (Arthritis) అంటే ఏమిటి?.*

మన శరీరంలో జరిగే వాత, పిత్త మరియు దోషాల ప్రకోపాల కారణంగా ఈ కీళ్లనొప్పి సమస్య వస్తుంది. కీళ్లనొప్పులు సాధారణంగా ఏ వయసు వారికైనా, ఆడవాళ్ళకైనా మగవారికైనా రావచ్చు. కీళ్లనొప్పుల రుగ్మత 50 సంవత్సరాలు, అంతకు పైబడిన వయస్సువారిలో మాత్రమే వస్తుందని గతంలో భావించేవారు. అయితే ఇటీవలి కాలంలో కీళ్లనొప్పులు వయసుతో నిమిత్తం లేకుండా అందరికి వస్తున్నాయి. వాస్తవానికి, ఈ కీళ్ళనొప్పుల వ్యాధి సామాజిక-ఆర్థిక సమస్యల ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది, 

✍️ *కీళ్ళనొప్పుల రకాలు:*

కీళ్లనొప్పులు కనీసం 100 వేర్వేరు రకాలుగా ఉన్నాయని వైద్య పరిశోధకులు విశ్వసిస్తున్నారు. మేము ఇక్కడ ప్రధానంగా చాలా మందికి సామాన్యంగా కలిగే కీళ్ళనొప్పుల రకాలను వివరిస్తున్నాం. 

*1). రుమటాయిడ్'ఆర్థరైటిస్ - Rheumatoid arthritis:*

రుమటాయిడ్ కీళ్ళనొప్పి అనేది ఒక స్వయం ప్రతిరక్షక స్థితి. ఈ స్థితిలో శరీరం యొక్క సొంత కణాలు ఆరోగ్యకరమైన కణాలను విదేశీ దండయాత్రలుగా పొరబాటుగా భావించి దాడి చేస్తాయి. కీళ్లనొప్పి వేళ్లలో, మోకాళ్లలో, మోచేతుల్లో మరియు చీలమండలాల్లోని కీళ్ళలో వచ్చే వాపును బట్టి వర్గీకరించబడుతుంది. 'రుమటాయిడ్' అనే ఈ పరిస్థితి పురుషులు కంటే, పిల్లలు మరియు స్త్రీలకు ఎక్కువగా వస్తుంది.

✍️ *రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు:*

చేతులు, వేళ్లు, కీళ్ళు, మరియు పాదాలు పట్టినట్లు ఉంటుంది.నొప్పిని కూడా కలిగివుంటుంది. రక్తహీనతతో బాధపడుతుంటారు (రక్తహీనత అనేది శరీరంలో ఇనుము యొక్క స్థాయిలు పడిపోయినపుడు వస్తుంది.తీవ్ర అలసటను కలిగివుంటారు. మానసికంగా (డిప్రెషన్) బాధపడుతూ వుంటారు. మీకు తెలియక పోవచ్చు కానీ మీరు నడిచేటప్పుడు మీ బలహీనమైన నడకను లేక కుంటటాన్ని ఇతరులు గుర్తించవచ్చు. రుమటాయిడ్ కీళ్ళనొప్పుల కారణంగా మీరు కీళ్లలో వైకల్యాన్ని అనుభవించవచ్చు.

*2). ఆస్టియో ఆర్థరైటిస్- osteoarthritis:*

కీళ్ల బాధ లేక 'ఆస్టియో ఆర్థరైటిస్' 30-50 సంవత్సరాల మధ్య వయస్కుల్లో కనిపించే కీళ్ళ సమస్య. కీళ్లమధ్యలో ఉండే కీలకమైన 'గట్టి నరాలు' లేక 'కార్టిలేజ్' అనే మృదువైన ఎముకలు (మృదులాస్థి) మిక్కిలి శ్రమకు లేదా అరుగుదలకు గురై ఇటువంటి కీళ్ల బాధ ఏర్పడుతుంది. ఈ 'కార్టిలేజ్' గట్టినరాలకు దెబ్బలు తగలడం లేదా వాపు ఏర్పడడం మూలాన కీళ్లలో అవయవాల్ని కదిపినప్పుడల్లా విపరీతమైన నొప్పి కల్గుతుంది

