Monday, February 26, 2024

తీర్థానికి, క్షేత్రానికి తేడా ఏమిటండీ

తీర్థానికి, క్షేత్రానికి తేడా ఏమిటండీ?" అని అడుగుతున్నారు. మంచి ప్రశ్న. అందుకే ఈ Post తీర్థం, క్షేత్రం రెండూ వేరువేరు. నదీన దాలు, సముద్రతీరాన వెలసిన ఆలయాలను "తీ ర్థాలు" అంటారు. "గంగ, గోదావరి, కృష్ణ, తుంగభ ద్ర" వంటి నదుల తీరంలో ఉన్న "వారణాసి, గోకర్ణ, రామే శ్వరం, మంత్రాలయం" వంటివి తీర్థాలు.
నదీజలాలు లేనిప్రాంతాల్లో కొలువైన ఆలయాలను "క్షేత్రాలు" అంటారు. ఇవి "స్థలక్షేత్రా లు, గిరిక్షేత్రాలు" అని 2 రకాలుంటాయి. నేలపైన ఉన్న ఆలయాలను *స్థలక్షేత్రాలు* అంటారు. కొండ లపై వెలిసిన గుడులను *గిరిక్షేత్రాలు* అంటారు.
గిరిక్షేత్రాలు ; "తిరుమల, మంగళగిరి, సింహా చలం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, పెంచలకోన" వంటివి *గిరిక్షేత్రాలు*.
స్థలక్షేత్రాలు : అహోబిలం నరసింహస్వామి ఆలయం, ఆలంపూరు జోగులాంబ ఆలయం, బాసర సరస్వతీ ఆలయం, వేములవాడ రాజరా జేశ్వరీదేవి ఆలయం వంటివి *స్థలక్షేత్రాలు*. 
ఇది చదవగానే మీకొక doubt వెంటనే వచ్చే స్తుంది. తిరుమల, శ్రీశైలం క్షేత్రాల్లో కూడా నదులు ఉన్నాయి కదండీ! అని.... పక్కన నది ఉన్నప్పటికీ కొండపై వెలిసిన ఆలయాలను కూడా క్షేత్రాలుగానే పిలవాలి. అందుకే పక్కనే నది ఉండి, కొండపై వెలి సిన విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయాన్ని కూడా క్షేత్రంగానే పిలవాలి.

No comments:

Post a Comment