ఈరోజుల్లో చాలా మంది కి ఈ సందేహం వుంటుంది ...
భగవంతుని పూజించడానికి అనేకానేక మార్గాలలో నోము ,
వ్రతము లు అనేవి ముఖ్యము గా స్త్రీలు పాటించే వాటిలో సాధారణమైన భక్తి విధానాలు...
భగవంతుడు - దేవుడు అనేది మానవుని నమ్మకము,
దండము పెట్టి దక్షిణ ఇస్తే చేసే పాపాలు పోయి పుణ్యము వస్తుందంటే,
నవీనకాలము లో శాస్త్రీయ ప్రరంగా నమ్మకము కుదరడలేదు...
ఏది ఏమైనా మన ప్రాచీన గ్రంధాలు లలో ఉన్న ప్రకారము ....
*నోము :*
మనస్సుని కేవలము భగవంతుని పైనే లగ్నము చేసి స్వామిని పూజించి ధ్యానము చేసేది - నోము...
ఉదా: శ్రావణ మంగళవారం నోము ,
అట్లతద్ది నోము,
నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది.
స్త్రీలకు బాల్యము నుంచి సదా చార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను
ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండ వచ్చును.
ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖ సంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్య ప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించ వలసిన నోములు కలవు.
ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో,
పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము.
*వ్రతము :*
అత్యంత నియమ నిష్టలతో మంత్రోచ్చాటనలతో ధూప దీప నైవేద్యాలతో భగవతుని
(దేవుని లేదా దేవతను )
సేవించేది వ్రతము.
వ్రతము ...
అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము.
సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను,
విడవ రాదు" అనుకొనుట.
నియమ-నిబంధనలతో ఉపవాసము తో చేసే పూజ లేక అరాధన .
వ్రతము లో సంకల్పము ,
దీక్ష , కథాపఠనము తప్పనిసరి .
వ్రతము చేయుట వలన సమస్త పాపములు పోయి ...
పుత్ర పౌత్ర సంపదాభివృద్ధి ,
సర్వ సౌభాగ్యములు కలుగును.
ఉదా: వరలక్ష్మీ వ్రతం, సావిత్రీ వ్రతం, మంగళగౌరీ వ్రతం, మున్నగునవి ...
ఒక గ్రూపులో వచ్చిన సమాచారం....
No comments:
Post a Comment