✍️ *ఆస్టియోఆర్థరైటిస్ యొక్క లక్షణాలు:*

ఉదయం నిద్ర లేవగానే వెంటనే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పిని అనుభవిస్తుంటారు. కీళ్ల నుండి "టప్” మనే విరుపుల శబ్దాలు వస్తుంటాయి. కీళ్ళలో మరియు వాటి చుట్టుపట్ల వాపులు, ఉబ్బులు రావడం గమనించవచ్చు. రోజు మొత్తంలో మీరు మీ కండరాలు మరియు కీళ్లలో నొప్పిని గమనిస్తారు లేదా మీరు విశ్రాంతిగున్నపుడు కూడా కీళ్లనొప్పులు, కండరాల నొప్పి మిమ్మల్ని బాధించవచ్చు.

*3).బాల కీళ్లనొప్పులు - juvenile arthritis:*

బాల (జువెనైల్) కీళ్లనొప్పులు 16 సంవత్సరాల లోపు వయసున్న పిన్న వయస్కుల్లో కీళ్లలో నొప్పి, వాతశూల మరియు వాపు వలన సంభవిస్తుంది. ఇది 'రుమటిక్ ఆర్థరైటిస్' అనే కీళ్లనొప్పి రకాల్లో ఒకటని చెప్పబడింది. పిన్నవయస్కుల్లో వచ్చే బాల్య కీళ్లనొప్పి లక్షణాలు ఏవంటే కీళ్లు ఎరుపురంగులోకి మారడం, వెచ్చదనం, కీళ్ళ నొప్పి, చిన్న పిల్లల అవయవాల కదలికలలో విపరీతమైన నొప్పి కష్టాలు ఉంటాయి.

*4).సాంక్రామిక కీళ్ళవ్యాధి- infectious arthritis:*

సాంక్రామిక కీళ్ళవ్యాధినే (ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్) 'సెప్టిక్ కీళ్లవ్యాధి' అని కూడా అంటారు. కీళ్ళ చుట్టూ స్రవించే ద్రవాల కారణంగా, దానిలోంచి వచ్చే బ్యాక్టీరియా మరియు విషక్రిముల కారణంగా ఈ సాంక్రామిక కీళ్ళవ్యాధి సంభవిస్తుంది. కీళ్ళ చుట్టూ స్రవించే ద్రవాలను సైనోవియల్ ద్రవం' అని పిలుస్తారు. ఏ వయస్కులకైనా ఈ రకం కీళ్లవ్యాధి సంభవించవచ్చు మరియు ఈ అంటువ్యాధికి సంబంధించిన కారణాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియవు. అయినప్పటికీ, ఎక్కువగా అంటువ్యాధిగానే ఇది గుర్తించబడుతోంది. బాహ్య గాయాలు, శస్త్రచికిత్స సమయంలో లేదా కొన్ని మందుల ద్వారా ఈ సాంక్రామిక కీళ్ళవ్యాధి (ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్) శరీరంలోకి ప్రవేశిస్తుంది.

*5). కీళ్లవాతం - (Gout)*:

కీళ్లవాతం (గౌట్) అనేది రక్తంలో 'యూరిక్ యాసిడ్' కారణంగా సంభవిస్తుంది. ఇది కీళ్ళనొప్పులకు, వాపులకు కారణమవుతుంది. వాపు, నొప్పిని కలిగించే ఈ కీళ్ళ అంటువ్యాధి, వ్యాదున్న కీళ్లప్రాంతం ఎరుపు రంగులోకి మారుతుంది. సూది వంటి స్ఫోటకాలు కీళ్ల మధ్యలో పొడజూపడం వల్లనే ఈ కీళ్ల పోటు, ఎర్రబారిపోవడమనేది జరుగుతుంటుంది, అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి కూడా కలుగుతుంటుంది.

