👉అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ఈ రోజుల్లో సాధారణంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్య.
👉ప్రాణాంతకమైన వ్యాధులలో ఇది 3వ స్థానంలో ఉంది.
✍️ *అసలు "రక్త పోటు" (బీపీ) అంటే ఏమిటి?*
👉మానవ శరీరంలో రక్త ప్రసరణ హృదయ సంకోచాల (systolic pressure), వ్యాకోచ (Diostolic pressure) వలన జరుగుతుంది.
👉గుండె ధమనుల నుండి రక్తం శరీర కణజాలాలకు చేరాలంటే పీడనం (pressure) కావాలి.
👉దీనినే రక్తపోటు/ బి.పి (బ్లెడ్ ప్లెజర్) అంటారు.
👉 బ్లడ్ ప్రెజర్ ను స్పిగ్నోమానోమీటర్ ద్వారా లెక్కిస్తారు.
👉 హృదయ సంకోచం అంటే గుండె కొట్టుకుంటున్నపుడు రక్తనాళాలలో ఉండే పీడనం, హృదయ వ్యాకోచమంటే గుండె విశ్రాంతిలో ఉన్నపుడు (ప్రతిరెండు చప్పుళ్ల మధ్య వ్యవధి) రక్తనాళాలలో ఉండే పీడనం.
👉దీనిని mmhg (పాదరసపు మిల్లిమీటర్) లో కొలిచి, హృదయ సంకోచం / హృదయ వ్యాకోచం గా సూచిస్తారు.
👉పై సంఖ్య ఎక్కువగా, క్రిందిసంఖ్య తక్కువగా ఉంటుంది.
👉 ఆరోగ్యంగా ఉన్న వారిలో రక్తపోటు 120/80 గా ఉంటుంది. కాని కొన్ని కారణాల వల్ల బి.పి ఎక్కువ అవ్వడం కాని తక్కువ అవ్వడం గాని జరుగుతుంది.
రెండింటిలో ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదు.
👉 హృదయ సంకోచం 160 mmhg కంటే అధికంగా ఉండి, హృదయ వ్యాకోచం 95 mmhg కంటే అధికంగా ఉన్నప్పుడు అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) అంటాము.
✍️ *అధిక రక్తపోటు గురించి కొన్ని నిజాలు:*
👉అధిక రక్తపోటు మనకు ఇతర ఆరోగ్య సమస్యలు అంటే గుండె సంబంధిత వ్యాధులైన ఊబకాయం, మధుమేహం, మూత్రపిండాల వ్యాధుల లాంటివి తీవ్రమైనపుడు కనిపించే లక్షణం.
👉మన దేశంలో 25% పురుషులు, 24% స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
👉ఈ సమస్య 20-30 సంవత్సరాల వయస్సు వారిలో 13.6% ఉంది. 80 సంవత్సరాల వయస్సు, అంతకన్నా ఎక్కువ వయస్సు వారిలో 54.4% ఉంది.
👉 సాధారణ శరీర పరిమాణాలతో ఉన్న వారిలో ఈ సమస్య వచ్చే అవకాశం 26% ఉండగా, ఊబకాయం ఉన్న వారిలో 48% ఉంది.
👉గ్రామాలలో నివసించే వారి కంటే పట్టణాలలో నివసించే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
👉రక్తపోటు అధికంగా ఉన్నవారిలో రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. అందువల్ల గుండె, మూత్రపిండాలు, మెదడు దెబ్బతింటాయి గుండెపోటు అవకాశాలు ఎక్కువ అవుతాయి.