✍️ *కీళ్ళవాతం (గౌట్) లక్షణాలు:*

 వాపుతో పాటు తాకితే చాలు నొప్పి పుట్టే మృదులత్వ లక్షణం కలిగివుంటుంది.
కీళ్లనొప్పి తీవ్రంగా ఉన్న చోట మీరు ఉడుకుతోందా అన్నటువంటి బాధాకరమైన అనుభూతిని లేదా వేడిని ఎదుర్కొంటారు. కీళ్లనొప్పి సమయంలో మీ చర్మం సామాన్యంగా ఎరుపు రంగులోకి, లేదా పసుపు రంగులోకి మారొచ్చు. చర్మం పాలిపోయినట్టు కనిపిస్తుంది. కీళ్లనొప్పి ఉన్నచోట ఆ బాధిత ప్రాంతాన్ని తాకినప్పుడు తీవ్రంగా, చాలా బాధాకరమైనదిగా ఉంటుంది.

✍️ *కీళ్ల నొప్పుల సమస్యలకు అద్భుతమైన ఆయుర్వేద నివారణ మార్గాలు:*

*విజ్ఞప్తి: ఇన్ని నియమాలను పాటించాలా అని కంగారుపడకండి.. ఇందులో మీకు అందుబాటులో ఉన్నవి కొన్నింటిని పాటించండి. ఆరోగ్యం గా జీవించండి.*

👉వాతదోషాన్ని పెంపొందింపచేసే ఆహార విహారాలు, మానసికపరమైన అకారణ ఆందోళనలు, దిగుళ్ళే వాతవ్యాధులు రావటానికి కారణమవుతున్నాయి.

👉 కీళ్ళనొప్పులు, సయాటికా, సర్వైకల్ స్పాండిలోసిస్, మోకాళ్ళనొప్పులు, ఇతర కీళ్ళవాత వ్యాధులు ఏవైనా కానీయండి... ప్రతిరోజు కాలవిరేచనం అయ్యేలా చేసుకుంటూ వుంటే, నొప్పులు సాధ్యమైనంత అదుపులో నడుస్తూ వుంటాయి. 

👉 సునాముఖి ఆకు వాతవ్యాధితో బాధపడేవారికి వర ప్రసాదంగా వుంటుంది. దీనిని మెత్తగా దంచిగానీ, మిక్సీ పట్టిగానీ పొడిని ఓ సీసాలో భద్రపరచుకోండి.

👉దీనిని నీళ్ళలో వేసి కషాయం కాచుకుని తాగవచ్చు. అరచెంచా నుంచి ఒక చెంచా పొడిని అవసరాన్నిబట్టి రోజు ఒకసారిగానీ, రెండుసార్లు గానీ తీసుకొంటే మంచిది. పాలలోగానీ, మజ్జిగలోగానీ కలుపుకోవచ్చు.

👉 సునాముఖి మృదు విరేచనకారి. అందువలన రోజూ వాడుకొంటూ వున్నా ఎలాంటి ఇబ్బందీ కల్గించదు. అపకారం చెయ్యదు. మోతాదుని అనుభవం మీద ఎవరికివారు నిర్ణయించుకోవడం మంచిది. 

👉ఈ సునాముఖినే సీమనేల తంగేడు అని కూడా అంటారు. ఇది మరీ ఎక్కువగా తీసుకొంటే వేడిచేస్తుంది. కానీ వాతపు నొప్పుల్ని తగ్గించేగుణం స్వయంగా దీనికుంది. మలశోధకంగా ఉపయోగపడుతుంది. 

👉వాతంవలన కలిగే ఇతర లక్షణాలు దగ్గు, జలుబు, ఉబ్బసం, మూర్ఛల జబ్బులు, సొరియాసిస్ అనే చర్మవ్యాధి ఇలాంటి వాటన్నింటిలోనూ మేలు చేస్తుంది.

👉కానీ అమీబియాసిస్, రక్తంతో కూడిన విరేచనాలు, పేగుపూత ఇలాంటి బాధలున్న సమయంలో మాత్రం దీన్ని వాడకూడదు. గర్భవతులకు కూడా వాడకుండా ఉంటేనే మేలని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి.

👉ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటిని సమానంగా తీసుకొని మెత్తగా దంచి తగినంత ఉప్పు కలిపి ఓ సీసాలో భద్రపరచుకోవాలి. వాతపు నొప్పుల్ని తగ్గించడంలో ఈ పొడి గొప్పగా పనిచేస్తుంది. నొప్పులు త్వరగా తగ్గుతాయి. ఈ పొడిని అన్నం మరియు టిఫిన్ కారప్పొడి మాదిరిగా వాడుకోవచ్చు కూడా! దాన్ని రోజూ రెండుమూడు సార్లు వాడుకోవడం మంచిది.

👉వాము పొడిని కూడా ఇలానే వాడుకో వచ్చు. లేదా ధనియాలు, జీలకర్ర, శొంఠితో నాలుగో ద్రవ్యంగా కలిపి పైన చెప్పినట్లే వాడుకోవచ్చును కూడా!

👉 ఆముదం కాయల కూర, ఆముదం ఒంటికి మర్దనా చేసుకోవడం వాత వ్యాధుల్లో బాగా మేలు చేసే అంశాలు. 

👉కురసానివాము ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుంది. ఒగరుగా, వెగటుగా ఉంటుంది. దీన్ని పావుచెంచా కన్నా తక్కువ మోతాదులో తీసుకొని గ్లాసునీళ్ళ లో వేసి, అరగ్లాసు మిగిలేంతవరకూ మరిగించి, వడగట్టి తగినంత తీపి కలుపుకొని తాగితే వాతపు నొప్పులు, కీళ్ళనొప్పులు తగ్గుతాయి.

👉గంగరావి చెట్టు ఆకులకు వాతాన్ని తగ్గించే గుణం వుంది. నొప్పి, వాపు ఏర్పడిన కీలు మీద శొంఠికొమ్ముని అరగదీసి ఆ గంధాన్ని రాయండి. గంగరావి మొక్క ఆకుల్ని ఈ శొంఠి పట్టు మీద వేసి కట్టినట్లయితే కొంత సేపటికి కొద్దిగా వేడి పుడుతుంది. వేడి తగ్గిన తర్వాత ఆ ఆకుని తీసివేసి, మళ్ళీ కొత్త ఆకు వెయ్యాలి.

👉గోరింటాకుని పైపైన రుబ్బి నీళ్ళుపోసి (సమానంగా) బాగా ఉడి కించి, ముద్దగా చేసి నొప్పులు, వాపులు ఏర్పడినచోట గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్టు కట్టినట్లయితే నొప్పి, పోటు, మంట తగ్గి వాపు త్వరగా కరుగుతుంది.

👉జిల్లేడు ఆకులకు ఆముదాన్ని పట్టించి, బాగా వెచ్చగా చేసి, నొప్పి, వాపు ఉన్న చోట పెడితే బాధలు ఉపశమిస్తాయి. జిల్లేడు ఆకుల్ని ఒక కట్టుగా గట్టిగా కట్టి, సగానికి కోసి, ఆ కోసిన వైపు వేడివేడి ఆముదంలో ముంచి గోరువెచ్చగా కాపడం పెడితే, బిగుసుకుపోయిన జాయింట్లు త్వరగా వదులై ఫ్రీగా కదులుతాయి. ప్రతిరోజూ ఇలా చేస్తూ వుంటే త్వరగా మార్పు వస్తుంది. 