✍️ *అధిక రక్తపోటుకి గల కారణాలు:*
👉గుండె సంబంధిత వ్యాధులు
👉మూత్రపిండ వ్యాధులు
👉మెదడు, అడ్రినల్ గ్రంథిలో కణతులు ఏర్పడ్డపుడు
👉హైపర్ థైరాయిడ్ సమస్యల వలన
👉అండాశయ వ్యాధులు,
👉ఊబకాయం ఉన్న వారు
👉పిట్యుటరీ గ్రంథి సక్రమంగా పనిచేయనపుడు
👉కొంత మందిలో ఇది వారసత్వంగా సక్రమించవచ్చు
👉ఒత్తిడికి గురవ్వడం,
👉 మద్యంసేవించడం, ధూమపానం చేయడం కూడా కారణాలే
👉మధుమేహులలో సగానికి పైన ఈ సమస్యతో బాధపడుతున్నారు.
👉హార్మోన్ల అసమతుల్యత
👉రక్తంలో ఎర్ర రక్తకణాల అసమతుల్యత కూడా కారణమే.
👉ఇవే కాకుండా సాల్ట్ సెన్సిటివిటి,
👉 ఆహారం సరిగా తీసుకోకపోవడం,
👉వయస్సు పైబడ్డాక జరిగే మార్పులు కూడా కారణాలే.
👉సాల్ట్ (ఉప్పు)సెన్సిటివిటి - ఉప్పు అంటే సోడియం క్లోరైడ్. కొందరి శరీరాలు సోడియం వలన స్పందిస్తాయి, మరికొందరిలో అది ఉండదు.
👉 స్పదించేవారిలో అధికరక్తపోటు వచ్చేఅవకాశాలు ఎక్కువ.
✍️ *లక్షణాలు:*
👉మాములుగా కొన్ని సార్లు ఎటువంటి లక్షణాలు కనపడకుండానే రక్తపోటు అధికమైపోతుంది.
👉 కాని కొంత మందిలో తలనొప్పి, అలసట, కళ్ళు తిరగడం, చూపు మందగించడం, మతిమరుపు, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, ఛాతిలో నొప్పి, జీర్ణ వ్యవస్థలో సమస్యల లాంటివి కనిపిస్తాయి.
✍️ *తీసుకోవాల్సిన జాగ్రత్తలు:*
👉అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆహార నియమాలపై శ్రద్ధ వహిస్తే వ్యాధి వలన కలిగే అనర్థాలను అదుపు చేసుకోవచ్చు.
👉ఆహారం ద్వారా శరీరానికి లభించే కెలరీలను తగ్గించుకోవాలి.
👉కెలరీలు, క్రొవ్వులు తక్కువగా, ప్రోటీన్లు సాధారణ మోతాదులో అంటే 60గ్రా. / 1 రోజుకి లభించేలా ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
👉సోడియం లభించే పదార్థాలను చాలా వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే సోడియం వల్ల రక్తపోటు ఇంకా అధికం అయ్యే అవకాలున్నాయి.
👉ప్రోటీన్లు లభించే పదార్థాలలో సోడియం అధికంగా ఉంటుంది.అందుకే రక్తపోటు మరీ అధికంగా ఉన్నప్పుడు ప్రోటీన్లు రోజు కు 20 గ్రా. కంటే అధికంగా తీసుకోవడం అంత మంచిది కాదు
(అత్యధికంగా రక్తపోటు ఉన్నప్పుడు మాత్రమే).
👉రక్తపోటు అధికంగా ఉన్నవారు బరువు పెరుగుదలను నియంత్రించుకుంటూ ఉండాలి.
👉 అందువల్ల క్రొవ్వు పదార్థాలకు అంటే వేపుళ్ళు, కేకులు, జంక్ ఫుడ్స్ కి చాలా వరకు దూరంగా ఉండాలి.
👉క్రొవ్వు పదార్థాలు తీసుకున్నప్పటికి మంచి క్రొవ్వులైన HDL లభించే ఆహారపదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
👉మాంసాహారం నుండి లభించే క్రొవ్వులను, డాల్డా, వెన్న, హైడ్రోజినేటెడ్ నూనెలను చాలా వరకు తగ్గించుకోవాలి.
👉ఒమెగా-3 క్రొవ్వుల వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
👉ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది. ఉప్పు అధికంగా తింటే శరీర ద్రవాల అసమతుల్యత పెరిగి ద్రవాలు అధికమై రక్తపోటుని అధికం చేస్తాయి. అందువల్ల ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.
👉 బీ.పి. ఉన్నవారు రోజుకి 2-3 గ్రా. ఉప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదు. బీ.పి. మరీ ఎక్కువగా ఉంటే రోజుకి 1 గ్రా .ఉప్పును మాత్రమే వాడుకోవాలి.
👉పొటాషియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో సోడియం ఎక్కువైపోతుంది.
👉శరీర ద్రవాల నుండి నీటిని పీల్చే గుణం సోడియం కి ఉండడం వల్ల మనిషి ఉబ్బిపోతాడు.
👉శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణ ఆటంకం కలిగి రక్తపోటు అధికమైపోతుంది.
👉 అందువల్ల పొటాషియం సమపాళ్ళలో ఆహారంలో లభించేలా చూసుకోవాలి.
👉తాజా పండ్లు, ఆకుకూరలు ఆహారంలో చేర్చుకోవటం ద్వారా పొటాషియంను పొందవచ్చు.
👉కాల్షియం సమృద్ధిగా తీసుకోవడం వల్ల గుండె రక్తనాళాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి.
👉రక్తప్రసరణ వ్యవస్థలో జరిగే ప్రక్రియలు రక్తనాళాలు తట్టుకునే శక్తిని కాల్షియం ఇస్తుంది.
👉 అందువల్ల కాల్షియం లభించే ఆహారపదార్థాలైన పండ్లు, క్రొవ్వు తీసేసిన పాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు విరివిగా తీసుకోవాలి.
👉గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల గుండెను రక్షించే పోషకాలైన పీచు, ఖనిజాలు ఉన్న పదార్థాలు తీసుకోవాలి.
👉రోజు చిరుధాన్యాలు, ఆకుకూరలు, కమలా జాతికి చెందిన పండ్లు తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు.
👉రోజూ 20 నిమిషాలు నడవడం, వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
👉మద్యపానం చేసేవారు మానివేయడం శ్రేయస్కరం లేదా 2 పెగ్గుల కంటే అధికంగా తీసుకోరాదు.
✍️ *అధిక రక్తపోటుతో బాధపడేవారికి పంచ సూత్రాలు:*
👉పండ్లను, ఆకుకూరలను అధికంగా తినాలి.
👉వారానికి ఒకసారైనా చేపలను తినాలి.
👉క్రొవ్వు తీసేసిన పాలను తీసుకోవాలి.
👉వేపుడ్లు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడుల్స్, పిజ్జా లాంటి ట్రాన్స్ క్రొవ్వు పదార్థాలను నిషేధించాలి.
👉సోడియం లభించే పదార్థాలను నియంత్రించుకోవాలి.
✍️ *సోడియం అధికంగా ఉండే పదార్థాలు:*
👉పచ్చళ్ళు (నిల్వ చేసినవి),
👉అజినామోటో అధికంగా వాడే ఫాస్ట్ ఫుడ్స్ అంటే న్యూడుల్స్, ఫ్రైడ్ రైస్ లాంటివి,
👉ఎండు చేపలలో ఉప్పు అధికంగా ఉంటుంది,
👉ఆలూ చిప్స్,
👉బేకరీ పదార్థాలైన బ్రెడ్లు, కేకులు,
సాఫ్ట్ డ్రింక్ లు,
👉మార్కెట్లలో లభిస్తున్న క్యానెడ్ ఫుడ్స్.
*పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిస్కారం చూపే సూచనలు మరియు మాచే స్వయంగా తయారుచేయబడిన "మహార్జున చూర్ణం" కలవు. ఈ చూర్ణం బయట మందుల షొపులలో దొరకదు. కావాల్సిన వారు మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి ఈ చూర్ణం తో పాటు మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పొందండి. ఈ సమస్య నుండి విముక్తి పొంది ఆరోగ్యంగా జీవించండి*
No comments:
Post a Comment