👉జిల్లేడు వేరుని సేకరించి, ఎండించి, మెత్తగా దంచి పొడిని ఓ సీసాలో భద్రపరచుకొని పావుచెంచా కన్నా తక్కువ మోతాదులో తీసుకొని చిక్కటి కషాయం కాచుకొని రోజూ తాగుతూ వుంటే, కీళ్ళనొప్పులు, వాపులు, గౌట్ (వాతరక్తం) అనే కీళ్ళవ్యాధి, పక్షవాతం లాంటివి ఉపశమిస్తాయి. 

👉 జిల్లేడు వేరుని అరగదీసి గంధంతీసి, నొప్పి, వాపు, బెణుకులు పట్టిన చోట ఆముదంతో కలిపి మర్దనా చేస్తే నొప్పులు, పోట్లు తగ్గుతాయి. 

👉' చిత్రమూలం 'ను శుభ్రం చేసుకొని, ఎండించి, మెత్తగా దంచిన పొడిని చిక్కటి కషాయం కాచుకొని తాగుతూ వుంటే వాతం తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. నొప్పులూ, పోట్లూ ఉపశమిస్తాయి.

👉నీరుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కీళ్ళవాతం, పక్షవాతం, సయాటికా నడుంనొప్పి ఇలాంటి వాటిలో బాగా ఉపయోగ పడతాయి. 

👉 పారిజాతం ఆకుల్ని మెత్తగా దంచి రసంగా గానీ, చిక్కటి కషాయంగా గానీ... 3-4 చెంచాలు మోతాదులో తీసుకొంటే వాతపు నొప్పులు, నడుం నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళనొప్పులు, చిరకాలంగా బాధపెడుతున్న జ్వరాలు తగ్గుతాయి. 

👉ముసాంబరాన్ని అరగదీసి, చిక్కటి గంధాన్ని తీసి పట్టీ వేస్తే నొప్పులు, వాపులు, పోట్లు తగ్గుతాయి.

👉తెల్లతెగడ లేదా త్రివృత్ చూర్ణం ని పావుచెంచానుంచి అరచెంచా మోతాదులో పాలలోగాని, మజ్జిగలో గాని, నేరుగా తేనెతోగానీ కలిపి తీసుకోవాలి. తేలికగా విరేచనం అవుతుంది. వాతాన్ని తగ్గిస్తుంది. నొప్పులు, పోట్లు ఉన్నవారు సునాముఖిగానీ, త్రివృత్ (తెల్లతెగడ) చూర్ణంగానీ వాడుకొని విరేచనం అయ్యేలా చేసుకోవడం మంచిది. రెండింటినీ కలిపి వాడుకోవచ్చు .

 👉 అశ్వగంధాది చూర్ణం తప్పనిసరిగా కీళ్ళనొప్పులు ఉన్నప్పుడు వాడితీరాలి. అరచెంచా పొడి వరకూ తీసుకొని పాలలో వేసి, బాగా మరగనిచ్చి వడగట్టి, తాగితే వాతం తగ్గడమేకాకుండా నరాలకు సత్తువ నిస్తుంది. మానసికంగా సంతృప్తి నిస్తుంది. టెన్షన్లు, దిగుళ్ళను పోగొట్టి మంచినిద్ర పట్టిస్తుంది.

👉చవ్యం అనే మూలికను మెత్తగా దంచగా వచ్చిన పొడిని పావుచెంచా మోతాదులో చిక్కటి కషాయంగా గానీ, తేనెతోగానీ తీసుకొంటే వాతప్రకోపం తగ్గుతుంది. నొప్పులూ, పోట్లు తగ్గుతాయి. 

👉కర్పూరతైలం మర్దనా చేస్తే కీళ్ళనొప్పులు త్వరగా తగ్గుతాయి.

👉మునగచెట్టు లేత ఆకుల కూర వాపుల్ని కరిగించడానికి తోడ్పడుతుంది. మునగచెట్టు వేరుని కూడా కషాయంగా గానీ, నేరుగా తేనె కలుపుకొని గానీ వాడుకోవచ్చు. వాపులు, నొప్పులు తగ్గుతాయి. మునగపూలను కూడా కూరగా వండుకోవచ్చు.

👉 అడ్డసరం ఆకుల్ని ఎండించి దంచిన పొడిని చెంచా మోతాదులో తీసుకొని చిక్కని కషాయం కాచుకొని రోజూ తాగుతూ వుంటే కీళ్ళవాతం నొప్పులు (రుమాటిక్ పెయిన్స్) తగ్గుతాయి. వీటితోపాటు దగ్గు, జలుబు, ఆయాసం కూడా తగ్గుతాయి.

👉ఆకాశగరుడ పల్లెసీమల్లో విస్తారంగా పెరుగుతుంది. దీన్ని కూడా ఎండించి చిక్కని కషాయం కాచుకొని తాగితే వాత వ్యాధులన్నీ తగ్గుతాయి. మూత్రపిండాలు శక్తివంతమవుతాయి. అనేక మందులు వాడినందువలన కలిగే అవకారాలు తగ్గుతాయి.

👉రాతి ఉప్పును వేయించి కాపడం పెడితే నొప్పి, వాపు త్వరగా తగ్గుతాయి.

👉ఇప్పచెట్టు బెరడు, గంగరావిచెట్టు ,మామిడిచెట్టు బెరడు, పొన్నచెట్టు బెరడు, సంపెంగచెట్టు బెరడు ఇవన్నీ కీళ్ళనొప్పులు తగ్గించేందుకు తోడ్పడతాయి. ఎండించి, మెత్తగా చూర్ణించి, చిక్కటి కషాయం కాచుకొని తాగడమే! రోజూ వాడుకొంటూవుంటే త్వరగా తగ్గిపోతుంది. పావుచెంచా నుంచి అరచెంచా మోతాదులో పొడిని కషాయం కాచి అవసరాన్నిబట్టి రెండు పూటలు కూడా తాగవచ్చు.

👉పుల్లగోంగూరని ఉడికించి కట్టు కడితే వాచిపోయిన జాయింట్లలో వాపు తగ్గి, మెత్తబడి బిగుసుకుపోయిన కీళ్ళు నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది. తరుచూ ఈ ప్రయోగం చేస్తూ వుంటే ఫలితం కనిపిస్తుంది.

👉నువ్వులు, అవిసి గింజలు, వాల్నట్, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు మరియూ ప్రొద్దుతిరుగుడు గింజలు అన్నిటినీ సమపాళ్లలో తీసుకుని విడి విడిగా దోరగా వేయించి చల్లార్చి పొడి కొట్టుకుని ఒక సీసాలో భద్రపరుచుకోండి. ఉదయం మరియూ రాత్రి సమయాల్లో తిన్న తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో కానీ లేక పాలలో కానీ రెండు స్పూన్ ల పొడిని కలిపి తీసుకోవాలి.

👉ఆవాలు, ఆవపిండి, పిప్పళ్ళు, దాల్చిన చెక్క, బాదంపప్పు, బావంచాలు, మిరియాలు, మునక్కాడ గింజలు, లవంగాలు, లవంగనూనె, కరక్కాయ లు, తానికాయలు, ఉసిరికాయలు ఇవి వాతవ్యాధుల్లో తప్పకుండా వాడవలసిన అంశాలు.

పై నియమాలను పాటించడానికి వీలుపడని మిత్రులకోసం అద్భుతమైన శాశ్వత పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. రెడీమేడ్ మందులు మాత్రం కాదు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేస్తే మీ సమస్యను బట్టి మేము ఎప్పటికప్పుడు మందులను తయారుచేసి మీకు పంపుతాము. మెడిసిన్ తో పాటు మేము మీకు సూచించే ఆహార మరియూ శారీరక నియమాలు చాలా గొప్పగా ఉంటాయి. తద్వారా మీకు 100% అద్భుతమైన శాశ్వత పరిస్కారం లభిస్తుంది.

🙂 *అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి* 🙂

No comments:

Post a Comment